బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన మాటల్లోనే కాదు కెరీర్లో యమ స్పీడ్. వరుస సెట్టి సినిమాలు చేస్తోందామె. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిస్తూ.. ఎప్పుడూ ఏదో ఒక గొడవలో తలదూర్చినా ఆమెకు ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు. వ్యక్తిగత విషయాలు, ఇండస్ట్రీ, రాజీకీయ అంశాలపై ఆమె స్పందన కొందరికి నచ్చినా నచ్చకపోయినా.. తెరపై ఆమె నటనను మాత్రం అందరూ ఇష్టపడుతారు. కంగనా అంటే పడని వాళ్లు, విమర్శకులు సైతం ఆమె యాక్టింగ్ స్కిల్స్‌ను తెగ పొగిడేస్తుంటారు. గాడ్ ఫాదర్స్ లేకపోయినా.. ఔట్‌సైడర్గా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన కంగనా తన స్వశక్తితో ఎదిగింది. ప్రతి సినిమాలోనూ తన మార్కు చూపిస్తోంది. సక్సెస్ వచ్చాక వరుస ఆఫర్లు ఎదురైనా కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. స్టోరీతో పాటు తన క్యారెక్టర్ బలంగా ఉండే సినిమాలే చేస్తోంది. కథానాయిక ప్రాధాన్యం ఉన్న కథల కోసం బాలీవుడ్‌లో అందరి దర్శకుల చూపు ఫస్ట్ కంగనా వైపే వెళ్తుంది. ఈ మధ్యే ‘పంగా’ మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకున్న రనౌత్.. ప్రస్తుతం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత బయోపిక్ ‘తలైవి’లో నటిస్తోంది. అదే విధంగా దగ్గుబాటి రానాతో ఓ ప్రాజెక్టుకు ఓకే చెప్పింది. అయితే ఇది సినిమా, వెబ్ సిరీసా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. తాజాగా ఆమె మరో సాహసం చేసేందుకు రెడీ అయింది. ఆమె ప్రధాన పాత్రలో ‘తేజస్’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో కంగనా ఇండియన్ ఎయిర్ఫోర్స్ పైలట్ పాత్రను పోషించనుంది.
Also Read: బన్నీ- కొరటాల.. భరత్ అనే నేను ఫార్ములా
ఈ చిత్రంలో ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర బృందం ఈ రోజు (శుక్రవారం) విడుదల చేసింది. తేజస్ అనే యుద్ధ విమానం ముందు.. ఎయిర్ఫోర్స్ డ్రెస్‌లో గంభీరంగా నిల్చున్న కంగనా లుక్ అదిరిపోయింది. ఈ పోస్టర్ను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసిన రనౌత్… ‘తేజస్ ఈ డిసెంబర్లో టేకాఫ్ అవుతుంది. ఎంతో ధైర్యవంతులైన మన ఎయిర్ఫోర్స్ పైలట్ల గురించి చెప్పే ఈ అద్భుతమైన కథలో భాగం అయినందుకు గర్వపడుతున్నా. జైహింద్’ అని ట్వీట్ చేసింది. ‘వురి: ది సర్జికల్ స్ట్రైక్’ అనే హిట్ సినిమాను నిర్మించిన రోనీ స్క్రివాలా ఈ చిత్రానికి ప్రొడ్యూసర్. సర్వేశ్ మెవారా దర్శకత్వం వహించనున్నాడు. ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధైర్య సాహసాలను, మహిళా పైలట్ వీరోచిత పోరాటాన్ని కళ్లకు కట్టనున్నాడు.
#Tejas to take-off this December! ✈️ Proud to be part of this exhilarating story that is an ode to our brave airforce pilots! Jai Hind 🇮🇳 #FridaysWithRSVP@sarveshmewara1 @RonnieScrewvala @rsvpmovies @nonabains pic.twitter.com/2XC2FgnQKb
— Kangana Ranaut (@KanganaTeam) August 28, 2020
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Kangana ranauts tejas fist look
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com