Home Blog Page 8386

రాజధానుల రాజకీయ రగడ మొదలైయింది

AP Districts

ఆంధ్రప్రదేశ్ లో రాజధానుల రాజకీయ రగడ మొదలయింది, మూడు రాజధానుల విషయంలో దమ్ము ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ప్రజాభిప్రాయానికి రండి అని సర్కార్ కు 48 గంటల గడువు ఇచ్చారు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు , ప్రతిగా అధికార పక్షం దమ్ము ఉంటే ముందుగా మీరు రాజీనామా చెయ్యండి అని సవాల్ విసిరారు.

Also Read: ఎలా దెబ్బకొట్టాలో.. కేసీఆర్ ఆదర్శం అంతే!

ఎన్నికల ముందు అమరావతే రాజధాని అన్నారు ఇప్పుడు రాజధానిని మూడు ముక్కలు చేసారు, ఎందుకు ఇలా దుర్మార్గంగా, అన్న్యాయంగా , కిరాతంగా రాజధానిని విడదీసి ప్రాంతీయ చిచ్చు పెట్టారు, అని చంద్రబాబు జగన్ మోహన్ రెడ్డిని నిలదీస్తున్నారు.

2014 సెప్టెంబర్ 4వ తేదీన జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ అమరావతిలో రాజధాని నిర్మాణానికి తన అంగీకారాన్ని తెలిపారు, అధికారంలోకి రాగానే అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను తుంగలో తొక్కి రాజధానిని చీల్చి, మడమ తిప్పారు.పైగా 30 వేల ఎకరాలు ఎక్కడ లభ్యమైతే అక్కడే రాజధానిని నిర్మించాలని సలహా కూడా ఇచ్చారు.

రాజధాని విషయంలో అప్పటి ప్రభుత్వమే బలమైన చట్టాన్ని చేయవలసింది అని జన సేనాని వ్యాఖ్యానించారు, ఈ వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నాయకుడు తప్పు పడుతున్నారు, విభజన చట్టంలో ఒక రాజధాని ప్రస్తావన వుంది కానీ మూడు రాజధానుల ప్రస్తావన లేదు అని జన సేనానికి గుర్తు చేసారు.

ఏది ఏమైనప్పటికి అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలు 200ల రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నారు వారి గోడును వీనే నాధులే కరువైయాయ్యారు. వేల ఎకరాలు రాజధాని నిర్మాణానికి ఇస్తే ఇప్పుడు మూడు రాజధానులేమిటి అని వాపోతున్నారు, తిరిగి ఎక రాజధాని ప్రకటన చేసేవరకు తమ పోరాటం ఆగదు, ఈ క్రమంలో తమ ప్రాణాలు పోయినా సరే వెనకడుగు వేసే ప్రసక్తి లేదు అని భూములిచ్చిన రైతులు ప్రకటించారు .

అమరావతిని రాజధానిగా ప్రకటించిన తరువాత ఆ ప్రాతంలో ఎన్నో సంస్థలు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయి, మరి వాటి సంగతి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి.

Also Read: అమరావతి టీడీపీకి.. విశాఖ వైసీపీకి లాభం? పవన్ వస్తే.?

రాజకీయంగా ఒకరిని ఒకరు ధూషించుకుంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప ప్రజల బాగోగుల గురించి ఆలోచించే నాయకులే కరువైయ్యారు. మీరు అధికారంలో వున్నప్పుడు రాజధాని చుట్టుపక్కల భూములన్నీ చౌకగా కొట్టేసి, ఇప్పుడు నీతులు చెబుతున్నారు అంటూ ప్రతిపక్షంపై ఎదురు దాడి చేస్తున్నారు వై సి పీ నాయకులు.

చంద్రబాబు ప్రభుత్వానికి విధించిన డెడ్ లైన్ కు కట్టుబడి అసెంబ్లీని రద్దు చేసి ప్రజాభిప్రాయానికి వెళతారో లేక రాజధానుల రాజకీయ రగడను కొనసాగిస్తారా ? అనే సమాధానం కావాలంటే మరి కొంత కాలం వేచిచూడక తప్పదు.

సుక్కు పైత్యం.. బాధలో బన్నీ !


క్రియేటివ్ డైరెక్టర్ అని ముందు పేరు వేసుకుని ప్రొడ్యూసర్స్ ను ముంచిన డైరెక్టర్ల లిస్ట్ పెద్దదే. వాళ్ళేదో సినిమా హిట్ సూత్రాన్ని కనిపెట్టినట్లు ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు సుకుమార్ కూడా ఆ కోవలోకే వచ్చేలా ఉన్నాడట. సుక్కు ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు. నిజానికి వీరి కలయికలో సినిమా వస్తోందంటేనే.. అంచనాలు రెట్టింపు ఆవుతాయనేది వాస్తవమే. అంతమాత్రాన ఓవర్ బడ్జెట్ చేస్తే ఎలా.. ? రేపు బడ్జెట్ ఎక్కువై సినిమా బ్రేక్ ఈవెన్ కాకపోతే. చివరకి ప్లాప్ అనే అంటారు కదా. మరి ఈ విషయం సుక్కు ఎందుకు ఆలోచించలేకపోతున్నాడో. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ఎవరైనా ఖర్చు తగ్గించుకుంటారు. మెగాస్టార్- కొరటాల సినిమాకే ముందు అనుకున్న బడ్జెట్ కి పది కోట్లు తగ్గించారు. కానీ, సుకుమార్ మాత్రం బడ్జెట్ తగ్గించేదే లేదు అంటున్నాడట.

Also Read: ఎక్స్ క్లూజివ్: ప్రభాస్ ‘రాధే శ్యామ్’ స్టోరీ సీక్రెట్స్ !

సరేలే అని నిర్మాతలు ముందు అనుకున్న ప్రకారమే వెళ్దాం అని సర్దిచెప్పుకుంటే.. ఇప్పుడు క్యాస్టింగ్ కోసం అదనపు బడ్జెట్ అడుగుతున్నాడట. బాలీవుడ్ స్టార్స్ ను ఎట్టిపరిస్థితుల్లో తమ సినిమాలో తీసుకోవాలని దాని కోసం అదనంగా మరో పది కోట్ల రూపాయలను బడ్జెట్ పెంచాలని అంటే.. బన్నీ జోక్యంతో నిర్మాతలు బడ్జెట్ పెంచారు. ఆ తరువాత మళ్ళీ సెకెండ్ హాఫ్ లో వచ్చే ఒక ఫైట్ సీక్వెన్స్ సముద్రంలో చేద్దామని దాని కోసం హాలీవుడ్ సాంకేతిక బృందాన్ని తీసుకుందామని సుక్కు పట్టుబడుతున్నాడట. అసలు నువ్వు ఎంత నీ సినిమా రేంజ్ ఎంత ఇలా ప్రతి విషయంలో ఓవర్ బడ్జెట్ చేస్తే.. రేపు తిరిగి వస్తాయా అని నిర్మాతలు కాస్త సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

అయినా సుకుమార్ తగ్గడం లేదట. బన్నీ కూడా సుక్కుకి నచ్చచెప్పాలని చూస్తున్నా వినే స్థితిలో సుక్కు లేడని.. రంగస్థలం సూపర్ హిట్ మహిమ సుక్కుని మైకంలో పడేసిందని బన్నీ కూడా బాధ పడుతున్నాడట. మొత్తానికి సుకుమార్ పైత్యం దెబ్బకు పుష్ప టీంకి చుక్కలు కనిపిస్తున్నాయి అన్నమాట. మరి ఇంతకీ సుక్కు తన అంచనాలను అందుకుంటాడా ?ఒకవేళ సినిమా భారీ హిట్ కొట్టినా ఓవర్ బడ్జెట్ అయితే డబ్బులు రికవరీ అవుతాయా.. నిర్మాతలు మాత్రం సినిమా పై విపరీతమైన హోప్స్ పెట్టుకుని డబ్బులు ఖర్చు పెట్టడం తప్ప.. ప్రస్తుతం వారి చేతిలో కూడా ఏమి లేన్నట్లు కనిపిస్తుంది.

Also Read: మోహన్‌బాబు ఇంటికెళ్ళి బెదిరించింది వారే !

ఇక అక్టోబర్ నుండి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేసి సాధ్యమైనంత తక్కువమంది స‌భ్యుల‌తో షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు. అయితే హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక బన్నీ సరసన ఎలా ఉంటుందో చూడాలి. దేవీ శ్రీ పుష్ప సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది.

మోహన్‌బాబు ఇంటికెళ్ళి బెదిరించింది వారే !


మోహన్‌ బాబు ఇంట్లోకి ఓ గుర్తుతెలియని కారు దూసుకెళ్లి.. అందులో నలుగురు మైకంలో ఉన్న కుర్రాళ్లు దిగి మిమ్మల్ని వదలమంటూ వీరంగం సృష్టించిన యవ్వారం తెలిసిందే. సహజంగా ఇలాంటి బెదిరింపులు మంచు ఫ్యామిలీనే అందరికీ ఇస్తుంటారని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. కానీ, కామెడీగా ఈ సారి మంచు ఫ్యామిలీ మొత్తానికే ఆ బెదిరింపులు తగిలాయి. ఇంతకీ ఆ బెదిరింపులు జారీ చేసిన దుండగులు ఎవరయ్యా అంటే.. మంచు ఫ్యామిలీ శంషాబాద్ లో కట్టుకున్న ఇంటి పక్కన స్ధలం ఉన్నవారు అట. స్థలం విషయంలో ఇద్దరి మధ్య గొడవ లేకపోయినా… ఆ స్థలానికి వెళ్లే దారి విషయంలో తేడా వచ్చిందని.. దాంతో మంచు ఫ్యామిలీ పై ఆ స్థలం తాలూకు వ్యక్తులు కోపం పెంచుకున్నారని.. ఈ క్రమంలో ఆ వ్యక్తుల పిల్లలే మంచు ఇంటిలో దూరి హెచ్చరించి వెళ్లారని తెలుస్తోంది.

Also Read: ‘పుష్ప’ స్టోరీ అదేనా!

వారి హెచ్చరికలకు భయానికి లోనైన మోహన్‌బాబు కుటుంబ సభ్యులు పహాడిషరీఫ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా చేసిన దర్యాప్తులో ఈ విషయం బయటపడింది. అయితే ఇందులో మోహన్‌బాబు ఇంటి వాచ్‌మెన్ ప్రమేయం కూడా ఉందని అంటున్నారు. అతను ఆ రోజు కావాలనే అప్రమత్తంగా లేడట. భారీ గేటు నుండి ఒక ఇన్నోవా కారు లోపలకి రావాలంటే వాచ్ మెన్ గేటు తీయాలి. కారులో వాళ్లు దుండగులు అని, తాగి ఉన్నారని క్లియర్ గా తెలిసిన తరువాత కూడా వాచ్ మెన్ గేటు ఎందుకు తీశాడని మంచు ఫామిలీ అతని పై సీరియస్ అయింది.

Also Read: మూడో పెళ్లి చేసుకున్నా సుఖం లేదట !

ఇక కారులో ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మోహన్‌బాబు ఇంటికెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చేంత అవసరం, ఆ స్థాయి శత్రువులు ఎవరా అని ఆలోచిస్తున్న క్రమంలో వీళ్ళ గురించి తెలిసి దొరికిపోయారు. ఏది ఏమైనా ఆ ఆకతాయిలు మోహన్‌బాబు కుటుంబానికి హాని కలిగించే ఉద్దేశంతో రాకపోయినా.. వారు చేసింది తప్పే. ఎవరు ఈ పనికి పూనుకున్నా తగిన చర్యలు తీసుకోవాల్సిందే.

ఎక్స్ క్లూజివ్: ప్రభాస్ ‘రాధే శ్యామ్’ స్టోరీ సీక్రెట్స్ !


మరీ రక్తం మరిగిన జంతువులు కూడా అతని అడుగుల చప్పుడుకు ఆదరిపోతాయి… ఈ డైలాగ్ రాధే శ్యామ్ లో ప్రభాస్ గురించి రాసింది. స్పాంజి నీళ్లను పీల్చుకున్నట్టు అనుభవాల్ని పాఠాలుగా మలుచుకోవటం నేర్చుకున్న ఓ దొంగ కుమారుడే ఈ రాధే శ్యామ్. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి దేశ విదేశాల్లో ఓ స్థాయికి ఎదిగిన వ్యక్తి క్యారెక్టర్ లో ప్రభాస్ కనిపిస్తున్నాడు. మొత్తంగా ప్రభాస్ ఈ సినిమాలో ఎంట్రప్రెన్యూర్ గా నటిస్తున్నాడట. అవసరమైతేనే జత కలవాలి బలం పెంచుకోవాలనే క్రియేటవివ్ బిజినెస్ మెన్ గా ఓ ఇన్నవేటివ్ థాట్ తో ప్రభాస్ ఒక క్యారెక్టర్ చేస్తుంటే.. మరో క్యారెక్టర్ లో రెగ్యులర్ మాస్ హీరోలా కనిపిస్తాడట. అంటే.. ప్రభాస్ ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ లో అలరించబోతున్నాడు.

Also Read: మూడో పెళ్లి చేసుకున్నా సుఖం లేదట !

మొత్తానికి ఈ సినిమా కథలో బోలెడంత నిగూఢార్ధం ఉందట. కొత్త కథలతో వచ్చే సినిమాల రిలీజ్ తరువాతే వాటి బాగోతం బయటపడుతుంది. కప్పేసే ప్రతీదీ మనల్ని మిస్ లీడ్ చేస్తుందన్నట్లు.. సినిమా స్టోరీ లైన్స్ కూడా అలానే అనిపిస్తాయి. ఏమైనా నేషనల్ స్టార్ అయ్యాక ప్రభాస్ సినిమాల స్టైల్ మారింది. యూనివర్సల్ సబ్జెక్ట్ లు తీసుకోవాలని తెగ ఆరాటపడుతున్నాడు. కానీ, అవి ఎంతవరకూ వర్కౌట్ అవుతాయి అన్నదే పాయింట్. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు అలాంటి కథలు ఎక్కవు. సాహో విషయంలో ఆ తప్పే జరిగింది. ఇప్పుడు రాబోయే సినిమాల్లో కూడా అదే రిపీట్ ఆయితే.. ఇక ప్రభాస్ కి తెలుగు మార్కెట్ తగ్గిపోయే అవకాశం ఉంది. మరి ప్రభాస్ ఇవ్వన్నీ దృష్టిలో పెట్టుకుని సినిమాలను ఫైనల్ చేసుకుంటే బెటర్.

Also Read: ‘పుష్ప’ స్టోరీ అదేనా!

ఇక ప్రస్తుతం ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఇటీవలే ఒక స్పెషల్ సెట్ ను వేయడానికి పూనుకున్నారు. త్వరలో జరగబోయే షెడ్యూల్ తరువాత రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా వన్ వీక్ షూటింగ్ జరగనుందని.. దాని కోసమే సెట్ వేస్తున్నారని తెలుస్తోంది. మరి`జిల్` అనే ప్లాప్ సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ రాధాకృష్ణ‌ తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎంతవరకు హిట్ అవుతుందో చూడాలి. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అన్నట్టు అమ్మడు బికినీ అవతారంలో కనిపించనుంది ఈ సినిమాలో. నాలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాని గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఎలా దెబ్బకొట్టాలో.. కేసీఆర్ ఆదర్శం అంతే!


40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబును మూట ముల్లె సర్దుకొని హైదరాబాద్ నుంచి పారిపోయేలా చేసిన ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్ ది. ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు నెలవైన రాజకీయాల్లో ఆరితేరిన అపర బీష్ముడు మన చంద్రబాబు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాడు ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశం పార్టీ ఆయన కుటుంబ సభ్యులతోనే లాక్కొని నేడు వారికి అందులో పాత్రలేకుండా చేసిన ఘనత బాబు సొంతం. 40 ఏళ్లుగా జగన్, వైఎస్ఆర్, కేసీఆర్ సహా ఎంతో మంది చంద్రబాబు బాధితులే.. అస్సలు ఒక్క కోర్టుల్లో కూడా దొరకని చంద్రబాబు కేసీఆర్ కు దొరికి పరారయ్యాడు. కేసీఆర్ అపరచాణక్య తెలివితేటలకు చంద్రబాబు పలాయనం చిత్తగించారు. తొలిసారి వెనకడుగు వేశారు.

Also Read: అమరావతి టీడీపీకి.. విశాఖ వైసీపీకి లాభం? పవన్ వస్తే.?

ఓటుకు నోటు కేసులో ఇరికించేలా చేసి చంద్రబాబును అమరావతికి సాగనంపారు కేసీఆర్ . అంతకుముందు తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చి విభజన వాదంతో తెలంగాణలో టీడీపీనే లేకుండా చేశారు.

కేసీఆర్ వ్యూహాలు, దెబ్బలకు చంద్రబాబు కోలుకోలేదు. ఏకంగా తెలంగాణలో టీడీపీ దుకాణమే ఇప్పుడు ఖాళీ అయిపోయింది. నేతలంతా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లో చేరిపోవడంతో తెలంగాణలో ఉనికే లేదు.

ఇప్పుడు కేసీఆర్ దగ్గర సలహాలు సూచనలు తీసుకున్నాడో ఏమో కానీ ఏపీ సీఎం జగన్ అదే కేసీఆర్ మంత్రంతో చంద్రబాబును కొట్టారని అమరావతిలో టాక్ వినిపిస్తోంది. ‘విభజనవాదం’ ఇదీ కేసీఆర్ నినాదం.. ఆయన నినాదాన్ని అందిపుచ్చుకొని జగన్ ఇప్పుడు ఏపీకి మూడు రాజధానులు చేశాడు. చంద్రబాబు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. అమరావతి ప్రాంతం కోసం ఉత్తరాంధ్ర, రాయలసీమలో బాబు విలన్ అవుతున్నాడు. అలా బాబును ఒక ప్రాంతానికి పరిమితం చేసి రెండు ప్రాంతాల్లో వైసీపీ బలంగా తయారువుతోంది. ఇలా కేసీఆర్ స్ట్రాటజీతోనే చంద్రబాబును చావుదెబ్బ తీసే ప్లాన్ జగన్ తెస్తున్నారు.

Also Read: కేసీఆర్ కుటుంబం నుంచి మరొకరు రాజకీయాల్లోకి?

ఇప్పుడు చంద్రబాబు విశాఖ రాజధానికి, ఉత్తరాంధ్రకు వ్యతిరేకమంటూ జగన్-వైసీపీ కొత్త పల్లవిని ఎత్తుకుంటున్నారట.. ఇలా కేసీఆర్ ఐడియాలజీనే ఏపీలో చంద్రబాబుపై ప్రయోగిస్తూ జగన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడని వైసీపీ వర్గాల్లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. సమకాలీన రాజకీయాల్లో విభజన వాదం కంటే బలమైన ఆయుధం మరొకటి లేదని.. కేేసీఆర్ అందుకే దాన్ని ప్రతీసారి అవసరార్థం వాడేస్తుంటారని విశ్లేషకులు చెబుతున్నారు.

-ఎన్నం

బాబు వెంట నడిచేది ఎంతమంది?

CBN Press meet


సీఆర్డీఏ బిల్లు రద్దు.. మూడు రాజధానులకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. అధికార ప్రతిపక్ష పార్టీ మధ్య మాటలయుద్ధంగా తారాస్థాయికి చేరుకుంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు రాజీనామాకు సిద్ధమవుతున్నారు. ఈనేపథ్యంలోనే చంద్రబాబు వైసీపీ నేతలకు సవాల్ విసురుతున్నారు. 48గంటల డెడ్ లైట్ సీఎం జగన్ కు విధించడం ఆసక్తిని రేపుతోంది. ‘దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయి.. ఎన్నికలకు వెళదాం.. అమరావతిపై ప్రజల్లోనే తేల్చుకుందాం..’ అంటూ బాబు తొడగొట్టడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: అమరావతి టీడీపీకి.. విశాఖ వైసీపీకి లాభం? పవన్ వస్తే.?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పదేళ్లు కష్టపడి గత ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. జగన్ ఇటీవలే ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఇంకా నాలుగేళ్లు ఆయనకు పదవీకాలం ఉంది. ఈ సమయంలో చంద్రబాబు అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికల్లో తేల్చుకుందాం.. అంటే మాత్రం జగన్ మాత్రం సిద్ధమవుతారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. కిందటి ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23సీట్లు దక్కాయి. ఇందులో నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం జగన్ కు జై కొడుతున్నారు. ఈ లెక్కన టీడీపీలో బాబుతో కలిపి మొత్తంగా 20మంది ఎమ్మెల్యేలు ఉంటారు.

సీఎంగా ఏడాది కాలంలో జగన్ సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి దూసుకెళుతున్నారు. మునుపటి కంటే ఆయన గ్రాఫ్ ఇటీవలే చాలా పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు అమరావతి రాజధానిని అడ్డుపెట్టుకొని ప్రజాక్షేత్రంలోకి వెళుతారా? రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఎంతవరకు నెగ్గుతుందని ఆ పార్టీ నేతలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా బాబు రాజీనామా చేస్తే ఆయన వెంటే నడించేందుకు తమ్ముళ్లు సిద్ధంగా ఉన్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. టీడీపీలో రాజీనామాలు చేసేందుకు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని సమాచారం.

Also Read: జగన్ భాద్యత వహిస్తాడా ?

తమ నియోజకవర్గాల్లో పరిస్థితి అంచనా వేయకుండా బాబు ఎలా రాజీనామా కోరుతారని మిగితా ఎమ్మెల్యేలు ఎదురు ప్రశ్నిస్తున్నారట. కిందటేడాదే కోట్లు ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలిస్తే బాబు ఆవేశానికి తాము బలికావాలా? అంటూ తమ్ముళ్లు వాపోతున్నారట. ఒక్క అమరావతి రాజధాని కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలకు వెళితే మిగతా ప్రాంతాల్లో టీడీపీ గెలిచే అవకాశం లేదని నేతలు చెబుతున్నారు. టీడీపీ అధికారంలోకి రానప్పుడు మళ్లీ రాజీనామా చేసి గెలువడం ఎందుకని నైరాశ్యం నేతల్లో కన్పిస్తుంది.

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ వైసీపీ ఇటీవల ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. సంక్షేమ పథకాలు అమలును చూపిస్తూ టీడీపీ నేతలను వైసీపీలోకి చేర్చుకుంటోంది. ఇలాంటి సమయంలో బాబు ఎన్నికలకు వెళితే ఆయన కూడా గెలిస్తాడో లేడో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాజీనామాల అంశాన్ని ఎలా వెనక్కి తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇది నిజంగా బాబుకు పరీక్ష మారనుందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. మరీ బాబు ఈ పరీక్షలో ఏమేరకు నెగ్గుతారనేది వేచి చూడాల్సిందే..!

‘పుష్ప’ స్టోరీ అదేనా!


సెన్సిబుల్‌ డైరెక్టర్ సుకుమార్, స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్‌ సినిమాలు వస్తున్నాయంటే ఆడియన్స్‌లో క్యూరియాసిటీ ఉంటుంది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. తమ ప్రతి సినిమాలో వైవిధ్యం, కొత్తదనం ఉండేలా చూసుకుంటారు సుక్కూ, బన్నీ. అలాంటిది వీరిద్దరి కలయికలో మూవీ అంటే అంచనాలు అమాంతం పెరిగిపోతాయి. ప్రస్తుతం అదే జరుగుతోంది. ‘అల వైకుంఠపురములో’ వంటి క్లాసిక్‌ మూవీతో భారీ హిట్‌ అందుకున్న బన్నీ.. వెంటనే రూటు మార్చి సుకుమార్ తో ‘పుష్ప’ అనే డిఫరెంట్‌ మూవీకి కమిటయ్యాడు. పాన్‌ ఇండియా మూవీగా ఐదు భాషల్లో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను బన్నీ బర్త్‌డే సందర్బంగా రివీల్‌ చేశారు. గంధం చెక్కల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే మూవీలో బన్నీ.. రఫ్‌ లుక్‌లో వైవిధ్యంగా కనిపించాడు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్రంలో బన్నీ ‘పుష్పరాజ్‌’ అనే పాత్రలో కనిపించనుండగా.. రష్మిక.. పోలీస్‌ ఆఫీసర్గా నటిస్తోందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు.

Also Read: ఎక్స్ పోజింగ్, లిప్ కిస్ ల‌ పై నిత్యా మీన‌న్‌ ఆసక్తి !

కరోనా ప్రభావం మొదలయ్యే వరకూ కేరళలోని అడవుల్లో షూటింగ్‌ నిర్మహించారు. కానీ, లాక్‌డౌన్‌ విధించిన తర్వాత చిత్రీకరణకు బ్రేక్‌ పడింది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఫారెస్ట్‌ సెట్‌ వేసి షూటింగ్‌ రీస్టార్ట్‌ చేయాలని సుక్కూ భావించినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదని తేలింది. మరోవైపు కరోనా వైరస్‌ ఉధృతి పెరగడంతో ఇప్పుడప్పుడే షూటింగ్‌ తిరిగి ప్రారంభమయ్యే పరిస్థితి లేదు. దాంతో, బన్నీ, సుక్కు తమ తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. కొరటాల శివతో అల్లు అర్జున్‌ సినిమా అనౌన్స్‌ చేయగా.. ఈ ఖాళీ టైమ్‌లో ఓ వెబ్‌ సిరీస్‌ తీయాలని సుకుమార్ భావిస్తున్నాడని సమాచారం.

Also Read: మూడో పెళ్లి చేసుకున్నా సుఖం లేదట !

షూటింగ్‌ సందడి లేకున్నా కూడా ‘పుష్ప’ ప్రతి రోజూ వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ రోజుకో వార్త హల్‌చల్‌ చేస్తోంది. బన్నీ క్యారెక్టర్లో మూడు కోణాలు ఉంటాయని ఓసారి… కాదు కాదు రెండు షేడ్స్‌ ఉంటాయని ‘రంగస్థలం’ క్లైమాక్స్‌ మాదిరిగా చివర్లో అది రివీల్‌ అవడంతో కథ ఆసక్తికర మలుపు తిరిగి ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేస్తుందని టాలీవుడ్‌ సర్కిల్స్‌లో ఇప్పటికే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో మూవీ గురించి మరో ఆసక్తి కర విషయం బయటికొచ్చింది. ఈ మూవీలో హీరో గంధం చెక్కలు స్మగ్లింగ్‌ చేసినా స్టోరీ మొత్తం దాని గురించే ఉండదట. ‘పుష్ప’.. గ్యాస్‌ లీకేజ్‌ ప్రధానంగా సాగుతుందట. గతంలో ఓఎన్‌జీసీ గ్యాస్‌ లీకేజ్‌, ఈ మధ్య వైజాగ్‌లో ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజ్‌ ఉదంతాల కారణంగా సమీప ప్రాంతాలు, అడవులకు దగ్గరగా ఉండే ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపాయనే బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. గ్యాస్‌ లీకేజ్‌లు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే వాయువుల కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం హీరో చేసే పోరాటమే చిత్ర కథ అని అంటున్నారు. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు గానీ… ‘పుష్ప’ కోసం అభిమానులనే కాదు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారన్నది మాత్రం నిజం.

అమరావతి టీడీపీకి.. విశాఖ వైసీపీకి లాభం? పవన్ వస్తే.?


ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తుంటారు రాజకీయ నాయకులు.. అధికారం మార్పిడి జరగగానే అంతా మారిపోతుంటుంది. ఆ పార్టీ రంగులు జనబాహుళ్యంలోకి వచ్చేస్తాయి. పాత పచ్చ రంగులు కనుమరుగైపోతాయి. అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించకముందే అది లీక్ అయిపోయి టీడీపీ నేతలంతా భూములు కొని పెద్ద ఎత్తున లాభపడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అమరావతి మొత్తం టీడీపీ నేతల చేతుల్లోనే ఉందని.. రాజధాని అయితే బాగుపడేది వారేనని వైసీపీ ఆరోపించింది. అమాయకపు రైతుల నుంచి పెద్ద ఎత్తున భూమిని ముందే కొని మోసం చేశారనే అపవాదు ఉంది.

Also Read: కాపులు ఐక్యత కోసం బీజేపీలోకి ముద్రగడ?

అందుకే చంద్రబాబు, టీడీపీ నేతలు లక్షల కోట్లు ఖర్చు పెట్టి పెట్టుబడి పెట్టిన అమరావతి కోసం పోరాడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అమరావతి నుంచి విశాఖకు రాజధాని తరలిస్తే టీడీపీ గగ్గోలు పెట్టడానికి కారణం అదే అంటున్నారు.

ఇదే సమయంలో అమరావతిని రాజధానిగా కొనసాగించడం వల్ల పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి పైసా లాభం లేదు. టీడీపీ వాళ్ల జేబులు నింపడం తప్ప వేరే ఉపయోగం లేదని వైసీపీ సమాలోచనల్లో తేలిపోయింది. అందుకే వైసీపీ నేతలు ఎక్కువగా భూములు కొన్న విశాఖకు మకాం మార్చాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనూ మూడు రాజధానులు ప్రక్రియ తెరపైకి వచ్చిందని టీడీపీ ఆరోపిస్తోంది.

తాజాగా టీడీపీ మాజీ మంత్రి ఒకరు హాట్ కామెంట్స్ చేశారు. ఇక్కడ అమరావతి రాజధాని చేస్తే లక్ష కోట్ల లాభం టీడీపీ నేతలకు కలుగుతుంది. అక్కడ విశాఖను రాజధానిగా చేస్తే వైసీపీ నేతలకు లాభాల పంట పండుతుందని.. రాజధాని అనేది ఒక రియల్ మాఫియా దందా అని స్పష్టం చేశారు.

Also Read: జగన్ భాద్యత వహిస్తాడా ?

దీన్ని బట్టి టీడీపీ, వైసీపీ నేతలు అంతా రాజధాని పేరు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం తప్పితే ప్రజా అవసరాల కోసం ఈ రాజధాని ఏర్పాటు కాదన్నది సగటు సామాన్యుడి ఆవేదన. ఏది అయితేనేమీ ఐదేళ్లకోసారి అధికారం మారినప్పుడల్లా రాజధాని మారకుండా ఈ ఐదేళ్లలోనే రాజధాని విశాఖలో ఫిక్స్ చేస్తే.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చినా ఏపీకి కొత్త రాజధాని రాకుండా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు..

-ఎన్నం

కాపులు ఐక్యత కోసం బీజేపీలోకి ముద్రగడ?

Mudragada Padmanabham

Mudragada Padmanabham
ఏపీలో బీజేపీ బలపడేందుకు యత్నిస్తుంది. కేంద్రంలో బీజేపీ సర్కార్ అధికారంలోకి ఉండటంతో అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళుతోంది. ఏపీలో బీజేపీకి ఒక్క సీటు లేనప్పటికీ రాజకీయాల్లో చక్రం తిప్పుతోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ దీటుగా బీజేపీ ఏపీలో రాజకీయాలు చేస్తుండటం విశేషం. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో బీజేపీ బలపడేందుకు ఇప్పటి నుంచి ప్రణాళికలను రచిస్తుంది.

Also Read: రాజధాని రైతులకు ప్రభుత్వం ఇచ్చే ఆఫర్ ఇదేనా?

ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ పార్టీ స్థాపించిన జనసేనతో పొత్తుపెట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కూటమిగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఏపీలో బలంగా ఉన్న కాపు ఓట్లను గంపగుత్తగా తన ఖాతాలో వేసుకుంటున్నందుకు కసరత్తులు చేస్తోంది. జనసేన ఓటు బ్యాంకులో కాపుల మెజార్టీ ఎక్కువగా ఉంది. జనసేనతో పొత్తు కారణంగా ఇధి ఆ పార్టీకి కలిసిరానుంది. దీంతో కాపుల్లో బలంగా ఉన్ననేతలపై బీజేపీ దృష్టిసారిస్తోంది. ఇందులో భాగంగా ముద్రగడ పద్మానాభానికి బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు రెడీ అవుతుందనే ప్రచారం జరుగుతోంది.

ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల కోసం గతంలో ఉద్యమం చేపట్టారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఏపీలో కాపు ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. అయితే ఈ ఉద్యమాన్ని బాబు తీవ్రంగా అణిచివేశారు. ఆ తర్వాత కొద్దిరోజులపాటు సైలంటయ్యారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఒకటిరెండు కాపు ఉద్యమం కోసం లేఖలు రాశారు. పద్మనాభం వైసీపీని గట్టిగా నిలదీయకుండా జగన్ కు మద్దతు పలుకుతున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన మనస్థాపం చెంది కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

Also Read: బాబు మార్క్ రాజకీయాలు షూరూ?

తాజాగా ఆయన మళ్లీ రాజకీయాల్లో క్రీయాశీలకంగా మారుతున్నారనే టాక్ విన్పిస్తోంది. పద్మనాభంకు బీజేపీ మంచి పదవీ ఇచ్చి ఆ పార్టీలోకి ఆహ్వానించిందనే సమాచారం. దీంతో ఆయన బీజేపీలోకి చెరేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాపుల్లో బలమైన నేతలుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ, సొము వీర్రాజులు బీజేపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. జనసేన ఎలాగూ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ముద్రగడను కూడా బీజేపీలో చేర్చుకోవడం ద్వారా కాపు ఓట్లను గంపగుత్తగా లాగాలని చూస్తోంది. టీడీపీ, వైసీపీకి చెందిన కాపు నేతలను కూడా బీజేపీకి ఆహ్వానించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. కాపు నేతలందరినీ ఐక్యం చేస్తున్న బీజేపీలోకి ముద్రగడ వెళుతారా? లేదో వేచిచూడాల్సిందే..!

కేసీఆర్ కుటుంబం నుంచి మరొకరు రాజకీయాల్లోకి?

CMKCR

CMKCR
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరో సెంటిమెంట్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కేసీ‘ఆరు’ పేరులోనే 6 అనే సంఖ్య ఉంది. ఇందుకు తగ్గట్టుగానే ఆయన ఏ పని మొదలెట్టినా ఆ సంఖ్య వచ్చేలా చూసుకుంటారు. కేసీఆర్ కు తొలి నుంచి జ్యోతిష్యం, న్యూమరాలజీ, ఆధ్యాత్మికంపై మంచి నమ్మకం ఉంది. వీటి ప్రకారం ఆయన ముహుర్తాలు చేసుకుంటూ పనులు చేస్తుంటారు. ముఖ్యంగా ఆరు అంకె కలిసొచ్చేలా పనులు చేపడుతుంటారు. ఆరు అంకె ఆయనకు కలిసొస్తుండటంతో కేసీఆర్ కు అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. ఈ సెంటిమెంట్ ను ఆయన తన కుటుంబానికి కూడా వర్తింపజేస్తుండటం ఆసక్తిని రేపుతోంది.

Also Read: కొత్త తెలంగాణ పీసీసీ చీఫ్ కు అదే అడ్డు?

కేసీఆర్ కుటుంబానికి చెందిన మరో వ్యక్తి రాజకీయాల్లోకి రానున్నారని టీఆర్ఎస్ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగానే సదరు వ్యక్తి గత కొద్దిరోజులుగా ప్రగతి భవన్ కి వచ్చిపోతున్నారనని సమాచారం. కేసీఆర్ తో కలిసి ఇప్పటికే పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ కుటుంబం నుంచి ఐదుగురు వ్యక్తులు టీఆర్ఎస్ క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో కేసీఆర్ మరొకరిని కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారనే టాక్ విన్పిస్తుంది. కేసీఆర్ ఆరో సెంటిమెంట్ కు అనుగుణంగా తెరపైకి మరొకరు రానున్నట్లు తెలుస్తోంది.

సీఎం కేసీఆర్ తో కలిపి ఆయన కుటుంబం నుంచి ఐదుగురు రాజకీయాల్లో ఉన్నారు. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన తనయుడు కేటీఆర్ ఐటీశాఖ మంత్రిగా ఉన్నారు. ఇక ఆయన మేనల్లుడు హరీష్ రావు ఆర్థిక మంత్రిగా, కూతురు కవిత ఎమ్మెల్సీగా, సోదరుడి కుమారుడు సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. తాజాగా మరో పేరు తెరపైకి రావడంతో కేసీఆర్ కుటుంబం నుంచి ఆరో వ్యక్తి రానున్నాడని ప్రచారం జోరుగా సాగుతోంది.

Also Read: జల వివాదాల పరిష్కారంపై ముఖం చాటేస్తున్న కేసీఆర్

కేసీఆర్ ల‌క్కీ నెంబ‌ర్ ఆరుకు తగ్గట్టే అన్ని వ్యవహారాలు సాగుతుంటాయి. ఆయన వాడే కాన్వాయ్ నెంబరు నుంచి ప్రతీ విషయంలోనూ 6 అనే అంకె ముడిపడేలా చూసుకుంటుంటారు. చివరికి తెలంగాణ కొత్త సచివాలయం కూడా ఆరు అంతస్తుల్లో 6లక్షల చదరపు అడుగుల్లో నిర్మించనున్నారట. తాజాగా ఈ ఆరో సెంటిమెంట్ కుటుంబానికి కూడా వర్తించనుందని సమాచారం. త‌న‌ సోదరుడి కుమారుడైన‌ వంశీని త్వరలోనే పార్టీలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వంశీ ఇటీవల త‌రచూ ప్రగతి భ‌వ‌న్లో కన్పిస్తుండటంతో ఆయన ఎంట్రీ కన్ఫామ్ అనే ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంపై సీఎం కేసీఆర్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో వేచి చూడాల్సిందే..!

జగన్ భాద్యత వహిస్తాడా ?

CM Jagan

CM Jagan
శుక్రవారం నాడు గవర్నర్ మూడు రాజధానులకు ఆమోదముద్ర వేయడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి , శుక్రవారం రాష్ట్ర చరిత్రలో చీకటి రోజు అని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు.అన్ని రాజకీయ పార్టీలు గవర్నర్ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. కానీ జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల వలన అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి అని వాదిస్తుంది.

Also Read: రాజధాని రైతుల కల నెరవేరుతుందా?

రాష్ట్ర విభజన తరువాత అమరావతి రాజధానిగా నవ్యఆంధ్రప్రదేశ్ ఏర్పడింది , అప్పటి ప్రభుత్వం వేలాది ఎకరాలు రైతుల నుండి సేకరించింది . అక్కడి ప్రజలు తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని ఎన్నో ఆశలతో మూడు పంటలు పండే భూమిని ప్రభుత్వానికి సమర్పించుకున్నారు, కానీ నేడు వారి ఆశలు అన్ని ఆవిరైపోయాయి , సవంత్సరం కాలంగా అమరావతి రైతులు రాజధాని కోసం పోరాడుతూనేవున్నారు ,ఐనా గవర్నర్ ఇవేమి పట్టించుకోకుండా మూడు రాజధానులకు ఆమోద ముద్ర వేశారు.

ఇది ఇలా ఉంటే తెరపైకి మరో ఆసక్తికర వాదన వచ్చింది, ఆ వాదన ప్రకారం రాజధాని అమరావతిలోని ఉంటే ఒకే సామజిక వర్గానికి లాభం చేకూరుతుంది, ఆలా ఆ సామజిక వర్గం బలపడితే ప్రస్తుత ప్రభుత్వానికి రాజధాని ప్రాంతంలో పట్టు ఉండదు, ఎలాగైనా రాజధాని ప్రాంతంలో తన ఉనికిని కాపాడుకోవడానికి జగన్ అండ్ కో ఇలా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి, మూడు రాజధానులు సాధించుకున్నారని కొందరు అంటున్నారు.

Also Read: రాజధాని రైతులకు ప్రభుత్వం ఇచ్చే ఆఫర్ ఇదేనా?

ప్రపంచంలో ఏ దేశానికి మూడు రాజధానులు లేవు , మరి ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు మూడు రాజధానులు అంటే రాయలసీమ , కోస్తాంధ్ర , ఉత్తరాంధ్ర సమానంగా అభివృద్ధి సాధించాలంటే మూడు రాజధానులు అవసరం అని ప్రభుత్వం వాదిస్తోంది . వాస్తవంగా ఒక ప్రాంతం అభివృద్ధి సాధించాలంటే ప్రవేటు పెట్టుబడులు చాల అవసరం, ఆ పెట్టుబడుల వలన అనేక పరిశ్రమలు వచ్చి , ఉపాధి అవకాశాలు పెరిగి ఆ ప్రాంతం అభివృద్ధి సాధిస్తుంది.అంతే కానీ మూడు రాజధానుల వలన కాదు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం జగన్ ప్రభుత్వం అధికారంలో వుంది , భవిష్యత్తులో వేరే రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చి ఒకే రాజధాని అని అంటే అప్పుడు మూడు ప్రాంతాల ప్రజలు అయోమయానికి గురి కాకా తప్పదు. ప్రభుత్వ వాదన ప్రకారం మూడు రాజధానుల వలన మూడు ప్రాంతాలు అభివృద్ధి సాధించకుంటే పరిస్థితి ఏమిటి ? ఆ ప్రాంతాల మధ్య విద్వేషాలు చెలరిగితే భాద్యత ఎవరిది . జగన్ ప్రభుత్వం భాద్యత వహిస్తుందా?

మూడో పెళ్లి చేసుకున్నా సుఖం లేదట !

Vanitha Vijaykumar

Vanitha Vijaykumar
ఈ మధ్య మూడు పెళ్లిళ్లు చేసుకోవ‌డం అనేది అస్సలు కలిసి రావడంలేదు, ఈ పాయింట్ దగ్గరే పవన్ ను అవమానిస్తారు. ఇప్పుడు కరెక్ట్ గా ఇదే పాయింట్ దగ్గర బుక్ అయింది మాజీ హీరోయిన్ ‘వ‌నితా విజ‌య‌కుమార్‌’. మొదటి రెండు పెళ్లిళ్లు న‌చ్చ‌క విడాకుల బాట ప‌ట్టాయి. అలా అని వ‌నితా ఒంటరిగా ఏమి లేదు. చాల రోజులు ఇప్పుడు చేసుకున్న మూడో భర్తతో సహజీవినం చేసింది. ఈ సారి అన్ని విధాలుగా ముందే చూసుకుని ఆనందంగా పెళ్లి చేసుకుంది.

కానీ సుఖంగా కాపురం చేసుకోలేక నానా ఇబ్బందులు పడుతుందట. తన మీద చేస్తోన్న కామెంట్స్ కి తెగ ఫీల్ అవుతుందట.గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నా తనని మాత్రం వదలడం లేదని తెగ బాధ పడుతుందట.

Also Read: ఎక్స్ పోజింగ్, లిప్ కిస్ ల‌ పై నిత్యా మీన‌న్‌ ఆసక్తి !

నిజమే వనితా చేసిన తప్పు ఏముంది ? ఒక హీరోయిన్ గా మూడు పెళ్లిలు చేసుకోవడం నేరమా ? పెళ్లి కాకుండా లెక్కకు మించి తిరిగేతే తప్పు గానీ, పద్దతిగా పెళ్లి చేసుకుంటే తప్పు ఎలా అవుతుందని ఆమె మనోగతం. అయినా జీవితానికో తోడు అవ‌స‌రం అని.. అందుకే తానూ ప్రేమ‌, పెళ్లిళ్ల విష‌యంలో ఎన్నిసార్లు విఫ‌ల‌మ‌వుతున్నా వాటి పై న‌మ్మ‌కాన్ని చంపుకోనని.. అవసరమైతే మరో సారైనా పెళ్లికి సిద్ధం అని ఆవేశంలో ఏదేదో మాట్లాడుతుందని కోలీవుడ్ మీడియాలో ఈ అవుట్ డేటెడ్ హీరోయిన్ మీద ఛలోక్తులు విసురుతున్నారు క్రిటిక్ రాయుళ్ళు.

Also Read: అనసూయ బిజినెస్ మొదలెట్టేసింది !

ఏది ఏమైనా వివాహ బంధం పై తన ధోర‌ణిని వ‌నితా విజ‌య‌కుమార్‌ స్పష్టంగా చెబుతుంది. ఇక నాలుగేళ్ళు పోతే కూతురు కూడా పెళ్లి ఈడుకొస్తోంది. అయినా పీట‌ర్ పాల్‌ను వ‌నితా మూడో పెళ్లి చేసుకుంది. పీట‌ర్ తో కూడా తేడా వస్తే మరో పెళ్లికి కూడా సిద్ధం అనే రేంజ్ లో వీర వనితా ఆవేశం చూపిస్తుంటే ఆ కార్యం కూడా జరిగేలానే ఉంది. ఏమైనా ఎప్పటికప్పుడు కొత్త వ్యక్తులతో కొత్త జీవితం ఆరంభించాలనే వనితా విశాలమైన హృదయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అయినా వ‌నిత‌ వ్య‌క్తిగ‌త జీవితాన్ని ర‌చ్చ చేయడం మంచి పద్దతి కాదని ఆమె సన్నిహితులు కూడా ఆమెకు కాస్త సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు కూడా ఆమె పై చాటుగా పెదవి విరుస్తున్నారట. మొత్త్తనికి అందరూ కలిసి వనితను సుఖంగా కాపురం చేసుకోనివ్వడం లేదు పాపం.

రాజధాని రైతులకు ప్రభుత్వం ఇచ్చే ఆఫర్ ఇదేనా?

Amaravati

Amaravati

మూడు రాజధానుల విధానంలో భాగంగా అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం, రాజధాని రైతుల విషయంలో అనుసరించాల్సిన విధానంపై ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. రాజధాని రైతులను కొంతైనా సంతృప్తి పరిచేందుకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించడంతోపాటు, మరికొన్నేళ్లు వారికి కౌలు రూపంలో ఆర్ధిక సాయం కొనసాగించాలనే అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. భూములు వినియోగించుకున్న ఒక రకంగా, వినియోగించుకోని భూములకు మరో రకంగా ప్యాకేజీలను అమలు చేసి అమరావతిలోని రైతుల సంతృప్తి చెందే విధంగా చేయాలని భావిస్తోంది. ఇందుకు రైతులతో స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి తదనుగుణంగా ఓ నిర్ణయానికి రానున్నారు.

Also Read: రాజధాని రైతుల కల నెరవేరుతుందా?

ఇప్పటికే నిర్మించిన భవనాలు, స్పీడ్ యాక్సెస్ రోడ్లు, ఇతర నిర్మాణాలను కొంత మంది రైతుల భూములు వినియోగించుకున్నారు. వారికి లేవుట్ ప్లాట్లు ఇవ్వడంతో పాటు లేవుట్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారు. ఇక వినియోగించుకోని భూముల విషయంలో ఎవరి భూములు వారి తీసుకుని మళ్లీ సాగు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించాలనే ఆలోచనల చేస్తున్నారు. మరి కొంత కాలం వీరికి కౌలు చెల్లిస్తారు. దీంతో వారికి ఎటువంటి అభ్యంతరం లేకపోవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే విజయవాడ, గుంటూరులకు సమీపంలో ఉంటే ఈ ప్రాంతాలు ఎప్పటికైనా అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి రైతులు ప్రభుత్వం సూచలను అంగీకరిస్తారనే ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. భూ సమీకరణ సమయంలో రాజధాని ప్రాంతంలో పర్యటించిన జగన్ తాము అధికారంలోకి వస్తే టిడిపి ప్రభుత్వం తీసుకున్న భూములన్నీ తిరిగి వెనక్కి ఇస్తానని హామీ ఇచ్చారు కాబట్టీ హామీ నిలబెట్టుకున్నట్లు ఉంటుందని అనుకుంటున్నారు.

Also Read: అమరావతికి కొత్త శోభ.. జగన్ ప్లానింగ్ ఇదేనా?

ఇప్పటికే గత ప్రభుత్వం రూ.9,600 కోట్ల వ్యయంతో భవనాలు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టగా వాటిలో కోన్ని పూర్తయ్యాయి. ఉద్యోగుల భవనాలు, ఐఎఎస్ అధికారుల నివాసాలు, ఎమ్మెల్యేల నివాసలు నిర్మాణాలు ప్రారంభించగా కొన్ని సముదాయాలు దాదాపుగా పూర్తి కావచ్చాయి. కొద్ది రోజుల కిందట పురపాలక శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ అధికారులతో కలిసి ఈ నిర్మాణాలను పరిశీలించారు. ఈ నిర్మాణాలను ఎలా ఉపయోగించుకోవాలని అనే అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. 50 శాతానికి మించి పూర్తయ్యిన భవన నిర్మాణ పనులు పూర్తి చేసి వాటిని వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. శాసన రాజధానితోపాటు ఈ ప్రాంత అభివృద్ధికి పలు ప్రాజెక్టులను కేటాయించడతోపాటు కొన్ని ప్రత్యేక చర్యలు ప్రభుత్వం తీసుకోవడంతో రైతుల్లో అసంతృప్తిని చల్లారుతుందని దీంతో ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

రాజధాని రైతుల కల నెరవేరుతుందా?

Amaravthi Farmers

Amaravthi Farmers
రాజధానిని తరలించకుండా అడ్డుకునేందుకు ఇప్పుడు రాజధాని రైతులకు ఉన్న ఏకైక మార్గం న్యాయస్థానాలను ఆశ్రయించడమే. దీంతో అమరావతి ప్రాంత రైతులు రాజధాని తరలింపుపై మరోమారు హై కోర్టును ఆశ్రయించారు. మూడు రాజధానుల గెజిట్ ను నిలిపివేయాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి హై కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. గతంలోనే రాజధానిని అమరావతి నుంచి తరలించకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సమితి ఆధ్వర్యంలో పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై న్యాయస్థానంలో విచారణ కోనసాగుతుంది. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలుతో రాజధాని తరలింపునకు ప్రభుత్వం చట్టపరమైన లాంఛనాలను పూర్తి చేసింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్ చే ఆమోదింప చేసుకుని చట్టరూపంలోకి తీసుకువచ్చింది. గవర్నర్ ఆమోదం లభించడంతో ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ గెజిట్ నిలిపివేయడంతోపాటు పాలనా వికేంద్రీకరణ, సీఆర్డఏ రద్దు ఉత్తర్వులను ఈ పిటీషన్ లో రైతులు సవాల్ చేశారు.

Also Read: అమరావతికి కొత్త శోభ.. జగన్ ప్లానింగ్ ఇదేనా?

రాజధాని విషయంలో ప్రభుత్వం నియమించిన జి.ఎన్ రావు కమిటీ, హై పవర్ కమిటీలు చట్ట విరుద్ధమని ప్రకటించాలని సమితి పిటీషన్ లో కోరింది. పాలనా వికేంద్రీకరణ చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వం రాజ్ భవన్, సిఎంఓ, సచివాలయాలను అమరావతి నుంచి తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నందున వీటిని తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ లో కోరారు. ఈ పిటీషన్ ను హై కోర్టు మంగళవారం విచారణకు స్వీకరించనుంది. గతంలో విచారణలో ఉన్న పిటీషన్ లను కలిపి విచారించే అవకాశం కూడా లేకపోలేదు.

Also Read: బాబు మార్క్ రాజకీయాలు షూరూ?

గతంలో రాజధాని రైతు పరిరక్షణ సమితి ఈ ఏడాది మార్చిలో దాఖలు చేసిన పిటీషన్ లో కరోనా నేపథ్యంలో ప్రభుత్వం రాజధానిని తరలించేందుకు ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. ఈ పిటీషన్ పై విచారించిన హై కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏ ప్రతిపధికన రాజధానిని తరలిస్తున్నారని చెప్పాలంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ప్రభుత్వం తీసుకవచ్చిందని శాసన మండలిలో బిల్లులు ఆమోదం పొందలేదని, ఆమోదం లభించే వరకూ అమరావతిని తరలించమని న్యాయస్థానానికి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు బిల్లులకు ఆమోదం లభించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో హై కోర్టు కేసు విచారణలో భాగంగా ప్రభుత్వానికి ఏం ఆదేశాలు జారీ చేస్తుందనేది శర్చనీయాంశమైంది. మరోవైపు రాజధానిని అమరావతి నుంచి తరలించకుండా అడ్డుకోవాలని రాజధాని పరిరక్షణ సమితి కల నెలరవేరుతుందా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.

ఎక్స్ పోజింగ్, లిప్ కిస్ ల‌ పై నిత్యా మీన‌న్‌ ఆసక్తి !

Nithya Meenan

Nithya Meenan

హీరోయిన్ నిత్యా మీన‌న్‌ అంటే.. పాత సినిమాలో హీరోయిన్ లాగా బొద్దుగా ముద్దుగా పద్ధతిగా ఉంటుందనే నేమ్ ఉండేది. అయితే ‘బ్రీత్’ అనే వెబ్ సీరిస్ లో హాట్ లిప్ కిస్ సీన్ లో రెచ్చిపోయి మరీ పెదవులను జుర్రుకోవడంతో.. ఇప్ప‌టి వ‌ర‌కూ పద్దతి.. ఎక్స్ పోజింగ్ కి దూరం లాంటి మాటలకు నిత్యామీన‌న్ దూరమైపోయింది. నిజానికి వెండితెర‌ పైనే చాలా సినిమాల్లో నిత్యామీన‌న్ ను కాస్త ఎక్స్ పోజింగ్ చేయమంటేనే నో చెప్పేది. ఇక లిప్ కిస్ లు ఉంటే ఆ సినిమానే ఒప్పుకునేది కాదు, అలాంటది ఒక వెబ్ సిరీస్ కోసం నిత్యామీన‌న్ ఎక్స్ పోజింగ్, లిప్ కిస్ ల‌ విషయంలో హద్దులు దాటడం అనేది అందరికీ షాకే.

Also Read: నయనతార అంతే.. నచ్చితేనే చేస్తోంది !

అయితే తాజాగా ఈ భారీ మ‌ల‌యాళీ బ్యూటీ ఇక నుండి రొమాంటిక్ సీన్స్ లో కూడా నటించడానికి సిద్దమే అని డైరెక్టర్స్ కి పోన్ చేసి మరి చెబుతుందట. మరి సడెన్ గా ఈ బ్యూటీలో ఈ మార్పు ఎందుకు వచ్చింది అంటే.. త‌మిళం, హిందీ, తెలుగు చిత్రాల్లో న‌టిస్తూ బ‌హుభాషా న‌టిగా గుర్తింపు పొందినా.. ఎక్కడా పెద్దగా స్టార్ డమ్ తెచ్చుకోలేకపోయానే అనే బాధ నిత్యాలో ఉందట. తనకంటే టాలెంట్ తక్కువ ఉన్న పూజా హేగ్దే, రాశి ఖన్నా లాంటి హీరోయిన్స్ ఫుల్ డిమాండ్ తో స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తుంటే తానూ మాత్రం బి గ్రేడ్ హీరోయిన్ లా సెకండ్ లీడ్ కే పరిమితం అయాననే బాధ నిత్యాని వేదిస్తోందట.

Also Read: వెండితెర పైకి హాట్ హాట్ జోడీ !

అందుకే నిత్యా ఇక నుండి కమర్షియల్ హీరోయిన్ అనే ముద్ర కోసం బికినీ కూడా వేస్తానంటుంది. మొత్తానికి లాక్‌ డౌన్ లో నిత్యా మీన‌న్ లో చాల మార్పులు వచ్చాయి. బ‌రువు కూడా తగ్గింది. ఇక నుండి చేయబోయే సినిమాల్లో నిత్యామీనన్‌ లిప్‌ లాక్‌ సన్నివేశాల్లో కూడా విచ్చలవిడిగా న‌టించనుంది. మరి అలాంటి పాత్ర‌ల్లో న‌టించ‌డానికి నిత్యా మీన‌న్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. ఆమెకు మెయిన్ క్యారెక్టర్స్ వస్తాయా అంటే డౌటే.

బాబు మార్క్ రాజకీయాలు షూరూ?

Chandrababu Politics

 

Chandrababu Politics

ఏపీలో మూడు రాజధానుల నిర్ణయానికి గవర్నర్ ఆమోదముద్ర వేసిన సంగతి తెల్సిందే. దీంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. అయితే ప్రభుత్వ నిర్ణయంలో లోపాలను ఎత్తిచూపాల్సిన టీడీపీ నేతలు ప్రస్తుతం వ్యవహరిస్తున్నతీరు హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లో 40ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు ఏపీ రాజధాని విషయంలో అనుసరిస్తున్న వ్యూహాలు చేస్తుంటే ఆయన కన్ఫూజ్ అవుతున్నారా? లేక ప్రజలను కన్ఫూజ్ చేస్తున్నారో తెలియడం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: అమరావతికి కొత్త శోభ.. జగన్ ప్లానింగ్ ఇదేనా?

ఏపీలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లుకు ఇటీవల గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో జగన్ సర్కార్ కు మూడు రాజధానుల విషయంలో లైన్ క్లియర్ అయింది. విశాఖపట్టణం పరిపాలన, అమరావతి శాసన, కర్నూలు న్యాయ రాజధానులుగా మారనున్నాయి. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఆమోదముద్ర వేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడుతున్నారు. అమరావతి రాజధాని కోసం అవసరమైతే రాజీనామా చేసేందుకు సిద్ధపడుతున్నారు. టీడీపీకి చెందిన నేతలందరూ రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నారనే టాక్ విన్పిస్తుంది.

తాజాగా టీడీపీ నేతలు తెరపైకి కొత్త డిమాండ్ తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించడం వల్ల రాయలసీమకు కొత్తగా ఒరిగేదేమీ లేదని అంటూనే.. కర్నూలును ఏపీ రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో డిమాండ్ తెరపైకి తీసుకొస్తుండంపై స్థానికులు విస్మయం చెందుతున్నారు. గతకొంతకాలంగా టీడీపీ ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని(అమరావతి) అని చెబుతూ వస్తోంది. అయితే తాజాగా టీడీపీ నేతలు రూట్ మార్చడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దమ్ముంటే టీడీపీ నేతలు రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ తరుణంలో వాటి నుంచి తప్పించుకునేందుకు టీడీపీ కర్నూలు రాజధానిని తెరపైకి తీసుకొస్తుందనే ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో అనంతపురం జిల్లాకు రావాల్సిన ఎయిమ్స్ ను అమరావతికి తరలించినప్పుడు మాట్లాడని స్థానిక టీడీపీ నేతలు నేడు కర్నూలును పరిపాలన రాజధాని చేయాలని కోరడం ఏంటని వైసీపీ నేతలు అంటున్నారు.

Also Read: జగన్ కి మేలుచేసేలా బాబు విమర్శలు!

ఓవైపు చంద్రబాబు అమరావతి రాజధాని కోసం పోరాటం చేస్తుంటే ఆ పార్టీ నేతలు కర్నూలును రాజధానిగా చేయాలని కోరుతుండటం ప్రజలను గందరగోళానికి గురిచేస్తుంది. దీంతో టీడీపీ కూడా అమరావతి రాజధానిని అటకెక్కించిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై చంద్రబాబు ప్రజలకు ఎలాంటి క్లారిటీ ఇస్తారో వేచి చూడాల్సిందే..!

వెండితెర పైకి హాట్ హాట్ జోడీ !

Rashmi Goutam, Sudigali Sudheer

Rashmi Goutam, Sudigali Sudheer టీవీ కార్యక్రమాలను డైలీ ఫాలో అయ్యేవారిని టీవీ ప్రోగ్రామ్స్ లో కనిపించే మోస్ట్ హాట్ జోడీ ఎవరంటే కచ్చితంగా ముందు చెప్పే జోడీ ‘రష్మీ-సుడిగాలి సుధీర్’. పెద్దగా టీవీ చూడని వాళ్ళు అంటుంటారు..వీళ్లిద్దరికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారని.. కానీ వీళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ముందు టిఆర్పి రేటింగ్ ఓ రేంజ్ లో వస్తోందట. ఇక వీళ్లిద్దరి మధ్య ఏదో వ్యవహారం సాగుతోందని ఇప్పటికీ చాలా రకాలుగా పుకార్లు వచ్చాయి. వాటిలో నిజానిజాలు పక్కన పెడితే వీరిద్దర్నీ హీరోహీరోయిన్లుగా పెట్టి ఓ సినిమా తీయబోతున్నారు.

Also Read: నయనతార అంతే.. నచ్చితేనే చేస్తోంది !

గత సంవత్సరమే వీళ్ళతో సినిమా చేయడానికి చాలామంది వచ్చినా కథ నచ్చక ఒప్పుకోలేదట. మరి ఇప్పుడు కథ సెట్ అయినప్పుడు కూడా ఎందుకు మేమిద్దరం సిల్వర్ స్క్రీన్ పై కలిసి నటించికూడదు అని ఇద్దరూ దగ్గర ఉండి మరి, ప్రకాష్ అనే నూతన డైరెక్టర్ తో సినిమాని ఫైనల్ చేశారు. ఇప్పటికే సుడిగాలి సుధీర్ హీరోగా ఒక సినిమా చేశాడు. రష్మి కూడా హీరోయిన్ గా నాలుగైదు బి గ్రేడ్ సినిమాలు చేసింది.

ఇప్పుడు త్వరలోనే వీళ్ళు కలసి ఒక సినిమా కూడా చేయబోతున్నారు. మరి బుల్లితెర పై లాగే వెండితెర పై కూడా ఈ జంట అలరిస్తుందేమో చూడాలి. ఏమైనా ఈ హాట్ జోడీని వెండితెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చాన్నాళ్లుగా జరుగుతున్నా.. ఎట్టకేలకు ఇప్పటికి సెట్ అయింది. కాకపోతే వీళ్ళకు వెండితెర ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.

Also Read: అనసూయ బిజినెస్ మొదలెట్టేసింది !