Homeఆంధ్రప్రదేశ్‌Mithun Chakraborty respects Chandrababu: చంద్రబాబు కాలికి నమస్కరించిన ఆ భారతీయ దిగ్గజ నటుడు!

Mithun Chakraborty respects Chandrababu: చంద్రబాబు కాలికి నమస్కరించిన ఆ భారతీయ దిగ్గజ నటుడు!

Mithun Chakraborty respects Chandrababu: పశ్చిమ బెంగాల్లో( West Bengal) కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బిజెపి తొలి ముఖ్యమంత్రిగా సువేందూ అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులతో పాటు బిజెపి పాలిత ముఖ్యమంత్రులు, ఎన్డీఏ పక్ష సీఎంలు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి. ఏపీ సీఎం చంద్రబాబు హాజరుకాగా ఆయనకు కేంద్ర పెద్దలనుంచి ఆత్మీయ గౌరవం అందింది. ప్రస్తుతం ఎన్డీఏలో టిడిపి కీలక […]

Mithun Chakraborty respects Chandrababu: పశ్చిమ బెంగాల్లో( West Bengal) కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బిజెపి తొలి ముఖ్యమంత్రిగా సువేందూ అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులతో పాటు బిజెపి పాలిత ముఖ్యమంత్రులు, ఎన్డీఏ పక్ష సీఎంలు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి. ఏపీ సీఎం చంద్రబాబు హాజరుకాగా ఆయనకు కేంద్ర పెద్దలనుంచి ఆత్మీయ గౌరవం అందింది. ప్రస్తుతం ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామి. అందుకే ప్రత్యేక ఆహ్వానం అందింది. కార్యక్రమానికి హాజరయ్యారు చంద్రబాబు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా పలకరించారు చంద్రబాబును. సహచర ముఖ్యమంత్రులు సైతం చంద్రబాబును పలకరించారు. ఆత్మీయ నమస్కారాలతో సాగింది కార్యక్రమం. చంద్రబాబు ఉల్లాసంగా కనిపించారు. అయితే ఉన్నట్టుండి ఓ వ్యక్తి వచ్చి చంద్రబాబుకు పాదాభివందనం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భారీ భద్రత నడుమ..
సాధారణంగా ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) పాల్గొన్న కార్యక్రమం.. అతిరథ మహారధులైన కేంద్రమంత్రులు.. దాదాపు 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కావడంతో.. ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టారు. భారీ నిఘా ఉంది. ఈ తరుణంలో ఓ వ్యక్తి తలపాగా ధరించి, కుర్తా జమాతో వచ్చారు. అందరికీ నమస్కరిస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు కాళ్లకు దండం పెట్టారు. చంద్రబాబు సైతం ఆయనను పైకి ఏపీ సముదాయించారు. ఆత్మీయంగా హత్తుకున్నారు. అయితే ఆయన ఎవరు అనే దానిపై క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా వైరల్ కాగా.. చంద్రబాబు కాలికి నమస్కరించిన వ్యక్తి మిధున్ చక్రవర్తిగా తేలింది.

ప్రస్తుతం బిజెపిలో..
ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్నారు మిథున్ చక్రవర్తి( Mithun Chakravarti ). బాలీవుడ్ లో మంచి నటుడిగా గుర్తింపు పొందారు. ఆయన స్వరాష్ట్రం పశ్చిమ బెంగాల్. అక్కడి బెంగాలీ చిత్రాల్లో రాణించి తర్వాత బాలీవుడ్ లో ప్రవేశించారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఎన్నెన్నో ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు. అయితే రాజకీయ ఎంట్రీ మాత్రం తృణముల్ కాంగ్రెస్ ద్వారా జరిగింది. 2014లో తృణమూల్ కాంగ్రెస్ ద్వారా రాజ్యసభకు ఎంపికయ్యారు మిధున్ చక్రవర్తి. అయితే 2016లో రాజ్యసభ పదవితో పాటు తృణమూల్ కాంగ్రెస్కు రాజీనామా చేశారు. 2021 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరారు. అలా చేరిన మిథున్ చక్రవర్తిని ఆ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. ఆ ఎన్నికల్లో బిజెపి గెలుపు కోసం కృషి చేశారు. ఎన్నికల ప్రచారంలో సైతం పాల్గొన్నారు. కానీ అప్పట్లో బీజేపీకి గెలుపు తట్టలేదు. ఈ ఎన్నికల్లో సైతం బిజెపికి మద్దతుగా ప్రచారం చేశారు. బిజెపి అధికారంలోకి రావడంతో సంతోషించారు. అందుకే సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు మిధున్ చక్రవర్తి. వేదికపై అంతమంది ఉండగా చంద్రబాబు కాలికి నమస్కరిస్తూ మిధున్ చక్రవర్తి ఆశీర్వాదం తీసుకోవడం అందర్నీ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక దిగ్గజ నటుడు టిడిపి అధినేత చంద్రబాబును ఇలా కాలికి నమస్కరించడం అనేది జాతీయస్థాయిలో కూడా హాట్ టాపిక్ అవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper