Homeక్రీడలుక్రికెట్‌IPL 2026 Playoff Race: రెండు ప్లే ఆఫ్ కు వెళ్లినట్టే.. మిగతా రెండు స్థానాలకు...

IPL 2026 Playoff Race: రెండు ప్లే ఆఫ్ కు వెళ్లినట్టే.. మిగతా రెండు స్థానాలకు వెళ్లే అవకాశం వేటికుందంటే..

IPL 2026 Playoff Race: ఐపీఎల్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే లక్నో, ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించాయి. కోల్ కతా కూడా దాదాపు నిష్క్రమించినట్టే. గ్రూప్ సమరంలో టాప్ ఫోర్ స్థానాలలో నిలిచిన జట్లు ప్లే ఆఫ్ బెర్త్ సిద్ధం చేసుకుంటాయి. ప్రస్తుత పాయింట్ల పట్టికలో బెంగళూరు 16, గుజరాత్ 16, హైదరాబాద్ 14, పంజాబ్ 13 పాయింట్లతో కొనసాగుతున్నాయి. చెన్నై 12, రాజస్థాన్ 12 పాయింట్లతో ప్లే ఆఫ్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని సంకేతాలు పంపిస్తున్నాయి. […]

IPL 2026 Playoff Race: ఐపీఎల్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే లక్నో, ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించాయి. కోల్ కతా కూడా దాదాపు నిష్క్రమించినట్టే. గ్రూప్ సమరంలో టాప్ ఫోర్ స్థానాలలో నిలిచిన జట్లు ప్లే ఆఫ్ బెర్త్ సిద్ధం చేసుకుంటాయి.

ప్రస్తుత పాయింట్ల పట్టికలో బెంగళూరు 16, గుజరాత్ 16, హైదరాబాద్ 14, పంజాబ్ 13 పాయింట్లతో కొనసాగుతున్నాయి. చెన్నై 12, రాజస్థాన్ 12 పాయింట్లతో ప్లే ఆఫ్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని సంకేతాలు పంపిస్తున్నాయి. ఢిల్లీ ఖాతాలో 10, కోల్ కతా ఖాతాలో తొమ్మిది పాయింట్లు ఉన్నాయి. అయితే ఇవి సాంకేతికంగా మాత్రమే ప్లే ఆఫ్ బరికి సిద్ధంగా ఉన్నాయి

బెంగళూరు ఖాతాలో 16 పాయింట్లు ఉన్నాయి. 12 మ్యాచ్లు ఆడిన ఈ జట్టు 8 విజయాలు సాధించింది. ప్లే ఆఫ్ బెర్త్ దాదాపు సిద్ధం చేసుకుంది. ఈ జట్టు మిగిలిన రెండు మ్యాచ్లలో ఒక దాంట్లో గెలిస్తే చాలు ప్లే ఆఫ్ వెళ్లిపోతుంది. ఒకవేళ రెండు గెలిస్తే టాప్ 2 స్థానంలో ఉంటుంది. మే 17న పంజాబ్ జట్టుతో.. మే 22న హైదరాబాద్ జట్టుతో బెంగళూరు పోటీ పడుతుంది.

గుజరాత్ జట్టు ఖాతాలో 16 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేట్ విషయంలో బెంగళూరు కంటే తక్కువ స్థానంలో ఉంది. గుజరాత్ 12 మ్యాచ్లలో 8 గెలిచింది. తదుపరి రెండు మ్యాచ్లలో గెలిస్తే టాప్ 2 స్థానంలో ఉంటుంది. ఒకదాంట్లో గనక విజయం సాధిస్తే ప్లే ఆఫ్ వెళ్ళిపోతుంది. ఈ జట్టు మే 16న కోల్కతా.. మే 21న చెన్నై తో పోటీ పడుతుంది.

హైదరాబాద్.. మ్యాచ్లో హైదరాబాద్ ఓడిపోవడంతో మూడో స్థానానికి పడిపోయింది. 12 మ్యాచ్లలో ఏడు గెలిచింది. మిగిలిన రెండు మ్యాచ్లలో గెలిస్తే ప్లే ఆఫ్ వెళ్లిపోతుంది. అలాకాకుండా ఒక దాంట్లో గెలిచి.. ఒక దాంట్లో పడిపోతే మిగతా జట్ల ఫలితాల మీద ఆధార పడాల్సి ఉంటుంది. మే 18న చెన్నై జట్టుతో.. మే 22న బెంగళూరు తో హైదరాబాద్ పోటీ పడుతుంది.

పంజాబ్.. వరుసగా నాలుగు మ్యాచ్లో ఓడిపోయి టాప్ స్థానాన్ని కోల్పోయింది. 11 మ్యాచ్లో 6 గెలిచింది. ఈ జట్టు ఖాతాలో 13 పాయింట్లు ఉన్నాయి. మిగతా మూడింటిలో గెలిస్తే ఎలాంటి ఇబ్బందులేకుండా ప్లే ఆఫ్ వెళ్లిపోతుంది. ఒకవేళ ఒకదాంట్లో ఓడిపోతే మాత్రం ఈ జట్టుకు ఇబ్బందులు తప్పవు. ముంబై జట్టుతో మే 14న.. బెంగళూరు తో మే 17న.. లక్నోతో మే 23న ఈ జట్టు ఆడుతుంది.

చెన్నై, రాజస్థాన్.. ఈ రెండు జట్లు వచ్చే మూడు మ్యాచ్లలో కచ్చితంగా గెలవాలి. దాంట్లో ఓడిపోతే మాత్రం ఇబ్బందులు తప్పవు. చెన్నై జట్టు కంటే రాజస్థాన్ నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉంది. 11 మ్యాచ్లలో ఆరు విజయాలు నమోదు చేశాయి చెన్నై, రాజస్థాన్. ఈ రెండు జట్లు 12 పాయింట్లతో కొనసాగుతున్నాయి. లక్నోతో మే 15న.. మే 18న హైదరాబాద్.. మే 21న గుజరాత్ జట్టుతో చెన్నై పోటీ పడుతుంది.. ఢిల్లీతో మే 17న.. లక్నోతో మే 19న.. ముంబై తో మే 24న రాజస్థాన్ పోటీ పడుతుంది.

ఢిల్లీ.. ఈ జట్టు ప్లే ఆఫ్ వెళ్లడం దాదాపు కష్టమే. ఇప్పటికే 12 మ్యాచ్లు ఆడిన ఈ జట్టు ఐదు విజయాలు మాత్రమే నమోదు చేసింది. ఒకవేళ తదుపరి మ్యాచ్లో గెలిచినప్పటికీ నాకౌట్ చేరుకునే అవకాశం లేదు. నెట్ రన్ రేట్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో మే 17న.. కోల్కతా జట్టుతో మే 24న ఢిల్లీ పోటీ పడుతుంది.

కోల్ కతా.. ఈ జట్టు ప్లే ఆఫ్ వెళ్లే అవకాశాలు దాదాపు ముగిసిపోయాయి. కోల్కతా 11 మ్యాచుల్లో నాలుగు విజయాలు మాత్రమే నమోదు చేసింది. వచ్చే మూడు మ్యాచ్లో గెలిచినప్పటికీ.. ఇతర జట్ట సమీకరణల మీద ఆధారపడాల్సి ఉంటుంది. గుజరాత్ జట్టుతో మే 16న.. ముంబై జట్టుతో మే 20న.. ఢిల్లీ జట్టుతో మే 24న పోటీ పడాల్సి ఉంటుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper