Venkatesh Rajasekhar Differences: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య పోటీ వాతావరణం ఉంటుంది. ఎవరి సినిమాలు సక్సెస్ లను సాధిస్తున్నాయి. ఎవరి మూవీస్ డీలా పడిపోతున్నాయనే దానిమీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే సక్సెస్ ఫుల్ సినిమాలను తీసిన హీరోలు టాప్ రేంజ్ కి వెళ్తుంటే ప్లాప్ లను మూట గట్టుకున్న హీరోలు మాత్రం పాతాళానికి పడిపోతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే విక్టరీ వెంకటేష్ లాంటి హీరో సైతం కెరియర్ స్టార్టింగ్ లో వరుస సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధించాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసి ఆయన సినిమాలు చేయడమే కాకుండా సక్సెస్ లను కూడా సాధించాడు.
వాళ్ళని థియేటర్ కి రప్పించడంలో ఆయన కీలకపాత్ర వహించాడనే చెప్పాలి. వెంకటేష్ ఒక సినిమాని రీమేక్ చేయాలనుకున్నాడు. కానీ ఆ సినిమాని రాజశేఖర్ చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే ‘మా అన్నయ్య’ మూవీ కావడం విశేషం…
తమిళంలో విక్రమన్ దర్శకత్వంలో విజయ్ కాంత్ హీరోగా వచ్చిన ‘వెన్నత్తై పోలా’ అనే సినిమాకి రీమేక్ గా ‘మా అన్నయ్య’ సినిమా తెరకెక్కింది. తెలుగులో ఈ సినిమాకి ‘రవి రాజా పెనిశెట్టి’ దర్శకత్వం వహించాడు. మొదట ఈ మూవీ ని వెంకటేష్ చేయాలని అనుకున్నాడట. కానీ అనుకోని కారణాల వల్ల రాజశేఖర్ ఈ సినిమాకి సంబంధించిన రైట్స్ ని చేజిక్కించుకున్నట్టుగా తెలుస్తుంది.
అందువల్ల వెంకటేష్ తో చేయాల్సిన ఈ ప్రాజెక్టు రాజశేఖర్ దగ్గరికి వెళ్లిందంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా రాజశేఖర్ కెరియర్ లోనే సూపర్ డూపర్ సక్సెస్ గా నిలిచిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక తెలుగు నేటివిటికి తగ్గట్టుగా ఈ సినిమాలో చాలా బాగా చేంజెస్ చేసి మరి రవి రాజా పెనిశెట్టి దర్శకత్వం వహించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…
















పెద్ది స్టోరీని అక్కడి నుంచి లేపేశాను అంటూ అసలు నిజం చెప్పేసిన బుచ్చిబాబు...
Peddi movie story : రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా వచ్చే నెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం ట్రెండింగ్ లోకి వస్తుంది. ఇక మరికొద్ది గంటల్లో ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రైలర్ కనక ప్రేక్షకులను మెప్పించినట్టయితే మాత్రం సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందని మేకర్స్ సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెస్ ఫుల్ సినిమాలు చేసిన కూడా రామ్ చరణ్ కి వచ్చిన సక్సెస్ వేరే లెవెల్లో ఉంటాయనే చెప్పాలి. గత సంవత్సరం శంకర్ డైరెక్షన్ లో చేసిన ‘గేమ్ చేంజర్’ సినిమా ఫ్లాప్ అవ్వడంతో రామ్ చరణ్ కొంతవరకు వెనకబడ్డాడు. అయిన కూడా ఈ సినిమా సక్సెస్ అతనికి చాలా మంచి బుస్టాప్ ఇస్తుందని అతను భావిస్తున్నాడు. ఇక డైరెక్టర్ బుచ్చిబాబు ఈ పెద్ది సినిమా కథని ఒక దగ్గర నుంచి లేపేసాను అంటూ చెప్పడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది…
తన చిన్న తనంలో తన ఊరులో పెద్దిరాజు అనే ఒక వ్యక్తి ఉండేవాడట. ఆయన కూలీ పనులు చేస్తూ చాలా బలంగా ఉండేవాడట. తను ఎవరివైపు క్రికెట్ మ్యాచ్ ఆడితే వాళ్ళ మ్యాచ్ ఈజీగా గెలిచేదట. అంతటి దృఢమైన బాడీ పెట్టుకుని ఈజీగా సిక్స్ లు కొడుతూ మ్యాచ్ ని గెలిపించేవాడట.
ఒకానొక సమయంలో ఊర్లో ఏదైనా మ్యాచ్ ఉంది అంటే ప్రతి ఒక్కరు తనకి కూలీ డబ్బులు ఇచ్చి మరి తన పనిని మాన్పించి మరి క్రికెట్ ఆడటానికి రప్పించేవారట. అలా క్రికెట్ తో పాటు తను బాస్కెట్ బాల్ కూడా బాగా ఆడేవాడని బుచ్చిబాబు చెప్పాడు. అతన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని బుచ్చి బాబు పెద్ది సినిమా కథనైతే రాసుకున్నాడట.
ఎప్పుడో చిన్నప్పుడు తన మైండ్ లో ఉండిపోయిన క్యారెక్టర్ ని ఇప్పుడు రీ క్రియేట్ చేసి రామ్ చరణ్ తో ఆ క్యారెక్టర్ చేయించడమనేది మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమా కథ పల్లెటూరు నేపథ్యంలో సాగుతుందనే విషయం మనకు తెలిసిందే… మరి ఈ కథని ప్రేక్షకులు ఎంతవరకు ఓన్ చేసుకుంటారు సినిమా సక్సెస్ ఫుల్ నిలుపుతారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులపాటు వెయిట్ చేయాల్సిందే…