Home Blog Page 8340

కరోనా విచిత్రం… పిల్లికి సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం!

ప్రపంచ దేశాల్లోని అన్ని రంగాలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. వైరస్ వల్ల ప్రైవేట్ సంస్థల్లో పని చేసే కోట్లాది మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. అయితే మనుషులే ఉద్యోగాలు కోల్పోతున్న కరోనా కష్ట కాలంలో ఒక పిల్లి మాత్రం సులభంగా ఉద్యోగాన్ని సంపాదించుకోగలిగింది. వినడానికి కొంచెం వింతగానే ఉన్నా ఆస్ట్రేలియాలో ఒక పిల్లి సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాన్ని సాధించింది. సంస్థ యాజమాన్యం పిల్లికి ఐడీ కార్డు కూడా ఇవ్వడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియాలో ఎప్ వర్త్ ఆస్పత్రి దగ్గర కొన్ని నెలల నుంచి ఒక పిల్లి తిరుగుతోంది. ఆస్పత్రికి సమీపంలోనే ఆ పిల్లి ఎల్లప్పుడూ ఉండటాన్ని సిబ్బంది, యాజమాన్యం గమనించింది. దీంతో యాజమాన్యానికి ఒక వింత ఆలోచన వచ్చింది. ఎప్పుడూ ఆస్పత్రి ఆవరణలో ఉండే పిల్లికి సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కలిగింది. అనుకున్నదే తడవుగా యాజమాన్యం పిల్లికి ఐడీ కార్డు ఇచ్చింది.

ఆ ఐడీ కార్డుపై “ఎల్వుడ్” అని పిల్లి పేరు రాసి ఉంది. సెక్యూరిటీ గార్డు ఉద్యోగం పొందిన పిల్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముద్దుగా ఉన్న పిల్లిని చూసి అక్కడ ఉన్న రోగులు కూడా సంతోషపడుతున్నారని తెలుస్తోంది. అధికారికంగా సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం అందుకున్న పిల్లి సోషల్ మీడియాలో తెగ పాపులరైంది. పిల్లి ఉద్యోగం చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

జగన్ కు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు షాక్ ఇవ్వబోతున్నారా…?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తి చేసుకుంది. జగన్ సర్కార్ ఐదేళ్ల పదవీ కాలంలో పావు భాగం ఇప్పటికే పూర్తైంది. అయితే ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వానికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు షాక్ ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పరిపాలన వ్యవహారాలు చిత్రవిచిత్రంగా జరుగుతున్నాయని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు భావిస్తున్నారని తెలుస్తోంది.

ముఖ్యంగా రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్ లు, ఐపీఎస్ లు కేంద్ర సర్వీసులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో సీఎస్, డీజీపీ స్థాయి అధికారులకు సైతం తెలియకుండానే పనులు జరుగుతున్నాయని, ఫైళ్లు కదులుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. కీలకమైన శాఖలు కొందరి గుప్పిట్లోనే చిక్కుకుపోయాయని… మిగిలిన వారికి పెద్దగా ప్రాధాన్యత ఉండటం లేదని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు భావిస్తున్నారని సమాచారం.

మరోవైపు జగన్ సర్కార్ తీసుకుంటున్న చాలా నిర్ణయాలకు కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా జగన్ అనుకూల పత్రికకు ప్రభుత్వం నుంచి ఎక్కువగా యాడ్స్ వెళ్లినట్లు నిరూపితమైంది. ఇలాంటి విషయాల్లో నమోదైన కేసుల్లో అధికారులకు ఇబ్బందులు తప్పవు. పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరించి అవతవకలు జరిగితే ఇబ్బందులు పడాల్సింది అధికారులే. అందువల్లే అవకాశం ఉన్న ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కేంద్ర సర్వీసుల వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.

కరోనా ఆస్పత్రిలో మరుగుదొడ్లు శుభ్రం చేసిన మంత్రి… ఏం జరిగిందంటే…?

మనలో చాలామంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొన్ని రోజుల పాటు ఉండాలంటే సముఖత చూపరు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం బాగానే అందినా అక్కడ మౌలిక సౌకర్యాలు బాగా ఉండవనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో టాయిలెట్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆస్పత్రుల పరిశీలనకు వచ్చిన రాజకీయనాయకులు సైతం రోగులు ఇలాంటి సమస్యలు చెబితే పెద్దగా పట్టించుకోరు.

అయితే పుదుచ్చేరి ఆరోగ్య మంత్రి మల్లాడి కృష్ణారావు మాత్రం కరోనా ఆస్పత్రిలో మరుగుదొడ్డి శుభ్రం చేసి ప్రశంసలు అందుకున్నారు. దగ్గర్లో ఎన్నికలు లేకపోయినా రోగులు సమస్య చెప్పిన వెంటనే స్వయంగా పరిష్కరించి నిజమైన లీడర్ అనిపించుకున్నారు. పుదుచ్చేరి ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో నిన్న కృష్ణారావు పర్యటించారు. అక్కడ బాధితులను పరామర్శించి వసతులు, ఇతర విషయాల గురించి ఆరా తీశారు.

ఆ సమయంలో ఆస్పత్రిలో టాయిలెట్స్ ను సరిగ్గా శుభ్రపరచటం లేదని కొందరు రోగులు ఆయనకు ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి రంగంలోకి దిగి టాయిలెట్స్ శుభ్రం చేసి రోగులు మరోసారి ఫిర్యాదు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సిబ్బందిని సున్నితంగా మందలించారు. కరోనా బాధితులు మరుగుదొడ్లు వినియోగించిన తరువాత నీళ్లతో శుభ్రం చేయాలని సూచించారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా నర్సులు, డాక్టర్లు, ఆరోగ్య కార్మికులను 458 మందిని నియమించుకుంటున్నట్లు తెలిపారు.

త‌న‌యుడి సినిమాలో హీరోగా స్టార్ హీరో !


భార‌తీయ సినీ రంగంలో సినీ వార‌సులే ఎక్కువుగా హీరోల‌య్యారు. కాకపోతే, వారిలో కొంతమందే స్టార్ డమ్ తెచుకున్నారు అనుకోండి. అయితే, స్టార్ హీరోలు తమ కొడుకులతో కలిసి నటించడం అనేది ఎన్టీఆర్ – బాలయ్య, నాగేశ్వరరావు – నాగార్జున సినిమాల నుండే ఆనవాయితీగా వస్తోంది. ఆ తరువాత కాలంలో కూడా తండ్రికొడుకుల కాంబినేష‌న్ల‌లో బోలెడ‌న్ని సినిమాలు వ‌చ్చాయి. కానీ విచిత్రంగా ఆ సినిమాల వల్ల కొడుకులకు పెద్దగా ప్రయోజనం జరిగింది అయితే ఏమిలేదు. ఆ తరువాత కొందరి స్టార్లు కొడుకుల సినిమాలను ప్రమోట్ చేయడానికి మెగాస్టార్, ముమ్ముట్టి, నాగార్జున లాంటి వాళ్లు త‌మ త‌న‌యుల సినిమాల్లో గెస్ట్ రోల్ లో కనిపిస్తూ ఆయా సినిమాలకు మంచి హైప్ ను తీసుకువచ్చిన సందర్భాలున్నాయి.

Also Read: బోల్డ్ సీన్స్ కి ‘టబు’ గ్రీన్ సిగ్నల్ !

ఇక తాజాగా మరో తండ్రీకొడుకుల కాంబినేష‌న్ లో ఓ సినిమా రాబోతుంది. పైగా తండ్రీ కొడుకు లిద్దరూ ఫుల్ లెంగ్త్ రోల్స్ లో నటిస్తున్నారు. త‌మిళంలో స్టార్ హీరో విక్ర‌మ్, ఆయ‌న త‌న‌యుడు ధ్రువ్ కలకయిలో ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా రూపొంద‌నుంద‌ని.. ఈ సినిమాలో సీనియర్ హీరో కార్తిక్ కూడా మరో కీలక పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తోంది. అన్నట్టు కార్తిక్ సుబ్బరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతుందట. సహజంగా కార్తిక్ సుబ్బ‌రాజ్ అంటేనే మంచి కంటెంట్ ఉంటుందనే నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నాడు.

Also Read: వెబ్‌ సిరీస్‌లో రేణు దేశాయ్‌ ‘ఆహా’ అనిపిస్తుందా?

మరి అలాంటి డైరెక్టర్ నుండి సినిమా అనేసరికి, పైగా విక్ర‌మ్-ధ్రువ్ ల కలయిక అనేసరికి మొత్తానికి ఈ సినిమా పై సౌత్ సినీ ప్రేక్షకులకు మంచి ఆసక్తి ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక అర్జున్ రెడ్డి రీమేక్ తో విక్ర‌మ్ త‌న‌యుడుగా ధ్రువ్ త‌మిళ తెర‌కు ప‌రిచ‌యం అయినా.. ఆ సినిమాతో పెద్దగా స్టార్ డమ్ ను అయితే తెచ్చుకోలేకపోయాడు. దాంతో తన రెండో సినిమాగా తన తండ్రి విక్ర‌మ్ తో కలిసి న‌టించ‌బోతున్నాడు.

ప్లాప్ హీరోయిన్ కి భారీ ఆఫర్స్ !


టాలెంట్ ను అలాగే గ్లామర్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే ఎప్పుడో స్టార్ హీరోయిన్ గా అనూ ఇమాన్యుల్, ఇప్పటికే అందరి స్టార్ హీరోలతో జతకట్టేది. కానీ, అదృష్టం లేక సక్సెస్ ట్రాక్ లోకి వెళ్ళలేక మొత్తానికి అనూ ఇమాన్యుల్ మాత్రం స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. కెరీర్ లో చెప్పుకోవటానికి మంచి హిట్ లేకపోవడంతో.. అనూ ఇమాన్యుల్ కెరీర్ ఆశించిన స్థాయిలో టాలీవుడ్ లో ఊపందుకోలేదు. దానికి తోడు సరైన ప్లానింగ్ లేకపోవడం కూడా అనూని వెనక్కి నెట్టేసింది.

Also Read: వెబ్‌ సిరీస్‌లో రేణు దేశాయ్‌ ‘ఆహా’ అనిపిస్తుందా?

బహుశా అందుకే బన్నీతో చేశాక కూడా భారీ అవకాశాలు రాలేదు. కానీ, ఆ మధ్య తన కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లదామని అనూ ఇమాన్యుల్ గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టినా స్టార్ హీరోల చిత్రాల్లో ఛాన్స్ లను మాత్రం సాధించలేకపోయింది. కెరీర్ స్టార్టింగ్ లో స్టార్స్ తో తప్ప చిన్న హీరోలతో చెయ్యనని.. అలాగే ఎంత పెద్ద స్టార్ సినిమానైనా తన పాత్ర సినిమాలో కీలకంగా ఉండాలని ఇలా ఓవర్ బిల్డప్ ఇచ్చి ఛాన్స్ లు పోగొట్టుకుంది. లేకపోతే గీతగోవిందం లాంటి సినిమా మిస్ అయ్యేది కాదు. ఆ సినిమా ఆఫర్ మొదట అనూకే వెళ్ళింది. చిన్న హీరోతో చెయ్యను అని, అల్లు అరవింద్ గారి కోసం గెస్ట్ రోల్ చేస్తానని ఆ సినిమాలో ఒక చిన్న రోల్ చేసింది. దాంతో పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి.

Also Read: నెట్టింట్లో ‘ఆంటీ’ ఐటమ్ సాంగ్ వైరల్

అయితే, హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చేయబోయే సినిమాలో ప్లాప్ హీరోయిన్ గా ముద్ర పడ్డ అనూ ఇమాన్యుల్ నే హీరోయిన్ గా తీసుకోవాలని అల్లు కాంపౌండ్ నుండి రికమండేషన్ వెళ్లిందని.. దాంతో హరీష్ శంకర్ ఆమెనే హీరోయిన్ గా తీసుకోవాలని ఆలోచిస్తోన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయన’కి సీక్వెల్ గా చేస్తోన్న ‘బంగార్రాజు’లో కూడా అనూ ఇమాన్యుల్ నే హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. మొత్తానికి అనూ ఇమాన్యుల్ కి అవకాశాలు పెరుగుతున్నాయి.

బాక్సర్ గా మారుతున్న ఈషా రెబ్బా.. పంచ్‌లు ఎవరిపైనో?


ఓరుగల్లు బిడ్డ, అచ్చ తెలుగమ్మాయి ఈషా రెబ్బా. అందం, అభినయం రెండూ ఉన్న తెలుగు నటి. కానీ, అవకాశాలే తక్కువగా వస్తున్నాయి. 2013లో అంతకముందు ఆ తర్వాత మూవీతో హీరోయిన్‌గా పరిచయమైన ఈషా కెరీర్ ఆశించిన వేగంతో ముందుకు సాగలేదు. చిన్నాచితకా సినిమాలకే పరిమితమైందామె. కానీ, రెండేళ్ల నుంచి ఆమె కెరీర్‌‌ మెల్లగా స్పీడందుకుంటోంది. తన ప్రతిభను నిరూపించుకునే కథలు, పాత్రలు ఈషా ముందుకొస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడలోనూ అవకాశాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు ప్రాజెక్టులున్నాయి. జీవి ప్రకాశ్‌ హీరోగా వస్తున్న ఓ తమిళ మూవీ, కన్నడ హీరో శివరాజ్‌ కపూర్తో ఓ సినిమాకు కమిటైన తెలుగమ్మాయి.. అక్కినేని అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్’లో కూడా నటిస్తోంది. అలాగే, ‘లస్ట్‌ స్టోరీస్‌’ వెబ్‌ సిరీస్‌ తెలుగు రీమేక్‌తో ఫుల్‌ బిజీగా మారింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడామెకు మరో అవకాశం లభించింది. ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటించే చాన్స్ వచ్చింది. ఓ ప్రముఖ సంస్థ నిర్మించే ఈ చిత్రంలో ఈషా బాక్సర్ గా కనిపించనుంది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది.

Also Read: వెబ్‌ సిరీస్‌లో రేణు దేశాయ్‌ ‘ఆహా’ అనిపిస్తుందా?

ఈ చిత్రం కోసం బాక్సింగ్‌ నేర్చుకుంటోంది. తొలిసారి ఓ స్పోర్ట్స్‌ డ్రామాకు ఒప్పుకున్న ఆమె.. తనను తాను బాక్సర్ గా మార్చుకుంటోంది. పదునైన పంచ్‌లు విసరడంతో పాటు బాక్సింగ్‌ రింగ్‌లో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వాలనే అంశలపై తర్ఫీదు పొందుతోంది. అలాగే, మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌, జిమ్నాస్టిక్స్‌ కూడా నేర్చుకుంటోంది. పాత్ర కోసం తననో క్రీడాకారిణిగా మార్చుకుంటోంది. ‘నేను నా తదుపరి చిత్రంలో బాక్సర్‌గా నటించబోతున్నాను. అందువల్ల శారీరకంగా, మానసికంగా ఆ పాత్రలోకి రావడం నాకు చాలా ముఖ్యం. దానికోసం ట్రైనింగ్ తీసుకుంటున్నా. మార్షల్ ఆర్ట్స్ శిక్షకులతో కూడా శిక్షణ పొందుతున్నాను. తెరపై నిజమైన బాక్సర్ లాగా కనిపించాలనుకుంటున్నా. అందుకోసం జిమ్నాస్టిక్స్ కూడా నేర్చుకుంటున్నా. ఈ చిత్రంలో కొన్ని క్లోజప్ షాట్లు ఉంటాయి. దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని శిక్షణ తీసుకుంటున్నా. నేను ఈ స్క్రిప్ట్ చదవగానే, ఆ కథే నన్ను ఉత్సాహపరిచింది. మరింత కష్టపడాలని ప్రేరేపించింది. బాక్సింగ్ గ్లౌజులు వేసుకుని పంచ్‌లు విసరాలన్న ఆసక్తి నాకు ఎప్పటి నుంచో ఉంది. ఆ కోరిక ఇప్పుడు నెరవేరనుంది కాబట్టి ఈ మొత్తం ప్రాసెస్‌ను చాలా ఎంజయ్‌ చేస్తున్నా. ఇక, స్నేహితులతో కలిసి ప్రాక్టీస్‌ చేస్తుంటే ఆ ఉత్సాహం రెట్టింపవుతుంది. ప్రస్తుతం నేను శివాత్మిక రాజశేఖర్ ఆమె సోదరి శివానితో కలిసి శిక్షణ తీసుకుంటున్నా. మేమంతా కిక్‌బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు చాలా సరదాగా ఉంటుంది’ అని ఈషా చెప్పుకొచ్చింది. అయితే, తన సినిమాకు దర్శకుడు, ప్రొడ్యూసర్ ఎవరనే విషయాలను ఆమె వెల్లడించలేదు. మరి, ఈషా ఎవరితో కలిసి, తెర మీద ఎవరిపై పంచ్‌లు విసురుతుందో తెలియాలంటే కొంత కాలం ఎదురు చూడాల్సిందే.

కొండ పోచమ్మ కథలు.. సిగ్గు.. సిగ్గు అంటున్న రేవంత్


కొండ పొచమ్మ కథలు పేరిట కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టే పనిలో పడ్డారు. ఈమేరకు తన ట్వీటర్లో కొండ పోచమ్మ ప్రాజెక్టు జరిగిన అవినీతి అక్రమాలపై వరుస ట్వీట్లు పెడుతూ ప్రభుత్వాన్ని బెంబెలెత్తిస్తున్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించిన కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టు దుస్థితిపై నిన్న.. నేడు అంటూ ఫొటోలు తీసి ట్వీటర్లో పోస్టు చేశారు. అదేవిధంగా కొండపోచమ్మ అవినీతి పోలీసుల పహారా అంటూ ఓ వీడియోను ట్వీటర్లో పోస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: కెసిఆర్ లో ఈ మార్పుకి కారణం ఏంటి? ‘మమా’ అనిపిస్తున్నాడు…

ఇటీవల కురిసిన వర్షాలకు కొండపోచమ్మ ప్రాజెక్టుకు సంబంధించిన చెరువు కట్టలు తెగి గ్రామాల్లోని నీళ్లు వచ్చిన సంగతి తెల్సిందే. దీంతో సీఎం కేసీఆర్ సైతం ఉన్నఫలంగా అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే తాజాగా రిజర్వాయర్ గేట్ల వద్దకు వెళ్లే వంతెను కుప్పకూలింది. దీంతో రేవంత్ రెడ్డి మరోసారి కొండ పోచమ్మ కథల పేరిట అక్కడి దుస్థితిపై వరుస ట్వీట్లు పెడుతున్నాడు.

Also Read: కేటీఆర్ హడావుడికి కారణం అదేనా?

ఏపీకి చెందిన ఓ మంత్రి నిర్వాకం వల్లే కొండ పోచమ్మలో ఈ దుస్థితి నెలకొందంటూ ఆరోపణలు గుప్పించాడు. ‘కొండపోచమ్మ కథలు.. కేసీఆర్ స్వహస్తాలతో ప్రారంభించిన కొండపోచమ్మ సాగర్లో అవినీతి ఆనవాళ్లు అనంతం.. నిన్న కట్టలు తెగి నీళ్లు ఊళ్లమీదకు పారితే… తాజాగా రిజర్వాయర్ గేట్ల వద్దకు వెళ్లే వంతెన కుప్పకూలింది.. ఏపీ మంత్రి కంపెనీ నిర్వాకాన్ని పోలీసు పహారాతో కప్పెట్టే కుయత్నం. సిగ్గు…సిగ్గు అంటూ ట్వీట్ చేశాడు. జనాలకు తెలియకుండా కొండపోచమ్మలో పోలీసులను కాపలా పెట్టారని రేవంత్ ఆరోపిస్తూ ఫొటోలను, వీడియోను ట్వీటర్లో పోస్టు చేశాడు. అయితే రేవంత్ చెబుతున్న ఆ ఏపీ మంత్రి ఎవరు అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.

కేసీఆర్, హరీష్ రావు కన్నీళ్లు.. ఏమైంది?


ఢిల్లీకి రాజైనా ఓ తల్లికి కొడుకే.. అలాగే ఓ స్నేహితుడికి మిత్రుడే.. మంచి స్నేహితుడి జ్ఞాపకాలను మరిచిపోవడం అంత తేలిక కాదు.. చిన్నప్పటి నుంచి మన వెంట నడిచిన మిత్రుడు దూరమైతే.. అతడు పాల్గొనే కార్యక్రమంలో మనం పాల్గొన్న వేళ కన్నీళ్లు ఆపడం ఎవరి తరం కాదు.. ఇదే అనుభవాన్ని తాజాగా హరీష్ రావు అనుభవించాడు.

Also Read: కెసిఆర్ లో ఈ మార్పుకి కారణం ఏంటి? ‘మమా’ అనిపిస్తున్నాడు…

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి జ్ఞాపకాలు సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావును వెంటాడుతూనే ఉన్నాయి. ఇద్దరికీ కన్నీళ్లు తెప్పించాయి. రామలింగారెడ్డి మృతదేహానికి నివాళులర్పించినప్పుడు కేసీఆర్ కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చేశాడు. ఎందుకంటే ఉద్యమ ప్రస్థానం కంటే ముందు నుంచే సిద్దిపేట, దుబ్బాక ఎమ్మెల్యేలుగా పనిచేసిన కేసీఆర్, సోలిపేట మంచి మిత్రులు.. అన్నా అంటూ కేసీఆర్ ను సోలిపేట పిలిచేవారు. సోలిపేటతో తనకున్న సుధీర్ఘ అనుభవాన్ని కేసీఆర్ గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు.

తాజాగా దుబ్బాక నియోజకవర్గంలో ఓ భారమైన సంఘటన హరీష్ రావుకు ఎదురైంది. దుబ్బాకలో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల కింద ఆర్థిక సాయం అందించడానికి ఎమ్మెల్యే లేకపోవడంతో మంత్రి హోదాలో హరీష్ రావు దుబ్బాకకు వెళ్లారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు వాటిని అందజేశాడు.

అయితే ఆ కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులపై సోలిపేట రామలింగారెడ్డి సంతకం ఉండడం చూసి హరీష్ రావు షాక్ అయ్యాడు. చనిపోయే ముందు కూడా వాటిని తెప్పించుకొని సోలిపేట రామలింగారెడ్డి సంతకం చేశాడని అధికారులు చెప్పడంతో హరీష్ రావు ఉద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చేశాడు.

Also Read: కేటీఆర్ హడావుడికి కారణం అదేనా?

ఈ సందర్భంగా సోలిపేటతో తనకున్న అనుబంధాన్ని హరీష్ రావు గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి తనతో కలిసి తిరిగాడని వాపోయాడు. సోలిపేట కలలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. సోలిపేట నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను తాను నెరవేరుస్తానని హామీ ఇచ్చాడు.

కాగా సోలిపేట మరణంతో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ తరుఫున సోలిపేట కొడుకునే నిలబెట్టబోతున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. బీజేపీ, కాంగ్రెస్ లు కూడా బరిలో ఉంటామని ప్రకటించాయి.

-నరేశ్ ఎన్నం

చిరంజీవి-త్రివిక్రమ్‌.. ఓ దొంగ స్వామీజీ.. ఫుల్లు కామెడీ!


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రతీ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్‌, కమర్షియల్‌ హంగులు సమపాళ్లలో ఉంటాయి. క్లీన్‌ కామెడీకి కేరాఫ్‌ అడ్రస్‌ ఆయన. కుల, మత ప్రస్తావన లేకుండా అశ్లీల పదజాలం వాడకుండా తెరపై హాస్యం పడించడంలో త్రివిక్రమ్‌కు తిరుగులేదు. అతడు, జల్సా, ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది నుంచి మొన్నటి అలవైకుంఠపురములో వరకు తన మార్కు కామెడీతో ప్రేక్షకులను మురిపించాడు. మరోవైపు ఎంత మాస్‌ ఇమేజ్‌ ఉన్నా కామెడీ పండించడంలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకతే వేరు. ప్రతి సినిమాలో తన మార్కు హ్యూమర్ ఉండేలా చూసుకుంటాడు చిరు. సేమ్‌ త్రివిక్రమ్‌ మాదిరిగానే తెరపై క్లీన్ కామెడీ పండిస్తారాయన. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తే.. అది పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్ అయితే… త్రివిక్రమ్‌ మార్కు పంచ్‌ డైలాగ్స్‌, సెటైర్స్‌ను తనదైన టైమింగ్‌తో చిరు పలికితే ఎలా ఉంటుంది. ఊహించుకుంటేనే చాలా కొత్తగా అనిపిస్తోంది కదూ..! అంతా అనుకున్నట్టు జరిగితే చిరు- త్రివిక్రమ్‌ కాంబోలో ఓ కామెడీ ఎంటర్టైనర్ రానుంది.

Also Read: నెట్టింట్లో ‘ఆంటీ’ ఐటమ్ సాంగ్ వైరల్

మెగా ఫ్యామిలీలో ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌తో మూడేసి సినిమాలు తీసిన ఈ మాటల మాంత్రికుడు తొందర్లోనే చిరును కూడా డైరెక్ట్‌ చేయబోతున్నాడని సమాచారం. చిరు బాడీ లాంగ్వేజ్‌కు సూటయ్యే కామెడీ ఎంటర్టైనర్ కథ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో మరో విశేషం ఏంటంటే ఇది దొంగ స్వామీజీలు, బాబాలపై రాసిన కథ అని తెలుస్తోంది. ఇందులో చిరు స్వామీజీ వేషంలో ఫుల్‌ కామెడీ పండిస్తారట. త్రివిక్రమ్‌ ఇప్పటికే చిరును కలిసి లైన్‌ చెప్పాడట. అది బాగా నచ్చడంతో పూర్తి స్థాయి కథ సిద్ధం చేయాలని మెగాస్టార్ సూచించారట. ఈ సినిమాలో ఓ మెసేజ్‌ కూడా ఉంటుందని, భక్తి ముసుగులో దొంగ స్వామీజీలు ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో ఎత్తి చూపిస్తారట. ఇలాంటి స్టోరీలతో ఇది వరకే సినిమాలు వచ్చినా తనదైన హాస్యంతో కడుబుబ్చా నవ్వించడంతో పాటు ప్రజల్లో చైతన్యం రగిలించే కథనం సిద్ధం చేసే పనిలో త్రివిక్రమ్ ఉన్నారని సమాచారం.

Also Read: వెబ్‌ సిరీస్‌లో రేణు దేశాయ్‌ ‘ఆహా’ అనిపిస్తుందా?

ప్రస్తుతం చిరు.. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తున్నారు. ఇంకోవైపు జూనియర్ ఎన్టీఆర్30వ సినిమాకు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ రెండూ పూర్తయ్యాక.. చిరు- త్రివిక్రమ్‌ కాంబో పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. ఇది వరకు త్రివిక్రమ్‌ కథ, డైలాగ్స్‌ అందించిన ‘జై చిరంజీవ’లో చిరు నటించారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో పూర్తి స్థాయి హాస్య చిత్రం వస్తే అభిమానులకు అంతకుమించిన కిక్కేముంటుంది.

బోల్డ్ సీన్స్ కి ‘టబు’ గ్రీన్ సిగ్నల్ !


హీరో నితిన్ స్టార్ట్ చేసిన సినిమాల్లో కాస్త భారీ అంచనాలు ఉన్న సినిమా బాలీవుడ్ సూపర్ హట్ మూవీ ‘అంధాదూన్’ రీమేకే. ఈ సినిమా హిందీలో విజయం సాధించడానికి గల ప్రధాన కారణాల్లో కథాకథనాలు కంటే కూడా.. ముఖ్యంగా హీరో ఆయుష్మాన్ ఖురాన్ నటన అలాగే నెగెటివ్ రోల్ చేసిన ‘టబు’ పెర్ఫార్మెన్సే కీలకం. లేటు వయసులో కూడా టబు బోల్డ్ క్యారెక్టర్ లో ఎలాంటి మొహమాటం లేకుండా నటించి మెప్పించింది.

Also Read: వెబ్‌ సిరీస్‌లో రేణు దేశాయ్‌ ‘ఆహా’ అనిపిస్తుందా?

అయితే హిందీలో టబు నటించిన ఆ బోల్డ్ క్యారెక్టర్ లో.. తెలుగులో వచ్చే సరికి అనసూయ, రమ్యకృష్ణ, ఇలియానా, శ్రియా, స్నేహ లాంటి హీరోయిన్స్ పేర్లు బాగా వినిపించాయి. అయితే మేకర్స్ కి మాత్రం ఆ బోల్డ్ పాత్రలో టబు అయితేనే పూర్తి న్యాయం జరుగుతుందని మొదటి నుండి ఫీల్ అవుతున్నారు. కానీ టబు మాత్రం తెలుగు రీమేక్ లో నటించడానికి నో అనేసింది. అప్పటినుండి ఈ బోల్డ్ క్యారెక్టర్ లో టబులా ఎవరు చేస్తారన్న విషయం ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో మొదట వినిపించిన పేరు రమ్యకృష్ణదే.

Also Read: నెట్టింట్లో ‘ఆంటీ’ ఐటమ్ సాంగ్ వైరల్

కానీ రమ్యకృష్ణ ఈ చిత్రంలో నటించడానికి ఆమె పెద్ద మొత్తంలో డబ్బును డిమాండ్ చేస్తోందట. ఆ తరువాత అనసూయ దగ్గరకి ఈ రోల్ వెళ్ళింది. దాదాపు అనసూయనే ఈ రోల్ లో ఫిక్స్ చేయబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం టబు, తెలుగులో కూడా ఈ బోల్డ్ క్యారెక్టర్ లో నటించడానికి ఒప్పుకుందని.. టబుకు పెద్ద మొత్తంలో ఆఫర్ చేసి నిర్మాతలు ఆమెను ఒప్పించారని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

వెబ్‌ సిరీస్‌లో రేణు దేశాయ్‌ ‘ఆహా’ అనిపిస్తుందా?


రేణు దేశాయ్. బహుముఖ ప్రజ్ఞాశాలి. మోడల్‌. యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, కాస్ట్యూమ్‌ డిజైనర్, ఎడిటర్, ప్రొడ్యూసర్గా ఎన్నో పనులు చేసిందామె. కానీ, పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్యగానే తెలుగు ప్రజలకు సుపరిచితం. పవన్‌తో ఆమె విడాకులు తీసుకొని ఎనిమిదేళ్లు అవుతోంది. ఇద్దరు పిల్లల బాధ్యత తానే తీసుకుంది. పెళ్లికి ముందు పవన్‌తో చాలా రోజుల పాటు సహజీవనం చేసిన ఆమె యాక్టింగ్‌ కెరీర్ మూడు సినిమాలకే పరిమితమైంది. 2014లో స్వీయ నిర్మాణంలో ఇష్క్ వాలా లవ్‌ అనే సినిమాకు దర్శకత్వం వహించింది. ఆ తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన రేణు.. కొన్నాళ్లకు టీవీ షోకు హోస్ట్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ, కొన్ని రోజులే బుల్లితెరపై కనిపించింది. 2018లో ఓ వ్యాపారవేత్తతో ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. కానీ, వీరిద్దరి పెళ్లి జరిగిందో లేదో అన్న దానిపై క్లారిటీ లేదు.

Also Read: సంచలనం.. సుశాంత్ ది హత్యే అంటున్న ప్రత్యక్ష సాక్షి..!

ఆమె వ్యక్తిగత విషయాలను పక్కనబెడితే.. ప్రొఫెషనల్‌ కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నటనలో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించాలని చూస్తోంది. అయితే, సినిమాల్లో కాకుండా వెబ్‌ సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది. అల్లు అరవింద్‌కు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘ఆహా’ నిర్మిస్తోన్న ఓ వెబ్‌ సిరీస్‌లో నటిచేందుకు రేణు దేశాయ్ ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ సిరీస్‌ను కొత్త దర్శకుడు తెరకెక్కిస్తారని తెలుస్తోంది. ఇది ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అట. ప్రేక్షకులను ఆకట్టుకునే హాస్యంతో పాటు భావోద్వేగాలు సమపాళ్లలో ఉండే ఈ కథను దర్శకుడు ఇప్పటికే రేణుకు వినిపించారట. కథ నచ్చడంతో ఆమె వెంటనే అంగీకారం తెలిపిందని ఫిల్మ్‌ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. అయితే, ఈ వెబ్‌ సిరీస్‌లో రేణునే లీడ్‌ రోల్‌ పోషిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. ఈ సిరీస్‌ కోసం ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోందని, ఆ ప్రక్రియ పూర్తయ్యాకే ఎవరు ఏ పాత్ర చేస్తారన్నదానిపై క్లారిటీ రానుంది. కాగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో నటించేందుకు కూడా రేణు రెడీగా ఉంది. ముందుగా వెబ్‌ సిరీస్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న రేణు దేశాయ్‌..తన నటనతో ఆహా అనిపిస్తుందా? చూడాలి మరి.

“ముందు ఇది కట్టండి.. మూడు రాజధానులు తర్వాత!” జగన్ పై ధ్వజమెత్తారు

కొద్ది నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ బాధితుల కోసం అని అనంతపురం జిల్లాలో 1500 పడకల తాత్కాలిక ఆసుపత్రిని జగన్ సర్కార్ యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తోందని వైసిపి సోషల్ మీడియాలో పేజీల్లో అభిమానులు హోరెత్తించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన రీతిలో ఈ ఆసుపత్రి గురించి ఒక సందర్భంలో ప్రస్తావించారు. చంద్రబాబుని దెప్పిపొడుస్తూ… అనంతపురం లో అద్భుతమైన ఆసుపత్రి రెడీ అయిందని…. చంద్రబాబుకి కరోనా సోకినా…. అక్కడికి వెళ్లి చికిత్స చేయించుకోవచ్చు అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.

ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు రాజీవ్ కృష్ణ అయితే ఒక అడుగు ముందుకు వేసి ఆసుపత్రి ఫోటోలు కూడా పెట్టారు. తీరా చూస్తే ఆ ఫోటోలు ఎక్కడో కర్ణాటకలో సిద్ధమైన కోవిడ్ ఆస్పత్రి ఫోటోలు. అంతే…. చూశారా జగన్ సర్కారు ఇంత తక్కువ సమయంలో ఎంత మంచి ఆసుపత్రి రెడీ చేసిందో అంటూ ఎలివేషన్లు ఇచ్చుకున్న వైసిపి సపోర్ట్ లకు ప్రత్యర్థులు పూర్తిగా గాలి తీసేశారు. దెబ్బకు కర్ణాటకలోని ఆసుపత్రి ఫోటోలను నెటిజన్లు బయట పెట్టేసారు.

సరే ఇదంతా జరిగిన తర్వాత తమ తప్పు తెలుసుకుని ప్రభుత్వం ఆస్పత్రి కొంచెం లేట్ అయినప్పటికీ కచ్చితంగా సిద్ధం చేస్తారని వైసీపీ అభిమానులు భావించారు. పట్టుదలతో, పంతంతో అయినా మంచి వసతులు కల్పిస్తారు అని అంతా అనుకున్నారు. తీరా చూస్తే ఆసుపత్రి ఇంకా సిద్ధం కాలేదు. పెద్దగా ఒక గో డౌన్ అద్దెకి తీసుకుని పనులు మొదలు పెట్టారు కానీ ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆగిపోయాయి. ఎప్పుడో నాలుగు నెలలు కిందట వచ్చిన కరోనాను నివారించేందుకే ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేయలేకపోయారు కానీ మూడు రాజధానులు నిర్మిస్తారట అంటూ నెటిజన్లు వైసీపీ ప్రభుత్వం పై సెటైర్లు వేయడం మొదలుపెట్టారు.

అంతేకాకుండా ఫేక్ ఫోటోలు తీసుకుని వచ్చి ఆసుపత్రిని నిర్మించేశాం అంటూ డబ్బు కొట్టు కోవడం మాని ముందు ఆ పని చూడాలని ధ్వజమెత్తారు. ముందు ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేయండి…. ఆ తర్వాత రాజధాని గురించి ఆలోచించవచ్చు అని సలహాలు ఇవ్వడం మొదలు పెట్టేశారు. ఇంతకీ ఈ ఆస్పత్రిని ఉన్నతాధికారులు పట్టించుకోలేదు లేదా.. నిధులు ఇవ్వలేదా.. దీని అవసరం లేదనుకున్నారా? లోపల మాత్రం సౌకర్యాలు లేకుండా ఇది మామూలు గో డౌన్ గానే కనిపిస్తుంది. దీని గురించి ఒక ప్రధాన పత్రిక కథనం కూడా రాయగా ప్రభుత్వంలో కదలిక మాత్రం కరువైంది.

నెట్టింట్లో ‘ఆంటీ’ ఐటమ్ సాంగ్ వైరల్


ప్రస్తుతం నెట్టింట్లో ఓ ఐటమ్ సాంగ్ హల్చల్ చేస్తోంది. 61ఏళ్ల భామ ఐటమ్ సాంగులో చేసిన స్టెప్పులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా ‘ఆంటీ కిస్కో బోలా’ సాంగులో నటించి అందరిచేత ప్రశంసలు అందుకుంటోంది. ఇంతకీ ఆ భామ ఎవరు? ఆమె గురించి నెటిజన్లు ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం..!

Also Read: సంచలనం.. సుశాంత్ ది హత్యే అంటున్న ప్రత్యక్ష సాక్షి..!

ఢిల్లీకి చెందిన నీనా గుప్తా 1959 జూన్ 4న జన్మించింది. ప్రస్తుతం ఆమె వయస్సు 61. నీనా గుప్తా బాలీవుడ్ తోపాటు పలు అంతర్జాతీయ సినిమాల్లో నటించింది. పలు టెలివిజన్ షోలను నిర్వహించడంతోపాటు సినిమాలకు దర్శకత్వం వహించింది. ‘గాంధీ’ సినిమాలో గాంధీ మేనకోడలి పాత్రను నీనా గుప్తా పోషించింది. మాధురీ దీక్షిత్తో కలిసి ఖల్‌నాయక్ చిత్రంలో నటించింది. ఆచిత్రంలోని ఛోళీకీ పీఛే క్యాహై అనే పాటలోనూ మెరిసింది. అప్పట్లో ఈ సాంగ్ ట్రెండ్ సెట్ సెట్టర్ గా నిలిచింది. ప్రముఖ క్రికెటర్ వివీయస్ రిచర్డ్ తో సహజీవనం చేసి ఓ కూతురును కూడా కన్నది. ఆ తర్వాత 2008లో వివేక్ మెహ్రా అనే చార్టెట్ అకౌంటెంటెన్ ను రహస్య వివాహం చేసుకుంది.

Also Read: ఓటీటీలోకి మరో లెజెండరీ క్రికెటర్ !

తాజాగా నీనా గుప్తా నటించిన ‘మసాబా మసాబా’ అనే వెబ్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో నిన్న విడుదలైంది. ఇందులో ‘ఆంటీ కిస్కో బోలా’ అనే పాటలో నీనా గుప్తా నటించింది. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. నీనా గుప్తాతో తన కూతురు మసాబా గుప్తా కూడా ఈ పాటలో నటించడం విశేషం. దీనిపై నీనా గుప్తా స్పందిస్తూ ఐటమ్ సాంగ్స్‌కు వయస్సుతో సంబంధం లేదని చెబుతోంది. ఈ వెబ్ సిరీస్ లో నీసా గుప్తా అద్భుతంగా నటించారంటూ తన ఇన్ స్ట్రాగ్రామ్లో పోస్టు పెట్టింది. మసాబా గుప్తా కూడా ఆంటీ బులావ్.. మాగర్ ప్యార్ సే. నహిన్ తో.. అంటూ పోస్టు చేసింది. ఈ ఐటమ్ సాంగుపై నెటిజన్లు హాట్ హాట్ కామెంట్లో చర్చించుకుంటున్నారు.

https://www.instagram.com/tv/CETrxcBhDf0/

కెసిఆర్ లో ఈ మార్పుకి కారణం ఏంటి? ‘మమా’ అనిపిస్తున్నాడు…

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇతర ముఖ్యమంత్రులతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండే వారు. అటు అధికారులతో గాని ఇటు ఉన్నతస్థాయి ఆఫీసర్లతో గాని గంటలు గంటలు మాట్లాడి స్పష్టమైన సలహాలు సూచనలు ఇచ్చేవాడు. ఎంతో ఎక్కువ సేపు క్యాబినెట్లో, రాజ్ భవన్ లో సమయం గడిపే కేసీఆర్ లో మాత్రం ఈ మధ్య మార్పు వచ్చేసింది. ఆ తేడా ఎవరైనా ఇట్టే కనిపెట్టవచ్చు. ఎలా ఉన్నా దానిని దాచుకోవడం ఆయనకు చేతకాదు. ముక్కుసూటి మనిషి. అతను ఏమి అనుకుంటున్నారో ఆ విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పేస్తారు. తను మారిన తీరును కూడా దాచుకోలేరు. మొహమాటం లేకుండా బాహాటంగా చూపించడానికి అస్సలు సంకోచించరు.

ఇప్పుడు విషయమంతా దేని గురించి అంటే…. తాజాగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ను కలిసేందుకు కేసీఆర్ వెళ్లారు. ఎప్పుడైతే నరసింహ స్థానంలో తమిళసై వచ్చారో కెసిఆర్ లో ఒక మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గవర్నర్ గా నరసింహన్ ఉన్న రోజుల్లో తరచూ కేసీఆర్ అక్కడ కొద్ది కాలం గడిపేవారు. అదేమంటే ప్రభుత్వ నిర్ణయాలను గవర్నర్ కు వివరించినట్లుగా చెప్పేవారు. దేశంలో మరే రాష్ట్రంలోను ముఖ్యమంత్రి కూడా గవర్నర్ తో అంత ఎక్కువ సేపు గడిపిన దాఖలాలు ఉండేవి కావు.

కానీ ఈ మధ్య కాలంలో అసలు కెసిఆర్ రాజ్ భవన్ కు అసలు వెళ్ళింది లేదు. నరసింహన్ స్థానంలో తమిళసై వచ్చినప్పటినుండి కెసిఆర్ లో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.. ఎప్పుడో ఒకసారి వెళ్తున్నారు…. వెళ్ళిన వారు అలా వెళ్లి ఇలా వచ్చేస్తున్నారు. ఇక తప్పనిసరి సందర్భాల్లో తప్పించి ఆయన అటు వైపు చూస్తే ఒట్టు. ఇక వెళ్ళిన తర్వాత కూడా చాలా తక్కువ వ్యవధిలో తిరిగి వచ్చేస్తున్నారు.

దీనికి కారణం ఏమంటే ఈ మధ్యన చాలా విషయాల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని తమిళ సై నిలదీసింది. కరోనా నేపథ్యంలో టెస్టుల విషయంలో కావచ్చు ప్రైవేటు ఆసుపత్రుల విషయంలో కావచ్చు ఏకంగా ప్రభుత్వాన్ని బాధ్యులను చేసే వ్యాఖ్యలు చేసింది. అందుకే గతంలో గవర్నర్ చర్చించినట్లు ప్రభుత్వ విషయాలను చర్చించేందుకు కేసీఆర్ మొగ్గు చూపడం లేదు. తాజాగా గవర్నర్ బంధువు మరణించిన నేపథ్యంలో రాజ్ భవన్ విచ్చేసిన ఆమెని పరామర్శించి కేసీఆర్ వెంటనే తిరిగి రావడంతో అందరికీ విషయం అర్థం అయిపోయింది. వెళ్ళామా…. తిరిగి వచ్చామా అన్నట్లు ఆయన వ్యవహరిస్తున్నారు. చూద్దాం…. ఎన్నాళ్ళు ఇలా ప్రవర్తిస్తారో…!

బయటికొచ్చాడు కానీ బెంబేలెత్తిపోయాడు..? పాపం అచ్చెన్న

ఎట్టకేలకు టిడిపి ఎమ్మెల్యే… ఆంధ్రప్రదేశ్ మాజీ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పైన విడుదలయ్యాడు. ఈఎస్ఐ స్కాం లో అతనిదే ప్రధాన పాత్ర అంటూ ఏసీబీ అధికారులు ఎంతో నాటకీయంగా చేపట్టిన అరెస్టు తర్వాత 70 రోజులు రిమాండ్ లో ఉండి ఇన్వెస్టిగేషన్ కు సహకరించిన అచ్చెన్నాడుని చివరికి కోర్టు వారు కండిషన్ బెయిల్ పై విడుదల చేశారు.

ఇప్పటికే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి దారుణ ఓటమితో కుమిపిపోయి ఉన్న టీడీపికి 23 మంది ఎమ్మెల్యేలలో కేవలం 20 మందే ఇప్పుడు పార్టీకి చెందినవారు. వారిలో ఇద్దరు ముగ్గురు అరెస్టులు, కేసులు, బెయిల్ లు అంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి సమయంలో బయటకు వచ్చి రాగానే తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించి అచ్చెన్నాయుడు పరిస్థితులు తారుమారు చేస్తాడని అందరూ భావించారు. అయితే తన వ్యవహార శైలికి భిన్నంగా అచ్చెన్నాయుడు సైలెంట్ గా ఉండాలని డిసైడ్ కావడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

అచ్చెన్నాయుడు టిడిపి ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పని చేసినప్పుడు ఫలానా అవినీతి కుంభకోణంలో భాగస్వామి అయ్యారని ఏసిబి వారు అరెస్టు చేశారు. రెండు నెలలు జైలులో ఉన్నా కూడా అతనికి వ్యతిరేకంగా ఆధారాలను పొందుపరచలేకపోయారు. అయితే ఇలాగే బయటికి వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం వచ్చీ రాగానే రెచ్చిపోయాడు. ఇంకా చెప్పాలంటే ప్రభాకర్ రెడ్డి ఖచ్చితమైన ఆధారాలతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు కానీ అచ్చెన్నాయుడు సంగతి వేరే. ఆది నుండి అంతం వరకు ఇది మొత్తం కుట్రపూరితమైన అరెస్ట్ అని అందరూ ఆరోపిస్తున్న వాళ్లే.

కానీ ఇప్పుడు అచెన్నాయుడు బయటకు వచ్చి ఇలా సైలెంట్ కావడం వెనుక ఎవరైతే అతనిని అరెస్టు చేయించారో వారి వ్యూహం బాగానే పని చేసిందని తెలుస్తోంది. అచ్చెన్నాయుడిని జైలుకు పంపించడం కన్నా తమ నిర్ణయాలకు అతను అడ్డు చెప్పకపోతే చాలు అన్నదే అవతలి వారి వ్యూహం. అంతేకాకుండా ఉత్తరాంధ్ర కీలక నేతలలో ఒకడైన అచ్చెన్నాయుడు సైలెంట్ గా ఉంటే మూడు రాజధానుల వ్యవహారం చాలా త్వరగా అయిపోతుందని వారి ఆశ. ఇదే క్రమంలో వారు దాదాపుగా సక్సెస్ సాధించారు కూడా. మొత్తానికి రెండు నెలలు జైలు అచ్చం నాయుడు ని బాగానే ఇబ్బంది పెట్టింది. త్వరలోనే అతడు చంద్రబాబును కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు అని టిడిపి వర్గాలు ఆశావహంగా ఉన్నాయి.

సంచలనం.. సుశాంత్ ది హత్యే అంటున్న ప్రత్యక్ష సాక్షి..!


బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు సస్పెన్స్ సినిమాను తలపిస్తోంది. రోజుకో కొత్త ట్వీస్ట్ వెలుగు చూస్తుండటంతో సుశాంత్ సింగ్ మృతిపై ప్రజల్లో పలు అనుమానాలు కలుగుతున్నాయి. సుశాంత్ సింగ్ మృతికి నెపోటిజమే కారణమని నెటిజన్లు బాలీవుడ్ ఇండస్ట్రీపై విమర్శలు గుప్పిస్తునే ఉన్నారు. దీంతోపాటు సుశాంత్ సింగ్ మాజీ లవర్ రియా చక్రవర్తి.. ఇతర సినీ ప్రముఖుల వేధింపుల కారణంగానే సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలు విన్పించాయి.

Also Read: ఓటీటీలోకి మరో లెజెండరీ క్రికెటర్ !

అయితే సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదంటూ సుశాంత్ సింగ్ కుటుంబ సభ్యులు, అతని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు రాజకీయ నాయకులు, మాజీ పోలీస్ అధికారులు సైతం సుశాంత్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సుశాంత్ ను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారనే అనుమానాలు ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో ఈ కేసుపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఈ కేసును సీబీఐ ఛాలెంజ్ గా తీసుకొని దర్యాప్తు వేగవంతం చేస్తుండటంతో త్వరలోనే అసలు నిజాలు బయటికి రానున్నాయి.

తాజాగా సుశాంత్ పోస్టుమార్టం సమయంలో ఉన్న ఓ ప్రత్యక్షసాక్షి సంచలనం విషయాలను వెల్లడించారు. సుశాంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కూపర్ ఆస్పత్రికి తరలించారు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు సుశాంత్ సింగ్ భౌతికకాయాన్ని మొసుకెళ్లారు. వారిలో ఒక వ్యక్తి పోస్టుమార్టం సమయంలో వైద్యులు మాట్లాడుకున్న విషయాన్ని ఓ మీడియాకు వెల్లడించించారు. తాను పోస్టుమార్టం గదిలోకి వెళ్లినపుడు వైద్యులు సుశాంత్ సింగ్ ది హత్యేనని మాట్లాడుకోవడం విన్నానని చెప్పాడు.

Also Read: బడా ప్రొడ్యూసర్ తో ప్రభాస్‌ మరో బాలీవుడ్‌ మూవీ?

అంతేకాకుండా సుశాంత్ సింగ్ భౌతికకాయాన్ని పట్టుకున్నపుడు ఆయన గొంతు చుట్టురా సెల్లో టేప్‌ ఆనవాళ్లను ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపాడు. శరీరంపై సూదులతో గుచ్చిన ఆనవాళ్లు ఉన్నాయని.. సుశాంత్ కాలు ఒకటి ఫ్రాక్చర్ అయినట్లు గమనించినట్లు తెలిపాడు. ఇక సుశాంత్ సింగ్‌ను మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన రియా చక్రవర్తి ‘ఐయాం సారీ’ అంటూ విలపించిందని పోస్టుమార్టం సమయంలో అక్కడే ఉన్న ఒక ప్రత్యక్ష సాక్షి జాతీయ మీడియా వెల్లడించడం సంచలనం రేపుతోంది.

మరోవైపు సుశాంత్ సింగ్ కు పోస్టుమార్టం చేసిన కూపర్ హాస్పిటల్ వైద్యులు సెలవుపై వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈనేపథ్యంలో సీబీఐ సుశాంత్ ఆత్మహత్య మిస్టరీని ఎలా చేధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

‘బ్లూ’ మీడియా పవన్ పై బురద చల్లితే… జగన్ కు మరక అంటుకుందే

విశాఖలో తాజాగా నూతన్ నాయుడు, అతని కుటుంబం ఒక దళిత వ్యక్తికి శిరోముండనం చేశారు. ఇక ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అన్నది ‘బ్లూ మీడియా’ కథనం. అధికార పార్టీకి కొమ్ము కాస్తూ వారికి ఎటువంటి సెగ తగలకుండా కాపాడే ఈ బ్లూ మీడియా నెమ్మదిగా ఈ విషయాన్ని జనసేన పార్టీ వైపు మళ్ళించాలని ప్రయత్నం చేసింది. నిజానికి సదరు వ్యక్తికి గతంలో వైఎస్సార్సీపీతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి లక్షల మంది అభిమానుల్లాగే అతను కూడా ఆకర్షితుడయ్యాడు.

ఇక ఇప్పటి వరకూ ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.. ఈ కేసులో పోలీసులు ఆ వ్యక్తిని మీద ఎలాంటి ఆరోపణలు చేయలేదు. చాలా గంటలు బాధితుడు కూడా కేసు ఫైల్ చేయలేదు. కానీ బ్లూ మీడియా మాత్రం ఈ లోపలే ఎక్కడ తమ నేత మెడకు చుట్టుకుంటుందేమో అనే భయంతో వివాదాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అంటగట్టే ప్రయత్నం చేసింది. దాని తర్వాత నూతన్ నాయుడు అతని భార్యతో సహా మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ కేసులో ఇరుక్కుపోయాడు అని… అతని అభిమాని ఇటువంటి పనులు చేస్తున్నాడు అని సదరు మీడియా వాదించింది.

సరే.. “అసలు ఆ వ్యక్తితో మా పార్టీకి ఎలాంటి సంబంధం లేద”ని జనసేన పార్టీ ఖండించిన తర్వాత కూడా బ్లూ మీడియా ఇలాగే చేస్తుంది…. బాగుంది. ఇప్పుడు వారి కోణంలో ఆలోచిస్తే వైసీపీకి చెందిన సినీ నటుడు హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన “దళిత యువతిపై ఐదు వేల సార్లు రేప్” కేసులో ఇరుక్కున్న వార్తలు వచ్చాయి. మరి ఇక్కడ వైసిపి పార్టీ కానీ వారి అధినేత కానీ ఈ కేసుతో ఏమైనా సంబంధం ఉన్నట్లా…? అలాగని ఇదే లాజిక్ ప్రకారం ‘బ్లూ మీడియా’ తీర్మానించగలదా…?

ప్రతి విషయంలో జనసేన పై విషం చిమ్మడం ‘బ్లూ మీడియా’ పని గా మారిపోయింది. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే మెగా కాంపౌండ్ మీద పడి ఏడవడం తప్పించి వారికి వేరే పని ఉండదు. ‘ఆచార్య’ సినిమా చుట్టూ కాపీ వివాదాన్ని కూడా మొదట రాజేసింది వారే. ఇప్పుడు విశాఖ సిరోముండనం ఘటన ను పవన్ కు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పవన్ కు ఈ ఘటనతో సంబంధం ఉంటే జగన్ కు హైదరాబాద్ లో జరిగిన ఘటన తో కూడా సంబంధం ఉండి ఉండాలి అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. దీనికి వారిని ఏమంటారు..?