
యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి మరో బంపర్ ఆఫర్ తగిలింది. బన్నీ సుకుమార్ సినిమా తరువాత ఐకాన్ అనే సినిమా స్టార్ట్ చేద్దామనుకున్నాడు. కానీ, ఇప్పుడు మనసు మార్చుకునట్లు తెలుస్తోంది. తన తరువాత సినిమాని బోయపాటితో చేస్తే బాగుంటుందని ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుతం సుకుమార్ తో చేస్తోన్న పుష్ప సినిమా ఎంత లేదు అన్నా.. కాస్త బిసి సెంటర్ ప్రేక్షకులకు దూరంగానే ఉంటుంది. పైగా, సుకుమార్ అంటేనే.. అదొక పజిల్ లాగా స్క్రీన్ ప్లే సాగుతుంది. మరి ఆ ప్లే మాస్ జనానికి నచ్చకపోతే.. తనకు ఈ మధ్య పెరిగిన మాస్ ఫాలోయింగ్ పోయే చాన్స్ ఉంది. అందుకే కేవలం మాస్ జనం కోసమని.. తన తరువాత సినిమాని బోయపాటితో ప్లాన్ చేస్తున్నాడు బన్నీ. పైగా వీరిద్దరిది హిట్ కాంబినేషన్ కూడా.
Also Read: ఆర్థిక కష్టాల్లో స్టార్ హీరో వారసుడు !
ఇంతవరకూ బాగానే ఉంటుంది గాని, రామ్ చరణ్ తో చేసిన ‘వినయ విధేయ రామ’ చిత్రం ప్లాప్ తరువాత బోయపాటిలో మార్పు వచ్చింది. బోయపాటికి మరో సినిమా రావడానికి చాల గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది, ఆది బాలయ్య లాంటి హీరోతో. అంతగా ‘వినయ విధేయ రామ’ ప్లాప్ ఎపెక్ట్ బోయపాటి మీద పడింది. నిజానికి ఆ సినిమా ప్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం సినిమాలోని యాక్షనే. వాస్తవానికి పూర్తి దూరంగా ఉండే బోయపాటి యాక్షన్ ఈ మధ్య వర్కౌట్ అవ్వట్లేదు. అందుకే ఈ క్రమంలో బోయపాటి, నందమూరి బాలకృష్ణతో చేస్తోన్న సినిమాలో కూడా యాక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
Also Read: అందాలను ఆరబోసిన శ్రద్ధా దాస్
కాస్త నమ్మే విధంగా రియలిస్టిక్ యాక్షన్ తోనే ఇక నుండి తన సినిమాలు తీయాలని బోయపాటి బలంగా డిసైడ్ అయ్యాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న బోయపాటికి వంద కోట్లు మార్కెట్ ఉన్న బన్నీ లాంటి హీరో చాన్స్ ఇవ్వడం అంటే కచ్చితంగా రిస్కే. మరి బన్నీ ఏం చేస్తాడో చూడాలి. బాలయ్యతో సినిమా హిట్ అయితే బన్నీ బోయపాటికి చాన్స్ ఇస్తాడు, ఒకవేళ ప్లాప్ అయితే, మళ్ళీ చేద్దామని పోస్ట్ పోన్ చేస్తాడు. ఇప్పుడు బాల్ బోయపాటి చేతిలోనే ఉంది. ప్లాప్ వైపు వేస్తాడో.. లేక హిట్ వికెట్ పడగోట్టేస్తాడో చూడాలి. .