Home Blog Page 8339

139మంది రేప్ కేసులో మాటమార్చిన బాధితురాలు..!

139 members rape case victim change their mind

139మంది తనపై అత్యాచారం చేశారని ఓ యువతీ తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెల్సిందే. ఈ కేసుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. యువతీ ఆరోపణలపై పోలీసులు.. ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు బాధిత యువతీ పట్ల వకల్తా పుచ్చుకొని మాట్లాడుతుండగా.. మరికొందరేమో ఇందులో వేరే కోణం ఉందని వాదిస్తున్నారు. తొలి నుంచి ఈ కేసులో సెలబ్రీలకు కూడా సంబంధం ఉందని చెప్పిన బాధితులు సడెన్ గా మాటమార్చడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి.
Also Read : సంచలనం: 139మంది రేప్ కేసులో భారీ ట్విస్ట్

ఈ రేప్ కేసులో తొలి నుంచి బాధితులు 139మంది తనను రేప్ చేశారని చెబుతోంది. ఇందులో సిని ఇండస్ట్రీకి చెందిన యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు తనపై అత్యాచారం చేసినట్లు భాదితులు ఆరోపించింది. దీంతో వారిద్దరు మీడియా ముందుకొచ్చి ఆమెతో తమకు సంబంధం లేదని చెబుతూ లీగల్ ఫైట్ కు సిద్ధమయ్యారు. ఈ కేసులో పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడిస్తున్న సమయంలో బాధితురాలు మీడియా ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె గతంలో చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

తాజాగా మీడియా ముందుకొచ్చిన బాధిత యువతీ తనను 139మంది అత్యాచారం చేయలేదని చెప్పుకొచ్చింది. దీనిలో సెలబ్రెటీలకు సంబంధం లేదని చెప్పడంలేదని తన వల్ల వాళ్లు ఇబ్బందులు పడ్డారని.. వారికి తాను క్షమాపణలు చెబుతున్నానని చెప్పింది. డాలర్ బాయ్ అనే వ్యక్తి తన ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించడంతో యాంకర్ ప్రదీప్, సీని నటుడు కృష్ణుడి పేర్లను అత్యాచారం కేసులో చెప్పినట్లు పేర్కొంది. తనపై లైంగిక దాడి జరిగిన మాట వాస్తవేగానీ ఇందులో వారిద్దరి సంబంధం లేదని బాధితులు మీడియా ఎదుట చెప్పింది.

Also Read : కోమటిరెడ్డికి కీలక పదవీ దక్కనుందా?

డాలర్ బాయ్ కారణంగానే 50శాతం వేధింపులకు గురికాగా మరో 50శాతం బయటి వ్యక్తుల నుంచి ఇబ్బందులు పడినట్లు బాధితురాలు వాపోయింది. తనకు మహిళా సంఘాలు, కులసంఘాలు, మీడియా, పోలీసులు మద్దతు ఇచ్చి డాలర్ బాయ్ వేధింపుల నుంచి రక్షించారని తెలిపింది. తనను లైంగిక వేధించిన వివరాలను మూడు విభాగాలు చేసి పోలీసులకు అందించచడం జరిగింది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటికి వస్తాయని చెబుతుండటం గమనార్హం.

యువతీ ఒకసారి సెలబ్రెటీలకు సంబంధం ఉందని.. మరోసారి వారికి సంబంధం లేదని చెబుతుండటంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. బాధితులపై ఒత్తిడి చేసి ఎవరైనా వారి పేర్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. సస్పెన్స్ థిల్లర్ ను తలపించేలా రోజుకో ట్వీస్టు ఇస్తున్నా ఈ కేసు చివరికీ ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే..!

‘జీఎస్టీ’పై జగన్ కు మరోదారి లేదా?

Is there no other way for Jagan on ‘GST’?

కరోనా వైరస్ ప్రపంచాన్నే చిన్నాభిన్నం చేసింది. అన్ని దేశాలు తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. మన దేశం ఇందుకు భిన్నమేమీ కాదు. కరోనా వైరస్ కారణంగా మార్చి మూడవ వారం నుంచి జూలై వరకూ పూర్తి లాక్ డౌన్ కోనసాగింది. దీంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఫలితంగా ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయం బాగా తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ (గూడ్స్ సర్వీసు టాక్స్) వసూలు చేసి రాష్ట్రాలకు వాటా ఇస్తుంది. కరోనా నేపథ్యంలో జీఎస్టీ వాటా చెల్లించలేమని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అగాధాన్ని పెంచేలా ఉంది.

Also Read : జగన్ చేతకాని తనమే ఏపీ దుస్థితికి కారణమంటున్న ఆర్కే?

కేంద్రం ప్రకటనపై ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్నాయి. తెలంగాణా, బీహార్ వంటి రాష్ట్రాలు జీఎస్టీ ఎందుకు చెల్లించలేరని ప్రశ్నిస్తున్నాయి. ఏపీ మాత్రం ఈ వ్యవహారంపై ఇంత వరకూ ఏటువంటి దోరణి అవలంభించాలనే ఓ నిర్ణయానికి రాలేదు. కేంద్ర ప్రభుత్వం నెలకు రూ. 90 వేల కోట్ల నుంచి లక్ష వరకూ జీఎస్టీని వసూలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి జీఎస్టీ ద్వారా నెలకు రూ. 2,200 కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉందని ఆర్ధిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.  ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రాలకు జీఎస్టీ వాటా చెల్లించలేమని కేంద్రం చెబుతూ ఉపసమనంగా… రాష్ట్రాలు అప్పులు తీసుకునేందుకు ఎఫ్ఆర్బీఎం పరిమితి పొడిగించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. అయితే కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలతో సహా మిగిలిన రాష్ట్రాలు ఈ అంశాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రమే అప్పు తీసుకుని జీఏస్టీ కింద రాష్ట్రాలకు నిధులు అందించాలని పశ్చిమ బెంగాల్, పంజాబ్ తదితర రాష్ట్రాల ఆర్ధిక శాఖ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు.

అన్ని వ్యవహారాల్లో కేంద్రానికి అనుకూలంగా వ్యవహరించే ఏపీ సీఎం జగన్ ఈ వ్యవహారంలో ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల కిందట విద్యుత్ చట్టానికి సరవణ చేస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ను తెలంగాణా సహా మరికొన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు వ్యతిరేకించినా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం మిన్నకుండి పోయారు. కేంద్రం విద్యుత్ చట్టంలో తెచ్చిన మార్పుల కారణంగా రాష్ట్రాల అధికారాలకు భంగం కలుగుతుందని రాష్ట్రాలు వాదించాయి. సీఎం జగన్ కేంద్రానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు జీఎస్టీపై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సహా 15 రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు సమావేశమై ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. ఈ వారంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన ఆర్ధిక, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో జీఎస్టీపై అనుసరించాల్సిన వ్యూహంపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Also Read : ఉద్యోగుల సంఘం పిటీషన్ వెనుక కారణమదేనా?

జగన్ చేతకాని తనమే ఏపీ దుస్థితికి కారణమంటున్న ఆర్కే?

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రతి ఆదివారం తన కొత్త పలుకు ద్వారా తెలుగు రాష్ట్రాల పాలకుల పాలనపై కీలక వ్యాఖ్యలు చేస్తారనే సంగతి తెలిసిందే. తాజాగా ఆర్కే తన కొత్త పలుకులో జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సీఎం జగన్ చేతగానితనం వల్లే ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడంలో, నిర్ణయాలు తీసుకున్నా అమలు చేయడంలో విఫలమవుతోందని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా చెప్పకపోయినా పరోక్షంగా ప్రతి మాటలో ఆర్కే జగన్ పాలనపై అవాక్కులు చవాక్కులు పేల్చారు.

Also Read : జగన్ దగ్గరకు పోతా అంటున్న బాలయ్య… బాబు తట్టుకోగలడా?

జగన్ ఇళ్ల పట్టాల పంపిణీ నిర్ణయం, మూడు రాజధానుల నిర్ణయం న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకోవడానికి జగన్ అనుసరించిన విధానమే కారణమని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన జగన్ కు ఏ కోశాన లేదని ఆర్కే అన్నారు. పేదలకు ఏ విధంగా ఇళ్ల పట్టాలు ఇస్తే చెల్లవో ఆ విధంగా జగన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుండటం వల్లే జగన్ ఇళ్ల పట్టాల పంపిణీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతోందని తెలిపారు.

చంద్రబాబు కోర్టులను మేనేజ్ చేస్తున్నారని వస్తున్న ఆరోపణలపై సైతం ఆర్కే స్పందించి వివరణ ఇచ్చారు. జగన్ నిర్ణయాలకు హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బలు తగులుతున్నాయని… దీనిని బట్టి చంద్రబాబుపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో హేతుబద్ధత అర్థమవుతోందని చెప్పారు. జగన్ ప్రతి నిర్ణయాన్ని విపక్షాలు కోర్టుల్లో అడ్డుకుంటున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని… నిజాలు నిలకడ మీద తెలుస్తాయని అన్నారు.

Also Read : బాలయ్య మంత్రం.. కరోనా పరార్ అవాల్సిందే?

కోమటిరెడ్డికి కీలక పదవీ దక్కనుందా?

Does Komatireddy deserve a crucial position ?
తెలంగాణ కాంగ్రెసులో కోమటిరెడ్డి బ్రదర్స్ కు మంచి క్రేజ్ ఉంది. నల్లొండ జిల్లాకే పరిమితమైన కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెసులో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నల్లొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ హవా కొనసాగింది. అయితే ఇటీవల కాలంలో జిల్లాలో వారి ప్రాధాన్యత తగ్గుతూ వస్తుందనే ప్రచారం జరుగుతోంది. అయితే వీటన్నింటికి చెక్ పెట్టేలా కోమటిరెడ్డికి కాంగ్రెసులో ఓ కీలక పదవీ రాబోతుందనే టాక్ తాజాగా విన్పిస్తోంది.

Also Read : గ్రేటర్ పై కన్నేసిన బీజేపీ.. వ్యూహమెంటీ?

నల్గొండ జిల్లాలో జానారెడ్డి వంటి సీనియర్ ఉన్నప్పటికీ దివంగత రాజశేఖర్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ కే ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన మరణానంతరం సీఎం అయిన కిరణ్ కుమార్ రెడ్డి నల్లొండకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రాధాన్యత ఇచ్చారు. వీరిద్దరు ఒకేసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో వీరిమధ్య చాలా సన్నిహిత్యం ఉండేది. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ కే ప్రాధాన్యం ఇచ్చారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమిపాలయ్యారు. అయితే ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసి గెలుపొంది సత్తాచాటాడు.

కాంగ్రెస్ పీసీసీ రేసులో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు కూడా విన్పిస్తోంది. తనకు పీసీసీ ఇస్తే కేసీఆర్ పై తన ప్రతాపం చూపిస్తానంటూ ఎన్నోసార్లు బహిరంగగానే ప్రకటించాడు. అయితే ఆయనకు తెలంగాణ వ్యాప్తంగా చరిష్మా లేకపోవడంతో అధిష్టానం ఆయనకు పదవీ ఇచ్చేందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. అయితే ఆర్థికంగా బలంగా ఉన్న కోమటిరెడ్డి సేవలను మరోవిధంగా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు సీడబ్ల్యూసీలోకి కోమటిరెడ్డిని తీసుకోవాలని ఏఐసీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

రాబోయే ఎన్నికలు కులపరంగా జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ అధిష్టానం ఉందని భావిస్తోంది. దీంతో తొలి నుంచి కాంగ్రెస్ కు అండగా ఉంటున్న రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీఠ వేయాలని భావిస్తోంది. జానారెడ్డి వయస్సు రీత్య రాజకీయాల్లో యాక్టివ్ లేకపోవడంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సీడబ్ల్యూసీలోకి తీసుకోవాలని అధిష్టానం భావిస్తోంది. దీంతో కొన్ని జిల్లాలో కోమటిరెడ్డి ఆర్థికంగా కాంగ్రెస్ ను ఆదుకుంటాడని భావిస్తుందట. అదేవిధంగా రేవంత్ రెడ్డికి కూడా ఓ కీలక పదవీ ఇవ్వడం ద్వారా రెడ్డి సామాజికవర్గాన్ని సంతృప్తి పర్చాలని కాంగ్రెస్ భావిస్తుందట. దీంతో కోమటిరెడ్డికి కాంగ్రెస్ ప్రమోషన్ ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది.

కళ్లజోడు వాడేవారికి షాకింగ్ న్యూస్..!

Shocking news for those who wear glasses

కరోనా కాలంలో ఏం చేయాలన్నా.. ఏం ముట్టుకోవాలన్నా.. ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ సోకకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఎటూ ప్రమాదం వస్తుందోననే భయాందోళన ప్రతీఒక్కరిలో నెలకొని ఉంటోంది. కరోనా విషయంలో డబ్ల్యూహెచ్ఓ, యూనిసెఫ్, సామాజిక సంస్థలు, వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. అయితే రోజుకో కరోనా న్యూస్ బయటికి వస్తుండటంపై ప్రజల్లో ఆందోళన నెలకొంటుంది.

Also Read : ఆ గ్యాస్ తో కరోనా వైరస్ వ్యాప్తికి చెక్…?

జిత్తులమారి కరోనా వస్తువులపై ఎన్ని గంటలపాటు ఉంటుందనే విషయంలో యూనిసెఫ్ కొన్ని విషయాలను వెల్లడించింది. వైరస్ గాలిలో ఎక్కువ దూరం ప్రయాణించలేదని.. వస్తువులపై 12గంటల కంటే ఎక్కువ కాలం బ్రతికే అవకాశం లేదని స్పష్టం చేసింది. కరోనా కేసులు రోజుకురోజుకు పెరుగుతున్నవేళ ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. తాజాగా కళ్లజోళ్లపై కరోనా వైరస్ ఎన్నిగంటలు బ్రతికి ఉంటుందని పరిశోధన చేయగా షాకింగ్ న్యూస్ వెల్లడైంది.

ఈరోజుల్లో చాలా మంది కళ్లజోడు కామన్ అయిపోయింది. చిన్నతనం నుంచి కొందరు కళ్లజోళ్లను వాడుతుంటడం చూస్తూనే ఉన్నాం. అయితే కరోనా వైరస్ కళ్లద్దాలపై తొమ్మిదిరోజుల పాటు బ్రతికి ఉంటుందని తాజా పరిశోధనల్లో వెల్లడి కావడం ఒక్కింత ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో కళ్లజోడు ఉపయోగించే వారంతా మరింత జాగ్రత్త ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. బయటికి వెళ్లేప్పుడు కళ్ళద్దాలను శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే కళ్లద్దాలను శానిటైజర్ తో శుభ్రం చేయకూడని.. హైడ్రోజన్ పెరాక్సాయిడ్ తో మాత్రమే శుభ్రం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఉద్యోగుల సంఘం పిటీషన్ వెనుక కారణమదేనా?

Secretariat employees

రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల నాయకులు తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం కోత విధించిన జీతాలు వడ్డీతో కలిపి చెల్లించాలని హై కోర్టు ఆదేశించింది. కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు తమ నిర్ణయాన్ని ప్రకటించడంతో ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు తమ స్వార్ధం కోసం ఉద్యోగుల హక్కులను ప్రభుత్వానికి తాకట్టు పెడుతున్నారని విమర్శిస్తున్నారు.

Also Read : టీడిపి కి ఆ ప్రాంతం నేతలంతా గుడ్ బై..? అదే జరిగితే బాబు వెన్ను విరిగినట్టే..!

ప్రభుత్వం తీసుకున్న జీతాల కోత నిర్ణయంపై విశాఖకు చెందిన విశ్రాంత న్యాయమూర్తి లక్ష్మీ కామేశ్వరి కొద్ది రోజుల కిందట హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ఆమె పిటీషన్ లో పేర్కోన్నారు. ఈ కేసుపై విచారణ నిర్వహించిన హై కోర్టు ప్రభుత్వం, పిటీషనర్ తరుపున న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం కోత విధించిన జీతాలతోపాటు 12 శాతం వడ్డీని కలిపి చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం విధితమే.

సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు రామిరెడ్డి ఈ అంశంపై కోర్టులో పిటీషన్ వేయనున్నట్లు ప్రకటించారు. జీతాల కోత ప్రభుత్వ ఉద్యోగుల సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని, జీతాలు ప్రభుత్వానికి అవకాశం ఉన్నప్పుడు విడతల వారీగా చెల్లించవచ్చని, వడ్డీ మాత్రం అసలు చెల్లించవద్దని ఆయన కోరుతున్నారు. మరోవైపు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాత్రం ప్రభుత్వం కోత విధించిన జీతాలు వీలైనంత త్వరగా చెల్లించాలని కోరుతున్నారు.

సచివాలయ ఉద్యోగుల సంఘం పిటీషన్ వెనుక ప్రభుత్వ పెద్దలు ఉండి వ్యవహారాన్ని నడిపిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. గత నెలలో ఈ కేసులో తీర్పు ఇచ్చిన హై కోర్టు రెండు నెలల్లోగా కోత విధించిన జీతాల మొత్తాన్ని 12 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. ఇప్పుడు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్న ప్రభుత్వానికి కోత విధించిన జీతాలు, వడ్డీ చెల్లించడం సాధ్యమయ్యే పని కాదు. దీంతో ఈ వ్యవహారంపై తాత్సారం చేయడానికే సచివాలయ ఉద్యోగుల సంఘంతో పిటీషన్ వేయిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Also Read : రూ.5 లక్షల కోట్లు అప్పులు తెస్తారా?

రూ.5 లక్షల కోట్లు అప్పులు తెస్తారా?

Can ap bring in a debt of Rs 5 lakh crore

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి తెలిసిన వారు రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్లు అప్పులు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. టీడీపీ నాయకులు ఇధే అంశాన్ని మీడియాకు వివరిస్తున్నారు. గడచిన మూడు నెలల అప్పులు లెక్కగట్టి అది అదేళ్లకు వర్తింప జేయడం జరికాదనేది నిపుణుల వాదన. ఆర్ధిక సంవత్సరం ప్రారంభం నాటికే రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం ఉండటం, కేంద్రం అమలు చేసిన లాక్ డౌన్ తో వ్యవస్థలన్ని స్ధంబించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయాన్ని కోల్పోయింది, అదే సమయంలో పేదలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతో ప్రభుత్వం అప్పుల బాట పట్టింది.

Also Read : టీడిపి కి ఆ ప్రాంతం నేతలంతా గుడ్ బై..? అదే జరిగితే బాబు వెన్ను విరిగినట్టే..!

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోయింది. ఈ సమయంలో లాక్ డౌన్ కొనసాగడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రూ.39,529 కోట్లు ఆదాయం లభించాల్సి ఉండగా… కేవలం రూ.7,555 కోట్లు మాత్రమే వివిధ మార్గాల్లో ఆదాయం లభించింది. ఏప్రిల్ నెలలో రూ.1,123 కోట్లు, మే నెలలో రూ.2,498 కోట్లు, జూన్ నెలలో రూ.3,934 కోట్లు ఆదాయం వచ్చినట్లుగా ఆర్ధిక శాఖ ఇటీవల ప్రకటించింది. ప్రభుత్వం రూ.31,974 కోట్ల ఆదాయం కోల్పోయింది. లక్ష్యంలో కేవలం 19 శాతం మాత్రమే ఆదాయం లభించింది. దీంతో ప్రభుత్వం అప్పలు చేయకతప్పడం లేదు. ఏప్రిల్ లో రూ.5,000 కోట్లు, మే లో రూ.6,000 కోట్లను ప్రభుత్వం మార్కెట్ నుంచి రుణాలు తెచ్చింది. ఈ మొత్తాన్ని 13 ఏళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంది. తోలి త్రైమాసికంలో ప్రభుత్వానికి రోజుకు రూ. 400 నుంచి 500 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా కేవలం రూ. 70 నుంచి 80 కోట్లు మాత్రమే లభించింది.

Also Read : చంద్రబాబుని కరుణించిన కరోనా..607 కోట్ల లాభం?

ఖజానాకు రాబడిని పెంచుకునేందుకు ఇటీవల చమురు ఉత్పత్తులపై వ్యాట్ ట్యాక్స్ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.. కొద్ది రోజుల వ్యవధిలోనే భూముల మార్కెట్ విలువల పెంచింది. వృత్తి పన్నును పెంచినట్లు వార్తలు వచ్చాయి. గ్రామాల్లో చెత్త సేకరణపై పన్ను వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వం ఆశించినంత ఆదాయం రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై ఆధారపడుతుంది. మరోవైపు రుణ పరిమితిని పెంచే విషయంలోను కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం వత్తిడి తెస్తోంది.

ఈ ఆర్ధిక సంవత్సరం కరోనా ప్రభావం అధికంగా ఉంది కాబట్టి అప్పులు అధికమయ్యాయి. కరోనా వైరస్ ప్రభావం తగ్గి అన్ని రంగాల్లో తిరిగి సాధారణ స్థితి నెలకొంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెగుతుంది. ఫలితంగా అప్పులు తగ్గే అవకాశాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తెచ్చిన అప్పులు సంక్షేమ పథకాలకే వెచ్చించడం మరో సమస్యగా మారింది. ఉత్పాదక రంగాలకు కేటాయిస్తే ఫలితం అధికంగా ఉంటుంది. సంక్షేమ పథకాలకు మళ్ళించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఇవి భారంగా మారనున్నాయి. 

Also Read : జగన్ కు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు షాక్ ఇవ్వబోతున్నారా…?

మోడీకి నెటిజన్ల సెగ.. బాగానే తగిలింది

shock to Modi for the first time
ఎంత దేశానికి రాజైనా అప్పుడప్పుడూ సమయం సందర్భం చూడకుండా చేసే పనులపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతాయి. తాజాగా దేశ ప్రధాని నరేంద్రమోడీకి కూడా నెటిజన్ల నుంచి గట్టి షాకే లభించింది. ఓవైపు కరోనా.. మరో వైపు వర్షాకాలం రావడంతో జనాలను వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఇక కరోనాతో ఉద్యోగ, ఉపాధి కోల్పోయి జనాలంతా అరిగోస పడుతున్నారు. ఇంతటి క్లిష్ట సమయంలో మోడీ నుంచి కావాల్సింది స్వాంతన.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, కరోనా నియంత్రణపై భరోసా.. కానీ ఇవేవి పట్టించుకోకుండా బొమ్మల తయారీపై మాట్లాడడం.. వాటి గురించే ఆదివారం ‘మన్ కీ బాత్’ నడపడంపై ప్రజల్లో వ్యతిరేక భావం వచ్చింది.

Also Read :  గ్రేటర్ పై కన్నేసిన బీజేపీ.. వ్యూహమెంటీ?

తాజాగా ఈ ఆదివారం కూడా ‘ఆల్ ఇండియా రేడియో’లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీన్ని దూరదర్శన్ తోపాటు కొన్ని ప్రైవేట్ చానెళ్లు కూడా ప్రసారం చేశాయి. ఇక మోడీ, పీఐబీ, బీజేపీ యూట్యూబ్ చానెళ్లలో మోడీ ‘మన్ కీ బాత్’ వీడియోలను అప్ లోడ్ చేశారు.ఆశ్చర్యకరంగా మోడీ ‘మన్ కీ బాత్’ వీడియోకు యూట్యూబ్ లో నెగెటివ్ స్పందన రావడం గమనార్హం. మోడీ వీడియోకు నెటిజన్లు డిస్ లైక్ లు భారీగా కొట్టారు. ఇప్పటివరకు మోడీకి లైక్ ల మీద లైక్ వస్తుంటే తాజాగా డిస్ లైక్ లు విపరీతంగా రావడం అందరినీ షాక్ కు గురిచేసింది.

మోడీ వీడియోకు బీజేపీ యూట్యూబ్ చానెల్ లో ఏకంగా సోమవారం ఉదయానికి డిస్ లైక్ 2.3 లక్షలు దాటాయి. లైక్ లు కేవలం 26వేలు మాత్రమే ఉండడం గమనార్హం. మోడీ యూట్యూబ్ లో డిస్ లైక్ లు 48వేలు, లైక్ లు 23వేలు వచ్చాయి. పీఐబీ చానెల్ లో డిస్ లైక్ లు 8వేలు వచ్చాయి. లైక్ లు 3.4 వేలు వచ్చాయి. మోడీకి ఇంత భారీ స్థాయిలో డిస్ లైక్ లు రావడం ఇదే తొలిసారట..

ఇలా ఎంత మోడీ జపం చేసే జనాలకైనా సమయం సందర్భం లేకుండా ప్రజలు ఇంతటి కష్టాల్లో ఉన్న వేళ వాటి పరిష్కారాలపై మాట్లాడకుండా టాపిక్ మార్చేసిన మోడీపై ‘డిస్ లైక్ ’లతో జనం ప్రతీకారం తీర్చుకున్నారు. ప్రతిసారి తన ప్రసంగాలు, వీడియోలకు లక్షల్లో వ్యూస్ వచ్చి లైక్ లు తెచ్చుకొని ట్రెండింగ్ లో ఉండే మోడీ సార్ ఈసారి మాత్రం డిస్ లైక్ లతో సరిపెట్టుకోవాల్సి రావడం స్వయంకృతాపరాధమే మరీ..

Also Read : ఏం చేయకపోయినా.. ఇది చేస్తే చాలు మోడీజీ?

ఏపీ సర్కార్ గంటకు అన్ని కోట్లు అప్పు చేస్తోందా…?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చే సరికి రాష్ట్రంపై అప్పుల రూపంలో లక్షల కోట్ల రూపాయల భారం ఉంది. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టడంతో ఆ అప్పుల భారం మరింత పెరిగింది. అయితే కరోనా, లాక్ డౌన్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి కొత్త సమస్యలను సృష్టిస్తోంది. రాష్ట్రానికి గడిచిన ఆరు నెలల నుంచి కరోనా, లాక్ డౌన్ వల్ల ఆదాయం భారీగా తగ్గింది.

Also Read : జగన్ దగ్గరకు పోతా అంటున్న బాలయ్య… బాబు తట్టుకోగలడా?

అదే సమయంలో జగన్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు, పెన్షనర్ల జీతాలు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులపై ఆధారపడుతోంది. తాజాగా వెలుగులోకి వస్తున్న సమాచారం ప్రకారం జగన్ సర్కార్ గంటకు దాదాపు 9 కోట్ల రూపాయల అప్పు చేసినట్టు సమాచారం. కాగ్ రిపోర్టుల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగ్ గత మూడు నెలల్లో ఏపీ ప్రభుత్వం 33,294 కోట్ల రూపాయలు అప్పు చేసినట్టు తెలిపింది.

ఈ సంవత్సరం బడ్జెట్ లో యాభై వేల కోట్లు అప్పు చేస్తామని చెప్పిన ఏపీ ప్రభుత్వం మూడు నెలలల్లోనే ఏకంగా 33,000 కోట్ల అప్పు చేయడం గమనార్హం. అయితే ప్రభుత్వం ఇంత అప్పు తెచ్చినా గత మూడు నెలల్లో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. దీంతో ప్రభుత్వం చేసిన అప్పును అనుత్పాదక వ్యయంగానే పరిగణించాల్సి వస్తోంది. గత మూడు నెలలల్లో ప్రభుత్వ ఆదాయం 21,000 కోట్లుగా ఉంది. ఆదాయం కంటే అప్పు ఎక్కువగా ఉండటం వల్ల రాష్ట్రం భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Also Read : బాలయ్య మంత్రం.. కరోనా పరార్ అవాల్సిందే?

సంచలనం: 139మంది రేప్ కేసులో భారీ ట్విస్ట్

139 persons rape case latest update

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 139 మంది తనపై అత్యాచారం చేశారని నల్గొండకు చెందిన యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలంగాణలో సంచలనమైంది. ఈ కేసును చాలెంజ్ గా తీసుకున్న పోలీసులు కీలక విషయం రాబట్టినట్టు సమాచారం. సీసీఎస్ పోలీసులు సీరియస్ గా ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే బాధితురాలు చాలా మంది ప్రజాప్రతినిధులు, వారి పీఏలు, సినీ ప్రముఖులు, జర్నలిస్టులు, ప్రముఖుల పేర్లను ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలోనే తాజాగా పోలీసులు ఈ యువతి వెనుక ఎవరున్నారన్న దానిపై కీలక విషయం రాబట్టినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Also Read : కేసీఆర్, హరీష్ రావు కన్నీళ్లు.. ఏమైంది?

యువతి పోలీసులకు  ఫిర్యాదు చేయడానికి సహకరించిన సోమాజిగూడలోని ‘గాడ్ పవర్’ అనే స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో పోలీసులు సోదాలు జరిపి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఆ కార్యాలయాన్ని సీజ్ చేశారని తెలిసింది. యువతిని ప్రేరేపించి ఈ కేసు పెట్టారని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. దీనివెనుక పెద్ద బ్లాక్ మెయిలింగ్ దందా ఉందని.. ‘డాలర్ భాయ్’ అనే మారు పేరుగల వ్యక్తినే ఇదంతా చేయించాడని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం.

బాధిత యువతిని బంధీగా చేసుకొని డాలర్ బాయ్ అనే వ్యక్తి ఆరోపణలు చేసిన పలువురు సెలెబ్రెటీలకు ఫోన్ చేసి డబ్బులు బెదిరించిన ఆడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాధిత యువతిని తన చెరలో ఉంచుకొని ‘డాలర్ బాయ్ ’ అనే వ్యక్తియే ఇదంతా చేయించాడని పోలీసులు అనుమానిస్తున్నారు.  యువతిని బందీగా చేసుకొని డాలర్ ఆమెతో ఈ 139మంది రేప్ చేశారని బ్లాక్ మెయిలింగ్ చేయించాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిసింది.  డబ్బులు ఇవ్వాలని బెదిరించినట్లు ఆడియో రికార్డింగ్ లు సోషల్ మీడియాలో బయటపడడంతో డాలర్ భాయ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని తెలిసింది. దీంతో బాధిత యువతిని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందాలనే డాలర్ భాయ్ ఇదంతా చేశాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Also Read : గ్రేటర్ పై కన్నేసిన బీజేపీ.. వ్యూహమెంటీ?

డాలర్ బాయ్ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించారని సమాచారం. అతడిపై ఇటీవలే భార్య కూడా కేసు పెట్టిందని పోలీసులు గుర్తించారు. అతడిపై నగరంలోనే కాదు.. ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ ఆరోపణల కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉద్యోగం కోసం నగరాలకు వచ్చిన యువతిని ట్రాప్ చేసి ఆమె విద్యార్హత పత్రాలను తన వద్ద ఉంచుకొని మానసికంగా.. శరీరకంగా వేధిస్తూ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడినట్లు పోలీసుల విచారణ తెలిసినట్టు ప్రచారం జరుగుతోంది. డాలర్ భాయ్ కార్యాలయంలో పలు ఆడియో టేపులు కూడా ఉండడంతో పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలిసింది.

ప్రస్తుతం డాలర్ బాయ్ అజ్ఞాతంలోకి వెళ్లడంతో బాధిత యువతి అతడి చెర నుంచి బయటపడింది. ఆమెను కులపెద్దలు రక్షించి ఆమె తల్లి వద్దకు చేర్చారు.‘తెలంగాణ యూత్ ఫోర్స్ ’ మాత్రం ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.  కాగా డాలర్ భాయ్ పేరుతో అమ్మాయిలను వలవేసి సెలెబ్రెటీల నుంచి డబ్బులు గుంజుతున్న ‘డాలర్ భాయ్’ కఠిన చర్యలు తీసుకోవాలని  సెలెబ్రెటీలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు కోరుతున్నాయి. అయితే డాలర్ భాయ్ సంగతిపై మీడియాలో వస్తున్న కథనాలపై పోలీస్ శాఖ ఇంతవరకు స్పందించలేదు.

Also Read : కొండ పోచమ్మ కథలు.. సిగ్గు.. సిగ్గు అంటున్న రేవంత్

అమెరికా కరోనా పరీక్షల విషయంలో గందరగోళం?

ప్రపంచ దేశాలను చిగురుటాకులా వణికిస్తున్న కరోనా మహమ్మారి అగ్రరాజ్యం అమెరికాపై సైతం పంజా విసిరిన సంగతి తెలిసిందే. అమెరికాలో ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. అయితే తాజాగా అమెరికా కరోనా పరీక్షలకు సంబంధించిన మార్గదర్శకాలను సడలించింది. అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలనా కేంద్రం(సీడీసీ) తాజాగా మార్గదర్శకాల్లో లక్షణాలు లేకపోతే కరోనా నిర్ధారణ పరీక్షలు అవసరం లేదని పేర్కొంది.

కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తులకు ఆరడుగుల లోపు 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఉంటే మాత్రమే పరీక్షల కోసం వెళ్లాలని సూచనలు చేసింది. అయితే అమెరికా సీడీసీ సవరించిన మార్గదర్శకాలను అక్కడి మెజారిటీ రాష్ట్రాలు వ్యతిరేకించడం గమనార్హం. 30కు పైగా రాష్ట్రాలు వైరస్ సోకిన వారితో సన్నిహితంగా మెలిగిన వారు, కరోనా లక్షణాలు కనిపించిన వారు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచనలు చేస్తున్నాయి.

సీడిసీ సవరించిన మార్గదర్శకాలను పట్టించుకోకుండానే పరీక్షలు చేయడానికి రాష్ట్రాలు మొగ్గు చూపుతున్నాయి. గతంలో సీడీసీ కరోనా లక్షణాలు ఉన్నవారితో పాటు లక్షణాలు లేని వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని పేర్కొంది. లక్షణాలు లేని వారు సైతం వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారని నివేదికలు చెబుతున్నాయని తెలిపింది. అయితే తాజా మార్గదర్శకాల్లో మాత్రం సీడీసీ లక్షణాలు లేని వారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని చెప్పడం గమనార్హం.

ప్రియుడితో నయనతార ఫోటో..  మళ్లీ వైరల్ !

nayanthara relationship with vignesh shivan

లేడీ సూపర్ స్టార్ గా సౌత్ ఇండస్ట్రీలో వెలిగిపోతున్న నయనతార  ఏమి చేసినా గొప్పగానే ఉంటుంది. ప్రియుడి బంధువులను కలవడానికి కూడా చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసుకుని మరీ కొచ్చికి  మరో హీరోయిన్ వెళ్లగలుగుతుందా.. ఒక్క నయనతార తప్ప.  తన ప్రియుడు విఘ్నేష్ శివన్ తో కలిసి నిన్న సాయంత్రం కొచ్చిలో అడుగుపెట్టింది. అది కూడా  విఘ్నేష్ శివన్ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి  ఓనమ్ జరుపుకోవటానికి చెన్నై నుండి చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసుకుని మరీ  నయనతార కొచ్చికి వచ్చింది.
 
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాకపోతే ఫోటోలో నయనతార ఇంగ్లీష్ సినిమలోని హీరోయిన్ లా  వెరీ స్టైలిష్ లుక్ లో కనిపిస్తుంటే.. పక్కన విఘ్నేష్ శివన్ మాత్రం  నయనతార జర్కిన్ ను, బ్యాగ్ ను మోస్తూ ఆమె అసిస్టెంట్ లా కనిపిస్తున్నాడు.  ఈ ఫోటో చూసి నయనతార స్టార్ డమ్ కి ప్రియుడు అయినా తగ్గి ఉండాల్సిందే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
 
ఏమైనా నయనతార వ్యక్తిగత జీవితంలోని  ప్రేమ కథల గురించి ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినిమా వాళ్ళు కూడా కథలుకథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పటికే విఘ్నేష్ శివన్ తో నయనతార పెళ్లి అయిపోయిందనే పుకార్ల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. దానికి తగ్గట్లు  నయనతార కూడా గత నాలుగైదు ఏళ్ల నుండి విఘ్నేష్ శివన్ ప్రేమలో మునిగితేలుతూ ఉంది. కానీ,  అతనితో పెళ్లిపీటలు మాత్రం వెక్కడం లేదు.
 
కాకపోతే ఈ రోజు కొచ్చికి వచినట్లు ఎప్పటికపుడూ అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ జనానికి కనిపించడం, చివరకు ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం.. నయనతారకు ఆనవాయితీగా వస్తోంది. అసలు పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళు ప్రియుడితో  ప్రేమాయణం నడిపిస్తుందో గానీ, నయనతార ఫ్యాన్స్ మాత్రం  తరుచూ హాలీడే ట్రిప్పులకు, పార్టీలకు వెళ్తూ  మీడియా కంట పడొద్దు అని పోస్ట్ లు పెడుతున్నారు. 

టీడిపి కి ఆ ప్రాంతం నేతలంతా గుడ్ బై..? అదే జరిగితే బాబు వెన్ను విరిగినట్టే..!

ఇప్పటి వరకు తమకు గడ్డు పరిస్థితుల్లో కూడా చేదోడువాదోడుగా ఉన్న తెలుగుదేశం పార్టీకి అతి త్వరలో సూపర్ షాక్ తగలబోతోందట. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విషయాన్ని అడ్డంపెట్టుకుని కొందరు టిడిపి నేతలు పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడమే ఇక్కడ షాకింగ్ న్యూస్. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖను రాజధానిగా చేయాలనుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉండగా.. వారు మాత్రం ‘స్టేటస్ కో’ ను వారాల తరబడి పెంచుకుంటూపోతున్నారు. ఇక ఇప్పట్లో అయితే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసే అవకాశమే లేదు.

ఇక వైసీపీ ప్రధాన ఆరోపణ ఏమిటంటే విశాఖ పరిపాలనా రాజాధాని కాకుండా టీడీపీ కుట్రపన్నుతోంది అని. ఈ ఆరోపణల నేపథ్యంలో ఉత్తరాంధ్రాలో టిడిపి నేతలు ఒకింత ఇబ్బందిగా కదులుతున్నారు. దాంతో ఈ గడ్డు పరిస్థితి నుండి తప్పించుకునేందుకు చాలామంది నేతలు తమదైన దారులు వెతుక్కుంటున్నారు. కొందరైతే వైసిపి పంచన చేరగా మరికొందరు బిజెపి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఏపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ మధ్య వరుసబెట్టి టిడిపి నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. అతని సామర్థ్యానికి ముగ్ధులయ్యరో ఏమో తెలియదు కానీ బీజేపీలో మకాం వేసేందుకు టీడీపీ నేతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఢిల్లీ స్థాయిలో బీజేపీ నేతలు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కి గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. రామ్మోహన్ నాయుడు గనుక సానుకూలంగా స్పందిస్తే అదే వరుసలో అచ్చెన్నాయుడు కూడా బిజెపి వైపు వెళ్ళచ్చు. ఇక ఈఎస్ఐ విషయమై బెయిల్ కోసం అచ్చెన్నాయుడు పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. మరోపక్క టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని కూడా బిజెపిలోకి వెళ్తారనే ప్రచారం ఎప్పటినుండో జరుగుతూనే ఉంది. ఇక సోము వీర్రాజు మాత్రం బీజేపీలోకి రావాలంటే టీడీపీ భావజాలాన్ని వదిలించుకోవాలి అని బహిరంగంగానే ప్రకటించేశాడు.

అచ్చెన్నాయుడు కూడా ఇప్పుడిప్పుడే బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తనను అరెస్టు చేస్తే టిడిపి వారు బయట నానా రచ్చ చేశారే తప్ప వచ్చి అతనిని జైలు నుండి బయటకు రప్పించేందుకు ప్రయత్నాలు పెద్దగా చేయలేదు అని చెప్పాలి. ఇక ఇలాంటి సమయంలో అచ్చెన్నాయుడు విషయంలో ఛాన్స్ తీసుకోకూడదని భావిస్తోన్న టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌ని అచ్చెన్న వద్దకు పంపి, ‘పార్టీ మారడం’పై వాకబు చేయాలని ఆదేశించారట. ఏది ఏమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో టిడిపిని నమ్ముకోవడం చాలా కష్టమనే భావన తెలుగు తమ్ముళ్లలో ఉంది కాబట్టి రానున్న రోజుల్లో రాష్ట్రంలో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నట్లే.

గ్రేటర్ పై కన్నేసిన బీజేపీ.. వ్యూహమెంటీ?


గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. జీహెచ్ఎంసీ మేయర్ పీఠం దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈమేరకు ఆ పార్టీ వ్యూహారచనలను సిద్ధం చేసుకుంటోంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్న బీజేపీ ఈ ఎన్నికల ద్వారా నిరూపించాలని అనుకుంటోంది. మత రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్ రాజకీయాలు నిలువనుండటంతో ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. ఈమేరకు పకడ్బంధీ ప్రణాళికలను రచిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: కొండ పోచమ్మ కథలు.. సిగ్గు.. సిగ్గు అంటున్న రేవంత్

వచ్చే ఫిబ్రవరి నాటికి ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకవర్గం పదవీ కాలం పూర్తికానుంది. దీంతో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు నిర్వహించడం ఖాయంగా కన్పిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవెర్చేందుకు అధిక నిధులను వెచ్చిస్తోంది. గ్రేటర్ పరిధిలోని టీఆర్ఎస్ కార్పొరేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ స్థానికంగా హడావుడి చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఇప్పటికే గ్రేటర్లో టీఆర్ఎస్ బలబలాలపై నివేదిక తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు అభ్యర్థుల ఎంపికలో మార్పులు చేసేందుకు రెడీ అవుతున్నారు. అన్ని పార్టీల కంటే ముందుగానే టీఆర్ఎస్ ప్రచారం మొదలెట్టింది.

తాజాగా కాంగ్రెస్, బీజేపీ సైతం గడిచిన వారం రోజులుగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుచుకొని సత్తా చాటింది. దీంతో రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు అవకాశం దక్కింది. ఇక త్వరలోనే రానున్న గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బలపడుతుందన్న సంకేతాలను పంపాలని ఆపార్టీ భావిస్తోంది. దీంతో పక్కా ప్రణాళికతో ఎన్నికలకు వెళ్లేందుకు రెడీ అవుతోంది.

Also Read: కేసీఆర్, హరీష్ రావు కన్నీళ్లు.. ఏమైంది?

జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ తో పొల్చుకుంటే బీజేపీకి బలపడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా కొనసాగుతున్నందున బల్దియా ఎన్నికలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం అయ్యాక గ్రేటర్ ఎన్నికలు వస్తుండటంతో ఈ ఎన్నికలు వారిద్దరికీ కీలకంగా మారాయి.

దీంతో అవసరమైతే జాతీయస్థాయి నాయ‌కులతో ప్ర‌చారం చేయాల‌ని వారిద్దరు భావిస్తున్నారు. హోంశాఖ మంత్రి అమిత్‌షాను ప్ర‌చారానికి తీసుకొస్తే ఎక్కువ లబ్ధి చేకూరుతుందని స్థానిక బీజేపీలు భావిస్తున్నారట. దీంతో ఇప్పటికే అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. బీజేపీ ఎట్టకేలకు బల్దియాపై ఫోకస్ పెట్టడంతో రాజకీయాలు మరింత వెడెక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి.

కరోనాకు.. మగవాళ్లకు ఉన్న లింకేటీ?


ఆడవాళ్లతో పెట్టుకుంటే అంతే సంగతులు అన్న విషయం కరోనాకు త్వరగానే అర్థమైనట్లుంది. దీంతో కరోనా తన ప్రభావన్ని మగవాళ్లపైనే ఎక్కువగా చూపిస్తోంది. ప్రస్తుత కాలంలో మహిళలు మగాళ్లతో సమానంగా అన్నిరంగాల్లో పురోగతి సాధిస్తున్న సంగతి తెల్సిందే. ఇంట్లో.. బయట.. మగాళ్లపై పైచేయి సాధిస్తున్న ఆడవాళ్లు కరోనాను కూడా అంతే ధీటుగా ఎదుర్కొంటున్నారని తాజా అధ్యాయనం వెల్లడైంది.

Also Read: సంచలనం.. సుశాంత్ ది హత్యే అంటున్న ప్రత్యక్ష సాక్షి..!

శారీరకంగా మగవాళ్లు మహిళల కంటే బలవంతులుగా ఉంటారనేది అందరికీ తెల్సిందే. అయితే కరోనా ఎదుర్కొనే విషయంలో మాత్రం పురుషులు మహిళల కంటే వెనుకంజలో ఉన్నట్లు అమెరికా యూనివర్సీటీ పరిశీలనలో వెల్లడైంది. దీంతోనే కరోనాతో మహిళల కంటే పురుషులే అధికంగా మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు. మహిళలకు వైరస్ సోకినప్పటికీ వారిలో కోవిడ్ ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి(ఇమ్యూన్‌ రెస్పాన్స్‌) అధికంగా ఉందని యేల్‌ యూనివర్సిటీ ఉమెన్స్‌ హెల్త్‌ రీసెర్చ్‌లో పేర్కొంది.

కరోనా పాజిటివ్ వచ్చిన మహిళల్లో పురుషుల కంటే టీ-సెల్‌ యాక్టివేషన్‌ చురుకుగా పనిచేస్తుందని వారి పరిశోధనలో వెల్లడైంది. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను మలచుకోవడంలో టీ-లింపోసైట్స్‌గా పిలిచే ఈ సెల్స్‌ ముఖ్య పాత్రను పోషిస్తాయి. శరీరంలోకి సోకిన వైరస్‌ కణాలను ఇవి ప్రత్యక్షంగా చంపడంతోపాటు ఇతర రోగనిరోధక కణాలను యాక్టివేట్‌ చేస్తాయి. మగవారిలో టీ సెల్స్‌ నెమ్మదిగా ఉండటంతోనే కరోనాతో వారే అధికంగా మృతిచెందుతున్నారని తాజా పరిశోధనలో వెల్లడించింది.

Also Read: ఏం చేయకపోయినా.. ఇది చేస్తే చాలు మోడీజీ?

ఈ నేపథ్యంలో కరోనా విషయంలో మహిళల కంటే పురుషులే జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శారీరకంగా మగవాళ్లు మహిళల కంటే బలవంతులు అయినప్పటికీ కరోనాను ఎదుర్కొవడంలో మహిళలే బేష్ తేలడం గమనార్హం.

క్రేజీ హీరో నిర్మాణంలో రేస్ క్లబ్ సిరీస్ !


టాలీవుడ్ లో ప్రస్తుతం అతి తక్కువ టైంలో ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకున్న క్రేజీ స్టార్ ఎవరైనా ఉన్నారా అంటే, అది ఒక్క ‘విజయ్ దేవరకొండ’నే. తన యాక్టింగ్ కంటే కూడా తన ఆటిట్యూడ్ తోనే ఎక్కువ అభిమానులను సంపాదించుకున్న ఘనత, పవర్ స్టార్ తరువాత విజయ్ కే దక్కుతుంది. ఏమైనా విజయ్ దేవరకొండ.. నాని, రామ్ లాంటి హీరోలను దాటుకుని టాప్ స్టార్ రేంజ్ కి ఎప్పుడో వెళ్ళిపోయాడు. అలాంటి ఈ సెన్సేషనల్ స్టార్ తమ్ముడిగా ‘దొరసాని’ అనే స్లో అండ్ బోరింగ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ‘ఆనంద్ దేవరకొండ’.

Also Read: ప్లాప్ హీరోయిన్ కి భారీ ఆఫర్స్ !

తన అన్నయ్యలాగే స్టార్ అవుతాడు అనుకుంటే కనీస స్థాయిలో కూడా హీరోగా మెప్పించలేక.. వెండితెర పై పూర్తిగా తేలిపోయాడు. అయితే ‘ఆనంద్ దేవరకొండ’కి ఒక బంపర్ ఆఫర్ తగిలింది. మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఒక వెబ్ సిరీస్ చేసే ఆలోచనలో ఉన్నాడు. అయితే ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ గా ‘ఆనంద్ దేవరకొండ’ను పెట్టుకునే ఆలోచనలో ఉన్నాడట తరుణ్ భాస్కర్. ఈ వెబ్ సిరీస్ నేపథ్యం మొత్తం కొత్తగా ఉండబోతుందని.. ఆనంద్ దేవరకొండ పాత్ర మొత్తం హార్స్ రేసింగ్ నెపథ్యంలో సాగుతుందని.. అలాగే ఈ సిరీస్ చాలా వరకు రేస్ క్లబ్ లోనే చిత్రీకరిస్తారని తెలుస్తోంది.

Also Read: బాక్సర్ గా మారుతున్న ఈషా రెబ్బా.. పంచ్‌లు ఎవరిపైనో?

ఇక తన తమ్ముడి కోసం ఈ సిరీస్ ను నిర్మించబోతున్నాడు విజయ్. ఇప్పటికే నిర్మాతగా విజయ్ దేవరకొండ ఒక సినిమా తీసి హిట్ కొట్టాడు. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ తో డిజిటల్ రంగంలోకి కూడా అడుగుపెట్టబోతున్నాడు. ఇక ఆనంద్ దేవరకొండ ఈ వెబ్ సిరీస్ కోసం చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాడట. తన పాత్రలో మంచి కామెడీని పండించే అవకాశం పుష్కలంగా ఉందని.. పైగా తరుణ్ భాస్కర్ హీరోల నుండి నటనను రాబట్టుకోవడంలో సిద్ధహస్తుడు. ఈ లెక్కన ఆనంద్ దేవరకొండకి వెబ్ సిరీస్ రూపంలో ఒక హిట్ రావడం దాదాపు ఖాయంలానే కనిపిస్తోంది.

చంద్రబాబుని కరుణించిన కరోనా..607 కోట్ల లాభం?


ప్రపంచాన్ని ఆవహించిన కరోనా వల్ల అందరి ఉద్యోగ, ఉపాధి దూరమైంది. వ్యాపారాలను చావుదెబ్బ తీసింది. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చింది. అయితే ఇంత కరువులోనూ కొంతమంది అదృష్టవంతులైన వ్యాపారులు కోట్లకు పడగలెత్తారు. సాధారణ రోజుల్లో సంపాదించే దానికంటే ఎక్కువనే సంపాదించడం విశేషం.

Also Read: “ముందు ఇది కట్టండి.. మూడు రాజధానులు తర్వాత!” జగన్ పై ధ్వజమెత్తారు

అమెజాన్ అధినేత జెఫ్ బోజెస్ మాత్రం ఏకంగా సంపద పోగేసుకోవడం..ప్రపంచంలోనే ఎవ్వరికి అందనంత సంపదతో తొలిస్థానంలో నిలవడం విశేషంగా మారింది. కరోనా టైంలో అంతా ఆన్ లైన్లో కొనడంతో ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ ఆదాయం 2.85 శాతం పెరిగింది. దీంతో అమెజాన్ వ్యవస్థాపకుడు.. సిఇఒ జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే మొదటి 200 బిలియన్ డాలర్ల సంపద కలిగిన ఏకైక వ్యక్తిగా అవతరించారు. . ప్రస్తుతం బెజోస్ మొత్తం నికర విలువ 4204.6 బిలియన్లు.

ఈ కరోనా కాలంలో మందుల తయారీ కంపెనీలు, మెడికల్ షాపులు, మాస్క్ ల తయారీదారులు.. శానిటైజర్ తయారీదారులు, ఆస్పత్రులు, చిన్న కిరాణాషాపుల పంట పండింది. ఇప్పుడు వీరి వరుసలో మన టీడీపీ అదినేత చంద్రబాబును కూడా చేర్చాలి.

రిటైల్ విభాగంలో 124 హెరిటేజ్ ఫ్రెష్ స్టోర్లు, హెరిటేజ్ ఫుడ్స్ లను అప్పట్లో చంద్రబాబు ఫ్యూచర్ రిటైల్ గ్రూపుకు అమ్మేశాడు. చంద్రబాబు చేతిలో ఇప్పుడు ఆ హెరిటేజ్ -ఫ్యూచర్ గ్రూపులో రూ.295 కోట్ల విలువైన 3.65శాతం వాటా మాత్రమే కలిగి ఉన్నారు. హెరిటేజ్ కొన్నప్పుడు ఫ్యూచర్ గ్రూపు విలువ కేవలం రూ.8083 కోట్లు.

కానీ ఇప్పుడు ఇదే ఫ్యూచర్ గ్రూపును రిలయన్స్ గ్రూపు ఏకంగా రూ.24713 కోట్లకు కొనుగోలు చేసింది. ఎలాగూ ఫ్యూచర్ గ్రూపులో చంద్రబాబు వాటా 3.65శాతం ఉంది. అంటే 24713 కోట్లలో 3.65శాతం అంటే రూ.907 కోట్లు. కాబట్టి చంద్రబాబు హెరిటేజ్ ను అమ్మిన 4 ఏళ్లలోనే ఏకంగా సంపాదించిన లాభం ఏకంగా 607 కోట్లు.

Also Read: బయటికొచ్చాడు కానీ బెంబేలెత్తిపోయాడు..? పాపం అచ్చెన్న

చంద్రబాబు రాజకీయాల్లో ఘోరంగా విఫలమైనప్పటికీ విజయవంతమైన వ్యాపారవేత్తగా మరోసారి నిరూపించుకొని సత్తా చాటాడని టీడీపీ శ్రేణులు గొప్పగా చెప్పుకుంటున్నాయి.

ఇంత అపరకుబేరుడైనా కూడా చంద్రబాబు మాత్రం అమరావతి రైతుల కోసం జోలుపట్టి అడుక్కోవడం బాగాలేదు అని అనుకుంటున్నారు. అమరావతి రైతుల కోసం తనకు వచ్చిన లాభాలైనా పంచితే తను అమరావతి విషయంలో చేసిన పాపం అయినా కడిగేసుకున్నట్టు అవుతుంది కదా అని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.