Home Blog Page 8328

ఎన్టీఆర్ పాఠ్యాంశం పై బాలయ్య ధన్యవాదాలు !


నందమూరి బాలకృష్ణకు ఆయన తండ్రి ‘విశ్వవిఖ్యాత నట సార్వభౌమా నందమూరి తారకరామారావు’ అంటే ఎనలేని అభిమానం. అందుకే ఎన్టీఆర్ ను ఎవరు తలచుకున్నా బాలయ్య పొంగిపోతారు. ఇక ఏకంగా ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్య పుస్తకాల్లో ప్రచురిస్తే.. బాలయ్య ఆనందానికి అవధులు ఏమి ఉంటాయి. అందుకే బాలకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తన ఆనందాని వ్యక్తం చేస్తూ.. ‘కళకి, కళాకారులకి విలువ పెంచిన కథానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని దిల్లీ పీఠాన్ని కదిలించేలా వినిపించిన మహానాయకుడు, ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజానాయకుడు, మద్రాసీయులమనే పేరుని చెరిపి భారతదేశపటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతని తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ మా నాన్నగారు నందమూరి తారక రామారావు. కాగా భవిష్యత్తు తరాలకి స్ఫూర్తినిచ్చేలా ఆయన గురించి 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చిన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి నా హృదయ పూర్వక ధన్యవాదాలు’ అని తన ఫేస్‌ బుక్‌ ఎంకౌట్ లో పోస్ట్‌ చేశారు.

Also Read: నాని ‘వి’ మూవీ రివ్యూ

ఇంతకీ కేసీఆర్ ఉన్నట్లు ఉండి ఎన్టీఆర్ జీవితాన్ని 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చడానికి ఓ కారణం ఉందట. కేసీఆర్ రాజకీయ జీవితానికి పునాది వేసింది ఎన్టీఆరే అని, పైగా కేసీఆర్ స్వతహాగా సీనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమాని అని.. ఆ అభిమానంతోనే కేసీఆర్, తన కుమారుడి పేరు కూడా తారక రామారావు అని ఎన్టీఆర్ పేరే పెట్టుకున్నారని.. అంతటి అభిమానం ఉంది గనుకనే ఎన్టీఆర్ జీవితాన్ని ఇలా పాఠంగా మలిచారని తెలుస్తోంది. ఎన్టీఆర్ రాజకీయ పార్టీ స్థాపించిన వెంటనే కేసీఆర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం పని చేసి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. మొత్తానికి తానూ సీఎం అయ్యాక ఎన్టీఆర్ మీద అభిమానాన్ని ఈ విధంగా ప్రదర్శించారు కేసీఆర్.

వర్మ మరో సెన్సేషన్.. ‘దిశ ఎన్ కౌంటర్’ ఫస్ట్ లుక్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సన్సేషన్ సినిమాతో రాబోతున్నాడు. తెలంగాణతోపాటు యావత్ దేశాన్ని అట్టుడికించిన ‘దిశ’ సంఘటనపై వర్మ సినిమాను తెరక్కిస్తున్నట్లు గతంలోనే ప్రకటించాడు. దిశపై అత్యాచారం.. హత్య.. ఆపై ఎన్ కౌంటర్ నేపథ్యంలో సినిమా రాబోతుంది. మృగాళ్లు ఇలాంటి సంఘటనలు చేయాలంటేనే భయపడేలా సినిమా ఉండబోతుందని గతంలో ప్రకటించిన రాంగోపాల్ వర్మ తాజాగా ఫస్టు రిలీజ్ చేయడం ఆసక్తిని రేపుతోంది.

Also Read: నాని ‘వి’ మూవీ రివ్యూ

వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కించడం దర్శకుడు రాంగోపాల్ వర్మకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటికే తెలుగు రాష్ట్రంలో వివాదాస్పదమైన, సంచలనం సృష్టించిన ఎన్నో సంఘటనలను రాంగోపాల్ వర్మ తెరపైకి తీసుకొచ్చాడు. గతంలో పరిటాల రవి హత్య నేపథ్యంలో ‘రక్తచరిత్ర’.. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ఎంట్రీపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లను తెరకెక్కించి హిట్టందుకున్నాడు. తాజాగా రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘మర్డర్’ సినిమా కూడా ప్రణయ్-అమృత ప్రేమ కథతోనే రాబోతుంది. తాజాగా దిశ ఎన్ కౌంటర్ సంఘటనను కళ్లకు కట్టినట్టు చూపించేందుకు రెడీ అవుతున్నాడు.

Also Read: ఆర్ఆర్ఆర్’ అప్డేట్.. దసరాకు సెట్స్ పైకి?

దిశ.. ఎన్ కౌంటర్ పేరుతో వర్మ విడుదల చేసిన ఫస్టు లుక్ సినిమా ఉండబోతుందో హింట్ ఇచ్చింది. వాస్తవ సంఘటలను కళ్లకు కట్టేలా వర్మ.. తనదైన సస్పెన్స్ థ్రిల్లర్లో ఈ మూవీని చూపించడం ఖాయంగా కన్పిస్తోంది. దిశ ఘటనకు కారణమైన టోల్ గేట్.. అండర్ బ్రిడ్జి.. స్కూటీ.. లారీ వంటి వాటిని ఫస్టు లుక్కులోనే వర్మ చూపించాడు. ఈమేరకు ‘దిశ’ ఫస్టు లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇక సినిమా టీజర్ ఈనెల 26 రాబోతుందని వర్మ తెలిపాడు. సినిమా నవంబర్ 26న రిలీజ్ చేయనున్నట్లు వర్మ ప్రకటించి మరోసారి తన స్టైలే సపరేట్ అని నిరూపించాడు.

భారత్-చైనా ఫైట్.. సాయం చేస్తానంటున్న ట్రంప్

india china war trump
కొద్దిరోజులుగా భారత్-చైనా దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇటీవల భారత సరిహద్దుల్లోని గాల్వానా లోయలో ఇరుదేశాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో భారత్ కు చెందిన 21మంది జవాన్లు వీరమరణం పొందగా చైనా తరుఫున కూడా భారీ నష్టమే జరిగింది. ఈ నేపథ్యంలో భారత్ చైనాకు ధీటుగా జవాబువ్వడంతో చైనా కొంత వెనక్కి తగ్గింది.

Also Read: చైనా భయపడిందా..చర్చలకు దిగొస్తోందా.. కారణమదే?

సరిహద్దులను ఆక్రమించేందుకు యత్నిస్తున్న చైనా కుయత్నాన్ని భారత్ ఎప్పటికప్పుడు  తిప్పికొడుతోంది. ఈ పరిణామాలు మింగుపడని చైనా ఓవైపు భారత్ తో శాంతి ప్రవచనాలు వల్లిస్తూనే దొంగదెబ్బ తీసేందుకు యత్నిస్తోంది. భారతే తమ భూభాగాలను ఆక్రమించుకుంటుందని చైనా ప్రపంచాన్ని నమ్మించే యత్నం చేస్తోంది. ఈ యత్నాలు ఫలించకపోవడంతో కొద్దిరోజులుగా చైనా స్తబ్ధుగా ఉంది. అయితే గత మూడ్రోజులుగా చైనా సైనికులు సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్నారు.

భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి స్పందించారు. ఇరుదేశాల మధ్య పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయాయన్నారు. చైనా అత్యంత దూకుడుగా వ్యవహరిస్తుందన్నారు. భారత్ సైతం చైనాకు ధీటైనా జవాబిచ్చేందుకు సిద్ధపడుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు తాను మధ్య వర్తిత్వం చేస్తానంటూ ట్రంప్ ప్రకటించాడు.

Also Read: పబ్ జీకి పోటీగా భారతీయ ‘ఫౌ-జీ’

ట్రంప్ గతంలోనూ ఇలాంటి ప్రకటనే చేశారు. గాల్వానా లోయలో ఇరుదేశాల మధ్య  ఘర్షణ జరిగినపుడు కూడా ట్రంప్ స్పందించారు.  సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు అమెరికా మధ్య వర్తిత్వం చేస్తుందని ప్రకటించారు. ఇరుదేశాల మధ్య ఏర్పడిన సమస్యను పరిష్కరించేందుకు అవసరమైతే సాయం అందించేందుకు తాను రెడీ అంటూ స్పష్టం చేశారు. అయితే ట్రంప్ ప్రతిపాదనను ఇరుదేశాలు తిరస్కరించారు. తమ దేశాల మధ్య నెలకొన్న సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని స్పష్టం చేశాయి. తాజాగా మరోసారి చైనా-భారత్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నారు. దీంతో ట్రంప్ మరోసారి మధ్య వర్తిత్వం చేస్తానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

డ్రగ్ కేసులో ఇరుక్కుంటున్న రియా చక్రవర్తి.. అరెస్టుకు రంగం సిద్ధం?

riya
సిసీ ఇండస్ట్రీలో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. బాలీవుడ్లో నెపోటిజం కారణంగా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని తొలుత ఆరోపణలు వచ్చాయి. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈనేపథ్యంలోనే సుశాంత్ సింగ్ అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు సుశాంత్ ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా ఈ కేసులో డ్రగ్ మాఫియాకు సంబంధాలున్నట్లు తేలింది. దీంతో ఈ కేసు సస్పెన్స్ థ్రిలర్ ను తలపించేలా రోజుకో ట్వీస్ట్ తో ముందుకు సాగుతోంది.

Also Read: నాని ‘వి’ మూవీ రివ్యూ

ఈ కేసులో నార్కొటిక్ కంట్రోల్ అధికారులు ఎంట్రీ అయ్యారు. డ్రగ్ సప్లయర్ బాసిత్ తో రియా చక్రవర్తికి, షోవిక్, శ్యామూల్ మిరాండాల ఇంటిపై శుక్రవారం దాడులు నిర్వహించారు. వారికి సంబంధించిన ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్నారు. రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. రియా చక్రవర్తి ఆదేశాలతోనే సుశాంత్ కు డ్రగ్ ఇచ్చినట్లు షోవిక్ విచారణ చెప్పటినట్లు తెలుస్తోంది. దీంతో రియా చక్రవర్తి డ్రగ్ కేసులో అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

అదేవిధంగా గత రెండేళ్లుగా ఇక డ్రగ్స్ సప్లయర్ బాసిత్ పరిహార్‌తో తనకు సంబంధాలున్నాయని ఒప్పుకున్నాడని సమాచారం. ముంబైలోని బాంద్రా ఫుట్‌బాల్ క్లబ్‌లో తాము కలుసుకొనే వాళ్లమని.. రెండేళ్లుగా అతడితో కాంటాక్ట్ లో ఉన్నట్లు తెలిపాడట. బాసిత్ తన ఇంటికి చాలాసార్లు వచ్చాడని.. తమ కుటుంబంతో మంచి పరిచయాలు ఏర్పరుచుకున్నాడని పోలీసుల విచారణలో షోవిక్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాసిత్ ను, షోవిక్ ను అరెస్టు చేసిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

Also Read: ఆర్ఆర్ఆర్’ అప్డేట్.. దసరాకు సెట్స్ పైకి?

తాజాగా షోవిక్ విచారణలో వెల్లడించిన వివరాల మేరకు రియా చక్రవర్తిని అరెస్టు చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆమె ల్యాప్ టాప్, ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా కేసు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే రియా చక్రవర్తి అరెస్టు అవడం ఖాయంగా ప్రచారం బాలీవుడ్లో జోరుగా సాగుతోంది.

మావోయిస్టు సిద్ధాంతాలకు కాలం చెల్లిందా..?


నక్సలైటు అన్న పదం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నక్సల్‌బరి అనే ఒక చిన్న గ్రామం పేరు మీదుగా వచ్చింది. తర్వాతి కాలంలో పీపుల్స్ వార్‌‌తో కలిసి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)గా ఏర్పాటైంది. పీడిత ప్రజలను బానిస బతుకుల నుంచి విముక్తి చేయడం.. భూస్వాముల భూములను పేదలకు పంచాలనే ప్రధాన లక్ష్యంతో ఈ పార్టీని స్థాపించారు. ఏండ్ల చరిత్ర ఉన్న పార్టీ అప్పటి నుంచి ఎన్నో ఉద్యమాలు చేసింది. ఎంతో మంది అమరులయ్యారు. కానీ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ మావో సిద్ధాంతాలకు కాలం చెల్లిందా..? అనే అంశం మీదనే. ‘పీడించే బడే వాళ్లు ఉన్నంతకాలం.. పీడించే వారు ఉన్నంతకాలం మావోయిస్టుల సిద్ధాంతం ఎప్పటికీ చెక్కు చెదరదు’ అంటూ మావోయిస్టులు చెబుతున్న మాట.

Also Read : బ్రేకింగ్ : మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్

భూమి కోసం, భుక్తి కోసం, పీడిత జ‌న విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జ‌రిగింది. ఆ త‌రువాత పుట్టుకొచ్చిన భూస్వామ్య, పెత్తందారీ వ్యవస్థపై తిరుగుబావుటా ఎగురవేసే క్రమంలో అది నక్సల్‌బరి ఉద్యమంలా మారింది. కొన్ని ద‌శాబ్దాలుగా ఈ ఉద్యమం సాగుతూనే ఉంది. కొంత కాలంగా ఈ ఉద్యమం గాడి తప్పినట్లు కనిపిస్తోంది. పోలీసుల‌కు, ఉద్యమకారులకు మధ్య సమరంగా మారింది. ప్రజలకు అందుబాటులో ఉండే ఉద్యమకారులు దశాబ్దకాలంగా అర‌ణ్యాల‌కే ప‌రిమితం కావ‌డంతో ప్రజలకు వారి మధ్య దూరం పెరుగుతూనే ఉంది.

తాజాగా మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోతున్నారనే వార్తల నేపథ్యంలో మళ్లీ మావోయిజంపై చర్చ మొదలైంది. మావోయిస్టు కేంద్ర మాజీ కార్యదర్శి.. పార్టీలో కీలక నేత అయిన గణపతి త్వరలో లొంగిపోతున్నారంటూ వరుస కథనాలు రావడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పీపుల్స్‌వార్‌‌ ఉద్యమం కాస్త మావోయిస్టు పార్టీగా అవ‌త‌రించ‌డంలోనూ గ‌ణ‌ప‌తి కీల‌క భూమిక పోషించారు. అంతే కాకుండా దేశ‌ వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని విస్తరించడంలోనూ ఆయనే ప్రధానం. అలాంటి వ్యక్తి అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నారంటూ ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. ఇది కేవ‌లం పోలీసులు చేస్తున్న పుకార్లని కేంద్ర క‌మిటీ స‌భ్యుడు ఓ ప‌త్రికా ప్రకటన విడుదల చేశారు. దీంతో గ‌ణ‌ప‌తి లొంగిబాటు ఓ క‌ట్టుక‌థ అని తేలిపోయింది.

Also Read : కేసీఆర్‌‌ ఇమేజ్‌ ముందు బీజేపీ నిలిచేనా

ఇదే స‌మ‌యంలో మావోయిస్టు సిద్ధాంతాలకు కాలం చెల్లిపోలేద‌ని, దాన్ని అమ‌లు చేయ‌డంలోనే నాయ‌క‌త్వ వైఫ‌ల్యం క‌నిపిస్తోంద‌ని ప్రజాస్వామ్యవాదులు, సామాజిక వేత్తలు అంటున్నారు. వ్యక్తుల సిద్ధాంతాల్లో మార్పులు వస్తేనే ఉద్యమం మరింత కాలం మనుగడ సాగిస్తుందని, లేదంటే కాలక్రమేనా అంత‌రించి పోతుంద‌ని అభిప్రాయ ప‌డుతున్నారు.

దుబ్బాకలో కారు జోరుకు బ్రేక్‌ ఖాయమా..?

బిహార్‌‌ అసెంబ్లీ ఎన్నికలతోపాటే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన 65 స్థానాలను ఉప ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన సొలిపేట రామలింగారెడ్డి ప్రాతినిధ్యం వహించిన దుబ్బాక నియోజకవర్గానికీ ఉప ఎన్నిక అనివార్యం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కూడా ఈ నయోజకవర్గానికి సంబంధించి త్వరలోనే ఒక రిపోర్టను పంపించనున్నట్లు సమాచారం.

Also Read : బ్రేకింగ్ : మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి అక్టోబర్‌‌ లేదా నవంబర్‌‌లో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుండడంతో పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో రాజకీయ వేడి రగులుకుంది. కాంగ్రెస్‌, బీజేపీలూ తమ అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నాయి. గతంలో కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మృతి చెందిన ఖేడ్‌, పాలేరులో టీఆర్‌‌ఎస్‌ పార్టీ తమ అభ్యర్థులను పోటీలో నిలిపి విజయం సాధించింది. అందుకే ఈసారి కాంగ్రెస్ కూడా దుబ్బాకలో ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేసి తీరుతామని ప్రకటించింది. కాంగ్రెస్‌ అభ్యర్థి విషయంలో ఎలాంటి స్పష్టత లేకున్నా ప్రధానంగా మాజీ ఎంపీ విజయశాంతి పేరు వినిపిస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన ఎం.నాగేశ్వరరావు కూడా ఈసారి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు లేకపోలేనట్లు తెలుస్తోంది. గ‌జ్వేల్ మాజీ ఎమ్మెల్యే న‌ర్సారెడ్డి కూడా పేరు కూడా తెర‌మీద‌కు వ‌స్తోంది. బీజేపీ తరఫున పోటీ చేయడానికి రఘునందన్‌రావు ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి దూకారు. వీరికి తోడు కొందరు ఇండిపెండెంట్‌ అభ్యర్థులూ కదనరంగంలోకి దిగేందుకు రెడీ అయ్యారు.

దుబ్బాక ఉప ఎన్నికలో విజయం తథ్యమని మరోవైపు అధికార టీఆర్‌‌ఎస్‌ పార్టీ భరోసాతో ఉంది. దీర్ఘకాలం పాటు ఆ నియోజకవర్గంలో రామలింగారెడ్డి గెలవడం.. ఇప్పుడు సానుభూతి పవనాలు కూడా వీస్తాయనే ధీమాతో ఉంది. రామలింగారెడ్డి కుటుంబంలోనే ఒకరికి టికెట్‌ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కుమారుడు సతీశ్‌కే దాదాపు ఖాయమనే వార్తలూ వినిపిస్తున్నాయి. మరోవైపు మాజీ మంత్రి ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్‌రెడ్డి కూడా ఈ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ శ్రీనివాస్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వకుంటే ఆయన కాంగ్రెస్‌లోకి జంప్‌ అయి ఆ పార్టీ నుంచి టికెట్‌ తీసుకోవాలని భావిస్తున్నట్లు టాక్‌. మంత్రి హరీశ్‌రావు ఈ నియోజకవర్గంలో టీఆర్‌‌ఎస్‌ గెలుపు బాధ్యతను తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈసారి టీఆర్‌‌ఎస్‌ గెలుపు నల్లేరుమీద నడకలా అన్నట్లు ఏం కనిపించడం లేదు. ప్రతిపక్షాలు గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయి. దీనికితోడు రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం మీద ఇంతో అంతో రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ఇది గత లోక్‌సభ ఎన్నికల్లోనూ వెల్లడైంది.

Also Read : కేసీఆర్‌‌ ఇమేజ్‌ ముందు బీజేపీ నిలిచేనా

హుజూర్‌‌నగర్‌‌లో ఇష్టమున్నట్లు డబ్బులు వెదజల్లి టీఆర్‌‌ఎస్‌ బంపర్‌‌ మెజార్టీతో విజయం సాధించిందనేది అందరికీ తెలిసిందే. కానీ.. ఈసారి దుబ్బాకను అన్ని పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇక ఇండిపెండెంట్ల విష‌యానికి వ‌స్తే బిగ్‌బాస్ ఫేం క‌త్తి కార్తీక ఇప్పటికే ప్రచారంలోకి దిగారు. మరో ముగ్గురు ఇండిపెండెంట్లు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఏది ఏమైనా ఈసారి దుబ్బాక నియోజకవర్గం మీదనే రాష్ట్ర ప్రజల చూపు ఉంది. అధికార పార్టీ గెలిచి తీరుతుందా..? ప్రతిపక్షాలు పాగా వేస్తాయా..? అనే ఆసక్తి నెలకొంది. నోటిఫికేషన్‌ రాకముందే రాజకీయ వేడెక్కింది.

రేవంత్ కొత్త పార్టీ వెనుక అసలు కథ ఏంటి? 

రేవంత్‌.. యూత్‌ ఫాలోయింగ్‌ ఉన్న లీడర్‌‌. కొడంగల్‌ టైగర్‌‌.. ఏదైనా సమస్య పరిష్కారానికి ఎక్కడి వరకైనా పోదాం పద అంటూ తెగువ చూపే నాయకుడు. ఏ పార్టీలో ఉన్నా తన వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకునే శైలిలీ ప్రసంగాలు చేయడంలో ధిట్ట. ఉత్సాహం, పోరాటం, ఆరాటం కలిగిన నేత. అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోయే పర్సన్‌. ఇలా ఆల్‌రౌండర్‌‌గా పేరు తెచ్చుకున్నారు తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి. రెండో సారి టీఆర్‌‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేసరికి తుడిచిపెట్టుకుపోతున్న కాంగ్రెస్‌ ఎంతో కొంత బూస్ట్‌ ఇచ్చింది రేవంత్‌రెడ్డి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఎక్కడ ఆయనకు పీసీసీ ప్రెసిడెంట్‌ పదవి వస్తుందోనని కాంగ్రెస్‌ సీనియర్లంతా కూడగట్టుకొని అడుగడుతునా ప్రయత్నం చేస్తున్నట్లు బహిరంగంగా తెలిసిన విషయమే. కానీ.. రేవంత్‌ మాత్రం వాటిని లెక్కచేయకుండా తనదైన శైలిలో ముందుకు సాగుతున్నాడు. ఒకానొక సందర్భంలో కొత్త పార్టీ పెడుతాడంటూ ప్రచారాలు వినిపిస్తున్నాయి.

Also Read : కేసీఆర్‌‌ ఇమేజ్‌ ముందు బీజేపీ నిలిచేనా

టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల అవినీతి వ్యవహారం వెలుగులోకి తెస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ క్రమక్రమంగా వారి ఇమేజీని డ్యామేజ్‌ చేస్తూ రేవంత్‌ పైచేయి సాధిస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా కేసీఆర్‌‌ సర్కార్‌‌ బండారం బయటపెడుతూనే ఉన్నారు. అయితే అనూహ్యంగా ఆయన త్వరలోనే కాంగ్రెస్‌ నుంచి తప్పుకుంటారని, కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపు రాజకీయాలు కారణంగా ముందు ముందు మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయని, స్వపక్షంలోని విపక్షాన్ని నిత్యం ఎదుర్కోవడం పెద్ద తలనొప్పి వ్యవహారంగా రేవంత్ అంచనాకు వచ్చారు. దీనికితోడు జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ ఇబ్బందులు పడుతుండటం, ముందు ముందు మరింత బలహీనం అయ్యే ప్రమాదం ఉండడంతో సొంత పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అసలు రేవంత్‌కు సొంత పార్టీ ఆలోచన రావడానికి టీడీపీ అధినేత చంద్రబాబు కారణమనే విషయమూ ఇప్పుడిప్పుడే బయటికి వస్తోంది.

టీడీపీ లీడర్‌‌ చంద్రబాబు సలహాలు సూచనలతోనే కొత్తపార్టీ పెట్టేందుకు రేవంత్ సిద్ధమవుతున్నారట. రేవంత్ రాజకీయంగా పైకి ఎదిగితే, తనకు బద్ధశత్రువుగా ఉన్న కేసీఆర్‌‌ను రాజకీయంగా పతనం చేయవచ్చనే అభిప్రాయంతో బాబు రేవంత్‌ను దువ్వుతున్నట్టుగా  ప్రచారం జరుగుతోంది. రేవంత్ పార్టీ కనుక పెడితే, రెడ్డి సామాజిక వర్గం అంతా ఏకమై, ఆయనకు మద్దతుగా నిలబడతారని, అలాగే నాయకులు లేక అల్లాడుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా రేవంత్ పార్టీలో చేరుతారని, ఇలా అనేక లెక్కలను బయటకు తీసి చంద్రబాబు రేవంత్‌కు నూరిపోశారట. ఇప్పటికే రేవంత్ బాబు మధ్య పార్టీ ఏర్పాటుకు సంబంధించి తీవ్రమైన చర్చ  జరిగినట్లు, బాబు నైతిక మద్దతుతోనే రేవంత్ కథన రంగంలోకి దూకుతున్నట్టుగా తెలుస్తోంది.

అయితే.. రేవంత్‌ కొత్త పార్టీ పెట్టి సీఎం అవుదామనుకుంటున్నారా..? కొత్త పార్టీ ఆయనకు ఏ మేరకు కలిసివస్తుంది..? కొత్త పార్టీని నడిపించడం అంత ఈజీ అవుతుందా..? చంద్రబాబుతో పొత్తు ఏ మేరకు సత్ఫలితాలిస్తుంది..? ఇప్పటికే ఆంధ్రాలోనూ మైలోజ్‌ కోల్పోయిన బాబు సలహాలు సూచనలు రేవంత్‌కు ఏ మేరకు పనిచేస్తాయి..? వేచి చూద్దాం.

Also Read : బ్రేకింగ్ : మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్

ట్రంప్‌ సంస్కరణలు ఇండో అమెరికన్ల ఓట్లు రాల్చేనా

American presidentఅగ్రరాజ్యం.. ప్రపంచ దేశాలకు పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికాలో ఎన్నికలకు వేళ అయింది. ప్రతి నాలుగేళ్లకోసారి వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనా, ఫలితాలపైనా ప్రపంచవ్యాప్తంగా అదే స్థాయిలో ఆసక్తి ఉంటుంది. ఇక ఈ ఎన్నికల్లో ఇండో–అమెరికన్ల ప్రభావం గట్టిగానే ఉంటుంది. గత టర్మ్‌లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపొందారు. ఆయన వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన ట్రంప్‌.. ఈ నాలుగేళ్లలో భారతీయులకు అనుకూలంగానో.. వ్యతిరేకంగానో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో అందరికీ తెలిసిందే. మరోమారు బరిలో నిలుస్తున్న ట్రంప్‌కు ఈసారి ఇండో అమెరికన్లు మద్దతు తెలుపుతారా..? భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడని.. ఆయన నుంచి తమకు గొప్ప మద్దతు ఉందని అంటున్నారు. అటు డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా జో బిడెన్‌, ఉపాధ్యక్ష పదవికి కమలా హ్యారిస్‌ బరిలో నిలుస్తున్నారు. కమలా హ్యారిస్‌ ఆసియా అమెరికన్‌. ఈ పదవికి పోటీ చేస్తున్న తొలి నల్లజాతి మహిళ. మరి ఇప్పుడు మన వాళ్లు ఎవరికి సపోర్టుగా నిలుస్తారో చూడాల్సి ఉంది.

Also Read : ప్రజలకు శుభవార్త… నవంబర్ 1 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ!

ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడని.. ఆయన పాలన చాలా బాగుందని ట్రంప్ కితాబిచ్చారు. గతేడాది సెప్టెంబర్‌లో అమెరికాలో జరిగిన ‘హౌడీ మోడీ’ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ట్రంప్ గుర్తుచేసుకున్నారు. ‘మీ అందరికీ తెలుసు గతంలో హోస్టన్‌లో ఒక ఈవెంట్ జరిగింది. ఆ భారీ ఈవెంట్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ నన్ను ఆహ్వానించారు. భారత్ నుంచి మనకు గొప్ప మద్దతు ఉంది. అలాగే మోదీ నుంచి కూడా మనకు గొప్ప మద్దతు ఉంది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన ఇండియా పర్యటన గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు. కరోనా మహమ్మారికి ముందు జరిగిన ఆ పర్యటన చాలా అద్భుతంగా సాగిందని.. భారత్ ఓ అద్భుతమని పేర్కొన్నారు.

అయితే.. ఇండియన్ అమెరికన్లలో ఎక్కువగా పాపులర్ అయిన ఇవాంకా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, కింబర్లీ గిల్‌ఫోయిల్‌లతో మీ తరపున ప్రచారం చేయిస్తారా..? అని ఓ జర్నలిస్ట్ ట్రంప్‌ను ప్రశ్నించగా.. ‘నాకు తెలుసు.. వారికి భారత్‌తో మంచి సంబంధాలున్నాయి..’ అని పేర్కొన్నారు. అయితే వారితో ప్రచారం చేయించేది లేనిది మాత్రం స్పష్టం చేయలేదు.

కొద్దివారాలుగా అటు డెమోక్రాట్స్, ఇటు రిపబ్లికన్లు ఇరువురు ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీని ఆకర్షించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సంప్రదాయకంగా డెమోక్రాటిక్ పార్టీకి ఓటు వేసే భారతీయ-–అమెరికన్లు నవంబర్ 3 ఎన్నికల్లో మాత్రం రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఇటీవలి మాసన్ సర్వే వెల్లడించింది. భారత ప్రధాని మోదీతో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి ఉన్న మిత్రుత్వమే దీనికి కారణమని సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రంప్, ఆయన క్యాంపెయినర్స్ ఇటీవలి ప్రచారాల్లో పదేపదే ఇండియన్ అమెరికన్ల మద్దతు కోసం విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read : చైనా భయపడిందా..చర్చలకు దిగొస్తోందా.. కారణమదే?

భాగ్యనగరం భాగ్యరేఖలు మారుతున్నాయా..?

0

Hyderabad
హైదరాబాద్‌నే మరో పేరుతో భాగ్యనగరంగా పిలుచుకుంటుంటాం. ఇప్పటికే ఎన్నో బహుళఅంతస్తులు.. మరెన్నో ప్రాచీన కట్టడాలతో పేరుగాంచిన సిటీ మామూలుగా విస్తరించడం లేదు. భాగ్యనగరం అభివృద్ధి రోజురోజుకూ ఖ్యాతిని చాటుతోంది. నలువైపులా ఏ దిక్కున చూసినా ఆకాశహర్మ్యాలే. ఇప్పుడు సిటీ అంతా తూర్పు దిశగా విస్తరిస్తోంది. దీంతో భాగ్యనగరం భాగ్యరేఖ మారుతున్నట్లే అని నిపుణులు అభిప్రాపడుతున్నారు.

Also Read : బ్రేకింగ్ : మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్

హైదరాబాద్‌ తూర్పున స్థిరాస్తి మార్కెట్‌ పుంజుకుంటోంది. నివాసాలకు అందరూ అటువైపే దృష్టి సారించారు. మెరుగైన మౌలిక వసతులు, బడ్జెట్‌ తగినట్లుగా సొంతిల్లు వస్తుండడంతో కొనుగోలుదారుల ఆసక్తి పెరిగింది. ఆ రూట్లో ఇప్పుడు బహుళ అంతస్తులు వెలుస్తున్నాయి. 20 అంతస్తులకు పైగా గృహ నిర్మాణాల ప్రాజెక్టులు ఇప్పటికే కొందరు రియల్టర్లు మొదలు పెట్టారు. ఇన్నాళ్లు పశ్చిమ హైదరాబాద్‌కే పరిమితమైన ఎత్తైన బిల్డింగ్‌లు ఇప్పుడు తూర్పుకూ విస్తరిస్తున్నాయి.

దశాబద్ద కాలానికి పైగా ఐటీ కారిడార్ చుట్టుపక్కల పశ్చిమ హైదరాబాద్‌లోనే స్థిరాస్త మార్కెట్‌ ఎక్కువ. ఏళ్ల తరబడి పశ్చిమ దిశగా మార్కెట్‌ విస్తరిస్తూనే ఉంది. ఇక్కడ భూములు ధరలు వింటే కూడా కల్లు బైర్లు కమ్మాల్సిందే. దీంతో మధ్య తరగతి వారు కూడా ఈ ఏరియాలో ఇల్లు కొనుక్కునే పరిస్థితి లేదు. కోటి రూపాయలకు పైగా వెచ్చిస్తే కానీ సొంత ఇంటిని కొనలేం. అబ్బో ఇంత ధర మనతోకాదనుకున్న కొనుగోలు దారులు తమ బడ్జెట్‌లో ఎక్కడైతే దొరుకుతాయో అటువైపుగా దృష్టి సారించారు. తూర్పున ఉన్న ఉప్పల్‌, ఎల్‌బీ నగర్‌‌ పరిసరాల్లో తక్కువ రేట్‌లో బిల్డర్లు ఇండ్లను నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడ బహుళ అంతస్తుల బిల్డింగ్‌లు ఏమీ లేకుండే. ఇప్పుడు ఐదంస్తుల నంచి.. 20 అంతస్తుల వరకు అపార్ట్‌మెంట్లు వెలుస్తున్నాయి.

నాగోల్‌ నుంచి రాయదుర్గం వరకు, ఎల్‌బీ నగర్‌‌ నుంచి మియాపూర్‌‌ వరకు మెట్రో రూట్‌ పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇక్కడ డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. గంటలో మాదాపూర్‌‌, రాయదుర్గంలోని ఐటీ ఆఫీసులకు చేరచ్చు. దీంతో ఐటీ ఉద్యోగులు, ఇతర రంగాల్లో పనిచేసేవారు ఇటు వైపు చూస్తున్నారు. ఫ్లైఓవర్లు, అవుటర్‌‌ రింగ్‌ రోడ్డు ఉండడంతో రెసిడెన్షియల్‌ హబ్‌లు పెరుగుతున్నాయి.

Also Read: అడవిలో డీజీపీ.. తెలంగాణలో ‘మావో’ల భయం?

ఇన్నాళ్లు ఈ ఏరియాల్లో రవాణా ఉన్నప్పటికీ పెద్దగా ఇన్‌ఫ్రా లేకుండా పోయింది. వీకెండ్‌లో కానీ.. సెలవుల్లో కానీ ఆహ్లాదంగా గడిపేందుకు పెద్దగా ఎంటర్‌‌టైన్‌మెంట్‌ స్థలాలు ఉండేవి కావు. ఇప్పుడు ఇక్కడ శిల్పారామం అందుబాటులోకి వచ్చింది. నాగోల్‌ మూసీ బ్రిడ్జి పక్కన ఏర్పాటైంది. ఉప్పల్‌లో మల్లీప్లెక్స్‌ కొత్తగా ప్రారంభమైంది. ఎల్‌బీ నగర్‌‌ చుట్టుపక్కన పెద్ద సంఖ్యలో మల్లీప్లెక్స్‌లు నిర్మాణంలో ఉన్నాయి. రామోజీ ఫిల్మ్‌ సిటీ చేరువలోనే ఉంది. కొత్త ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ వస్తున్నాయి. వైద్య సదుపాయాలూ పెరుగుతున్నాయి. ప్రైవేట్‌ స్పోర్ట్స్‌ గ్రౌండ్స్‌ అందుబాటులో ఉన్నాయి. అందుకే.. ఇప్పుడు డిమాండ్‌ పెరుగుతోంది.

ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండడం.. ఐటీ సంస్థలూ వస్తుండడంతో ఈ ప్రాంతం రూపురేఖలు మారుతున్నాయి. ఐటీ ఆఫీసులకు తోడుగా కొత్తగా మరిన్ని ఏర్పాటుకు ప్రభుత్వం కూడా లుక్‌ ఈస్ట్‌తో ప్రోత్సాహకాలు అందిస్తోంది. అందుకే.. ఇప్పుడు ఇటు సైడు ఇండ్లకు డిమాండ్‌ పెరిగింది. ఇండిపెండెంట్‌ హౌస్‌లు, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టులు, ఇంటి స్థలాల వెంచర్ల వరకు అందుబాటులో ఉన్నాయి. దూరం వెళ్లేకొలదీ ధరలు ఒక్కో విధంగా ఉన్నాయి. రూ.75 లక్షల్లో మంచి అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ దొరుకుతోంది. రూ.50 లక్షలకు అటు ఇటుగా గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఇల్లు వస్తోంది.

Also Read : అన్న ఎన్టీఆర్ ను మరవని కేసీఆర్..

ఆర్ఆర్ఆర్’ అప్డేట్.. దసరాకు సెట్స్ పైకి?


‘బాహుబలి’ సిరీసుల తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా ప్రారంభం నుంచే దర్శకుడు ‘ఆర్ఆర్ఆర్’పై భారీ అంచాలను పెంచాడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లను ఒకే తెరపై చూపించేందుకు రెడీ అయ్యాడు. దీంతో అటూ నందమూరి అభిమానులు.. ఇటూ మెగా ఫ్యాన్స్ ‘ఆర్ఆర్ఆర్’ కోసం అత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Also Read: ‘మిస్ ఇండియా’ రేటు 38 కోట్లు !

రాజమౌళి సినిమా కనీసం రెండేళ్లు చిత్రీకరణ చేసుకోవాల్సిందే. అయితే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికే 40శాతం సినిమా పూర్తయింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న క్రమంలోనే కరోనా ఎఫెక్ట్ తో సినిమా ఆగిపోయింది. దీంతో గత ఐదునెలలుగా ఆర్టిస్టులంతా ఇంటికే పరిమితయ్యారు. ఇప్పుడిప్పుడే టాలీవుడ్లో షూటింగులు మొదలవుతున్నాయి. అయితే రాజమౌళి సినిమా అంటే భారీగా టెక్నిషియన్లు, ఆర్టిస్టులు ఉంటారు. దీంతో ఈ మూవీని ప్రారంభించేందుకు రాజమౌళి ఇన్నిరోజులు వెనుకడారు.

అయితే తాజాగా సమాచారం ప్రకారం ఈ నెలఖారు లేదా అక్టోబర్ మొదటి వారంలో సినిమాను ప్రారంభించేందుకు రాజమౌళి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక సెట్స్ హైదరాబాద్ పరిసరాల్లోనే వేశారు. గత ఐదునెలలుగా షూటింగ్ ప్రారంభంకా సెట్స్ ఖాళీగా ఉంటుంది. తాజాగా సెట్స్ ఆవరణను పూర్తిగా శానిటైజర్ చేసి షూటింగ్ ప్రారంభించేలా చిత్రయూనిట్ సన్నహాలు చేస్తోంది.

Also Read: నాని ‘వి’ మూవీ రివ్యూ

పరిమిత సంఖ్యలోనే ఆర్టిస్టులు, టెక్నిషన్లతో సినిమాను ప్రారంభించేందుకు దర్శకుడు కసరత్తులు చేస్తున్నారు. కాగా ఇటీవల దర్శకుడు దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి కరోనా నుంచి కోలుకున్నారు. అన్ని పనులు సజావుగా సాగితే దసరాకు ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఓ కొత్త అప్డేట్ రావడం ఖాయంగా కన్పిస్తోంది.

లోకేష్ ‘అందరివాడు’లా మారతాడా?

టీడీపీ గతంలో ఎన్నడూ ఎదుర్కొని గడ్డు పరిస్థితులను ప్రస్తుతం ఎదుర్కొంటోంది. కిందటి ఎన్నికల్లో ఫ్యాన్ ప్రభంజాన్ని సైకిల్ తట్టుకోలేక చతికిలపడింది. అయితే ఎన్నికలు జరిగి ఏడాది పూర్తయినా టీడీపీ గత ఓటమిని ఇంకా తెరుకోలేకపోవడం గమనార్హం. టీడీపీ అధినేత చంద్రబాబుకు వయస్సు పైబడటంతో మునుపటిలా రాజకీయాలు చేయడంలేదని టాక్ టీడీపీ శ్రేణుల్లో విన్పిస్తోంది. దీంతో టీడీపీ ఆశాకిరణంగా లోకేష్ బాబును తెరపైకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

Also Read: ‘జగనన్న విద్యాకానుక’ వాయిదా.. కారణమిదే?

టీడీపీ ప్రభుత్వ హయాంలో లోకేష్ బాబు ఎమ్మెల్సీగా ఎన్నికై ఐటీ మంత్రిగా పని చేశారు. అయితే కిందటి ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి లోకేష్ బాబు ఓటమి చెందడంతో ఆయన స్టామినాపై అనుమానాలు రేకెత్తాయి. సీఎం కొడుకుగా, మంత్రిగా పనిచేసిన లోకేష్ బాబు ఎమ్మెల్యేగానే గెలువకుంటే మున్ముందు పార్టీని ఎలా నడిపిస్తారనే ప్రశ్నలు తలెత్తాయి. దీంతో కొందరు టీడీపీ నాయకులు లోకేష్ నాయకత్వంపై పెదవి విరుస్తున్నారు.

ఇటీవల కొందరు టీడీపీ ఎమ్మెల్యే పార్టీని వీడి సమయంలోనూ లోకేష్ నాయకత్వంలో విమర్శలు చేశారు. దీంతో ఆయన నాయకత్వంపై శ్రేణుల్లో సందేహాలు మొదలయ్యాయి. మరోవైపు లోకేష్ బాబు కేవలం ట్వీటర్లో ట్వీట్లకే పరిమితం అవడం కూడా విమర్శలు తావిచ్చింది. అయితే ఇటీవల కాలంలో లోకేష్ బాబు పార్టీపై పట్టు సాధించేందుకు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు చంద్రబాబు సైతం ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడనే టాక్ విన్పిస్తోంది. అయితే లోకేష్ మాత్రం టీడీపీ నాయకులపై పెత్తనం చేసేందుకు చూస్తుండటంతో ఆయనపై నేతల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుందని ప్రచారం జరుగుతోంది.

ఇటీవల కాలంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు ఎక్కువ అవడంతో బాబు పార్టీ నేతలకు భరోసా ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక లోకేష్ సైతం పార్టీ నేతలను కలుపుకుపోయేందుకు యత్నిస్తున్నారు. సైకిల్ యాత్రతో ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల లోకేష్ తన సామర్థ్యాన్ని నిరూపించుకునేలా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రస్తుతం లోకేష్ తన తండ్రిలా పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

Also Read: చంద్రబాబు, పీవీ.. ఒక మరుపు కథ.!

ఆయన తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటేనే భవిష్యత్లో టీడీపీ ఆశాకిరణంగా మారే అవకాశం ఉంది. అన్ని కలిసొస్తే సీఎం అయినా ఆశ్చర్యపోనవరం లేదని నేతలు అంటున్నారు. ఈనేపథ్యంలో లోకేష్ బాబు టీడీపీ అందరివాడుగా మారుతారా? లేదా కొందరివాడుగా ఉండటా? అనేది వేచి చూడాల్సిందే..!

కేసీఆర్‌‌ ఇమేజ్‌ ముందు బీజేపీ నిలిచేనా


2019 అసెంబ్లీ ఎన్నికలు అటు ఆంధ్రలోనూ.. ఇటు తెలంగాణలోనూ వన్‌సైడ్‌ అన్నట్లే జరిగాయి. మెజార్టీ స్థానాల్లో గెలుపొంది అక్కడ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని ఫాం చేశారు. తెలంగాణలో యాజ్‌ టీజ్‌గా కేసీఆర్‌‌ ప్రభుత్వం కొలువుదీరింది. ఈ ఎన్నికలను ఒకసారి పరిశీలిస్తే ఆంధ్రలో ప్రతిపక్షం అనేది లేకుండా అక్కడ వైసీపీకి ఏకపక్ష మెజార్టీ కట్టబెట్టారు. అక్కడ కాంగ్రెస్‌ ఎప్పుడో కాటికి వెళ్లిపోయింది. ఇప్పుడు టీడీపీ పరిస్థితి కూడా అలానే ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం స్థానం ఆక్రమించడానికి అక్కడ బీజేపీకి గ్యాప్‌ దొరికింది. ఇక తెలంగాణలో అంతో ఇంతో బలంగా ఉన్న బీజేపీ.. ఇన్నాళ్లు ఏకపక్షంగా ప్రభుత్వం పైనే తన విమర్శలను సంధించింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి కాంగ్రెస్‌పైనా కాలు దువ్వుతోంది.

Also Read: బ్రేకింగ్ : మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో చంద్రబాబు చేసిన పని వల్ల మహాకూటమి కట్టి కాంగ్రెస్‌కు సంఖ్యాపరంగా సీట్లు తగ్గాయి కానీ.. క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ఆదరణ అలానే ఉంది. ఓటు బ్యాంక్‌ కూడా ఏమాత్రం తగ్గలేదు. హస్తం గుర్తుకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ తెలంగాణలోని ప్రతి జిల్లాలోనూ ఉన్నారంటే నమ్మాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో సెకండ్‌ ప్లేస్‌లోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది బీజేపీ.

ఇది కాస్త కష్టమైన వ్యవహారం అనే విషయమని తెలంగాణ బీజేపీకి బాగా తెలుసు. అయినా తన ప్రయత్నాలు సాగిస్తోంది. ఇటీవలే అధిష్ఠానం కూడా యువ లీడర్‌‌.. ఎలాంటి మచ్చ లేని నాయకుడైన కరీంనగర్‌‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌‌ను పార్టీ స్టేట్‌ చీఫ్‌గా సెలెక్ట్ చేసింది. ఆయన పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు పోరు సలుపుతూనే ఉన్నారు. సీఎం కేసీఆర్‌‌ వైఫల్యాలను ఎండగడుతూనే ఉన్నారు. నిత్యం ప్రజల్లోకి వెళ్తూ పార్టీకి మైలేజ్‌ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే.. ఇప్పటి వరకు ప్రభుత్వం మీదనే ప్రశ్నలవర్షం కురిపించిన బీజేపీ.. కొత్తగా కాంగ్రెస్‌ మీద పడింది. కేంద్రంలో కాంగ్రెస్‌ ఇస్తున్న ప్రకటనలకు.. రాష్ట్ర కాంగ్రెస్‌తో ముడిపెట్టి ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: అడవిలో డీజీపీ.. తెలంగాణలో ‘మావో’ల భయం?

వాస్తవంగా చూసుకుంటే.. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలోనే బీజేపీకి అంతోఇంతో ఓటు బ్యాంక్ ఉంది. ఈ ఓటు బ్యాంక్‌ను పెంచుకోవాలంటే అధికార పక్షాన్ని టార్గెట్ చేయడం కంటే.. కాంగ్రెస్‌ను బద్నామ్ చేయడం ఈజీ అని భావిస్తోంది. ఒకవేళ ఈ ప్రయోగం  ఫలిస్తే.. హార్డ్ కోర్ కాంగ్రెస్ అభిమానులు బీజేపీ వైపు రాకున్నా.. మధ్యతరగతి ఓటర్లు, తటస్థ ఓటర్లు, కాంగ్రెస్,- కేసీఆర్‌‌కు వ్యతిరేకంగా న్యూట్రల్‌గా ఉన్నా మేధో వర్గం తమవైపు వస్తుందని బీజేపీ ఆశ పడుతోంది .

తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ,-సామాజిక పరిస్థితుల బట్టి చూస్తే.. బీజేపీ ప్రయత్నాలకు పెద్దగా ఫలితాలు కనిపించే పరిస్థితులు లేవు. కాకపోతే ఇదే వ్యూహాన్ని వాళ్లు కొనసాగిస్తే.. మరో మూడేళ్లలో కాంగ్రెస్‌కు గట్టి ప్రత్యామ్నాయంగా ఏర్పడే ఆస్కారమూ లేకపోలేదు. అయితే కేసీఆర్ హవాను తట్టుకోవాలంటే ఈ మాత్రం వ్యూహాలు సరిపోవని అంటున్నారు రాజకీయ నిపుణులు.

మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ భావోద్వేగం

దేవుడు, గురువు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తా అన్నారు మహానుభావుడు కబీర్ దాస్. ఎందుకంటే.. ఆయన భగవంతుడు అని మొదట తనకు చెప్పింది గురువే కాబట్టి. సమాజంలో గురువుకు ఉన్న స్థానం అంత గొప్పది. ‘గు’ అంటే చీకటి, ‘రు’ అంటే పోగొట్టేది అని అర్థం. అంటే మనలో అజ్ఞాన పొరలు తొలగించి, జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు అన్నమాట. అలాంటి గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనది. అందుకే ఏటా సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటుంటాం. ఎంతటి పెద్ద కంపెనీకి సీఈవో అయినా ఆది నుంచి గురువు లేనిదే ఆ స్థాయికి రాలేడు. అందుకే.. సినిమా ఇండస్ర్టీలో ఎంత పెద్ద హీరో అయినా.. ఎంత పెద్ద క్యారెక్టర్‌‌ ఆర్టిస్ట్‌ అయినా వారికీ గురువులు ఉంటారు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మన టాలీవుడ్‌ హీరోలు తమ తమ గురువులను తలచుకున్నారు.

Also Read: బిగ్ బాస్: కంటెస్టెంట్లు ఎవరో తెలిసిపోయింది?

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు సినీ ప్రముఖులు తమ జీవితంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులను గుర్తు చేసుకున్నారు. సూపర్ స్టార్ మహేశ్‌బాబు, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, మలయాళ నటుడు ప్రేమమ్ ఫేమ్ నవీన్ పౌలీ సోషల్ మీడియాలో స్పందించారు. వారు తమ గురువులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

టీచర్స్ డే‌ను పురస్కరించుకొని మహేశ్‌ తన ట్విట్టర్‌ ద్వారా స్పందించాడు. ‘అభ్యాసానికి సరిహద్దులు లేవు. కరోనా పరిస్థితుల్లో విద్యార్థులకు ఉత్తమంగా తీర్చి దిద్దేందుకు ప్రయత్నిస్తున్న ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. నా జీవితంలో ఎంతో మంది స్ఫూర్తినిచ్చిన, నాకు పలు విషయాలను నేర్పించిన వ్యక్తులు, నన్ను నడిపించిన ప్రతీ ఒక్కరికీ హ్యాపీ టీచర్స్ డే’ అంటూ ట్వీట్ చేశాడు.

టీచర్స్ డే రోజున జర్నలిస్టు, రచయిత గౌరీ లంకేశ్‌ను గుర్తు చేసుకొంటూ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌ భావోద్వగమయ్యారు. ‘నేను ఇంత వాడిని కావడానికి తోడ్పాటునందించిన, ఎన్నో రకాలుగా స్ఫూర్తిగా నిలిచిన నా టీచర్లకు, ముఖ్యంగా గౌరీకి స్పెషల్ థ్యాంక్స్. మూడేళ్ల క్రితం పిరికిపందలు నిన్ను ఈ లోకం నుంచి తీసుకెళ్లారు. కానీ భయమే లేని ఓ స్ఫూర్తి మాతోనే ఉంది. నీవు లేని లోటు ఇంకా వెంటాడుతూనే ఉంది.. నన్నుగౌరి. జస్ట్ ఆస్కింగ్’ అంటూ ప్రకాశ్ రాజ్ ఎమోషనల్ అయ్యారు.

సాయిధరమ్ తేజ్ స్పందిస్తూ.. ‘మనం ఈ రోజు ఇంత ఎత్తుకు ఎదిగామంటే అందుకు కారణం టీచర్లే. వారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. సరైనా మార్గంలో నడిపించడానికి, మంచి భవిష్యత్ ఉండాలని వారు పడిన తాపత్రయం మాటల్లో చెప్పలేం. మన జీవితాల్లో గొప్ప పాత్ర పోషించిన ఉపాధ్యాయులందరికీ నా శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.

Also Read: సవతులుగా మారనున్న వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ఐశ్వర్య రాజేష్ !

‘నా జీవితంపై ఎక్కువగా ప్రభావితం చేసిన వారిలో నా డైరెక్టర్లే ఉన్నారు. మీరే నా లైఫ్‌పై బలమైన ప్రభావం చూపించారు. ఒక్క సినిమా డైరెక్టర్ గురించి చెబితే చాలదు. మీ అందరినీ గురువులుగా భావించి గుర్తు చేసుకోవాల్సిందే’ అని వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు. శ్రీకాంత్ అడ్డాల, క్రిష్, పూరీ జగన్నాథ్, శ్రీను వైట్ల, శేఖర్ కమ్ముల, హరీష్ శంకర్, వెంకీ అట్లూరి, సంకల్ప్ రెడ్డి, అనిల్ రావిపూడి డైరెక్టర్ల ఫొటో పెట్టి ట్వీట్ చేశారు.

మలయాళ నటుడు నవీన్ పౌలీ ఉపాధ్యాయుల సేవలను స్మరించుకున్నారు. ‘నాలోని ప్రతిభను గుర్తించిన ప్రతీ ఉపాధ్యాయుడికి నా శుభాకాంక్షలు. స్కూల్, కాలేజీ స్థాయిలో నాకు సరైన మార్గం చూపించిన ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు. నా కలల్ని సాకారం చేసుకొనే ప్రయాణంలో తోడ్పడిన ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.

బ్రేకింగ్ : మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ నెల 7 నుంచి శాసనసభ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. అయితే హరీష్ రావుకు కరోనా లక్షణాలు లేకుండానే పాజిటివ్ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. లక్షణాలు లేని ‘అన్ సిమ్టామిక్’గా వైద్యులు తెలిపారు. కానీ జాగ్రత్తగా ఉండాలని చికిత్స తీసుకోవాలని సూచించారు.

Also Read : అడవిలో డీజీపీ.. తెలంగాణలో ‘మావో’ల భయం?

ఇక కరోనా వచ్చిన విషయాన్ని స్వయంగా హరీష్ రావు ట్వీట్ చేసి తెలిపారు. తన ఆరోగ్యం బాగుందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్విట్టర్ లో తెలిపారు. కాగా తనకు కరోనా రావడంతో తనను కలిసిన వారు అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని నేతలు, అధికారులకు హరీష్ రావు సూచనలు చేసినట్టు సమాచారం.

తెలంగాణలో వరుసగా ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారినపడుతున్నారు. తీవ్రత రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు దాదాపు 30మంది ఎమ్మెల్యేల వరకు కరోనా బారిపడినట్లు సమాచారం. తాజాగా మంత్రులను కూడా కరోనా వదిలిపెట్టడం లేదు.

Also Read : హాంఫట్.. తెలంగాణలో ఏం జరుగుతోంది?

‘మిస్ ఇండియా’ రేటు 38 కోట్లు !


హోమ్లీ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ మూవీగా వస్తోన్న సినిమా ‘మిస్ ఇండియా’. ఇప్పటికే ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. గత నెలలోనే మేకర్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి బేరం పెట్టారు. ఇక అప్పటినుండే త్వరలోనే ఈ సినిమా ఓటిటీ ప్లాట్‌ ఫామ్‌ లో విడుదల కాబోతోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నుండి ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో ఆఫర్స్ రాకపోయేసరికి ఇక ఎట్టిపరిస్థితుల్లోనూ థియేటర్స్ లోనే తమ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. ఆ రకంగా ఈ సినిమా ఇప్పటివరకూ ఓటీటీ రేసులో లేకుండా పోయింది.

Also Read: సవతులుగా మారనున్న వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ఐశ్వర్య రాజేష్ !

అయితే అనూహ్యంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ తెలుగు సినిమాలను భారీ మొత్తానికి కొనడం స్టార్ట్ చేస్తుండేసరికి.. మిస్ ఇండియా మేకర్స్ కు మళ్లీ ఆశ పుట్టింది. ఎలాగూ ఇప్పట్లో థియేటర్లు తెరిచే అవకాశం లేదు. తెరిచినా జనం ఈ సినిమాకి వస్తారనే గ్యారెంటీ లేదు. ఈ పరిస్థితుల్లో ఈ సినిమాని ముందే అమ్మేసుకోవడం ఉత్తమం అనుకున్న సినిమా టీం.. ఆ రకంగా ప్రయత్నాలు చేసి.. మొత్తానికి అనుకున్నది సాధించారు, మిస్ ఇండియాని భారీ ధరకు అమ్మేశారు. దాదాపు 38 కోట్లుకు ఈ సినిమాని అమ్మినట్లు తెలుస్తోంది. ఎలాగూ టీవీ శాటిలైట్ రైట్స్ చేతిలో ఉన్నాయి.. దాని ద్వారా మరో ఎనిమిది నుండి పది కోట్లు వచ్చే అవకాశం ఉంది.

ఇక ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అక్టోబర్ లో రిలీజ్ అయ్యే ఆవకాశం ఉంది. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని అమెజాన్ బృందం ప్లాన్ చేస్తున్నారట. దసరాకి మహిళ ప్రాధాన్యత ఉన్న సినిమా అయితే బాగా వర్కౌట్ అవుతుందనేది వారి లెక్కలు కావొచ్చు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించాడు. మహేష్ కోనేరు గతంలో ఫిల్మ్ క్రిటిక్ గా పనిచేశారు. అతను మంచి క్రిటిక్ కూడా. ఆ రకంగా చూసుకుంటే.. ఈ మిస్ ఇండియా కథలో ఏదో ప్రత్యేకత ఉంటేనే సినిమా ఓకే చేస్తాడు. కాబట్టి ఈ సినిమాకి మినిమమ్ గ్యారెంటీ ఉంటుందనేది ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోన్న మాట.

Also Read: బాలయ్యతో నటిస్తా కానీ.. హీరోయిన్ డిమాండ్ !

కాగా ఈ సినిమా కథ.. మహిళల పై ఒక్కో స్టేజిలో ఒక్కో రకంగా జరిగే దాడుల గురించి ఉంటాయని.. అలాంటి దాడులని.. అలాగే అలాంటివి జరిగినప్పుడు ఎలా ఎదురుకోవాలనే అంశాన్ని ఈ చిత్రంలో విశ్లేషాత్మకంగా చూపిస్తున్నారట. ఇప్పటికే మహానటితో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్న కీర్తి సురేష్.. ఈ సినిమాతో కూడా మరోసారి ఆకట్టుకోవడం గ్యారంటీ అంటున్నారు మేకర్స్.

నాని ‘వి’ మూవీ రివ్యూ

మూవీ : ‘వి’
విడుదల తేదీ: సెప్టెంబర్‍ 5, 2020
వేదిక: అమెజాన్‍ ప్రైమ్‍ వీడియో
బ్యానర్‍: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
తారాగణం: నాని, సుధీర్‍బాబు, అదితిరావ్‍ హైదరి, నివేదా థామస్‍, నరేష్‍, వెన్నెల కిషోర్‍ తదితరులు
సంగీతం: అమిత్‍ త్రివేది
ఎడిటింగ్ : మార్తాండ్‍ కె. వెంకటేష్‍
నిర్మాతలు: రాజు-శిరీష్‍-హర్షిత్‍ రెడ్డి
రచన, దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ

నాని 25వ సినిమాగా ‘వి’ చిత్రం ఈరోజు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. నాని తొలి సినిమా దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణనే ‘వి’ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీని థియేటర్లలో విడుదల చేయాలని ప్రయత్నించినా కరోనా కారణంగా చివరకు ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు ‘వి’ని కొనుగోలు చేసి నేడు విడుదల చేసింది. అయితే ‘వి’ సినిమా అంచనాలను అందుకుందా? లేదా అనేది చూద్దాం.

*కథ ఏంటి?
హీరో నాని తాను చేయని ఓ మాస్ క్యారెక్టర్లో కన్పించాడు. రఫ్ అండ్ టఫ్ లుక్కులో అదిరిపోయాడు. అయితే ఈ సినిమా కథాంశాన్ని దర్శకుడికి కొత్తమోగానీ తెలుగులో ఇలాంటి కంటెంట్ సినిమాలు వచ్చాయి. హీరో నాని ఎంట్రీలోనే ఓ స్టైల్ ఆఫ్ స్మోకింగ్ చేస్తూ కన్పిస్తాడు. ఎంట్రీలోనే మర్డర్ చేసి ఓ పోలీస్ ఆఫీసర్ కు తనను పట్టుకో అంటూ సవాల్ విసురుతాడు. ఇలా హీరో మర్డర్లు చేసుకుంటూ సదరు పోలీస్ ఆఫీసర్ కు క్లూ ఇస్తూ పోతుంటాడు. ఇలాంటి రోటీన్ కథలు తెలుగులో బోలెడన్నీ వచ్చాయి.

Also Read: ‘మిస్ ఇండియా’ రేటు 38 కోట్లు !

*విశ్లేషణ
‘వి’లో సుధీర్ బాబు పాత్ర హీరోకు సమానమైనదిగా నడుస్తోంది. సినిమా ఎంట్రీలోనే సుధీర్ బాబు మంచి ఫైట్ సీన్ తో కన్పిస్తున్నాడు. సిక్స్ ప్యాక్ బాడీతో సుధీర్ బాబు ఆకట్టుకున్నాడు. టైటిల్ కార్డులోనే సుధీర్ బాబును సూపర్ కాప్ గా దర్శకుడు చూపించారు. అయితే ఆ వెంటనే ఈ కాప్ ను హీరోయిన్ ఫ్లర్టింగ్ చేస్తుంటుంది. నాని మర్డర్లు చేస్తూ పోలీస్ కాపుకు ఛాలెంజ్ విసిరడం సినిమాలో రోటిన్ మారిపోతుంది. అయితే సుధీర్ బాబు కొన్ని సీన్లలో కామెడీ చేయడం.. నాని వదిలిని క్లూ చాలా కామెడీగా ఉన్నాయి. దీంతో ‘వి’లో సస్పెన్స్ థిల్ మిస్సయినట్లు కన్పిస్తుంది.ఇక హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. నివేధా దామన్ కేవలం పాటలకు, కొన్ని సీన్లకే పరిమితమైంది. అదితి రావు నిడివి చాలా తక్కువగా ఉంది. ఇక తమన్‍ మరోసారి తన సంగీతంతో ఆకట్టుకున్నాడు. సినిమాలో నాని పాత్ర ఆ మాత్రమయినా ఎలివేట్‍ అయిందంటే తమన్ మ్యూజికే కారణం. సినిమాటోగ్రఫీ బాగుంది. వెన్నల కిషోర్ కామెడీతో ఆకట్టుకున్నాడు. రచయిత, దర్శకుడు అయిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ ‘వి’ సినిమాపై ఇంకొంచెం ఫోకస్ పెడితే బాగుండేది అనిపిస్తోంది. మొత్తానికి ఈ సినిమా రోటిన్ సినిమానే తలపిస్తోంది. ఈ థియేటర్ల కంటే ఓటీటీలో విడుదల కావడం నిర్మాతకు మంచే చేసింది.

– oktelugu రేటింగ్: 2.5/5