Home Blog Page 25

2 రోజులకే ఓటీటీ నుంచి తీసేశారు.. అ అసలేంటి సినిమా వివాదం...

Satluj OTT Removal
Satluj OTT Removal

Satluj OTT Removal: ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా రిలీజ్ అయ్యే సినిమాలకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఏదైనా వివాదంలో చిక్కుకున్న సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించినప్పటికి ఆ వివాదం వల్ల ఆ సినిమా చాలా వరకు నష్ట పోతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ నటుడు దిల్జిత్ నటించిన ‘సట్లూజ్’ అనే మూవీ ఈనెల 3 వ తేదీన ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన జీ5 లో స్ట్రీమింగ్ కి వచ్చింది…

ఇక స్ట్రీమింగ్ కి వచ్చిన రెండు రోజుల్లోనే ఈ సినిమాని జీ5 వాళ్ళు తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక సినిమా ని ఓటిటి సంస్థ తొలగించాలి అనుకుంది అది చాలా సాహసోపేతమైన నిర్ణయం అనే చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమా వాళ్లకు ఓటిటి వాళ్ళు డబ్బులు ఇచ్చి మరి కొనుక్కుంటారు. కాబట్టి అర్ధాంతరంగా ఆ సినిమాని ఆ ప్లాట్ ఫామ్ నుంచి తీసివేయడం వల్ల అటు సినిమా వాళ్లకి ఇటు ఓటిటి సంస్థకి కూడా భారీ నష్టం వాటిల్లే అవకాశమైతే ఉంది.

ఇక దానిని ఎందుకని ఓటిటి నుంచి తొలగించారనే విషయం పర్ఫెక్ట్ గా చెప్పలేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఈ సినిమాని ఇండియాలో స్ట్రీమింగ్ చేయడం కష్టతరం అంటూ జీ5 వాళ్ళు ఒక క్లారిటి అయితే ఇచ్చారు. ఇక ఇదిలా ఉంటే పంజాబ్ లో జరిగిన హత్యల పేరిట 2022 లో ‘పంజాబ్ 95’ పేరుతో ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ సినిమాకి 127 కట్లను విధించడంతో చేసేది ఏమీ లేక సినిమా పేరుని మార్చి ఓటిటి లో రిలీజ్ చేశారు.

ఇక ఇక్కడ కూడా కాంట్రవర్సీ అవుతుందనే ఉద్దేశ్యంతోనే ఓటిటి సంస్థ ఈ సినిమాని తొలగించడం జరిగింది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా వల్ల వాళ్లకి భారీ నష్టమైతే వాటిల్లే అవకాశాలైతే ఉన్నాయి. అందుకే సినిమా చేసేటప్పుడు కాంట్రవర్సీ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా సినిమాని తెరకెక్కించగలిగితే బాగుంటుందని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం క్లారిటి ఇస్తున్నారు…

చుక్కలు చూపిస్తున్నారు.. ఆడి గెలవాలి కానీ ఇలా చప్పుడు చేసి గెలుచుడు ఏందిరా బై

England Vs Mexico FIFA World Cup
England Vs Mexico FIFA World Cup

England Vs Mexico FIFA World Cup: ఏ ఆటైనా సరే.. ఆడాలి.. పోరాడాలి.. చివరి వరకు శాయశక్తులను ఒడ్డాలి. అప్పుడే గెలుపు సాధ్యమవుతుంది. కొన్ని సందర్భాలలో ఈ స్థాయిలో కష్టపడినప్పటికీ విజయం దక్కదు. ప్రతి ఆటలో విజయం దక్కుతుందనే క్రీడాకారులు రంగంలోకి దిగుతారు. చివరి వరకు పోరాటాన్ని సాగిస్తూ ఉంటారు. కానీ ఈ కథనంలో తమ జట్టు ఆటగాళ్లు గెలవాలని అభిమానులు సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు..ఎవరూ అంచనా వేయలేని విధానానికి పాల్పడ్డారు. చివరికి వీరి వ్యవహారం మీడియాలో పడి ప్రపంచవ్యాప్తంగా రచ్చ రచ్చ అవుతోంది.

ఫిఫా వరల్డ్ కప్ లో క్వార్టర్స్ లో చోటు తగ్గించుకోవడానికి ఇంగ్లాండ్ తాపత్రయపడుతోంది. ఈ నేపథ్యంలో మెక్సికో జట్టుతో ఇంగ్లాండు కీలకమైన మ్యాచ్ ఆడబోతోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ మెక్సికో అభిమానులు ఓ దుర్మార్గానికి పాల్పడ్డారు. ఎవరూ ఊహించని విధానానికి శ్రీకారం చుట్టారు. దీంతో వాళ్ళ వ్యవహారం రకరకాల చర్చకు దారితీస్తోంది.

ఇంగ్లాండ్ జట్టు బస చేసిన హోటల్ బయట మెక్సికో అభిమానులు మామూలు హంగామా చేయడం లేదు. డ్రమ్స్ వాయిస్తున్నారు. షార్ట్స్ పేలుస్తున్నారు. ఇంగ్లాండ్ ప్లేయర్లకు నిద్రలేకుండా చేస్తున్నారు. పోలీసులు హెచ్చరించినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల కాలంలో ఈక్వెడార్ జట్టుతో కూడా ఇలానే వ్యవహరించారు. గెలుపు కోసం అనేక రకాల అడ్డదారులు తొక్కారు. మెక్సికో అభిమానులు వ్యవహరిస్తున్న తీరు పట్ల అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మ్యాచ్లో గెలవాలని ఇంగ్లాండ్ జట్టుకు యాజమాన్యం ఆ మాత్రలు పంపిణీ చేసింది. రాత్రిపూట ఆ కార్యం పూర్తి చేసుకోవాలని సూచించింది. ఈ కార్యం వల్ల ప్లేయర్ల మీద ఉన్న ఒత్తిడి తగ్గుతుందని.. వారు మైదానంలో స్వేచ్ఛగా ఆడగలుగుతారని మేనేజ్మెంట్ భావించింది. ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.. ఇంగ్లాండ్ జట్టు గురించి మేనేజ్మెంట్ అలా ఆలోచిస్తే.. మెక్సికో గురించి అభిమానులు ఇలా విధ్వంసం ఆలోచన చేశారు. మొత్తానికి తమ జట్టు మాత్రమే గెలవాలని ఇంగ్లాండ్ ప్లేయర్లు బస చేసిన హోటల్ ఎదురుగా రచ్చ రచ్చ చేశారు.

ఒక్క అగ్గిపుల్లతో 11 ఏళ్ల బాలుడు 72మందిని చం*పా*డు.. పాకిస్తాన్ లోనే ఇది సాధ్యం

Pakistan Shopping Mall Fire
Pakistan Shopping Mall Fire

Pakistan Shopping Mall Fire: ఆ బాలుడికి 11 సంవత్సరాలు. ఈ వయసు ఉన్న పిల్లలు స్కూల్ కి వెళ్తారు. బుద్ధిగా చదువుకుంటారు. సాయంత్రం స్నేహితులతో ఆడుకుంటారు. పరీక్షలు ఉంటే రాస్తారు.. పుస్తకాలతో కుస్తీపడతారు. అటువంటి ఆ బాలుడు దారి తప్పాడు. ఘోరంగా వ్యవహరించాడు. చివరికి చేయకూడని దారుణం చేసేసాడు.

ఈ ఏడాది జనవరిలో పాకిస్తాన్ లోని కరాచీ ప్రాంతంలో షాపింగ్ మాల్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏకంగా 72 మంది చనిపోయారు. ఆ ఘటన అప్పట్లోనే సంచలనం కలిగించింది. మొదట్లో ఈ దారుణానికి పాల్పడింది ఉగ్రవాదులని వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ దేశంలో ఇటువంటి దాడులు.. బాంబు పేలుడులు సర్వసాధారణం. పైగా ఉగ్రవాదులు అక్కడ నిత్యం మారణహోమం సృష్టిస్తూనే ఉంటారు. కరాచీనగరంలో జరిగిన సంఘటనను కూడా చాలామంది పెద్దగా పట్టించుకోలేదు.

ఈ కేసు వ్యవహారంలో ఇటీవల రాజకీయ ఒత్తిళ్లు వచన నేపథ్యంలో పోలీసులు తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ ఘటనకు పాల్పడింది ఉగ్రవాదులు కాదని.. ఆత్మాహుతి దళాలు కాదని.. అదంతా కూడా 11 సంవత్సరాల బాలుడి పని అని పోలీసుల దర్యాప్తులో తెలింది. ఈ కేసు విచారణలో భాగంగా అతడి తండ్రిని.. మరో నలుగురిని పోలీసులు నిందితులుగా చేర్చారు. అంతేకాదు ఆ బాలుడు ఫ్లవర్ షాపులో అగ్గిపుల్లతో ఆడుకుంటుండగా నిప్పు పెట్టాడు.. ఈ ప్రమాదంలో ఏకంగా 72 మంది చనిపోయారు.. కాగా ఈ ఘటనకు పాల్పడిన వారు మొత్తం ఇప్పటికీ పరారీ లోనే ఉన్నారు.

ఈ ఘటన ప్రమాదం వల్ల జ రిగింది కాదని.. ఉద్దేశపూర్వకంగా చేశారని తెలుస్తోంది. ఫలితంగా 72 మంది చనిపోయారని అక్కడ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి రాజకీయంగా ఒత్తిడి రాకపోతే ఇలా ఉండేది కాదని.. చనిపోయిన వారిలో కొంతమంది అక్కడి రాజకీయ నాయకులకు అత్యంత దగ్గరవారని.. అందువల్లే ఈ కేసు దర్యాప్తు జనవరి తర్వాత ఎన్ని రోజులకు మొదలైందని ప్రచారంలో ఉంది. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

రావణ్ గురించి నీతులు చెబుతున్న వైసిపి.. పవన్ కళ్యాణ్ ను ఏం చేసిందో మర్చిపోతే ఎలా

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: నీతులు చెప్పడం ఈజీ. సుద్దపూసలాగా మాట్లాడటం మరింత ఈజీ. కానీ వాటిని అనుసరించడం.. ఆచరించడం అంత ఈజీ కాదు. పాపం ఈ విషయంలో వైసిపి ప్రతిసారి బొక్క బోర్లా పడుతూనే ఉంటుంది. అయినప్పటికీ ఆ పార్టీకి.. ఆ పార్టీ అనుకూల మీడియాకు బుద్ధి రాదు.. కనీసం విచక్షణ ఉండదు.

రావణ్ అలియాస్ జోసెఫ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చేసిన హంగామా మామూలుది కాదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా అతడు ఏ స్థాయిలో విమర్శించాడు, ఉగ్రవాదులకు ఏ విధంగా వంత పాడాడు, భారతదేశాన్ని ఏ విధంగా తిట్టాడు, పురాణాలను, సనాతన ధర్మాన్ని, హిందువులు గొప్పగా పూజించే దేవుళ్లను ఏ విధంగా విమర్శించాడు.. అనేవి అతని వీడియోలను చూస్తే తెలుస్తుంది. అతనికి వంతపాడే కొంతమందికి ఇవి కనిపించడం లేదా.. కనిపించినప్పటికీ కావాలని నాటకాలు ఆడుతున్నారా అర్థం కావడం లేదు.

ప్రశ్నించడం మంచిదే. కానీ అది సమస్యను ఎత్తి చూపించే విధంగా ఉండాలి. వ్యక్తిగతంగా ఉండకూడదు. ఇంట్లో వాళ్లను దూషించే విధంగా ఉండకూడదు. కానీ రావణ్ అలియాస్ జోసెఫ్ ఎంచుకున్న విధానం మాత్రం వేరే విధంగా ఉంది. ఇష్టానుసారంగా మాట్లాడటం.. బండ బూతులు తిట్టడం.. వ్యక్తిగత అంశాలను బజార్లో పెట్టడాన్ని అతడు విమర్శించడం అనుకున్నాడు. పైగా దేశం మీద ప్రేమ లేదు అని చెప్పడాన్ని అతడు చాలా గొప్పగా భావించాడు. ఉగ్రవాదులకు సపోర్ట్ చేయడానికి అతడు ఈ దేశం కల్పించిన హక్కుగా అనుకున్నాడు. చివరికి దేశద్రోహం కేసు కింద అరెస్టు అయ్యాడు.

ఇక్కడ జోసెఫ్ కి వంత పాడుతున్న వైసిపి.. గతంలో పవన్ కళ్యాణ్ విషయంలో ఏం చేసిందో మర్చిపోతే ఎలా.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల గురించి మాట్లాడారు అని పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టారు. కారు మీద ఎక్కి కూర్చున్నాడని కేసు పెట్టారు. సీఎం సెక్యూరిటీ కూడా తీసేసి విశాఖపట్టణంలో ఓ హోటల్ ముందు సెక్యూరిటీగా పెట్టారు. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులను కాపలాగా పెట్టారు. ఆయన సినిమా విడుదల అవుతుంటే టికెట్ల రేట్లు తగ్గించమని జీవోలు జారీ చేశారు. సర్పంచి నుంచి మొదలు పెడితే ఐఏఎస్ అధికారుల వరకు థియేటర్ల వద్ద సెక్యూరిటీగా పెట్టారు.

జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి తన నాలుగవ భార్యగా పేర్కొన్నాడని మహిళా కమిషన్ దగ్గర కేసు పెట్టారు. అప్పట్లో మత్స్యకారులకు సంబంధించిన జీవోను వైసిపి ప్రభుత్వం జారీ చేస్తే.. దానిని చించివేశాడని కేసు నమోదు చేశారు. భీమ్లా నాయక్ సినిమాలో రావు రమేష్ పాత్ర జగన్మోహన్ రెడ్డిని పోలి ఉందని కేసు పెట్టారు. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు విడుదల కాకుండా ఉండడానికి కేసులు పెట్టారు. ఇవి కేవలం కొన్ని మాత్రమే.. ఇంకా చాలా ఉన్నాయి. ఇన్ని రకాలుగా కేసులు పెట్టి.. ఆయనను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన వైసీపీ నాయకులు ఇప్పుడు సుద్దపూసలుగా మాట్లాడటం నిజంగా ఆశ్చర్యంగా ఉందని.. జనసేన నాయకులు అంటున్నారు..

అన్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పుతో కొడతా అని ఆ మధ్య అన్నారు. దేనికోసం అన్నాడో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని జనసేన నాయకులు చెబుతున్నారు. ఫ్యాన్ పార్టీ నాయకులు ఆయన మీద కేసు పెట్టి జడ శ్రవణ్ లేదా రామ్ జెఠ్మాలనీ ని విచారణకు నియమించుకోవాలని జనసేన నాయకులు సూచిస్తున్నారు. అన్నట్టు వైసిపి నాయకులను ఆయన చెప్పుతో కొడతాను అని ఎందుకు అన్నారో కూడా చెప్పాలని వారు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు.

ఫిఫా వరల్డ్ కప్: ఓడితే ఏంటి.. కోట్లమంది మనసులు గెలిచారు..ఇది కదా పోరాటం అంటే..

Cape Verde FIFA World Cup
Cape Verde FIFA World Cup

Cape Verde FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్ లో ప్రతి మ్యాచ్ కూడా నువ్వా నేనా అన్నట్టుగా సాగుతూ ఉంటుంది. పోరాడే జట్లు ట్రోఫీ కోసం చివరి వరకు సర్వశక్తులు ఒడ్డుతాయి. అందువల్లే ఫిఫా మ్యాచ్ లు చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది కాబట్టి ఫిఫా మ్యాచ్ లకు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు హాజరవుతుంటారు. ఇక టీవీలలో అయితే చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి.. మరింత ఆదరణ ప్రేక్షకుల నుంచి లభిస్తోంది.

ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా టోర్నీలో ఓ జట్టు గొప్ప విజయాలు సాధించకపోయినప్పటికీ.. అద్భుతమైన పోరాటాన్ని ప్రదర్శించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఆ జట్టు మీద అంతగా అంచనాలు లేకపోయినప్పటికీ.. ఆ జట్టులో స్టార్ ప్లేయర్లు లేకపోయినప్పటికీ.. అద్భుతమైన ఆట తీరు కొనసాగించింది. అందువల్లే ఆ జట్టు గురించి సరికొత్త చర్చ మొదలైంది.

ఫిఫా వరల్డ్ కప్ లో ఈసారి కాబో వర్డే జట్టు కొనసాగించిన పోరాట స్ఫూర్తి అసాధారణంగా ఉంది. ప్రపంచ కప్ లోనే అద్భుతమైన ఆట తీరుతో సరికొత్త పేరు తెచ్చుకుంది.. లీగ్ దశలో పటిష్టమైన స్పెయిన్.. ఉరుగ్వే, సౌదీ అరేబియా జట్లతో మ్యాచ్ లను డ్రా చేసుకుంది. నాకౌంట్లో డిపెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా జట్టుతో జరిగిన పోరులో 2-3 తేడాతో ఓడిపోయింది. వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది.

కాబో వర్డే దేశంలో నిన్న స్వాతంత్ర్య దినోత్సవం జరిగింది. ఈ నేపథ్యంలో కాబో వర్డే జట్టు సొంత దేశంలో అడుగుపెట్టింది. ఈ క్రమంలో జట్టు ప్లేయర్లకు ఎయిర్ పోర్ట్ లో వేలాది మంది ప్రజలు ఘనమైన స్వాగతం పలికారు. ఆ దేశంలో జనాభా 5.5 లక్షలు ఉంటారు. దేశ జనాభాలో దాదాపు 90 శాతం మంది విమానాశ్రయానికి వచ్చి స్వాగతం పలికారు. కీలకమైన మ్యాచులలో అద్భుతమైన ప్రదర్శన చేసిన నేపథ్యంలో కాబో వర్డే గురించి గ్లోబల్ వ్యాప్తంగా చర్చ నడిచింది. లెజెండరీ ఫుట్బాల్ ప్లేయర్లు కూడా కాబో వర్డే జట్టు ఆటు తీరును మెచ్చుకున్నారు.

ఇంగ్లాండ్ చేతులారా... అక్కడే మ్యాచ్ టర్న్.. ఆస్ట్రేలియా సెవెంత్ వండర్ కు అదే కారణం

Women's T20 World Cup 2026
Women's T20 World Cup 2026

Women’s T20 World Cup 2026: వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్ లో ఇండియా చేతుల్లో ఓడిపోయింది. ఆ ఓటమి ఆస్ట్రేలియా జట్టును తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు తన ఆట తీరు పూర్తిగా మార్చింది. ముఖ్యంగా ప్లేయర్ల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంది. ఆ ఫలితం కూడా ఇప్పుడు కనిపించింది.

మహిళల టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమేమి ఆవిష్కృతం కాలేదు. వన్డే వరల్డ్ కప్ లో టీం ఇండియా మాదిరిగా ఇంగ్లాండ్ జట్టు సొంత గడ్డమీద అద్భుత ప్రదర్శన చేయలేదు. ఆస్ట్రేలియా బౌలింగ్ ఎదుర్కోలేక ఇబ్బంది పడింది. భారీగా పరుగులు చేయక తడబడింది. ఒత్తిడిలో ఇంగ్లాండ్ ప్లేయర్లు చేతులెత్తేశారు. ఫలితంగా ఆస్ట్రేలియా ఎదుట 151 పరుగుల టార్గెట్ మాత్రమే విధించగలరు. ఈ పరుగులు ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద లెక్కలోవి కాదు. పైగా ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు భీకరమైన ఫామ్ లో ఉంది. ఈ లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది.

ఒక దశలో ఆస్ట్రేలియా ఓపెనర్ జార్జియా వోల్ (9) పరుగులకే అవుట్ అయింది. ఈ దశలో ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తే బాగుండేది. బెత్ మూనీ, లిచ్ ఫీల్డ్ అద్భుతం చేశారు. వీరిద్దరూ రెండో వికెట్ కు ఏకంగా 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టడంలో ఇంగ్లాండ్ బౌలర్లు విఫలమయ్యారు. కనీసం సొంత గ్రౌండ్ మీద సత్తా చూపించే విధంగా బౌలింగ్ వేయలేకపోయారు. లిచ్ ఫీల్డ్ (48) అవుట్ అయినప్పటికీ.. అప్పటికే ఆస్ట్రేలియాకు జరగాల్సిన లాభం జరిగిపోయింది. మూనీ మాత్రం మరో ఎండ్ లో రెచ్చిపోయింది. 64 పరుగులు చేసి అదరగొట్టింది.

ఆస్ట్రేలియా కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి.. అది కూడా 17.1 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేసింది. ఆస్ట్రేలియా జట్టుకు మొత్తంగా ఇది ఏడవ వరల్డ్ కప్ టైటిల్.. ఆస్ట్రేలియా జట్టుకు సమీపంలో ఏ జట్టు కూడా లేదు. ఒకరకంగా చెప్పాలంటే మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా ప్లేయర్లు ఏక ఛత్రాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, భారత్ ప్లేయర్లు ఈసారి ఆస్ట్రేలియాకు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. ఒకరకంగా ఈ టోర్నీలో ఆస్ట్రేలియా మహిళలు నల్లేరు మీద నడకలాగా తమ విజయప్రస్థానాన్ని కొనసాగించారు. చివరికి ఏడవ వరల్డ్ కప్ ట్రోఫీ అందుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు.

ఒకప్పుడు అపర కుబేరులు.. ఇప్పుడు పాతాళానికి... వీళ్ళ ఆర్థిక మోసం చాలామందికి గుణపాఠం

Indian Businessmen Controversies
Indian Businessmen Controversies

Indian Businessmen Controversies: వారు సెవెన్ స్టార్ హోటల్లో విడిది చేసేవారు. అత్యంత ఖరీదైన వాహనాలలో తిరిగేవారు. ఇతర దేశాలకు ప్రత్యేకమైన విమానాలలో మాత్రమే వెళ్లేవారు. వారు తాగే నీళ్లు.. తినే తిండి.. వేసుకునే దుస్తులు.. ఇలా ప్రతి ఒక్కటి లక్షల్లో ఉండేవి. వారి జీవన విధానం చూసి చాలామంది ఆశ్చర్యపోయేవారు. కొందరైతే అలా బతకాలని కోరుకునేవారు. అటువంటి విలాసవంతమైన జీవితాన్ని.. విజయవంతమైన వ్యాపార తంత్రాన్ని సాగించిన వారు చివరికి ఎలా మిగిలిపోయారంటే..

పెద్ద ఓడను సైతం ముంచేది చిన్న చిల్లే. వీరి వ్యాపారాన్ని కూడా చిన్న నిర్లక్ష్యం నిండా మించింది. ఆగర్భ శ్రీమంతులను కాస్త అనామకులను చేసింది. ఆకాశ హర్మ్యాలలో నివాసం ఉండేవారిని నేలకు దించింది. కొందరు దేశం విడిచి పరారీలో ఉంటే.. మరికొందరు అప్పుల ఊబిలో కూరుకు పోయారు. అలా నష్టపోయిన వ్యాపారుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. ఇందులో మొదటి స్థానంలో అనిల్ అంబానీ ఉంటారు.

అనిల్ అంబానీ

అనిల్ అంబానీ పోగొట్టుకున్న డబ్బు విలువ అక్షరాల 3.14 లక్షల కోట్లు. 2008లో ఈయన ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద కుబేరుడుగా ఉండేవారు. అయితే ఈయన ఏర్పాటు చేసిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ తీవ్ర నష్టాలను చవిచూసింది. తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకోవడంతో ఈయన డౌన్ ఫాల్ అత్యంత వేగంగా సాగింది. 2008లో ప్రపంచంలో ఆరవ అతిపెద్ద ధనవంతుడిగా ఉన్న ఆయన 2020 నాటికి తన నెట్ వర్త్ జీరో అని బ్రిటన్ కోర్టులో చెప్పుకునే స్థాయికి దిగజారిపోయాడు.

బైజు రవీంద్రన్

ఒకప్పుడు ఈయన సంపద 17500 కోట్లకు ఉండేది. పైగా భారత దేశంలోనే అతిపెద్దదైన ఎడ్ టెక్ స్టార్టప్ కంపెనీగా ఈయన బైజుస్ ఉండేది. ఇది టీమిండియా కు అధికారిక స్పాన్సర్ గా కూడా వ్యవహరించింది. రవీంద్రన్ ఆర్థికంగా అవకతవకలకు పాల్పడటం.. నిబంధనలు మొత్తం పక్కన పెట్టడం.. పెట్టుబడు ధరలతో గొడవలు పెట్టుకోవడం వల్ల.. 2024లో ఈయన నెట్ వర్త్ జీరో అయిపోయింది.

నీరవ్ మోదీ

ఈయన గుజరాత్ రాష్ట్రంలో పేరుపొందిన వజ్రాల వ్యాపారి. పంజాబ్ నేషనల్ బ్యాంకు ను ఈయన నిండా ముంచారు. నకిలీ పాత్రలతో దాదాపు 13758 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. లండన్ పారిపోయారు.. ప్రస్తుతం లండన్ జైల్లో ఉంటున్నారు. అయితే లండన్ ప్రభుత్వం తనను భారతదేశానికి అప్పగించకుండా ఉండడానికి న్యాయపోరాటం చేస్తున్నారు.

మోహుల్ చోక్సీ

ఈయన గీతాంజలి జెమ్స్ కు అధినేతగా ఉండేవారు. అయితే ఈయన కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను నిండా ముంచారు. 13వేల కోట్ల స్కాంకు పాల్పడ్డారు. ఈ స్కాం బయటపడుతున్న నేపథ్యంలో తెలివిగా ఆంటిగ్వా దేశానికి వెళ్లిపోయారు. అక్కడ పౌరసత్వం తీసుకున్నారు. పైగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.

విజయ్ మాల్యా

కింగ్ఫిషర్ కంపెనీకి వ్యవస్థాపకులుగా ఉండేవారు. ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు యజమానిగా ఉండేవారు. ఈయన కింగ్ఫిషర్ ఎయిర్ లైన్స్ ద్వారా 9000 కోట్ల అప్పుల భారాన్ని తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకున్నారు. ఆ అప్పులను ఎగ్గొట్టి లండన్ లో ఉంటున్నారు

వీజీ సిద్ధార్థ

ఈయన 2019లో నేత్రావతి నదిలో దూకి చనిపోయారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణకు ఈయన స్వయానా అల్లుడు. సుమారు 7200 కోట్ల అప్పుల భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈయన కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు. మనదేశంలో చాలామందికి కాఫీ కల్చర్ ను ఈయన అలవాటు చేశారు. అప్పుల భారం పెరిగిపోవడం.. పెట్టుబడులు పెట్టినవారు ఒత్తిడి తీసుకురావడంతో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈయన భార్య కాఫీ డే ను టేక్ ఓవర్ చేసుకొని అప్పుల భారాన్ని మొత్తం తగ్గించారు. తెలివిగా సంస్థను నడిపిస్తున్నారు.

సత్యం రామలింగరాజు

ఐటి రంగంలో తెలుగు వ్యక్తిగా.. అధునాతన శక్తిగా ఆవిర్భవించారు రామలింగరాజు. సత్యం కంప్యూటర్స్ ఏర్పాటు చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు. కంపెనీ లాభాలను.. బ్యాంకు బ్యాలెన్స్లను అధికంగా చూపించి పెట్టుబడిదారులను మోసం చేశారు. 2009లో ఈ తప్పును స్వయంగా ఆయనే అంగీకరించారు. జైలుకు కూడా వెళ్లారు. ఈ స్కాం విలువ దాదాపు 7136 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.

హర్షద్ మెహతా

ఈయనను స్టాక్ మార్కెట్ చరిత్రలో బిగ్ బుల్ అని పిలిచేవారు. బ్యాంకింగ్ సిస్టంలో అనేకలోసుగులను ఈయన వాడుకున్నారు. నకిలీ బ్యాంకు రసీదుల ద్వారా మార్కెట్ మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకునేవారు. కుంభకోణం బయటపడిన తర్వాత ఆయన అసలు కోణం వెలుగులోకి వచ్చింది.. దాదాపు 4వేల కోట్ల వరకు ఈయన అక్రమాలకు పాల్పడ్డారు. దీనిని 1992 స్టాక్ మార్కెట్ కుంభకోణం అని పిలుస్తుంటారు. ఇటీవల ఆయన జీవితం జైలులో ముగియడం విశేషం.

వాస్తవానికి వీరందరినీ కూడా ఒకప్పుడు విజయానికి చిరునామాగా పేర్కొనేవారు. మీడియా కూడా వీళ్ళ వార్తలను విపరీతంగా ప్రసారం చేసేది. వీరి విజయవంతమైన కథలను గాధలను గొప్పగా ప్రచురించేది. చేసిన తప్పు వల్ల.. ఆర్థిక అవకతవకలవల్ల చివరికి వీరి పరిస్థితి ఇలా మారిపోయింది.

11,000 పెడితే.. 65 కోట్లు వచ్చాయి.. అదృష్టం అంటే ఈమెదే పో

Kanika Arora UAE Big Ticket Lottery
Kanika Arora UAE Big Ticket Lottery

Kanika Arora UAE Big Ticket Lottery: శీర్షిక చదివారు కదా.. ఇంకా చెప్పాల్సిందేముంది.. అదృష్టం అంటే ఎలా ఉంటుందో.. ధనలక్ష్మి తలుపు తడితే ధన ప్రవాహం ఎలా సాగుతుందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. 11000 పెడితే ఒకటి కాదు రెండు కాదు 65 కోట్లు వచ్చాయి. ఇదేదో పదిమందిని మోసం చేస్తే వచ్చిన డబ్బు కాదు. మాయమాటలు చెప్పి ముంచేస్తే వచ్చిన డబ్బు కాదు. సహనాన్ని నమ్ముకుని.. ఓపికను ప్రదర్శించి.. సానుకూల దృక్పథాన్ని అలవర్చుకుంటే వచ్చింది.

ఆమె పేరు కనిక అరోరా. వివాహమైంది. భర్తతో కలిసి ఢిల్లీలో నివాసం ఉంటున్నది. ఈమె భర్త ఓ ప్రవేట్ సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. మధ్యతరగతి కుటుంబం. ఎన్నో ఆశలు ఉన్నాయి. మరి ఎన్నో ఆకాంక్షలు ఉన్నాయి ఈమెకు. కాకపోతే ఆర్థిక నేపథ్యం సరిపోవడం లేదు కాబట్టి ఆశలను, ఆకాంక్షలను వాయిదా వేసుకుంటూ వస్తున్నది. ఈ నేపథ్యంలో ఆమెకు యూ ట్యూబ్ ద్వారా యూఏఈ బిగ్ టికెట్ లాటరీ గురించి తెలిసింది. దీంతో ఆ విషయాన్ని తన భర్తకు చెప్పింది.. ప్రతినెల బిగ్ టిక్కెట్ లాటరీ లో 11000 పెట్టి కనికా టికెట్ కొనుగోలు చేసేది. అయితే ప్రతి సందర్భంలో తన భర్త పేరు మీద మాత్రమే ఆమె టికెట్ కొనుగోలు చేసేది. ఈసారి తన పేరు మీద టికెట్ కొనుగోలు చేసింది.. దాని గురించి మర్చిపోయింది.. మొత్తానికి వారి సహనానికి.. వారి ఓపికకు ప్రతిఫలం లభించింది. కనిక కొనుగోలు చేసిన టికెట్ కు లాటరీ తగిలింది. అది కూడా తీగంగా 65 కోట్లు. ఈ విషయాన్ని కనిక భర్త చెప్పడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

“ప్రతి నెల టికెట్ రిలీజ్ కాగానే కొనుగోలు చేస్తున్నాం. ప్రతి నెలలో కూడా నా భర్త పేరు మీద టికెట్ కొనుగోలు చేసేవాళ్లం. అయితే ఈసారి నా పేరు మీద టికెట్ కొనుగోలు చేశాం. ఊహించని విధంగా లాటరీ తగిలింది. ఆ లాటరీలో నా పేరు వచ్చింది. కొత్తగా 65 కోట్లు గెలుచుకున్నామని నా భర్త చెప్పగానే ఆనందంగా అనిపించింది. ఈ డబ్బుతో చాలా కలలు నెరవేర్చుకోవాలి. చాలా ఆకాంక్షలను నిజం చేసుకోవాలని ఉంది. ఈ డబ్బులో చాలా భాగం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు పెడతాం. కొంతమేర ఖరీదైన ఇల్లు కొనుగోలు చేస్తాం. బంగారం ఇతర వస్తువులు కూడా కొనుగోలు చేసుకోవాలి. సేవ కార్యక్రమాలు కూడా జరపాలని ఉంది. ఇవన్నీ కూడా ఎప్పటినుంచో అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు డబ్బు వచ్చింది కాబట్టి ఈ పనులు మొత్తం చేయాల్సి ఉందని” కనిక చెప్పింది.

యూఏఈ లో బిగ్ టికెట్ లాటరీ కి మంచి పేరు ఉంది. అక్కడి ప్రభుత్వం దీనిని నిర్వహిస్తూ ఉంటుంది. ప్రతినెల కూడా లాటరీ తీసి విజేతను ప్రకటిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా యూట్యూబ్ వేదికగా జరుగుతూ ఉంటుంది. యూట్యూబ్ లోనే ఆ లాటరీ టికెట్ నెంబర్ ను నిర్వాహకులు బయట పెడతారు. తద్వారా విజేతలను ప్రకటిస్తారు. అయితే ఈ లాటరీ టికెట్ కోసం ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా డిమాండ్ ఉంటుంది. పైగా ప్రైజ్ మనీ కూడా భారీగా ఉండడంతో చాలామంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. అయితే ఈ నెలలో కనికకు ఆ అదృష్టం లభించింది. అది కూడా 65 కోట్ల రూపాయల అదృష్టం.

ఈ ఐదురాశుల వారికి ఈరోజు మహాశివుడి ఆశీస్సులు.. ఇంట్లో ధన పండుగ జరిగే అవకాశం..

Today 6 July 2026 Horoscope
Today 6 July 2026 Horoscope

Today 6 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై పూర్వాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా శుభయోగాలు ఉండే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు ఆకస్మిక దన లాభం ఉండనుంది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో ప్రశంశాలు పొందుతారు. కొందరికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. సూర్య దేవుడి అనుగ్రహం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు మిత్రుల సహాయం ఉంటుంది. కొందరు అప్పల నుంచి బయటపడతారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే వాహనాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు కొత్త అవకాశాలను పొందుతారు. ఉద్యోగులు తమ ప్రాజెక్టులను అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ఇతరుల సహాయం తీసుకుంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అభిప్రాయ బేధాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండడమే మంచిది. వ్యాపారులు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు శుభవార్తలు అందే అవకాశం ఉంటుంది. దూరపు బంధువులు ఇంటికి రావడంతో సందడిగా ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు పదోన్నతి కోసం ఎదురు చూస్తే శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త వ్యక్తులను కలుస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేయడం వల్ల మానసికంగా సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెండింగు పనులను పూర్తి చేసుకుంటారు.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. గ్రహాల అనుకూలతతో అనుకున్న పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని చూసే వ్యాపారులకు ఇదే మంచి సమయం.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి అనుకున్న పనుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. పాత బకాయిల నుంచి విముక్తి కలుగుతుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం సాగుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. విద్యార్థులు భవిష్యత్తు పై కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. తోటి వారి సహాయంతో ఉద్యోగులు ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగులకు అధికారుల నుంచి మద్దతు ఉండడంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. ఇంటికి అతిధులు రావడంతో సందడిగా ఉంటుంది. వ్యాపారులకు ప్రత్యర్థులతో కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు విదేశాల్లో కంపెనీలు పెట్టాలని అనుకుంటే ఇదే మంచి సమయం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేయడానికి ఇదే మంచి సమయం. ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. అయితే ఈ సమయంలో పెద్దలను సంప్రదించడం మంచిది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి బంధువుల సహాయం ఉంటుంది. అప్పుల నుంచి బయటపడే అవకాశం ఏర్పడుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. శుభయోగం వల్ల కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్త పనులను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతారు. వ్యాపారులకు ఇతర భాగస్వాముల సహాయం ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. బదిలీల విషయంలో కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. దీంతో ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం.

EPFO ఉన్న ఉద్యోగులకు ఇది తప్పనిసరి.. లేకుంటే..

EPFO Inactive Accounts Claim Process
EPFO Inactive Accounts Claim Process

EPFO new rules : ఉద్యోగులు తమ భవిష్యత్ కోసం దాచుకునే డబ్బు సదుపాయాన్ని ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) అంటారు. ఇప్పుడు ఈఫీఎఫ్ వో సభ్యులకు మరింత సులభమైన, సురక్షితమైన సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త యూనిఫైడ్ EPFO పోర్టల్‌లో పలు కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా UAN యాక్టివేషన్, ఆధార్ ధ్రువీకరణ, డెత్ క్లెయిమ్ వంటి సేవల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ విషయాలను ప్రతీ ఈపీఎఫ్ వో ఉద్యోగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వివరాల్లోకి వెళితె..

UAN యాక్టివేషన్ ఇక..
ఇప్పటి వరకు EPFO సభ్యులు తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) మర్చిపోయినా.. లేదా యాక్టివేట్ చేయాల్సి వచ్చినా నేరుగా EPFO పోర్టల్‌లోనే ఆ సౌకర్యం ఉండేది. ఇందులో తమ వివరాలు అందించి మాడిఫికేషన్ చేసుకునేవారు. అయితే ఇప్పుడు కొత్త మార్పులతో ఆ ఫీచర్‌ను పోర్టల్ నుంచి తొలగించారు. ఇకపై UAN యాక్టివేషన్ లేదా సంబంధిత సేవలను UMANG యాప్ ద్వారానే పొందాల్సి ఉంటుంది. దీంతో అన్ని ప్రభుత్వ సేవలను ఒకే వేదికపై అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆధార్ ఆధారిత అథెంటికేషన్ తప్పనిసరి..
కొత్త యూనిఫైడ్ పోర్టల్‌లో సభ్యుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. అందులో భాగంగా ఆధార్ బేస్డ్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేశారు. సభ్యుల వివరాలు, క్లెయిమ్‌లు, ఖాతా సంబంధిత సేవలు పొందేందుకు ఆధార్‌తో ధ్రువీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో నకిలీ క్లెయిమ్‌లు, మోసాలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

డెత్ క్లెయిమ్ ఫెసిలిటీకి ప్రత్యేక సౌకర్యం..
EPFO సభ్యుడు మరణించిన సందర్భంలో కుటుంబ సభ్యులు లేదా నామినీలు నిధులను పొందేందుకు ఇప్పుడు కొత్త పోర్టల్‌లో ప్రత్యేకంగా డెత్ క్లెయిమ్ ఫెసిలిటీని అందుబాటులో ఉంచారు. దీంతో కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసి ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి క్లెయిమ్‌ను సులభంగా సమర్పించవచ్చు.

డిజిటల్ సేవలకు ప్రాధాన్యం
కొత్త పోర్టల్‌లో సభ్యులకు అవసరమైన అనేక సేవలను పూర్తిగా డిజిటల్ రూపంలో అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఖాతా వివరాల పరిశీలన, KYC అప్‌డేట్, నామినేషన్, క్లెయిమ్ దరఖాస్తులు, ట్రాకింగ్ వంటి సేవలను మరింత వేగంగా పూర్తి చేసేలా వ్యవస్థను రూపొందించారు. దీంతో సేవల కోసం కార్యాలయాలను ఆశ్రయించే అవసరం తగ్గనుంది.

సభ్యులకు కలిగే ప్రయోజనాలు
కొత్త మార్పులతో EPFO సేవలు మరింత పారదర్శకంగా, సురక్షితంగా మారనున్నాయి. ఆధార్ ఆధారిత ధ్రువీకరణ వల్ల ఖాతా భద్రత పెరుగుతుంది. UMANG యాప్ ద్వారా UAN సేవలు సులభంగా పొందవచ్చు. అలాగే డెత్ క్లెయిమ్ వంటి కీలక సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రావడంతో కుటుంబ సభ్యులకు సమయం, శ్రమ రెండూ ఆదా కానున్నాయి.

ఏం చేయాలి?
EPFO సభ్యులు తమ ఆధార్, మొబైల్ నంబర్, బ్యాంక్ వివరాలు, KYC సమాచారాన్ని తాజాగా ఉంచుకోవాలి. అలాగే UMANG యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని UAN సంబంధిత సేవలను వినియోగించుకోవడం మంచిది. కొత్త యూనిఫైడ్ EPFO పోర్టల్‌లోని మార్పులను తెలుసుకుని వాటికి అనుగుణంగా ఖాతాను నిర్వహిస్తే భవిష్యత్తులో సేవలు మరింత సులభంగా పొందే అవకాశం ఉంటుంది.

 

 

వాకింగ్‌కు కొత్త వెర్షన్.. 'రకింగ్'.. వేగంగా బరువు తగ్గొచ్చట.. అసలేంటిది..

Walking
Walking

Rucking : ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజూ వాకింగ్ చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే ఇటీవల ఫిట్‌నెస్ ప్రపంచంలో ‘రకింగ్ (Rucking)’ అనే కొత్త వ్యాయామ విధానం ట్రెండ్ అవుతోంది. సైనికులు ఎన్నో ఏళ్లుగా అనుసరిస్తున్న ఈ పద్ధతి ఇప్పుడు సాధారణ ప్రజల్లోనూ ప్రాచుర్యం పొందుతోంది. ఈ పద్ధతి పాటించడం వల్ల సాధారణ వాకింగ్ కంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. అసలేంటీ రకింగ్? దీనిని ఎలా చేయాలి?

రకింగ్ అంటే ఏమిటి?
రకింగ్ అనేది వీపుపై బరువున్న బ్యాక్‌ప్యాక్ ధరించి నడిచే వ్యాయామం. ఇందులో శరీర సామర్థ్యానికి తగ్గట్టుగా బ్యాగ్‌లో బరువు పెట్టుకుని నిర్ణీత దూరం లేదా సమయం పాటు నడుస్తారు. ఇది కార్డియో వ్యాయామంతో పాటు కండరాలపై కూడా ప్రభావం చూపే ఫుల్ బాడీ వర్కౌట్‌గా పరిగణిస్తారు. సాధారణ వాకింగ్‌లో శరీర బరువును మాత్రమే మోస్తూ నడుస్తాం. కానీ రకింగ్‌లో అదనపు బరువును మోయాల్సి ఉండటంతో కాళ్లు, నడుము, వీపు, భుజాలు, పొత్తికడుపు కండరాలు మరింతగా పనిచేస్తాయి. దీనివల్ల శరీరం ఎక్కువ శక్తిని వినియోగించి ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తుంది. అందుకే తక్కువ సమయంలోనే మంచి ఫిట్‌నెస్ ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుంది.

గుండె ఆరోగ్యానికి మంచి వ్యాయామం
రకింగ్ వల్ల గుండె వేగం క్రమంగా పెరిగి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీని వల్ల గుండె కండరాలు బలపడటంతో పాటు హృదయ సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తుల పనితీరు కూడా మెరుగుపడి శరీరంలో ఆక్సిజన్ సరఫరా సమర్థవంతంగా జరుగుతుంది.

బరువు తగ్గడంలో ప్రభావవంతం
బరువు తగ్గాలనుకునే వారికి రకింగ్ మంచి ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు. అదనపు బరువును మోస్తూ నడవడం వల్ల సాధారణ వాకింగ్‌తో పోలిస్తే ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. దీంతో కొవ్వు కరుగుదల వేగవంతమై బరువు తగ్గే ప్రక్రియకు సహాయపడుతుంది. అదే సమయంలో కండరాల బలం కూడా పెరగడం దీని మరో ప్రత్యేకత.

ఎలా ప్రారంభించాలి?
మొదటిసారి రకింగ్ చేసే వారు భారీ బరువుతో ప్రారంభించకూడదు. వైద్యులు, ఫిట్‌నెస్ నిపుణుల సూచన ప్రకారం శరీర బరువులో 5 నుంచి 10 శాతం వరకు మాత్రమే బరువు ఉన్న బ్యాగ్‌తో ప్రారంభించడం మంచిది. ఉదాహరణకు 60 కిలోల బరువు ఉన్న వ్యక్తి 3 నుంచి 6 కిలోల బరువుతో మొదలు పెట్టవచ్చు. క్రమంగా శరీరం అలవాటు పడిన తర్వాత బరువును కొద్దికొద్దిగా పెంచుకోవచ్చు.

జాగ్రత్తలు తప్పనిసరి
రకింగ్ చేసే సమయంలో నాణ్యమైన బ్యాక్‌ప్యాక్‌ను ఉపయోగించాలి. బరువు రెండు భుజాలపై సమానంగా పడేలా బ్యాగ్‌ను సర్దుకోవాలి. నడుస్తున్నప్పుడు శరీరాన్ని నిటారుగా ఉంచి, సరైన భంగిమలో నడవడం అవసరం. మోకాళ్లు, నడుము లేదా వెన్నెముక సమస్యలు ఉన్నవారు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే రకింగ్ ప్రారంభించాలి.

ఎవరికి అనుకూలం?
ఫిట్‌నెస్‌ను మెరుగుపరచుకోవాలనుకునే వారు, బరువు తగ్గాలనుకునే వారు, సాధారణ వాకింగ్‌ను మరింత సవాలుగా మార్చుకోవాలనుకునే వారికి రకింగ్ మంచి ఎంపిక. అయితే ప్రారంభంలో తక్కువ బరువుతో, తక్కువ దూరం నడిచి క్రమంగా వ్యాయామ తీవ్రతను పెంచుకుంటేనే పూర్తి ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

 

 

 

AMOLED డిస్‌ప్లేలు..పెద్ద బ్యాటరీలు.. అయినా ఈ ఫోన్లు రూ.20 వేల లోపే..

best smartphones under 20000

best smartphones under 20000 : ప్రస్తుత కాలంలో మొబైల్ ధరలు లక్ష రూపాయలకు పైగానే ఉంటున్నాయి. అయితే ఇప్పుడు కూడా కొందరు బడ్జెట్ లో మొబైల్ కొనాలని చూసేవారు లేకపోలేదు. రోజూవారీ వినియోగంతో పాటు కాస్త రగ్గడ్ గా ఉపయోగించేవారు తక్కువ ధరలోనే ఫోన్ కొనాలని అనుకుంటారు. అలాంటి వారికి 2026లో రూ. 20,000 బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్‌ లు మార్కెట్లోకి వచ్చాయి. ఇవి తక్కువ ధరలు అయినప్పటికీ అద్భుతమైన AMOLED డిస్‌ప్లేలు, హై రిఫ్రెష్ రేట్, పవర్‌ఫుల్ ప్రాసెసర్లు, పెద్ద బ్యాటరీల వంటి ప్రీమియం ఫీచర్లను కంపెనీలు అందిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 4 స్మార్ట్‌ఫోన్ల పూర్తి వివరా ఇవే..

Poco M8
పోకో బ్రాండ్ నుంచి వచ్చిన పోకో M8 బడ్జెట్ ధరలో అద్భుతమైన డిస్‌ప్లే, పనితీరును అందిస్తోంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇచ్చే 6.77 అంగుళాల Full HD ప్లస్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనిలో అమర్చిన Snapdragon 6 Gen 3 ప్రాసెసర్ రోజువారీ పనులను చాలా స్మూత్‌గా రన్ చేస్తుంది. కెమెరా విషయానికి వస్తే, ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్‌తో పాటు 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 20MP ఫ్రంట్ కెమెరాను అందించారు. దీని ధర రూ. 14,999 గా ఉంది.

Realme Narzo 90
భారీ బ్యాటరీ, సూపర్ సెల్ఫీ కెమెరా కోరుకునే వారికి రియల్ మీ నాజ్రో 90 ఒక బెస్ట్ ఆప్షన్. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.57 అంగుళాల Full HD ప్లస్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ ప్రాసెసర్ ఉపయోగించారు. ఇందులో ఏకంగా 50MP సెల్ఫీ కెమెరాను అందించారు. వెనుక వైపు 50MP ప్రైమరీ, 2MP మోనోక్రోమ్ కెమెరాలు ఉన్నాయి. అంతేకాకుండా, 60W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే భారీ 7,000mAh బ్యాటరీ దీని సొంతం. దీనిని రూ. 17,999తో కొనుగోలు చేయొచ్చు.

Moto G37 Power
మోటొరోలా నుంచి మొబైల్స్ కొనాలని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చిన మోడల్ Moto G37 Power. ఈ ఫోన్లో 6.7 అంగుళాల HD ప్లస్ LCD డిస్‌ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ రోజువారీ సాధారణ వినియోగానికి చాలా చక్కగా సరిపోతుంది మరియు ఇందులో మీరు నార్మల్ గేమింగ్ కూడా సులువుగా ఆడుకోవచ్చు. క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని ఆశించేవారికి ఇది మంచి ఎంపిక. రూ. 12,999 తో ఈ మొబైల్ కొనుగోలు చేయొచ్చు.

Samsung Galaxy M36
శాంసంగ్ అంటే చాలా మందికి నమ్మకమైన బ్రాండ్. ఈ కంపెనీ నుంచి Samsung Galaxy M36 ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.55 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది పవర్‌ఫుల్ Samsung Exynos 1380 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే.. ఇందులో వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరా ఉంచారు. 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్ అనే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 13MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ధర దాదాపు రూ. 18,999 గా ఉంది.

బెస్ట్ డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్ కావాలంటే Poco M8, భారీ బ్యాటరీ మరియు అదిరిపోయే సెల్ఫీ కెమెరా కావాలంటే Realme Narzo 90, తక్కువ బడ్జెట్‌లో కావాలంటే Moto G37 Power, అలాగే నమ్మకమైన బ్రాండ్ మరియు మంచి కెమెరా సెటప్ కోసం Samsung Galaxy M36 ఫోన్లను మీ అవసరాలకు తగ్గట్టుగా ఎంచుకోవచ్చు.

నాలుగు పార్టీలు మారిన మాజీ ఎమ్మెల్యే.. 31 కోట్ల భూ వ్యవహారం.. ఇలా బయటకొచ్చింది..

former-ysrcp-mla-rs-31-crore-land

YSRCP EX MLA : ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే టికెట్ అడిగారు. చంద్రబాబు కుదరదని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అక్కడ కూడా ఆయన ఆశించిన స్థాయిలో జరగలేదు. ఆ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్లారు. అక్కడ పొలిటికల్ ఫ్యూచర్ లేదని అర్థమైంది. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లిపోయారు. ఏం మాయ చేసారో తెలియదు.. టికెట్ వచ్చింది.. ఎమ్మెల్యే అయ్యారు.

ఎమ్మెల్యే అయిన తర్వాత నోటికి పని చెప్పారు. చేతికి కూడా పని చెప్పారు. ఏపీలో తన నియోజకవర్గ పరిధిలో భూ వ్యవహారాలలో అంతకుమించిన పాత్ర పోషించారు. ఆ తర్వాత తెలంగాణలో గండిపేట ప్రాంతాన్ని తనకు స్థావరం గా మార్చుకున్నారు. అక్కడ చాలావరకు భూములను కొనుగోలు చేశారు. కొన్ని ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించారు. 10 సంవత్సరాలపాటు భారత రాష్ట్ర సమితి నాయకులతో కీలకంగా వ్యవహరించారు. దీంతో ఆయన భూ అతిక్రమణలకు అడ్డు లేకుండా పోయింది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది.. ఈయన మీద ఫోకస్ పడింది. భూ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించడంతో ఈయన అక్రమణలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఈ మాజీ ఎమ్మెల్యే మీద కేసులు కూడా నమోదయ్యాయి. ఆ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఈయనను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు తర్వాత వైసిపి నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఈయనతో తమ పార్టీకి సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరించింది. అరెస్టు కాకముందు ఈ మాజీ ఎమ్మెల్యే తన నోటికి పని చెప్పారు. ఇటీవల టీీడీపీ ఎంపీ మీద ఇష్టానుసారంగా మాట్లాడారు. ఆయన చేయని పనులు కూడా చేసినట్టు చెప్పారు..

సహజంగానే ఆ ఎంపీ సాత్వికుడు. పెద్దగా పరుష పదజాలం ఉపయోగించరు. కానీ ఓ మీడియా సంస్థ ఆ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఆ ఎంపీ తెరమీదకి వచ్చారు. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ మాజీ ఎమ్మెల్యే భూభాగోతాలను ఏకరవు పెట్టారు. అక్కడితో ఆ ఎంపీ ఆగలేదు. సదరు మాజీ ఎమ్మెల్యే హైదరాబాద్ నగరంలో గండిపేట ప్రాంతంలో ఒక భూమి వ్యవహారంలో వేలు పెట్టిన విషయం.. ఆ భూమిని తిరిగి ఇచ్చేయడానికి 31 కోట్లు వసూలు చేసిన విషయాన్ని ఆ ఎంపీ బయటపెట్టారు. పైగా ఈ డబ్బులను రామోజీ ఫిలిం సిటీ వెనుక ఉన్న ఓ ప్రాంతంలో తీసుకున్నట్టు ఆ ఎంపీ సాక్షాలతో సహా బయటపెట్టారు. 31 కోట్లను వసూలు చేసిన నేపథ్యంలో ఈడికి కంప్లైంట్ చేయాల్సి ఉంటుందని.. ఆ తర్వాత ఆ మాజీ ఎమ్మెల్యే ముఖచిత్రం ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తాను అంటూ ఆయన అనుచరులకు ఆ ఎంపీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ ఎంపీ మాట్లాడిన మాటలు.. ఆ మాజీ ఎమ్మెల్యే భూమి వ్యవహారాలకు సంబంధించిన వివరాలు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి. మరి దీనిపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

ఒకే ఒక్క పోస్ట్.. సోషల్ మీడియాను దున్నేస్తున్నాడు.. ఇదీ సూర్య వంశీ రేంజ్..

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : సచిన్ కంటే చిన్న వయసులోనే టీమ్ ఇండియాలోకి అడుగుపెట్టాడు వైభవ్ సూర్య వంశీ. తద్వారా తన పేరు మీద ఎవరు ఇప్పట్లో బద్దలు కొట్టలేని రికార్డును సృష్టించుకున్నాడు. వైభవ్ సూర్య వంశీ కి రికార్డులు కొత్త కాదు. ఘనతలు కూడా కొత్త కాదు. తను ఏమిటో అండర్ 19 వరల్డ్ కప్ లో తెలిసింది. ఐపీఎల్ లో తెలిసింది. తాజాగా శ్రీలంక వేదికగా జరిగిన ట్రై సిరీస్ లో కూడా తెలిసింది. లెజెండ్ సినిమాలో.. బాలకృష్ణ.. నీకు నరుకుతుంటే అలుపు వస్తదేమో.. నాకు ఊపు వస్తుంది.. అని జగపతిబాబును ఉద్దేశించి అంటాడు గుర్తుంది కదా.. క్రికెట్లో సూర్య వంశీ బ్యాటింగ్ కూడా అలానే ఉంటుంది. అన్ని రకాల బంతులు వేసి బౌలర్లకు అలుపు వస్తుందేమో.. కానీ కొడుతుంటే మాత్రం అతడికి ఊపు వస్తుంది. ఐపీఎల్ లో అదే కదా అతడు చూపించింది..

తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టి20 సిరీస్లో రెండో మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగు పెట్టాడు సూర్య వంశీ. అత్యంత చిన్న వయసులోనే టీమ్ ఇండియాలో ప్రవేశించిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. తొలి మ్యాచ్లో అతడు కేవలం 14 పరుగులు మాత్రమే చేయవచ్చు గాక.. కానీ ఆర్చర్ బౌలింగ్లో కొట్టిన సిక్సర్ ఎప్పటికీ మర్చిపోరు. అతడు ఒళ్ళును విల్లులాగా వంచి కొట్టిన తీరు కు ఆర్చర్ కూడా ఫిదా అయిపోయాడు. కేవలం పది బంతుల్లోనే అతడు 14 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ.. టీమిండియా ఈ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ.. సూర్య వంశీ మీద అంచనాలు ఏమాత్రం తగ్గలేదు. పైగా అతడు సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు మొత్తం సంచలనంగా మారింది.

సూర్య వంశీ కి ఇప్పటికే మిలియన్లలో ఫ్యాన్స్ ఉన్నారు. వారంతా కూడా సోషల్ మీడియాలో అతడిని అనుసరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటివరకు కేవలం తన ఫోటోలు మాత్రమే పెట్టేవాడు సూర్య వంశీ. తొలిసారిగా ఒక పోస్ట్ పెట్టాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాను మొత్తం దున్నేస్తోంది…”మీ ద్వారా వస్తున్న సందేశాలు నన్ను ఉద్వేగానికి గురిచేస్తున్నాయి. వాటిని చూసి నేను తన్మయత్వానికి గురవుతున్నాను. అది నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. నాకు మీరు మద్దతు ఇస్తున్నారు. అండగా నిలబడుతున్నారు. మీ ప్రేమకు.. మీ ఆప్యాయతకు ధన్యవాదాలు.. నా సీనియర్లకు.. శ్రేయోభిలాషులకు పేరుపేరునా కృతజ్ఞతలు. దేశానికి ఆడే అవకాశం రావడం ఒక జీవితకాల అదృష్టం. ప్రతి సందర్భంలోనూ దేశం కోసం అన్న అత్యుత్తమ ఆటతీరు అందించాలని కోరుకుంటాను. మీ అందరికీ నా ధన్యవాదాలు” అంటూ సూర్య వంశీ తన ఇన్ స్టా స్టోరీలో పేర్కొన్నాడు.

1989లో సచిన్ టెండూల్కర్ 16 సంవత్సరాల 205 రోజుల వయసులో టీమిండియాలో చోటు సంపాదించాడు. పాకిస్తాన్ జట్టుతో టెస్ట్ ఆడి సరికొత్త రికార్డు సృష్టించాడు. మళ్లీ ఇన్ని సంవత్సరాలకు ఆ రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. 35 సంవత్సరాలుగా చెక్కుచెదరని విధంగా ఉన్న సచిన్ రికార్డును అతడు బ్రేక్ చేశాడు. 10 సంవత్సరాల 99 రోజుల వయసులో వైభవ్ సూర్య వంశీ జాతీయ జట్టులోకి ప్రవేశించాడు.

Vaibhav Suryavanshi

పాకిస్తాన్ ను బెంబేలెత్తిస్తున్న బలోచ్ వీరులు.. ఉలిక్కిపడిన చైనా

Balochistan

Balochistan : పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో దశాబ్దాలుగా కొనసాగుతున్న స్వాతంత్య్ర ఉద్యమం ఇప్పుడు కొత్త రూపం తీసుకుంది. బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) పాకిస్తాన్‌ భద్రతా దళాలను మాత్రమే కాకుండా, చైనా ప్రయోజనాలను కూడా నేరుగా లక్ష్యంగా చేసుకుంటోంది. ఇటీవలి దాడులు ఈ మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయి. చైనా–పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ (సీపీఈసీ) ప్రాజెక్టుల భద్రతపై ఇది తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది.

జివానీలో దాడి..
గ్వాదర్‌ పోర్టు సమీపంలోని జివానీ ప్రాంతంలో జరిగిన ఇటీవలి ఘటనలో బీఎల్‌ఏ పాకిస్తాన్‌ సైన్యానికి చెందిన రాడార్‌ స్టేషన్, ఎయిర్‌ స్టేషన్‌ ఔట్‌పోస్టుపై దాడి చేసింది. ఈ ప్రాంతానికి సమీపంలో చైనాకు సంబంధించిన స్థావరం ఉండటం వల్ల ఈ దాడి చైనాపై కూడా ఉద్దేశపూర్వకంగా జరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గ్వాదర్‌ పోర్టుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ దాడి, హార్ముజ్‌ జలసంధికి సమీపంలో ఉండటం వల్ల వ్యూహాత్మక ప్రాధాన్యతను సంతరించుకుంది. బీఎల్‌ఏ మందుగుండు వాహనంతో ఆత్మాహుతి దాడి చేసినట్లు సమాచారం. దీంతో పాకిస్తాన్‌ భద్రతా దళాల్లో భారీ ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు బీఎల్‌ఏ నాలుగైదు ప్రధాన వంతెనలను పేల్చివేసి, ఇప్పుడు తీర భద్రతా దళాలపై కూడా దాడులు చేస్తోంది. బీఎల్‌ఏ తన స్వంత నేవీ ఫోర్స్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటనలు వచ్చాయి. గతంలో కోస్ట్‌ గార్డ్‌ సిబ్బందిపై దాడులు జరిపి, ముగ్గురిని చంపినట్లు బీఎల్‌ఏ పేర్కొంది.

చైనాకు హెచ్చరిక..
చైనా ఇప్పటికే పాకిస్తాన్‌ భద్రతా ఏర్పాట్లపై నమ్మకం కోల్పోయి, తన స్వంత రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంది. అయినప్పటికీ, ఇలాంటి ఘటనలు చైనా పెట్టుబడుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. చైనా–పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌లో కీలక భాగం. గ్వాదర్‌ పోర్టు ద్వారా చైనాకు అరేబియన్‌ సముద్రంలో ప్రత్యక్ష ప్రవేశం లభిస్తుంది. ఈ ప్రాంతంలో దాడులు పెరగడం వల్ల ప్రాజెక్టుల అమలు ఆలస్యం కావడం, ఖర్చులు పెరగడం, పెట్టుబడిదారుల నమ్మకం తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. బీఎల్‌ఏ దాడులు ఇప్పుడు చైనా నియంత్రణలో ఉన్నట్లు భావించే ప్రాంతాల్లోకి విస్తరించాయి. ఇది చైనా ప్రణాళికలను భంగపరచడమే కాకుండా, పాకిస్తాన్‌తో చైనా సంబంధాలను కూడా పరీక్షిస్తోంది. చైనా ఇప్పటికే ఉలిక్కిపడి, భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేసుకుంటోంది.

బీఎల్‌ఏ వ్యూహాత్మక దాడులు..
బీఎల్‌ఏ దాడులు ఇప్పుడు మరింత సంఘటితంగా, వ్యూహాత్మకంగా మారాయి. గ్వాదర్‌ పోర్టును తదుపరి టార్గెట్‌గా ఎంచుకోవచ్చని చర్చలు జరుగుతున్నాయి. బీఎల్‌ఏ తన దాడుల వీడియోలు, సాక్షాలతో సహా విడుదల చేస్తోంది. దీని వల్ల ప్రచారం విస్తృతంగా వ్యాపిస్తోంది. అయితే పాకిస్తాన్‌ అధికారులు ఈ ఘటనల గురించి బహిరంగంగా మాట్లాడడం లేదు. పత్రికల్లో కూడా విస్తృతంగా కవరేజ్‌ రావడం లేదు. ఇది ప్రభుత్వం దాడుల పరిమాణాన్ని తక్కువ చేయడానికి లేదా చైనా పెట్టుబడులపై నమ్మకం కల్పించడానికి చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తోంది. అయినప్పటికీ, బీఎల్‌ఏ ప్రచారం వల్ల వాస్తవాలు సామాజిక మాధ్యమాల్లో వ్యాపిస్తున్నాయి.

దాడుల వెనుక అమెరికా..
ఈ దాడుల నేపథ్యంలో అమెరికా బలూచ్‌ ఉద్యమానికి మద్దతు ఇస్తోందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది చైనా ప్రభావాన్ని అడ్డుకోవడానికి భాగంగా ఉండవచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇవి ఇప్పటికి అనుమానాలే. చైనా బలూచిస్తాన్‌ నుంచి వెళ్లిపోవాలనే ఉద్దేశంతో బీఎల్‌ఏ ఈ దాడులు చేస్తోందని కూడా భావన ఉంది. గ్వాదర్‌ పోర్టు, సమీప ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు కొనసాగితే, చైనా తన ప్రాజెక్టులను పునఃసమీక్షించవచ్చు లేదా భద్రతా ఖర్చులను బాగా పెంచవచ్చు.

బలూచిస్తాన్‌ సమస్య ఇప్పుడు స్థానిక స్థాయిని దాటి ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలను కలిగిస్తోంది. చైనా, పాకిస్తాన్‌ మధ్య సంబంధాలు బలంగా ఉన్నప్పటికీ, భద్రతా సవాళ్లు రెండు దేశాలను కూడా ఒత్తిడిలోకి తెస్తున్నాయి. బీఎల్‌ఏ దాడులు ఇలాగే కొనసాగితే, సీపీఈసీ ప్రాజెక్టుల వేగం మందగించడం, ప్రాంతీయ అస్థిరత పెరగడం తప్పదు. ఈ పరిస్థితి బలూచిస్తాన్‌లోని స్థానిక గుర్తింపు, వనరుల పంపిణీ సమస్యలను పరిష్కరించకపోతే, మరింత తీవ్రమవుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

 

అమీర్ ఖాన్ ౩వ భార్య గౌరీ స్ప్రాట్ ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ చూస్తే నోరెళ్లబెడుతారు..

Aamir Khan third marriage

Aamir Khan third marriage : ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నేడు మధ్యాహ్నం బాంద్రాలోని తన నివాసం లో గౌరీ స్ప్రాట్ ని వివాహం చేసుకున్నారు. 12 గంటల 45 నిమిషాలకు వీళ్లిద్దరి పెళ్లి కుటుంబ సభ్యులు , సన్నిహితుల సమక్షం లో జరిగింది. పెద్దగా హంగులు ఆర్భాటాలు లేకుండా, వీళ్లిద్దరు రిజిస్టర్ వివాహాన్ని చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అమీర్ ఖాన్ కి ఇది మూడవ పెళ్లి అనే సంగతి అందరికీ తెలిసిందే. 2021 వ సంవత్సరం లో కిరణ్ రావు కి విడాకులు ఇచ్చిన ఈయన , ఫాతిమా సనా షేక్ తో ప్రేమాయణం నడుపుతున్నాడని , ఆమెతో డేటింగ్ చేస్తున్నాడని రూమర్స్ వచ్చాయి, కానీ అందులో ఎలాంటి నిజం లేదని కాలం గడిచే కొద్దీ అందరికీ తెలిసొచ్చింది. అయితే ఇంతకీ ఎవరు ఈ గౌరీ స్ప్రాట్ ?, ఈమె బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ ఏంటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం.

గౌరీ స్ప్రాట్ బెంగళూరు ప్రాంతానికి చెందిన ఒక మహిళ. ఈమె వయస్సు 47 ఏళ్ళు. బెంగళూరు లో ఈమె ఒక పెద్ద వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ కన్సల్టెంట్ గా ఫేమస్. ఈమె తాత మన భారత దేశ స్వతంత్ర ఉద్యమానికి దోహదపడిన బ్రిటిష్ వ్యక్తి ఫిలిప్ స్ప్రాట్ మనవరాలు. బ్రిటిష్ దేశానికీ చెందినవాడు అయినప్పటికీ కూడా మన భారత దేశానికీ స్వాతంత్ర ఉద్యమం లో ఫిలిప్ ఎంతో తోడ్పాటుని అందించారు. గౌరీ స్ప్రాట్ బాల్యం మొత్తం లండన్ లోనే సాగింది. అక్కడి యూనివర్సిటీ ఆఫ్ ది ఆర్ట్స్ లో ఫ్యాషన్ , స్టైలింగ్ మరియు ఫోటోగ్రఫీ విభాగాల్లో డిగ్రీ పొందింది. ఇండియాలో ప్రఖ్యాతి గాంచిన BBlunt
సలోన్ లో ఒక డైరెక్టర్ గా పని చేసిన అనుభవం కూడా ఉంది. అదే విధంగా అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ కి ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పనిచేస్తూ వచ్చింది.

అలా రెండు దశాబ్దాలుగా వీళ్లిద్దరి మధ్య ఉన్న పరిచయం , స్నేహం ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకునేలా చేసింది. దీంతో విడాకులు తర్వాత అమీర్ ఖాన్ ఈమెతో సహజీవనం చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు అది పెళ్లి వరకు దారి తీసింది. అయితే సోషల్ మీడియా లో అమీర్ ఖాన్ మూడవ పెళ్లి పై ట్రోల్స్ భారీగానే జరుగుతున్నాయి. కానీ అమీర్ ఖాన్ వాటిని పట్టించుకోవడం లేదు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే ఈరోజు జరిగిన పెళ్ళికి అమీర్ ఖాన్ పిల్లలు కూడా హాజరు కావడం గమనార్హం.

స్పై ఫోన్.. సీక్రెట్ కోడ్స్.. ఇప్పుడు స్నాప్ చాట్.. కేతన్ ను లేపేసే ముందు సియా ఏం చేసిందో తెలుసా..

Siya Ketan Case
Siya Ketan Case

Siya Ketan case : ఆమె అమాయకురాలు కాదు. మహానటి.. కుటుంబ సభ్యుల ముందు నటించింది. కేతన్ అగర్వాల్ ముందు నటించింది. అతడు దగ్గరనుంచి కోటి రూపాయలు డబ్బు తీసుకుంది. కేతన్ అగర్వాల్ తల్లిదండ్రుల ముందు కూడా నటించింది. అతడిని రెండుసార్లు కోటకు తీసుకెళ్లింది. రెండుసార్లు కూడా అతడిని చంపే ప్రయత్నం విఫలమైంది. మూడోసారి బాలిదాకా వెళ్లాలి అనుకుంది. కానీ ఆ ప్లాన్ ప్లాఫ్ అయింది. చివరికి తన నటన కౌశలాన్ని ప్రదర్శించి కాబోయే వాడిని కోటకు తీసుకెళ్లింది. తన ప్రేమికుడితో లేపేసింది.

మూడో కంటికి తెలియకుండా చంపేశాం కాబట్టి ఇబ్బంది లేదు.. దొరికిపోయే అవకాశం లేదు అనుకుంది సియా. కానీ చేసిన ఘోరం.. ఎప్పటికీ దాగదు. ఒక చిన్న ఆధారం సియాను పట్టించింది. ఆమె ప్రియుడిని దొరికేలా చేసింది. ఆ తర్వాత ఈ కేసును ప్రత్యేక పోలీసుల బృందం దర్యాప్తు చేయడం మొదలుపెట్టింది. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సియా కేతన్ నుంచి కోటి రూపాయలు వసూలు చేయడం.. వాటిని తన ప్రియుడు చేతన్ కు ఇవ్వడం.. చేతన్ కూడా కేతన్ అగర్వాల్ ను చంపే క్రమంలో తన ఫోన్ వాడకపోవడం.. తన కారును పక్కనపెట్టి వేరే వ్యక్తి బైక్ ఉపయోగించడం.. తన దగ్గర పనిచేస్తున్న వ్యక్తి ఫోన్ వాడటం వంటివి చేశాడు. దీంతో ఈ కేసులో బలమైన ఆధారాలు పోలీసులకు లభించాయి. దీనికి తోడు సియా వాడిన స్పై ఫోన్.. కోడింగ్ లాంగ్వేజ్ వంటివి పోలీసులకు అనుమానం కలిగించాయి. ఆ తర్వాత వాటిని డీకోడ్ చేస్తుంటే అసలు విషయాలు వెలుగు చూస్తున్నాయి.

ఇప్పటిదాకా స్పై ఫోన్.. ఇతర ఆధారాలు మాత్రమే పోలీసులు సేకరించ గలిగారు. తాజాగా సియా స్నాప్ చాట్ లో జరిపిన ఓ సంభాషణ ఆమెను అడ్డంగా దొరికేలా చేసింది. స్నాప్ చాట్ లో సియా తన స్నేహితురాలికి వివాహ ఆహ్వానాన్ని పంపించింది. గెస్టులకు ఇచ్చే ఇంటర్ టికెట్ బుక్ చేసేందుకు ఆధార్ కార్డు పంపాలని ఆమెను కోరింది.. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎందుకంటే ఈ పెళ్లి జరగదని సియాకు తెలుసు. అదే విషయాన్ని స్నాప్ చాట్ లో ఆమె పేర్కొంది.. అంతేకాదు ఎలాగైనా సరే కేతన్ అడ్డు తొలగించుకోవాలని.. అతని శాశ్వతంగా వదిలించుకోవాలని సియా భావించింది. అందువల్లే స్నాప్ చాట్ లో ఈ పని చేసింది. వాస్తవానికి కేతన్ అంటే సియాకు ఇష్టం లేకపోయినప్పటికీ.. కుటుంబ సభ్యులు తీసుకురావడంతో ఆమె ఈ పని చేసినట్టు తెలుస్తోంది.. ఇప్పటికే సియా, చేతన్ ఫోన్ కాల్స్ ను పోలీసులు లోతుగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న సియా, చేతన్.. ఇప్పటికే అనేక విషయాలను చెప్పారు. ఇంకా ఈ కేసులో మరిన్ని నిజాలను రాబట్టడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.