
దేశంలో చాప కింద నీరులా కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. చైనాలోని వుహాన్ నుంచి వ్యాప్తి చెందిన ఈ వైరస్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అత్యధిక జనాభా కలిగిన దేశం కావడంతో మన దేశంలో ఈ మహమ్మారిని నియంత్రించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి.
Also Read: పాపం.. ఈ కాకి ఏం తప్పు చేసింది? తెల్లగా పుట్టడమే దీని తప్ప?
కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వైరస్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు చేపట్టాయి. వైరస్ గురించి శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తుండగా ఈ పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఒడిశా శాస్త్రవేత్తలు కరోనా వైరస్ రూపాంతరాలపై పరిశోధనలు చేసి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మన దేశంలో కరోనా 73 రకాలుగా రూపాంతరం చెందినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
Also Read: కోడి కూసిందని.. రూ.15 వేలు ఫైన్ వేశారు.. ఎక్కడంటే?
ఢిల్లీలోని సిఎస్ఐఆర్-ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ, భువనేశ్వర్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ,ఎస్ యూఎం హాస్పిటల్ కు చెందిన పరిశోధనా బృందం పరిశోధనలు చేసి వైరస్ కు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించింది. 752 క్లినికల్ శాంపిల్స్ తో పాటు 1,536 నమూనాలను పరిశీలించి పరిశోధనల బృందం ఈ విషయాలను వెల్లడించటం గమనార్హం. కరోనా వైరస్ లో బి .1.112 , బి 1 అనే రెండు వంశాలు ఉన్నాయని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్ జయశంకర్ దాస్ తెలిపారు.