Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi remuneration reduced: చిరంజీవి రెమ్యూనరేషన్ తగ్గించాడా..? కారణం ఏంటంటే..?

Chiranjeevi remuneration reduced: చిరంజీవి రెమ్యూనరేషన్ తగ్గించాడా..? కారణం ఏంటంటే..?

Chiranjeevi remuneration reduced: మెగాస్టార్ చిరంజీవి తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకానీ రీతిలో వరుస విజయాలను సాధించిన ఆయన ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా పెను సంచలనాలను క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించినప్పటికి చిరంజీవి తన రెమ్యూనరేషన్ ను కొంతవరకు తగ్గించాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. కారణం ఏంటంటే సినిమా బడ్జెట్లు విపరీతంగా పెరిగిపోతున్న క్రమంలో తన రెమ్యూనరేషన్ తగ్గించి […]

Chiranjeevi remuneration reduced: మెగాస్టార్ చిరంజీవి తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకానీ రీతిలో వరుస విజయాలను సాధించిన ఆయన ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా పెను సంచలనాలను క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించినప్పటికి చిరంజీవి తన రెమ్యూనరేషన్ ను కొంతవరకు తగ్గించాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. కారణం ఏంటంటే సినిమా బడ్జెట్లు విపరీతంగా పెరిగిపోతున్న క్రమంలో తన రెమ్యూనరేషన్ తగ్గించి ఆ డబ్బులను సినిమా బడ్జెట్ మీద కేటాయించాలని చిరంజీవి కోరుకుంటున్నాడట. సినిమాను గ్రాండియార్ గా తెరకెక్కించడానికి ఆ డబ్బులను వాడాలని ఆయన భావిస్తున్నాడు. నిజానికి చిరంజీవి తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పదని ప్రతి ఒక్కరు కీర్తిస్తున్నారు. హీరోలందరూ ఇలా చేస్తే ప్రొడ్యూసర్ల మీద బడ్జెట్ భారం పడే అవకాశాలైతే లేకుండా పోతాయి. మూవీ సక్సెస్ అయిన తర్వాత అందులో నుంచి ఎంతో కొంత వాటానైతే ప్రొడ్యూసర్లకు తిరిగి చెల్లిస్తారు. కాబట్టి హీరోలు మంచి కథల్ని ఎంచుకొని వాటిని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసే విధంగా జాగ్రత్తలు తీసుకుంటే హీరోలు సూపర్ సక్సెస్ లను సాధించిన వరవుతారు. అలాగే రెమ్యునరేషన్ కూడా ఆ తర్వాత భారీగా తీసుకున్నవారు అవుతారు…

ప్రస్తుతం చిరంజీవి బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు. ఆయన జిమ్ లో కష్టపడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఆయన అంతలా కష్టపడుతున్నడని అది చూస్తున్న ప్రతి ఒక్కరు అతన్ని ఆదర్శంగా తీసుకోవాలని భావిస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ ఫ్యాన్స్ మాత్రం తన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. చిరంజీవి లాంటి నటులు ఈ ఏజ్ లో కూడా చాలా బాగా కష్టపడుతూ తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారంటూ వాళ్ళు కామెంట్స్ చేస్తుండడం విశేషం…

ఇప్పటివరకు చిరంజీవి చేసిన సినిమాలు కమర్షియల్ గా ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల వైపు కూడా తను అడుగులు వేస్తున్నాడు. అందులో భాగంగానే బాబీ సినిమాలో అతను 50 సంవత్సరాల పైబడిన వయసు గల వ్యక్తిగా కనిపించబోతున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper