CM Vijay viral assembly video: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మొట్టమొదటిసారి అసెంబ్లీ లో తన వైపు నుండి తీవ్ర స్వరం వినిపించాడు. ఎన్నికల ప్రచారం లో కూడా చాలా సాఫ్ట్ తోనే ప్రసంగాలు ఇచ్చిన విజయ్, ఒక్కసారి గా ఇలా అసెంబ్లీ లో ప్రత్యార్థులపై అవ్వడం అందరినీ షాక్ కి గురించి చేసింది. విజయ్ దెబ్బకు DMK పార్టీ నేతలు అసెంబ్లీ నుండి వాకౌట్ అవ్వడం, చివర్లో విజయ్ ఒక కుట్టి స్టోరీ అంటూ స్టాలిన్ ని అనుకరించి మ్యానిరిజం చేయడం హైలైట్ గా నిల్చిన అంశం. సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ వీడియోనే చక్కర్లు కొడుతోంది.ఇంతకీ స్టాలిన్ కి విజయ్ ఇచ్చిన కౌంటర్ ఏంటంటే,’ఒక ఊర్లో పెద్దాయన కళ్ళు కనపడక,కంటి మీద చెయ్యి వేసి చూస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న ఒక కుర్రాడు ఏమి వెతుకుతున్నారు అని అడుగుతాడు. ఇక్కడ మీ నాన్న ఉంటాడని చెప్పారు, అందుకే చూస్తున్నాను, ఎక్కడ మీ నాన్న?, అసలు కనపడట్లేదే?’ అంటూ విజయ్ స్టాలిన్ ని ఒక రేంజ్ లో ర్యాగింగ్ చేసాడు.
VIRAL VIDEO: అసెంబ్లీలో స్టాలిన్ స్టైల్లో విజయ్
తమిళనాడు సీఎం విజయ్‌కి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ గతంలో ఎన్నికల ప్రచారం వేళ చేసిన చేసిన వైరల్ హ్యాండ్ సైన్ (చేతి సైగ)ను నేడు విజయ్ అసెంబ్లీలో అనుకరించారని… pic.twitter.com/bbDy9okMw3
— ChotaNews App (@ChotaNewsApp) June 23, 2026
ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాజీ సీఎం స్టాలిన్, తన సొంత స్థానం కొలత్తూరులో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు ఉదయ్ నిధి స్టాలిన్ మాత్రం గెలిచాడు. ప్రస్తుతం ఆయన అసెంబ్లీ లో ప్రతిపక్ష పార్టీ లీడర్ గా కొనసాగుతున్నాడు.విజయ్ ఈ ఎన్నికల్లో స్టాలిన్ కి ఎదురైన పరిస్థితి ని వెక్కిరిస్తూ, ఆయన మ్యానరిజం ని సినిమాటిక్ స్టైల్ లో అనుకరించడం ఆయన అభిమానులకు విజువల్ ఫీస్ట్ లాగ అనిపించింది.గతం లో ఉదయ్ నిధి స్టాలిన్ అసెంబ్లీ లో సీఎం విజయ్ పై పాలు విమర్శలు చేశాడు. కానీ విజయ్ వైపు నుండి ఎలాంటి కౌంటర్ రాలేదు. సీఎం అయ్యాక విజయ్ ఇంత సైలెంట్ అయిపోయాడేంటి అని ఆయన అభిమానులు కూడా నిరాశ చెందారు. అలాంటి సమయం లో విజయ్ ఈ రేంజ్ కౌంటర్ ఇవ్వడం తో సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మీదట కూడా ఇదే రేంజ్ కౌంటర్లు విజయ్ నుండి రాబోతున్నాయి.
