Homeబిజినెస్Vivo V80: మిడ్ రేంజ్ పీపుల్స్ కోసం Vivo కొత్త ఫోన్లు.. ఎలా ఉంటాయంటే..

Vivo V80: మిడ్ రేంజ్ పీపుల్స్ కోసం Vivo కొత్త ఫోన్లు.. ఎలా ఉంటాయంటే..

Vivo V80: Vivo కంపెనీ ఇప్పటికే ఎన్నో రకాల మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకువచ్చి వినియోగదారులను ఆకట్టకుంది. అయితే ఇటీవల తన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు Vivo V‑80, Vivo S‑2 అనే రెండు మొబైల్స్ ను గ్లోబల్ మొబైల్ సిస్టమ్స్ అలోన్‌స్ (GSMA) డేటాబేస్‌లో రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ రెండు మోడళ్లు త్వరలో లాంచ్ కాబోతున్నాయని తెలుస్తోంది. వివో వి‑80 మోడల్ నెంబర్ V2630 గాను, వివో ఎస్‑2 V2576 గా GSMAగా డేటాబేస్‌లో […]

Vivo V80: Vivo కంపెనీ ఇప్పటికే ఎన్నో రకాల మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకువచ్చి వినియోగదారులను ఆకట్టకుంది. అయితే ఇటీవల తన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు Vivo V‑80, Vivo S‑2 అనే రెండు మొబైల్స్ ను గ్లోబల్ మొబైల్ సిస్టమ్స్ అలోన్‌స్ (GSMA) డేటాబేస్‌లో రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ రెండు మోడళ్లు త్వరలో లాంచ్ కాబోతున్నాయని తెలుస్తోంది.

వివో వి‑80 మోడల్ నెంబర్ V2630 గాను, వివో ఎస్‑2 V2576 గా GSMAగా డేటాబేస్‌లో కనిపించినట్లు రిపోర్టులు తెలుపుతున్నాయి. ఇది తుది టెస్టింగ్ దశకు చేరుకున్నాయని తెలుస్తోంది. అయితే ఈ డేటాబేస్ ఎంట్రీలో ఎలాంటి స్పెసిఫికేషన్‌లు (చిప్‌సెట్, డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా) ఇంకా డిటైల్‌గా ప్రకటించలేదు. కానీ ఈ ఫోన్లు ఎలా ఉండబోతున్నాయో కొన్ని లీకులు భట్టి తెలుస్తోంది. కొన్ని అంచనాల ప్రకారం ఈ మొబైల్స్ ఇలా ఉండనున్నాయి.

Vivo V‑80:
మొబైల్ నిపుణుల అంచనాల ప్రకారం.. ఈ కొత్త మొబైల్ వివో ఎస్‑60 బేస్‌డ్ డివైస్‌గా ఉండొచ్చని చెబుతున్నారు. గ్లోబల్ మార్కెట్‌లో వివో వి‑80 పేరుతో, చైనాలో ఎస్‑60 పేరుతో లాంచ్ అవుతుందని అంటున్నారు. ఈ మొబైల్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 లేదా 8 జెన్ 3 చిప్‌సెట్‌ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇందులో 6.59 అంగుళాల OLED డిస్ ప్లేను చేర్చి ఉంటారని అంటున్నారు. ఈ డిస్ ప్లే 1.5K రిజల్యూషన్ తో పనిచేస్తుంది. అలాగే ఈ మొబైల్ బ్యాటరీ 7000mAh ఉండగా.. దీనికి 90W ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్టు చేస్తుందని అంటున్నారు.

Vivo S‑2:
వివో ఎస్‑2 లైన్‌అప్ ద్వారా వచ్చే ఈ మొబైల్ ప్రధానంగా మిడ్‌రేంజ్ సిరీస్‌లో రాబోతుంది. ఇప్పటికే ఎస్‑సిరీస్ మిడ్ రేంజ్ డివైస్‌లతో పోటీ పడుతోంది. ఈ పరిస్థితిలో వివో ఎస్‑2 మరింత ఆకర్షణీయమైన ప్రాసెసర్, డిస్‌ప్లే కాన్ఫిగరేషన్‌తో రావచ్చని అంచనా. అయితే దీని గురించ ఎటువంటి సమాచారం లీక్ కాలేదు.

GSMA డేటాబేస్‌లో ఈ ఫోన్ల గురించి కనిపించడం వల్ల వివో వి‑80, ఎస్‑2 రెండూ త్వరలో అధికారికంగా ప్రకటించబడే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా చైనాలో ఎస్‑60/ఎస్‑2 లాంచ్ తర్వాతే గ్లోబల్‌గా వి‑80 రిలీజ్ అవుతుందని ఊహిస్తున్నారు. మరిన్ని స్పెసిఫికేషన్‌లు, ధర, లాంచ్ స్లాట్ వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడికావచ్చని ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper