Home Blog Page 8344

సూపర్ హిట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ కి సినిమా లేదు !


సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘మహర్షి’ లాంటి సూపర్ హిట్ సినిమా తీసి.. ఇప్పుడు సినిమా లేక.. ఏ స్టార్ హీరోని ఒప్పించలేక ప్రస్తుతం కథ మీద కుస్తీ పడుతున్న డైరెక్టర్ వంశీ పైడిపల్లి. నిజానికి ఒక కొత్త డైరెక్టర్ అయినా సరే… ఒక సూపర్ హిట్ సినిమా తీసిన తరువాత, స్టార్ హీరోలు పిలిచి మరీ అవకాశం ఇవ్వడం అనేది సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రెండు జనరేషన్ల నుండీ వస్తోన్న ఆనవాయితీ.. మరియు ఒక అలవాటు. అలాంటిది ఒక్క వంశీ విషయంలోనే ఇది ఎందుకో సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం అని, హీరోల చుట్టూ తిరిగి సినిమాని ఫిక్స్ చేసుకోవడం వంశీకి మొదటినుండి అలవాటు లేదు. బహుశా అందుకేనేమో ఆయనకు అంతత్వరగా సినిమాలు సెట్ అవ్వవు.

Also Read: మళ్లీ సౌత్‌పై కన్నేసిన తాప్సీ

గతంలో ఊపిరి సినిమాకి ఇలాగే జరిగింది. అంతకుముందు బృందావనం సినిమాకి ఇలాగే జరిగింది. దిల్ రాజును ఈ విషయంలో మెచ్చుకోవాలి.. వంశీ సమస్య తెలుసు కాబట్టే.. వంశీ సినిమాలకు హీరోలను సెట్ చేసే బాధ్యత తాను తీసుకునేవాడు. కానీ ఈ సారి వంశీనే తన సినిమా హీరో కోసం తానే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ ఏ స్టార్ హీరో సెట్ కావడం లేదు. మహర్షి హిట్ టాక్ రాగానే వంశీ నిర్ణయించుకున్న మొదటి నిర్ణయం.. తన తదుపరి చిత్రాన్ని కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుతోనే చేయాలని. మహేష్ కోసం రాయలసీమ నేపథ్యంలో కథ కూడా రెడీ చేశాడు. మహేష్ ను ఒప్పించడానికి బాగానే ప్రయత్నాలు చేశాడు. కానీ ఎందుకో మహేష్ కి వంశీ చెప్పిన కథ నచ్చలేదు. మహర్షి నుండి వంశీతో మంచి సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేస్తూ వస్తోన్న మహేష్, ఈ సినిమాను చేయలేను అని చెప్పలేక, ఈ కథ చరణ్ కి అయితే బాగుంటుందని సలహా ఇచ్చాడు.

Also Read: బన్నీ- కొరటాల.. భరత్‌ అనే నేను ఫార్ములా

ఈ లోపు తానూ పరుశురామ్ సర్కారు వారి పాట సినిమాకి డేట్స్ ఇచ్చేశాడు. ఇక వంశీ పైడిపల్లి తన తరువాత సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. చరణ్ ను కలిసి కథ కూడా చెప్పాడు. కథ రాయలసీమ నేపథ్యంలో నడిచే పక్కా యాక్షన్ సినిమా కావడం, గతంలో ఇలాంటి యాక్షన్ సినిమానే బోయపాటితో చేస్తే అది సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు అంటూ చరణ్ కూడా వంశీ సినిమాని సున్నితంగా తిరస్కరించాడు. ఇప్పుడు వంశీకి ఉన్న అప్షన్.. అల్లు అర్జునే. అయితే బన్నీ కూడా ప్రస్తుతం సుకుమార్ తో యాక్షన్ సినిమానే చేస్తున్నాడు. అలాగే ఐకాన్ అనే సినిమాని కూడా ఇప్పటికే లైన్ లో పెట్టాడు. ఇక ప్రభాస్ తో సినిమా అంటే మరో మూడేళ్లు ఆగాల్సిందే. అంత బిజీగా ఉన్నాడు ప్రభాస్. మొత్తానికి హిట్ సినిమా ఇచ్చిన తరువాత కూడా, ఒక స్టార్ డైరెక్టర్ కి హీరో దోరకకపోవడం అంటే.. బ్యాడ్ టైమే అనుకోవాలి.

పైలట్‌‌ కంగనా.. లుక్‌ అదిరిందిగా..


బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ తన మాటల్లోనే కాదు కెరీర్లో యమ స్పీడ్‌. వరుస సెట్టి సినిమాలు చేస్తోందామె. వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిస్తూ.. ఎప్పుడూ ఏదో ఒక గొడవలో తలదూర్చినా ఆమెకు ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు. వ్యక్తిగత విషయాలు, ఇండస్ట్రీ, రాజీకీయ అంశాలపై ఆమె స్పందన కొందరికి నచ్చినా నచ్చకపోయినా.. తెరపై ఆమె నటనను మాత్రం అందరూ ఇష్టపడుతారు. కంగనా అంటే పడని వాళ్లు, విమర్శకులు సైతం ఆమె యాక్టింగ్‌ స్కిల్స్‌ను తెగ పొగిడేస్తుంటారు. గాడ్‌ ఫాదర్స్‌ లేకపోయినా.. ఔట్‌సైడర్గా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన కంగనా తన స్వశక్తితో ఎదిగింది. ప్రతి సినిమాలోనూ తన మార్కు చూపిస్తోంది. సక్సెస్‌ వచ్చాక వరుస ఆఫర్లు ఎదురైనా కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. స్టోరీతో పాటు తన క్యారెక్టర్ బలంగా ఉండే సినిమాలే చేస్తోంది. కథానాయిక ప్రాధాన్యం ఉన్న కథల కోసం బాలీవుడ్‌లో అందరి దర్శకుల చూపు ఫస్ట్‌ కంగనా వైపే వెళ్తుంది. ఈ మధ్యే ‘పంగా’ మూవీతో మరో హిట్‌ ఖాతాలో వేసుకున్న రనౌత్.. ప్రస్తుతం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత బయోపిక్‌ ‘తలైవి’లో నటిస్తోంది. అదే విధంగా దగ్గుబాటి రానాతో ఓ ప్రాజెక్టుకు ఓకే చెప్పింది. అయితే ఇది సినిమా, వెబ్‌ సిరీసా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. తాజాగా ఆమె మరో సాహసం చేసేందుకు రెడీ అయింది. ఆమె ప్రధాన పాత్రలో ‘తేజస్‌’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో కంగనా ఇండియన్ ఎయిర్ఫోర్స్‌ పైలట్‌ పాత్రను పోషించనుంది.

Also Read: బన్నీ- కొరటాల.. భరత్‌ అనే నేను ఫార్ములా

ఈ చిత్రంలో ఆమె ఫస్ట్ లుక్‌ పోస్టర్ను చిత్ర బృందం ఈ రోజు (శుక్రవారం) విడుదల చేసింది. తేజస్‌ అనే యుద్ధ విమానం ముందు.. ఎయిర్ఫోర్స్‌ డ్రెస్‌లో గంభీరంగా నిల్చున్న కంగనా లుక్‌ అదిరిపోయింది. ఈ పోస్టర్ను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసిన రనౌత్‌… ‘తేజస్‌ ఈ డిసెంబర్లో టేకాఫ్‌ అవుతుంది. ఎంతో ధైర్యవంతులైన మన ఎయిర్ఫోర్స్‌ పైలట్ల గురించి చెప్పే ఈ అద్భుతమైన కథలో భాగం అయినందుకు గర్వపడుతున్నా. జైహింద్‌’ అని ట్వీట్‌ చేసింది. ‘వురి: ది సర్జికల్‌ స్ట్రైక్‌’ అనే హిట్‌ సినిమాను నిర్మించిన రోనీ స్క్రివాలా ఈ చిత్రానికి ప్రొడ్యూసర్. సర్వేశ్‌ మెవారా దర్శకత్వం వహించనున్నాడు. ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో ఇండియన్‌ ఎయిర్ ఫోర్స్‌ ధైర్య సాహసాలను, మహిళా పైలట్‌ వీరోచిత పోరాటాన్ని కళ్లకు కట్టనున్నాడు.

అనుష్క ‘నిశ్శబ్దం’ పై.. మౌనమేలా?


కరోనా పరిస్థితుల రీత్యా అంచనాలు ఉన్న సినిమాలు కూడా నేరుగా ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి. మొదటి నుండీ ఓటిటిలో డైరెక్ట్ రిలీజ్ కు మన టాలీవుడ్ దూరంగానే ఉన్నా.. కరోనా ప్రవాహంలో డిజిటల్ రిలీజ్ కి మన టాలీవుడ్ మేకర్స్ అంగీకరించక తప్పలేదు. ఇప్పటికే చిన్నాచితకా బడ్జెట్ సినిమాలు కొన్ని రిలీజ్ అవ్వగా, ఇప్పుడు నాని ‘వి’తో మీడియం బడ్జెట్ సినిమాల విడుదల పరంపర కూడా మొదలు అయింది. అయితే రిలీజ్ కి రెడీగా ఉన్న మోస్ట్ వాంటెడ్ సినిమాల్లో అనుష్క “నిశ్శబ్దం” కూడా ఒకటి. ఈ సినిమా ఓటీటీలో వస్తోందని రచయిత కోన వెంకట్ ఆ మధ్య హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ తరువాత మళ్ళీ ఈ సినిమా రిలీజ్ గురించి మళ్ళీ ఏ వార్త వినిపించలేదు. ఈ సినిమా కోసం నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నా.. మేకర్స్ మాత్రం మౌనం వీడటం లేదు.

Also Read:  బన్నీ- కొరటాల.. భరత్‌ అనే నేను ఫార్ములా

ఈ సినిమాలో అనుష్క ప్రధాన పాత్రలో నటించడం, పైగా సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ కావడం, ముఖ్యంగా సినిమాలో ఓ మర్డర్ చుట్టూ తిరిగే సస్పెన్స్ సీన్స్ సినిమాలోనే మెయిన్ హైలైట్ గా ఉంటాయనే ఆసక్తి కలగడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. మరి ఈ థ్రిల్లర్ లో మర్డర్ చేసింది ఎవరనే కోణంలో సినిమా సాగుతుందట. అలాగే మంచి ఎమోషనల్ కంటెంట్ తో కనెక్ట్ అయ్యే విధంగా కూడా ఈ సినిమా ఉంటుందని.. అన్నిటికి మించి అనుష్క పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయని.. ఆ నెగెటివ్ యాంగిల్ నుండి పాజిటివ్ యాంగిల్ లోకి ఆమె క్యారెక్టర్ ఎలా మారింది అనే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా బాగుంటుందని… ఇలా అనుష్క క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది.

Also Read: మళ్లీ సౌత్‌పై కన్నేసిన తాప్సీ

అయితే అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు… ఈ సినిమా పరిస్థితి తగలడింది. అసలు ‘నిశ్శబ్దం’ సినిమా నిజానికి గత ఏడాదే రిలీజ్ అవుతుందనుకున్నారు.. మేకర్స్ కూడా ఆ మధ్య రిలీజ్ డేట్ ను కూడా ఎనౌన్స్ చేశారు. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల.. జనవరి లాస్ట్ వీక్ కి రిలీజ్ డేట్ పోస్ట్ ఫోన్ అయిందని అనుష్క టీమ్ వివరణ ఇచ్చింది. చివరకు ఆ డేట్ కూడా మిస్ అయింది. ఆ తరువాత ఇక కరోనా వచ్చింది. అయితే ఈ సినిమాని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్మాత కోన వెంకట్ ప్లాన్ చేసుకున్నా.. ఆయనకు ఓ ఛానల్ కు మధ్య సాగిన ఆర్ధిక లావాదేవీల గందరగోళంలో లెక్కలు తేడా వచ్చి.. ‘నిశ్శబ్దం’ రిలీజ్ కు అడ్డుపడ్డాయి. కానీ కోన ఆ అడ్డును నిశ్శబ్దంగానే వదిలించుకుని.. సినిమా ను విడుదలకు రెడీ చేస్తున్నాడు అనుకుంటే.. ఇప్పుడు మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. మరి ఈ మౌనం ఎప్పుడు విడుతారో చూడాలి.

మూడు సెకండ్ల వీడియో.. అమెరికాలో హల్చల్


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నవంబర్ లో జరుగనున్నాయి. ఈనేపథ్యంలో అమెరికాలో ఎన్నికల సందడి ఇప్పటికే మొదలైంది. డెమోక్రాట్ పార్టీ నుంచి ప్రెసిడెంట్ అభ్యర్థిగా జో బిడెన్, వైస్ ప్రెసిడెంట్ గా ఇండో-ఆఫ్రికన్ మహిళ కమలా హ్యారిష్ ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. తాజాగా రిపబ్లిక్ పార్టీ తరుఫున అమెరికా ప్రెసిడెంట్ అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి నామినేషన్ వేశారు. ట్రంప్ నామినేషన్ నుంచి రాజకీయ వేడి మొదలైనట్లు కన్పిస్తోంది.

Also Read: అసమ్మతి నేతలపై సోనియా వేటు వేస్తారా?

అమెరికా వైట్‌ హౌస్‌లోని సౌత్‌ లాన్‌లో ట్రంప్ నామినేషన్ కార్యక్రమం నిర్వహించారు. అయితే ట్రంప్ నామినేషన్ కంటే కూడా ట్రంప్ ప్రస్తుత భార్య మెలానీయా, ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంక ట్రంప్ మధ్య చోటుచేసుకున్న ఒక సంఘటన హాట్ టాపిక్ గా మారింది. కేవలం మూడు సెకన్ల నిడివిగల వీడియోలో ట్రంప్ భార్య, కూతురు మద్య జరిగిన పలకరింపు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రంప్ భార్యకు, కూతురు మధ్య సత్సంబంధాలు లేవంటూ ఈ వీడియోను అమెరికాలో నెటిజన్లు షేర్ చేస్తుండగా ప్రస్తుతం ట్రెండింగులో దూసుకెళుతోంది.

ట్రంప్ తన తొలి భార్యకు విడాకులు ఇచ్చి మెలానీయాను పెళ్లి చేసుకున్నాడు. ట్రంప్ తొలి భార్యకు కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడు వేరేచోట ఉంటుండగా కూతురు ఇవాంక మాత్రం తండ్రితోనే అధ్యక్ష భవనంలో ఉంటుంది. ఇటీవల ట్రంప్ భారత్ వచ్చినపుడు కూడా ఇవాంక ఆయన వెంట వచ్చింది. అయితే ఇవాంకకు ఆమె సవితి తల్లి మెలానీయాకు సత్సంబంధాలు లేవని అమెరికా మీడియాలో వార్తలు తరుచూ విన్పిస్తూనే ఉన్నాయి.

తాజాగా ట్రంప్ నామినేషన్ సందర్భంగా మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది. ట్రంప్ నామినేషన్ కార్యక్రమంలో ఆయన కుమార్తె ఇవాంకను ట్రంప్‌ను పరిచయం చేశాడు. ఈ సందర్భంగా ఇవాంక తన తండ్రి ట్రంప్ తోపాటు మెలానీయాను విష్ చేస్తూ చిరునవ్వు చిందిస్తుంది. దీనికి బదులుగా మెలానీయా కూడా చిరునవ్వులు చిందించింది. ఇవాంక అటు వెళ్లగానే సెకన్ల వ్యవధిలోనే మెలానీయా ముఖం చిట్లించుకున్నట్లు వీడియోలో కన్పిస్తోంది. దీనిని ట్రంప్ వ్యతిరేక బ్యాచ్ వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవీ గెలుస్తాడో లేదోగానీ ఎన్నికలు పూర్తయ్యే నాటికి ఆయన ఇంట్లో అమెరికా మీడియా చిచ్చు పెట్టడం ఖాయంగా కన్పిస్తోంది.

ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గెలుపు కష్టమేనా?


తెలంగాణను సాధించిన పార్టీగా టీఆర్ఎస్ కు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణకు తొలి సీఎం అయ్యాక అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్నలను చూరగొన్నారు. దీంతో రెండోసారి కూడా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతోనే విజయం సాధించారనే టాక్ ఉన్నా.. అది కేసీఆర్ చాణిక్యానికి నిదర్శంగా నిలుస్తోంది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి రావడంతో ఆ పార్టీ తెలంగాణలో మరింత బలోపేతం అయింది.

Also Read: జై కేటీఆర్‌‌.. ఆయనే మా సీఎం

గడిచిన ఆరేళ్లుగా తెలంగాణ ఎలాంటి ఎన్నికలు జరిగినా వార్ వన్ సైడ్ అన్నట్లుగా టీఆర్ఎస్ దూసుకెళుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్, కార్పోరేషన్, మున్సిపల్, సర్పంచ్, సహకార ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ జెట్ స్పీడుతో దూసుకెళుతుండగా ప్రతిపక్షాలు మాత్రం బేజారవుతున్నాయి. ప్రతీ ఎన్నికలోనూ టీఆర్ఎస్ దూకుడుకు కళ్లెంవేయలేక చతికిలిపడిపోతున్నాయి. అయితే త్వరలోనే రానున్న గ్రేటర్ ఎన్నికలు టీఆర్ఎస్ సత్తాకు గిటురాయిగా మారనున్నాయనే టాక్ విన్పిస్తోంది.

వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌, గ్రేటర్ వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం కార్పొరేష‌న్ల ఎన్నిక‌లు జ‌రుగనున్నాయి. ఈ మూడు ప్రాంతాల్లోనూ టీఆర్ఎస్ గులాబీ జెండా ఎగురవేయాలని భావిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు ఆయా పట్టణాల్లో అభివృద్ధి పనుల జోరును పెంచారు. ప్రభుత్వం కూడా అధిక నిధులు మంజూరు చేస్తుండటంతో నేతలు పర్యటనలు, శంకుస్థాపనలతో హడావుడి చేస్తున్నారు.

రాష్ట్రంలో కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నారు. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనాను ప్రభుత్వం కట్టడి చేయలేకపోయిందని నగరవాసులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నగరమంతా వరదల్లో కురుకుపోవడంతో హైదరాబాద్లో టీఆర్ఎస్ అభివృద్ధి చేసిందీ ఏమిలేదనే భావనను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇక వరంగల్ నగరం ఇటీవల కురిసిన చిన్నపాటి వానకే వరదముంపునకు గురైంది. గత ఆరేళ్లలో అభివృద్ధి కూడా అంతంత మాత్రంగా జరిగిందనే టాక్ విన్పిస్తోంది. ఇక ఖమ్మం టీఆర్ఎస్ లో గ్రూపు తగాదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది.

Also Read: బాబు అరాచకానికి నేటితో 20ఏళ్లు..!

దీంతో ఈ మూడు ప్రాంతాల్లో టీఆర్ఎస్ గెలుపు అంతా ఈజీ కాదనే టాక్ విన్పిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో విఫలమైతే టీఆర్ఎస్ మరోసారి జెడ్ స్పీడుతో దూసుకెళ్లడం ఖాయంగా కన్పిస్తోంది. కరోనా ఎఫెక్ట్.. వరదలతో టీఆర్ఎస్ పై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను ప్రతిపక్షాలు ఏమేరకు క్యాష్ చేసుకుంటాయనే దానిపైనే ఆ పార్టీల విజయావకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈసారైనా ప్రతిపక్షాలు కారు స్పీడుకు బ్రేకులు వేస్తాయో లేదో వేచి చూడాల్సిందే..!

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ హక్కు రాష్ట్రాలదే… సుప్రీం కీలక వ్యాఖ్యలు…?

దేశంలోని ప్రజల మధ్య ఎక్కువగా చర్చ జరిగే అంశాల్లో రిజర్వేషన్లు ఒకటి. ఈ రిజర్వేషన్ల విషయంలో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. ఈ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీం కోర్టు నిన్న కీలక వ్యాఖ్యలు చేసింది. 2004లో పంజాబ్ హైకోర్టు విద్య, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు , ఎస్సీ ఎస్టీల వర్గీకరణ గురించి ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాలని సుప్రీం నిర్ణయించింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం పంజాబ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో విభేదించింది.

రాష్ట్రాలకు ఎస్సీ ఎస్టీల వర్గీకరణ, వెనుకబడ్డ కులాలకు రిజర్వేషన్లు కల్పించే అధికారం ఉందని పేర్కొంది. ఇప్పటివరకు పార్లమెంట్ కు మాత్రమే ఎస్సీ ఎస్టీల వర్గీకరణకు సంబంధించిన అధికారం ఉండేది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ అధికారం లేదని 2005 సంవత్సరంలో ఈవీ చిన్నయ్య వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ’ కేసులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. అయితే రెండూ ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనాలే కావడంతో బెంచ్‌ ఇచ్చిన తీర్పు తక్షణం అమలు కాదని తెలుస్తోంది.

ఐదు మందే సభ్యులు ఉన్న ధర్మాసనానికి తీర్పును సమీక్షించే అధికారం లేనందు వల్ల దాన్ని ఏడుగురు లేదా అంతకంటే ఎక్కువమంది సభ్యులు ఉన్న ధర్మాసానానికి పంపాలని ప్రధాన న్యాయమూర్తి బోబ్డేను కోరింది. జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం ” ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో అసమానతలు ఉన్నాయని… అట్టడుగు వారికి రిజర్వేషన్ ఫలాలు చేరడం లేదని… వేర్వేరు వర్గాల మధ్య తేడాలను సరిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాలను తీసేయకూడదు” అని పేర్కొంది.

షెడ్యూల్డ్‌ కులాల వారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించారని… ఆర్టికల్‌ 341(2)లో ఉన్న అన్ని ఎస్సీ కులాలకు రిజర్వేషన్ వర్తిస్తుందని… కొన్ని కులాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి కొన్ని కులాలను విస్మరిస్తే జీవితాంతం ఆ కులాలు వెనుకబాటుతనంతోనే మిగిలిపోతాయని ధర్మాసనం పేర్కొంది. పంజాబ్ ప్రభుత్వం మిగిలిన కులాలకు నష్టం జరగకుండా నిమ్నవర్గాల్లో అతి వెనుకబడ్డ కులాలను రిజర్వేషన్లను కల్పించిందని… ఇది సరైన నిర్ణయమేనని అరుణ్ మిశ్రా ధర్మాసనం అభిప్రాయపడింది.

అవిటివాడిగా నారా రోహిత్ !


నారా రోహిత్ కి స్టార్ డమ్ రాలేదు గాని, వైవిధ్యమైన కథానాయకుడు అనే గుర్తింపు మాత్రం వచ్చింది. ఆ మాటకొస్తే తెలుగు హీరోలందరిలో కల్లా మొదటి నుండి వైవిధ్యమైన పాత్రలను కథలను చేస్తూ వస్తోన్న హీరో బహుశా నారా రోహిత్ ఒక్కడే అనుకుంటా. ఒకపక్క హీరోగా చేస్తూనే.. మరోపక్క ‘అప్పట్లో ఒక్కడుండే వాడు, సారొచ్చారు, నీది నాది ఒకే కథ లాంటి ఐదారు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించాడు. తన సినిమాలకు కనీస మార్కెట్ ఉన్నా.. ఎప్పుడూ బడ్జెట్ ను ఓవర్ కాకుండా తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేస్తూ.. తనకంటూ ఓ ఇమేజ్ సాధించిన ఘనత నారా రోహిత్ ది. పైగా పాతికేళ్ల వయసులోనే నలభై ఏళ్ల వ్యక్తిగా కూడా కొన్ని సినిమాల్లో కనిపించే ధైర్యం చేశాడు.

Also Read: ఓటీటీలు సినీ ఇండస్ట్రీకి లాభమా? నష్టమా?

అయితే, పాపం టాలెంట్ ఎంత ఉన్నా.. ఎన్ని మంచి సినిమాలు చేసినా కనీసం సెకెండ్ గ్రేడ్ స్టార్ ల వరుసలో కూడా నారా రోహిత్ నిలబడలేకపోయాడు. దానికి తోడు నారా రోహిత్ కి సాలిడ్ హిట్ వచ్చి చాలా కాలం అయిపోయింది. పైగా సినిమాలను కూడా బాగా తగ్గించేశాడు. చేసిన గత కొన్ని సినిమాలు కూడా భారీ ప్లాప్ లు అయ్యాయి. ఇలా ప్రస్తుతం నారా రోహిత్ వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టలేక, సినిమాల వేగాన్ని కూడా పెంచలేక సతమతమవుతున్నాడు. అయినా నారా రోహిత్ మాత్రం మరో ప్రయోగానికి సిద్ధం అయ్యాడు. బాణం లాంటి వినూత్నమైన చిత్రంతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమైన చెైతన్య దంతులూరి దర్శకత్వంలో నారా రోహిత్ మారో వైవిధ్యమైన సినిమా చేయబోతున్నాడు.

Also Read: మళ్లీ సౌత్‌పై కన్నేసిన తాప్సీ

కరోనా పరిస్థితులు పోయాక ఈ సినిమాని మొదలు పెట్టనున్నారు. అయితే ఈ సినిమా కథ ఒక అవిటివాడు జీవితానికి సంబంధించినది అని, సినిమాలో నారా రోహిత్ అవిటివాడిగా కనిపించబోతున్నాడు అని తెలుస్తోంది. ఇలాంటి కొత్త కథలను ఎన్నుకోవడం అంటే.. అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. నారా రోహిత్ ది ఈ విషయంలో నిజంగా డేరింగే. తెలుగు యంగ్ హీరోల్లో ఈ జనరేషన్ లో ఏ హీరో చేయలేని కథను నారా రోహిత్ లైన్ లో పెట్టాడు. ఇక దర్శకుడిగా తన మొదటి చిత్రమైన ‘బాణం’తో చెైతన్యకు మంచి పేరు వచ్చినా సక్సెస్ మాత్రం రాలేదు. మరి ఈ సారైనా సక్సెస్ కొడతాడేమో చూడాలి.

బన్నీ- కొరటాల.. భరత్‌ అనే నేను ఫార్ములా


నాలుగు చిత్రాలతోనే టాలీవుడ్‌లో టాప్ ‌డైరెక్టర్ గా మారిపోయాడు కొరటాల శివ. ఆ నాలుగూ బ్లాక్‌ బస్టర్స్‌గా నిలిచాయి. పైగా వేటికవే సాటి. సామాజిక స్పృహ ఉన్న కొరటాల తన ప్రతి చిత్రంతో ఓ సోషల్‌ మెసేజ్‌ ఇస్తున్నాడు. అంతేకాదు బలమైన కథ, కమర్షియల్‌ హంగులూ సమపాళ్లలో మేళవించడంలో ఆరితేరారు అని చెప్పొచ్చు. రచయితగా పలు చిత్రాలకు పని చేసిన కొరటాల దర్శకుడిగా తన మార్కు ఉండేలా చూసుకుంటున్నాడు. తొలి చిత్రం ‘మిర్చి’తోనే ఆల్‌రౌండర్ అనిపించుకున్న ఆయన తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్‌ అనే నేను చిత్రాలతో ఇండస్ట్రీని షేక్‌ చేశాడు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో పని చేస్తున్నాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ కోసం ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మెగాస్టార్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్‌ చేసిన మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్ అదిరిపోయింది. ఈ మూవీలో చిరు నక్సలైట్‌గా కనిపిస్తారు. ఆయన ఇలాంటి పాత్ర తొలిసారి చేస్తున్నారు. ఈ మూవీకి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న రామ్‌ చరణ్‌ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో మార్చి వరకూ షూటింగ్‌ జరిగింది. కరోనా కారణంగా చిత్రీకరణ ఆగిపోగా.. తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెట్టాడు కొరటాల.

ఈ క్రమంలో తన ఆరో చిత్రాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో చేస్తున్నట్టు ప్రకటించాడు. రీసెంట్‌గా ‘అల వైకుంఠపురములో’తో బ్లాక్‌బస్టర్ సొంతం చేసుకున్న బన్నీ.. ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే పాన్‌ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ మూవీ షూట్‌ కూడా కరోనా కారణంగా ఆగిపోయింది. ఎలాగో బ్రేక్‌ వచ్చింది కాబట్టి తన 21వ సినిమా.. అదే కొరటాలతో రాబోయే చిత్రంపై దృష్టి పెట్టాడు బన్నీ. హీరోయిన్‌, ఇతర నటులు, సాంకేతిక నిపుణులను ఫైనల్‌ చేసే పనిలో ఉన్నారట బన్నీ, కొరటాల. ఎప్పట్లానే తన మార్కు సోషల్‌ మెసేజ్‌తో ఈ సినిమా ప్లాన్‌ చేస్తున్నాడు శివ. ఇలాంటి సినిమాలో నటించడం బన్నీకి ఇదే తొలిసారి కానుంది. బన్నీ కోసం ‘భరత్‌ అనే నేను’ మూవీ ఫార్ములాను కొరటాల ఫాలో అవుతున్నాడట. ఆ సినిమా లాంటి సాఫ్ట్‌ స్టోరీని అల్లు అర్జున్‌ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా రెడీ చేశాడని టాక్. అలాగే, భరత్‌ అనే నేనుతో టాలీవుడ్‌కు పరిచయం అయిన బాలీవుడ్‌ నటి కియారా ఆడ్వానీనే బన్నీ సరసన కథానాయికగా తీసుకోవాలని కొరటాల ఫిక్సయ్యాడట. భరత్‌ అనే నేను లో మహేశ్‌కు జోడీగా కియారా మెప్పించింది. తన ఆరో చిత్రాన్ని పాన్‌ ఇండియా లెవెల్లో తీయాలని ప్లాన్‌ చేస్తున్న నేపథ్యంలో హీరోయిన్‌గా కియారా అయితేనే బాగుటుందని శివ భావిస్తున్నాడు. అయితే, హిందీలో ఫుల్‌ బిజీగా ఉన్న ఆమె ఈ చిత్రానికి డేట్స్ ఇస్తుందా? లేదా అన్నది తేలాల్సి ఉంది. అలాగే, ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్‌ అందిస్తాడని సమాచారం.

మళ్లీ సౌత్‌పై కన్నేసిన తాప్సీ


‘ఏం సక్కగున్నావ్ రో నా సొట్ట బుగ్గలోడా’ అంటూ పదేళ్ల కిందట మంచు మనోజ్‌ సరసన ‘ఝుమ్మంది నాదం’ సినిమాలో ఆడిపాడి వెండితెరకు పరిచయమైంది తాప్సీ పన్ను. ఢిల్లీలో పుట్టిన ఈ చిన్నది టాలీవుడ్‌తోనే తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఆమెకు తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి. కానీ, చాలా సినిమాలు ఫెయిలవడంతో క్రమంగా చాన్స్‌లు తగ్గాయి. కెరీర్ ఆరంభంలోనే తమిళ్‌, మలయాళ సినిమాలు చేసినా అక్కడా నిరాశే ఎదురైంది. లాభం లేదని ముంబై బాట పట్టింది. తొలుత బాలీవుడ్‌లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఆమె క్రమంగా పుంజుకుంది. అక్షయ్‌ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘బేబీ’తో మంచి హిట్‌ అందుకున్న తాప్సీ కెరీర్ నాలుగేళ్ల కింద వచ్చిన ‘పింక్‌’తో పూర్తిగా టర్న్ అయింది. ఆ సినిమా బ్లాక్‌బస్టర్అవగా… తాప్సీ నటనకు మంచి పేరు వచ్చింది. అంతే అక్కడి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా మారిపోయింది. అదే స్థాయిలో హిట్లు కూడా పడడంతో హిందీలో టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే, కెరీర్ తొలినాళ్లలో మాదిరిగా ఏది పడితే అది చేయకుండా వైవిధ్య కథలనే ఎంచుకోవడం తాప్సీకి చాలా ప్లస్‌ అయింది. బలమైన కథ, నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూ హిట్లు సాధించిందామె.

Also Read: ఐశ్వర్యరాయ్ ద్విపాత్రాభినయమే మెయిన్ హైలైట్

ప్రస్తుతం హిందీలో ఆమె చేతిలో నాలుగు చిత్రాలున్నాయి. ‘హసీన్ దిల్‌రుబా’, ‘శభాష్ మిథూ’, ‘లూప్ లపేటా’, ‘రష్మీరాకెట్’ చిత్రాలు చేస్తోందామె. అయితే, హిందీలో జోరు కొనసాగిస్తూనే కెరీర్ ఆరంభంలో తనకు అవకాశాలు ఇచ్చిన దక్షిణాది భాషలపై మళ్లీ దృష్టి పెట్టిందామె. అక్కడ కూడా తన ప్రతిభ నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్న తాప్సీ తమిళంలో జయం రవితో కలిసి ‘జనగణమన’ అనే సినిమా చేస్తోంది. తాజాగా ఆమె మరో తమిళ చిత్రాన్ని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ నటుడు, డైరెక్టర్ సుందర రాజన్‌ కొడుకు దీపక్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాకు ఆమె కమిట్మెంట్‌ ఇచ్చిందని సమాచారం. ఇందులో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడు. కానీ, అది హీరో క్యారెక్టరా? ప్రత్యేక పాత్ర? అన్నది తేలాల్సి ఉంది. ఈ చిత్రంలో తాప్సీ పక్కా మాస్‌ లుక్‌లో, వీధుల్లో పని చేసే మహిళ పాత్రను పోషిస్తుందట. ఆమె పాత్ర కామెడీ కూడా పండిస్తుందని, ఈ చిత్రం సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో సెట్స్‌పైకి వెళ్తుందని సమాచారం. కథ, తన పాత్ర నచ్చితే దక్షిణాదిలో మరిన్ని చిత్రాలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు తాప్సీ స్పష్టం చేసింది. దాంతో, సౌత్‌లో ఆమె మరిన్ని సినిమాల్లో కనిపించే అవకాశం ఉంది.

మనమే ముందు స్టార్ట్ చేయాలి – బాలయ్య !


సీనియర్ హీరోలు షూట్ అంటే చాలు.. ఎందుకు రిస్క్ అంటూ పోస్ట్ ఫోన్ చేసుకుంటూ పోతున్నారు, ఒక్క బాలయ్య తప్ప. అవును బాలయ్య షూట్ కి రెడీ అంటున్నాడు. దర్శకనిర్మాతలు కొన్నాళ్లు ఆగుదాం అంటున్న.. నో.. షూట్ అందరి కంటే మనమే ముందు స్టార్ట్ చేయాలి అని ఆర్డర్ పాస్ చేసేశాడు. మొత్తంమీద బాలయ్య షూటింగ్ స్టార్ట్ చేసేదానిలో కూడా తోటి హీరోలతో పోటీ పడుతున్నాడు. మరి బాలయ్య అంతే.. ఒక్కసారి ముహూర్తం పెట్టుకుని ఫిక్స్ అయ్యాడు అంటే.. ఇక ఆ పని అయిపోవాల్సిందే. ఎవరు ఎన్ని చెప్పినా, ఏం జరిగినా వెనుకడుగు వేయడం బాలయ్య కెరీర్ లోనే లేదు. ఏది ఏమైనా బాలయ్య వచ్చే సోమవారం నుండి షూట్ చేయడానికి టైం ఫిక్స్ చేశాడు. రామోజీ ఫిల్మ్ సిటీలోని విలేజీ సెట్ లో షూట్ స్టార్ట్ కానుంది.

Also Read: ఓటీటీలు సినీ ఇండస్ట్రీకి లాభమా? నష్టమా?

దర్శకుడు బోయపాటి శ్రీనుకి కూడా ఇప్పుడు షూట్ చేయడం ఇష్టం లేదట.. ప్రస్తుతం కరోనా ప్రభావం ఇంకా ఎక్కువగానే ఉంది. సరే.. రిస్క్ చేసి షూట్ స్టార్ట్ చేసిన మిగిలిన నటీనటులు షూట్ కి వస్తారని నమ్మకం లేదు. మరోవైపు ఇప్పుడే షూట్ వద్దు అంటూ కొంతమంది ఆర్టిస్ట్ లు బోయపాటికి పర్సనల్ గా ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారట. కానీ, షూటింగ్ విషయం బోయపాటి చేతిలో కూడా ఏమిలేదు. బాలయ్య బాబు డిసైడ్ చేశాడు. దీనికి తోడు రెండు సంవత్సరాల నుండి వెతుకుతున్నా ఇంతవరకూ బాలయ్య బాబుకు మెయిన్ హీరోయిన్ దొరకలేదు. ఆయితే కేరళ నుండి ఒక కొత్త హీరోయిన్ ను పట్టుకొచ్చారు. ఆమె కూడా బాలయ్య బాబు పక్కన సరిగ్గా సెట్ అవ్వట్లేదని రూమర్స్ వినిపిస్తున్నాయి.

Also Read: ఐశ్వర్యరాయ్ ద్విపాత్రాభినయమే మెయిన్ హైలైట్

మరి బోయపాటి తెలిసిన హీరోయిన్ కోసం ప్రయత్నాలు చేస్తాడో లేక.. ఆ కొత్త అమ్మాయినే తన శైలిలో ప్రెజెంట్ చేస్తాడా అనేది చూడాలి. ఒకటి మాత్రం స్పష్టంగా అర్ధమవుతుంది. నటీనటులు వచ్చినా రాకపోయినా.. తనకి మాత్రమే సంబంధించిన సోలో సీన్స్ ను అయినా బాలయ్య బాబు షూట్ చేయడం పక్కా. వచ్చే సంక్రాంతికి తన సినిమాను రిలీజ్ చేయాలనేది బాలయ్య ప్లాన్. అయితే ఒకపక్క కరోనా మహమ్మారి దెబ్బకు దేశవ్యాప్తంగా సినీ లోకం అల్లాడిపోతూ ఉంది. బాలయ్య తోటి హీరోలు వెంకీ, చిరు లాంటి స్టార్ హీరోలందరూ ఈ సంవత్సరం మొత్తం తమ షూటింగ్ షెడ్యూల్స్ ను మరియు విదేశీ షెడ్యూల్‌ లను వాయిదా కూడా వేసుకున్నారు.

‘గాల్లో’ ఎగరాలంటే మాస్కు ఉండాల్సిందే..!


దేశంలో కరోనా ఎంట్రీతో పరిస్థితులన్నీ మారిపోయాయి. మార్చిలో కేంద్రం లాక్డౌన్ విధించడంతో ప్రజారవాణా స్తంభించిపోయింది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. క్రమేణ కేంద్రం లాక్డౌన్లో సడలింపులు ఇవ్వడంతో ఇప్పుడిప్పుడు ప్రజారవాణా కోలుకుంటోంది. ప్రధాన నగరాల్లో బస్సులు, లారీలు, ఇతర వాహనాలు తిరుగుతున్నాయి. రైళ్లు.. విమాన ప్రయాణాలకు మాత్రం కేంద్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

Also Read: అసమ్మతి నేతలపై సోనియా వేటు వేస్తారా?

లాక్డౌన్ కారణంగా విమానరంగం పూర్తిగా దెబ్బతింది. ఈ రంగంలో పనిచేస్తున్న వేలాదిమంది కార్మికులు ఇప్పటికే రోడ్డుపై పడ్డారు. కరోనా కట్టడిలో భాగంగా కేంద్రం మార్చి 23నుంచి విమాన సర్వీసులపై ఆంక్షలు విధించింది. గత కొన్నినెలలుగా ఎక్కడి విమానాలు అక్కడే నిలిచిపోయాయి. తాజాగా ఆన్ లాక్ 4.0లో విమాన సర్వీసులకు అనుమతి లభించనుందని తెలుస్తోంది. దీంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది.

కరోనా విపత్కర పరిస్థితుల్లో మాస్కు ధరించడం తప్పనిసరి అయింది. ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు, మీడియా కరోనా నిబంధనలు పాటించాలని ఎంత చెబుతున్నా కొందరు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇలాంటి వారి వల్ల ఇతరులకు ప్రాణాలు అపాయం పడే అవకాశం ఉంది. దీంతో విమాన ప్రయాణాలు చేసేవారు తప్పనిసరి మాస్కు ధరించాలని డీజీసీఏ స్పష్టం చేసింది. మాస్కు ధరించని ప్రయాణికుడిని నో ఫ్లైయింగ్ జాబితాలో ఉంచాలని అధికారులను ఆదేశించింది.

Also Read: అద్దె ఇళ్లల్లో ఉండేవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుందా?

విమానంలో ప్రయాణికులకు ప్రీ-ప్యాక్డ్ భోజనం.. పానీయలను అందించున్నట్లు డీజీసీఏ పేర్కొంది. ప్రయాణ దూరాన్ని బట్టి ప్రయాణీకులకు ఆహారం అందించనున్నారు. ప్రయాణికులు సింగిల్ యూజ్ డిస్పోజబుల్ ట్రేలు, ప్లేట్లు మాత్రమే వాడాలని సూచించింది. ప్రస్తుతం విధించిన నిబంధనలను అతిక్రమిస్తే ప్రయాణీకులపై చర్యలు తీసుకునే అధికారం ఎయిర్‌లైన్స్, క్యాబిన్ సిబ్బందికి ఉందని డీజీసీఐ స్పష్టం చేసింది. అధికారం ఉందని వెల్లడించింది. కరోనాతో గాలిలో ప్రాణం పోకుండా.. గాలి(విమానం)లో ప్రయాణించాలంటే మాస్కు తప్పనిసరి అని పలువురు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

జై కేటీఆర్‌‌.. ఆయనే మా సీఎం


భూమి కోసం.. భుక్తి కోసం.. పేద ప్రజల విముక్తి కోసమంటూ ఎర్రజెండాలు పట్టిన కామ్రేడ్స్‌ ఇప్పుడు కేటీఆర్‌‌ పాట ఎందుకు పాడుతున్నట్లు..? ఆయనపై ఎందుకంత ప్రేమ పుట్టుకొచ్చినట్లు..? ప్రజా ఉద్యమాలే ఎజెండాగా పోరాటాలు సాగించే లెఫ్ట్‌ పార్టీలు ఇప్పుడు కేటీఆర్‌‌ సారే సీఎంగా రైట్‌ అని ఎందుకు అంటున్నాయి..? కేటీఆర్‌‌ సీఎం అయితే వీరికి వచ్చే ప్రయోజనం ఏంటి..? మొదటి నుంచి ప్రభుత్వంపై దూకుడుగా ఉండి.. ఇప్పుడు లెటర్ల వరకే ఎందుకు పరిమితం అయ్యారు..? లెటర్ల ద్వారా సమస్యలు పరిష్కారం కావని వారికి తెలియదా..? పోరాటాలను ఎందుకు పక్కనపెట్టినట్లు..? ప్రభుత్వంతో సామరస్యపూర్వకంగా ఉండి ఏం చేద్దామని..? తెలంగాణలో సుత్తి.. కొడవలిని గులాబీతో జతచేద్దామనా..?

Also Read: బాబు అరాచకానికి నేటితో 20ఏళ్లు..!

సీపీఐ.. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా.. అదొక జాతీయ పార్టీ. ఎందరో వృద్ధండులు.. మరెందరో అనుభవశాలీలు పార్టీలో ఉన్నారు. దశాబ్దాల చరిత్ర. కానీ.. ఇప్పుడు ఉనికి కోల్పోయి పరువు దిగజార్చుకొని తప్పటడుగులు వేస్తోంది. ప్రజాపోరాటాల్లో ఎప్పుడూ ముందుండే వీరు ఇప్పుడు వెనకడుగు వేశారు. సమస్యలపై ప్రజల్లోకి వచ్చి పోరాడే వీరు ఇప్పుడు లెటర్ల ఉద్యమం చేస్తున్నారు. కరోనా టైంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు.. ప్రభుత్వ వైఫల్యాలు చెప్పేందుకు ఉద్యమించకపోగా కేవలం లెటర్లు రాసి చేతులు దులుపుకున్నారు. దీనిపై ఇప్పటికే ఎన్నో రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వంతో వీరేమైనా జత కడుతున్నారా అని విమర్శలూ వస్తున్నాయి.

ఎన్నికల్లో కేసీఆర్‌‌ను గద్దె దించడమే లక్ష్యంగా.. టీఆర్‌‌ఎస్‌ పార్టీని ఓడించడమే టార్గెట్‌గా పెట్టుకొని ప్రతిపక్షాలు, మిత్రపక్షాలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఈ మహాకూటమి కూర్పునకు ప్రధాన కారణం కూడా సీపీఐనే. మళ్లీ ఆ కూటమి నుంచి బయటకు వచ్చింది కూడా సీపీఐనే. దీనిపైనా ఎన్నో విమర్శలు మూటగట్టుకున్నారు. మొన్నటి హుజూర్‌‌నగర్‌‌ ఉప ఎన్నికలోనూ గులాబీ పార్టీతో జతకట్టి తెలంగాణ సమాజానికి పెద్ద షాక్‌ ఇచ్చారు. ప్రజాగ్రహంతో తమ వైఖరిని మార్చుకొని ఎట్టకేలకు మద్దతును ఉపసంహరించుకుని చారిత్రక తప్పిదం నుంచి తప్పించుకున్నామని పార్టీ భావించింది. కానీ.. ఆ మచ్చ పార్టీని ఇంకా వీడడం లేదు.

Also Read: ‘కలెక్టర్ల’కు మంగళం పాడుతున్న కేసీఆర్

అప్పటి నుంచి చల్లబడ్డ పార్టీ.. ఇప్పుడు మెల్లమెల్లగా కేటీఆర్‌‌ పేరు జపం చేస్తోంది. ఎందుకంటే.. కేసీఆర్‌‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని, తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్‌‌ అని. కేబినెట్‌ మంత్రులే దీనిపై తమదైన లీకులు ఇస్తూ.. ప్రచారాలు కల్పిస్తున్నా ఇతర పార్టీల నుంచి పెద్దగా ఏ కామెంట్స్‌ లేవు. కానీ.. సీపీఐ మాత్రం శుభపరిణామం అన్నట్లు వెల్‌కం చెబుతోంది. ఏకంగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ మాత్రం కేటీఆర్‌‌ సీఎం కావడాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటించేశారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు మెరుగుపడాలంటే యువకుడైన కేటీఆర్‌‌కు బాధ్యతలు అప్పగిస్తే మంచిదంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు కేటీఆర్‌‌ పార్టీ వర్కింగ్‌ అయినప్పటికీ ప్రభుత్వానికి కూడా వర్కింగ్‌ సీఎం అన్నట్లు భావించిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రజా సమస్యలపై కేటీఆర్‌కు లేఖ రాస్తా అని ప్రకటించారు. వీరి మాటలు విన్న రాజకీయ విశ్లేషకులు కామ్రేడ్స్‌ రూటు మార్చినట్లుగా విమర్శలు చేస్తున్నారు. వీరి పంతం చూస్తుంటే కేటీఆర్‌‌ని సీఎం చేసే దాకా వదిలేలా లేరంటూ సోషల్‌ మీడియాలో సెటైర్లు కూడా ఇబ్బడిముబ్బడిగా పడుతూనే ఉన్నాయి. లెఫ్ట్‌ పార్టీలు ప్రధాన పార్టీలకు తోక పార్టీలా మారుతున్నాయని ట్రోల్‌ అవుతూనే ఉన్నాయి.

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. కరోనా విధుల్లో ఉన్న వైద్యులు మరణిస్తే?

ఏపీలో కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతుంటే ఏపీలో మాత్రం 9,000కు అటూఇటుగా నమోదవుతున్న కేసులు ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. వైరస్ బారిన పడి కరోనా వారియర్స్ అయిన వైద్యులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది మృత్యువాత పడుతున్నారు.

కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు ఎక్కువగా రాష్ట్రంలో వైరస్ బారిన పడుతున్నారని తెలుస్తోంది. కొందరు వైరస్ బారిన పడి మృత్యువాత పడుతున్నారు. దీంతో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఎవరైనా వైరస్ బారిన పడి మృతి చెందితే 30 రోజుల్లో వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఏ ఆస్పత్రిలో వైద్యుడు మరణించాడో ఆ ఆస్పత్రి సూపరిండెంట్ మృతి చెందిన వైద్యుడి వివరాలను వెంటనే పంపించాలని పేర్కొంది. వివరాలు అందిన వెంటనే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 10,621 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,93,090కు చేరగా 3633 మంది మృతి చెందారు. రాష్త్రంలో ప్రస్తుతం 94,209 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఓటీటీలు సినీ ఇండస్ట్రీకి లాభమా? నష్టమా?


కరోనా మహమ్మారి ఈ శతాబ్దపు అతిపెద్ద ఉత్పాతంగా చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్నిరకాల వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసిన వైరస్‌ మహమ్మారి మనదేశంలోనూ తీవ్ర ప్రభావమే చూపిస్తోంది. 2020 ఫిబ్రవరి తర్వాత దేశంలోకి ప్రవేశించిన వైరస్‌ క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరించింది. కేంద్రం అప్రమత్తమై మార్చి నుంచి కొవిడ్‌ కట్టడి కోసం లాక్‌డౌన్‌ అమలుచేసింది. లాక్‌డౌన్‌ వల్ల అన్ని రంగాల మాదిరిగానే తెలుగు చిత్రసీమ దారుణంగా దెబ్బతింది. ఓ అంచనా ప్రకారం బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండిల్‌వుడ్‌ మిగతా ప్రాంతీయ చిత్రాలను కలుపుకుంటే దాదాపు జులై నాటికే 5 వేల కోట్ల రూపాయల వ్యాపారం ఆగిపోయి చిత్రసీమ మీద ఆధారపడ్డ ప్రతిఒక్కరూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా షూటింగ్‌లు ఆగిపోవడంతో పాటు సినిమా థియేటర్లు మూతపడ్డాయి. అప్పటికే విడుదలకు సిద్ధమైన సినిమాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో OTT ఇటీవల బహుళప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరుచుకోకపోవడం..ఒకవేళ ఆంక్షలతో ఓపెనైనా…కరోనా భయంతో ప్రేక్షకులు మునుపటిలా వస్తారా అనే సందేహాలు సినీ పరిశ్రమ పెద్దలను వెంటాడుతున్నాయి. అందుకే చిన్న నిర్మాతలు సినిమా నిర్మాణం కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలభారం భరించలేక OTT వేదికగా సినిమాలను విడుదల చేస్తున్నారు. ఆ కోవలోనే ‘‘అసలేం జరిగింది, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’’ తదితర తెలుగు చిత్రాలను OTTలోనే విడుదల చేశారు. ఇంతకీ OTT అంటే ఓవర్‌ది టాప్‌. టీవీ, సినిమాకు మించి హైస్పీడ్‌తో ఇంటర్నెట్‌ ఆధారంగా నడిచే సమాంతర వ్యవస్థ. మొదట్లో నిర్మాతలు తపటటాయించినా…క్రమంగా OTTల వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం OTT ప్లాట్‌ఫామ్స్‌గా నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, హాట్‌స్టార్‌, ఆహా ఉన్నాయి.

Also Read: 2 లక్షలు కూడా ఎక్కువేనట.. పాపం పవన్‌ హీరోయిన్‌ !

*ఓటీటీలతో ఎవరికి మేలు!

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో చిన్న నిర్మాతలు ఆర్థిక భారం భరించలేక OTTల వైపు మొగ్గుచూపుతున్నా పెద్ద నిర్మాతలు మాత్రం వెనకడుగు వేస్తున్నారు. సినిమా నిర్మాణంపై తాము పెట్టిన ఖర్చు OTTల ద్వారా రాదని వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ఆ కోవలోనే జూనియర్ NTR,రామ్‌చరణ్‌ ప్రధాన తారగణంగా రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR, కొరటాల శివదర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రాలు థియేటర్లలోనే విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుగుసినీవర్గాల సమాచారం. భారీ హంగులతో సిద్ధమవుతున్న చిత్రాలు థియేటర్లలోనైతేనే ప్రేక్షకులు ఆ అనుభూతిని ఆస్వాదిస్తారనే కోణంలోనూ ఆలోచిస్తున్నారు.

ఐతే ఇక్కడ చెప్పుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయమేమిటంటే చిన్న చిత్రాలనూ OTT నిర్వాహకులు చాలా తక్కువరేటుకే అడుగుతున్నారని సమాచారం. గత్యంతరం లేకనే వచ్చినకాడికి చాల్లే ఇక వడ్డీల భార మోయలేమనే ధోరణిలో చిన్న నిర్మాతలు OTT ప్లాట్‌ఫామ్స్‌పై విడుదల చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లకే పరిమితమైన ప్రేక్షకులు అరచేతిలో సినిమాలు చూడటాన్ని ప్రస్తుతానికి బాగానే ఆస్వాదిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నాక… ఆ స్థాయిలో రిసీవ్‌ చేసుకుంటారా లేదా థియేటర్ల వైపే పరిగెడతారా అనేది ప్రస్తుతం ఉత్కంఠ కలిగిస్తోంది.

· దిల్‌ రాజుకు కలిసొచ్చిన ఓటీటీ

నాని, సుధీర్‌ బాబు, నివేదాథామస్‌, అదితిరావు హైదరీ సూపర్‌ క్యాస్టింగ్ తో‌ వైవిధ్య దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్‌ లో వస్తున్న సినిమా భారీ బడ్జెట్ తో రూపొందింది. నాని నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర అనే అంచనాలతో తెరకెక్కిన V సినిమా భారీ హైప్‌ క్రియేట్‌ చేసింది. తీరా రిలీజ్‌ డేట్‌ వచ్చేసరికి కరోనా, తదనంతరం లాక్‌డౌన్‌ వచ్చింది. అమెజాన్‌ ప్రైమ్‌ నాని సినిమాను ఏకంగా అనూహ్యరీతిలో 42 కోట్లు పెట్టి కొనేసింది. దిల్‌రాజు బృందం 30 కోట్లతో తెరకెక్కించగా శాటిలైట్‌ హక్కుల ద్వారా మరో పది 15 కోట్లు దక్కుతాయని భావిస్తున్నారు. అన్ని బేరాలు కుదిరి వర్కవుటైనందున చివరకు సెప్టెంబర్‌ 5న అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ కానుంది. ఏ స్థాయి సినిమానైనా మేం కొంటాం అంటూ అంతేకాదు ఈ సినిమాలు కొనే పోటీలో మేమంటే మేమే… ఇంకెవరూ పోటీలేరనే సందేశం ఇవ్వాలనే అమెజాన్‌ ప్రైమ్‌ అంత భారీ ధర ఆఫర్‌ చేసినట్లు టాలీవుడ్‌ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇలా అన్ని సినిమాలకు ఇంత ధర వస్తుందని అనుకోవడం పూర్తి అపోహలే.

Also Read: మాకు కరోనా రాలేదు.. దయచేసి వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్దు !

· ఇక వరుస కట్టడమేనా…

బాహుబలి-2 తర్వాత అనుష్క నటించిన చిత్రం నిశ్సబ్దం కూడా దాదాపుగా OTTలోనే విడుదలయ్యేందుకు ఒప్పందాలు అయిపోయాయి. ఇప్పటికే బాలీవుడ్‌లో గుంజన్‌ సక్సేనా వంటి సినిమాల్ని నేరుగా ఓటీటీ వేదికగానే రిలీజ్‌ చేస్తున్నారు. తమిళ నిర్మాతల ఆలోచనసరళి మారిపోయింది. కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య సూరారై పొత్రు సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. కొందరు దర్శకులు, నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేసినా…ఖాతరు చేయకుండా ముందుకే వెళ్లారు. అమెజాన్‌ గనుక V స్థాయిలో మంచి రేట్‌ ఆఫర్‌ చేస్తే మన తెలుగు సినిమాలూ ప్రైమ్‌లో వరుస గడతాయి. ఆ రేంజ్‌లో హాట్‌స్టార్‌, ఆహా ఎలాగూ ఇవ్వలేవు. ఇక నెట్‌ఫ్లిక్స్‌ సొంత సినిమాలకు తప్ప వేటికీ ప్రాధాన్యం ఇవ్వదు. అసలు తెలుగు సినిమాలు దానికి ఆనవు కూడా!! ఇంకా కొందరు బడా నిర్మాతలు మాత్రం కమర్షియల్‌ సినిమాలు ఓటీటీలో విడుదల చేస్తే అంత మేలు కలగదు. చిత్రానికి సంబంధించిన కాపీరైట్స్‌ మొత్తం డిజిటల్‌ తెర వారికే సొంతవుతాయని చెబుతున్నారు. దర్శకులు , నిర్మాతలు సొంతంగా నిర్మించుకోవడానికే ఈ వేదికలు ఉపయోగపడతాయనే అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు. OTTల్లో సినిమాలు రిలీజ్‌ చేస్తే థియేటర్ల కంటే ఎక్కువగానే పైరసీ బారిన పడతామనే ఆందోళన వ్యక్తమవుతోంది.

మొత్తంగా చూస్తే ఏదేమైనా… ఓటీటీ నాణానికి రెండు వైపులా అన్న చందంగా ఉంది. ప్రస్తుత సంక్షోభ సమయంలో మార్పును ఎవరైనా ఆహ్వానించాల్సిందే. ఐతే అది ఎంతవరకు వర్కవుట్‌ అవుతుందేనే లెక్కల్లో తెలుగు సినీ బడా నిర్మాతలు, దర్శకదిగ్గజాలు ఉన్నారు. ఇప్పటికైతే చిన్న చిత్రాలు అనివార్యంగా ఓటీటీ, ఏటీటీలో రిలీజ్‌ చేసేందుకే రెడీ అయిపోతున్నారు. పెద్ద నిర్మాతలు మాత్రం ఇంకా వేచిచూసే ధోరణిలోనే ఉన్నారు. అంతిమంగా తెలుగు చిత్రసీమను ఓటీటీల వ్యవస్థ ఎటువైపు నడిపిస్తుందో వేచిచూద్దాం!.

ఐశ్వర్యరాయ్ ద్విపాత్రాభినయమే మెయిన్ హైలైట్


క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నంకు హీరోయిన్స్ ను బాగా చూపిస్తాడు అనే నేమ్ ఉంది. మణిరత్నం సినిమాల్లో నటించిన హీరోయిన్స్ అందరూ తమ కెరీర్ ల్లో ఉత్తమ నటి అనిపించుకున్నవారే. అంతగా మణిరత్నం వారి నుండి నటనను రాబట్టుకుంటాడు. ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ సినీ కెరీర్ ఈ రోజు ఈ స్థాయిలో ఉంది అంటే.. దానికి మణిరత్నం తీసిన ఇద్దరు సినిమానే. ఆ సినిమాతోనే ఐశ్వర్య రాయ్ పాపులారిటీ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. బాలీవుడ్ సినిమాలు వెతుక్కుంటూ వచ్చేలా ఐశ్వర్య రాయ్ ను మణిరత్నం చాలా బాగా ప్రెజెంట్ చేసాడు ఆ సినిమాలో. మళ్లీ ఆ రేంజ్ లో ఐశ్వర్యరాయ్ ని చూపించబోతున్నాడు ఈ క్లాసిక్ డైరెక్టర్.

Also Read: 2 లక్షలు కూడా ఎక్కువేనట.. పాపం పవన్‌ హీరోయిన్‌

కాగా మణిరత్నం ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’ అనే సినిమాని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా లేకపోయి ఉంటే.. ఈ పాటికి ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉండేది. ఇక ఈ సినిమాలోనే ఐశ్వర్యరాయ్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. డిసెంబర్ లో జరగబోయే షూట్ లో ఐశ్వర్యరాయ్ కూడా పాల్గొనబోతుందట. ఇంతకీ ఐశ్వర్యరాయ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించట్లేదు. ఆమె ద్విపాత్రాభినయం చేయనుంది. ఆ రెండు పాత్రల్లో ఒక పాత్ర నెగెటివ్ షేడ్స్ ఉన్న నందిని పాత్ర కాగా మరో పాత్ర ఆమె తల్లి పాత్ర మందాకినీ దేవి పాత్ర అట. ఈ పాత్రలు రెండు సినిమాలో మెయిన్ హైలైట్ అట.

ఈ సినిమాలోనే ఎంతో కీలకమైన పాత్రలుగా ఉండే ఈ పాత్రల కోసం ఐశ్వర్యరాయ్ బరువు కూడా పెరగనుంది. అయితే ఐశ్వర్యరాయ్ తల్లి పాత్రకు సినిమాలో ఎక్కడా డైలాగ్స్ ఉండవట. అలాగే నందిని పాత్ర ఎంతో ఆవేశపూరితంగా ఉంటుందని, అలాగే కథకు అనుగుణంగా ఓ రొమాంటిక్ సాంగ్ కూడా ఉంటుందని.. ఈ సాంగ్ లో కాస్త బోల్డ్ గా కనిపించడానికి ఐశ్వర్యారాయ్ కూడా అంగీకారాన్ని తెలిపిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రెహమాన్ సాంగ్స్ ను కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

Also Read: మాకు కరోనా రాలేదు.. దయచేసి వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్దు !

అలాగే ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి ఈ సినిమాకి ఆర్ట్ డిపార్ట్మెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అన్నట్టు ఈ సినిమాలో జయం రవి, విక్రమ్, కార్తి, మరియు విజయ్ సేతుపతి, అలాగే ప్రత్యేక పాత్రలో డాక్టర్ మోహన్ బాబు నటిస్తున్నారు. ఇలాంటి స్టార్ హీరోలతో పాటు.. త్రిష, అమలాపాల్, ఐశ్వర్య లక్ష్మి లాంటి టాలెంటెడ్ హీరోయిన్స్ కూడా నటిస్తున్నారు. మొత్తానికి భారీ తారాగణంతో మణిరత్నం మరో భారీ సినిమాని చేస్తున్నాడు.

ఏపీ రాజకీయాల్లో సోము వీర్రాజు భారీ స్టెప్


ఏపీలో బీజేపీ బలం సరిపోదని కొత్తగా అధ్యక్షుడైన సోము వీర్రాజు తొందరగానే గ్రహించినట్టున్నారు. ఓ వైపు బలమైన టీడీపీ తొక్కేయాలని చూస్తుండగా.. మరోవైపు అధికార వైసీపీ భీకరంగా ఉంది. ఈ ఇద్దరినీ దాటుకొని ముందుకెళ్లడం ఒక్కడితో కాదని త్వరగానే అర్థమైంది.

Also Read: అదే సీన్.. జగన్ ను ఫాలో అవుతున్న రామోజీ?

ఇటీవల టీడీపీ సోషల్ మీడియా విభాగం.. సోము వీర్రాజును టార్గెట్ చేసి అభాసుపాలుచేసే కుట్రకు తెరతీసిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. లోకల్ పోస్టులు చేస్తే కేసులు పెడుతానని సోము వీర్రాజు హెచ్చరించడంతో ఇప్పుడు విదేశాల్లోని ఫేక్ అకౌంట్ల ద్వారా ఏపీలో సోము వీర్రాజును దెబ్బతీసే పోస్టులు సోషల్ మీడియాలో పెడుతున్నారట.. ఆయనను డమ్మీని చేసే కుట్రలు సాగుతున్నాయట.. దీంతో అలెర్ట్ అయిన సోము వీర్రాజు టీడీపీకి చెక్ పెట్టాలంటే క్షేత్రస్థాయి నుంచి వెళ్లాలని డిసైడ్ అయ్యారని తెలిసింది.

ఏపీలో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా సోము వీర్రాజు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే కుదేలైనా.. అసంతృప్తితో ఉన్న టీడీపీ నేతలను బీజేపీలోకి లాగాలని డిసైడ్ అయ్యాడట.. తెలుగుదేశం పార్టీ కేడర్ ను లక్ష్యంగా చేసుకొని జిల్లా పట్టణ, గ్రామీణ స్థాయిలో చేరికలు చేపట్టి పార్టీని బలోపేతం చేసేందుకు సోము వీర్రాజు కసరత్తు ప్రారంభించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే వీడియో కాన్ఫరెన్స్ లు, టెలీ కాన్ఫరెన్స్ లు చేస్తూ.. పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరిస్తూ యువతను ఆకర్షించే పని మొదలుపెట్టారట..

Also Read: చంద్రబాబుకు కొత్త సమస్య…. సుప్రీంలో అళ్ల స్పెషల్ లీవ్ పిటిషన్….?

ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఏపీ యువతలో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ను వాడుకోవాలని సోము వీర్రాజు ప్లాన్ చేశారట.. బీజేపీతో కలిసి పనిచేస్తున్న జనసేనను కలుపుకు పోవాలని సోము కీలక నిర్ణయం తీసుకున్నారు.బీజేపీ-జనసేన ఒకటిగా ఉంటే బలోపేతం కావచ్చని.. దీన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.

బలమైన తెలుగుదేశంను నీరుగార్చాలంటే ఇవన్నీ చేయాలని.. అందరితో కలిసి పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయని సోము వీర్రాజు భావిస్తున్నారు.

-ఎన్నం