Home Blog Page 8341

కేటీఆర్ హడావుడికి కారణం అదేనా?


త్వరలోనే గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో టీఆర్ఎస్ నాయకులు గ్రేటర్లో హడావుడి చేస్తున్నారు. ఇక గ్రేటర్ బాధ్యతలను భుజాన మోస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ హడావుడి మాములుగా లేదనే టాక్ విన్పిస్తోంది. గత నాలుగేళ్లుగా పూర్తికానీ పనులన్నీ మరో నాలుగు నెలల్లో పూర్తి చేసేలా అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు ఆఘమేఘాల మీద ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

Also Read: పదవీ విరమణపై.. ఉద్యోగుల్లో టెన్షన్?

గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో మంత్రి కేటీఆర్ నగరవాసులు బోలెడన్నీ హామీలిచ్చారు. నగరవాసులకు ఆశల పల్లకి చూపడంతో ఆ ఎన్నికల్లో ప్రజలంతా అధికార పార్టీకే పట్టం కట్టారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ వంద స్థానాలను గెలుస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేయగా అందుకు తగ్గట్టుగానే టీఆర్ఎస్ 99 స్థానాల్లో గెలిచి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే ఆ ఎన్నికల్లో కేటీఆర్ ఇచ్చినా హామీల్లో నేటికీ చాలావరకు పెండింగులోనే ఉన్నట్లు తెలుస్తోంది.

మరికొన్ని నెలల్లో గ్రేటర్లో ఎన్నికలు జరుగనుండటంతో ప్రభుత్వం నగర అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ప్రభుత్వం వేల కోట్ల నిధులు విడుదల చేసి అభివృద్ధి పనులను చేపడుతోంది. రహదారుల అభివృద్ధి, జలాశయాల సుందరీకరణ, స్కైవేల ఏర్పాటు, రేయిన్ గార్డెన్‌ల నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్‌కు సొబగులు, తార్నాకలో టీవోడీ వంటి నిర్మాణాలను చేపట్టేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అక్టోబర్ నాటికి బాలానగర్ ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని పూర్తిచేసి నగరవాసులకు కానుకగా ఇవ్వాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

వీటితోపాటు హుస్సేన్ సాగర్ కోసం ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ అధికారులు రూపొందిస్తున్నారు. పదెకరాల్లో రూ.12కోట్లతో లేక్ వ్యూ ఫ్రంట్ పార్కు నిర్మాణ పనులు.. ఉప్పల్ భగాయత్‌తోపాటు మరో 9ప్రదేశాల్లో రేయిన్ గార్డెన్‌లను నిర్మించేలా సన్నహాలు చేస్తున్నారు. నగర శివార్లలోని జల్‌పల్లి, రాంపల్లి చెరువులతోపాటు మరో 18చెరువులను సుందరీకరించేందుకు టెండర్లను పిలవాలని అధికారులకు నిర్ణయించారు. నగరంలో పాదచారుల ఇబ్బందులు తొలగించేలా ప్రత్యేక ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు.. పలు చోట్ల స్కైవేలను నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నారు. వీలైనంత త్వరగా టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

Also Read: వందల కోట్లు వృథా.. టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిర్వాకం

వీటిన్నింటికి ఎంత ఖర్చు అయినా వెనుకడొద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉండటంతో అధికారులు పనులను వేగవంతం చేస్తున్నారు. ఇన్నిరోజులు పెండింగులో ఉన్న పనులన్నీ ఒక్కసారి చేయాల్సి వస్తుండటంతో అధికారులపై ఒత్తిడి పెరుగుతున్ననట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కరోనా సాకుతో ఇంటికే పరిమితమైన నేతలంతా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నగరంలో నిత్యం పర్యటనలతో హడావుడి చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు.

హానీ ట్రాప్ కథనం: చిక్కుల్లో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ


తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా.. చంద్రబాబు ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తారన్న ప్రచారం ఉన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చిక్కుల్లో పడ్డారు. పత్రిక, చానెల్ ను అడ్డుపెట్టుకొని ఏపీలోని జగన్ సర్కార్ పై విరుచుకుపడుతున్న ఆయనకు తాజాగా ఏపీ కలెక్టర్లు అంతా కలిసి మూకుమ్మడిగా షాక్ ఇచ్చారు.

Also Read: పవన్ కళ్యాణ్ సైలెన్స్ వెనుక ఇంత వైలెంటా?

పత్రికను అడ్డుపెట్టుకొని ఏమైనా రాయచ్చని.. అభాసుపాలు చేయవచ్చని అనుకున్న ఏబీఎన్ రాధాకృష్ణకు తాజా పరిణామం మింగుడుపడడం లేదు. తరచూ సంచలనమైన కథనాలతో ఏపీ ప్రభుత్వాన్ని షేక్ చేస్తున్న ఆంధ్రజ్యోతి దినపత్రికకు తాజాగా ఏపీలోని 13మంది కలెక్టర్లు అంతా కలిసి లీగల్ నోటీసులు పంపడం సంచలనమైంది.

తాజాగా ఆంధ్రజ్యోతి పత్రికలో ‘హనీట్రాప్’ పేరుతో ఇద్దరు కలెక్టర్లపై ప్రచురించిన కథనం సంచలనమైంది. ఒక కలెక్టర్ ఒక మహిళను ప్రయోగించారని.. ఇంకో కలెక్టర్ కు అమ్మాయిల బలహీనత ఉందని.. అతడి దెబ్బకు పలువురు మహిళలు ఇబ్బందులు పడ్డారని కథనంలో ప్రచురించారు.

దీనిపై సీరియస్ అయిన ఏపీ కలెక్టర్లు మూకుమ్ముడిగా ఆంధ్రజ్యోతికి నోటీసులు పంపారు. సదురు మీడియా సంస్థ ఎండీ రాధాకృష్ణతోపాటు మరో ముగ్గురిని బాధ్యులను చేస్తూ నోటీసులు జారీ చేశారు.

ఆంధ్రజ్యోతి కథనంపై కలెక్టర్లు అంతా సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది. కలెక్టర్ల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా.. వారిపై దాడి చేసేలా ఈ కథనం ప్రచురించారని వారంతా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Also Read: ఇన్ టాక్ : తెదేపా సోషల్ మీడియా vs సోము వీర్రాజు !

కలెక్టర్ల పరువు తీసేలా కథనం ప్రచురించినందుకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని.. దాన్ని పత్రికలో ప్రచురించాలని వారు సూచించారు. వారంలోపు స్పందించకపోతే తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

దీన్ని బట్టి తప్పుడు కథనాలతో వార్తలు రాస్తే వదిలిపెట్టేది లేదని ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి జగన్ సర్కార్ గట్టి హెచ్చరికనే పంపినట్టు అర్థమవుతోంది. మరి ఇలాంటి బెదిరింపులకు లొంగని ఆర్కే ఈ విషయంలో ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తిగా మారింది.

ఏం చేయకపోయినా.. ఇది చేస్తే చాలు మోడీజీ?


గత కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్ ను మౌనమునిగా అనేవారు. ఆయన తక్కువ మాట్లాడేవారు.. ఎక్కువ పనిచేసేవారు. స్వయంగా ఆర్థికవేత్త కావడంతో దేశ ఆర్థికవ్యవస్థ ఆయన కాలంలో బలంగా ఉండేది. జీడీపీ మెరుగ్గా ఉండేది.

Also Read: ‘లవ్ జిహాద్’.. మతం పేరిట యుద్ధం

కానీ ఇప్పుడు మాటల మాంత్రికుడు మోడీ హయాంలో ఆర్థికవ్యవస్థ కుదేలైంది. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చారన్న అపవాదును మూటగట్టుకున్నారు. మోడీజీ ఆ తప్పునుంచి మెల్లిగా బయటపడుతున్న వేళ కరోనా దాడితో పూర్తిగా చేతులులెత్తేశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ ఊదరగొట్టడం అభాసుపాలైంది. అది ఎవరికి లబ్ధి చేకూర్చలేదని తెలిసి విమర్శల పాలయ్యారు.

అయితే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినా.. జనాలు ఉద్యోగ, ఉపాధి కోల్పోయినా.. ప్రజలను ఆకట్టుకోవడం.. బోల్తా కొట్టించడంలో మోడీని మించిన ఘనుడు లేడంటారు. దేశంలో ప్రతీసారి ట్రెండింగ్లో ఉండడం మోడీకే సాధ్యమంటారు.

ఇటీవల ధోని , రైనా రిటైర్ మెంట్ తో అందరి చూపు వారిపై మళ్లిన వేళ.. ధోనికి మోడీ లేఖ రాయడం.. దానికి ధోని కృతజ్ఞతలు తెలుపడంతో మొత్తం ఫోకస్ తనవైపు తిప్పుకున్నారు. ఇక దేశ ఆర్థిక, సామాజిక సమస్యల కంటే జాతీయవాదం, హిందుత్వం, పాక్, చైనాలతో యుద్ధోన్మాదంతో ప్రజల్లో దేశభక్తిని పెంపొందించి మోడీ తనవైపు తిప్పుకుంటారు.

Also Read: ఐపీఎల్‌పై కరోనా కాటు.. షెడ్యూల్‌లో భారీ మార్పులు!

ఇప్పుడు తాజాగా యూపీలోని ఝాన్సీ వ్యవసాయ వర్సిటీలో తెలుగు విద్యార్థితో మాట్లాడుతూ ‘గారు’ అంటూ సంభోదించి తనకు తెలుగు తెలుసు అని.. అక్కడి మర్యాదలు తెలుసు అని.. వ్యవసాయంలో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ముందంజలో ఉన్నాయని ప్రధాని పొగిడేశారు. ఇలా ఒక్క విద్యార్థితో ప్రేమగా.. చలోక్తిగా మాట్లాడి అందరి చూపును తనవైపు తిప్పుకున్నారు. జనాలను ఆకట్టుకోవడంలో మోడీని మించిన వారు లేరని మరోసారి నిరూపించుకున్నారు.

నరేశ్

ఓటీటీలోకి మరో లెజెండరీ క్రికెటర్ !


బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో రానున్న లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ పాన్ ఇండియా విడుదలకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా మార్చిలో రిలీజ్ అవ్వాలి. కానీ, కరోనా మహమ్మారి రాకతో కపిల్ అభిమానుల ఎదురుచూపులకు బ్రేక్ పడింది. ఆ తరువాత ఈ సినిమా ఓటిటీలో రిలీజ్ అవ్వబోతున్నట్లు.. గత కొన్ని రోజులుగా అనేక రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఆ రూమర్స్ నిజమేయ్యేలా కనిపిస్తున్నాయి. ప్రముఖ ఓటిటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ నుండి ఈ బయోపిక్ కి భారీ ఆఫర్ వచ్చింది అని.. ఈ సినిమా మేకర్స్ కూడా ఓటీటీకి తమ సినిమాని అమ్ముకోవడానికి రెడీగా ఉన్నారని.. ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని.. త్వరలోనే మేకర్స్ నుండి అధికారికంగా ప్రకటన రాబోతోందని తెలుస్తోంది.

Also Read: ఆదిపురుష్.. ఫ్యాన్ మేడ్ వీడియో వైరల్

ఆయితే నాలుగు నెలల క్రితమే మేకర్స్ కి అమెజాన్ నుండి ఈ బయోపిక్ కి భారీ ఆఫర్ వచ్చింది. కానీ అప్పుడు మేకర్స్ మాత్రం ఓటీటీలో తమ సినిమాని రిలీజ్ చేయాలనుకోలేదు. ఎందుకంటే తమ సినిమాలో మొత్తం 80 నాటి కాలం సంగతులను పరిస్థితులను అప్పటి నేపథ్యం తాలూకు విజువల్స్ ఎక్కువగా ఉంటాయని.. ప్రేక్షకులను 80 నాటి కాలంలోకి తీసుకువెళ్లాలన్నా.. సినిమాలోని ఫీల్ ను వాళ్లు ఇంకా బాగా ఓన్ చేసుకోవాలన్నా.. థియేటర్ అయితేనే బాగుంటుందని మేకర్స్ ఇప్పటివరకూ చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే కరోనా అనంతరమే తమ సినిమాని నేరుగా థియేటర్స్ లోనే విడుదల చేస్తామని స్టేట్మెంట్స్ ఇస్తూ వచ్చారు. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల ప్రకారం థియేటర్లకు జనం రావాలంటే.. అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనబడటం లేదు.

Also Read: సైరా నటుడితో సన్నీ లియోన్‌ ఐటమ్ సాంగ్‌

అందుకే మొత్తానికి అమెజాన్ లో రిలీజ్ చేయడానికి ఈ బయోపిక్ మేకర్స్ ఫిక్స్ అయ్యారట. అమెజాన్ లో రిలీజ్ చేయడమే ప్రొడ్యూసర్లకు బెటర్ అప్షన్. అదే థియేటర్లలో రిలీజ్ చేస్తే.. ఎదురు డబ్బులు కట్టి.. కలెక్షన్స్ లో తేడా జరగకుండా ఆ మొత్తం మేకర్స్ దగ్గరకు చేరాలంటే అది అంత తేలిక అయిన పనేమీ కాదు. అదే ఓటీటీలో రిలీజ్ చేస్తే.. డబ్బులు రూపాయి కూడా ఎదురు కట్టే పని ఉండదు. పైగా ఎలాంటి టెన్సన్స్ లేకుండా భారీ మొత్తంలో డబ్బులు ఒక్కసారిగా వచ్చి పడతాయి. అందుకే ఇప్పుడు భారీ సినిమాల నిర్మాతలు కూడా తమ సినిమాని ఓటిటీలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఐపీఎల్‌పై కరోనా కాటు.. షెడ్యూల్‌లో భారీ మార్పులు!

0


క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) పదమూడో సీజన్‌ సజావుగా జరిగే అవకాశం కనిపించడం లేదు. ఈ మెగా లీగ్‌పై కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. లీగ్‌లో అత్యధిక ప్రజాదరణ ఉన్న జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్కే) కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. ఆ జట్టులో ఒక ప్లేయర్, కొందరు సహాయక సిబ్బంది కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆ టీమ్‌లో మరో ప్లేయర్ కూడా వైరస్‌ సోకింది. బీసీసీఐ లెక్కల ప్రకారం ఇద్దరు క్రికెటర్లు సహా 13 మందికి పాజిటివ్‌ అని తేలింది. కానీ, విశ్వసనీయ సమాచారం ప్రకారం టీమ్‌లో 20 మందిపైనే వైరస్‌ బారిన పడ్డారట. ఇందులో ప్లేయర్లే 12-13 మంది ఉన్నట్టు సమాచారం. సురేశ్‌ రైనా టోర్నీ నుంచి వైదొలిగి స్వదేశానికి తిరిగి రావడానికి కారణం కూడా ఇదే అన్న అభిప్రాయం కలుగుతోంది. జట్టులో ఇంత మందికి పాజిటివ్‌ అని తేలడంతో ఆట లేదు ఏం లేదు ఇంటికొచ్చెయ్‌ అని రైనా కుటుంబ సభ్యులు అతనిపై ఒత్తిడి తెచ్చారట. అందుకే పెట్టేబేడా సర్దుకొని అతను స్వదేశానికి వచ్చాడని తెలుస్తోంది. ఏం చెప్పాలో తెలియకే వ్యక్తిగత కారణాల వల్ల అతను లీగ్‌కు దూరమయ్యాడని సీఎస్కే మేనేజ్‌మెంట్‌ ప్రకటన విడుదల చేసిందని క్రికెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: చెన్నై టీమ్‌కు మరో షాక్..‌ ఐపీఎల్‌ నుంచి తప్పుకున్న సురేశ్‌ రైనా

ఒక్క చెన్నై టీమ్‌లోనే ఇంత మందికి పాజిటివ్‌ అని తేలడంతో ఐపీఎల్‌ నిర్వహణపై అనేక సందేహాలు కలుగుతున్నాయి. ముందుగా నిర్ణయించిన సెప్టెంబర్ 19వ తేదీనే లీగ్‌ మొదలవుతుందా? లేదా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే, టోర్నీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేది లేదని బీసీసీఐ అంటోంది. 19వ తేదీనే షురూ అవుతుందని చెబుతోంది. కానీ, జరుగుతున్న పరిణామాలు చూస్తే లీగ్‌ షెడ్యూల్‌లో మార్పులు అనివార్యం అనిపిస్తోంది. షెడ్యూల్‌ ఇంకా ఖరారు చేయకపోయినప్పటికీ చివరి సీజన్‌లో విజేత, రన్నరప్‌ మధ్య మ్యాచ్‌తో కొత్త సీజన్‌ను మొదలు పెట్టడం ఆనవాయితీ. అది అధికారిక రూల్ కూడా. ఈ లెక్కన గత సీజన్‌లో విన్నర్ ముంబై ఇండియన్స్‌, రన్నరప్‌ చెన్నై సూపర్ కింగ్స్‌ సెప్టెంబర్19వ తేదీన తొలి మ్యాచ్‌ ఆడాల్సి ఉంటుంది. కానీ, అది జరిగేలా లేదు.

ఇప్పుడు చెన్నై టీమ్‌లో చాలా మందికి వైరస్‌ సోకింది. బీసీసీఐ మార్గనిర్దేశాల ప్రకారం పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులంతా 14 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి. వారితో కాంటాక్ట్‌ అయిన వారిని సైతం క్వారంటైన్‌ చేయాలి. ఈ లెక్కన చెన్నై జట్టు ఆటగాళ్లు, సహాయ సిబ్బందిలో సగం మంది ఇంకో రెండు వారాల పాటు హోటల్‌ గదులకే పరిమితం అవుతారు. 14 రోజుల తర్వాత 24 గంటల వ్యవధిలో రెండుసార్లు నెగెటివ్ రిజల్ట్‌ వస్తేనే వారిని ఇతర ఆటగాళ్లతో కలిసి ఆడేందుకు అనుమతిస్తారు. టోర్నీకి ఇంకా 22 రోజుల సమయం ఉన్నప్పటికీ సీఎస్కే టీమ్‌లో డజను మంది ఆటగాళ్లు 14 రోజుల ఐసోలేషన్‌ పూర్తి చేసుకున్నాక వారికి మిగిలేది వారం రోజులే. ఇంత తక్కువ సమయంలో ప్రాక్టీస్ చేసి మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించడం చాలా కష్టం.

Also Read: నేడు ఖేల్ రత్న అందుకోనున్న రోహిత్ శర్మ

అందుకే, లీగ్‌ ఆరంభంలో చెన్నై ఆడాల్సిన మ్యాచ్‌లను వెనక్కు జరపాలని బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్‌ కౌన్సిల్‌ భావిస్తున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 19వ తేదీన తొలి మ్యాచ్‌లో ముంబైతో చెన్నై పోటీ పడే అవకాశం లేదు. అందుకే ఈ వారంతంలోనే షెడ్యూల్‌ను రిలీజ్‌ చేయాలని నిర్ణయించిన బీసీసీఐ ఆ ఆలోచన విరమించుకుందట. చెన్నై టీమ్‌ను దృష్టిలో ఉంచుకొని షెడ్యూల్‌లో మార్పులు చేయాలని చూస్తోంది. దాంతో, షెడ్యూల్‌ ప్రకటన మరింత ఆలస్యం కానుంది. ఇదంతా చూస్తుంటే ఐపీఎల్‌ సజావుగా జరుగుతుందో లేదో అని అభిమానులు కలవరపడుతున్నారు.

పదవీ విరమణపై.. ఉద్యోగుల్లో టెన్షన్?


పదవీ విరమణ వయస్సు పెంపుపై తెలంగాణ సర్కార్ ఎటూ తేల్చకపోవడంతో ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ఉద్యోగ సంఘం నాయకుడి పదవీ విరమణ వయస్సు ఈనెలాఖరకు తీరనుంది. దీంతో పదవీ విరమణ పెంపు ఉంటుందని కొందరు భావిస్తుండగా.. మరికొందరెమీ అలాంటిదేమీ లేదంటూ చర్చంచుకుంటున్నారు. ప్రస్తుతం ఏ ఇద్దరు ఉద్యోగులను కదిపినా ఇదే చర్చ జోరుగా నడుస్తోంది.

Also Read: గ్రేటర్ లో ‘ముందస్తు’ ఎన్నికలు?

సీఎం కేసీఆర్ గతంలోనే ఉద్యోగుల పదవీ విమరణ వయస్సును 58నుంచి 60ఏళ్లకు పెంచుతారని హామీ ఇచ్చినట్లు సమాచారం. పలు క్యాబినెట్ మీటింగులోనూ ఉద్యోగ పదవీ విరమణ వయస్సు పెంచాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ ఎందుకో ఆచరణకు మాత్రం నోచుకోలేదు. సీఎంతో తొలి నుంచి సన్నిహితంగా ఉండే ఉద్యోగ సంఘం నేతలకు టీఆర్ఎస్ పాలనలో మంచి పదవులు దక్కాయి. ఓ ప్రధాన సంఘం నేతకు గతంలో శానసమండలి చైర్మన్ పదవీ దక్కింది. ఇక మరో సంఘం నేతకు ఎమ్మెల్యేతోపాటు మంత్రి పదవీ దక్కిన సంగతి తెల్సిందే.

అయితే ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ పీఆర్సీ, పదవీ విమరణ వయస్సు పెంపులో మాత్రం ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో ఉద్యోగులు సర్కార్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలోనే సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ప్రధాన ఉద్యోగ సంఘం అధ్యక్షుడి పదవీ మరి కొన్ని గంటల్లో ముగియనుంది. దీంతో పదవీ విరమణ వయస్సు పెంపు ఉంటుందా? ఉండదా? అనే చర్చ ఉద్యోగ వర్గాల్లో సాగుతోంది.

Also Read: అదే జరిగితే.. హైదరాబాద్ లో తట్టుకోగలమా?

సీఎంతో సన్నిహితంగా ఉండే వ్యక్తికి పదవీ విరమణ పెంపు లేకుంటే రానున్న రోజుల్లో ఇది అటెకెక్కడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. కాగా గతంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ రమేష్ రెడ్డి పదవీ విరమణ చివరి రోజునే ప్రభుత్వం పెంచింది. బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యుల పదవీ విరమణ వయస్సును 65ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.

గతంలో మాదిరిగానే ప్రస్తుతం కూడా ఇలానే జరుగుతుందని ఉద్యోగ సంఘం నేతలు ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం నుంచి పిలుపు కోసం నేతలు ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలోనే సీఎం కేసీఆర్ పదవీ విరమణ వయస్సును పెంచుతారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

సైరా నటుడితో సన్నీ లియోన్‌ ఐటమ్ సాంగ్‌


సన్నీ లియోన్‌. బాలీవుడ్‌ అందాల ఆటం బాంబ్‌. పోర్న్‌ స్టార్ నుంచి భారత సినీ పరిశ్రమలో టాప్‌ స్టార్ గా మారిన సన్నీకి దేశ వ్యాప్తంగా అభిమానులున్నారు. కొచ్చిలాంటి చిన్న నగరంలో ఓ షాప్‌ ఓపెనింగ్‌కు వచ్చిన తనని చూసేందుకు ఏకంగా రెండు మూడు లక్షల మంది వచ్చారంటేనే ఆ పాపులారిటీ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తొలుత ఐటమ్‌ సాంగ్స్‌తో మెప్పించిన లియోన్‌ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌, హీరోయిన్‌గానూ మారింది. కానీ, ఏ పాత్రలో కనిపించినా.. అందాలను ఆరబోయడంలో మాత్రం తేడా ఉండదు. ఆమె కోసమే చాలా మంది కుర్రాళ్లు థియేటర్లకు వస్తుంటారు. దాంతో, సన్నీని తమ సినిమాలో భాగం చేసుకుంటే మంచి పబ్లిసిటీ లభిస్తుందని దేశంలోని అన్ని భాషల చిత్ర పరిశ్రమలు అనుకుంటున్నాయి. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, బెంగాలీ పరిశ్రమలో అడుగు పెట్టిందామె.

Also Read: ఆదిపురుష్.. ఫ్యాన్ మేడ్ వీడియో వైరల్

చాలా మంది హీరోలతో ఆడిపాడిన సన్నీ లియోన్‌ ఇప్పుడు కన్నడ స్టార్ హీరో, సౌతిండియా యాక్టర్ కిచ్చా సుదీప్‌తో కూడా స్టెప్పులేయనుంది. సుదీప్‌ హీరోగా నటిస్తున్న యాక్షన్‌ డ్రామా ‘కోటిగొబ్బా3’ (కే3) మూవీలో సన్నీ ఓ ఐటమ్‌ సాంగ్‌ చేయనుంది. కన్నడతోపాటు తమిళ్‌, తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా సుదీప్‌ సుపరిచితమే. ఈగలో విలన్‌గా మెప్పించిన అతను.. చిరంజీవి హీరోగా వచ్చిన ప్రతిష్టాత్మక ‘సైరా నరసింహా రెడ్డి’లో కీలక పాత్రతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తను నటించే సినిమాలను దక్షిణాది అన్ని భాషల్లో రిలీజ్‌ చేయాలని నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా మార్కెటింగ్‌, పబ్లిసిటీ రాబట్టేందుకు సన్నీతో ఐటమ్‌ సాంగ్‌ ప్లాన్‌ చేశారు. సౌత్‌లో ఇప్పటికే చాలా సినిమాల్లో ప్రత్యేక పాటలు చేసిందామె. ఇప్పుడు సుదీప్‌తో ఆమె ఆటపాట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సాంగ్‌ హిట్‌ అవుతుందని ఆమె ఆత్మవిశ్వాసంతో ఉంది. ‘నా డ్యాన్సింగ్‌ స్కిల్స్‌, ఐటమ్‌ సాంగ్స్‌ను ప్రజలు ఇష్టపడుతున్నారని తెలిసి చాలా సంతోషిస్తున్నా. ఈ క్రెడిట్ మొత్తం సంగీత, నృత్య దర్శకులకే వెళ్తుంది. కే3 ఐటమ్‌ నంబర్ ను అందంగా ప్లాన్‌ చేశారు. ఇది కచ్చితంగా హిట్‌ అవుతుందన్న నమ్మకం ఉంది’ అని సన్నీ అంటోంది.

భారతీయ వైద్యుడిని స్మరించుకుంటున్న చైనా.. ఎందుకంటే?


భారత్-చైనా మధ్య కొద్దికాలంగా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. భారత సరిహద్దుల్లోని గాల్వానా లోయలో ఇరుదేశాల మధ్య జరిగిన ఘర్షణలో 21మంది భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెల్సిందే. ఈ ఘర్షణలో చైనాకు చెందిన జవాన్లు కూడా భారీ సంఖ్యలో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే చైనా మాత్రం అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో భారత్ చైనాకు చెందిన పలు కంపెనీల కాంట్రాక్టులు.. యాప్స్ ను బ్యాన్ చేసి షాకిచ్చింది. ఇదిలా ఉంటే ఓ భారతీయుడు కాంస్య విగ్రహాన్ని చైనాలో ఏర్పాటు చేసేందుకు సన్నహాలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

Also Read: ‘లవ్ జిహాద్’.. మతం పేరిట యుద్ధం

భారత్-చైనా ఇరుదేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలో చైనా ఓ భారతీయ వైద్యుడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనుండటం ఆసక్తిని రేపుతోంది. వచ్చే నెలలో ఓ మెడికల్ కళాశాల ఎదుట భారతీయ వైద్యుడి విగ్రహం ఏర్పాటు చేసేందుకు చైనా సన్నహాలు చేస్తోంది. దీంతో ఆ భారతీయుడు ఎవరా? అనే ఆసక్తి నెలకొంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చైనాలో ఓ భారతీయ వైద్యుడు చేసిన సేవలను గుర్తింపుగా చైనా ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనుందని తెలుస్తోంది.

Also Read: గల్వాన్ లో చైనా సైనికులు చనిపోయారు.. ఇదిగో సాక్ష్యం..

మహారాష్ట్రలోని షోలపూర్ చెందిన ద్వారకానాథ్ కోట్నీస్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చైనాకు వెళ్లారు. జపాన్ దురాక్రమణపై పోరాడుతున్న కమ్యూనిస్టు సైనికులకు ఆయన వైద్య సేవలందించారు. 1938లో చైనాకు వెళ్లిన కోట్నిస్ చనిపోయేంతవరకు అంటే 1942 వరకు అక్కడే ఉన్నారు. చైనా యువతినే పెళ్లి చేసుకున్నాడు. చనిపోయేటప్పటికీ కోట్నీస్ వయస్సు 32ఏళ్లే. ఆయన సేవలకు గుర్తింపు చైనాలోని షిజియాజువాంగ్ నగరంలోని ఒక మెడికల్ కాలేజీ ఎదుట వచ్చే నెలలో కోట్నీస్ కాంస్య విగ్రహాం ఏర్పాటు చేయబోతుంది. ఇది ఒకరకంగా భారతీయులకు గర్వకారణమే అని చెప్పొచ్చు. ఇప్పటికైనా చైనా భారత్ పట్ల తన వైఖరిని మార్చుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

ఫ్యాన్స్‌కు పండగే పదేళ్ల తర్వాత మళ్లీ మహేశ్‌-త్రివిక్రమ్ కాంబో!‌


సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, సూపర్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ది హిట్‌ కాంబినేషన్‌. ‘అతడు’ మూవీతో మహేశ్‌ కెరీర్ టర్న్‌ చేశాడు త్రివిక్రమ్‌. ‘పోకిరి’ తర్వాత వరుస ఫ్లాప్స్‌ ఎదురై.. ఎలాంటి కథ ఎంచుకోవాలో తెలియని అయోమయంలో పడ్డ సూపర్ స్టార్ తో ‘ఖలేజా’ తీశాడు. ఈ మూవీతో అతనిలోని హ్యమర్, కామెడీ యాంగిల్‌ను బయటకు తీసి.. సరికొత్త మహేశ్‌ను పరిచయం చేసిన ఘనత త్రివిక్రమ్‌దే అనొచ్చు. అక్కడి నుంచి ప్రతి సినిమాలో తమ మార్కు హ్యూమర్ ఉండేలా చూసుకుంటున్నాడు సూపర్ స్టార్. 2010లో రిలీజైన ఖలేజా ‌ తొలుత డివైడ్ టాక్‌ తెచ్చుకున్నా.. తర్వాత ప్రేక్షకులను బాగా ఆకట్టుంది. తన కెరీర్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంటుందని మహేశ్‌ చాలా సార్లు చెప్పాడు. అయితే, ఈ పదేళ్లలో మహేశ్‌, త్రివిక్రమ్‌ మళ్లీ కలిసి పని చేయలేకపోయారు. ఒకటి రెండు సార్లు వీరిద్దరి కాంబినేషన్‌ కుదిరిందన్న వార్తలు వచ్చినా మూవీ పట్టాలెక్కలేదు. ఇద్దరి మధ్య క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ రావడమే అందుకు కారణం అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దాని వల్ల ఇద్దరి మధ్య కొంత గ్యాప్‌ కూడా ఏర్పడిందట. అందుకే ఒకరిపై ఒకరికి అభిమానం, గౌరవం, ప్రేమ ఉన్నప్పటికీ పదేళ్లుగా వీళ్ల కాంబినేషన్‌లో మరో సినిమా రాలేదని అంటున్నాయి.

Also Read: హాలీవుడ్‌ స్టార్ హీరో కన్నుమూత

అయితే, తాజా సమాచారం మేరకు మహేశ్, త్రివిక్రమ్‌ మళ్లీ కలిశారు. వీరిద్దరి కాంబినేషన్లో మూడో సినిమా రాబోతోందని తెలుస్తోంది. మహేశ్‌ కోసం త్రివిక్రమ్‌ పవర్ ఫుల్‌ స్క్రిప్టు రెడీ చేశాడట. లాక్‌డౌన్‌ విరామంలో దాదాపు ఐదు వారాల పాటు కష్టపడి మంచి కథ, కథనం రాశాడని సమాచారం. ఇప్పటికే మహేశ్‌కు పాయింట్‌ చెప్పాడని తొందర్లోనే స్క్రిప్టు చెప్పాలని నిర్ణయించుకున్నాడట. అంతా సవ్యంగా సాగితే మహేశ్- త్రివిక్రమ్‌ కాంబినేషన్లో మూడో చిత్రాన్ని హారిక, హాసిని క్రియేషన్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్‌ కలిసి నిర్మిస్తాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: నాగార్జున వైల్డ్‌ డాగ్‌ లుక్‌ అదుర్స్‌.. షూటింగ్‌ ఎప్పుడంటే

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘సరిలేరు నీకెవ్వరూ’తో హిట్‌ ఖాతాలో వేసుకున్న మహేశ్‌ ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చేయాల్సి ఉంది. తొందర్లోనే ఈ మూవీ షూటింగ్‌ షురూ కానుంది. మరోవైపు అల్లు అర్జున్‌తో ‘అల వైకుంఠపురములో’తో భారీ విజయాన్ని సొంతం చేసుకొని ఫామ్‌లోకి వచ్చిన త్రివిక్రమ్‌.. జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమాకు కమిటయ్యాడు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన వెంటనే మహేశ్‌- త్రివిక్రమ్‌ కాంబో తెరపైకి రానుంది. అదే జరిగితే ఇద్దరి అభిమానులకు పండగే.

వందల కోట్లు వృథా.. టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిర్వాకం


ఒకటి కాదు.. రెండు కాదు.. వందల కోట్లు.. ప్రజాప్రతినిధిగా గెలిచిన వారందరూ నిధులు కావాలని సీఎంల వెంటపడుతున్నారు. మా నియోజకవర్గంలో ఆ పనిచేయాలి.. ఈ పనిచేయాలి.. నిధులు ఇవ్వండని మొరపెట్టుకుంటారు. సిద్ధిపేట ఎమ్మెల్యే కం మంత్రి హరీష్ రావు అయితే పట్టుబట్టి మరీ నిధులు కేటాయించుకొని సిద్ధిపేటలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుంటారు.కానీ అందరూ ఎమ్మెల్యేలు హరీష్ రావుల ఉండరు కదా.. అదే బాధ..

Also Read: గ్రేటర్ లో ‘ముందస్తు’ ఎన్నికలు?

నియోజకవర్గంలో బోలెడన్నీ పనులు చేయడానికి ఉంటాయి. తాగునీటి కొరత.. రోడ్లు, డ్రైనేజీలు, హరితహారం, పారిశుధ్యం, తరగతి గదులు, వైద్యశాలలు ఇలా ఎన్నో గ్రామాల్లో పెండింగ్ వర్క్స్ ఉంటాయి. ప్రజలు కూడా ప్రజాప్రతినిధులు కనపడితే చాలు ఈ పని ఆ పని అంటూ సమస్యల చిట్టాను ముందు పెడుతుంటారు. కానీ మన ఎమ్మెల్యేలు మాత్రం నిధులు లేవంటూ తప్పించుకుంటారు.కానీ పైసలు ఇచ్చినా ఖర్చు చేయని మన తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఏమనాలి?

తాజాగా తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. తెలంగాణ రాష్ట్రంలో గత కేసీఆర్ ప్రభుత్వం 2014-19 కాలంలో ఎమ్మెల్యేలకు , ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులను భారీగా కేటాయించింది. కానీ వాటిని ఖర్చు చేయడంలో వారి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వారి నిర్లక్ష్యం వల్ల ప్రజలకు పనులు కాకుండా వారు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

2014-19 మధ్య గత ఐదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఏకంగా 1440 కోట్లు విడుదల చేసింది. వీటిని నాలాలు, బోర్లు, స్కూల్ బిల్డింగులు, స్ట్రీట్ లైట్లు ఇతర పనులకు నియోజకవర్గాల్లో ఖర్చు చేయాలని సూచించింది. కానీ ప్రజాప్రతినిధులు కేవలం రూ.974 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.

Also Read: అదే జరిగితే.. హైదరాబాద్ లో తట్టుకోగలమా?

ఇక ఎమ్మెల్సీలకు తెలంగాణ ప్రభుత్వం రూ.974 కోట్లు కేటాయించగా.. రూ.254 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. తాజాగా ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఓ వ్యక్తి దరఖాస్తు చేయగా.. మన ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం బయటపడింది.

ఇలా డబ్బులిచ్చినా కూడా పనిచేయని ఖర్చు చేయని మన ఎమ్మెల్యేల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధులు ఖర్చు చేస్తే పర్సంటేజిల ద్వారా కూడా సంపాదించుకునే అవకాశం ఉన్నా మన ప్రజాప్రతినిధుల బద్దకం కారణంగా ఆ నిధులు మురిగిపోయాయి.

-ఎన్నం

బడా ప్రొడ్యూసర్ తో ప్రభాస్‌ మరో బాలీవుడ్‌ మూవీ?


బాహుబలి తర్వాత గ్లోబల్‌ హీరోగా మారిపోయిన టాలీవుడ్‌ యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ ఇప్పుడు హిందీపైనే దృష్టి పెట్టాడా? ఇకపై పూర్తిగా బాలీవుడ్‌ సినిమాలే చేయబోతున్నాడా? రాధేశ్యామ్‌, నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్లో వచ్చే సినిమా తర్వాత ప్రభాస్‌ హిందీ డైరెక్టర్లతో పాన్‌ ఇండియా చిత్రాల్లోనే నటిస్తాడా? అంటే సినీ సర్కిల్స్‌లో అవుననే సమాధానం వస్తోంది. తన మార్కెట్‌, అభిమానుల సంఖ్య, అంచనాలు పెరిగిన నేపథ్యంలో వాటిని అందుకునేందుకు బాలీవుడ్‌ బాట పట్టడమే మార్గం అనుకుంటున్నాడని సమాచారం. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయట పెట్టాడు. ‘ఫిల్మ్ మేకర్స్ పాన్ ఇండియా సినిమాలు తీయాలి. అలాంటి చిత్రాల ద్వారానే తక్కువ సమయంలో విస్తృత శ్రేణి ప్రేక్షకులను చేరుకోగలం. బాలీవుడ్ అతి పెద్ద చిత్ర పరిశ్రమల్లో ఒకటి. కాబట్టి నేను అక్కడ పనిచేయడానికి ఎందుకు ఇష్టపడను?’ అని అన్నాడు.

Also Read: పవన్‌ బర్త్‌డే స్పెషల్‌… ఓ సర్ప్రైజ్‌, ఓ సస్పెన్స్‌

ఈ స్టేట్‌మెంట్‌ తర్వాత ప్రభాస్‌ను దృష్టిలో ఉంచుకొని పలువురు స్టోరీలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే హిందీ దర్శకుడు ఓం రౌత్‌తో ‘ఆదిపురుష్‌’ సినిమాకు ఒప్పుకున్న మన డార్లింగ్‌ కోసం పలువురు బాలీవుడ్‌ బడా డైరెక్టర్లు కథతో సిద్ధంగా ఉన్నారు. దాంతో, ప్రభాస్‌ తదుపరి సినిమాను సాజిద్‌ నడియావాలా నిర్మించే అవకాశం కనిపిస్తోంది. డార్లింగ్‌తో ఓ సినిమా కోసం సాజిద్‌ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభాస్‌పై ఎంత పెట్టుబడి పెట్టినా దానికి మూడు నాలుగింతలు రాబడి వచ్చే అవకాశం ఉంది. దాంతో, టాలీవుడ్‌ డార్లింగ్ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు బాలీవుడ్‌ పెద్దలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Also Read: హాలీవుడ్‌ స్టార్ హీరో కన్నుమూత

కరణ్‌ జోహార్, ఆదిత్య చోప్రా సహా పలువురు టాప్‌ ప్రొడ్యూసర్స్‌.. రెబల్‌ స్టార్ డేట్స్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారట. ఈ రేసులో ప్రముఖ నిర్మాత, దర్శకుడు, రైటర్ అయిన సాజిద్‌ ఓ అడుగు ముందున్నారట. భారీ యాక్షన్‌, మల్టీస్టారర్ సినిమా నిర్మాతగా నడియావాలాకు మంచి పేరుంది. గతేడాది సూపర్ 30, చిచ్చోరే, హౌస్‌ఫుల్‌ 4, భాగీ 3 వంటి హిట్‌ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు సాజిద్‌. సల్మాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో కిక్‌2 ను స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఆయన నిర్మించిన కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ ‘83’, ‘తడాప్‌’ ‘బచ్చన్‌ పాండే’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రభాస్‌తో ఓ భారీ యాక్షన్‌ ఎంటర్టైనర్ చేయాలని ఆశిస్తున్నారు. ఒకవేళ ప్రభాస్‌, సాజిద్‌ కలిస్తే అది బాలీవుడ్‌లో అతి పెద్ద ప్రాజెక్టు కానుంది.

ఆదిపురుష్.. ఫ్యాన్ మేడ్ వీడియో వైరల్


డార్లింగ్ ప్రభాస్ ‘బాహుబలి’ మూవీతో వరల్డ్ వైడ్ హీరోగా మారిపోయాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’లో ప్రభాస్ మహేంద్ర బాహుబలిగా నటించి అందరినీ మెస్మరైజ్ చేశారు. ఈ మూవీ ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబట్టింది. దీంతో ప్రభాస్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిగణం ఏర్పడింది. టాలీవుడ్ స్థాయి నుంచి ప్రభాస్ క్రేజ్ వరల్డ్ స్థాయికి ఎదిగింది.

Also Read: హాలీవుడ్‌ స్టార్ హీరో కన్నుమూత

‘బాహుబలి’ సీరీసుల తర్వాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా కథలను చేస్తూ తన స్థాయిని పెంచుకుంటున్నారు. ‘సాహో’తో బాలీవుడ్ ప్రేక్షకులను ప్రభాస్ మరింత దగ్గరయ్యారు. యాక్షన్ మూవీగా తెరకెక్కిన సాహో తెలుగులో పెద్దగా విజయం సాధించినప్పటికీ బాలీవుడ్లో మాత్రం మంచి కలెక్షన్లు సాధించింది. తాజాగా ‘రాధే’ మూవీలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ మూవీలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

తాజాగా ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘తానాజీ’ ఫేమ్ ఓం రౌత్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ జోడీగా కీర్తి సురేష్ లేదా బాలీవుడ్ భామ కియరా అద్వానీ నటిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఆదిపురుష్‌ మూవీ దాదాపుగా వెయ్యి కోట్లతో తెరకెక్కనుందని సమాచారం.

Also Read: నాగార్జున వైల్డ్‌ డాగ్‌ లుక్‌ అదుర్స్‌.. షూటింగ్‌ ఎప్పుడంటే

ప్రభాస్ రాముడిగా క‌నిపించ‌నుండటంతో అభిమానుల్లు ఈ మూవీపై ఆసక్తి చూపుతున్నారు. రాముడిగా ప్రభాస్ ఎలా ఉంటాడో చూపిస్తూ ప్రభాస్ అభిమానులు కొందరు కొన్ని డిజైన్స్ రూపొందించారు. చేతితో వేసిన చిత్రాలు, పెయింటింగ్స్‌, డిజిట‌ల్ ఆర్ట్‌, ఫొటోషాప్ స్టిల్స్ తో కలిపి ఓ వీడియోను రూపొందించారు. ఈ వీడియోను చిత్ర దర్శకుడు ఓం రావ‌త్ తన ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో వైరల్ అవుతోంది.

‘లవ్ జిహాద్’.. మతం పేరిట యుద్ధం


‘లవ్ జిహాద్’.. ప్రేమలో కొత్త కోణం.. కానీ మతం ముసుగులో ప్రేమ పేరిట ఆడుతున్న వికృత ఆట.. దేశాన్ని ఒక మతంలోకి తీసుకురావాలన్న మత చాంధసవాదులు, సంస్థలు కలిసి చేస్తున్న ఈ పన్నాగంపై కేంద్రం సీరియస్ అవుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు సూచించింది. అమాయకపు ఆడపిల్లలను ప్రేమ పేరిట ముగ్గులోకి దించి మతం మార్చి పెళ్లి చేసుకునే ఈ దురాచారాన్ని ఓ మతం యువకులు పగబట్టి చేస్తున్న వైనం విస్తుగొలుపుతోంది.

Also Read: అదే జరిగితే.. హైదరాబాద్ లో తట్టుకోగలమా?

ఇప్పుడు ఉత్తర భారతదేశంతోపాటు కర్ణాటకలోనూ ‘లవ్ జిహాద్’ కేసులు ఎక్కువ అవుతుండడం పోలీస్ శాఖను కలవరపెడుతున్నాయి. కొన్ని మత సంస్థలు, సంఘాలు యువకులను ప్రోత్సహించి మరీ హిందూ మతంలోని ఆడపిల్లలను ప్రేమ పేరుతో వలవేస్తూ మతాన్ని మార్చి పెళ్లి చేసుకుంటున్నారు. దీన్నే వారు ‘లవ్ జిహాద్’ అంటున్నారు. దీని కారణంగా హిందూ ముస్లింల మధ్య గొడవలు, హత్యలు, కేసులు పెట్టుకోవడం పెరిగిపోతోంది. కొన్ని సంఘాలు దీనికి మద్దతు ఇస్తూ పెంచిపోషిస్తున్నాయని కేంద్రం నిఘాలో కనిపెట్టాయి.

తాజాగా ఉత్తరప్రదేశ్ లోని మీరట్, కాన్పూర్, లక్నోలో యువతులను బలవంతంగా మతం మార్చి మరో మతం యువకులకు పెళ్లి చేశారని ఆరోపణలు వచ్చాయి. సాక్ష్యాలు పోలీసులకు దొరికాయి. దీంతో ఈ సున్నితమైన అంశంపై ఏం చేయాలని కేంద్రాన్ని ఆ రాష్ట్రం కోరగా ఉక్కుపాదం మోపాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.

Also Read: టీఆర్ఎస్ వేటకు కాంగ్రెస్ కుదేలు

దీంతో యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ ఈ ‘లవ్ జిహాద్’ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. సమాజంలో తప్పుడు సంకేతాలు వెళుతూ అల్లకల్లోలానికి కారణం అవుతున్న లవ్ జిహాద్ ను అడ్డుకోవాలని రాష్ట్ర పోలీస్ శాఖకు అల్టిమేటం జారీ చేశారు. ఇటువంటి పరిణామం చోటుచేసుకుంటే యూపీలో పోలీసులు వెళ్లి కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

దేశవ్యాప్తంగా ఈ లవ్ జిహాద్ ను అరికట్టడానికి ఒక వ్యూహాన్ని సిద్ధం చేయాలని.. ఆ వ్యూహం ప్రకారం ముందుకెళ్లాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. లవ్ జిహాద్ పేరిట ఆగడాలకు చెక్ పెట్టడానికి కేంద్రం సిద్ధమవుతోంది.

హాలీవుడ్‌ స్టార్ హీరో కన్నుమూత


హాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ ఓ ధ్రువతారను కోల్పోయింది. అవెంజర్స్‌, బ్లాంక్ పాంథర్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో హీరోగా నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న చాద్విక్‌ బోస్‌మన్‌ను క్యాన్సర్ కబలించింది. కొంతకాలంగా ఈ ప్రాణాంతక మహమ్మారితో పోరాడుతున్న ఆయన లాస్‌ ఏంజెలెస్‌లోని తన నివాసంలో శుక్రవారం కన్ను మూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. బోస్‌మన్‌ క్యాన్సర్ బారిన పడినట్టు 2016లో గుర్తించారు. అప్పటికే కొలన్‌ క్యాన్సర్ మూడో దశలో ఉంది. అప్పటి నుంచి నాలుగేళ్ల పాటు చికిత్స పొందారు. ఓ వైపు చికిత్స తీసుకుంటూనే ఈ నాలుగేళ్లలో చాద్విక్‌ పలు సినిమాల్లో నటించి మెప్పించారు.

Also Read: పవన్‌ బర్త్‌డే స్పెషల్‌… ఓ సర్ప్రైజ్‌, ఓ సస్పెన్స్‌

12 ఏళ్ల సినీ ప్రస్థానంలో బోస్‌మన్‌ 11 సినిమాల్లో నటించారు. పలు టీవీ షోలు, సిరీస్‌ల్లో కూడా నటించారు. 2016లో వచ్చిన కెప్టెన్‌ అమెరికాతో స్టార్గా మారిన చాద్విక్ కెరీర్లో బ్లాక్‌ పాంథర్ మూవీ ఓ మైలురాయిగా నిలిచింది. 2018లో రిలీజైన ఈ చిత్రంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు 2018లో అత్యధిక వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. అదే ఏడాది అవెంజర్స్‌ ఇన్ఫినిటీ వార్, గతేడాది వచ్చిన అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌ సినిమాలతో బోస్‌మన్‌ పేరు మార్మోగిపోయింది. అవెంజర్స్‌ సిరీస్‌ మూవీస్‌ భారీ వసూళ్లు రాబట్టాయి. దాంతో నల్ల జాతీయుడైన తొలి సూపర్ హీరోగా చాడ్విక్ హాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్నారు.

Also Read: నాగార్జున కు బ్యూటిఫుల్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన ‘లవ్ స్టోరీ’ టీమ్

బోస్‌మన్‌ చివరగా ద 5 బ్లడ్స్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆ మూవీ ఈ ఏడాదే రిలీజవగా… ‘మ రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌’ ఆయన నటించిన చివరి చిత్రం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. కాగా, బోస్‌మన్‌ మ‌ర‌ణ‌వార్తతో సినీలోకం దిగ్భ్రాంతికి గురైంది. హాలీవుడ్‌ ప్రముఖ నటీనటులతో పాటు బాలీవుడ్ నుంచి కూడా సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీలో ఉన్న డొమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ కూడా విచారం వ్యక్తం చేశారు.