
ఏపీలో బీజేపీ బలం సరిపోదని కొత్తగా అధ్యక్షుడైన సోము వీర్రాజు తొందరగానే గ్రహించినట్టున్నారు. ఓ వైపు బలమైన టీడీపీ తొక్కేయాలని చూస్తుండగా.. మరోవైపు అధికార వైసీపీ భీకరంగా ఉంది. ఈ ఇద్దరినీ దాటుకొని ముందుకెళ్లడం ఒక్కడితో కాదని త్వరగానే అర్థమైంది.
Also Read: అదే సీన్.. జగన్ ను ఫాలో అవుతున్న రామోజీ?
ఇటీవల టీడీపీ సోషల్ మీడియా విభాగం.. సోము వీర్రాజును టార్గెట్ చేసి అభాసుపాలుచేసే కుట్రకు తెరతీసిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. లోకల్ పోస్టులు చేస్తే కేసులు పెడుతానని సోము వీర్రాజు హెచ్చరించడంతో ఇప్పుడు విదేశాల్లోని ఫేక్ అకౌంట్ల ద్వారా ఏపీలో సోము వీర్రాజును దెబ్బతీసే పోస్టులు సోషల్ మీడియాలో పెడుతున్నారట.. ఆయనను డమ్మీని చేసే కుట్రలు సాగుతున్నాయట.. దీంతో అలెర్ట్ అయిన సోము వీర్రాజు టీడీపీకి చెక్ పెట్టాలంటే క్షేత్రస్థాయి నుంచి వెళ్లాలని డిసైడ్ అయ్యారని తెలిసింది.
ఏపీలో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా సోము వీర్రాజు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే కుదేలైనా.. అసంతృప్తితో ఉన్న టీడీపీ నేతలను బీజేపీలోకి లాగాలని డిసైడ్ అయ్యాడట.. తెలుగుదేశం పార్టీ కేడర్ ను లక్ష్యంగా చేసుకొని జిల్లా పట్టణ, గ్రామీణ స్థాయిలో చేరికలు చేపట్టి పార్టీని బలోపేతం చేసేందుకు సోము వీర్రాజు కసరత్తు ప్రారంభించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే వీడియో కాన్ఫరెన్స్ లు, టెలీ కాన్ఫరెన్స్ లు చేస్తూ.. పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరిస్తూ యువతను ఆకర్షించే పని మొదలుపెట్టారట..
Also Read: చంద్రబాబుకు కొత్త సమస్య…. సుప్రీంలో అళ్ల స్పెషల్ లీవ్ పిటిషన్….?
ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఏపీ యువతలో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ను వాడుకోవాలని సోము వీర్రాజు ప్లాన్ చేశారట.. బీజేపీతో కలిసి పనిచేస్తున్న జనసేనను కలుపుకు పోవాలని సోము కీలక నిర్ణయం తీసుకున్నారు.బీజేపీ-జనసేన ఒకటిగా ఉంటే బలోపేతం కావచ్చని.. దీన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.
బలమైన తెలుగుదేశంను నీరుగార్చాలంటే ఇవన్నీ చేయాలని.. అందరితో కలిసి పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయని సోము వీర్రాజు భావిస్తున్నారు.
-ఎన్నం