Homeక్రీడలుక్రికెట్‌Rashid Latif latest comments: క్రికెట్ ఆడటం రాదు.. ఈ పిల్లి శాపనార్థాలకు కొదవలేదు.. అందుకే...

Rashid Latif latest comments: క్రికెట్ ఆడటం రాదు.. ఈ పిల్లి శాపనార్థాలకు కొదవలేదు.. అందుకే మిమ్మల్ని పాకీలు అనేది..

Rashid Latif latest comments: క్రికెట్ ఆడలేరు. మైదానంలో గట్టిగా నిలబడలేరు.. పూర్తిస్థాయి ఓవర్లలో బ్యాటింగ్ చేయలేరు. కానీ వంట వండడానికి పనికి వస్తారు. మా వాళ్ల రక్తంలోనే వంట ఉంది. క్రికెట్ లేదు.. ఇటీవల పాకిస్తాన్ మహిళా క్రికెటర్ ను ఉద్దేశించి.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. వాటిని మర్చిపోకముందే.. మరొకడు తెరపైకి వచ్చాడు. వాడి పేరు లతీఫ్. గతంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఆడాడు. ప్రస్తుతం మహిళా టి20 వరల్డ్ కప్ […]

Rashid Latif latest comments: క్రికెట్ ఆడలేరు. మైదానంలో గట్టిగా నిలబడలేరు.. పూర్తిస్థాయి ఓవర్లలో బ్యాటింగ్ చేయలేరు. కానీ వంట వండడానికి పనికి వస్తారు. మా వాళ్ల రక్తంలోనే వంట ఉంది. క్రికెట్ లేదు.. ఇటీవల పాకిస్తాన్ మహిళా క్రికెటర్ ను ఉద్దేశించి.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు ఇవి.

వాటిని మర్చిపోకముందే.. మరొకడు తెరపైకి వచ్చాడు. వాడి పేరు లతీఫ్. గతంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఆడాడు. ప్రస్తుతం మహిళా టి20 వరల్డ్ కప్ జరుగుతుండడం.. అందులో ముందుగానే పాకిస్తాన్ జట్టు ఇంటికి వెళ్లడంతో లతీఫ్ తన అక్కసు మొత్తాన్ని బయట పెట్టుకున్నాడు. తమ జట్టు ఓడిపోయిన పర్వాలేదు గాని.. భారత్ గెలవకూడదు అన్నట్టుగా అతడు చేస్తున్న వ్యాఖ్యలు కంపరాన్ని కలిగిస్తున్నాయి.

“మహిళా టి20 వరల్డ్ కప్ లో మనం ఓడిపోయాం. మన ప్లేయర్లు దారుణంగా ఆడుతున్నారు. మన పరువు తీశారు. మన ఓడిపోయినా పర్వాలేదు.. మన శత్రువు భారత్ గెలవడానికి అవకాశం ఉండకూడదు. మన మాదిరిగానే గ్రూపు దశలోనే ఆ జట్టు ఇంటికి వెళ్లాలి. ఇందుకోసం మీరు ప్రార్థనలు చేయండి. అల్లాను ఆరాధించండి. టీమిండియా గ్రూప్ దశలోని ఇంటికి వెళ్లి పోవాలని కోరండి. అప్పటివరకు మీరు నిద్రపోకండి” అంటూ మహిళా క్రికెటర్లకు లతీఫ్ సూచన చేశాడు.

ప్రస్తుత ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు వరుసగా మూడు ఓటములు ఎదుర్కొంది. ఆస్ట్రేలియా మీద దారుణమైన ఓటమిని చవిచూసింది. జట్టులో సానుకూల దృక్పథాన్ని పెంపొందించాల్సిన లతీఫ్.. ఇలా టీమ్ ఇండియా మీద తన ఆక్రోశాన్ని ప్రదర్శించడాన్ని క్రికెట్ అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. మైదానంలో ఆట ద్వారా మాత్రమే సమాధానం చెప్పాలని.. అలా కాకుండా ఇలా పిల్లి శాపనార్ధాలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మైదానంలో క్రికెట్ ఆడలేక.. ఇలా నోటికి పని చెప్పడం ఏంటని.. క్రికెట్ అనేది అద్భుతమైన ఆట అని.. అందులో ప్రొఫెషనలిజం మాత్రమే చూపించాలని.. అడ్డగోలుగా వ్యవహరిస్తే పాకిస్తాన్ జట్టు ఇక జన్మలో కూడా గ్రూప్ దశను దాటి ముందుకు వెళ్లలేదని సూచిస్తున్నారు.

పాకిస్తాన్ క్రికెట్ మహిళల జట్టు ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో ఏమాత్రం గొప్ప ప్రదర్శన చేయలేదు. బౌలింగ్లో.. బ్యాటింగ్లో.. ఫీల్డింగ్లో.. ఇలా అన్ని విభాగాలలో పాకిస్తాన్ జట్టు అట్టర్ ఫ్లాఫ్ అయింది. కనీసం నిలబడి పరుగులు కూడా చేయలేక ఆ జట్టు బ్యాటర్లు చేతులెత్తేశారు. అందువల్లే పాకిస్తాన్ దారుణమైన ఓటములను మూటగట్టుకుంది. గ్రూపు దశ నుంచే ఇంటికి వెళ్లిపోయింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper