Cockroach Janata Party Controversy: పగలేమో నిరసనలు చేస్తున్నారు. రాత్రి ఏమో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ప్రతి ప్రాంతంలోనూ నిరసన చేపట్టే ముందు హంగామా చేస్తున్నారు. ఇండిపెండెంట్ ఉద్యమాలు అని చెబుతూనే.. లగ్జరీ లెవెల్ లో నిరసనలు చేపడుతున్నారు. వాస్తవానికి ఇదంతా ఎలా జరుగుతోంది.. ఈ ఖర్చు మొత్తం ఎవరి భరిస్తున్నారు.. అభిజిత్ ఒక పిలుపు ఇవ్వగానే ఒక వర్గానికి సంబంధించిన మేధావులు ఎందుకు వస్తున్నారు.. వారంతా ఏం చేస్తున్నారు.. దీనిని ఎవరు నడిపిస్తున్నారు.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు కొంతమంది పాత్రికేయులకు కలిగాయి. వారు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేస్తే దారుణమైన నిజాలు వెలుగు చూశాయి.
అప్పట్లో రైతు చట్టాలను కేంద్రం తీసుకొచ్చినప్పుడు టూల్ కిట్ ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమానికి మనదేశంలో చాలామంది సపోర్ట్ చేశారు. అందులో కమ్యూనిస్టు పార్టీలకు చెందినవారు ఎక్కువగా ఉన్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో ఆకస్మాత్తుగా ఖలిస్తాన్ నినాదం పుట్టింది. ఆ తర్వాత ఢిల్లీలో ఎర్రకోట మీద జాతీయ జెండాకు బదులుగా వేర్పాటు వాదులు తమ జెండాను ఎగరవేశారు. దీంతో వారి ఎజెండా క్లియర్గా కనిపించింది.
ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో కూడా కొంతమంది పాత్రికేయులు లోతుగా దర్యాప్తు చేస్తే అసలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇదంతా కూడా కార్పొరేట్ టూల్ కిట్ మాదిరిగానే ఉంది.. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ వెబ్సైట్.. ఇతర సోషల్ మీడియా ఖాతాలు పనిచేయడం లేదు. ఆయనప్పటికీ వాటి సంబంధించిన డిజిటల్ వ్యవహారాలలో ఫుట్ ప్రింట్లు ఎప్పటికప్పుడు క్లియర్ చేసి కనిపిస్తున్నాయి.. పైగా నిరసనలు చేపడుతున్నప్పుడు దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు దరఖాస్తు చేసిన వారందరికీ సందేశాలు వెళుతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ చేపడుతున్న నిరసనలో పాల్గొనాలని పిలుపులు వెళ్తున్నాయి. లక్షల మంది విద్యార్థులకు అలా సందేశాలు వెళ్లడం వెనక ఎగ్జామ్ జీట్ ఆప్స్ వాడుతున్నట్టు తెలుస్తోంది. డేటా హార్వెస్టింగ్ కూడా చేపడుతున్నట్టు సమాచారం. ఇదంతా అంతా సులువైన వ్యవహారం కాదు. దీని వెనక పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలు.. పేరుపొందిన హ్యాకర్లు పనిచేస్తూ ఉంటారు. బొద్దింకల ఉద్యమానికి వీరంతా ఎందుకు సపోర్ట్ చేస్తున్నట్టు.. ఎన్ని కోట్ల ఖర్చు ఎందుకు పెడుతున్నట్టు.. అదే ఆందోళన కలిగిస్తోంది.
పైగా కాక్రోచ్ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్న కొన్ని వెబ్సైట్లో సోలానా బిట్ కాయిన్ గేట్ వే లు కనిపిస్తున్నాయి. ఇవి మనీలాండరింగ్ వ్యవహారాలలో కీలకంగా ఉంటాయి. ఎందుకంటే వీటి ద్వారా సులభంగా నల్లధనాన్ని తెల్లగా మార్చవచ్చు. మనదేశంలో ప్రభుత్వ బ్యాంకుల సర్వర్లు ఒప్పుకోనప్పటికీ.. ఎప్పటికప్పుడు హ్యాకర్లు డొమైన్ లు మార్చుతున్నారు. ఇలా వందల కోట్ల డబ్బు ఖర్చు పెట్టడం.. తెర వెనుక కార్పొరేట్ వ్యక్తులు ఉండడం.. ఈ ఉద్యమంలో కొంతమందిని భాగస్వాములు చేయడం చూస్తుంటే దేశాన్ని అస్థిరపరిచే కుట్ర పన్నినట్టు తెలుస్తోంది..
నీట్ పరీక్ష నిర్వహణ దారుణంగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషయం కూడా తెలిసిందే. ఈ వ్యవహారంలో దోషులను వదిలిపెట్టకూడదు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. కానీ, నీట్ లో లోపాలను సాకుగా చూపించి కొంతమంది కృత్రిమ ఉద్యమాలు సృష్టించి.. దేశంలో అస్థిరత సృష్టించే పనులు చేపడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఎందుకంటే ఈ దేశం అందరిది. ఈ దేశంలో ఏవైనా దారుణాలు జరిగితే బాధపడేది కూడా అందరే.
















రేవంత్ రెడ్డి వ్యవహారశైలి సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా..
Revanth Reddy political style : రేవంత్ రెడ్డి .. యంగెస్ట్ సీఎం.. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యువ సీఎం. ఆయనకు పార్టీలు ముఖ్యం కాదు.. పార్టీలను ఒక సాధనంగా వాడుకొని పైకి వచ్చిన వ్యక్తి. రేవంత్ రాజకీయ ప్రయాణం అలానే కనిపిస్తోంది. మాటల గారెడీతో ఆకట్టుకోగలదు. అవతల వారిని హర్ట్ చేసినా చింతించడు. అది ఎంత పెద్ద నాయకుడు అయినా.. మోడీ స్థాయి ఏంటి.. మోడీపై కూడా అలాంటి డైలాగులు మాట్లాడుతాడు. అలాంటి మోడీతోనే సన్నిహితంగా మెలగలరు. కేవలం ట్రాన్సాక్షన్ నాయకుడు. ఈ వ్యవహారశైలి బాగానే ఉంటుంది. హైడ్రా వంటి మంచి ప్రయత్నం హైదరాబాద్ లో కొనసాగుతోంది.కొన్ని ఆరోపణలున్నా మంచి పనులే చేస్తున్నారు.
హైడ్రా, మూసీ పనులు మంచి పనులు. మెట్రో ఎయిర్ పోర్టు విస్తరణ తుగ్గక్ పని.. హైడ్రా ఇన్స్పిరేషన్ హిట్లర్ అని.. రెడ్లు సహజ పాలకులు అంటాడు. చాలా స్లిప్ట్ పర్సనాలిటీని ఎక్కడా చూడలేం.
మెట్రో విస్తరణ విషయంలో కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శించాడు. కేంద్రమంత్రుల వద్ద రేవంత్ రెడ్డి పరపతి సరిపోవడం లేదు. పబ్లిక్ లో తిట్టేసి ఒత్తిడి తీసుకొచ్చాడు. అదే కిషన్ రెడ్డిని పట్టుకొని వెళ్లి అశ్వినీ వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్ దగ్గరకు తీసుకెళ్లి మెట్రో విస్తరణపై పని చేసుకొని పెట్టాడు కిషన్ రెడ్డి. పబ్లిక్ గా బ్లాక్ మెయిల్ తీసుకొచ్చి కిషన్ రెడ్డి పనిచేయించుకున్నాడు రేవంత్ రెడ్డి..
రేవంత్ రెడ్డి వ్యవహారశైలి సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోను చూడొచ్చు.