Home Blog Page 8366

అక్కినేని కాంపౌండ్ లో నలిగిపోతున్న డైరెక్టర్ !


యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దాదాపు రెండు సంవత్సరాలకు పైగా అక్కినేని కాంపౌండ్ లో నలిగిపోతున్నాడు. సహజంగా నాగ్ ను స్క్రిప్ట్ విషయంలో ఒప్పించడం కొంచెం కష్టమే. దీనికి తోడు, నాగ్ ఇతర పనులతో ఎప్పటికప్పుడు బిజీగా ఉంటూ.. కళ్యాణ్ కృష్ణను మాత్రం స్క్రిప్ట్ పనులను తప్ప, మరో పనిని చేయనివ్వట్లేదు. ఎన్ని నెలలు చేసినా అదే పేమెంట్.. దానితో కళ్యాణ్ కృష్ణ కాస్త లోలోపల ఇబ్బంది పడుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కళ్యాణ్ కృష్ణకి ఈ గతి పట్టడానికి కారణం రవితేజతో చేసిన ‘నేల టికెట్’ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడమే.

Also Read: ఆర్థిక కష్టాల్లో స్టార్ హీరో వారసుడు !

ఒకవేళ ఆ సినిమా హిట్ అయి ఉంటే.. కళ్యాణ్ కృష్ణకి గ్యాప్ రాకుండా అక్కినేని హీరోల్లో ఎవరో ఒకరు డేట్స్ ఇచ్చేవాళ్ళు. సరే అయిపోయిందేదో అయిపొయింది. కనీసం కరోనా అనంతరం కూడా ఈ సినిమా మొదలయ్యేలా కనబడటం లేదట. మొత్తానికి రెండేళ్లు నుండి అక్కినేని కాంపౌండ్‌ నుండి బయటకు రాలేక, సినిమాని సెట్స్ పైకి తీసుకు వెళ్లలేక కళ్యాణ్ కృష్ణ పడుతున్న బాధ వర్ణాతీతం. అసలు కళ్యాణ్ ఈ సినిమా నుండి ఎప్పుడు బయటకు వస్తాడో అని సినీ సర్కిల్స్ లోని ఆయన ఫ్రెండ్స్ కూడా ఆశ్చర్యపోతున్నారట. ప్రస్తుతం ‘బిగ్ బాస్’ కోసం నాగ్‌ బిజీగా ఉన్నాడు.

Also Read: అందాలను ఆరబోసిన శ్రద్ధా దాస్

మరి నాగార్జున బంగార్రాజు మీదకు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ సినిమా ఇలా వాయిదా పడుతూనే వస్తోంది. అనుకున్న సమయానికి బంగార్రాజు స్టార్ట్ కాలేక ప్రతిసారి చేతులు ఎత్తేస్తున్నాడు. అయితే అక్టోబర్ మొదటి వారంలో ఈ సినిమాను మొదలుపెట్టి, సింగిల్ షెడ్యూల్ లోనే షూటింగ్ ను పూర్తి చేసి… అన్ని కుదిరితే వచ్చే సంక్రాంతికి బంగార్రాజు సినిమాని రిలీజ్ చేయాలని కళ్యాణ్ కృష్ణ ప్లాన్ చేసుకున్నప్పటికీ.. నాగ్ మాత్రం సైలెంట్ గా బిగ్ బాస్ కి తన డేట్స్ మొత్తం ఇచ్చి.. మళ్ళీ బంగార్రాజును వెనక్కి నెట్టేశాడు. పాపం కళ్యాణ్ కృష్ణ.

ఓవర్ యాక్షన్ డైరెక్టర్ తో బన్నీ యాక్షన్ !


యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి మరో బంపర్ ఆఫర్ తగిలింది. బన్నీ సుకుమార్ సినిమా తరువాత ఐకాన్ అనే సినిమా స్టార్ట్ చేద్దామనుకున్నాడు. కానీ, ఇప్పుడు మనసు మార్చుకునట్లు తెలుస్తోంది. తన తరువాత సినిమాని బోయపాటితో చేస్తే బాగుంటుందని ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుతం సుకుమార్ తో చేస్తోన్న పుష్ప సినిమా ఎంత లేదు అన్నా.. కాస్త బిసి సెంటర్ ప్రేక్షకులకు దూరంగానే ఉంటుంది. పైగా, సుకుమార్ అంటేనే.. అదొక పజిల్ లాగా స్క్రీన్ ప్లే సాగుతుంది. మరి ఆ ప్లే మాస్ జనానికి నచ్చకపోతే.. తనకు ఈ మధ్య పెరిగిన మాస్ ఫాలోయింగ్ పోయే చాన్స్ ఉంది. అందుకే కేవలం మాస్ జనం కోసమని.. తన తరువాత సినిమాని బోయపాటితో ప్లాన్ చేస్తున్నాడు బన్నీ. పైగా వీరిద్దరిది హిట్ కాంబినేషన్ కూడా.

Also Read: ఆర్థిక కష్టాల్లో స్టార్ హీరో వారసుడు !

ఇంతవరకూ బాగానే ఉంటుంది గాని, రామ్ చరణ్ తో చేసిన ‘వినయ విధేయ రామ’ చిత్రం ప్లాప్ తరువాత బోయపాటిలో మార్పు వచ్చింది. బోయపాటికి మరో సినిమా రావడానికి చాల గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది, ఆది బాలయ్య లాంటి హీరోతో. అంతగా ‘వినయ విధేయ రామ’ ప్లాప్ ఎపెక్ట్ బోయపాటి మీద పడింది. నిజానికి ఆ సినిమా ప్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం సినిమాలోని యాక్షనే. వాస్తవానికి పూర్తి దూరంగా ఉండే బోయపాటి యాక్షన్ ఈ మధ్య వర్కౌట్ అవ్వట్లేదు. అందుకే ఈ క్రమంలో బోయపాటి, నందమూరి బాలకృష్ణతో చేస్తోన్న సినిమాలో కూడా యాక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

Also Read: అందాలను ఆరబోసిన శ్రద్ధా దాస్

కాస్త నమ్మే విధంగా రియలిస్టిక్ యాక్షన్ తోనే ఇక నుండి తన సినిమాలు తీయాలని బోయపాటి బలంగా డిసైడ్ అయ్యాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న బోయపాటికి వంద కోట్లు మార్కెట్ ఉన్న బన్నీ లాంటి హీరో చాన్స్ ఇవ్వడం అంటే కచ్చితంగా రిస్కే. మరి బన్నీ ఏం చేస్తాడో చూడాలి. బాలయ్యతో సినిమా హిట్ అయితే బన్నీ బోయపాటికి చాన్స్ ఇస్తాడు, ఒకవేళ ప్లాప్ అయితే, మళ్ళీ చేద్దామని పోస్ట్ పోన్ చేస్తాడు. ఇప్పుడు బాల్ బోయపాటి చేతిలోనే ఉంది. ప్లాప్ వైపు వేస్తాడో.. లేక హిట్ వికెట్ పడగోట్టేస్తాడో చూడాలి. .

తహసీల్దార్ కోటి లంచంలో రేవంత్ రెడ్డికి లింక్?


తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర తహసీల్దార్ నాగరాజు లంచావతరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా 1.10 కోట్ల రూపాయల లంచం తీసుకుంటూ శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు నాగరాజు పట్టుబడడం పెను సంచలనమైంది. ఏకంగా ఓ భూ వ్యవహారంలో కోటి రూపాయలు లంచం డిమాండ్ చేసిన వైనం అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

Also Read: తెలంగాణ లో హై అలెర్ట్ : కరోనా ని మించిన ముప్పు

తహసీల్దార్ నాగరాజుపై జరిగిన దాడిలో కంటికి కనిపించని అవినీతి ఉందా? అంటే ఔననే అంటున్నాయి అధికార వర్గాలు. నాగరాజు అవినీతి పరుడని.. అంతకుముందే ఆయనపై కేసు నమోదైందని సమాచారం.

కాగా తెలంగాణలో పాలక టీఆర్ఎస్ పార్టీ.. ఈ కేసును తమ ప్రత్యర్థి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మెడకు చుట్టేందుకు ప్రయత్నిస్తుందా అంటే ఔననే ప్రచారం తాజాగా సాగుతోంది.

అయితే ఈకేసులో షాకింగ్ నిజం ఏంటంటే.. ఈ అవినీతి లంచం కేసులో రేవంత్ రెడ్డి కోణం కూడా కనిపిస్తోంది. తహసీల్దార్ నాగరాజుతోపాటు అరెస్ట్ చేసిన వారిలో ఒకరు కందాడ అంజిరెడ్డి. ఇతడు కాంగ్రెస్ నాయకుడు కావడం గమనార్హం. రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడని సమాచారం. దీంతో ఈ కేసును రేవంత్ రెడ్డి మెడకు చుట్టేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది.

Also Read: తెలంగాణకు రెండో రాజధాని? ఏదంటే?

రేవంత్ రెడ్డి అనుచరుడు అరెస్ట్ కావడంతో ఈ కేసులో రేవంత్ ప్రమేయంపై ఆరాతీయాలని టీఆర్ఎస్ సర్కార్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. రేవంత్ కు సంబంధించి లింక్ ను వెలికితీసి ఈ కేసులో ఇరికించాలని పట్టుదలగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. పోలీసులు ఇప్పుడు ఇదే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. దొరికితే రేవంత్ ను బుక్ చేయడానికి టీఆర్ఎస్ సర్కార్ అన్ని అవకాశాలను పరిశీలిస్తోందట..

అందాలను ఆరబోసిన శ్రద్ధా దాస్


ముంబై నుంచి తెలుగు వెండితెరకు వచ్చి దశాబ్దం గడిచినా సక్సెస్ కోసం, అవకాశాల కోసం ఎదురుచూస్తోన్న నటి శ్రద్ధా దాస్. ఆర్య 2 సినిమాలో మిస్టర్ పర్‌ఫెక్ట్ అంటూ పాటలో బన్నీని తన అందాలతో బాగా ఉడికించిది ఈ ముద్దుగుమ్మ, ఈ భామ ప్రభాస్ డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడవేగ’ వంటి సినిమాల్లో కూడా మెరిసింది. హిందీలోనూ కొన్ని సినిమాలు చేసింది. అయితే అందంలో ఏ హీరోయిన్‌కు తీసిపోని శ్రద్ధాకు ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు.. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల గుండె కొట్టుకునే వేగాన్ని రెట్టింపు చేస్తోంది.

ఫొటోస్ కోసం క్లిక్ చేయండి

అడవిలో కేక్ కట్టింగ్.. కోతి ఏం చేసిందంటే?

సాధారణంగా కోతులు చేసే అల్లరి అంతాఇంతా కాదు. కోతుల అల్లరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఒక కోతి బర్త్ డే బాయ్ కు చుక్కలు చూపించింది. ఒక వ్యక్తి స్నేహితులతో కలిగి సరదాగా పుట్టినరోజు వేడుక జరుపుకుందామని భావించగా అక్కడ ఉన్న కోతి బర్త్ డే బాయ్ ఆశలను అడియాశలు చేసింది. తన కోతిచేష్టలతో చేసిన వింత పని వల్ల అవాక్కవ్వడం బర్త్ డే బాయ్ వంతయింది.

ఒక వ్యక్తి తన స్నేహితులతో కలిసి అడవిలో పుట్టినరోజు వేడుక జరుపుకోవాలని భావించాడు. కేక్ తీసుకొని అడవిలోకి వెళ్లి ఒక మంచి స్థలం వెతుక్కుని కేక్ ను కట్ చేయడం ప్రారంభించాడు. అతని స్నేహితులు హ్యాపీ బర్త్ డే అంటూ పాట పాడుతూ శుభాకాంక్షలు చెబుతూ ఉన్నారు. అయితే అదే సమయంలో ఎక్కడినుంచో వచ్ఛిన కోతి కేక్ తీసుకుని పరుగులు తీస్తూ చెట్టెక్కేసింది. దీంతో అవాక్కవ్వడం బర్త్ డే బాయ్ వంతయింది.

కోతి కేకును ఎత్తుకెళ్లడం చూసి యువకులు తెల్లమొహాలు వేశారు. ఎంతో ఆనందంగా పుట్టినరోజు వేడుక జరుపుకుందామని భావిస్తే ఆ ఆశలపై కోతి నీళ్లు జల్లిందని అభిప్రాయపడ్డారు. బర్త్ డే తతంగాన్ని షూట్ చేస్తున్న వాళ్లకు కేకు దక్కకపోయినా వీడియో మాత్రం మిగిలింది. కోతి కేకును ఎత్తుకెళ్లిపోయిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కోతి తెలివిని ప్రశంసిస్తూ బర్త్ డే బాయ్ పట్ల జాలి చూపించారు.

ఆర్థిక కష్టాల్లో స్టార్ హీరో వారసుడు !


అన్నీ ఉన్నా అదృష్టం లేకపోతే ఏమి లేనివాడిగా మిగిలిపోవాల్సి వస్తోంది. నిజానికి మంచు మనోజ్ కి స్టార్ హీరో కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. కానీ, మాములు హీరోలాగే కూడా మనోజ్ సినిమాలు చెయ్యలేకపోతున్నాడు. కారణాలు ఎన్నో ఉండొచ్చు.. నిర్మాతలు మనోజ్ కి దూరం జరిగారు. పోనీ, ఓన్ ప్రొడ్యూసర్లు అన్నా మనోజ్ తో మంచి సినిమాలు చేస్తారు అనుకుంటే.. వాళ్ళు వాళ్ళ పర్సనల్ సినిమాల గోలలో ఉన్నారు తప్పితే.. మనోజ్ ని నిలబెట్టే ఆలోచనలో ఎవ్వరూ లేరు. అందుకే పాపం మనోజ్ కెరీర్ కి చాలా గ్యాప్ వచ్చింది అంటారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తనే ఓన్ గా ప్రొడక్షన్ హౌస్ పెట్టాడు. కాకపోతే ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌ ను ఎంకరేజ్‌ చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను ‘ఎమ్ఎమ్‌ ఆర్ట్స్‌’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించానని మంచు మనోజ్ చెప్పినా.. ప్రొడక్షన్ హౌస్ మాత్రం తన కోసమే.

Also Read: ‘మజిలీ – సమ్మోహనం’ కలయికలో చైతు !

సరే ఓన్ సంస్థ పెడితే పెట్టావు, పాన్ ఇండియా రేంజ్ సినిమా అవసరమా అని అడుగుతున్నారట అందరూ. తన కొత్త సినిమా ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాని పాన్ ఇండియా మూవీగానే తీసుకువస్తున్నాడు మనోజ్. ఎప్పుడూ కొత్తదనం కోసం వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసే మనోజ్.. కచ్చితంగా ఈ సారి కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తోనే ఈ సినిమాని స్టార్ట్ చేసి ఉండొచ్చు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనోజ్ కి సినిమాకి ఇరవై కోట్లు మార్కెట్ కూడా లేదు. మరి ఎందుకు అప్పు చేసి మరీ పాన్ ఇండియా మూవీ అని మనోజ్ సన్నిహితులు మొహమాటపడకుండానే ఆయన్ని నిలదీస్తున్నారట. ఎందుకంటే వాళ్ళ దగ్గరే మనోజ్ సినిమా పెట్టుబడికి డబ్బు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: సంక్రాంతినే నమ్ముకున్న స్టార్ హీరోలు !

మొత్తానికి మనోజ్ కాస్త ఆర్ధిక కష్టాల్లో ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. పాపం చాల గ్యాప్ ఇచ్చి ఎట్టకేలకు మళ్లీ ‘అహం బ్రహ్మాస్మి’తో మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ కాయబోతున్న మంచు మనోజ్ కి, ఈ ఆర్ధిక కష్టాలకు తోడు కరోనా కూడా పెద్ద అడ్డుగా నిలబడింది. లేకపోతే మనోజ్ సినిమా ఫస్ట్ డే షూట్ రోజే లాక్ డౌన్ ఎనౌన్స్ మెంట్ రావడం ఏమిటి కామెడీ కాకపోతే. ఇక కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఏమైనా మనోజ్ కి ఈ సినిమాతోనైనా మంచి హిట్ వస్తోందేమో చూడాలి.

లెజెండ్రీ ధోని.. రిటైర్ వెనుకున్నది అతడేనా?


భారత క్రికెట్ లో ఎవ్వరికీ సాధ్యం కానీ ఫీటును సాధించిన మహేంద్ర సింగ్ ధోని కరోనా వేళ అర్ధాంతరంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగారు. ధోని మహాభిష్క్రమణ అందరినీ షాక్ కు గురిచేసింది. చివరి మ్యాచ్ ఆడకుండా.. అందరితో పొగిడించుకోకుండా.. సన్మానించకుండా ధోని ఇలా రిటైర్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అందుకే ధోనిని సగర్వంగా సాగనంపాలని తాజాగా జార్ఖండ్ సీఎం సోరేన్ బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. ధోనికి ఫేర్ వెల్ మ్యాచ్ నిర్వహించాలని కోరాడు.

Also Read: ఆగస్టు 15న కరోనా వ్యాక్సిన్ గురించి అద్భుతమైన మాట చెప్పిన మోడీ…!

సమకాలీన క్రికెట్ లో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని మించిన సమర్థవంతమైన కెప్టెన్.. ఫినిషర్ లేరని దిగ్గజాలు సైతం అంగీకరిస్తున్నారు.. మ్యాచ్ లో ధోని ఉన్నాడంటే అతడి వ్యూహాలు.. ఆట భారత్ ను గెలిపిస్తుందని ఎంతో మంది దిగ్గజాలు కూడా మెచ్చుకున్నారు. ప్రపంచంలోనే ధోనినే ఇప్పటిదాకా బెస్ట్ ఫినిషర్ అని దిగ్గజ క్రికెటర్లంతా స్పష్టం చేస్తున్నారు. అయితే కరోనా ప్రబలడం.. ఇప్పట్లో క్రికెట్ మొదలయ్యే సూచనలు లేకపోవడంతో ఎంఎస్ ధోని.. ఇక క్రికెట్ కు వీడ్కోలు పలికాడని అందరూ అనుకున్నారు.. కానీ ధోని రిటైర్ మెంట్ వెనుక ఒక పెద్ద శక్తి ఉందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ధోని ప్రస్తుతం ఐపీఎల్ సన్నాహకాల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ప్రస్తుతం చెన్నైలో క్యాంప్ లో ఉన్నారు. సడన్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో మెమొరీస్ వీడియోను పోస్ట్ చేసి తాను ఈ సాయంత్రం 7.29 గంటల నుంచి రిటైర్ అవుతున్నట్లు అందరూ గమనించాలని కోరారు. ‘కెరీర్ లో సాంతం నన్ను ప్రేమించి.. మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు.. 19.29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి’ అని వీడియోను ఎంఎస్ ధోని పోస్టు చేశాడు.

గత ఏడాది ప్రపంచకప్ లో న్యూజిలాండ్ లో సెమీఫైనల్ లో చివరి మ్యాచ్ ఆడిన ధోని ఆ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యి అంతర్జాతీయ క్రికెట్ కి దూరంగా ఉన్నాడు.ఇక నుంచి ఐపీఎల్ లో మాత్రమే ధోని కొనసాగుతాడు. 2007 టీ20 ప్రపంచకప్ తోపాటుగా 2011 వన్డే ప్రపంచకప్, అలాగే చాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచి చరిత్ర సృష్టించాడు. టెస్టులలో ఇండియాను నంబర్ 1గా నిలిపాడు. భారత క్రికెట్ లోనే తిరుగులేని విజయాలను అందించిన గొప్ప కెప్టెన్ గా ధోని రికార్డుల్లో నిలిచారు.

Also Read: కరోనాను జయించినా.. వివక్ష కొనసాగుతుందా?

అయితే ధోని రిటైర్ మెంట్ వెనుకున్నది ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎందుకంటే గంగూలీ సహా ద్రావిడ్, లక్ష్మణ్ లను ఇదే ధోని కెప్టెన్ అయ్యాక సాగనంపాడు. వారిని తీసేసి యువతకు అవకాశం ఇచ్చి వారిని రిటైర్ అయ్యేలా చేశాడు. ధోని హయాంలోనే గంగూలీ కూడా తొలగించబడ్డాడు. 2007 ప్రపంచకప్ లో టీమిండియా దారుణ ఓటమి తర్వాత ధోని కెప్టెన్ కావడం.. గంగూలీ అవమానకరమైన రీతిలో జట్టులో చోటు కోల్పోయాడు. అందుకే ఇప్పుడు బీసీసీఐ చీఫ్ అయిన గంగూలీ ధోనిపై పగబట్టారని అంటున్నారు.

ధోనిని మళ్లీ జట్టులోకి రాకుండా గంగూలీ అడ్డుకుంటున్నాడని.. అతడికి ద్వారాలు క్లోజ్ చేశాడని అంటున్నారు. జట్టులో చోటు ఇవ్వవద్దని గంగూలీ పంతం పట్టాడని.. వరుసగా విఫలమైన ధోనిని పక్కనపెట్టాలని యోచిస్తున్నట్టు మీడియాలో కథనాలు వచ్చాయి.

అందుకే గంగూలీ తీసివేయకముందే తనే గౌరవంగా తప్పుకోవాలని ఇలా ధోని సడన్ గా రిటైర్ మెంట్ ప్రకటించాడని తెలుస్తోంది.

-నరేశ్ ఎన్నం

Kavya Thapar Naughty Pictures

సంక్రాంతినే నమ్ముకున్న స్టార్ హీరోలు !


ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒక్కరోజు రిలీజ్ అయితేనే సగం కలెక్షన్స్ పోతాయి. అలాంటిది ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ ఒకేసారి రిలీజ్ అయితే.. సినిమా ఎంత బాగున్నా.. ఇక బాక్సాపీస్ వద్ద బకెట్ తన్నేయాల్సిందే. అందుకే సినిమా హిట్ ప్లాప్ అనేది సినిమా రిలీజ్ అయ్యే డేట్ ను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కానీ కరోనా మహమ్మారి దెబ్బకు సినిమాల రిలీజ్ ల పరిస్థితి గందరగోళంలో పడింది. ఎప్పుడో సమ్మర్ లో రావాల్సిన సినిమాలే మొత్తం పోస్ట్ ఫోన్ అయ్యాయి. సరే.. సమ్మర్ సీజన్ పోతే మరో సీజన్ అనుకున్నారు.

Also Read: ‘మజిలీ – సమ్మోహనం’ కలయికలో చైతు !

సమ్మర్ తరువాత ముఖ్యమైన సీజన్ దసరానే. విజయదశమి సెలవుల్ని టార్గెట్ చేసుకుని స్టార్ హీరోల సినిమాలు ప్రతి సంవత్సరం పోటీకి సిద్దమవుతూ ఉంటాయి. కానీ కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదు. సమ్మర్ లాగే దసరా కూడా సినిమాలకు దూరమయ్యేలా ఉంది. పోనీ కనీసం చిన్న సినిమాలను కూడా రిలీజ్ చేసుకునే సిట్యుయేషన్ థియేటర్లలో ఉండదు. డిజిటల్ రిలీజ్ లకు నిర్మాతలు నో చెబుతున్నారు. దాంతో దసరా సీజన్ కూడా కరోనా కోరల్లో చిక్కుకుపోయింది. కచ్చితంగా అక్టోబర్ నాటికి కరోనా ప్రభావం పూర్తిగా తగ్గేలా కనిపించడం లేదనేది కరోనా కేసులు చెబుతున్న వాస్తవం.

Also Read: స్వర్ణ ప్యాలెస్‌ ప్రమాదంపై హీరో రామ్‌ సంచలన వ్యాఖ్యలు!

దాంతో ఇప్పుడు అందరి చూపు సంక్రాంతి మీదే పడింది. అసలు సినిమాకి సంక్రాంతి సీజన్ గుండె లాంటిది. అప్పటిలోగా కరోనా తగ్గుతుందనే ఆశతో ఉన్నారు మేకర్స్. ఏది ఆయితే ఏం సంక్రాంతికి పోటీ రెట్టింపు అయ్యేలా ఉంది. సంక్రాంతికి భారీ చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. చిరు ‘ఆచార్య’, రజనీ ‘అన్నాత్తే’, యాష్ ‘కె.జి.ఎఫ్ 2’ ప్రభాస్ రాధే శ్యామ్ అలాగే కంగనా ‘తలైవి’, నితిన్ ‘రంగ్ దే’ వరుణ్ తేజ్ ‘బాక్సర్’, సూర్య మూవీ, విజయ్ మాస్టర్ మూవీ ఇంకా అప్పటికీ కొన్ని పెద్ద సినిమాలు కూడా రేసులోకి రావడం పక్కా. ఇవ్వన్నీ సంక్రాంతి సీజన్ ను మాత్రమే నమ్ముకుని ఉన్నాయి. ఒక హీరో మరో హీరో కోసం తన సినిమాని ఆపుకోవడానికి ఇది రెగ్యులర్ డేస్ కాదు కదా. ఖచ్చితంగా పోటీలో విడుదల చేస్తారు. అప్పుడు కలెక్షన్స్ సగానికి పడిపోతాయేమో.

ఆ ఔషధంతో ‘కరోనా వైరస్’కు చెక్!

గడిచిన 8 నెలలుగా భారత్ తో పాటు ఇతర దేశాల ప్రజలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. రష్యా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ఆ వ్యాక్సిన్ పనితీరుపై అనేక సందేహాలు నెలకొన్నాయి. పూర్తిస్థాయిలో సత్ఫలితాలు ఇచ్చే వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి చాలా సమయం పట్టేలా ఉండటంతో శాస్త్రవేత్తలు ఇప్పటికే అందుబాటులో ఉన్న ఔషధాలపై పరిశోధనలు చేస్తున్నారు.

Also Read: బిత్తిరి సత్తికి కరోనా.. ఆందోళన లో ఫ్యాన్స్

ఈ పరిశోధనల్లో వినికిడి సమస్యలు, మానసిక ఒత్తిళ్ల సమస్యలను దూరం చేసే ఏబ్సెలిన్ అనే ఔషధం అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఔషధం కరోనా నియంత్రణకు ఉపయోగపడుతుందని ప్రాథమిక అంచనాకు వచ్చామని ఔషధంపై మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనా వైరస్ అభివృద్ధిలో ప్రోటీస్, ఎం ప్రో లాంటి ఎంజైమ్ లు కీలక పాత్ర పోషిస్తున్నాయని… ఈ ఎంజైమ్ లపై ఏబ్సెలిన్ మెడిసిన్ ప్రతికూల ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Also Read: ఆ ‘పోలీస్ స్టేషన్’లో పాములే ఖైదీలు..!

కంప్యూటర్ సిమ్యులేషన్ టెక్నాలజీ సహాయంతో ఈ వ్యాక్సిన్ పనితీరు గురించి కనుగొన్నామని పేర్కొన్నారు. సైన్స్ అడ్వన్సెడ్ జనరల్ లో ఈ ఔషధం గురించి వివరాలను ప్రచురించారు. ఏబ్సెలిన్ ఔషధం ప్రొటీస్‌, ఎం-ప్రో ఎంజైమ్ లలో క్యాటలిటిక్ ప్రాంతాన్ని విస్తరించకుండా చేస్తోందని మరో అణువులో ఎంజైమ్ లు వృద్ధి చెందకుండా నిరోధిస్తోందని చెప్పారు. శాస్త్రవేత్త జువాన్‌ ది పాబ్లో ఈ విషయాలను వెల్లడించారు.

కోడి కూసిందని.. రూ.15 వేలు ఫైన్ వేశారు.. ఎక్కడంటే?

పస్తుతం ఉదయం అలారంతో రోజువారి జీవితం మొదలవుతున్నా దాదాపు రెండు దశాబ్దాల క్రితం కోడి కూతే అలారంలా మనల్ని నిద్ర లేపేది. ఉదయం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు కోడి కూస్తూ నిద్రపోయిన వాళ్లను సైతం మేల్కొనేలా చేసేది. అయితే కాలం మారుతున్న నేపథ్యంలో కోళ్లను పెంచే వారి సంఖ్య భారీగా తగ్గింది. అయితే ఒక కోడి పుంజు కూసిన కూత వల్ల యజమానికి 15 వేల రూపాయల జరిమానా విధించడంతో కోడి వార్తల్లో నిలిచింది. ఇటలీలోని విదార్దో పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Also Read: పాపం.. ఈ కాకి ఏం తప్పు చేసింది? తెల్లగా పుట్టడమే దీని తప్ప?

ఎంగేలో బొలెట్టీ అనే 80 సంవత్సరాల వృద్ధుడు కార్గినో అనే కోడిపుంజును ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాడు. ప్రతిరోజూ 4.30 గంటల సమయంలో ఆ కోడి కూస్తుంది. అయితే ఇరుగుపొరుగు వారికి మాత్రం ఆ కోడి కూత తలనొప్పిగా మారింది. దీంతో వాళ్లు బొలెట్టీని పలుమార్లు హెచ్చరించారు. బొలెట్టీ కోడిని ఇంట్లో బంధించలేని పరిస్థితి. ఇరుగుపొరుగు వాళ్లు చివరకు కోడిపుంజుపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Also Read: రూ.1 ‘ఫీజు’కే కాలేజీలో అడ్మిష‌న్.. ఎక్కడంటే?

పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ కోడిపుంజుపై నిఘా పెట్టగా తెల్లవారుజాము నుంచి కోడి బిగ్గరగా అరుస్తూనే ఉంది. దీంతో పోలీసులు ఇండియన్ కరెన్సీ ప్రకారం 15 వేల రూపాయలు జరిమానా విధించారు. కోడిపుంజు కూత పొరుగింటి వారికి ఇబ్బంది కలిగిస్తూ ఉండటం వల్లే జరిమానా విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మేయర్ పెర్ఫెట్టి గత నెలలోనే హెచ్చరించినా కోడిపుంజు విషయంలో తీరు మార్చకపోవడంతో జరిమానా విధించామని తెలిపారు.

Rakul Preet Singh New Pics

వామ్మో.. కరోనా ఒకటి కాదు.. 73 రకాలు!

దేశంలో చాప కింద నీరులా కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. చైనాలోని వుహాన్ నుంచి వ్యాప్తి చెందిన ఈ వైరస్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అత్యధిక జనాభా కలిగిన దేశం కావడంతో మన దేశంలో ఈ మహమ్మారిని నియంత్రించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి.

Also Read: పాపం.. ఈ కాకి ఏం తప్పు చేసింది? తెల్లగా పుట్టడమే దీని తప్ప?

కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వైరస్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు చేపట్టాయి. వైరస్ గురించి శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తుండగా ఈ పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఒడిశా శాస్త్రవేత్తలు కరోనా వైరస్ రూపాంతరాలపై పరిశోధనలు చేసి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మన దేశంలో కరోనా 73 రకాలుగా రూపాంతరం చెందినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

Also Read: కోడి కూసిందని.. రూ.15 వేలు ఫైన్ వేశారు.. ఎక్కడంటే?

ఢిల్లీలోని సిఎస్ఐఆర్-ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ, భువనేశ్వర్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ,ఎస్ యూఎం హాస్పిటల్ కు చెందిన పరిశోధనా బృందం పరిశోధనలు చేసి వైరస్ కు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించింది. 752 క్లినికల్ శాంపిల్స్ తో పాటు 1,536 నమూనాలను పరిశీలించి పరిశోధనల బృందం ఈ విషయాలను వెల్లడించటం గమనార్హం. కరోనా వైరస్ లో బి .1.112 , బి 1 అనే రెండు వంశాలు ఉన్నాయని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్ జయశంకర్ దాస్ తెలిపారు.

Nidhhi Agerwal Beautiful Pics

Shraddha Das Stunning Pics

Kiara Advani Latest Pics

బ్రేకింగ్ : అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఎంఎస్ ధోనీ!

భారత క్రికెట్ చరిత్రను తిరగరాసిన జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ…. అంతర్జాతీయ క్రికెట్ నుండి సెలవు తీసుకున్నాడు. ప్రపంచంలోనే బెస్ట్ కెప్టెన్ లలో ఒకడైన ధోని భారత్ కు టీ-20 ప్రపంచ కప్ ను, వన్డే ప్రపంచ కప్ ను రెండింటినీ అందించిన ఏకైక సారథిగా ఘనత సాధించాడు.

Also Read: ఆగస్టు 15న కరోనా వ్యాక్సిన్ గురించి అద్భుతమైన మాట చెప్పిన మోడీ…!

ప్రపంచంలో ఏ క్రికెట్ జట్టు కెప్టెన్ కూడా రెండు ప్రపంచ కప్ లతో కలిపి చాంపియన్స్ ట్రోఫీని… అనగా 3 icc ట్రోఫీలను గెలిచింది లేదు. ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్ ధోనీ. అలాగే ధోనీ నేతృత్వంలోని భారత జట్టు మొట్టమొదటిసారి టెస్ట్ క్రికెట్లో నెంబర్ వన్ స్థానాన్ని కూడా అందుకుంది.

Also Read: ఉదారవాదులా? అవకాశావాదులా?

2019 ప్రపంచ కప్ తర్వాత ఇప్పటివరకు మైదానంలోకి దిగని ధోని ఒక్కసారిగా…. తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో తన వ్యక్తిత్వానికి తగ్గట్టు కూల్ గా తన రిటైర్మెంట్ ను ఒక వీడియో ద్వారా ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటనతో భారత దేశంలోని ధోని అభిమానులతోపాటు యావత్తు క్రికెట్ అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ధోని రిటైర్మెంట్ ఊహించినదే అయినా ఐపీఎల్ మొదలయ్యే సమయంలో ధోనీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే ఈ సంవత్సరం ఐపీఎల్ కు మాత్రం ధోనీ అందుబాటులో ఉంటాడని అధికారవర్గాల సమాచారం.