Homeఆధ్యాత్మికంAdhika Jyeshta Masam 2026: అధిక జ్యేష్ఠ మాసం ఎప్పటి నుంచి? ఈ కాలంలో ఏం...

Adhika Jyeshta Masam 2026: అధిక జ్యేష్ఠ మాసం ఎప్పటి నుంచి? ఈ కాలంలో ఏం చేయాలి?

Adhika Jyeshta Masam 2026: చంద్ర సంవత్సరాలు, సౌర సంవత్సరాల మధ్యలో ప్రతీ 32 నెలలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం.. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చాంద్రమాన జ్యేష్ఠ మాసం ఈసారి అధిక మాసంగా వచ్చింది. ఈ అధిక జ్యేష్ఠ మాసం 2026 మే 17 నుంచి జూన్ 15 వరకు కొనసాగనుంది. సూర్యసిద్ధాంతం, సిద్ధాంత శిరోమణి వంటి గ్రంథాల ప్రకారం.. ఏ చాంద్రమాసంలో సూర్య సంక్రాంతి లేకపోతే దానిని అధిక […]

Adhika Jyeshta Masam 2026: చంద్ర సంవత్సరాలు, సౌర సంవత్సరాల మధ్యలో ప్రతీ 32 నెలలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం.. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చాంద్రమాన జ్యేష్ఠ మాసం ఈసారి అధిక మాసంగా వచ్చింది. ఈ అధిక జ్యేష్ఠ మాసం 2026 మే 17 నుంచి జూన్ 15 వరకు కొనసాగనుంది. సూర్యసిద్ధాంతం, సిద్ధాంత శిరోమణి వంటి గ్రంథాల ప్రకారం.. ఏ చాంద్రమాసంలో సూర్య సంక్రాంతి లేకపోతే దానిని అధిక మాసం గా పరిగణిస్తారు. సౌర సంవత్సరం, చాంద్ర సంవత్సరం మధ్య ఉండే కాలవ్యత్యాసాన్ని సమన్వయం చేసేందుకు భారతీయ ఋషులు ఈ విధానాన్ని ఏర్పాటుచేశారు. సాధారణంగా వచ్చే జ్యేష్ఠమాసంలో కొన్నిశుభకార్యాలు నిర్వహిస్తారు. కాన ఇప్పుడు వచ్చిన అధిక జ్యేష్ఠమాసంలో ఎలాంటి పూజలు చేస్తారు? ఏం చేయకుండా ఉంటారు?

సాధారణంగా ఒక సౌరసంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. చంద్ర సంవత్సరంలో 354 రోజులు ఉంటాయి. ఈ మాసాలను సరిచేసేందుకు ప్రతీ 32 నెలలకు ఒకసారి అధికమాసంను చేర్చుతున్నారు. కొన్నిసార్లు అధిక ఆషాఢం,అధిక శ్రావణ మాసం వస్తుంది. ఈసారి అధిక జ్యేష్ఠమాసం వచ్చింది. అధిక జ్యేష్ఠమాసాన్ని పురుషోత్తమ మాసంగా కూడా పిలుస్తారు. ఈ కాలంలో భక్తితో స్నానం, దానం, జపం, ఉపవాసం, విష్ణుపూజ చేస్తే పాపక్షయం, దారిద్ర్య నివారణ కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. పురుషోత్తమ మహాత్మ్య పఠనం, శ్రీకృష్ణారాధన, నక్తవ్రతం, ఒక భుక్తం వంటి ఆచారాలు ఎంతో పుణ్యప్రదమని భావిస్తారు. అధికమాసాంతంలో నెయ్యి, బెల్లం, ధాన్యం దానం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రోక్తంగా పేర్కొన్నారు.

అయితే ఈ మాసంలో కొన్ని శుభకార్యాలు వర్జ్యంగా చెప్పబడ్డాయి. ముఖ్యంగా వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు, దేవతా ప్రతిష్ఠలు, కొత్త వాహనాలు లేదా భూమి కొనుగోలు వంటి కార్యక్రమాలు చేయరాదని ఆచారం చెబుతోంది. అలాగే కొత్త ఆభరణాలు, కొత్త వస్త్రధారణ, వ్రతోద్యాపనలు, యజ్ఞాలు కూడా నివారించాలని సూచించారు.

ఈ మాసంలో అవసరమైన నిత్యకర్మలు మాత్రం చేయవచ్చు. వార్షిక శ్రాద్ధాలు, పితృకార్యాలు, తీర్థశ్రాద్ధాలు, జన్మదిన పూజలు, రుద్రాభిషేకాలు, జపాలు, దానాలు, గ్రహణ సంబంధిత కర్మలు నిర్వహించేందుకు అధికమాసంలో నిషేధం లేదు. శాస్త్రాల ప్రకారం “ఆవశ్యక కర్మలకు అధికమాస దోషం లేదు” అనే సూత్రం ఇక్కడ ప్రధానంగా చెప్పబడింది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper