Home Blog Page 8365

ధోని అభిమానులకు షాక్.. ఇక అదే చివరి మ్యాచ్..!

dhoni-run-out-last-match
dhoni-run-out-last-match

మిస్టర్ కూల్ మహేంద్ర ధోని తాజాగా తన రిటైర్మెంట్ ను ప్రకటించిన సంగతి తెల్సిందే. 2019 వరల్డ్ కప్ తర్వాత నుంచి ధోని రిటైర్మెంట్ పై జోరుగా ప్రచారం జరిగింది. అయితే ధోని ఈ వార్తలపై పెద్దగా స్పందించలేదు. దీంతో ధోని క్రికెట్లో కొనసాగుతారని అందరూ భావించారు. అయితే సడన్ గా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ రోజు సాయంత్రం నుంచి తాను అంతర్జాతీయ క్రికెట్ల్ నుంచి విడ్కోలు తీసుకున్నట్లు భావించండి అంటూ తన ఇన్ స్ట్రాగ్రామ్లో పోస్టు చేశాడు. కొద్ది నిమిషాల్లో ధోని రిటైర్మెంట్ వార్త సంచలనంగా మారింది.

కరోనా కారణంగా టీ-20 వరల్డ్ కప్ వాయిదా పడటంతో ధోని తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడనే వార్తలు విన్పిస్తున్నాయి. అయితే ధోని ఫేల్ వేర్ మ్యాచ్ ఆడకుండా రిటైర్మెంట్ ప్రకటించడంపై క్రికెట్ అభిమానులు కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే జార్జండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ధోని రిటైర్మెంట్ వార్తలపై స్పందించారు. ధోనికి ఒక ఫేర్ వేల్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐకి లేఖ రాశారు. బీసీసీఐ ఒప్పుకుంటే జార్జండ్ లోనే మ్యాచ్ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ట్వీటర్లో పోస్టు చేశారు.

జార్జండ్ ముఖ్యమంత్రి సోరెన్ అభ్యర్థనపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా తాజాగా స్పందించారు. ధోని కోసం ప్రత్యేకంగా ఎలాంటి మ్యాచ్ నిర్వహింబోమని స్పష్టం చేశారు. ధోని సైతం ఫేర్ వేల్ మ్యాచ్ పై ఎలాంటి ప్రతిపాదన తీసుకు రాలేదని వెల్లడించారు. రానున్న ఐపీఎల్, ఇతర బీజీ షెడ్యూల్ కారణంగా ధోని కోసం ప్రత్యేకంగా మ్యాచ్ నిర్వహించడం సాధ్యంకాదని ఆయన తేల్చిచెప్పారు. దీంతో ధోని వరల్డ్ కప్ లో న్యూజిల్యాండ్ తో ఆడిన మ్యాచే చివరిది కానుంది.

ఈ మ్యాచులో ధోని రనౌట్ అయి కన్నీటితో వెనుదిరిగిన విషయం తెల్సిందే. ఈ మ్యాచులో భారత్ ఓడిపోవడంతో ప్రపంచ కప్ నుంచి భారత్ ఇంటి ముఖం పట్టింది. ఈ ఓటమికి ధోనినే కారణమంటూ పెద్దఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. నాటి నుంచే ధోని రిటైర్మెంట్ పై పెద్దఎత్తున ప్రచారం జరిగింది. కానీ ధోని వీటిపై స్పందించలేదు. భారత కెప్టెన్ గా.. వికట్ కీపర్ గా.. బ్యాట్స్ మెన్ గా ఇండియన్ టీముకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ధోని చివరి మ్యాచ్ ఓటమితో ముగియడం గమనార్హం.

బీజేపీ కన్నా రాజకీయ జీవితాన్ని ముగించిందా?

Kanna-Lakshmi-Narayana-was-replaced

Kanna-Lakshmi-Narayana-was-replaced
కన్నా లక్ష్మీనారాయణ.. ఈ ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు ఇప్పుడు నిండా మునిగిపోయారా? రెంటికి చెడ్డ రేవడిలా అయిపోయారా? కన్నా ఇప్పుడు నిరాశతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్లు తెలిసింది. బీజేపీ ఏపీకి సోము వీర్రాజును రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినప్పటి నుంచి కన్నా తీవ్ర నిరాశలో ఉన్నట్లు చెబుతున్నారు. బీజేపీ అధిష్టానం తనను మోసం చేసిందని కన్నా భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.

నిజానికి బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ చేయాలని మొదట భావించలేదు.  అసెంబ్లీ ఎన్నికల ముందర ఆయన వైసీపీలో చేరడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. వైసీపీ అధిష్టానం కన్నాకు ‘పెదకూరపాడు’ ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేసింది. అంతేకాదు.. ఆయన నలుగురు ముఖ్య అనుచరులకు కూడా ముఖ్యమైన నామినేటెడ్ పోస్టులను ఇస్తామని హామీ ఇచ్చింది.

కానీ చివరి నిమిషంలో కన్నా లక్ష్మీనారాయణకు అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నుంచి పిలుపు వచ్చింది. దీంతో వైసీపీలో చేరాలనుకున్న కన్నా తన ప్రణాళికలను మార్చుకొని తిరిగి బీజేపీలో చేరి ఏపీకి అధ్యక్షుడిగా అయ్యాడు.

కన్నా గడిచిన కొన్నేళ్లుగా పార్టీని నిర్మించడానికి చాలానే కష్టపడ్డాడు. నిరంతరం ప్రజల్లోకి వెళ్లి పర్యటించాడు. ఓట్లను సమీకరించడానికి ప్రయత్నించాడు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పేలవ ప్రదర్శన చేసింది. కన్నా టీడీపీ తరుఫున రాజకీయాలు చేస్తున్నాడనే వైసీపీ ప్రచారం బాగా ప్రజల్లోకి వెళ్లడం బీజేపికి మైనస్ గా మారింది. ఇప్పుడు అదే ఆయన పోస్టును ఊస్ట్ చేసేలా చేసింది.

తాజాగా కన్నా లక్ష్మీనారాయణ తనను కలవడానికి వచ్చిన తన మద్దతుదారులతో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట.. బీజేపీ తనకు మరోసారి ఏపీ అధ్యక్ష పదవి ఇస్తుందని భావించానని.. కానీ మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట.. ‘తాను వైసీపీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు మంత్రిగా ఉండేవాడిని.. నా బలమైన నలుగురైదుగురు నామినేటెడ్ పోస్టులు పొందేవారు. కానీ ఇప్పుడు నమ్మిన బీజేపీ తన రాజకీయ జీవితాన్ని ముగించింది’ అంటూ కన్నా సన్నిహితుల వద్ద వాపోతున్నారట..

తెలంగాణకు కేంద్రం భారీ నిధులు.. అయినా టెస్టులు తక్కువే?

corona-tests-telangana

corona-tests-telangana
కరోనా కట్టడితో తెలంగాణ ప్రభుత్వం తొలినాళ్లలో చూపిన తెగువ ఇప్పుడు చూపడంలేదని విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. రాష్ట్రంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చిన సమయంలో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు భరోసా కల్పించారు. దీంతో ప్రజలు కూడా కేసీఆర్ ను నమ్మారు. అయితే కరోనా కట్టడి ప్రభుత్వం ఏమరపాటుగా ఉండటంతో మహ్మమరి రాష్ట్రంలో పంజా విసురుతోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన పాజిటివ్ కేసులు నేడు పల్లెల్లోనూ భారీగా నమోదవుతుండటంతో కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైనట్లు కన్పిస్తోంది.

కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వం మేనమేషాలు లెక్కించదనే వాదనలు విన్పించాయి. పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న టెస్టులు ఎక్కువగా చేయకపోవడంపై  సర్వత్రా విమర్శలు వచ్చాయి. హైకోర్టు పలుమార్లు ప్రభుత్వం తీరును తప్పుబట్టింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఇటీవల కాలంలో టెస్టుల సంఖ్య పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే టెస్టులు చేయాల్సిన సమయంలో చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పరిస్థితులు చేయిదాటిపోయినట్లు కన్పిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో కేసులు సంఖ్య పెరుగుతున్నప్పటికీ రికవరీ రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలో మరణాల రేటు తక్కువగా ఉండటం కొంచెం ఊరటనిస్తుంది.

అయితే కేంద్రం నుంచి తెలంగాణకు భారీగా నిధులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం టెస్టులను ఎక్కువగా ఎందుకు చేయడం లేదని ప్రశ్నలు తలెత్తుతోన్నాయి. కరోనా సాయం విషయంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. తెలంగాణకు కేంద్రం అన్నివిధలా సాయం చేస్తుందని బీజేపీ నేతలు చెబుతుండగా టీఆర్ఎస్ నేతలు మాత్రం కేంద్రం పెద్దగా సాయం చేయడం లేదని విమర్శిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే తాజాగా కేంద్రం తెలంగాణకు అందించిన సాయం సమాచార హక్కు చట్టం కింద వెల్లడైంది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రూ.215.22కోట్ల నిధులను కరోనా అవసరాలకు కేంద్రం తెలంగాణకు ఇచ్చినట్లు పేర్కొంది.

జూలై చివరి నాటికే కేంద్రం తెలంగాణకు 1400వెంటిలేటర్లు, 10.09లక్షల ఎన్-95మాస్కులు, 2.41లక్షల పీపీఈ కిట్లు, 42.50 లక్షల హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను సరఫరా చేసినట్లు పేర్కొంది. వీటితోపాటు రూ.215.22 కోట్ల నగదు సాయాన్ని జాతీయ హెల్త్ మిషన్ పథకం కింద విడుదల చేసినట్లు పేర్కొంది. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్నాటక, గుజరాత్, హర్యానాలు రాష్ట్రాలకు కేంద్రం తక్కువ సాయం చేసింది. అయితే ఆరాష్ట్రాలు మాత్రం కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ కంటే మెరుగ్గా ఉన్నాయి. ఇక ఏపీ కరోనా టెస్టుల్లో దేశంలో నెంబర్ వన్ గా కొనసాగుతోంది.

తెలంగాణ కంటే కేవలం ఐదు రాష్ట్రాలే ఎక్కువ నిధులు పొందాయి. కేంద్రం తెలంగాణకు భారీగా కరోనా నిధులు ఇచ్చినా టెస్టులు చేయడంలో ప్రభుత్వం విఫలం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇటీవల కరోనా అవసరాల కోసం రూ.100 కోట్లు గతంలో విడుదల చేయగా ఇటీవల క్యాబినెట్ మీటింగులో మరో రూ.100కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణకు కేంద్రం నుంచి భారీగా సాయం చేస్తుండగా టీఆర్ఎస్ నేతలు మాత్రం కేంద్రం పెద్దగా సాయం చేయడం లేదంటున్నారు. కరోనాకు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయిస్తున్నట్లు చెబుతుండటం గమనార్హం. తాజాగా కేంద్రం రాష్ట్రానికి అందించిన నిధులు సమాచార హక్కు చట్టం కింద స్పష్టమవడంతో దీనిపై టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..!

ఓవైపు కరోనా.. మరోవైపు వానలు.. దేనికి సంకేతం?

rain_corona-lockdown
rain_corona-lockdown
కరోనా విజృంభిస్తున్న వేళ దేశంలో ఎడతెరపి లేకుండా వానలు కురిస్తున్నాయి. గడిచిన నాలుగైదు రోజులుగా కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా వర్షాలు పడుతున్నాయి. ఆగస్టులో కరోనా విజృంభిస్తుందని డబ్ల్యూహెచ్ఓ అప్రమత్తం హెచ్చరిస్తుందని ప్రకటించినా.. ప్రతీఒక్కరు లైట్ తీసుకున్నారు. ప్రభుత్వాలు లాక్డౌన్ ఎత్తివేయడంతో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దని ప్రభుత్వాలు చెబుతున్నా ఎవరూ పట్టించుకున్న దాఖలు కన్పించడం లేదు. దీంతో ప్రకృతే రంగంలోకి దిగినట్లు కన్పిస్తోంది.

గడిచిన కొన్ని దశాబ్దలుగా చూసుకుంటే వర్షాలు రోజుల తరబడి కురిసిన సంఘటనలు చాలా అరుదుగా కన్పిస్తాయి. మన తాతలు చెబుతుంటే వాళ్లు.. వాళ్ల చిన్నతననంలో వర్షాలు కొడితే ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఎడతెరపి లేకుండా కొట్టేవని. వరుసగా 15రోజులు వర్షాలు పడేవని.. మన కాలంలో మాత్రం వర్షాలు గంటో.. రెండుగంటలు కొట్టి వెళ్లిపోవడం చూస్తున్నాం.. ఓవైపు ఎండకొడుతూనే.. మరోవైపు వర్షాలు పడటం చూసిన రోజులు అనేకం ఉన్నాయి. కానీ గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వానలు కురుస్తుండటంతో ప్రకృతి మనల్ని హెచ్చరిస్తుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఆగస్టులో కరోనా విజృంభిస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు, డబ్ల్యూహెచ్ఓ లాంటి సంస్థలు చెబుతున్నా ఎవరూ పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతున్నాయి. దీంతో పాజిటివ్ కేసులు సంఖ్య రోజుకు వేలల్లో నమోదవుతున్నాయి. గత నాలుగు నెలలుగా ప్రభుత్వాలు చెబుతున్నా పట్టించుకోని ప్రజలు ప్రస్తుతం ఇంటికి పరిమితం కావాల్సి వస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అత్యవసర పనులు సరే బయటికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి.

తెలంగాణలో కేసీఆర్ పుణ్యమా అని చెరువులు నిండిపోయి జలకళను సంతరించుకున్నాయి. అయితే ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో చెరువులు పొంగిపోయి జనాసావాల్లోకి చేరుతున్నాయి. వరద ప్రవహం ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగి తగు చర్యలు చేపడుతోంది. అయితే వరదలు ఎక్కువ అవుతుండటంతో సహాయ చర్యలకు ఆటంకాలు కలుగుతున్నాయి. రష్యా వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చిన ఇప్పట్లో అందరికీ అందుబాటులో వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇక కరోనా నగరాల నుంచి పల్లెలకు పాకింది. దీంతో కరోనా కట్టడి మరింత కష్టంగా మారింది.

ప్రభుత్వాలు లాక్డౌన్ ఎత్తేయడంతో ప్రజలు బయట తిరుగుతున్నాయి. అయితే గడిచిన నాలుగైదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలు ప్రజలను ఇళ్లకే పరిమితం చేశాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రకృతే ఇలా వానల రూపంలో వచ్చిందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. కరోనా విజృంభణ.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలు చూస్తుంటే ఇదంతా ప్రకృతి ఆడే నాటకంలా కన్పిస్తుంది. కరోనా నుంచి కాపాడేందుకే ప్రకృతి లాక్డౌన్ విధించిందా? లేదా అన్నది పక్కకు పెడితే.. ప్రకృతి లాక్డౌన్ వల్ల ప్రజలంతా ఇళ్లకే పరిమితమైనట్లు తెలుస్తోంది. ఓవైపు కరోనా.. మరోవైపు ఎడతెరపి లేని వానలతో ప్రజలు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారు.

బీజేపీ చేతిలో పావుగా ఫేస్ బుక్, వాట్సాప్?

BJP using facebook and whatsapp
BJP using facebook and whatsapp
భారతదేశంలో 
ఇన్నాళ్లు సంప్రదాయ ప్రచారం సాగేది. అంటే బహిరంగ సభలు.. రోడ్ షోల ద్వారా నేతలు ప్రచారం చేసేవారు. కానీ ఇప్పుడు దేశంలో అందరి చేతిలోకి స్మార్ల్ ఫోన్లు వచ్చేశాయి. డిజిటల్ విప్లవం వచ్చింది. 2014  ఎన్నికల్లో బీజేపీ సారథ్య బాధ్యతలు మోడీ తీసుకున్నాక దేశంలో ఈ ఆన్ లైన్, సామాజిక వేదికల ద్వారా ప్రచారాన్ని ప్రారంభించారు. హోరెత్తించారు. ఇప్పుడు ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ లనే ఆయుధంగా ఎంచుకున్నారు.

ముఖ్యంగా దేశ ప్రధాని మోడీ నుంచి బీజేపీ కేంద్రమంత్రులు, చివరకు ఎమ్మెల్యేలకు కూడా సోషల్ మీడియా పెను సాధనమైంది. ఇప్పుడు దానితోనే వారంతా ప్రత్యర్థులపై యుద్ధం చేస్తున్నారు.

అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్ విద్వేశవ్యాఖ్యలు చేసినా.. ఓటర్లను ప్రభావితం చేసేలా చేసినా ఫేస్ బుక్, ట్విట్టర్ లు వెంటనే చర్యలు తీసుకొని వాటిని డిలీట్ చేస్తున్నాయి. కానీ భారత్ లో అలాంటి సందర్భం ఒక్కటి కూడా చోటుచేసుకోలేదు. కేంద్రంలోని బీజేపీ పెద్దలకు ఫేస్ బుక్, వాట్సాప్ సంస్థలు లొంగిపోయాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కోవలోనే తాజాగా ప్రఖ్యాత అమెరికన్ పత్రిక ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ బాంబు పేల్చింది.

భారతదేశంలో పాలక బీజేపీ నేతలు విచ్చలవిడిగా విద్వేశపూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని.. కానీ ఇదే ఫేస్ బుక్ వాట్సాప్ లు చూసీ చూడనట్లు వదిలేస్తుందని.. చర్యలు తీసుకోవడం లేదంటూ అమెరికాకు చెందిన ప్రఖ్యాత పత్రిక ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’లో సంచలన కథనం ప్రచురితమైంది. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రవ్యాఖ్యలను కూడా ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంలో ప్రస్తావించింది. భారత్ లో తన వ్యాపార లావాదేవీలు దెబ్బతినకుండా ఉండేందుకే ఫేస్ బుక్ ఇలా చేస్తోందని ఆ కథనంలో రాశారు. ఇది పెను సంచలనమై దేశంలోని పలు పత్రికలు, వెబ్ సైట్లు ఇదే విషయంపై బీజేపీపై విమర్శలు చేశాయి.

తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు దేశంలో ఫేస్ బుక్, వాట్సాప్ లను నియంత్రిస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘ఫేస్ బుక్, వాట్సాప్ ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ అదుపులో ఉన్నాయి. ఫేక్ న్యూస్ ను, విద్వేషాలను రెచ్చగొట్టడంలో బీజేపీకి సహకరిస్తున్నాయి. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి’ అని ట్విట్టర్ ద్వారా రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.

ఈ క్రమంలోనే బీజేపీ ‘సోషల్ యుద్ధాన్ని’ ప్రారంభించిందని అర్థమవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉండడంతో బీజేపీకి ఫేస్ బుక్, వాట్సాప్ సంస్థలు భయపడుతున్నాయి. తమ వ్యాపార ప్రయోజనాల కోసం వారి వ్యాఖ్యలను తీసివేయడం లేదు.. చర్యలు తీసుకోవడం లేదు. ఈ క్రమంలోనే రాహుల్ సహా పత్రికలు, వెబ్ సైట్స్ కథనాలు ఆరోపించినట్టు సోషల్ మీడియా ఇప్పుడు బీజేపీకి బానిసగా మారిందా అన్న చర్చ కూడా తెరపైకి వచ్చింది. బీజేపీకి  పావుగా  ఫేస్ బుక్, వాట్సాప్ మారాయా అన్న అనుమానాలు బలపడుతున్నాయి..

ఎంపీ కేశినేని నాని గారు… మీకిది తగునా?


దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ విషయంలో ఇప్పుడు కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఈ ఫ్లై ఓవర్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా 2015 డిసెంబరులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. మూడు నెలల వ్యవధిలో నిర్మాణంపూర్తి చేసి పుష్కరాల సమయానికి ఫ్లై ఓవర్ ను అందుబాటులోకి తీసుకువస్తామని చంద్రబాబు చెప్పారు. రివ్యూ సమావేశం జరిగినప్పుడల్లా గడువు మూడు, ఆరు నెలలు పెంచుకుంటూ పోయారు. చివరికి అది ఐదేళ్లకు గాని పూర్తి కాలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికైనా నిర్మాణం పూర్తవడం సంతోషించదగిన విషయమే.

Also Read: స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం వెనకున్న అసలు కుట్ర బయటపడింది…!

విజయవాడ ఎంపీ కేశినేని నాని ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రారంభోత్సవానికి ఆహ్వానించడం వివాదానికి తావిస్తోంది. ఒక పక్క ప్లై ఓవర్ ప్రారంభానికి పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. ప్రభుత్వం ప్రారంభోత్సవం తేదీ ఖరారు చేయలేదు. ఎంపీ మాత్రం  ముందే వెళ్లి కేంద్ర మంత్రిని ప్రారంభోత్సవానికి హాజరు కావాలని కోరడం హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందకపోతే కేంద్ర మంత్రి నాని ఆహ్వానాన్ని పరిగణలోకి తీసుకుని ప్రారంభోత్సవానికి హాజరవుతారా? అది సాధ్యం కాదని నానికి తెలుసు. ఈ వ్యవహారం వెనుక తనకు ఆహ్వానం అందుతుందో లేదో అనే సందేహాంతోనే ఎంపీ నాని ఇలా చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఫ్లై ఓవర్ నిర్మాణం ఘనత గడ్కరీ, చంద్రబాబు దక్కుతుందని ఎంపీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Also Read: ‘స్వర్ణా’ వ్యవహారంలో రామ్ కు చిక్కులు తప్పవా?

గత ఐదేళ్ల కిందట ఇదే ఆలోచన టిడిపి నాయకులకు ఉండకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014 లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తయిన పనులకు వరుసపెట్టి ప్రారంభోత్సవాలు నిర్వహిస్తూ రోజుకో జిల్లాలో పర్యటించారు. అంతెందుకు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయి వాహనాలు రాకపోకలు సాగిస్తున్నా చంద్రబాబు దానిని ప్రారంభించడం అప్పట్లోనే విమర్శలు వినిపించాయి. నాని చెప్పిన లెక్క ప్రకారం కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఇన్నర్ రింగ్ రోడ్డు ఘనత వారికే దక్కాల్సి ఉండగా… కొత్తగా రంగులేసి తన ఘనతే అని చంద్రబాబు చెప్పుకుంటే ఎంపీ నాని ఆయన పక్కనే ఉండి ఎందుకు మాట్లాడలేకపోయారనే విషయం ఇప్పడు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలను వేదిస్తోంది.

ఈ తెలివి బాబుకి లేకే కదా జగన్… నువ్వు సీఎం అయింది..! ప్రత్యేక హోదా అట మరి..!

జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా వేస్తున్న వ్యూహాత్మకమైన ప్లాన్లకు విపక్షాలు నోళ్ళు వెళ్ళబెడున్నాయి. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధానంగా చేసుకుని ప్రజల ముందుకు వచ్చి మాట్లాడిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఈ విషయాన్ని మర్చిపోవలసిందే అన్నట్లు వ్యవహరించారు. వైసిపి ఎంపీలు కూడా ఇంకెక్కడి హోదా అంటూ నిట్టూర్చారు.

Also Read: ‘స్వర్ణా’ వ్యవహారంలో రామ్ కు చిక్కులు తప్పవా?

ఇదే సమయంలో మూడు రాజధానులు విషయం ఇప్పుడు హైకోర్టులో ఊగిసలాడుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు హైకోర్టులో గవర్నర్ ఆమోద ముద్ర కు వ్యతిరేకంగా దాఖలు చేసిన అఫిడవిట్ లో విభజన చట్టం అనే పదాన్ని హైలెట్ చేయడమే వారి పాపం అయిపోయింది. అంతే జగన్ మెదడు పాదరసంలా పనిచేసింది. ఇన్ని రోజులు ప్రత్యేక హోదా అనే అంశం మరిచిపోయి బిజెపి వారు చెప్పిట్లు నడుచుకున్న జగన్… అసలు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే…. విభజన చట్టం అమలు చేసినట్లు కాదని… దానిని మూడు రాజధానులకు లింక్ పెట్టాలంటే ముందు ప్రత్యేక హోదా కేంద్రం నుంచి రావాలని…. ఒక చట్టం లో రెండూ అంశాలు కచ్చితంగా అమలు కావాలని… ఒకటి అమలయి ఇంకొకటి అమలు కాకపోతే అసలు ఆ చట్టానికి విలువ ఉండదన్నది ఆయన వాదన.

Also Read: ఎంపీ కేశినేని నాని గారు… మీకిది తగునా?

అసలు ఇలాంటి ఆలోచన ఎవరికీ రాదు. ‘ప్రత్యేక హోదా’ అనే అంశం ఒక్కసారిగా పైకి లేవనెత్తడం…. హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో కు కౌంటర్ దీనిని వేయడం…. వెంటనే స్వాతంత్ర వేడుకల్లో ఆ అంశాన్ని ప్రస్తావించడం. ఈ తెలివితేటల్లో జగన్ అవకాశవాద రాజకీయాలు ముందు చంద్రబాబు తేలిపోయాడు అనే చెప్పాలి. ఇన్ని రోజులు గుర్తుకు రాని హోదా మళ్లీ రాజకీయంగా వాడుకునేందుకే జగన్ తెరమీదకు తెచ్చారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమరావతి విషయాన్ని పక్కన పెట్టి మళ్ళీ చంద్రబాబు ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమయ్యాడు అని తాను సాధ్యమైనంత ప్రయత్నిస్తుంటే… ఇలాంటి అడ్డుకట్టలు వేస్తున్నాడు అని ప్రజల్లో చూపించే ప్రయత్నమే తప్పించి వైసీపీకి తరపు నుండి ఎటువంటి ప్రత్యేక హోదా విషయంలో నిజాయితీ ప్రయత్నాలు చేయడం లేదన్నది కళ్లకు కట్టినట్లు కనబడుతోంది.

‘స్వర్ణా’ వ్యవహారంలో రామ్ కు చిక్కులు తప్పవా?


రమేష్ ఆసుపత్రి నిర్వహిస్తున్న ప్రవేటు కోవిడ్ సెంటర్ లో జరిగిన అగ్ని ప్రమాదం విషయంలో సినీ నటుడు రామ్ కు చిక్కులు తప్పవనిపిస్తోంది. స్వర్ణా ప్యాలెస్ ప్రమాదం విషయం ఫైర్ నుంచి ఫీజుల వరకూ వెళ్లిందని, సిఎం జగన్ ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ట్వీట్ చేయడంతోపాటు, రమేష్ ఆసుప్రతికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్ లు సినీ నటుడు రామ్ ట్విట్టర్ లో ఫోస్టు చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. పోలీసులు మాత్రం రామ్ ట్వీట్ లపై సీరియస్ గా ఉన్నారు.

Also Read: స్వర్ణా ప్యాలెస్ అగ్ని ప్రమాదం వెనకున్న అసలు కుట్ర బయటపడింది…!

విచారణకు ఆటంకం కలిగిస్తే సినీనటుడు రామ్ కు నోటీసులు ఇవ్వడం జరుగుతుందని ఈ కేసును పర్యవేక్షిస్తున్న ఏసీపీ సూర్యచంద్రరావు తెలిపారు. కేసుకు సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే పోలీసులకు ఇవ్వచ్చని వాటిని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ విధంగా సోషల్ మీడియాలో వివాదాస్పదమైన అంశాలను ప్రస్తావిస్తూ కేసు విచారణకు ఆటంకం కలిగిస్తే విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేస్తామన్నారు.

స్వర్ణా ప్యాలెస్ లో కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసే విషయంలో ఆసుపత్రి యాజమాన్యం ఎటువంటి పరిశీలన లేకుండా, ముందు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఈ విషయంలో ఆసుపత్రి యాజమాన్యం తప్పిదం పూర్తిగా ఉంది. అంతే కాకుండా కరోనా తీవ్రత లేని వారికి వైద్యం చేసి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేసి క్యాష్ చేసుకోవాలని చూస్తున్న యాజమాన్యాన్ని సినీ నటుడు రామ్ సమర్ధిస్తూ ట్వీట్ చేయడంపై సోషల్ మీడియాలోను విమర్శలు వెల్లువెత్తున్నాయి.

Also Read: పబ్లిసిటీకి ఒక ‘లిమిట్’ ఉంటుంది… ఒక మనస్’సాక్షి’ ఉంటుంది…!

రమేష్ ఆసుపత్రి యజమాని రమేష్, హీరో రామ్ కు బందువు కావడంతోనే ఆసుపత్రి యాజమాన్యాన్ని వెంటేసుకువస్తున్నాడనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా స్వర్ణా ప్యాలెస్ ప్రమాదం విషయంలో హీరో రామ్ ట్వీట్ అటు సినీ ప్రముఖులను, ఇటు అభిమానులను నిరుత్సాహ పరిచిందనే చెప్పాలి. ఇప్పడు పోలీసుల వ్యాఖ్యలతో రామ్ కు చిక్కులు తప్పవనే అనిపిస్తోంది.

కారును బైకులా మార్చి ప్రాణాలు దక్కించుకున్నాడు!

సమస్యలు, ఆపదలు ఎప్పుడు ఏ విధంగా వస్తాయో ఎవరూ ఊహించలేరు. అయితే ఆపదలు, సమస్యలు వచ్చిన సమయంలో ఎవరో వచ్చి తమకు సహాయం చేస్తారని ఆలోచిస్తూ ఉండటం వల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆలోచనలను పదును పెడితే ఎలాంటి సమస్యనైనా సులభంగా పరిష్కరించుకోవడం సాధ్యమే. సమస్యలు ఎదురైన సమయంలో చురుకుగా ఆలోచిస్తే సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు.

Also Read: షాకింగ్: గుండె జబ్బులున్న వారి ప్రాణాలు తీస్తోన్న కరోనా!

ఈ ఘటనలో ఫ్రెంచ్‌కు చెందిన ఎమిలీ లెరే వ్యక్తి ఎడారిలో ఒంటరిగా చిక్కుకున్నాడు. ఉదయం సమయంలో తీవ్ర ఉష్ణోగ్రతలు, రాత్రి సమయంలో భరించలేని చలి వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. కారులో ఎడారికి షికారుకు వెళ్లిన ఆ వ్యక్తి తన స్నేహితులు మొదట చెప్పిన రూట్ లో కాకుండా మరో మార్గంలో వెళ్లాడు. ఆ మార్గం రాళ్ల మార్గం కావడంతో కారు ఆ మార్గంలోని ఒక రాయిని బలంగా ఢీ కొట్టింది.

దీంతో కారు ఎక్సెల్ దెబ్బ తింది. ఎడారిలో నడుచుకుంటూ వెళ్లడం అసాధ్యం అని ఎమిలీకి అర్థమైంది. వెంటనే ఎమిలీ తన బుర్రకు పదును పెట్టాడు. ఎలక్ట్రీషియన్ గా పని చేసే ఎమిలీకి కారు మెకానిజం గురించి అవగాహన ఉంది. వెంటనే కారును బైక్ లా తయారు చేయాలని భావించాడు. చాలా కష్టమైన పని అయినా వేరే అవకాశం లేకపోవడంతో కారు భాగాలను తీయడం ప్రారంభించాడు.

Also Read: చెట్టును నరకడం ఇష్టం లేకా ఆ వ్యక్తి ఏం చేశాడంటే?

తెచ్చుకున్న ఆహారం కొద్దిగా తింటూ నాలుగు రోజులు శ్రమించి కారు భాగాలను ఊడ పీకాడు. అనంతరం బైకుకు అనువుగా ఉండే పార్టులను ఎంపిక చేసుకుని వెల్డింగ్ చేసే సదుపాయం లేకపోవడంతో వైర్లను చుట్టి బైక్ లా తయారు చేశాడు. స్టీరింగ్ రాడ్డును హ్యాండిల్‌గా మలుచుకుని ఇంజిన్ కు ఇంధనం అందేలా చేసి 12 రోజులు శ్రమించి బైక్ ద్వారా ఇంటికి చేరుకున్నాడు.

35 ఏళ్ల స్టార్ హీరోయిన్ కి పెళ్లి చూపులు !


ఇన్నేళ్లు పెళ్లి కాకుండా మిగిలిపోయిన సినీ సెలబ్రిటీల అంతా, ప్రస్తుతం ఈ కరోనా కాలంలో పెళ్లి పీటలెక్కేస్తున్నారు. ఇప్పుడు వీరి లిస్ట్ లో ఓ స్టార్ హీరోయిన్ కూడా చేరేలా కనిపిస్తోంది. కాకపోతే అమ్మడుకు పెళ్లి ఇంకా ఫిక్స్ కాలేదు. ప్రెజెంట్ చూపులు దాకే వచ్చిందట. ఆ చూపులకి వచ్చిన కుర్రాడు.. సారీ అంకుల్ నచ్చితేనే.. ఈ 35 ఏళ్ల స్టార్ హీరోయిన్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. మరి ఈమెకు నచ్చాలి అంటే.. ఆ వచ్చే అంకుల్ బాగా సౌండ్ అన్న అయి ఉండాలి, లేదా పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి అన్నా అయి ఉండాలి. లేకపోతే ఈ స్టార్ హీరోయిన్ కి అతను ఎక్కడు.

Also Read: తమన్నా షోకి సర్వం సిద్ధం !

మరి ఎంతైనా చూడ చ‌క్క‌టి సౌంద‌ర్యం ఈ స్టార్ హీరోయిన్ సొంతం కదా.. ఈమె చందమామ లాంటి క‌లువ క‌ళ్ల అంద‌గ‌త్తె కాజ‌ల్ అగర్వాల్. నిజానికి కాజల్ త్వ‌ర‌లో ఏడ‌డుగులు న‌డ‌వ‌నుంద‌నే వార్తలు గత నాలుగేళ్ళ నుండి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఎంతైనా స్టార్ హీరోయిన్ వ్య‌క్తిగ‌త జీవితం అంటే.. పైగా కాజల్ లాంటి హీరోయిన్ పెళ్లి మ్యాటర్ అంటే.. అభిమానులకు కాస్త ఎక్కువ ఆసక్తి ఉంటుందాయే. అందుకే హీరోయిన్ల ప్రేమ‌, స‌హ‌జీవ‌నం, పెళ్లి, విడాకులు లాంటి యవ్వారాలు ఎంత దాచాలనుకున్నా దాగవు.

Also Read: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వరుణ్ తేజ్ హీరోయిన్

ఇంతకీ ఈ 35 ఏళ్ల ముద్దుగుమ్మకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని.. త్వరలో పెళ్లి చూపుల తంతు కూడా జరగబోతుందని తెలుస్తోంది. మరి ఆ తంతు విజయవంతం అయితే.. ఏకంగా పెళ్లి కూడా లాగించేస్తారట. ఇప్పటికే కాజ‌ల్‌ చెల్లెలైన‌ నిషా అగర్వాల్ కి కూడా పెళ్లి అయిపోయి.. ఎప్పుడో పిల్లాడు కూడా పుట్టాడు. అయినా, కాజల్ మాత్రం సినిమా అవకాశాలు వస్తున్నాయని పెళ్లి కూడా చేసుకోకుండా, డబ్బులు సంపాదించడానికి.. 35 ఏళ్ళు వచ్చాక కూడా గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతుంది. ఒకవేళ ఇప్పుడు పెళ్లి అయిపోయినా… సినిమాలను మాత్రం మానదట. కాజలా మజాకా !

షాకింగ్: గుండె జబ్బులున్న వారి ప్రాణాలు తీస్తోన్న కరోనా!

చైనా దేశం నుంచి భారత్ కు వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి ప్రజలను తీవ్ర భయాందోళనకు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శాస్త్రవేత్తల అధయనంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఇటలీ శాస్త్రవేత్తల అధ్యయనంలో గుండె జబ్బులతో బాధ పడే వారు వైరస్ భారీన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. మ్యాగ్నా గ్రేషియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి కరోనాకు గుండె జబ్బులకు సంబంధం ఉందని తేల్చారు.

Also Read: కారును బైకులా మార్చి ప్రాణాలు దక్కించుకున్నాడు!

ఆసియా, ఐరోపా, అమెరికా దేశాలకు చెందిన 77,317 మంది కరోనా బాధితులకు సంబంధించిన డేటాను విశ్లేషించి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. కరోనా సోకిన వారిలో 12.89 శాతం మందికి ఆస్పత్రిలో చేరకముందే గుండె జబ్బులు ఉన్నట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. గుండె సమస్యలు లేదా గుండె రుగ్మతలతో కరోనా మరణాలకు సంబంధం ఉందని పరిశోధనల్లో తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Also Read: చెట్టును నరకడం ఇష్టం లేకా ఆ వ్యక్తి ఏం చేశాడంటే?

మిగిలిన వారిలో 36.08 శాతం మంది బీపీ సమస్యతో బాధ పడుతున్నారని… 19.45 శాతం మంది డయాబెటిస్ సమస్యతో బాధ పడుతున్నారని… కరోనా రోగుల గుండె కొట్టుకునే వేగంలో సైతం మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. కరోనా బాధితుల్లో చాలామందిలో స్వల్ప అస్వస్థత కనిపిస్తోందని… కొంతమందిలో మాత్రం వైరస్ తీవ్ర న్యూమోనియాగా మారి మరణం సంభవిస్తుందని చెప్పారు.

తమన్నా షోకి సర్వం సిద్ధం !


మిల్క్ బ్యూటీ అని ప్రేమగా పిలుచుకుంటారు త‌మ‌న్నాని. నిజానికి మిల్క్ బ్యూటీ లాంటి బిరుదును పొందే గ్లామర్ ఏమి లేదు తమన్నాకి. కానీ టాలెంట్ ఉంది, అన్నిటికి మించి దర్శక నిర్మాతలను ఆకట్టుకోవడంలో, హీరోలతో మంచి సాన్నిహిత్యం మెయింటైన్ చేయడంలో తమన్నా మాస్టర్స్ చేసింది. పైకా, అమ్మడు మంచి మాటకారి కూడా, ఈ విషయం ఇండస్ట్రీలోని జనానికి బాగా తెలుసు. ఇప్పుడు మాములు జనానికి కూడా తనలోని మాటకారిని… త‌న ముద్దు ముద్దు మాట‌లతో, అలాగే షో స్టార్టింగ్ లో వచ్చే సాంగ్స్ లో తన అంద‌చందాల‌తో తెలుగు ప్రేక్షకులను అల‌రించ‌డానికి ఈ మిల్క్ బ్యూటీ రెడీ అయిపోతుంది.

Also Read: అక్కినేని కాంపౌండ్ లో నలిగిపోతున్న డైరెక్టర్ !

ప్రస్తుతం ఓటీటీల‌కు ఆద‌ర‌ణ పెరుగుతున్న నేపథ్యంలో ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్‌ తన అహా కోసం మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాతో ప్ర‌త్యేకంగా ఓ టాక్ షోను ప్లాన్ చేయబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
కాగా వచ్చే నెల నుండి ఈ టాక్ షో మొదలుకానుంది. వచ్చే వారం నుండే తమన్నా హోస్ట్‌గా ఈ షో షూటింగ్ కూడా మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే హోస్ట్ గా చేయడానికి త‌మ‌న్నా భారీ మొత్తాన్ని అడిగిందని, ఆమె అడిగినంత ఇవ్వడానికి అల్లు అరవింద్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడని స‌మాచారం.

Also Read: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వరుణ్ తేజ్ హీరోయిన్

అన్నట్టు చాలా కాలంగా త‌నలో బ‌లంగా నాటుకున్న కోరిక ఈ హోస్టింగ్ చేయడం అని త‌మ‌న్నా అప్పుడే బిస్కెట్లు వేస్తోందట. సరే ఆమె ఎలా ఫీల్ అయినా, నిర్మాతకు కావాల్సింది షో హిట్ అవ్వడం, మరి త‌న నాజూకుత‌నంతో అభిమానుల‌కు కిక్ ఇచ్చి షోకి తమన్నా క్రేజ్ తీసుకు వస్తోందేమో చూడాలి. ఈ టాక్ షోలో అల్లు అర్జున్, రామ్ చ‌ర‌ణ్‌, రానా దంపతులు, ర‌వితేజ త‌దిత‌ర స్టార్ హీరోల‌తో పాటు హీరోయిన్లు కూడా పాల్గొనబోతున్నారు. మరి తమన్నా త‌న ప్ర‌శ్న‌ల‌తో షోను ఎంతవరకు ర‌క్తి క‌ట్టిస్తుందో చూడాలి. ప్రశ్నలు కాస్త ఘాటుగా ఉంటాయట.

చెట్టును నరకడం ఇష్టం లేకా ఆ వ్యక్తి ఏం చేశాడంటే?

చాలామంది ఇల్లు కట్టుకునే సమయంలో ఇంటి చుట్టూ చెట్లు లేకుండా జాగ్రత్త పడతారు. ఒకవేళ అప్పటికే పెద్దపెద్ద చెట్లు ఉంటే వాటిని నరికేస్తూ ఉంటారు. కానీ మాస్కోకు చెందిన ఒక వ్యక్తి మాత్రం ప్రకృతితో మమేకమై జీవించాలని భావించాడు. చెట్టును అలాగే ఉంచి డోమ్ ను నిర్మించి తనకు నచ్చిన విధంగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నాడు. మాస్కోకు చెందిన అల్మాస్సోన్ అనే వ్యక్తి వృత్తిరిత్యా అర్కిటెక్ట్ గా పని చేసేవాడు.

Also Read: కారును బైకులా మార్చి ప్రాణాలు దక్కించుకున్నాడు!

చెట్లను ఎంతో ప్రేమించే అల్మాస్సోన్ మందంగా ఉండే గ్లాస్ తో నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించాడు. ఎండ, వేడి లోపలికి రాకుండా చేసే ప్రత్యేకమైన గ్లాస్ తో ఇంటి నిర్మాణం చేపట్టాడు. చెక్కల గోడల ద్వారా ప్రతి పనికి ప్రత్యేకమైన గదులను నిర్మించాడు. అల్మాస్సోవ్ కాలుష్యంతో ఉండే నగర వాతావరణం నచ్చదు. కిచె, బెడ్ రూమ్, స్టడీ రూమ్ ఇలా వేరువేరు గదులను ఏర్పాటు చేసుకున్నాడు.

Also Read: షాకింగ్: గుండె జబ్బులున్న వారి ప్రాణాలు తీస్తోన్న కరోనా!

అందువల్ల సిటీకి దూరంగా దట్టమైన అడవిలో ఇంటిని నిర్మించుకున్నాడు. చెట్టును అలాగే ఉంచి అల్మాస్సోవ్ నిర్మించిన ఇంటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రకృతి ప్రేమికులు తమకు కూడా ఇలాంటి ఇల్లు ఉంటే బాగుంటుందని కామెంట్లు చేస్తుండగా మరికొందరు తాము ఫోటోలో లాంటి ఇంటిని నిర్మించుకునే ప్రయత్నం చేస్తామని కామెంట్లు చేస్తున్నారు.

పబ్లిసిటీకి ఒక ‘లిమిట్’ ఉంటుంది… ఒక మనస్’సాక్షి’ ఉంటుంది…!

నేరుగా విషయంలోకి వచ్చేస్తే…. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసుతో ఓ వ్యక్తికి సాయం అందించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ బాధితుడికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 10 లక్షల రూపాయలు అందించారు. అయితే ఇక్కడ ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ వీరాభిమాని కావడంతో వైసిపి అనుకూల మీడియా తన పబ్లిసిటీ స్టంట్స్ ను మొదలు పెట్టింది.

Also Read: స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం వెనకున్న అసలు కుట్ర బయటపడింది…!

ఎక్కడైనా అధికార పార్టీ చేయలేని పనిని.. ప్రతిపక్షం వారు చేస్తే ఇది వారు చేయాల్సిన పనులు అని మీడియా ఎద్దేవా వేస్తుంది. అంతేగాని అధికార పార్టీ అధినేత…. అందులోనూ ఒక సినీస్టార్ అభిమానికి ముఖ్యమంత్రి తన బాధ్యతలు నిర్వర్తిస్తే మాత్రం ‘పవన్ కళ్యాణ్ అభిమాని కి జగన్ సాయం’ అంటూ ఒక కొత్త కథనాన్ని వండి వడ్డించడం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. అంటే…. పవన్ అభిమానులు రాష్ట్రంలో భాగం కాదా…? వారేమన్నా గ్రహాంతరవాసులా? బాధితుడు ఒక రాష్ట్ర పౌరుడు. జగన్ బాధ్యతగల ప్రభుత్వానికి అధినేత. ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం అతని పని. ముఖ్యమంత్రి సహాయనిధి నుండి డబ్బులు కేటాయిస్తారో…. మరో రకంగా సాయం అందించి వైద్యం చేయిస్తాడో…. లేదా ఆరోగ్యశ్రీలో కొత్త రోగాలను ప్రవేశపెడతారో అన్నది వేరే చర్చ. ‘కానీ పవన్ అభిమానికి జగన్ సాయం’. ఈ టైటిల్ ఏమిటి?

జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగంగా ఎంతోమంది పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆర్థిక సహాయం అందింది. దానికి కూడా రాష్ట్రంలో ఎంతమంది పవన్ అభిమానులు ఉంటే.. అందరికీ జగన్ చేయూత అని బోర్డులు పెట్టేస్తారా..? స్క్రోలింగ్ లు వేసేస్తారా? పవన్ కళ్యాణ్ అంటే రాజకీయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అసలు పడదు. పవన్ కళ్యాణ్ అభిమానులు మీద చాలా సందర్భాల్లో అటు వైసిపి నేతలు ఇటు వైసిపి అనుకూల మీడియా అవాకులు చవాకులు పేల్చిన సందర్భాలు చాలా చూశాం. కానీ పార్టీ వేరు… ప్రభుత్వం వేరు. ప్రభుత్వం అన్న తర్వాత అందరిని సమభావంతో చూడాల్సిందే.

Also Read: సోము వీర్రాజు గేమ్ ప్లాన్ ఏమిటీ?

సాయం వద్దకు వచ్చేటప్పటికీ అతను పవన్ అభిమానా లేదా ఇంకొకరి అభిమానా అని ప్రత్యేకించి చూడటం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి పవన్ అభిమానికి సాయం అందించడం నిజంగా అభినందనీయం…. దానిని తప్పు పట్టలేం. కాని దీనిని పబ్లిసిటీకి వాడుకోవాలని చూడడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఇక పబ్లిసిటీకి అంటూ ఒక పరిధి ఉంటుంది. ఇంత దిగజారుడు రాజకీయాలకు వీరే పరాకాష్ట అని ఈ వ్యవహారంపై సదరు మీడియా ఛానల్ ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. రేపోమాపో సీఎం సహాయనిధి నుండి ఇంకో పార్టీ కార్యకర్తలు సహాయం అందించారని కొత్త పబ్లిసిటీ స్టంట్లు స్టార్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు మరి..!

క్రికెట్‌ ఇంద్రుడు ఈ మహేంద్రుడు!


క్రికెట్ సైన్స్‌ అయితే అతను అబ్దుల్‌ కలాం అంతటి గొప్ప శాస్త్రవేత్త..! ఇది సినిమా అయితే అతను అమితాబ్‌ బచ్చన్‌ అంతటి గొప్ప నటుడు..! ఈ ఆట ఓ తపస్సు అయితే అతనో మహా ఋషి.! ఇది ఓ సామ్రాజ్యం అయితే అతను మకుటం లేని మహారాజు..! ఇది ఓ కురుక్షేత్ర సంగ్రమాం అయితే అర్జునుడూ అతనే.. శ్రీకృష్ణుడూ అతనే..! ఆ దేవలోకానికి అధిపతి ఇంద్రుడు అయితే ఒకటిన్నర దశబ్దాల పాటు భారత క్రికెట్ కు అధిపతిలాంటి వాడు ఈ మహేంద్రుడు..! అతగాడి పూర్తి పేరు మహేంద్ర సింగ్ ధోనీ. పుట్టింది రాంచీ. ఏలింది భారత క్రికెట్ ను !

Also Read: సోము వీర్రాజు గేమ్ ప్లాన్ ఏమిటీ?

అనామకుడిలా వచ్చి అసాధ్యుడిగా ఎదిగిన ధోనీ.. దేశ క్రికెట్ గతి మార్చేసిన మొనగాడు..! సౌరవ్‌ గంగూలీ, రాహుల్ ద్రవిడ్‌, సచిన్‌ టెండూల్కర్, వీవీఎస్‌ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజాలు ఒక్కొక్కరుగా ఆట నుంచి నిష్ర్కమణతో డీలా పడుతున్న జాతీయ జట్టును ప్రపంచంలోనే మేటిగా నిలిపిన వైతాళికుడు.! టీ20, వన్డే వరల్డ్‌ కప్, ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ అందించి, టెస్టుల్లో ఇండియాను నంబర్ వన్‌గా నిలిపిన మేరునగధీరుడు.!! స్వాతంత్ర్య దినోత్సవం రోజు రిటైర్మెంట్‌ ప్రకటించి అభిమానులకు షాకిచ్చిన ధోనీ గురించి చెప్పేందుకు అంకెలు, రికార్డులు సరిపోవు. ఆటకు మించిన అతని వ్యక్తిత్వాన్ని పొగిడేందుకు మాటలు సరిపోవు.

అపర ప్రతిభాశీలి
ఎక్కడి రాంచీ.. ఎక్కడి వరల్డ్ కప్ విక్టరీ. ఒకప్పుడు క్రికెట్ అంటే ముంబై, బెంగాల్, ఢిల్లీ, హైదరాబాద్, కర్నాటక పేర్లే వినిపించేవి. దేశవాళీ క్రికెట్లో ఆయా జట్లకుప్రాతినిథ్యం వహించిన వాళ్లే జాతీయ జట్టుకు ఎక్కువ మంది ఆడేవాళ్లు. జార్ఖండ్‌ లాంటి చిన్న రాష్ట్రాల్లో క్రికెట్కు అంతగా ప్రాముఖ్యత ఉండేది కాదు. ఆ రాష్ట్ర రంజీ జట్టు కూడా ఒకటి ఉందని చాలా మంది గుర్తించే వాళ్లు కాదు. అలాంటి చోటు నుంచి ఒకడు భారత జట్టులోకి రావడమే అనూహ్యం. కానీ, ధోనీ వచ్చాడు. ఆటగాడిగా, నాయకుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ దేశ క్రికెట్పై చెరగని ముద్ర వేశాడు. తన ప్రతిభతో, పోరాట స్పూర్తితో, నాయకత్వ పటిమతో పుట్టిన రాంచీకే కాదు యావత్‌ దేశానికి పేరు తెచ్చిన ప్రతిభాశీలి అతను. తన వ్యక్తిత్వం మాదిరిగా ధోనీ ఆట కూడా విలక్షణమే. అతని బ్యాటింగ్‌ కానీ, కీపింగ్ శైలి కానీ అంత అందంగా ఉండదు. సచిన్‌, కోహ్లీలా పుస్తకాల్లోని షాట్లు ఆడడు. క్లాసిక్ డ్రైవ్‌లు కొట్టలేడు. భుజ బలం, బుద్ధిబలమే ఉపయోగిస్తాడు. తాను సిక్సర్ కొట్టాలనుకుంటే ఎలాంటి బంతినైనా స్టాండ్స్‌లోకి పంపేస్తాడు. కీపింగ్‌లోనూ అంతే. ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌లా అమాతం డైవ్‌ చేయలేడు. కానీ, ధోనీ వికెట్ల వెనకాల ఉంటే బంతి అతడిని దాటి వెళ్లదు. బ్యాట్స్‌మెన్‌ క్రీజు దాటాడంటే రెప్పపాటులో స్టంపౌంట్‌ చేస్తాడు. అల్లంత దూరంలో ఉన్న వికెట్లను చూడకుండా రనౌట్‌ చేసేస్తాడు.

నిగర్వి.. నిస్వార్థి
సచిన్‌ టెండూల్కర్ అంతటి పేరుంది. సౌరవ్‌ గంగూలీలా జాతీయ జట్టులో ఎదురేలేదు. అయినా సరే ధోనీలో మీసమెత్తు గర్వం కనిపించదు. ఒకటిన్నర దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ఒక్కసారి కూడా పొగరు గా వ్యవహరించిన సందర్భం లేదు. అతని నోటి నుంచి అనవసరంగా వచ్చిన మాట లేదు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ధోనీ అందరికీ విలువ ఇస్తాడు. తాను కెప్టెన్‌ అయిన కొత్తలో గంగూలీ, ద్రవిడ్, సెహ్వాగ్, లక్ష్మణ్, అనిల్‌ కుంబ్లే, జహీర్ ఖాన్‌ లాంటి సీనియర్లకు గౌరవం ఇచ్చాడు. సత్తా ఉన్నంతకాలం వాళ్లు స్వేచ్ఛగా ఆడే వాతావరణం కలిపించాడు. కానీ, వయసు పెరిగి, పరుగులో వేగం తగ్గి, ఆటలో పదును తగ్గిన వెంటనే వాళ్లు మాకొద్దు అనేశాడు. ప్రపంచ క్రికెట్‌లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా జట్టును తీర్చిదిద్దాలని భావించే ఈ నిర్ణయం తీసుకున్నాడు. దూరదృష్టితో కుర్రాళ్లకు అవకాశం ఇచ్చాడు. అప్పుడు కుర్రాళ్లుగా ఉన్న కోహ్లీ, రోహిత్, జడేజా, రైనా, భువనేశ్వర్, శిఖర్ధవన్‌, మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్యాలను తెరపైకి తీసుకొచ్చింది అతనే. వీళ్లంతా ధోనీ కెప్టెన్సీలో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. టాలెంట్‌ ఉన్న ఆటగాళ్లు కొన్నిసార్లు విఫలమైనా వెన్నుతట్టి ప్రోత్సహించి వాళ్లను వరల్డ్‌ క్లాస్‌ ప్లేయర్లుగా తీర్చిదిద్దాడు మహీ. జట్టు కోసం తన బ్యాటింగ్‌ స్టయిల్‌ను, బ్యాటింగ్ ఆర్డర్ను మార్చుకున్న నిస్వార్థి అతను. మూడు, నాలుగులో మంచి రికార్డు ఉన్నప్పటికీ మిడిలార్డర్కు మారి విజయాలు అందించాడు.

Also Read: తహసీల్దార్ కోటి లంచంలో రేవంత్ రెడ్డికి లింక్?

సీతయ్య.. అనుకున్నదే చేస్తాడు
ధోనీ అందరి అభిప్రాయాలను గౌరవిస్తాడు. జట్టులో ఎవరైనా సరే తన దగ్గరకి వచ్చి సలహాలు ఇచ్చే స్వేచ్ఛనిచ్చాడు. కానీ, తాను అనుకున్నదే చేస్తాడు. సీతయ్య టైప్‌. తాను ఏదైనా చేయాలని మైండ్‌లో ఫిక్స్‌ అయితే బ్లైండ్‌గా వెళ్లిపోతాడు. తన సామర్థ్యంపై అతనికున్న నమ్మకం అలాంటిది మరి. ఆటలో అతనిది మాస్టర్ మైండ్‌. 22 గజాల పిచ్‌ను.. 80 మీటర్ల మైదానాన్నే కాదు ప్రత్యర్థి ఆటగాళ్ల మైండ్‌ను చదివేశాడు. ఓ బ్యాట్స్మెన్‌ ఏ టైమ్‌లో ఎలాంటి షాట్ ఆడతాడో, ఓ బౌలర్ ఎలాంటి బంతిని వేస్తాడో అతనికి ముందుగానే తెలిసిపోతుంది. అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తాడు. ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తాడు. ఇప్పటికీ ఎంతో మందికి బ్రహ్మపదార్థం లాంటి డీఆర్ఎస్‌పై అయితే అతను పీహెచ్డీ చేశాడని చెప్పొచ్చు. ధోనీ రివ్యూ కోరాడంటే దాదాపు 90 శాతం కచ్చితవ్వం ఉంటుంది. అందుకే డీఆర్ఎస్‌ అంటే ధోనీ రివ్యూ సిస్టమ్‌ అని పేరొచ్చింది. జట్టుకు ఏది మంచిదో, ఏ టైమ్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మహీకి బాగా తెలుసు. ఒక వరల్డ్‌ కప్ ముగిసిన వెంటనే నాలుగేళ్ల తర్వాత జరిగే మరో ప్రపంచ కప్‌ కోసం ప్రణాళికలు రచిస్తాడతను. ఎప్పుడేం చేయాలో అతనికున్న క్లారిటీ మరెవరికీ లేదు.

దటీజ్‌ ధోనీ..
జట్టుకు పట్టుకొని వేళాడే రకం కాదు ధోనీ. తాను కెప్టెన్‌గా ఉన్నప్పుడు కొందరు సీనియర్లను సాగనంపిన మహీ కుర్రాళ్లకు దారిచ్చేందుకు తానూ అదే పని చేశాడు. ఇండియాకు తర్వాతి కెప్టెన్‌ కోహ్లీ అని అర్థమవగానే టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఆపై, లిమిటెడ్‌ ఓవర్ల పగ్గాలు అతనికే ఇచ్చేసి ఓ ప్లేయర్గా జట్టులో కొనసాగాడు. ఓ పెద్దన్నలా విరాట్‌కు సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఈ లోపు వయసు మీద పడి, గాయాలు ఎదురై ధోనీ ఆటలో మునుపటి వాడి తగ్గింది. 2015 వన్డే వరల్డ్ కప్, 2016 టీ 20 వరల్డ్ కప్ ఓటముల తర్వాత నుంచే ధోనీ రిటైరవ్వాలన్న అభిప్రాయాలు ఎక్కువయ్యాయి. కానీ, కీపర్గా తన స్థానాన్ని భర్తీ చేసే సరైన ఆటగాడు లేకపోవడం, 2019 వరల్డ్కప్ ఇండియాకు అందించాలన్న లక్ష్యంతోనే రాంచీ వీరుడు కొనసాగాడు. కానీ, గతేడాది ఇంగ్లండ్‌లో జరిగిన వరల్డ్‌కప్ సెమీస్‌లోనే మన జట్టు ఓడిపోయింది. అతని రనౌట్‌తోనే ఇండియా కప్పు కల చెదిరింది. మైదానంలో మొదటిసారి ధోనీ కంట కన్నీరు కనిపించింది. ఇది జరిగి ఏడాది పూర్తయింది. ధోనీ మళ్లీ గ్రౌండ్‌లో కనిపించలేదు. అప్పటి నుంచి ధోనీ వీడ్కోలు పలకాల్సిందే అని కొందరు డిమాండ్‌ కూడా చేశారు. కానీ, ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ఆడాలనుకున్నాడు మహీ. కారణం లిమిటెడ్‌ ఓవర్లలో మంచి కీపర్లేకపోవడమే. కానీ, ఈ ఏడాది టీ20 వరల్డ్‌ కప్ వాయిదా పడింది. ఇప్పుడు జట్టుకు తన అవసరం లేదని అతనికి అర్థమైంది. అందుకే ఓ రాత్రి ఓ చిన్న మెసేజ్‌తో తన కెరీర్కు ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చేశాడు. దటీజ్‌ ధోనీ. బీసీసీఐ బాస్ సౌరవ్‌ గంగూలీ వల్లే మహీ రిటైర్మెంట్‌ ఇచ్చాడని పలువురు భావిస్తున్నారు. కానీ, ఒకరి కారణంగానో.. ఒకరు చెబితేనో వైదొలగాలని అనుకుంటే ధోనీ ఇప్పటికి వంద సార్లు రిటైర్మెంట్‌ ప్రకటించాల్సి వచ్చేది. ఫేర్వెల్‌ మ్యాచ్‌ ఆడించాల్సిందని, సచిన్‌ మాదిరిగా సగర్వంగా సాగనంపాలని ఎన్ని అభిప్రాయాలు వస్తున్నా.. మహీ ఒప్పుకుంటేనే అది సాధ్యం అవుతుంది. ఇలాంటి హడావుడి ధోనీకి నచ్చదు. అతనెప్పుడూ కూల్‌గానే ఉంటాడు. ఏపనైనా కూల్‌గానే చేస్తాడు. ఎందుకంటే అతను మహేంద్రుడు..!

ఆ ఇంట్లో కనిపించిన మనిషి పుర్రె.. అసలు మిస్టరీ ఏంటంటే?

ప్రశాంతమైన వాతావరణం ఉన్న ప్రాంతంగా పేరు తెచ్చుకున్న విశాఖ జిల్లాలో గత కొంతకాలం నుంచి మనుషులను భయభ్రాంతులకు గురి చేసే ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా విశాఖలో ఒక వ్యక్తి మనిషి పుర్రెను కాల్చుకుంటూ తినడానికి ప్రయత్నించాడు. స్థానికులు పుర్రె తినడానికి ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తిని చూసి షాక్ కు గురయ్యారు. తన చుట్టూ జనం చేరడంతో ఆ వ్యక్తి వెంటనే ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు.

Also Read: కారును బైకులా మార్చి ప్రాణాలు దక్కించుకున్నాడు!

విశాఖలోని రెల్లి వీధిలో నేడు ఈ ఘటన చోటు చేసుకుంది. పాడుబడ్డ ఇంట్లో రావేలపూడి రాజు అనే సైకో మనిషి పుర్రెను కాల్చుకుని తినడానికి ప్రయత్నించడాన్ని స్థానికులు గమనించారు. స్థానికులను చూడటంతో భయపడి సైకో అక్కడి నుంచి పరుగు లంకించాడు. రాజు గత కొన్ని నెలల నుంచి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఒంటరిగా ఉంటూ చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు ఘటన అనంతరం పోలీసులు రాజును పట్టుకోవడానికి ప్రయత్నించారు.

Also Read: చెట్టును నరకడం ఇష్టం లేకా ఆ వ్యక్తి ఏం చేశాడంటే?

అయితే తృటిలో రాజు పోలీసులకు దొరకకుండా పరారయ్యాడు. పోలీసులు పుర్రెను స్వాధీనం చేసుకోగా ఈ ఘటనతో రెల్లి వీధి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసులు రాజు ఇంట్లో ఉండే ఒక యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం రాజు తండ్రి అనారోగ్య సమస్యలతో మృతి చెందాడని అప్పటినుండి రాజు మానసిక పరిస్థితి బాగాలేదని స్థానికులు చెబుతున్నారు.

స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం వెనకున్న అసలు కుట్ర బయటపడింది…!

స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం విచారణ కీలక దశకు చేరుకుంది. ముందు స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యం సరైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోలేదని…. వారి నిర్లక్ష్యం వల్లనే అగ్ని ప్రమాదం జరిగిందని కమిటీ తేల్చింది. అయితే మరింత విచారన జరిపించిన తర్వాత విచారణ కమిటీ అగ్నిప్రమాదం విషయం పక్కన పెడితే… రమేష్ ఆసుపత్రి వారు స్వర్ణ ప్యాలెస్ ను ఉపయోగించుకొని చాలా కుట్రలకు పాల్పడ్డారని బయటపెట్టారు.

Also Read: సోము వీర్రాజు గేమ్ ప్లాన్ ఏమిటీ?

వివరాల్లోకి వెళితే చాలా మంది పేషెంట్లకు కరోనా టెస్ట్ చేయకుండానే ఎక్స్ రే, సిటి స్కాన్ ద్వారా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారని…. అవసరం లేకపోయినా రెమిడెసివిర్ మందులను ఇచ్చి అధిక ఫీజులను చివరికి బిల్లుల రూపంలో వసూలు చేశారని తెలిపారు. వ్యాధి తీవ్రత లేకపోయినా కరోనా ఇంజెక్షన్లు ఇచ్చి అధిక ఫీజులు వసూలు చేశారని కమిటీ తెలిపింది.

ఇప్పటికే అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే రమేష్ ఆస్పత్రి యజమాని రమేష్ బాబు పరారీలో ఉండగా ఈ సంచలన విషయాలు బయట పడిన నేపథ్యంలో ఖచ్చితంగా అతని అరెస్టుకు గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేస్తామని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read: పబ్లిసిటీకి ఒక ‘లిమిట్’ ఉంటుంది… ఒక మనస్’సాక్షి’ ఉంటుంది…!

ఇక ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. ఆసుపత్రి అధినేత రమేష్ పరారీలో ఉన్నారు కానీ ఆడియో సందేశాలు మాత్రం మీడియా కి పంపుతున్నారు. తప్పు చేయకపోతే పోలీసులు ఎదుట విచారణకు హాజరు కావచ్చు కదా…. అని ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సరైన అనుమతులు తీసుకోలేదు. లోపల వైద్యం మొత్తం అక్రమంగా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ శాఖలు ఏమి చేస్తున్నాయి..? ఇంత అక్రమం జరుగుతుంటే… వారి వైఖరి ఇంత నిర్లక్ష్యంగానా ఉండేది…? అని ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి.