Homeబిజినెస్CNG Price Hike: మరోసారి CNG ధరలపెంపు.. వీరిపై తీవ్ర ప్రభావం..

CNG Price Hike: మరోసారి CNG ధరలపెంపు.. వీరిపై తీవ్ర ప్రభావం..

CNG Price Hike: దేశంలో వాహనదారులపై ఇంధన భారం మరింత పెరిగింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలోనే ఇప్పుడు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలు కూడా భగ్గుమంటున్నాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) కిలో సీఎన్‌జీపై మరో రూపాయి పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితమే కిలో CNGపై రూ.2 పెంచిన కేంద్రం.. ఇప్పుడు మరో రూపాయి పెంచడంతో… కేవలం 48 గంటల వ్యవధిలోనే […]

CNG Price Hike: దేశంలో వాహనదారులపై ఇంధన భారం మరింత పెరిగింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలోనే ఇప్పుడు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలు కూడా భగ్గుమంటున్నాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) కిలో సీఎన్‌జీపై మరో రూపాయి పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితమే కిలో CNGపై రూ.2 పెంచిన కేంద్రం.. ఇప్పుడు మరో రూపాయి పెంచడంతో… కేవలం 48 గంటల వ్యవధిలోనే సీఎన్‌జీ ధర ఏకంగా రూ.3 మేర పెరిగినట్లయింది. ఈ ధరల ప్రభావం ఎలా ఉండబోతుందో చూద్దాం..

CNG ధరల పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధర రూ.80 దాటి రూ.80.09కి చేరింది. అలాగే నోయిడా, ఘజియాబాద్‌లలో రూ.88.70, గురుగ్రామ్‌లో రూ.85.12, ముంబైలో రూ.84 చొప్పున ధరలు పలికాయి. హైదరాబాద్ లో రూ.90 పలుకుతోంది. ఈ రెండు రోజుల వ్యవధిలోనే అటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా లీటరుకు రూ.3 చొప్పున పెరగడం గమనార్హం.

సీఎన్‌జీ ధరల పెరుగుదల వల్ల మధ్యతరగతి ప్రజలతో పాటు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది.ఆటో, క్యాబ్ డ్రైవర్లు: పెట్రోల్, డీజిల్ రేట్లు భరించలేక ఎక్కువ మైలేజ్ వస్తుందని ఆటోలు, ఓలా/ఉబెర్ ట్యాక్సీలను సీఎన్‌జీ మోడల్స్‌గా మార్చుకున్న డ్రైవర్లకు ఇది కోలుకోలేని దెబ్బ. వారి రోజువారీ సంపాదనలో ఇంధన ఖర్చులే సగానికి పైగా చేరనున్నాయి. ఇప్పటికే కొన్ని నగరాల్లో ఆటో యూనియన్లు కనీస ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి.
సరుకు రవాణా చేసే చిన్న కమర్షియల్ వాహనాలు (టాటా ఏస్ వంటివి) చాలా వరకు సీఎన్‌జీపైనే నడుస్తాయి. ఇంధన ధర పెరగడంతో రవాణా ఖర్చులు పెరిగి, పండ్లు, కూరగాయలు, నిత్యవసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంది.

భారతదేశంలో సీఎన్‌జీ కార్ల విభాగంలో మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్ కంపెనీలదే హవా. మారుతి సుజుకి (Maruti Suzuki)కంపెనీకి చెందిన అల్టో K10 (Alto K10), వ్యాగన్ ఆర్ (WagonR), సెలెరియో (Celerio), స్విఫ్ట్ (Swift), డిజైర్ (Dzire), బ్రెజ్జా (Brezza), ఎర్టిగా (Ertiga) ఉన్నాయి. అలాగే టాటా మోటార్స్ (Tata Motors)కు చెందిన తియాగో (Tiago), టిగోర్ (Tigor), పంచ్ (Punch), ఆల్ట్రోజ్ (Altroz) వంటి కార్లు సీఎన్‌జీ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. హ్యుందాయ్ (Hyundai గ్రాండ్ i10 నియోస్ (Grand i10 Nios), ఆరా (Aura) మరియు సరికొత్తగా మైక్రో ఎస్‌యూవీ ‘ఎక్స్టర్’ (Exter) కార్లలో సీఎన్‌జీ ఆప్షన్‌ను అందిస్తోంది.

పెట్రోల్, డీజిల్ కంటే సీఎన్‌జీ కార్లు ఇప్పటికీ 40 నుంచి 45 శాతం వరకు రన్నింగ్ కాస్ట్‌ను ఆదా చేస్తున్నప్పటికీ… ఇలా వరుసగా ధరలు పెంచుకుంటూ పోతే సీఎన్‌జీ వాహనాల కొనుగోలుపై కస్టమర్లు పునరాలోచనలో పడే అవకాశం ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper