Homeఎంటర్టైన్మెంట్I Nobody Movie Review: 'I Nobody' మూవీ రివ్యూ : పృథ్వీరాజ్ యాక్షన్ థ్రిల్లర్...

I Nobody Movie Review: ‘I Nobody’ మూవీ రివ్యూ : పృథ్వీరాజ్ యాక్షన్ థ్రిల్లర్ ఇలా ఉంటుందని ఊహించలేదు!

I Nobody Movie Review: వరుస సూపర్ హిట్ సినిమాలతో మలయాళం లో దూసుకుపోతున్న ప్రముఖ నటుడు పృథ్వీరాజ్, లేటెస్ట్ గా నటించిన ‘I nobody’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ట్రైలర్ తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పాటు చేసిన ఈ చిత్రం, ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో, సినిమాలో ప్లస్సులు, మైనస్సులు ఏంటో ఒకసారి వివరంగా చూద్దాము. కథ : రాజీవ్ (పృథ్వి రాజ్ సుకుమారన్ […]

I Nobody Movie Review: వరుస సూపర్ హిట్ సినిమాలతో మలయాళం లో దూసుకుపోతున్న ప్రముఖ నటుడు పృథ్వీరాజ్, లేటెస్ట్ గా నటించిన ‘I nobody’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ట్రైలర్ తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పాటు చేసిన ఈ చిత్రం, ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో, సినిమాలో ప్లస్సులు, మైనస్సులు ఏంటో ఒకసారి వివరంగా చూద్దాము.

కథ :

రాజీవ్ (పృథ్వి రాజ్ సుకుమారన్ ) ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఇతనికి భార్య మీరా (పార్వతి) , ఇద్దరు పిల్లలు ఉంటారు. వీళ్లది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఒక బ్యాంక్ లో జరిగిన దోపిడీ వ్యవహారంలో తన ప్రమేయం లేకుండానే చిక్కుకుంటారు రాజీవ్. ఆ తర్వాత ఈ నేరం చేసిన వ్యక్తులు చనిపోతారు. కానీ ఈ వ్యవహారంలో దోషిగా రాజీవ్ నిలుస్తారు. పోలీసులు కూడా అతన్నే అనుమానిస్తూ ఉంటారు. అతని వద్దనే కోట్ల కొద్దీ దోపిడీ సొమ్ము ఉండనే ప్రచారం చాలా గట్టిగా జరుగుతూ ఉంటుంది. ఇక సోషల్ మీడియా లో జనాలు కూడా రాజీవ్ ని దోషిగా అనుకుంటూ ఉంటారు. మరి ఈ సమస్యల నుండి రాజీవ్ ఎలా భయటపడుతారు?, ఎలాంటి వ్యూహ రచన చేసి నిర్దోషి గా బయటకు వస్తారు అనేది చూడాలి.

విశ్లేషణ :

ఈ చిత్రాన్ని చూసినప్పుడు మనకి నెట్ ఫ్లిక్స్ లోని ‘మనీ హీస్ట్’ వెబ్ సిరీస్ గుర్తుకు వస్తుంది. డైరెక్టర్ ఆ సిరీస్ ఆధారంగానే ఈ చిత్రాన్ని తీసాడేమో అనిపించక తప్పదు. దోపిడీకి ముందు , ఆ తర్వాత జరిగే పరిణామాలు ఆద్యంతం ఉత్కంఠ కలిగించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు డైరెక్టర్. అయితే ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత దమ్ము , సెకండ్ స్క్రీన్ ప్లే లో కనిపించదు . కొన్ని సన్నివేశాలను బాగా ల్యాగ్ చేసినట్టు అనిపిస్తాది. చాలా సన్నివేశాలను నేపధ్య సంగీతం రక్షించింది అనే చెప్పాలి. ఇక హీరో పృథ్విరాజ్ సుకుమారన్ అయితే ఎప్పటి లాగానే ఈ సినిమాలో కూడా జీవించేసారు. ఆయన నటన చాలా సహజం గా అనిపించింది. ఫస్ట్ ఉన్న రేంజ్ లో సెకండ్ హాఫ్ ఉండుంటే ఈ సినిమా ఎక్కడో ఉండేది. ఆరంభం లో బ్యాంక్ దోపిడీ సన్నివేశంతోనే ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తాడు డైరెక్టర్.

అక్కడి నుండి కథ లో ఎలాంటి డీవియేషన్స్ ఉండవు , సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. కానీ హీరో ఎప్పుడైతే కిడ్నాప్ డ్రామా మొదలు పెడుతాడో అక్కడి నుండి చాలా ఆర్టిఫీషియల్ గా ఉంటుంది స్క్రీన్ ప్లే. ఈ సినిమాని చూస్తున్నంతసేపు మనకు తెలుగు సినిమాని చూస్తున్న ఫీలింగ్ రాదు , అది కూడా ఈ సినిమాకు పెద్ద మైనస్ అవ్వొచ్చు. కేరళ ప్రేక్షకులు ఇలాంటి సినిమాలను బాగా ఆదరిస్తుంటారు కాబట్టి , అక్కడ పెద్ద హిట్ అవ్వొచ్చు కానీ , తెలుగు లో మాత్రం కష్టమే.

చివరి మాట : సెకండ్ హాఫ్ ని కాస్త భరించగలము అనుకుంటే ఈ సినిమాని చూడొచ్చు. లేదంటే మీ సహనానికి కాస్త పరీక్ష :

రేటింగ్ : 2.25/5

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper