Homeఆంధ్రప్రదేశ్‌Chiranjeevi: చిరంజీవి - నాగార్జున ఆ మూవీని రీమేక్ చేసి ఉంటే బాగుండేదా...

Chiranjeevi: చిరంజీవి – నాగార్జున ఆ మూవీని రీమేక్ చేసి ఉంటే బాగుండేదా…

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి…ఆయన నుంచి వచ్చిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ప్రస్తుతం ఎనలేని సేవలను అందిస్తున్న నటులు కూడా వాళ్లే కావడం విశేషం…70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఆయన యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ ముందుకు సాగుతున్నాడు అంటే మామూలు విషయం కాదు. ఇక నాగార్జున లాంటి నటుడు సైతం అక్కినేని ఫ్యామిలీ బాధ్యతలను […]

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి…ఆయన నుంచి వచ్చిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ప్రస్తుతం ఎనలేని సేవలను అందిస్తున్న నటులు కూడా వాళ్లే కావడం విశేషం…70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఆయన యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ ముందుకు సాగుతున్నాడు అంటే మామూలు విషయం కాదు. ఇక నాగార్జున లాంటి నటుడు సైతం అక్కినేని ఫ్యామిలీ బాధ్యతలను నిలబెడుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ప్రస్తుతం నాగార్జున తన వందో సినిమాని చేస్తున్నాడు. ఇక చిరంజీవి – నాగార్జున కాంబినేషన్లో ఒక సినిమా వస్తే బాగుండేదని ఎప్పటినుంచో తమ అభిమానులైతే కోరుకుంటున్నారు కానీ అది ఇప్పటివరకు వర్కౌట్ కాలేదు… తమిళంలో వచ్చిన ‘విక్రమ్ వేద’ సినిమాని తెలుగులో వీళ్ళిద్దరితో రీమేక్ చేయాలని చాలామంది దర్శక నిర్మాతలు ప్రయత్నం చేసిన కూడా అది వర్కౌట్ కాలేదు.

కారణమేంటంటే ఆ సినిమాని తెలుగులో కూడా చాలామంది చూసేసారు. దానివల్ల వీళ్ళ ఇమేజ్ కి తగ్గట్టుగా కథను మార్పులు చేర్పులు చేసినా కూడా ఆ సినిమాకి అనుకున్న ఆదరణ దక్కకపోవచ్చనే ఉద్దేశ్యంతోనే వీళ్ళిద్దరు ఆ సినిమాకి నో చెప్పారు. ఇక ఏది ఏమైనా కూడా రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే చిరంజీవి చేసిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాలో వెంకటేష్ కీలకపాత్రలో నటించాడు. కాబట్టి ఇటు చిరంజీవి అభిమానులు, అటు వెంకటేష్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవి నాగార్జునతో కలిసి నటిస్తే కూడా అతని అభిమానులు పండుగ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి ఫ్యూచర్ లో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందా లేదా అనేది…ఒకవేళ ఈ కాంబో వర్కౌట్ అయితే మాత్రం ఇండియాలోనే ఈ మూవీ భారీ బజ్ క్రియేట్ చేసుకుంటుంది…ఇక ఇప్పుడు వీళ్లిద్దరు ఎవరి ప్రాజెక్ట్స్ లో వాళ్లు చాలా బిజిగా ఉన్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper