Homeఆంధ్రప్రదేశ్‌Prakash Raj And Prashna Ravana: ప్రకాష్ రాజ్.. ప్రశ్న రావణ్.. ఈ కనెక్షన్ ఏంటి?

Prakash Raj And Prashna Ravana: ప్రకాష్ రాజ్.. ప్రశ్న రావణ్.. ఈ కనెక్షన్ ఏంటి?

Prakash Raj And Prashna Ravana: ఏపీలో ప్రశ్న రావణ్ అరెస్టు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు పవన్ కళ్యాణ్ పై ప్రశ్న రావణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కులం మాటున, మతం మాటున ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి. ఒక విధంగా దీని వెనుక కుల కుట్ర ఉందన్నది ప్రధాన ఆరోపణ. ఏపీలో కుల చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే రావణ్ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని, ముఖ్యంగా ఆయన సతీమణిని టార్గెట్ చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలతో లైవ్ పెడతానని జోసెఫ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే జోసెఫ్ రావణ్ వెనుక ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఉన్నారని ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రావణ్ అరెస్టు వెంటనే ప్రకాష్ రాజ్ స్పందించిన తీరు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

* ఉద్దేశపూర్వక కుట్ర..
జోసెఫ్ రావణ్ హిందుత్వాన్ని, హిందూ దేవుళ్లను టార్గెట్ చేయడం దగ్గర నుంచి.. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం పై బురద చల్లడం వరకు.. అంతా ఒక పద్ధతి ప్రకారం జరిగిన కుట్రగా పోలీసులు అనుమానిస్తున్నారు. దమ్ముంటే అరెస్టు చేసుకోండి అంటూ రావణ్ సవాల్ వెనుక ఉన్నది ప్రకాష్ రాజ్ అని పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసినట్లు ప్రచారం జరుగుతోంది. రావణును అరెస్టు చూపించలేదు. పోలీస్ స్టేషన్లకు తిప్పడం వెనుక లోతైన దర్యాప్తు అంశం ఉందని తెలుస్తోంది. అసలు కుట్ర దారులను బయటకు లాగడమే దీని ఉద్దేశ్యంగా భావిస్తున్నట్లు సమాచారం. పోలీసుల దర్యాప్తులో జోసెఫ్ రావణ్, ప్రకాష్ రాజ్ మధ్య జరిగిన ఓ రహస్య ఫోన్ కాల్ ఆడియో రికార్డింగ్ పోలీసుల చేతికి చిక్కినట్లు తెలుస్తోంది. ప్రశాంతంగా కూటమిపాలన కొనసాగుతుండగా.. కుల చిచ్చు పెట్టి ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేయడానికి ప్రకాష్ రాజ్ కేంద్రంగా సోషల్ మీడియా వ్యూహాలు సిద్ధమయ్యాయని ఆధారాలు లభిస్తున్నాయి.

* అంతా స్క్రిప్ట్ ప్రకారమే..
ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ పైనే ప్రకాష్ రాజ్ టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి జోసఫ్ రావణ్ ను పావుగా వాడుకోవాలని భావించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు కూటమి ప్రభుత్వాన్ని ఎలా టార్గెట్ చేయాలి? అరెస్టు చేస్తే ఎలా స్పందించాలి? అనే విషయాలపై ప్రకాష్ రాజ్ టీం జోసెఫ్ రావణ్ కు వెనుక ఉండి స్క్రిప్ట్ అందించిందని లీకులు పొలిటికల్ వర్గాలను షేక్ చేస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ నినాదం ఇవ్వడాన్ని ప్రకాష్రాజ్ తీవ్రంగా వ్యతిరేకించారు. దానిని వ్యతిరేకిస్తూ మనసులో పగను పెంచుకున్నారు ప్రకాష్ రాజ్. అందుకే జోసెఫ్ రావణ్ లాంటి వారితో పావులు కలిపినట్లు అర్థం అవుతుంది. ఒకవైపు ఆడియో కాల్స్ లీక్ కావడం, డిజిటల్ సాక్షాలు దొరకడంతో ప్రకాష్ రాజ్ ఈ వివాదంలో దాదాపు దొరికిపోయినట్లేనని తెలుస్తోంది. అయితే ప్రకాష్ రాజ్ హిందూ వ్యతిరేక ముద్ర ఇటీవల బయటపడింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై పెను ప్రభావం చూపాలన్న ప్రయత్నంలో ప్రత్యర్థులతో చేయి కలిపి ప్రకాష్ రాజ్ అడ్డంగా బుక్ అయినట్లు అర్థం అవుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper