Home Blog Page 292

Bandi Sanjay Son Case: బండి సంజయ్ కొడుకు ఉదంతం.. రాజకీయ నాయకులకు ఓ గుణపాఠం

Bandi Sanjay Son Case:  ఎలా జరిగినా.. ఏం జరిగినా.. తప్పు తప్పే. దానిని సమర్థించకూడదు. ప్రోత్సహించకూడదు.. ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో ఎవరైనా సరే అనుచితంగా.. దారుణంగా ప్రవర్తిస్తే ఆ తదుపరి పరిణామాలు కూడా అదే స్థాయిలో ఉండాలి. ఎందుకంటే ఆడవాళ్ళ మీద మరోసారి అటువంటి దారుణాలకు పాల్పడాలంటేనే మగవాళ్ళల్లో వణుకు పుట్టాలి. మన చట్టాలు, మన వ్యవస్థలు గొప్పవే అయినప్పటికీ.. అందులో ఉన్న లోపాలు కొంతమంది వ్యక్తులకు అనుకూలంగా ఉంటున్నాయి. వాటిలో ఉన్న లోపాలను సాకులుగా చూపించుకొని ఆయా వ్యక్తులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలలో గత రెండు రోజులుగా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడి వ్యవహారం విపరీతంగా చర్చలో ఉంది. ఒక అమ్మాయిపై అతడు దారుణంగా ప్రవర్తించాడని.. పేట్ బషీర్ బాదులో పోలీస్ స్టేషన్లో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. ఈ కేసు నమోదైన కొద్ది రోజులకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించారు. ఆ వేదిక మీద బండి సంజయ్ ఆవేశంగా మాట్లాడారు. తాను తప్పు చేయనని.. తప్పు చేసే అవకాశం కల్పించ బోనని స్పష్టం చేశారు. తద్వారా తన కుమారుడి మీద వస్తున్న ఆరోపణలకు బండి సంజయ్ పరోక్షంగా సమాధానం చెప్పారు.

వాస్తవానికి తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకుల కుమారులు.. వారితో సంబంధం ఉన్న వ్యక్తులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఆ మధ్య భారత రాష్ట్ర సమితికి సంబంధించిన ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు అత్యంత వేగంగా కారు నడిపి.. ఓ బాలుడి మరణానికి కారణమయ్యాడు. కొంతమందిని తీవ్రంగా గాయపరిచాడు. ఆ సమయంలో అతడు మద్యం తాగి ఉన్నట్టు తెలుస్తోంది. పైగా ఈ కేసులో పోలీసులను బురిడీ కొట్టించడానికి ఆ మాజీ ఎమ్మెల్యే కుమారుడు ప్రయత్నించాడు. రోడ్డు ప్రమాదం జరగగానే అక్కడి నుంచి పారిపోయిన ఎమ్మెల్యే కుమారుడు.. తన స్థానంలో మరొక వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నట్టు నమ్మబలికాడు. చివరికి పోలీసులకు అన్ని ఆధారాలు దొరకడంతో అరెస్టు తప్పదని భావించిన అతడు దుబాయ్ పారిపోయాడు. తెలంగాణ పోలీసులు నోటీసుల మీద నోటీసులు జారీ చేయడంతో.. చివరికి అతడు దుబాయ్ నుంచి తెలంగాణకు వచ్చాడు. ఇటీవల కేసు విచారణ సందర్భంగా కోర్టుకు హాజరయ్యాడు.

భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భూపాలపల్లి జిల్లా అడవుల్లో అడవి జంతువుల వేట సాగింది. ఈ జంతువులను వేటాడింది నాటి గులాబీ పార్టీ లో ఓ కీలక నాయకుడి మనవడు. అయితే ఈ వ్యవహారాన్ని బయటపడకుండా చూశారు. చివరికి మీడియా ద్వారా బయటపడడంతో కేసును నీరుగార్చారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం పట్టణంలో అప్పటి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు ఓ కుటుంబాన్ని వేధించాడు. దీంతో ఆ కుటుంబంలో ఉన్న నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల పుత్ర రత్నాల ఆగడాలు చాలానే ఉన్నాయి.

బండి సంజయ్ కుమారుడి వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ కేసును విచారించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీనిపై స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి కీలక ప్రకటన చేశారు. చర్యలు తీసుకునే విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. రేవంత్ ప్రభుత్వం గనుక ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపి.. అసలైన వారిపై చర్యలు తీసుకుంటే.. జన్మలో ప్రజాప్రతినిధుల కొడుకులు.. వారితో సంబంధం ఉన్న వ్యక్తులు ఇటువంటి వ్యవహారాలకు పాల్పడరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Today 12 May 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి ఈరోజు లక్కీ డే..

Today 12 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఏ పని మొదలుపెట్టినా విజయమే వరిస్తుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈరోజు పూర్తిగా మారిపోతుంది. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. వ్యాపారులకు కొత్తగా లాభాలు వస్తాయి. కురుమ సభలతో సంతోషంగా ఉంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. సొంత వాహనాలపై ప్రయాణాలు చేయకుండా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు పెద్దలను సంప్రదించడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులు అదనపు ఆదాయం పొందడానికి మార్గం ఏర్పడుతుంది. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అనుకూలంగా మారుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులను నమ్మకూడదు. జీవిత భాగస్వామి కోసం షాపింగ్ చేస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు. ఇంట్లో జరిగే శుభకార్యం కోసం బిజీగా మారుతారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఎవరికైనా కొత్తగా వాహనాలు ఇవాల్చి వస్తే జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. అనుకోకుండా వ్యాపారులు లాభాలు పొందుతారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. కొన్ని పనులు క్లిష్టంగా ఉన్న వాటిని వెంటనే పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దీంతో ముఖ్యమైన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులు ప్రత్యర్థులపై కన్నేసి ఉంచాలి. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారి ఆదాయం ఈరోజు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు ప్రత్యర్థులతో ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి. ఉద్యోగులకు అధికారుల సపోర్టు ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి బంధువుల నుంచి శుభవార్తలో అందుతాయి. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. గతంలో అనుకున్న ఒక కోరికను ఈరోజు నెరవేర్చుకుంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో పనులు పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు పెద్దల సలహా తీసుకోవాలి. ఎవరికి అనవసరంగా డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయవద్దు. ఇవి తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. కోపంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఈరోజు సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం ప్రత్యేకంగా వస్తువులు కొనుగోలు చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి వ్యాపారాలు ఎప్పుడు లాభాలు పొందుతారు. చెప్పిన మాటలు వినకుండా సొంతంగా ఆలోచించాలి. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. అనుకోకుండా స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. డబ్బులు వ్యవహారంలో జీవిత భాగస్వామి సలహా తీసుకుంటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడిల నుంచి ఇప్పుడు అనేక ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేయకూరుతుంది. కొందరికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడులపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రోజు వారిని ఈరోజు అన్ని శుభ ఫలితాలే పొందుతారు. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కీలకమైన పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో డబ్బు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. అధికారుల నుంచి మద్దతు ఉండడంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.

Vishwambhara movie : రెండు భాగాలుగా విడుదల కానున్న మెగాస్టార్ ‘విశ్వంభర’.. స్పందించిన డైరెక్టర్..

Vishwambhara movie : మెగాస్టార్ చిరంజీవి లాంగ్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’ కోసం మెగా అభిమానులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఎప్పుడో 2023 వ సంవత్సరం లోనే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని , గ్రాఫిక్స్ క్వాలిటీ ఔట్పుట్ కోసం ఇన్ని రోజులు విడుదల చేయకుండా, అనుకున్న ఔట్పుట్ వచ్చే వరకు ఎదురు చూశారు . ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన పనులు మొత్తం పూర్తి అయ్యాయి. ప్రస్తుతం రీ రికార్డింగ్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. సాధ్యమైనంత వరకు ఈ చిత్రాన్ని జులై నెలలో విడుదల చెయ్యాలని చూస్తున్నారు మేకర్స్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా బయటకు రానున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త నిన్నటి నుండి సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతోంది.

అదేమిటంటే ఈ చిత్రాన్ని కేవలం ఒక భాగంగా మాత్రమే విడుదల చేసేలా కాకుండా, రెండు భాగాలుగా విడుదల చెయ్యాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు వార్తలు వినిపించాయి. సినిమా ఫైనల్ ఔట్పుట్ నాలుగు గంటలకు పైగానే వచ్చిందని , కొన్ని మార్పులు చేర్పులు చేసి రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని డైరెక్టర్ వశిష్ఠ అనుకుంటున్నాడని , సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగింది. దీనిని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మూర్తి ట్విట్టర్ లో తెలియజేయగా, డైరెక్టర్ బాబీ వెంటనే రెస్పాన్స్ ఇచ్చారు. సెటైరికల్ టోన్ లో మాట్లాడుతూ ‘అవునా.. నిజమా’ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా అందరికీ ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అవ్వబోవడం లేదు, కేవలం ఒక్క భాగంగా మాత్రమే విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల అవ్వబోతుంది అనే రూమర్ కి చెక్ పడింది.

ఇకపోతే ఈ సినిమా ఫైనల్ ఔట్పుట్ పై మెగాస్టార్ చిరంజీవి చాలా సంతృప్తిగా ఉన్నాడట. ముఖ్యంగా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని , అభిమానులను ఇంతకాలం ఎదురు చూసేలా చేసినప్పటికీ, మంచి ఔట్పుట్ ని వాళ్లకు అందించబోతున్నామని , ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా సంచలనాలను సృష్టిస్తుందని బలమైన నమ్మకం తో చెప్పాడట. మరి ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా త్రిష నటించగా, ఆశికా రంగనాథ్ కీలక పాత్ర పోషించింది. అదే విధంగా ఇషా చావ్లా , సురభి వంటి యంగ్ హీరోయిన్స్ చిరంజీవి కి చెల్లెళ్లుగా నటించారు.

SBI ATM salon : దూరం నుంచి చూస్తే ఏటీఎం.. లోపలికి వెళ్లి చూస్తే క్షవరం అయినట్టే..

SBI ATM salon : ఈ రోజుల్లో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేవారు చాలామంది. అయితే ఆ కాయలు అమ్మడంలో కూడా కొంతమంది టెక్నిక్ పాటిస్తుంటారు. తద్వారా వినూత్నమైన మార్కెట్ సంపాదించుకొని భారీగా ఆర్జిస్తూ ఉంటారు. అటువంటి వారిలో ఇతడు పిహెచ్డి చేశాడు అనుకుంటా. చదివింది తక్కువనే. తెలివితేటలు మాత్రం పీహెచ్డీ లెవెల్. అందుకే ఈ రేంజ్ లో షాప్ పెట్టాడు. ఒక రేంజ్ లో సంపాదిస్తున్నాడు.

అతడి పేరు రాహుల్ (కొన్ని పరిమితుల దృష్ట్యా పేరు మార్చాల్సి వచ్చింది) అతడు వృత్తిరీత్యా బార్బర్. చదువుకున్నది కొంత వరకే అయినప్పటికీ.. క్షవరం మాత్రం బాగా చేస్తాడు. డిఫరెంట్ స్టైల్ లో మగవాళ్లకు కటింగ్ చేస్తూ తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇతడి సొంత రాష్ట్రం బీహార్. ఆ ప్రాంతంలోని దానాపూర్ ఏరియాలో నివాసం ఉంటాడు. ప్రపంచంలో ఏ సెలూన్ షాప్ కైనా సరే ఒక పేరు ఉంటుంది. కానీ ఇతడి షాప్ కు ఎటువంటి పేరు ఉండదు. పేరు లేకుండానే ఇతడు ఇంతగా సంపాదిస్తున్నాడా.. అనే డౌట్ మీకు రావచ్చు. బ్రాండ్ గట్టిగా ఉంటే పేరుతో సంబంధం లేదు. ఆయన పేరే ఒక బ్రాండ్ అన్నట్టుగా రాహుల్ తనకంటూ ఒక మార్కెట్ సృష్టించుకున్నాడు.

దానాపూర్ ఏరియాలో రాహుల్ షాప్ కు ఎటువంటి పేరు ఉండదు. అతడి సెలూన్ షాప్ పేరు చెప్పాలంటే ఎవరైనా ఎస్బిఐ ఎటిఎం అంటే చాలు. అదేంటి ఎటిఎం సెంటర్లో కటింగ్ చేయడం ఏంటి అనే అనుమానం మీలో కలిగింది కదా.. అయితే రాహుల్ ఏర్పాటు చేసిన షాప్ మెయిన్ సెంటర్లో ఉంటుంది. గతంలో ఆ భవనంలో ఎస్బిఐ ఏటీఎం కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మూసివేసింది. ఏటీఎం సెంటర్ మూసివేసినప్పటికీ దాని నేమ్ బోర్డు తొలగించలేదు. అది అప్పటినుంచి అలానే ఉంది. ఆహులు కూడా ఆ నేమ్ బోర్డు అలానే కొనసాగిస్తున్నాడు. దానివల్ల తనకు విపరీతమైన గిరాకీ వస్తుందని అతను చెబుతున్నాడు. ఏటీఎం సెంటర్ అనుకుని చాలామంది డబ్బులు డ్రా చేయడానికి వస్తున్నారని.. వారంతా లోపలికి రాగానే షాక్ అవుతున్నారని రాహుల్ అంటున్నాడు.

డబుల్ డ్రా చేయడానికి వచ్చిన వారిలో చాలామంది కటింగ్ చేయించుకుని వెళ్తున్నారని అతడు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.. పైగా రాహుల్ కు మంచి పేరు ఉండడంతో గిరాకీ కూడా బ్రహ్మాండంగా సాగుతోంది. ఈ నేమ్ బోర్డును ఎస్బిఐ అధికారులు తొలగించకుండా అలానే ఉంచాలని అతడు కోరుతున్నాడు. ఎంతైనా గొప్ప ఆలోచన కదా.. దూరం నుంచి చూస్తే ఇది ఎస్బిఐ ఎటిఎం సెంటర్.. లోపలికి వెళ్తే కచ్చితంగా క్షవరం చేస్తాడు. ఎంతైనా రాహుల్ ఐడియానే ఐడియా.

Suriya Veerabhadrudu review : సూర్య ‘వీరభధ్రుడు’ మూవీ మొట్టమొదటి రివ్యూ.. కనీసం ఈసారైనా హిట్ కొడతాడా..

Suriya Veerabhadrudu review : సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత సౌత్ లో మంచి మార్కెట్ ఉన్నటువంటి హీరో సూర్య. ఇప్పుడైతే విజయ్ సౌత్ లో రజినీకాంత్ రేంజ్ కి వచ్చేశాడు కానీ , 2020 కి ముందు సౌత్ లో సూర్య కి ఉన్నంత మార్కెట్ విజయ్ , అజిత్ వంటి వారికి ఉండేది కాదు. 2015 లోనే తెలుగు రాష్ట్రాల నుండి 50 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టిన సత్తా ఉన్న హీరో సూర్య. కానీ ఈమధ్య కాలం లో ఆయనకు ఒక్కటంటే ఒక్క సూపర్ హిట్ కూడా రావడం లేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన కంగువ దారుణ పరాజయం గా నిలిస్తే, కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అనే హ్మణాల నడుమ విడుదలైన ‘రెట్రో ‘ ఇంకా పెద్ద ఫ్లాప్ గా నిల్చింది. తమిళనాడు లో నిన్నగాక మొన్న ఇండస్ట్రీ లోకి వచ్చినటువంటి ప్రదీప్ రంగనాథన్ వంటి వారు కూడా సూర్య ని దాటేశారు.

ఇది ఆయన అభిమానులకు ఘోర అవమానం అనే చెప్పాలి. అయితే ఇప్పుడు సూర్య ఈ నెల 14 న ‘కరుప్పు’ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రేడియో బాలాజీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం లో త్రిష హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఈ సినిమా ‘వీరభధ్రుడు’ అనే టైటిల్ తో విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాపై అటు తమిళం లో కానీ , ఇటు తెలుగు లో కానీ ఎలాంటి అంచనాలు లేవు. రీసెంట్ గానే తమిళనాడు లో అడ్వాన్స్ బుకింగ్స్ ని ప్రారంభించారు , చాలా బలహీనంగా ఉన్నాయి. సూర్య సినిమాకు ఇంత వీక్ అడ్వాన్స్ బుకింగ్స్ ఈమధ్య కాలం lo ఏ సినిమాకు జరగలేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అది కాసేపు పక్కన పెడితే నిన్న చెన్నై లో ee చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో ని ప్రదర్శించారు.

ఈ షోకి పలువురు సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా, మీడియా రిపోర్టర్స్ కూడా వచ్చారు. వాళ్ళ నుండి ఈ సినిమాకు వచ్చిన టాక్ ఏమిటంటే, ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఇంటెన్స్ డ్రామా తో ఈమధ్య కాలంలో సూర్య కెరీర్ లోనే ది బెస్ట్ అనిపించేలా ఉందని , సెకండ్ హాఫ్ లో కాస్త ఎమోషనల్ డ్రామా ఉన్నప్పటికీ, బాగా ల్యాగ్ చేశారని క్లైమాక్స్ మాత్రం సూపర్ గా ఉందని టాక్ వినిపిస్తోంది. మరి ఆడియన్స్ కి ఇది నచ్చుతుందో లేదో చూడాలి. ఇకపోతే కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. ఇది ఎలా ఉందో చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.

Krunal Pandya : కృణాల్ పాండ్యా.. గాయపడిన సింహం.. అతని గర్జన భయంకరం

Krunal Pandya :  మామూలుగా అయితే బెంగళూరు బ్యాటింగ్ భారాన్ని మొత్తం విరాట్ కోహ్లీ మోస్తాడు. లేదా బెతెల్, పాటిదర్.. ఇంకా కొంతమంది ఆటగాళ్లు బెంగళూరు జట్టుకు బలంగా ఉంటారు. అయితే తొలిసారి వీరంతా కూడా విఫలమయ్యారు. తక్కువ స్కోరు చేదించే క్రమంలో పెవిలియన్ క్యు కట్టారు. వరుసగా విరాట్ కోహ్లీ 0 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.

ఒక రకంగా బెంగళూరు జట్టుకు ఇది బీకరమైన షాక్. ప్లే ఆఫ్ దశ సమయంలో బెంగళూరు ఇలా ఆడటం అభిమానులకు ఏమాత్రం కృషించలేదు. ఈ క్రమంలోనే వచ్చాడు పాండ్యా. గర్జించిన సింహం మాదిరిగా బ్యాటింగ్ చేశాడు. ముంబై బౌలర్లకు తన బ్యాట్ పరాక్రమాన్ని చూపించాడు. వీరోచితమైన బ్యాటింగ్ చేసిన అతడు బెంగళూరు జట్టుకు విజయాన్ని ఖాయం చేసి వెళ్లిపోయాడు. కాళ్ల నొప్పి ఇబ్బంది పెడుతున్నప్పటికీ.. ఇంకా రకరకాల సమస్యలు అతడిని వేధిస్తున్నప్పటికీ గట్టిగా నిలబడ్డాడు. 73 పరుగులు చేసిన పాండ్యా బెంగళూరు విజయానికి మూల స్తంభం మాదిరిగా నిలిచాడు. ఈ క్రమంలో పాండ్యా మెన్ అఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు బెంగళూరు అభిమానుల ప్రశంసలతో తడిసి ముద్దవుతున్నాడు.

ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో పాండ్యా విజయం సాధించిన తర్వాత.. తనకు తగిలిన గాయాన్ని పాండ్యా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.. “కొన్ని దెబ్బలు మన పోరాటానికి నిలువెత్తు ప్రతీక మాదిరిగా కనిపిస్తుంటాయి. అవి మనల్ని కొత్తగా చూపిస్తుంటాయని” పాండ్యా రాస్కొచ్చాడు. పాండ్యా పోస్ట్ చేసిన స్వల్ప కాలంలోనే ఇది చర్చకు దారి తీసింది. మరోవైపు గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే ప్రమాదకరమని పాండ్యాను ఉద్దేశించి అభిమానులు పేర్కొంటున్నారు. నీ పోరాట పటిమ గొప్పగా ఉందని బెంగళూరు అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.

ప్రస్తుత ఐపీఎల్ లో పాండ్యా బెంగళూరు జట్టుకు అత్యంత కీలకమైన ఆటగాడిగా మారాడు. ఇతడు బౌలింగ్ తో పాటు బ్యాటింగ్లో కూడా అదరగొడుతున్నాడు. కీలకమైన బెంగళూరు బ్యాటర్లు అనుకోని పరిస్థితుల్లో అవుట్ అయినప్పుడు.. ఇతడు నిలబడుతున్నాడు. జట్టు భారాన్ని మొత్తం మోస్తున్నాడు. ఆ సమయంలో ప్రొఫెషనల్ బ్యాటర్ కంటే ఎక్కువగా బ్యాటింగ్ చేస్తూ సత్తా చూపిస్తున్నాడు. సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ సంఖ్యను మరింత పెంచుకుంటున్నాడు పాండ్యా.

Mad For Each Other show : ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ షో టైటిల్ గెలుచుకున్న జంట అదే.. ఇది చాలా అన్యాయం..

Mad For Each Other show : రీసెంట్ గానే స్టార్ మా ఛానల్ లో మొదలైన ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్ ‘ షో మరో రెండు వారాల్లో ముగియబోతుంది. బిగ్ బాస్ కాకుండా, మరో రియాలిటీ షో అంటే ఆడియన్స్ మొదట్లో బాగా ఆసక్తి చూపించారు , కాన్సెప్ట్ బాగుంది, కంటెస్టెంట్స్ కూడా మంచి ఇస్తున్నారు, కానీ షో మాత్రం పూర్తిగా జనల ఇష్టానికి వ్యతిరేకంగా సాగుతోంది. మ్యాన్షన్ లోపల కష్టపడే కంటెస్టెంట్స్ కి విలువ లేదు, కేవలం కొందరి మీద మాత్రమే పక్షపాతం చూపిస్తూ మిగతా వాళ్లకు అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఈ షో మొదలైనప్పటి నుండి , ఇప్పటి వరకు ఈయన నిర్వాహకులపై , కంటెస్టెంట్స్ పై నోర్లు జారుతూనే ఉన్నాడు. ఎన్ని సార్లు ఆయన్ని జడ్జీలు వారించినా వినడంలేదు, ఆయన తీరులో ఎలాంటి మార్పు లేదు.

అయితే జడ్జీలు ఆయన డేంజర్ జోన్ లోకి వచ్చినప్పుడల్లా ‘నో ఎలిమినేషన్’ పెట్టి సేఫ్ చేయడం , ఇతర కంటెస్టెంట్స్ కి అన్యాయం చేయడం ఆడియన్స్ కి ఏ మాత్రం నచ్చడం లేదు. గతం లో కూడా ఇలాగే చేశారు. డేంజర్ జోన్ లోకి వచ్చిన నటరాజ్ మాస్టర్ – నీతూ , అంజలి – పవన్ లకు ఒక గేమ్ పెట్టారు. ఆ గేమ్ లో నటరాజ్ మాస్టర్ ఓడిపోతాడు. న్యాయంగా అయితే నటరాజ్ మాస్టర్ ని ఆరోజు ఎలిమినేట్ చెయ్యాలి, కానీ ఆరోజు ఎలిమినేషన్ ని రద్దు చేశారు , పక్క వారం మంచి టాప్ జోడిగా పేరు తెచ్చుకున్న సంధ్య – బ్రిట్టూ జంటని ఎలిమినేట్ చేశారు. వీళ్ళు ఎలిమినేట్ అయ్యినప్పుడు హౌస్ లో ఉన్నవాళ్ళంతా ఎంత బాధపడ్డారో , ఆడియన్స్ కూడా అంతే బాధ పడ్డారు. ఎలిమినేట్ అవ్వాల్సిన నటరాజ్ మాస్టర్ కి తనని తానూ నిరూపించుకోవడానికి అద్భుతమైన అవకాశం వచ్చింది.

కానీ ఇప్పటి వరకు ఆయన గోల్డెన్ కపుల్ అవ్వలేకపోయాడు. వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా ఒకసారి ఎలిమినేట్ అయ్యి మళ్లీ మ్యాన్షన్ లోకి అడుగుపెట్టిన మహేష్ – సాండ్రా జంట కూడా తమని తాము రీ ఎంట్రీ లో నిరూపించుకున్నారు. మొదటి రోజు నుండే అద్బుతంగా గేమ్స్ ఆడుతూ , నేడు మొదటి ఫైనలిస్ట్ గా ఈ జంట నిలబడడమే కాకుండా, చివరి గోల్డెన్ కపుల్ గా అరుదైన అవకాశాన్ని సంపాదించుకున్నారు. కానీ నటరాజ్ – నీతూ జంట మాత్రం నిరూపించుకోలేదు. ఈ వారం ఎలిమినేషన్ ని రద్దు చేసి , వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. అంటే వచ్చే వారం సిద్దు – సోనియా, అభిమానిక – ఆమీర్ జంటలు ఎలిమినేట్ అవ్వబోతున్నాయి అన్నమాట. ఇలా నటరాజ్ మాస్టర్ కి అనుకూలంగా గేమ్ మార్చి , చివరికి టైటిల్ కూడా ఈ జంటకు ఇచ్చే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారేమో అని అంటున్నారు నెటిజెన్స్.

Indian cricket team ranking news: ఐసీసీ వన్డే, టీ 20 ర్యాంకింగ్స్.. టీమ్ ఇండియా అభిమానులు ఎగిరి గంతేసే వార్త ఇదీ

Indian cricket team ranking news: క్రికెట్ లో ఒకప్పుడు ఆస్ట్రేలియాది స్పష్టమైన ఆధిపత్యం కొనసాగేది. ఇప్పుడు ఆ స్థానాన్ని టీమిండియా ఆక్రమించింది. కొంతకాలంగా వైట్ బాల్ ఫార్మాట్ లో తిరుగులేని స్థాయిలో ఆడుతోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టీమిండియా స్పష్టమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి వన్డే ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఇందులో భారత జట్టు ఏకంగా 118 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో కొనసాగుతోంది. 113 పాయింట్లతో న్యూజిలాండ్ రెండవ స్థానంలో ఉంది. 109 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. గత ఏడాది మే నెల నుంచి ఆడిన మ్యాచ్ లకు పూర్తి వెయిటేజ్ ఇచ్చింది. అంతకుముందు రెండు సంవత్సరాల ఫలితాలకు సగం వెయిటేజ్ (50%) ఆధారంగా ర్యాంకింగ్ కల్పించింది. రోహిత్ నాయకత్వంలో టీం ఇండియా 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ పై విజయం సాధించింది టీమ్ ఇండియా.

టీ20 లలో కూడా టీం ఇండియా అదరగొడుతుంది.. ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ లో అద్భుతమైన విజయాన్ని అందుతుంది. ఏకంగా ట్రోఫీ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు మీద సూపర్ విజయం అందుకుని.. ట్రోఫీని దక్కించుకుంది. 2024లో రోహిత్ నాయకత్వంలో టీమిండియా పొట్టి ప్రపంచ కప్ సొంతం చేసుకుంది. 2026లో సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా టి20 వరల్డ్ కప్ సొంతం చేసుకుంది. మొత్తంగా టీమ్ ఇండియా మూడుసార్లు టి20 వరల్డ్ కప్ లను సాధించింది. ఈ ఫార్మేట్లో మూడుసార్లు వరల్డ్ కప్ లు అందుకున్న జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది.

టెస్ట్ ఫార్మేట్ లో టీమిండియా మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇది టీమిండి అభిమానులను తీవ్రంగా కలవరపరుస్తోంది. ఈ ఫార్మేట్ లో కూడా టీమిండియా సత్తా చూపిస్తే.. ఇక తిరుగు ఉండదు. నెంబర్ వన్ స్థానాన్ని అందుకుంటే.. అభిమానుల ఆనందానికి అవధి ఉండదు.. త్వరలోనే టీమ్ ఇండియా టెస్ట్ ఫార్మేట్ లో నెంబర్ వన్ స్థానాన్ని అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Munir lobbying with America: దిగజారిన మునీర్‌.. బయటపడిన అమెరికాతో లాబీయింగ్!

Munir lobbying with America: గతేడాది పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. పాకిస్తాన్‌ ప్రతిదాడులను తిప్పికొట్టింది. అయితే మన దాడికి వణికిపోయిన పాకిస్తాన్‌ అమెరికాతో చేసిన లాబీయింగ్‌ ఇప్పుడు బయటపడింది. ఇది పాకిస్తాన్‌ బలహీనతకు ప్రత్యక్ష సాక్ష్యం.

పకడ్బందీ లాబీయింగ్‌..
అమెరికా చొరవతోనే ఆపరేషన్‌ సిందూర్‌ ఆగిపోయిందని, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని పాకిస్తాన్‌ ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిమ్‌ మునీర్‌ తాజాగా ప్రకటించారు. ప్రాంతీయ శాంతి కోసమే పాకిస్తాన్‌ ఇందుకు అంగీకరించిందని వెల్లడించాడు. కానీ యూఎస్‌ ఫారిన్‌ ఏజెంట్స్‌ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ ఫెరా(FARA) పత్రాలు ఈ ప్రకటనను డొల్లుగా మార్చాయి. నిజం ఏమిటంటే.. పాకిస్తాన్‌ అమెరికా సాయం కోసం 60 సార్లకుపైగా లాబీయింగ్‌ చేసింది. ఇది దౌత్య విజయం కాదు, దౌత్య బలహీనతకు నిదర్శనం.

30 సార్లు సంప్రదింపులు..
మే 6 అర్ధరాత్రి భారత్‌ సైనిక దాడులతో షాక్‌ అయిన పాకిస్తాన్‌ అమెరికాతో సుమారు 30 సార్లు వేర్వేరుగా సంప్రదింపులు చేపట్టింది. పాక్‌ అంబాసిడర్‌ అమెరికా నేతలతో సమావేశాల కోసం ప్రయత్నాలు చేసింది. మే 7–8న ఉద్రిక్తతలపై చర్చించేందుకు లాబీయింగ్‌ చేసింది. మే 9న లాబీయింగ్‌ను మరింత పెంచి, రక్షణ, జాతీయ భద్రత వ్యక్తులతో 20–25సార్లు సంప్రదించింది. అమెరికా మీడియా జర్నలిస్టులతో భేటీలు జరిపింది.

సైనిక దెబ్బకు బలహీనపడిన పాక్‌
భారత్‌ సైనిక చర్యలకు పాక్‌ ఎంతగా భయపడిందో లాబీయింగ్‌ పరిమితి నుంచి స్పష్టమవుతోంది. మొత్తం 50సార్లకుపైగా అమెరికాను సంప్రదించడం, 60 మంది అధికారులను సంచరించడం నిదర్శం.

దౌత్య వ్యూహాల్లో తేడా..
వాషింగ్‌టన్‌లో భారత్, పాక్‌ కార్యకలాపాలకు పూర్తి వ్యత్యాసం కనిపించింది. ఉగ్రవాదాన్ని ఖండించడం, పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా దౌత్యపరమైన మద్దతు కూడగట్టడం. మూడో పక్షం జోక్యాన్ని వ్యతిరేకిస్తూ భారత్‌ తొలి నుంచే వస్తోంది. పాకిస్తాన్‌ మాత్రం అమెరికా మద్దతు కోరడం, మధ్యవర్తిత్వం కోరడం, కశ్మీర్‌ను అంతర్జాతీయత చేయడం. ఇదే రెండు దేశాల మధ్య తేడా.

బలహీనతకు లొంగిపోవడం
పాక్‌ ప్రకటనలు ‘ప్రాంతీయ శాంతి కోసం‘ అని చెప్తున్నాయి. కానీ నిజం మరొకటి: ఆపరేషన్‌ సిందూర్‌ దెబ్బకు కంగుతిన్న పాక్‌ చివరకు కాళ్లబేరానికి వచ్చింది. ఈ పరిస్థితిలోనే భారత్‌ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించింది. ఇది భారత్‌ బలహీనత కాదు. ఇది భారత్‌ దౌత్య విజయం.

కచ్చితమైన దాడులు..
ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌ సైనిక సమర్థతను చాటింది: ఇచ్చిన పనిని పర్ఫెక్ట్‌గా పూర్తి చేశాం. పీవోకేసహా పాకిస్తాన్‌ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రకేంద్రాలను కకావికలం చేసి పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం చెప్పింది.

ఆసిమ్‌ మునీర్‌ ప్రకటనలు డొల్లు అని తేలిపోయాయి. పాక్‌ ఎంతగా దిగజారిపోయిందనే విషయం వెలుగు చూసింది. 60సార్లకుపైగా లాబీయింగ్‌ చేయడం బలహీనతకు లక్షణం. ఆపరేషన్‌ సిందూర్‌ కేవలం సైనిక విజయం కాదు, దౌత్య విజయం కూడా.. భారత్‌ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. పాకిస్తాన్‌ మెడలు వంచింది.

Lady Boss Harassment Case: జూనియర్ ఉద్యోగికి వ*యా*గ్రా బిల్లలు ఇచ్చింది.. ఈ లేడీ బాస్ టార్చర్ ఎంత దారుణం అంటే..

Lady Boss Harassment Case: మామూలుగా అయితే దీనిని వార్త లాగా రాయకూడదు. కాకపోతే ఇటువంటి దారుణాలు సభ్య సమాజానికి తెలియాలి. ఎందుకంటే మిగతా వాళ్ళు అప్రమత్తమవుతారు. తమకు ఇటువంటి అనుభవాలు ఎదురుగా కాకుండా జాగ్రత్తపడతారు. ఈ స్టోరీ గురించి తెలుసుకున్న తర్వాత.. ఆమె దారుణాలు వెలుగులోకి వచ్చిన తర్వాత.. బాధ కలిగింది. ఇబ్బంది కలిగింది. అన్నింటికీ మంచి పురుషులకు ఈ సమాజంలో రక్షణ లేకుండా పోతుందని అర్థమైంది.

చాలా సందర్భాల్లో లైంగిక వ్యవహారాలలో ఆడవాళ్లే బాధిత పక్షంగా ఉంటారు. మగవాళ్ళను ఈ మీడియా దోషులుగా చూస్తూ ఉంటుంది. మగవాళ్ళు అనేవారు మనుషులు కాదని.. ఆడవాళ్లను చూస్తే రెచ్చిపోతారని.. ఎంతటి దారుణానికైనా తెగిస్తారని మీడియా రాస్తూ ఉంటుంది. కొన్ని ఈ సందర్భాలలో ఇది నిజమైనప్పటికీ.. అన్ని సమయాలలో ఇది నిజం కాదు. ఎందుకంటే పురుషులు కూడా బాధిత పక్షంగా ఉంటారు.. వారు కూడా ఇబ్బంది పడతారు. కొన్ని సందర్భాలలో బలవన్మరణానికి పాల్పడుతుంటారు.

అది అమెరికా.. అక్కడ జేపీ మోర్గాన్ అనే కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఓ మహిళ పనిచేస్తూ ఉంటుంది. ఈమె వయసు దాదాపు 40 సంవత్సరాల దాకా ఉంటుంది. ఈమె తన కింద పనిచేసే జూనియర్ ఉద్యోగి మీద లైంగిక దాడికి పాల్పడింది. అతడిని ఆ బానిస చేసుకుంది. ప్రతిరోజు అతడితో మాట్లాడటం.. రెచ్చగొట్టే విధంగా దుస్తులు వేసుకోవడం.. ఆఫీస్ పనిమీద తనను ఇంటికి పిలిపించుకోవడం.. కాఫీ లేదా ఇతర పదార్థాలు సర్వ్ చేయడం.. అందులో వ*యా*గ్రా కలిపి ఇచ్చేది. అతడితో నిత్యం అదే పనిలో మునిగి తేలుతూ ఉండేది.. అతనితో బలవంతంగా ఆ పనిలో పాల్గొనేది. ఆ తర్వాత వాటిని వీడియోలు రహస్యంగా తీసేది.

ఈ క్రమంలో ఆ జూనియర్ ఉద్యోగి తనపై ఈ స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మీద ఆరోపణలు చేశాడు. తనను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నది మొత్తం బయటపెట్టేశాడు. ఈ వ్యవహారం అమెరికా వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికే కేసు నమోదయింది. ఈ కేసు కు సంబంధించి విచారణ వేగవంతంగా కొనసాగుతోంది.. అయితే ఆ జూనియర్ ఉద్యోగం మీద జేపీ మోర్గాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దారుణానికి పాల్పడింది నిజమేనని తేలింది. ఈ వ్యవహారంపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు.. ఆమెకు ఎటువంటి శిక్ష విధిస్తారు.. అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.

Singer comments on Trisha: త్రిష అసలు మనిషి కాదంటూ ప్రముఖ సింగర్ హాట్ కామెంట్స్..

Singer comments on Trisha: తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న త్రిష గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం సౌత్ నుండి నార్త్ వరకు మారుమోగిపోతున్న పేరు ఇది. అందుకు కారణం ఏంటో కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. గత కొంతకాలం నుండి ఈమె తమిళ హీరో విజయ్ తో సహజీవనం చేస్తోంది. ఇప్పుడు ఆయన ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం లో త్రిష పాల్గొనగా , అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే ‘సూచీ లీక్స్’ అంటూ అప్పట్లో ప్రముఖ సింగర్ సుచిత్ర సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో అందరికీ తెలిసిందే.

సినీ సెలబ్రిటీలకు సంబంధించిన అక్రమ సంబంధాలు , ఫోటోలు , వీడియోలు వంటివి అప్పట్లో ఈమె విడుదల చేసింది. దానిని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. అయితే సుచిత్ర ఇప్పుడు విజయ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా త్రిష గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘త్రిష అంటే నాకు మొదటి నుండి అసలు ఇష్టం ఉండదు. కానీ తలపతి విజయ్ అంటే చాలా ఇష్టం. ఆయన తన భార్య కి దూరమయ్యాడు , తల్లిదండ్రులకు , పిల్లలకు కూడా దూరం అయ్యాడు. ఇలా అందరికీ దూరమైన సమయాన్ని చూసుకొని కొన్ని పరాన్నజీవులు లాంటి వ్యక్తులు ఆయన జీవితం లోకి అడుగుపెడుతున్నారు. ఆయన ఒంటరి తనాన్ని , మంచితనాన్ని వాడుకొని కొందరు ఆయనకు భారం గా మారుతున్నారు’ అంటూ త్రిష ని ఉద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం గా మారాయి.

ఇకపోతే విజయ్ ముఖ్యమంత్రి అవ్వగానే, త్రిష టీవీకే పార్టీ లో కీలక బాధ్యతలు చేపడుతుందని, ఆమెకు ఉపముఖ్యమంత్రి పదవి ని ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని సోషల్ మీడియా లో అందరూ అనుకున్నారు. కానీ అలాంటిదేమి జరగలేదు. ఎందుకంటే టీవీకే పార్టీ ప్రస్తుతం నాలుగు పార్టీలతో పొత్తులో ఉంది, అందులో వీసీకే పార్టీ కి సంబంధించిన ఎమ్మెల్యే ఉపముఖ్యమంత్రి పదవి ని డిమాండ్ చేస్తున్నారు , అందుకే విజయ్ త్రిష కి ఈసారి అవకాశం ఇవ్వలేదని, కానీ పార్టీ కి సంబంధించిన అంతర్గత కార్యక్రమాలు మొత్తం ఆమె దగ్గరుండి చూసుకుంటుందని అంటున్నారు. ఇకపోతే మరోపక్క ఆమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కరుప్పు’ ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సూర్య హీరో గా నటించిన ఈ చిత్రం , తెలుగు లో ‘వీరభద్రుడు’ అనే పేరుతో విడుదల కాబోతుంది.

Vijay insulted former CM in assembly: అసెంబ్లీ లో మాజీ సీఎం ని అవమానించిన విజయ్.. ఇలా ఉంటే కష్టమే..

Vijay insulted former CM in assembly: రాజకీయాల్లో పదవి శాశ్వతం కాదు , కేవలం నాయకులూ చేసే మంచి పనులు తాలూకు ఫలితం మాత్రమే శాశ్వతం, ఆ ఫలితాల ద్వారా ఏర్పడే మంచి పేరు శాశ్వతం. ఇది చాలా మంది నాయకులూ అర్థం చేసుకోలేదు , అందుకే కాలగర్భంలో కలిసిపోయారు. అధికార మదంతో అహంకారం చూపించడం అసలు కరెక్ట్ కాదు అనేది 2024 ఎన్నికలు ఒకసారి నిరూపించి చూపించింది. ఇప్పుడు రీసెంట్ గా తమిళనాడు ముఖ్యమంత్రి గా ఎన్నికైన విజయ్ కూడా పైన చెప్పిన దారిలోనే నడుస్తున్నాడా?, వయస్సులో పెద్దవారైనా నాయకులకు ఆయన మర్యాద ఇవ్వడం లేదా అంటే అవుననే చెప్తున్నారు విశ్లేషకులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, నేడు తమిళనాడు అసెంబ్లీ లో ఎమ్మెల్యేలుగా ఎంపికైన ప్రతీ ఒక్కరు ప్రమాణస్వీకారం చేశారు. అందులో అన్నా డీఎంకే పార్టీ అధినేత పళని స్వామి కూడా ఉన్నాడు.

అయితే పళని స్వామి ప్రమాణస్వీకారం చేయడానికి ముందుకొచ్చినప్పుడు, తన ఎదురుగా కూర్చున్న ముఖ్యమంత్రి విజయ్ కి నమస్కారం చేశాడు. నమస్కారం చేసిన వారికి తిరిగి నమస్కారం చేయడం సంస్కారం. కానీ విజయ్ పళని స్వామికి నమస్కారం చెయ్యలేదు, దండం పెడితే చిన్న చిరునవ్వుతో సరిపెట్టాడు. ఇదే ఇప్పుడు అన్నా డీఎంకే సపోర్టర్స్ ని తీవ్రమైన అసహనానికి గురయ్యేలా చేస్తోంది. ఇదే అసెంబ్లీ లో తనకు గురువు లాంటి విజయ్ కాంత్ సతీమణి ప్రేమలత ప్రమాణస్వీకారం చేయడానికి వచ్చినప్పుడు పైకి లేచి మరీ నమస్కారం చేసిన విజయ్, గతం లో తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన పళని స్వామిని ఎందుకు గౌరవించలేదు?, అంటే ఒక్కొక్కరికి ఒక్కోలాగా మర్యాద ఇస్తాడు అన్నమాట. ఇదంతా పక్కన పెడితే నేడు విజయ్ మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ , ఆయనకు నమస్కారం చేసి , సన్మానం చేసి వచ్చాడు. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ప్రతిపక్ష నేతకు గౌరవం ఇచ్చాడు మంచిగానే ఉంది , కానీ విపక్ష నేత అంటే చిన్న చూపు ఎందుకు?, అంటే AIDMK ప్రధాన ప్రతిపక్షం కాదు కాబట్టి విజయ్ చిన్న చూపు చూస్తున్నాడా?, ఎన్నికల ప్రచారం లో ఆయన పదే పదే చెప్పుకుంటూ వచ్చాడు , ఇక నుండి తమిళనాడు లో కేవలం రెండు పార్టీల మధ్య మాత్రమే పోటీ ఉంటుంది , ఒకటి DMK కాగా, మరొకటి TVK అని. అంటే విజయ్ హోదా ని బట్టే గౌరవం ఇస్తాడు అన్నమాట , అంటూ సోషల్ మీడియా లో ఆయనపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే , ఇక రాబోయే రోజుల్లో ఈయన ఎలా ఉంటాడో అని అంటున్నారు నెటిజెన్స్.
https://www.youtube.com/shorts/GwaByE8hF7Y?feature=share

Peddi theatrical trailer release date: ‘పెద్ది’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్.. బ్రాండ్ న్యూ పోస్టర్ అదుర్స్..

Peddi theatrical trailer release date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం వచ్చే నెల 4 వ తేదీన విడుదల అవ్వబోతున్న సందర్భంగా , మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఊహించిన రేంజ్ లో అద్వానీ బుకింగ్స్ జరగడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ఊపందుకొని ప్రీమియర్ షోస్ నుండి అద్భుతమైన గ్రాస్ వసూళ్లను రాబట్టాలంటే , కచ్చితంగా థియేట్రికల్ ట్రైలర్ కావాలి. ఎందుకంటే నార్త్ అమెరికా లో ఆడియన్స్ ట్రైలర్ ని చూసిన తర్వాతే టికెట్స్ బుక్ చేసుకుంటారు. అందుకే ఫ్యాన్స్ ట్రైలర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తుండగా, కాసేపటి క్రితమే అందుకు సంబంధించిన అధికారిక అప్డేట్ ని ఒక సరికొత్త పోస్టర్ ని తెలిపారు.

ఈ థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 18 న విడుదల చేయబోతున్నారట. ముంబై లో ఒక భారీ ఈవెంట్ ని ప్లాన్ చేసి ఈ ట్రైలర్ ని విడుదల చేస్తారని టాక్. ముందుగా భోపాల్ లో ఈ ఈవెంట్ ని ప్లాన్ చేద్దాం అని అనుకున్నారు. కానీ చివరికి ముంబై కి షిఫ్ట్ చేశారు. మరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులు ఎవరైనా రాబోతున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రం ప్రధానంగా నార్త్ ఇండియా కలెక్షన్స్ ని టార్గెట్ చేసింది. ఎందుకంటే ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్ వంటి వారు నార్త్ ఇండియా లో తిరుగులేని స్టార్ స్టేటస్ తో బలంగా నాటుకుపోయారు. ఇప్పుడు రామ్ చరణ్ వాళ్లకు పోటీ అవ్వాలంటే , కచ్చితంగా అక్కడ ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలి. అందుకే సినిమాకు సంబంధించిన అతి ముఖ్యమైన ఈవెంట్ ని నార్త్ అమెరికా నుండే మొదలు పెట్టబోతున్నారు.

ఈ ఈవెంట్ కి మూవీ టీం తో పాటు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరు కాబోతున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లోనే ఈ సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను రివీల్ చేయబోతున్నారట. అవి అభిమానులకు మెంటలెక్కిపోయేలా చేస్తుందని టాక్. ఈ ట్రైలర్ తో సినిమా కథ మీద అందరికీ ఒక అంచనా వస్తుందని , ఇప్పటి వరకు ఈ చిత్రం పై ఏర్పడిన హైప్ ని పదింతలు ఎక్కువ చేస్తుందని బలమైన నమ్మకం తో ఉన్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ట్రైలర్ తర్వాత ఈ సినిమా పై ఆడియన్స్ లో ఎలాంటి హైప్ క్రియేట్ అవుతుంది అనేది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల చేసిన రెండు గ్లింప్స్ వీడియోస్ కి , రెండు పాటలకు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.

CM Vijay Wife and Children: సీఎంగా విజయ్ బిందాస్.. మరి ఆయన భార్య, పిల్లలు ఎక్కడున్నారు

CM Vijay Wife and Children: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ పని మొదలుపెట్టారు. అసెంబ్లీలో శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది.. ఇప్పుడు అసలైన ప్రశ్న వ్యక్తమవుతోంది. అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో దానికి సంబంధించిన చర్చ సాగుతూ ఉంది. విజయ్ ముఖ్యమంత్రిగా బిందాస్ గా ఉన్నారు.. మరి ఆయన భార్య ఎక్కడున్నారు, పిల్లలు ఎక్కడ తలదాచుకున్నారు?

విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. నిన్న తన స్వగృహంలోనే ఉన్నారు. కొంతమంది వీవీ వీఐపీలను మాత్రమే ఆయన కలిశారు. సోమవారం తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడులో గెలిచిన ఇతర ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.. పొలిటికల్ గా ఈ స్థాయికి ఎదిగిన విజయ్.. వ్యక్తిగతంగా మాత్రం ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. బయటికి ఆయన ఎన్ని మాటలు చెప్పినా సరే.. లోపల మాత్రం ఒక రకమైన ఆవేదన కనిపిస్తూనే ఉంది.

కట్టుకున్న భార్య సంగీత దగ్గర లేదు. పిల్లలు జేసన్, దివ్య కూడా ఆయన వద్ద లేరు. తన తండ్రి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు పిల్లలు పక్కన లేరంటే ఆ బాధ మామూలుగా ఉండదు. భర్తతో విభేదాల నేపథ్యంలో ఇప్పటికే విజయ్ భార్య సంగీత దూరంగా ఉంటున్నారు. ఆమె ఏకంగా విడాకుల నోటీస్ కూడా పంపించారు. దానిపై రకరకాల చర్చలు సాగుతూనే ఉన్నాయి. త్వరలోనే ఆ కేసు విచారణకు రానుంది.. విజయ్ భార్య సంగీతకు బ్రిటిష్ సిటిజన్ షిప్ ఉంది. ఆమె ఫ్యామిలీ బిజినెస్ చేసుకుంటున్నారు.

మరోవైపు త్రిష విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. విజయ్ తో తాను రిలేషన్ లో ఉన్నానని త్రిష చెప్పకనే చెప్పారు. విజయ్ కుమారుడు జేసన్ ఆల్రెడీ సినిమా ఫీల్డ్ లో ఉన్నాడు.. సందీప్ కిషన్ హీరోగా ఒక సినిమాను కూడా రూపొందిస్తున్నాడు. ఇప్పటికే జేసన్ తన తండ్రి పేరును తొలగించుకున్నాడు. దివ్య కూడా తల్లితో ఉంటున్నది.. ఆమె కూడా ఉన్నత చదువులు చదువుతున్నది.. విడాకుల కేసు విచారణకు సంగీత హాజరయ్యే అవకాశం ఉందని తమిళనాడు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Bandi Bhagirath POCSO case: బండి భగీరథ్‌ పోక్సో కేసు.. సత్వర విచారణకు సీఎం ఆదేశం!

Bandi Bhagirath POCSO case: కరీంనగర్‌ ఎంపీ, కేంద్ర మంత్రి, కరుడుగట్టిన హిందుత్వవాది.. బండి సంజయ్‌ తనయుడు సాయిభగీరథ్‌పై ఇటీవల హైదరాబాద్‌లో పోక్సో కేసు నమోదైంది. అదే రోజు సాయి భగీరథ్‌ కూడా ఓ మైన్‌ బాలిక, ఆమె తల్లిదండ్రులపై హనీట్రాప్‌ కేసు కరీంనగర్‌ టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో పెట్టారు. ఈ రెండు కేసులపై ఇంకా విచారణ మొదలు కాలేదు. అయితే ఇప్పటికే రాజకీయరంగు పులుముకుని విమర్శలు, ప్రతివిమర్శలతో తెలంగాఱ రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఈ సభలో బండి సంజయ్‌ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మరోవైపు బీఆర్‌ఎస్‌పైనా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి బండి భగీరథ్‌పై నమోదైన కేసుపై ఆరా తీశారు. ఇది న్యాయ వ్యవస్థ పరీక్ష, ప్రజా విశ్వాసానికి పరీక్ష. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి తక్షణ చర్యలకు ఆదేశించడం ఇపుపడు చర్చనీయాంశమైంది.

పోలీస్‌ల తీరుపై విమర్శలు..
ఈనెల 8వ తేదీనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. సీఎం రేవంత్‌రెడ్డి డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రశ్నించారు. ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటని నిలదీశారు. మోదీ పర్యటన ఏర్పాట్లలో సిబ్బంది బిజీగా ఉన్నారని డీజీపీ తెలిపారు. అయితే డీజీపీ సమాధానంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. 17 ఏళ్ల బాలిక హక్కులు ముఖ్యం కాదా అని నిలదీశారు. రాజకీయ నేత తనయుడు కాబట్టి వెనుకాడారా అని నిలదీశారు.

న్యాయం సంక్లిష్టం..
ఇదిలా ఉంటే ఈ కేసు సంక్లిష్టంగా ఉంది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. భగీరథ్‌ తన కుమార్తెను వేధిస్తున్నారని. కానీ అదే రోజు భగీరథ్‌ కూడా ఫిర్యాదు చేశాడు. బాలిక తల్లిదండ్రులు డబ్బుల కోసం తనను బెదిరిస్తున్నారని.

ఎవరు నిజం చెబుతున్నారు?
ఇది కేవలం పోలీసుల విచారణ కోసం వదిలివేయాలి. కానీ ప్రశ్న మిగిలిపోతోంది. రాజకీయ నేత తనయుడు కాబట్టి ప్రత్యేక ప్రాసిక్యూషన్‌ ఉందా? లేదా నిజమైన బాధితురాలికి న్యాయం లభిస్తుందా?

సీఎం కీలక ఆదేశాలు..
మరోవైపు ఈ కేసుపై విచారణ వేగవంతం చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. సమగ్ర విచారణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో డీజీపీ ఆనందర్‌ కూకట్‌పల్లి డీసీపీ రుతురాజ్‌కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.

రంగంలోకి బాలల హక్కుల కమిషన్‌..
పోక్సో కేసుపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ స్పందించింది. చైర్‌పర్సన్‌ సీతాదయాకర్‌రెడ్డి సీపీ నుంచి పూర్తి వివరాలు కోరారు. ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు చేశారు. బాలల హక్కుల విషయంలో ఏ వ్యక్తి అయినా, ఏ స్థానం అయినా సమానం అనేలా చర్యలు ఉన్నాయి.

ఈ కేసు పరిష్కారం ద్వారా రాష్ట్రం న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పెంచగలదు. లేదా కోల్పోయి, అనేక ప్రశ్నలను మిగిల్చివేస్తుంది. న్యాయం ముందు సమానత్వం కేవలం మాట కాదు, 17 ఏళ్ల బాలిక హక్కులు రక్షించబడతాయా లేదా అన్నదే ప్రస్తుతం చర్చనీయాంశం.

Why Modi said not to buy Gold: బంగారం కొనొద్దని ప్రధాని మోదీ ఎందుకు అన్నారు.. కొంటే ఏమవుతోంది..

Why Modi said not to buy Gold: భారతదేశంలో బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు.. దీనిని సంప్రదాయానికి, సంపదకు, సామాజిక హోదాకు చిహ్నంగా భావిస్తారు. ముఖ్యంగా వివాహాలు, దీపావళి, అక్షయ తృతీయ వంటి పండుగల సమయాల్లో బంగారం కొనుగోళ్లు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. కొన్ని గణాంకాల ప్రకారం.. భారతీయులు ఏటా సగటున 700 నుండి 800 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారని తెలుపుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశాల్లో భారత్ ఒకటిగా నిలవడానికి ఇక్కడి ప్రజలకు ఈ పసిడిపై ఉన్న మక్కువనే ప్రధాన కారణం. అయితే ఇటీవల మోదీ బంగారం ఎక్కువగా కొనుగోలు చేయొద్దని ప్రకటన చేశారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది?

దేశంలో బంగారానికి భారీ డిమాండ్‌ ఉంది. కానీ ఇందుకు విరుద్ధంగా మన దేశీయ ఉత్పత్తి అత్యంత స్వల్పంగా ఉంది. ఏటా కేవలం 1 నుండి 2 టన్నుల బంగారం మాత్రమే మన గనుల నుండి లభిస్తోంది. దీనివల్ల దాదాపు 90 శాతం కంటే ఎక్కువ డిమాండ్‌ను విదేశీ దిగుమతుల ద్వారానే తీర్చుకోవాల్సి వస్తోంది. ముడిచమురు తర్వాత భారత్ అత్యధికంగా విదేశీ మారక ద్రవ్యాన్ని (Foreign Exchange) ఖర్చు చేస్తున్నది బంగారం దిగుమతుల కోసమే. దీనివల్ల దేశ కరెంట్ అకౌంట్ లోటు (CAD) పెరిగి, రూపాయి విలువపై, విదేశీ మారక నిల్వలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది.

దేశ ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తెలంగాణలో పర్యటించినప్పుడు తెలిపారు. కనీసం ఏడాది పాటు కొత్త బంగారం కొనకుండా ఉండటం వల్ల దేశం నుంచి బయటకు వెళ్లే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని, ఆ నిధులను దేశాభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పసిడిపై పెట్టుబడి పెట్టడం వల్ల అది వ్యక్తిగతంగా లాభదాయకంగా అనిపించినప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థ పరంగా అది ‘డెడ్ ఇన్వెస్ట్‌మెంట్’ గానే మిగిలిపోతుందనేది నిపుణుల వాదన.

బంగారం కొనుగోళ్లను తగ్గించడానికి ప్రభుత్వం ‘సావరిన్ గోల్డ్ బాండ్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. భౌతికంగా బంగారాన్ని కొని లాకర్లలో దాచుకోవడం కంటే, బాండ్ల రూపంలో పెట్టుబడి పెట్టడం వల్ల విదేశీ దిగుమతుల భారం తగ్గుతుంది. దీనివల్ల వినియోగదారులకు భద్రతతో పాటు అదనపు వడ్డీ కూడా లభిస్తుంది. ప్రజలు తమ పెట్టుబడి దృక్పథాన్ని మార్చుకుని, భౌతిక బంగారం నుంచి డిజిటల్ , బాండ్ల వైపు మళ్ళినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది అని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

Adilone Hamsapadu meaning: ‘ఆదిలోనే హంసపాదు’ ఎలా పుట్టింది.. దీని వెనుకన్న ఆసక్తికర స్టోరీ ఏంటీ..

Adilone Hamsapadu meaning: చాలా సందర్భాల్లో కొన్ని విషయాలను గట్టిగా చెప్పాలనుకుంటే సామెతలను వాడుతూ ఉంటారు. ఈ సామెతల వల్ల ఎదుటివారిని ఆకర్షించడంతో పాటు వారికి విషయం పూర్తిగా అర్థం అవుతుంది. ఇలాంటి సామెతల్లో ‘ఆదిలోనే హంసపాదు’ అనే సామెత తెలుగు భాషలో చాలా ప్రసిద్ధి చెందింది. ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు ప్రారంభంలోనే పొరపాటు జరగడం, లేదా మొదట్లోనే ఆటంకం రావడం జరిగినప్పుడు ఈ మాటను ఉపయోగిస్తారు. ఒక పని సజావుగా సాగకుండా మొదటి దశలోనే సమస్యలు ఎదురైతే ‘ఆదిలోనే హంసపాదు వచ్చింది’ అని అంటారు. ఈ సామెత వెనుక ఆసక్తికరమైన సాంప్రదాయం ఏంటీ? ఈ పదం ఎలా పుట్టింది?

పూర్వకాలంలో గ్రంథాలను తాళపత్రాలపై లేదా చేతిరాత పుస్తకాలుగా రాసేవారు. రాయడం సమయంలో ఎక్కడైనా అక్షరదోషం వచ్చినప్పుడు దాన్ని సరిచేయడానికి ప్రత్యేక గుర్తులు పెట్టేవారు. అందులో ఒక గుర్తు హంస కాలి ఆకారంలా ఉండేదని చెబుతారు. అంటే ఇంగ్లీష్ Vని తిరగేసి రాసినట్లు ఉంటుంది. ఆ గుర్తునే ‘హంసపాదు’ అని పిలిచేవారు. ముఖ్యంగా రచన ప్రారంభంలోనే అలాంటి దిద్దుబాటు గుర్తు వస్తే అది మంచి శకునంగా భావించేవారు కాదట. అంటే, ఒక రచన మొదటి పేజీలోనే తప్పు రావడం వల్ల రచయితకు నిరాశ కలిగేది. ‘ఇంకా మొదలుపెట్టగానే తప్పు వచ్చింది’ అనే భావంతో “ఆదిలోనే హంసపాదు” అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. తర్వాత అది కేవలం రచనలకే కాకుండా అన్ని పనులకు వర్తించే సామెతగా మారిపోయింది.

ఈ సామెతలో ‘హంస’ అంటే స్వచ్ఛత, అందం, జ్ఞానం అనే భావాలు ఉన్నాయి. అయితే ‘హంసపాదు’ అనే పదం ఇక్కడ అందమైన గుర్తు కాదు. తప్పును సూచించే చిహ్నం. అందుకే మంచి ప్రారంభం కాకుండా, మొదట్లోనే సమస్య ఎదురవడాన్ని ఈ సామెత ద్వారా వ్యక్తపరుస్తారు. నేటికీ ఈ సామెతను రోజువారీ జీవితంలో విరివిగా వాడుతుంటారు. ఉదాహరణకు కొత్త వ్యాపారం ప్రారంభించగానే నష్టాలు రావడం, సినిమా మొదటి రోజే విమర్శలు రావడం, పరీక్ష మొదటి ప్రశ్నకే సమాధానం రాకపోవడం వంటి సందర్భాల్లో ‘ఆదిలోనే హంసపాదు’అని అంటారు.

తెలుగు భాషలోని సామెతలు జీవన అనుభవాల నుంచి పుట్టుకొచ్చినవే. ‘ఆదిలోనే హంసపాదు’ కూడా అలాంటి అనుభవజ్ఞానం నుంచి వచ్చిన సామెతగా భావిస్తారు. చిన్న పొరపాట్లు కూడా ప్రారంభంలోనే పెద్ద ప్రభావం చూపుతాయని ఈ మాట ద్వారా తెలియజేస్తారు.