Home వింతలు-విశేషాలు Older Women Relationships: అమ్మాయిలు కాదు.. యువకులతో కలిసి అంటీలు ఆ పని చేస్తున్నారు

Older Women Relationships: అమ్మాయిలు కాదు.. యువకులతో కలిసి అంటీలు ఆ పని చేస్తున్నారు

9
Older Women Relationships
Older Women Relationships

Older Women Relationships: నిజమే.. నేటి కాలం పూర్తిగా మారిపోయింది. మనుషుల మధ్య అనుబంధాలు పూర్తిగా వక్రమార్గం పడుతున్నాయి. వయసు తారతమ్యం లేదు. సమాజం ఏమనుకుంటుందని సోయి లేదు. పెళ్లయిన వాళ్లు అలానే.. పెళ్లి కాని వాళ్ళు అలానే.. మొత్తానికి వెస్ట్రన్ కంట్రీస్ లో ఉండే దిక్కుమాలిన కల్చర్ మొత్తం మన ఇండియాలోకి వచ్చి చేరుతుంది. అందువల్లే మనుషులు ఇలా మారిపోతున్నారు.

ఒకప్పుడు మనుషుల మధ్య ఇలా ఉండేది కాదు. తమకంటే వయసులో పెద్దవారైన మహిళలను చిన్న వయసులో ఉన్న యువకులు ఆ దృష్టితో చూసేవారు కాదు. పెద్ద వయసున్న మహిళలు.. తనకంటే చిన్నవాళ్ళైన యువకులను రెచ్చగొట్టేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా కామ వ్యవహారాలు సాగుతున్నాయి. మనుషులు జంతువుల కంటే హీనంగా మారిపోతున్నారు. సభ్య సమాజం ఏమనుకుంటుంది అనే సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా సంఘటనలు పెరిగిపోతున్నాయి.

ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని 30 సంవత్సరాల వివాహిత తన 19 సంవత్సరాల మేనల్లుడితో పారిపోయింది. అప్పటికి ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గడచిన నాలుగు నెలలుగా వారిద్దరి మధ్య ఈ సంబంధం సాగుతోంది. ఉత్తర ప్రదేశ్ లోని గోండా ప్రాంతానికి చెందిన 30 సంవత్సరాల వివాహిత.. తనకంటే 11 సంవత్సరాల చిన్నవాడు అయినా మేనల్లుడితో పారిపోయింది. ఆ మహిళ తన అల్లుడితో పారిపోయే ముందు ఇద్దరు పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయింది.

మరో ఘటనలో అలీగడ్ ప్రాంతానికి చెందిన ఓ 40 సంవత్సరాల మహిళ.. తమ ఇంటికి ఎదురుగా ఉండే 17 సంవత్సరాల బాలుడితో సంబంధం పెట్టుకుంది. సంబంధం కొనసాగిస్తుంది. అతడు నిరాకరించినప్పుడల్లా కేసు పెడతానని బెదిరించడం మొదలుపెట్టింది. ఇటీవల ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రీతి అనే మహిళ భాగోతం బయటపడింది.

ఇవి వెలుగులోకి వచ్చిన కేసులు మాత్రమే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రమని ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ తరహా కేసులు నమోదవుతున్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కేవలం ఉత్తర ప్రదేశ్ మాత్రమే కాదు.. దేశంలో చాలా ప్రాంతాలలో ఇతర సంఘటనలు చోటుచేసుకుంటుంది. ఆధునిక కాలంలో సామాజికపరంగా వచ్చిన మార్పులు.. కమ్యూనికేషన్ ప్రభావం.. కుటుంబంలో పరిస్థితులు వంటివి మహిళలను ఈ తరహా అడ్డదారులు తొక్కే విధంగా చేస్తున్నాయని సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు.. ఇటువంటి వారికి కౌన్సిలింగ్ ఇస్తే పరిస్థితి మెరుగుపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.