Home Blog Page 8345

2 లక్షలు కూడా ఎక్కువేనట.. పాపం పవన్‌ హీరోయిన్‌


చిత్ర పరిశ్రమ అంటేనే అనిశ్చితికి మారుపేరు. అదృష్టం ఎవరివైపు ఉంటుందో.. ఎంతసేపు ఉంటుందో తెలియదు. ఓవర్నైట్‌లో స్టార్డమ్‌ వస్తుంది. ఒక్క ఫ్లాప్‌ తో ఆ స్టార్ వాల్యూ నేలకు పడిపోతుంది. అప్పటిదాకా గోల్డెన్‌ హ్యాండ్‌ అనుకున్నవాళ్లపైనే ఐరెన్‌ లెగ్‌ అన్న ముద్ర పడుతుంది. ఇలాంటి వాళ్లకు యువ హీరోయిన్‌ అను ఇమాన్యుయెల్‌ను ఉదాహరణగా చెప్పొచ్చు. అమెరికాలో పుట్టిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ 2011లోనే పరిశ్రమలో అడుగు పెట్టింది. స్వప్న సంచారి అనే మలయాళ సినిమాతో అరంగేట్రం చేసింది. కానీ, రెండో అవకాశం కోసం ఐదేళ్లు ఎదురు చూసింది. తెలుగులో నాని సరసన ‘మజ్ఞు’తో టాలీవుడ్‌కు పరిచయం అయింది. అక్కడితో ఆమె లైఫ్‌ టర్న్‌ అయింది. తెలుగులో వరుస అవకాశాలు సొంతమయ్యాయి. కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్‌ సినిమాలు చేసింది. చాలా తక్కువ టైమ్‌లోనే ఏకంగా పవన్ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌ సరసన నటించే చాన్స్‌ కొట్టేసింది. కానీ, రెండేళ్ల కిందట వచ్చిన అజ్ఞాతవాసి, నా పేరు శివ సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న శైలజా రెడ్డి అల్లుడు కూడా బోల్తా కొట్టింది. దెబ్బకు అనుపై ఐరన్‌ లెగ్‌ అనే ముద్ర పడగా అవకాశాలు కరువయ్యాయి. గతేడాది తమిళ్‌లో అడుగు పెట్టినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా వస్తున్న అల్లుడు అదుర్స్‌ మూవీ చేస్తోంది. ఇందులో ఆమె విలన్ భార్య పాత్రను అను పోషిస్తోందని సమాచారం. ఈ సినిమాలో సోనూ సూద్ ప్రతి నాయకుడు. ఇప్పటికే సైడ్‌ యాక్టర్గా, చిన్న చిన్న పాత్రలకు రెడీ అని చెప్పినప్పటికీ ఆమెకు అవకాశాలు రావడం లేదు.

Also Read: మాకు కరోనా రాలేదు.. దయచేసి వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్దు !

లాభం లేదని వెబ్‌ సిరీస్‌లపై దృష్టి పెట్టిందట. ఆహా ఓటీటీకి చెందిన టీమ్‌ అను ఇమాన్యుయెల్‌ను సంప్రదించిందని సమాచారం. ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించే వెబ్‌ సిరీస్‌ కోసం అను డేట్స్‌ అడిగారు. దీనికి అంగీకరించిన అను ఒక్కో ఎపిసోడ్‌కు రూ. రెండు లక్షలు డిమాండ్‌ చేసిందట. వెబ్‌ సిరీస్‌ మహా అయితే ఐదు నుంచి ఏడు ఎపిసోడ్స్‌ ఉంటుంది. ఈ లెక్కన అనుకు గరిష్టంగా 14 లక్షలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు సినిమాకు 30 నుంచి 50 లక్షల దాకా తీసుకున్న అనుకు ఈ రేటు చాలా తక్కువే. డిమాండ్‌ లేకపోవడంతో రెమ్యునరేషన్‌ను బాగా తగ్గించుకుందామె. అయినా సరే ఆహా టీమ్‌ ఎపిసోడ్‌కు రెండు లక్షలు బాగా ఎక్కువ అంటున్నారట. జబర్దస్త్‌ షోతో పాపులర్ అయిన కొంత కమేడియన్లే ఏదైనా ఈవెంట్‌లో పాల్గొంటే రోజుకు లక్ష తీసుకుంటున్నారు. అలాంటి కనీసం నాలుగైదే రోజులు షూట్‌ చేసే వెబ్‌ సిరీస్‌ ఎపిసోడ్‌కు అనుకు రెండు లక్షలు కూడా ఎక్కువే అనడం దురదృష్టకరం.

అదే సీన్.. జగన్ ను ఫాలో అవుతున్న రామోజీ?


జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి నుంచే ‘ఈనాడు’ రామోజీరావు ఆయన్ని ఫాలోవుతున్నారు కదా.. కొత్త ఫాలో అయ్యేది ఏముందీ అంటారా? ఇప్పటివరకు మనం రామోజీరావు సీఎం జగన్ రాజకీయాలను.. సాక్షి మీడియాలను ఫాలో అవుతుంటారని అనుకుంటున్నాం.. కానీ రామోజీ మాత్రం మక్కికీ మక్కీగా జగన్ ఫాలో అవుతున్నారని ఓ సంఘటన ద్వారా తెలుస్తోంది. ఇంతకీ అదెంటో చూద్దాం..!

Also Read: ఆంధ్ర రాజకీయాలు కోర్టుల పాలు, ప్రజలు కష్టాలపాలు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మరి పంజా విసురుతున్న సంగతి తెల్సిందే. దీంతో ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి కరోనా కట్టడికి పకడ్బంధీ చర్యలు చేపడుతున్నారు. దేశంలోనే కరోనా టెస్టుల్లో ఏపీ నెంబర్ వన్ గా నిలిస్తోంది. ఇక ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలు చేస్తూనే ఉన్నారు. ప్రజలు ముఖానికి మాస్కులు ధరించాలి.. చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.. భౌతికదూరం పాటించాలని చెబుతున్నారు. అయితే ఆయన మాత్రం మాస్కు ధరించిన పాపానా పోవడం లేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఏ కార్యక్రమం ప్రారంభించినా.. సమావేశంలో మాట్లాడిన ముఖానికి మాస్కు లేకుండా కన్పిస్తున్నారు.

సీఎం స్థాయిలో వ్యక్తే మాస్కు లేకుండా కార్యక్రమాల్లో పాల్గొనడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై వైసీపీ నేతలు ప్రతిపక్షాలకు ధీటుగా జవాబివ్వడంతో సైలంటయ్యాయి. తాజాగా సీఎం జగన్ స్టైల్ నే రామోజీ కూడా ఫాలో అవుతున్నారనే సైటర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మాస్కులు ధరించకుండా రామోజీరావు ఈటీవీ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడంపై పలువురు నెటిజన్లు ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఓ పత్రిక అధిపతి అయి ఉండి ప్రజలకు ఇచ్చే సందేశం ఇదేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

Also Read: అద్దె ఇళ్లల్లో ఉండేవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుందా?

ఈటీవీ రజతోత్సవ వేడుకల్లో ఈనాడు ఎండీ కిరణ్ ఆయన సతీమణి శైలజా కిరణ్ లు ముఖానికి మాస్కులతో కన్పించారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన రామోజీ మాత్రం ఫొటోల్లో ఎక్కడా మాస్కులతో కన్పించినా పాపానా పోలేదు. దీంతో జగన్ స్టైల్ నే రామోజీ కాపీ కొడుతున్నారంటూ సోషల్ మీడియాలో సైటర్లు పేలుతున్నాయి. సీఎం జగన్, ఈనాడు అధినేత రామోజీలు కరోనాకు అతీతమా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. జగన్, రామోజీ మీమ్స్ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.

చంద్రబాబుకు కొత్త సమస్య…. సుప్రీంలో అళ్ల స్పెషల్ లీవ్ పిటిషన్….?

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కొత్త సమస్యలు మొదలయ్యాయి. గత కొన్ని నెలలుగా గుంటూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ కార్యాలయం గురించి వివాదం కొనసాగుతుండగా తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆళ్ల ఈ పిటిషన్ లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కార్యాలయం నిర్మాణం కోసం అక్రమంగా భూమిని కేటాయించిందని… నిబంధనలు ఉల్లంఘిస్తూ జరిపిన కేటాయింపుల గురించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Also Read : ఆంధ్ర రాజకీయాలు కోర్టుల పాలు, ప్రజలు కష్టాలపాలు

ఆత్మకూరు పరిధిలో ఉన్న 3 ఎకరాల 65 సెంట్ల భూమిని కేటాయిస్తూ 2017 సంవత్సరం జూన్ నెల 22వ తేదీన జారీ చేసిన 228ని సవాల్ చేస్తూ ఆళ్ల తరపు లాయర్ పిటిషన్ ను దాఖలు చేశారు. 2014 – 2019 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ఆత్మకూరులో కార్యాలయ నిర్మాణం కోసం 99 సంవత్సరాల లీజు ప్రాతిపదికన భూమిని కేటాయించిందని నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలకు ఏ విధంగా అనుమతి ఇచ్చారని పిటిషన్‌లో ప్రస్తావించారు.

ఈ విధంగా భూమిని కేటాయించడం సుప్రీంకోర్టు, హైకోర్టు నిర్దేశించిన చట్ట సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. నీటి వనరులు, వాటితో సంబంధం ఉన్న భూములు కేటాయించడంపై నిషేధం అమలులో ఉన్నా నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఏపీ పంచాయతీ రాజ్‌ చట్టం–1994లోని నిబంధనలకు విరుద్ధంగా భూములను కేటాయించారని… భవన అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపినందున తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కోరారు.

Also Read : జగన్ ‘ఆపరేషన్ వైజాగ్’ పై ఉక్కుపాదం మోపిన హైకోర్టు..!

జగన్ ‘ఆపరేషన్ వైజాగ్’ పై ఉక్కుపాదం మోపిన హైకోర్టు..!

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి వరుసగా షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది. నిన్న ఒక్కరోజే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తప్పుబడుతూ ఏడిటి పై సర్కారు వారికి వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ మరొక ఆదేశం జారీ చేసింది. పరిపాలనా రాజధాని వైజాగ్ తరలింపు ప్రక్రియ హైకోర్టు తీవ్రమైన వ్యతిరేకతను కనబరిచింది.

Also Read : చంద్రబాబుకు కొత్త సమస్య…. సుప్రీంలో అళ్ల స్పెషల్ లీవ్ పిటిషన్….?

నిన్ననే సర్కారు వారి గెస్ట్ హౌస్ పైన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన హైకోర్టు అసలు తామిచ్చిన స్టేటస్ కో అమలులో ఉన్నప్పుడు విశాఖలో చిన్న ఇటుక ముక్కను కూడా కదల్చకూడదు అని కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పుడు ‘బిల్డ్ ఏపీ’ పేరుతో విశాఖలో అమ్మదలుచుకున్న భూములపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ఆరు స్థలాల్లో రెండు స్థలాల విషయంలో హైకోర్టు స్టే ఇచ్చింది.

ఇప్పటికే తమ వద్ద విచారణలో ఉన్న పిటిషన్లపై ఒక నిర్ణయం వెలువడే దాకా విశాఖలో ఎటువంటి భూములు అమ్మకూడదు అని తేల్చి చెప్పిన హైకోర్టు ఎప్పుడు స్టే ఇచ్చిన స్థలాలలో చినగదిలి మండలం లోని జిల్లా ట్రైనింగ్ సెంటర్ లో 75 సెంట్లు స్థలం, ఏఆర్ పోలీస్ క్వార్టర్స్ లో ఎకరం స్థలం ఉన్నాయి. హైకోర్టులో గురువారం ఇరు వాదనలు విన్న న్యాయస్థానం ‘బిల్డ్ ఏపీ పేరుతో’ ప్రభుత్వం అమ్మాలనుకున్న స్థలాలపై స్టే విధించింది. అగనంపూడి లో భూముల విక్రయం పైన కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

అంతేకాకుండా గుంటూరు విశాఖ జిల్లాలోని కొన్ని భూములను ‘ఈ-వేలం’ వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న దశలో దీనిపై కూడా పిటిషన్ల పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం ఇటువంటి భూములను మార్కెట్ ధరలకు ప్రైవేటు వ్యక్తులకు లేదా సంస్థలకు విక్రయించాలని భావించింది. దీని ద్వారా ఎంత లోటు బడ్జెట్ లో ఉన్న ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చుకోవాలని వారి ఆలోచన అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభుత్వ భూముల అమ్మకం సరికాదని వాదనలు వినిపిస్తున్న దశలో ఇన్ని చేసిన హైకోర్టు వారు దానిపై కూడా స్టే విధించడం పెద్ద కష్టం కాకపోవచ్చు.

Also Read : ఆంధ్ర రాజకీయాలు కోర్టుల పాలు, ప్రజలు కష్టాలపాలు

బాబు అరాచకానికి నేటితో 20ఏళ్లు..!


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆగస్టు 28 ఓ చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ న్యాయం కోసం రైతులు నాడు రోడ్డెక్కారు. బషీర్ బాగ్ లో వెల్లువెత్తిన ప్రజాగ్రహానికి అణిచివేసేందుకు నాటి సర్కార్ వారిపై కాల్పులు జరిపింది. ఈ సంఘటనలో ముగ్గురు రైతులు అమరులుకాగా.. మరేందరో పోలీసుల లాఠీదెబ్బలు తిని ఆస్పత్రులపాలయ్యారు. ఇది నాటి బాబు పాలనకు మాయని మచ్చగా నిలిచిపోయింది.

Also Read: అద్దె ఇళ్లల్లో ఉండేవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుందా?

2000 సంవత్సరం ఆగస్టు 28న విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ తొమ్మిది వామపక్ష పార్టీలు చేపట్టిన ఉద్యమంలో తీవ్రరూపం దాల్చింది. ఈ ఉద్యమానికి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మద్దతు ఇచ్చారు. ఆగస్టు 28నాటికి బషీర్ బాగ్ చేరుకున్న రైతులు అసెంబ్లీని ముట్టడించేందుకు అటువైపు మరలడంతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసింది. నిరసనకారులు ముందుకు రాకుండా కాల్పులు జరిపడంతో ముగ్గురు బాలస్వామి, విష్ణువర్ధన్, రామకృష్ణలు మృతిచెందారు.

దీనిని నిరసిస్తూ నాటి డిప్యూటి స్పీకర్ గా ఉన్న కేసీఆర్ అప్పటి సీఎం చంద్రబాబుకు సుదీర్ఘ లేఖ రాశారు. విద్యుత్ ఛార్జీల పెంపును ఎండగడుతూ ఉద్యమకారులకు మద్దతు తెలుపుతూ ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమతి పార్టీని స్థాపించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు.

Also Read: ప్రజారోగ్యం కేసీఆర్ సార్ కు పట్టదా?

ఈ సంఘటన జరిగి 20ఏళ్లు పూర్తి కావస్తున్నా నేటికి చంద్రబాబు పాలనకు మాయని మచ్చగా మిగిలిపోయింది. చంద్రబాబుకు రైతులపై ఉన్న ప్రేమకు నిదర్శనంగా బషీర్ బాగ్ సంఘటన నిలిచిపోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి. బాబు అనాలోచిత విధానాలకు ఈ సంఘటన సజీవ సాక్ష్యంగా మిగిలిపోయింది. ఆ తర్వాత కాలంలో బషీర్ బాగ్ వద్ద అమరుల కోసం స్థూపం నిర్మించారు. ఇది నాటి చేదు జ్ఞాపకానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. ప్రజా ఉద్యమాలను ప్రభుత్వాలు ఆపలేవని మరోసారి బషీర్ బాగ్ సంఘటన నిరూపించింది.

‘కలెక్టర్ల’కు మంగళం పాడుతున్న కేసీఆర్


అది బ్రిటీష్ హయాం.. ప్రజల నుంచి పన్నులు వసూలు చేసేందుకు జిల్లాలకు ఒక కలెక్టర్ ను బ్రిటీష్ పాలకులు నియమించారు. ‘కలెక్ట్’ అంటే వసూలు.. అనే అర్థంలో ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే అధికారిగా బ్రిటీష్ వారు ఈ పేరు పెట్టారు. కానీ స్వాతంత్ర్యం అనంతరం మన దేశ పాలకులు కూడా జిల్లాను ఏలే ఐఏఎస్ అధికారులకు ‘కలెక్టర్’ అనే పేరును కొనసాగించారు. కానీ కలెక్టర్ ఇప్పుడు పన్నులు వసూలు చేసే బాధ్యతల్లో లేరు. జిల్లా పరిపాలన అధికారిగా.. మేజిస్ట్రేట్ గా ఉన్నారు. ఆ పాతపేరు ఐఏఎస్ లకు అపవాదు అని తెలంగాణ సీఎం కేసీఆర్ భావించి ‘కలెక్టర్’ అన్న పేరుకు మంగళం పాడేస్తున్నారని తెలిసింది.

Also Read: అద్దె ఇళ్లల్లో ఉండేవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుందా?

సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని ఇప్పటికే నిర్ణయించారు. అధికారుల హోదాలో కూడా మార్పులు, చేర్పులు చేయాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ పేరు ఇకపై జిల్లా మేజిస్ట్రేట్ గా మార్చాలని.. కలెక్టర్ అనే పదాన్ని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాలో ఈ అంశాన్ని చేర్చే విధంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు సచివాలయంలో వేగంగా దస్త్రం రెడీ అవుతోందని తెలిసింది.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెట్టి రెవెన్యూశాఖను ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. అవినీతికి నిలయమైన వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలనే ఎత్తివేయాలని నిర్ణయించారు. వారిని వేరే శాఖల్లో విలీనం చేస్తారు. ఈ క్రమంలోనే మొత్తం రెవెన్యూ శాఖలో ఆన్ లైన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు.

Also Read: ప్రజారోగ్యం కేసీఆర్ సార్ కు పట్టదా?

ఇక నుంచి రిజిస్ట్రేషన్ శాఖ చేసే పనులన్నీ తహసీల్దార్లకే అప్పగిస్తారు. కీలకమైన భూ, పరిపాలన వ్యవస్థలు, ప్రజలకు అవరసరమైన సర్టిఫికెట్లు.. ఇతర పనుల పర్యవేక్షణ తహసీల్దార్లకే అప్పగించనున్నారు. ఇక తప్పు జరిగితే తహసీల్దార్ల పోస్టులు కూడా ఊస్ట్ అయ్యేలా రెవెన్యూ చట్టంలో కఠిన నిబంధనలు పొందుపరచబోతున్నట్టు తెలుస్తోంది.

-ఎన్నం

అసమ్మతి నేతలపై సోనియా వేటు వేస్తారా?


కాంగ్రెస్ అధ్యక్ష పదవీని చేపట్టేందుకు సోనియాగాంధీ తనయుడు రాహుల్ గాంధీ విముఖత చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే తిరిగి కొనసాగాల్సి వస్తోంది. సోనియాగాంధీకి వయస్సు పైబడటంతో ఇంతకముందుగా యాక్టివ్ పాలిటిక్స్ చేయడం లేదు. దీంతో ఆమె ఆ పదవీ నుంచి తప్పుకొని రాహుల్ గాంధీకి పదవీ కట్టబెట్టాలని భావించారు. పార్టీలో సీనియర్ల హవానే కొనసాగుతుండటంతో రాహుల్ ఆ పదవీ చేపట్టేందుకు ససేమిరా అంటున్న సంగతి తెల్సిందే.

Also Read: ప్రధానికి లేఖ రాసిన సీఎం జగన్… ఎందుకోసమంటే..?

సోనియా, రాహుల్ గాంధీలు కాంగ్రెస్ అధ్యక్ష పదవీ నుంచి తప్పుకోనున్నారనే ప్రచారం జోరుగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం నుంచి చేజారిపోతుందా? అన్న సందేహాలు కూడా కలిగాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సీనియర్లు మూకుమ్మడిగా లేఖ రాశారు. దీనిలో పార్టీలో నెలకొన్న్ పరిస్థితులు.. పార్టీ ప్రక్షాళన వంటి అనేక కీలక అంశాలను పేర్కొన్నారు. ఈ లేఖపై రాహుల్ గాంధీ సైతం ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెసులోని కొందరు బీజేపీకి పావులుగా మారారనే ఆరోపణలు గుప్పించారు. ఈ పరిణమాల మధ్య కాంగ్రెస్ అధ్యక్ష పదవీని తిరిగి సోనియాగాంధీ చేపట్టాల్సి వచ్చింది.

ఈనేపథ్యంలోనే సోనియాగాంధీ కాంగ్రెసులో అసమ్మతికి కారణమైన లేఖ రాసిన నేతలను కట్టడి చేయనున్నారని తెలుస్తోంది. ఈ లేఖ రాయడం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా? అనే విషయాన్ని తేల్చేందుకు సోనియాగాంధీ కమిటీని వేసినట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కు సోనియా సూచించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్న గులాంనబీ ఆజాద్, డిప్యూటి లీడర్ ఆనంద్ శర్మలను సోనియా పక్కన పెట్టనున్నారనే టాక్ విన్పిస్తోంది.

Also Read: అద్దె ఇళ్లల్లో ఉండేవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుందా?

వీరికి బదులుగా సోనియా రాజకీయ సలహాదారు అయిన అహ్మద్ పటేల్, నమ్మకస్థుడైన కేసీ వేణుగోపాల్ కు రాజ్యసభలో బాధ్యతలు అప్పగించనున్నారనే టాక్ విన్పిస్తోంది. లోక్ సభలోనూ ఇదే తరహాలో కమిటీ నియమించనున్నట్లు తెలస్తోంది. గౌరవ్ గొగోయ్ డిప్యూటి లీడర్ గా, రవ్నీత్ సింగ్ బిట్టును విప్ గా నియమించబోతున్నారట. అయితే తొలుత అసమ్మతి నేతలపై ఎలాంటి చర్యలు ఉండవని స్పష్టం చేసిన అధిష్టానం తాజాగా చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతుండటం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఆ ముగ్గురికి కేసీఆర్ వరం


కొత్త నీరు వస్తుంటే.. పాత నీరు పోతూనే ఉంటుంది. తెలంగాణ రాజకీయంలో కూడా ఒకప్పుడు వెలుగు వెలిగిన నేతలంతా ఇప్పుడు కనుమరుగైపోయారు. అడ్రస్ లేకుండా పోయారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో వారికి పెద్దపీట వేసిన కేసీఆర్ రెండోసారి గెలిచాక కనీసం దగ్గరికి కూడా రానీయడం లేదు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. ఆ టీఆర్ఎస్ సీనియర్లకు పార్టీలో ఎటువంటి పాత్ర లేకుండా పూర్తిగా పక్కనపెట్టేలా చేసింది.

Also Read: ప్రజారోగ్యం కేసీఆర్ సార్ కు పట్టదా?

కానీ ఇప్పుడు కేసీఆర్ పాత సీనియర్లను అక్కున చేర్చుకోవాలని భావిస్తున్నాడట.. ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ తుమ్మల నాగేశ్వరరావు , మాజీ మంత్రులు చందూలాల్, జూపల్లి కృష్ణారావులు ప్రస్తుతం భవిష్యత్ పై బెంగతో స్తబ్దుగా ఉన్నారు. వారిని పునరావాసం కల్పించాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలిసింది.

తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసి మరీ జూపల్లి కృష్ణారావు టీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ వెంట నడిచారు. ఇక కేసీఆర్ స్వయంగా తుమ్మల వద్దకు వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక చందూలాల్ కూడా టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి చేపట్టారు.

ఇలా తెలంగాణ తొలి ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన కీలమైన ముగ్గురు నాయకులు తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. వారి తలరాత మారిపోయింది. ప్రస్తుతం తుమ్మల, చందులాల్ చాలా నిశ్శబ్ధంగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. ఇక జూపల్లి మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్లు తన అనుచరులకు ఇవ్వలేదని తిరుగుబాటు ఎగురవేశారు. ఎమ్మెల్యే బలపరిచిన అభ్యర్థులను ఓడించాడు.

Also Read: శకుంతలా దేవి రికార్డును బ్రేక్ చేసిన హైదరాబాదీ

ఈ ముగ్గురు సీనియర్లు ఇప్పుడు రాజకీయ పునారావాసం కోసం ఎదురుచూస్తున్నారని చెబుతున్నారు. అయితే వీరిలో ఇద్దరు తుమ్మల, చందూలాల్ కు ఎమ్మెల్సీ ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది.జూపల్లికి నామినేట్ పోస్టు ఇవ్వవచ్చని తెలుస్తోంది.

మాకు కరోనా రాలేదు.. దయచేసి వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్దు !


‘నాంది’ అంటూ అల్ల‌రి న‌రేష్ తన అదృష్టాన్ని వెతుక్కుంటూ చేస్తోన్న తన 57వ చిత్రం ఈ సినిమా. ఇప్ప‌టివ‌ర‌కూ ఎక్కువ శాతం సినిమాల్లో ప్రేక్ష‌కుల‌కు న‌వ్వులు పంచుతూ వ‌చ్చిన అల్లరి నరేష్, ఈ సారి ఏడిపించడానికి సిద్ధం అవుతున్నాడు. గతంలో గమ్యం లాంటి సినిమాలో తన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నా.. ఆ తరువాత మళ్ళీ ఆ రేంజ్ ఎమోషనల్ సినిమా చేయలేదు. ఇన్నేళ్లకు నాంది చేస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్త‌యింది. మిగిలిన బ్యాలెన్స్ షూట్ కూడా పూర్తి చేసి.. ఓటీటీలో తమ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు.

Also Read: ఖాకీ చొక్కా‌ ‌వేస్తున్న మరో మెగా హీరో

అందుకే కరోనా కాలంలో కూడా ఇటీవ‌ల హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ ని కూడా స్టార్ట్ చేశారు. అయితే మూడు రోజులు షూట్ చేశాక సడెన్ గా షూట్ ఆపేశారు. షూటింగ్ ను ఎందుకు ఆపేశారో చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వకపోయే సరికి, ఈ చిత్ర యూనిట్ కు కరోనా సోకిందని అందుకే షూట్ మధ్యలోనే ఆపేశారు అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. మొత్తానికి తాజాగా చిత్ర బృందం ఆ ప్రచారం పై క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి అవాస్తవాలను ద‌య‌చేసి ప్ర‌చారం చేయ‌వ‌ద్ద‌ని, అలాగే ప్రజలు కూడా దయచేసి వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌నీ నాంది మేకర్స్ కోరారు. తాము గత బుధ‌వారం వ‌ర్షం రావ‌డం కారణంగానే మా సినిమా చిత్రీక‌ర‌ణ నిలిపివేసామని.. అంతేగాని వేరే కార‌ణంతో షూటింగ్ ని ఆపలేదని మేకర్స్ స్ప‌ష్టం చేశారు.

Also Read: సుశాంత్ ప్రియురాలు రియా గుట్టు రట్టు?

ఇక గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో బాక్సాపీస్ వద్ద ప్లాప్ హీరోగా సతమతవుతున్న అల్లరి నరేష్ కెరీర్ కి, ఈ నాంది సినిమా అత్యంత కీలకమైనది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి ఉన్నా.. కామెడీ జానర్లో సినిమాలు చేసే నరేష్ మీద ఇలాంటి సీరియస్ క్రైమ్ డ్రామా ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి. అయితే గతంలో అల్లరి నరేష్ ‘నేను, విశాఖ ఎక్స్ ప్రెస్, గమ్యం, శంభో శివ శంభో’ లాంటి ఇంటెన్స్ చిత్రాలను చేశాడు. వాటి వల్ల అల్లరి నరేష్ కెరీర్ కి పెద్దగా ప్రయోజనం అయితే కలగలేదు.

ఆన్‌లైన్‌ క్లాస్‌లు సక్సెస్‌ అయ్యేనా..?


ఎన్నో ఫిర్యాదులు.. మరెన్నో ఆటంకాల మధ్య వచ్చే నెల ఫస్ట్‌ నుంచి స్టూడెంట్లకు ఆన్‌లైన్‌ క్లాస్‌లు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఈనెల 27 నుంచే సార్లు స్కూళ్లకు రావాలని ఆదేశించింది. తొలి రోజు ప్రభుత్వ టీచర్లు పాఠశాలలకు హాజరై 5 నెలలుగా క్లాసుల్లో పేరుకుపోయిన దుమ్ము దులిపి రోజంతా ఖాళీగా కూర్చుకున్నారు. వారు పాఠాలుచెప్పడానికి విద్యార్థులు లేరు. ప్రభుత్వం ఆన్ లైన్ విద్యాబోధన అంటోంది. మరి ఈ ఆన్ క్లాస్‌లు ఎంతవరకు సక్సెస్‌ అవుతాయో..? ప్రభుత్వ టీచర్లకు ఆఫ్ లైన్ లో ఏం పని? అని చాలా మందిలో ప్రశ్న తలెత్తుతోంది. ఆన్‌లైన్‌ తరగతుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారని హైకోర్టు తాజాగా ప్రశ్నించింది. ఆ ప్రశ్నలకు సర్కార్‌‌ కూడా తనదైన రీతిలో సమాధానం ఇచ్చిందనుకోండి. కానీ.. లైవ్‌ క్లాస్‌లకు వెళ్లే సరికి ప్రభుత్వం చెబుతున్న మాటలు ఎలాంటి అవరోధాలు లేకుండా నడుస్తాయా అనేది ఇక్కడ పెద్ద డౌటు!!

Also Read: ప్రజారోగ్యం కేసీఆర్ సార్ కు పట్టదా?

రాష్ట్రంలో వన్‌ బై వన్‌ అన్‌లాక్‌ అమలవుతున్నా.. పెరుగుతున్న కరోనా కేసులతో ఎవరూ బస్సులు ఎక్కేందుకు సాహసించడం లేదు. ఈ క్రమంలో టీచర్లను స్కూళ్లకు రావాలని ప్రభుత్వం చెప్పింది. ఏ టీచర్‌‌ కూడా లోకల్‌గా ఉండి విద్యాబోధన చేసే పరిస్థితిలో లేరు. అలాంటప్పుడు వీరు డైలీ బస్సుల్లో అప్‌ అండ్‌ చేస్తూ చదువులు కొనసాగిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటికి తోడు ఆర్టీసీ మెయిన్‌ రూట్లలోనే బస్సులు నడిపిస్తోంది. మారుమూల పల్లెలకు పంపడం లేదు. జీహెచ్‌ఎంసీలోనూ బస్సులు స్టార్ట్‌ కాలేదు. మరి ఇక్కడ ఉన్న స్కూళ్ల పరిస్థితి ఏంటి..? టీచర్లకు ఆయా స్కూళ్లకు ఎలా చేరుకుంటారు..? ఇంతవరకు దీనిపై ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం అయితే చూపించలేదు.

రాష్ట్రంలో సుమారు 40,597 స్కూల్స్‌ ఉన్నాయి. వీటిలో 58 లక్షలకు పైగా స్టూడెంట్స్‌ చదువుతున్నారు. దీంట్లో ప్రభుత్వ పాఠశాలలు గురుకులాలతో కలిపి 29,370 వరకు ఉన్నాయి. ఇందులో 29.09 లక్షల మంది చదువుతున్నారు. వీరందరికీ యాదగిరి, టీ శాట్‌, లోకల్‌ కేబుల్స్‌ ద్వారా పాఠాలు చెప్పాలని సర్కార్‌‌ నిర్ణయించింది.

ఇంతవరకు బాగానే ఉన్నా.. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల పరిస్థితిని సర్కార్‌‌ అంచనా వేయలేకపోయింది. భద్రాచలం, ఏటూరునాగారం, కొత్తగూడెం, జయశంకర్‌‌ భూపాలపల్లి, ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, నాగర్‌‌కర్నూల్‌ పక్కా ట్రైబల్స్‌ జిల్లాలు. అక్కడ ఉన్న గిరిజనుల ఏ ఒక్క ఇంట్లో కూడా టీవీలు లేవు. మరి వారు చదువుకునేదెలా..? వారి పాఠాలు సాగేదెలా..? టీవీలు కొనే స్థోమత వారికి లేదు. అక్కడికి కేబుల్‌ కనెక్షన్‌ కూడా కష్టమే. ఏజెన్సీ గ్రామాల్లోనూ సుమారు వేల సంఖ్యలోనే విద్యార్థులు ఉన్నారు. వీరితోపాటు పలు పల్లెల్లోని కుటుంబాలకు టీవీలు లేవు. ప్రభుత్వం మరి వీరి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Also Read: శకుంతలా దేవి రికార్డును బ్రేక్ చేసిన హైదరాబాదీ

ఆన్‌లైన్‌లో క్లాస్‌లు వింటున్న టీచర్లు స్టూడెంట్ల ఇండ్లలోకి వెళ్లి పర్యవేక్షించాల్సి ఉంటుంది. అక్కడే వారికేమైనా డౌట్స్‌ ఉంటే సబ్జెక్ట్‌ టీచర్‌‌కి ఫోన్‌ చేసి క్లియర్‌‌ చేయాల్సి ఉంటుంది. అయితే.. ప్రస్తుతం కరోనా కాలం నడుస్తుండడంతో గ్రామాల్లో ప్రజలు వారిని ఇండ్లలోకి రానిస్తారా. అసలు స్టూడెంట్లకు ఆ పాఠాలు ఎంత వరకు అర్థం అవుతాయి. సార్లకు భయపడి అర్థమైనట్లుగా తలలూపుతారా..?

అసలే వర్షాకాలం.. ఆపై ఈదురుగాలులు. గ్రామాల్లో చిన్నగా చినుకులు స్టార్ట్‌ కాగానే కరెంట్‌ పోతుంటుంది. 24 గంటలు కరెంట్‌ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. విలేజ్‌లల్లో మాత్రం ఆ పరిస్థితి లేదు. పాఠాలు‌ వింటుంటే సడన్‌గా కరెంట్‌ పోతే ఆ రోజుకు ఆ స్టూడెంట్‌ పాఠాలు లాస్‌ అవుతాడు. మరి ప్రభుత్వం ఈ ఇబ్బందులను కూడా ఎలా అధిగమిస్తుందో.. ఈ ఆన్ లైన్ పాఠాలు ఎంత సక్సెస్ అవుతాయో చూడాలి మరీ..

ఆంధ్ర రాజకీయాలు కోర్టుల పాలు, ప్రజలు కష్టాలపాలు

భారత రాజ్యాంగం శాసన వ్యవస్థ కు, న్యాయ వ్యవస్థకు , కార్య నిర్వాహక వ్యవస్థకు విధులు విభజించింది. ఎవరి పరిమితుల్లో వాళ్ళు ఉంటేనే ప్రజాస్వామ్యం నాలుగు కాళ్ళ మీద నిలకడగా వుంటుంది. ఏ కాలు బలహీనపడినా ప్రజాస్వామ్యం బలహీనమైనట్లే. ఇందులో నాలుగో కాలు సమాచార వ్యవస్థ. ఇందులో న్యాయ వ్యవస్థ మీద గురుతర బాధ్యత వుంది. ఇరువైపు వాదనలు విని పరిష్కారం చెప్పటం, నేరం చేసినవారికి శిక్ష విధించటం వీటితో పాటు రాజ్యాంగ పరమైన అంశాలపై వివరణ ఇవ్వటం ప్రధాన విధులు. చరిత్రలో శాసన వ్యవస్థ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భిన్నంగా చట్టాలు చేసినప్పుడు వాటిని సరిదిద్దే బృహత్తర బాధ్యత న్యాయ వ్యవస్థ పై వుంది. అలాగే కార్య నిర్వాహక వ్యవస్థ హద్దులు మీరి ప్రవర్తించినప్పుడు దాన్ని అదుపులో పెట్టే బాధ్యత అటు శాసన వ్యవస్థకి, ఇటు న్యాయ వ్యవస్థ కి కూడా వుంది. ఈ విధులపై స్పష్టత ఉన్నప్పటికీ ఈ రాజ్యాంగ వ్యవస్థలు శృతి తప్పిన సంఘటనలు చరిత్రలో చాలా వున్నాయి.

ఇటీవలికాలంలో కోర్టులు ప్రతి విషయం లో జోక్యం చేసుకోవటం చూస్తున్నాము. దానికి తగ్గట్టుగానే ప్రజలు కూడా ప్రతిదానికి కోర్టుల్లో న్యాయం కోరే ధోరణి కూడా పెరిగింది. సివిల్, క్రిమినల్ సమస్యల్లో ఖచ్చితంగా కోర్టులే తీర్పు చెప్పాల్సి వుంది. అలా కాకుండా రోజువారి ప్రజల సమస్యల్లో ప్రభుత్వం నుంచి న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించటం జరుగుతుంది. ఒకవిధంగా చెప్పాలంటే ప్రజలు ప్రభుత్వం ద్వారా ఉపశమనం పొందనప్పుడు కోర్టుల దగ్గరకు చేరుతున్నరనేది వాస్తవం. అయితే సమస్యల్లా కోర్టులు ఇవి తమ పరిమితిలోకి వస్తాయా రావా అనేది చూసుకోకుండా ప్రభుత్వానికి ఆదేశాలిస్తున్నాయి. అంటే రాజ్యాంగం విధించిన గోడల్ని అధిగమించి పనిచేస్తున్నాయని చెప్పాల్సి వుంది. కాకపోతే ఇవి రాజ్యాంగం విధించిన పరిమితుల్లో లేవని చెప్పాల్సింది కూడా కోర్టులే. అందుకే ఈ సున్నితమైన విభజన హద్దులు దాటటం జరుగుతూ వుంది. దీనిపై రాజ్యాంగ నిపుణులు న్యాయ స్థానం అతి చొరవ ( Judicial activism) చూపిస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read : బొత్స మాటలు వింటే నవ్వొస్తుంది… కథలు చిన్నారులకు చెప్పండి!

ఆంధ్ర ప్రదేశ్ వివాదాలు కోర్టుకి 

ఇటీవలి కాలం లో ఆంధ్ర రాజకీయాలన్నీ కోర్టుల చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రతిచిన్నదానికి కోర్టులను ఆశ్రయించటం జరుగుతుంది. ఇది మొదట్లో బాగానే అనిపించినా ముందు ముందు మిగతా వ్యవస్థలు బలహీనపడే అవకాశముంది. ముఖ్యమైన రాజధాని విషయం కోర్టుని ఆశ్రయించటం వరకూ సబబే నైనా ప్రభుత్వ గెస్టు హౌస్ కట్టటం పైన కూడా కోర్టులు జోక్యం చేసుకోవటం అతి చొరవ కిందకే వస్తుంది. నిన్నటి వార్తలు చూస్తే ప్రభుత్వ గెస్టు హౌస్ కి అయిదు ఎకరాలు చాలు కదా ముపై ఎకరాలు ఎందుకు అని కోర్టులు ప్రశ్నిస్తే రేపొద్దున ఒక గెస్టు హౌస్ లో ఎన్ని గదులు ఉండాలో కూడా కోర్టులే నిర్ణయిస్తాయి. ఇది న్యాయ వ్యవస్థ అతి చొరవ కి నిదర్శనం. అంతమాత్రాన ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించకూడదని కాదు. కొన్ని నిర్ణయాలు కోర్టుల పరిధిలోకి ఎలా వస్తాయో అర్ధం కావటంలేదు. ప్రభుత్వం నిజంగా దుబారా చేస్తే అటువంటి నిర్ణయాలను ప్రజలు ప్రశ్నించాలి, దాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి గాని ప్రభుత్వ పరిధిలోని అంశాలను కోర్టులకు బదిలీ చేస్తే ముందు ముందు ఇది ఆనవాయితీగా మారి కార్యనిర్వాహక అధికారాలకు ఆటంకాలు ఏర్పడతాయి. ఇవ్వాళ అధికారం లో వున్న పార్టీ శాశ్వతం కాదు. కానీ ఇటువంటి సంప్రదాయాలు శాశ్వతమయితే రాజ్యాంగం ప్రసాదించిన అధికార విధుల సమతుల్యం దెబ్బతింటుంది.

ఇక రాజధాని విషయానికొస్తే దీనిపై హై కోర్టు త్వరగా విచారణ చేపట్టాలి గానీ వాయిదాలమీద వాయిదాలు వేయటం మంచి సంప్రదాయం కాదు. మనకు నచ్చినా నచ్చక పోయినా రాజధాని అంశం శాసన వ్యవస్థకు సంబంధించిన అంశం. న్యాయ వ్యవస్థ శాసించ జాలదు. రాజధాని ని అమరావతి లో పెట్టాలని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా శాసన వ్యవస్థ కి సంబందించిందే. అటువంటప్పుడు తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని గౌరవించి వుండాల్సింది. పార్టీ లు వేరైనా ప్రభుత్వం అదే కదా. ఆ నిర్ణయం మార్పు మంచి సంప్రదాయం కాదు. కాకపోతే శాసన వ్యవస్థ నే తిరిగి వికేంద్రీకరణ పేరుతో నిర్ణయాన్ని మార్చిన తర్వాత చేయగలిగింది లేదు. ఒకవేళ శాసన మండలి నిర్ణయం సాంకేతికంగా వివాదాస్పదం అయిందనుకున్నా కోర్టులు దానిపై విచారించి త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఇది శాసన వ్యవస్థ కి సంబంధించినదీ, అతి ముఖ్యమైనదీ కాబట్టి. శాసన వ్యవస్థ ప్రజల తరఫున విధాన పరమైన, చట్టపరమైన నిర్ణయాలు తీసుకొనే అత్యున్నత వ్యవస్థ. రాజకీయంగా చూసినా ఈ సాంకేతిక సమస్య నిలబడేది కాదు. ఇంకో సంవత్సరంలో మండలి లో కూడా అధికార పార్టీ మెజారిటీ కి వచ్చే అవకాశముంది. అప్పుడైనా ఈ నిర్ణయం అమలు జరుగుతుంది. కాబట్టి ఎవరికి  నచ్చినా నచ్చక పోయినా అధికార పార్టీ నిర్ణయం అమలు జరుగుతుంది. కాకపోతే కొన్నాళ్లు ఆలస్యమవుతుంది. సమస్యల్లా ఈ రెండు పార్టీల మధ్యలో రైతులు నలిగిపోతున్నారనేదే. ఈ విషయం లో ప్రభుత్వం భేషిజాలకు పోకుండా రైతులతో మాట్లాడి వాళ్లకు ఏ విధంగా అయితే ఆర్ధికంగా ప్రయోజనం కలుగుతుందో ఆ రకమైన అన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలి. రాజధాని విషయం వాయిదాలు పడుతూవుంటే రైతుల సమస్య కూడా వాయిదా పడకూడదు. ఈ దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి.

Also Read : అభిమానుల్లో మిమ్మల్ని కొట్టేవారు లేరు..! జనసైనికులా మజాకా?

ఆ గ్యాస్ తో కరోనా వైరస్ వ్యాప్తికి చెక్…?

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. ప్రతిరోజూ అంచనాలకు అందని స్థాయిలో దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వైరస్ నుంచి త్వరగా విముక్తి కలిగించాలనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా జపాన్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో వైరస్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

Also Read : రండి రండి.. నాకు కరోనా లేదు.. కూరగాయలు కొనండి!

కరోనా వైరస్ కణాలను ఓజోన్ గ్యాస్ తటస్తం చేయగలదని తెలిపారు. ఆస్పత్రులు, పరీక్షా కేంద్రాలలో ఓజోన్ గ్యాస్ ను వినియోగించి వైరస్ ను నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 0.05 నుంచి 0.1 పీపీఎం ఓజోన్ గ్యాస్ మనుషులకు హాని చేయని స్థాయిలో వైరస్ ను చంపగలదని చెప్పారు. 600 నిమిషాల పాటు ఓజోన్ గ్యాస్ ను వదిలి అక్కడ దాదాపు 90 శాతం వైరస్ తగ్గినట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు.

చీఫ్‌ సైంటిస్ట్‌ తకాయుకి మురాటా లో డెన్సిటీ ఓజోన్ ను గాలిలోకి పంపించడం వల్ల కరోనా వైరస్ కట్టడిలో మంచి ఫలితాలను సాధించడం సాధ్యమవుతుందని చెప్పారు. ఓజోన్ అనేక వ్యాధికారకాలను క్రియారహితం చేయడంలో సహాయపడుతుంది. అయితే ఎక్కువ సాంద్రత కలిగిన ఓజోన్ గ్యాస్ ను గాలిలోకి వదిలితే మాత్రం మానవుల ప్రాణాలకే అపాయం కలుగుతుంది. వైద్య రక్షణ పరికరాలను క్రిమిరహితం చేయడంలో కూడా ఓజోన్ గ్యాస్ సహాయపడుతుందని తెలిపారు.

Also Read : విజయనగరంలో దారుణం… కరోనా మృతదేహాలనూ వదలని నీచులు…?

బొత్స మాటలు వింటే నవ్వొస్తుంది… కథలు చిన్నారులకు చెప్పండి!

ఈ ఒక్కరోజు లోనే ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 7 షాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వాటన్నింటిలోకి అమరావతి రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన వార్షిక కౌలు, పెన్షన్ మొత్తాన్ని రెండు నెలలుగా జాప్యం చేయడంతో హైకోర్టు వారు జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తక్షణమే రైతులకు ఆ మొత్తాన్ని అందించవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇక వీటన్నింటికంటే ముందు తమకు రావాల్సిన కౌలు డబ్బులు రాకపోవడంతో నిరసన చేస్తున్న అమరావతి రైతులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Also Read : ఆంధ్ర రాజకీయాలు కోర్టుల పాలు, ప్రజలు కష్టాలపాలు

అధికార వైసీపీ పై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతున్న సమయంలో అమరావతి రైతులకు వారి కౌలు, పెన్షన్ మొత్తాన్ని నిన్ననే విడుదల చేశామని ప్రభుత్వం చెప్పడం గమనార్హం. మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ఇందుకు సంబంధించి నిధులను విడుదల చేసిందని రైతులకు చెల్లించాల్సిన కౌలు – 158 కోట్ల రూపాయలు, రెండు నెలల పెన్షన్ మొత్తం 9.7 మూడు కోట్ల రూపాయలను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుందని అన్నారు.

ఇక్కడి వరకు బాగానే ఉంది…. కానీ నిన్ననే అనగా ఆగస్టు 26వ తేదీన కౌలు రైతుల పెన్షన్ బ్యాంకులో జమ చేశామని బొత్స సత్యనారాయణ చెప్పడం అందరికీ విడ్డూరంగా కనిపించింది. హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసిన సమయంలో వారు ఏమీ చెప్పలేదు. పైగా బొత్స సత్యనారాయణ ఇప్పుడు వచ్చి రెండు నెలల నుండి పెండింగ్లో ఉన్న పెన్షన్ నిన్ననే జమ చేశాము…. సాంకేతిక సమస్యల వల్ల ఆలస్యమైందని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అంతేకాకుండా ఎంతో విచిత్రమైన రీతిలో కౌలు, రైతుల పెన్షన్ ను ఐదు వేల రూపాయలకు పెంచాలని ప్రభుత్వం భావించిందని… అయితే ప్రతిపక్షాలు హైకోర్టుకు వెళ్లడంతో అది సాధ్యపడలేదు అని అన్నారు.

Also Read : బుక్కైన దేవినేని ఉమ.. నెక్ట్స్ టార్గెట్ అతడేనట?

అంటే ప్రతిపక్షం హైకోర్టు కి వెళ్తే అధికార పక్షం రైతులకు చేయాల్సిన మేలుని చేయకపోవడం ఏమిటో…. ఆ లాజిక్ ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. అంతేకాకుండా మంత్రి మాట్లాడుతూ భూహక్కు పత్రాలు అమ్ముకున్న రైతులకు కౌలు చెల్లింపులు జరగవని అన్నారు. అందుకు సంబంధించిన సర్వే జరుగుతోందని ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని చెప్పారు.

ఇక్కడ మంత్రి మాట్లాడిన మాటలు వింటుంటే ఏదో చిన్న పిల్లల కథలు చెప్పేందుకు ఆయన మైకు ముందుకు వచ్చినట్లు ఉందని పలువురు విమర్శిస్తున్నారు. నిన్ననే అకౌంట్లో డబ్బులు జమ చేస్తే ఆ ఆధారాలను హైకోర్టు ముందు ఎందుకు పెట్టలేదు? రైతులకు డబ్బులు పెంచేందుకు ప్రభుత్వాన్ని ఏమి ఆపింది? ఇక సర్వే జరుగుతున్న విషయాన్ని కూడా హైకోర్టు ముందు ఎందుకు వెల్లడించలేదు? మీడియా వారు ఏమన్నా వారికి ఆదేశాలు జారీ చేశారా? జారీ చేసింది హైకోర్టు కదా? సమాచారం అందించాల్సిన కూడా హైకోర్టు వారికే… కానీ మంత్రి ఇలా మీడియా వచ్చి తమ ప్రభుత్వం తప్పిదాలను ఇలా కప్పిపుచ్చడం ఎవరికీ ఏమీ అర్థం కావడం లేదు.

Also Read : ఆంధ్రకు అప్పుల తప్పులు అలవాటే… కానీ జగన్ ది మరీ ఓవర్ అయిపోయింది!

అద్దె ఇళ్లల్లో ఉండేవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుందా?


రోజురోజుకు పెరుగుతున్న ధరలతో సొంతింటి కళ అనేది అందరికీ సాధ్యం కావడం లేదు. అలాగే ఇతర ప్రాంతాలకు బ్రతుకు దెరువు కోసం వెళ్లేవారు.. ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవారంతా అద్దె ఇళ్లల్లోనే కాలం వెళ్లదీయడం కామన్ అయిపోయింది. అయితే అద్దె ఇళ్లలో ఉండే వారు యజమానుల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం అద్దె చట్టానికి మెరుగులు దిద్దుతుండటంపై పలువురు సంతోషం వ్యక్తం చేశారు.

Also Read: ప్రధానికి లేఖ రాసిన సీఎం జగన్… ఎందుకోసమంటే..?

కేంద్రం తీసుకురానున్న కొత్త చట్టం ద్వారా ఇంటి అద్దెల దోపిడీకి చెక్ పడే అవకాశం కన్పిస్తోంది. అద్దె ఇళ్లు వెంటనే ఖాళీ చేయమని.. ఉన్నఫలంగా అద్దె పెంచడం.. ఇంటి యజమానుల వేధింపులు తొలిగిపోయేలా అద్దె చట్టంలో కేంద్రం మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా అద్దె పెంపుపై మూడు నెలల ముందుగానే అద్దెకు ఉండేవారికి నోటీసు ద్వారా తెలుపాలని చట్టంలో చేర్చారు. ఈ చట్టం కింద సదరు యజమాని అద్దెకారుడికి మధ్య తలెత్తే వివాదాలను కలెక్టర్ సమక్షంలో పరిష్కరించేందుకు వీలు కలుగనుంది.

Also Read:కేంద్రం పై సుప్రీం కోర్టు అసహనం..! లాక్ డౌన్ వేసిన వాళ్ళే పరిష్కారం చూపాలి

వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ చట్టం ఆమోదం పొందుతుందని కేంద్ర గృహ పట్టణ మంత్రిత్వశాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ చట్టం అమలైతే ఖాళీగా ఉన్న 60శాతం పైబడి ఇళ్లు రెంటల్ మార్కెట్లోకి రానున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముడుపోని నిర్మాణాలను అద్దె గృహాలుగా మార్చుకునే అవకాశం లభించనుంది. వీలైనంత త్వరగా చట్టాన్ని అమలు చేసి అద్దె నివాసాల్లో ఉండేవారికి ప్రయోజనం కలిగించాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటివరకు అద్దె భవనాల్లో నివాసం ఉంటూ ఇబ్బందులు పడుతున్నవారికి కేంద్రం నిర్ణయం గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు.

అభిమానుల్లో మిమ్మల్ని కొట్టేవారు లేరు..! జనసైనికులా మజాకా?

2019 ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ “గెలిస్తే ప్రజలకు న్యాయం చేస్తాం… ఓడినా ప్రజలకు సాయం చేస్తాం” అని చెప్పింది. మిగతా నాయకులు తమ వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్చారో తెలియదు కానీ…. పవన్ కళ్యాణ్ మాత్రం అతని మాటకు కట్టుబడి ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా గ్రౌండ్ లెవెల్ లో సాయం చేయడంలో జనసేన పార్టీ తనదైన ప్రత్యేకతను చాటుకుంది.

Also Read : బుక్కైన దేవినేని ఉమ.. నెక్ట్స్ టార్గెట్ అతడేనట?

విషయం ఏమిటంటే…. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు దగ్గరపడుతున్న నేపథ్యంలో జనసైనికులు పెద్ద ఎత్తున పేదలకు సాయం అందించే కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుత పరిస్థితి మీద ఉన్న అవగాహనతో ఈ కరోనా నేపథ్యంలో…. ‘జనసేవ’ పేరుతో ఆక్సిజన్ సిలిండర్స్ పంపిణీకి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు విరాళంగా ఆక్సిజన్ సిలిండర్లు అందజేస్తున్నారు. రాష్ట్రమంతటా ఈ కార్యక్రమం విస్తృతంగా జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో జనసేన పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలతో పాటు విదేశాల్లో ఉంటున్న జనసేన మద్దతు దారులైన ఎన్నారైలు కూడా తమ వంతు సాయం అందించడం విశేషం.

ఇటీవల వరదల నేపథ్యంలో కూడా జనసైనికులు అందించిన సహాయం చాలా చాలా గొప్పది. ఇంకా జనసేన కార్యకర్తలు ఇంత గొప్ప విషయం చేస్తుంటే మన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ ‘జనసేవ’ ను గుర్తించడం లేదు అనుకోండి అది వేరే విషయం. అయినా కానీ అధికారంలో ఉన్నోడు ‘బొమ్మ’తో పబ్లిసిటీ చేసుకుని సంక్షేమ పథకాలతో ప్రజలను మభ్యపెట్టి ఓటుబ్యాంకు రాజకీయాలు చేయడం…. అధికారం లేనోడు అడ్డగోలుగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం చూస్తున్న మనం…. రాజకీయం అంటే ‘ప్రజాసేవ’ అని నమ్మిన వాడు మాత్రం గెలుపు ఓటములతో సంబంధం లేకుండా సాయం చేస్తాడు అని ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టు చూస్తూనే ఉన్నాం.

ఇక జనసేన కార్యకర్తలు మిగతా పార్టీ కార్యకర్తల్లా కాకుండా ప్రజలకు సాయం చేయడమే తమ అభిమాన నాయకుడికి ఇచ్చే అతి పెద్ద బహుమతి అని భావించి ఇలా ఆక్సిజన్ సిలిండర్లను విరాళంగా ఇవ్వడాన్ని రాష్ట్రమంతా మెచ్చుకుంటున్నారు. జనసేన కనుక చిత్తశుద్ధితో ముందుకు వెళితే ప్రజల్లో వారికి మరింత మద్దతు లభించడం ఖాయం. ఇక ఇంత ‘జనసేవ’ చేస్తున్నా మీడియా పట్టించుకోవట్లేదు అంటే దాదాపు తెలుగు మీడియా మొత్తం ఆయా పార్టీల కి ఎప్పుడు అమ్ముడుపోయింది అని ప్రజలు అనుకుంటారు.

Also Read : ఆంధ్ర రాజకీయాలు కోర్టుల పాలు, ప్రజలు కష్టాలపాలు

ఖాకీ చొక్కా‌ ‌వేస్తున్న మరో మెగా హీరో


ఏ ఇండస్ట్రీలో అయినా పోలీస్‌ స్టోరీస్‌, పోలీసు పాత్రలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఖాకీ చొక్కా వేసుకొని పవర్ఫుల్‌ పోలీసుగా కనిపించాలని హీరోలు కోరుకుంటారు.ఈ మధ్య హీరోయిన్లు కూడా తెరపై లాఠీలు పట్టుకుంటున్నారు. తెలుగులో పోలీసు కథలు చాలానే వచ్చాయి. పేరున్న హీరోలందరూ ఎప్పుడో ఒకసారి ఖాకీ చొక్క వేసుకున్నారు. మెగా కాంపౌండ్‌లో అయితే మెగాస్టార్ చిరంజీవి, పవన్‌ కళ్యాణ్ తో పాటు రామ్‌ చరణ్, సాయి ధరమ్‌ తేజ్, అల్లు అర్జున్‌‌ ఇప్పటికే పోలీసు పాత్రలు చేశారు. ఇప్పుడు మరో మెగా హీరో వరుణ్‌ తేజ్‌ కూడా ఖాకీ చొక్క వేయనున్నాడు. అతను పవర్ఫుల్‌ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు. దర్శకుడు సాగర్ చంద్రతో వరుణ్‌ తేజ్‌ ఇది వరకే ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు ఒప్పుకున్నాడు. గతంలో ‘అయ్యారే’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాలు తీసిన సాగర్.. మెగా హీరో కోసం ఓ రొమాంటిక్ పోలీస్‌ స్టోరీని సిద్ధం చేశాడు. ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. వరుణ్‌ రీసెంట్‌గా ‘గద్దలకొండ గణేష్‌’తో భారీ హిట్‌ సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ కంటే ముందే సాగర్ చంద్ర ఈ కథ రెడీ చేసి వరుణ్‌ను అప్రోచ్‌ అయ్యాడట. కానీ, అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టును పక్కనబెట్టారని సమాచారం.

Also Read: నితిన్‌ సినిమాకు లెడీ విలన్‌ దొరికనట్టేనా?

ప్రస్తుతం వరుణ్ బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ స్పోర్ట్స్‌ డ్రామా మూవీ చేస్తున్నాడు. ఇది వరుణ్‌కు పదో చిత్రం. దీని ద్వారా కిరణ్‌ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రాన్ని అల్లు వెంకటేశ్‌, సిద్దు ముద్దా నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం వరుణ్‌ అమెరికాలో బాక్సింగ్‌ ట్రైనింగ్‌ తీసుకున్నాడు. కథ, కథనం అన్నీ రెడీగా ఉన్నప్పటికీ కరోనా కారణంగా ఈ చిత్రం షూటింగ్‌ ఇంకా ప్రారంభం కాలేదు. తొందర్లోనే దీన్ని పట్టాలెక్కించాలని చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది. ఈ మూవీ తర్వాత అనిల్ రావిపూడితో ఎఫ్‌2 సీక్వెల్‌లో వరుణ్‌ నటించాల్సి ఉంది. అయితే, మరో హీరో వెంకటేశ్‌తో పాటు డైరెక్టర్ అనిల్‌ ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడంతో సీక్వెల్‌ కొంత ఆలస్యంగా ప్రారంభం కానుంది. దాంతో, కిరణ్ కొర్రపాటి డైరెక్ట్‌ చేసే స్పోర్ట్స్‌ డ్రామా పూర్తయిన వెంటనే సాగర్ చంద్ర ప్రాజెక్టు మొదలు పెట్టాలని వరుణ్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. దీన్ని 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్పై నిర్మించనున్నారు. ఈ చిత్రంలో వరుణ్‌ పవర్ఫుల్‌ పోలీసుగా కనిపిస్తాడని, అదే టైమ్‌లో ఇది రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైన్‌గా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.