
గడిచిన 8 నెలలుగా భారత్ తో పాటు ఇతర దేశాల ప్రజలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. రష్యా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ఆ వ్యాక్సిన్ పనితీరుపై అనేక సందేహాలు నెలకొన్నాయి. పూర్తిస్థాయిలో సత్ఫలితాలు ఇచ్చే వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి చాలా సమయం పట్టేలా ఉండటంతో శాస్త్రవేత్తలు ఇప్పటికే అందుబాటులో ఉన్న ఔషధాలపై పరిశోధనలు చేస్తున్నారు.
Also Read: బిత్తిరి సత్తికి కరోనా.. ఆందోళన లో ఫ్యాన్స్
ఈ పరిశోధనల్లో వినికిడి సమస్యలు, మానసిక ఒత్తిళ్ల సమస్యలను దూరం చేసే ఏబ్సెలిన్ అనే ఔషధం అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఔషధం కరోనా నియంత్రణకు ఉపయోగపడుతుందని ప్రాథమిక అంచనాకు వచ్చామని ఔషధంపై మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనా వైరస్ అభివృద్ధిలో ప్రోటీస్, ఎం ప్రో లాంటి ఎంజైమ్ లు కీలక పాత్ర పోషిస్తున్నాయని… ఈ ఎంజైమ్ లపై ఏబ్సెలిన్ మెడిసిన్ ప్రతికూల ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read: ఆ ‘పోలీస్ స్టేషన్’లో పాములే ఖైదీలు..!
కంప్యూటర్ సిమ్యులేషన్ టెక్నాలజీ సహాయంతో ఈ వ్యాక్సిన్ పనితీరు గురించి కనుగొన్నామని పేర్కొన్నారు. సైన్స్ అడ్వన్సెడ్ జనరల్ లో ఈ ఔషధం గురించి వివరాలను ప్రచురించారు. ఏబ్సెలిన్ ఔషధం ప్రొటీస్, ఎం-ప్రో ఎంజైమ్ లలో క్యాటలిటిక్ ప్రాంతాన్ని విస్తరించకుండా చేస్తోందని మరో అణువులో ఎంజైమ్ లు వృద్ధి చెందకుండా నిరోధిస్తోందని చెప్పారు. శాస్త్రవేత్త జువాన్ ది పాబ్లో ఈ విషయాలను వెల్లడించారు.