Home Blog Page 241

ఫ్లాష్ ఫ్లాష్.. రఘురామకృష్ణంరాజు కొత్త పార్టీ!

Raghurama Krishnam Raju
Raghurama Krishnam Raju

Raghurama Krishnam Raju: రఘురామకృష్ణం రాజు కొత్త పార్టీ పెడతారా? అందులో వాస్తవం ఉందా? ఇలా జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత? పొలిటికల్ సర్కిల్స్ లో దీనిపైన చర్చ నడుస్తోంది. టిడిపి తో పాటు కూటమిలో లేనిపోని వివాదాలకు రఘురామకృష్ణంరాజు కారణమవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అయితే తనకు అటువంటి ఉద్దేశం లేదని.. చంద్రబాబుతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు రఘురామకృష్ణంరాజు. మరోవైపు మంత్రి పదవి కోసమే ఇలా ప్రవర్తిస్తున్నారు అనేది ఒక కామెంట్ ఉంది. అయితే రఘురామకృష్ణం రాజుకు మంత్రి పదవి ఇవ్వడం కంటే ఆయన సొంత పార్టీ పెట్టుకోవడమే టిడిపికి మేలని ఆ పార్టీ క్యాడర్ భావిస్తోంది. వైసీపీలో ఉంటూ ఆ పార్టీపై తిరుగుబాటు చేసిన రఘురామ వల్ల టిడిపికి ప్లస్సు అయ్యింది. అదే సమయంలో చంద్రబాబు పిలిచి మరీ చివరి నిమిషంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇచ్చారు. కానీ రఘురామకృష్ణం రాజు లేనిపోని వివాదాలతో ఇరకాటంలో పెడుతున్నారు.

* తెలుగు వీర లేవరా అంటూ..
రఘురామకృష్ణం రాజు తెలుగు వీర లేవరా అనే కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనేది పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చ. ఇటీవల జరిగిన పరిణామాలతో ఆయన ఈ సొంత పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. ఇలా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు ఆయన. మరోవైపు తెలుగు వీర లేవరా అనేది సామాజిక వర్గంలో కష్టంలో ఉన్న వారికి ఆదుకునేందుకు రూపొందించిన ఒక ఫోరం అని.. అంతకుమించి ఏమీ లేదన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఇటీవల ఆకివీడు రామాలయ నిర్మాణానికి సంబంధించి.. రఘురామకృష్ణం రాజు చర్యల వల్ల టిడిపికి ఇబ్బందికర పరిస్థితిలు ఎదురయ్యాయి. రఘురామకృష్ణం రాజు చర్యలతో దళితులు టిడిపికి దూరమయ్యే ఛాన్స్ ఉందన్న టాక్ కూడా ఉంది. ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మందకృష్ణ మాదిగ, మహాసేన రాజేష్. అయితే అనవసరంగా లేనిపోని వివాదాలతో ఇబ్బందులు తెస్తున్నారన్న ఆగ్రహం రఘురామకృష్ణం రాజు పై టిడిపి నాయకత్వానికి ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

* వైసీపీలో రెబెల్ గా మారి
2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు రఘురామకృష్ణంరాజు. గెలిచిన ఆరు నెలలకే ఆ పార్టీకి రెబెల్ గా మారిపోయారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఎదురైతే టిడిపికి కష్టం అన్న వారు ఉన్నారు. అందుకే రఘురామకృష్ణం రాజు కొత్త పార్టీ పెడదామంటే అడ్డుకునే ప్రయత్నం చేయకూడదని.. ఆయనను అలా వదిలేస్తే టిడిపికి లాభం అన్న వారు కూడా ఉన్నారు. కానీ తాను కొత్త పార్టీ అంటూ ఎటువంటిది లేదని.. అటువంటిది ఆలోచన ఏమి చేయలేదని చెబుతున్నారు రఘురామకృష్ణంరాజు. చూడాలి ఏం జరుగుతుందో..

పవన్ అను నేను.. కొత్త ఆవిష్కరణ

Pawan Anu Nenu Book Launch
Pawan Anu Nenu Book Launch

Pawan Anu Nenu Book Launch: పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిమానులు కోరుతూ వస్తున్నారు. కానీ పవన్ మాత్రం తన బలాన్ని, తన బలహీనతలను అంచనా వేసుకుని మాత్రమే రాజకీయ అడుగులు వేస్తున్నారు. ఎవరు ఎన్ని రకాల ఒత్తిళ్లు చేసినా.. ఎన్ని రకాలుగా రచ్చ కొడుతున్నా రెచ్చిపోవడం లేదు. మరో 15 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉండాలన్నది ఆయన అభిమతం. సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయకత్వాన్ని ఆయన హైలెట్ చేస్తూ వస్తున్నారు. ప్రత్యర్ధుల ట్రాప్ లో పడవద్దని.. తాను పొత్తు పెట్టుకుంది ఈ రాష్ట్ర ప్రయోజనాలకు తప్ప.. రాజకీయ ప్రయోజనాల కోసం కాదని.. మరో 15 సంవత్సరాలు పాటు కూటమి ఉండాలన్నది తన లక్ష్యం అని.. పరోక్షంగా చంద్రబాబు నాయకత్వానికి పవన్ జై కొడుతూ వచ్చారు.

* పొత్తు చెడగొట్టేందుకు..
ఏపీలో పొత్తు విచ్ఛిన్నం చేసేందుకు జరగని ప్రయత్నం అంటూ లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన ను వేరు చేసేందుకు చాలా రకాల ప్రయత్నాలు జరిగాయి. ఏనాడైతే పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో చంద్రబాబు పరామర్శకు వెళ్లి ప్రకటన చేశారో.. నాటి నుంచి పొత్తు చెడగొట్టేందుకు చాలామంది ప్రయత్నాలు చేశారు. కాపు సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని మరి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వాటన్నింటినీ తట్టుకొని నిలబడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. తనతో ఉన్నవారు ఉండండి.. లేకుంటే బయటకు వెళ్ళిపోవచ్చు అని కూడా తేల్చి చెప్పారు. దీంతో చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయారు. ముఖ్యంగా జనసేన ముసుగులో ఉన్న వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ మాటలు రుచించడం లేదు.

* కొత్త పుస్తకం ఆవిష్కరణ..
ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధేయ నేతలు సైతం టిడిపి తో జనసేన కలిసి ఉన్నంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారం కష్టం అని తేల్చి చెప్పారు. అదే సమయంలో టిడిపి తో జనసేన పొత్తు చెడగొట్టేందుకు పతాక స్థాయిలో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి సమయంలో హైదరాబాదులో పవన్ అభిమానులు, జనసేన అభిమానులు ఒకరు పవన్ అను నేను పుస్తకాన్ని రాసుకోచ్చారు. ఏపీకి ముఖ్యమంత్రిగా పవన్ ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ పుస్తకాన్ని రాయగా ప్రముఖ నేతలు ఆవిష్కరించారు. అయితే ఇప్పటికే మంత్రిగా.. పవన్ అను నేను అని ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. అయితే జనసైనికులు మాత్రం పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి స్థానంలో చూస్తున్నారు. ఈ పుస్తకావిష్కరణ ద్వారా.. ఆ బలాన్ని మరింత బలంగా చాటుకున్నారు.

ట్రంప్‌ కూతురిని లేపేద్దామని ఇరాన్‌ స్కెచ్‌.. వెలుగులోకి ఇరాన్ భారీ ఆపరేషన్‌

Trump Daughter Kidnapping Plot
Trump Daughter Kidnapping Plot

Trump Daughter Kidnapping Plot: అమెరికా–ఇరాన్‌ మధ్య కొనసాగుతున్నాయి. ఒకవైపు ఇరాన్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఇరిటేషన్‌ తెప్పిస్తోంది. మళ్లీ దాడికి ట్రంప్‌ సిద్ధమవుతున్నారు. దీంతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అయితే దీర్ఘకాల ఉద్రిక్తతలు ఇప్పుడు వ్యక్తిగత స్థాయికి విస్తరించడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌కు సంబంధించిన ఒక ఉగ్రవాది కుట్ర పన్నినట్లు న్యూయార్క్‌ పోస్ట్‌ నివేదికలు వెల్లడించాయి.

నిందితుడి అరెస్ట్‌..
32 ఏళ్ల మహ్మద్‌ బకెర్‌ సాద్‌ దావూద్‌ (మహమ్మద్‌ బాకర్‌ సాద్‌ దావూద్‌ అల్‌ సాది) అనే వ్యక్తిని ఇటీవల ఎఫ్‌బీఐ అధికారులు అరెస్టు చేశారు. ఇతడు ఇరాన్‌ ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్‌ప్స్‌(ఐఆర్‌జీసీ)తో సత్సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2020లో ఇరాన్‌ జనరల్‌ ఖాసిమ్‌ సొలేమాని హత్యకు ప్రతీకారంగా ఇవాంకాను టార్గెట్‌ చేసినట్లు విచారణలో తేలిందని సమాచారం. ఇతడు ఇవాంకా ఫ్లోరిడా నివాసం బ్లూప్రింట్‌ కూడా సేకరించినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ కేసు ఇరాన్‌ మద్దతుతో నడిచే ఉగ్రవాద నెట్‌వర్క్‌లు అమెరికా నేలపై ఎలా కార్యకలాపాలు చేపడుతున్నాయనే దానిని మళ్లీ ప్రశ్నించేలా చేస్తోంది.

ఇరాన్‌–అమెరికా ఉద్రిక్తతలు..
ఖాసిమ్‌ సొలేమాని హత్య తర్వాత ఇరాన్‌ వైపు నుంచి అనేక ప్రతీకార బెదిరింపులు వచ్చాయి. ఐఆర్‌జీసీఈను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఇరాన్‌ మద్దతుతో పని చేసే మిలిషియా గ్రూపులు మధ్యప్రాచ్యం నుంచి ఐరోపా, అమెరికా వరకు తమ కార్యకలాపాలను విస్తరించాయని పశ్చిమ దేశాల నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ తాజా కుట్రలో ఇవాంకా ట్రంప్‌ను ఎంచుకోవడం వెనుక రాజకీయ సందేశం స్పష్టంగా కనిపిస్తోంది. ట్రంప్‌ ఇరాన్‌పై తీసుకున్న కఠిన చర్యలకు ప్రతీకారంగా కుటుంబ సభ్యులను లక్ష్యం చేసుకోవడం ఇరాన్‌ వ్యూహంలో భాగమని విశ్లేషకులు అంటున్నారు.

భద్రతా సవాళ్లు..
ఈ ఘటన అమెరికా భద్రతా ఏజెన్సీలు, ముఖ్యంగా సీక్రెట్‌ సర్వీస్‌ ముందు కొత్త సవాళ్లను ఉంచింది. ఉన్నత స్థాయి రాజకీయ కుటుంబాల సభ్యుల భద్రతను మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇరాన్‌ ఇలాంటి ప్రాక్సీ ఉగ్రవాదుల ద్వారా తన వ్యూహాలను అమలు చేయడం అంతర్జాతీయ సంబంధాల్లో మరింత ఉద్రిక్తతలను సృష్టిస్తోంది. అమెరికా ఈ కేసును ఎలా నిర్వహిస్తుందనేది రాబోయే రోజుల్లో ఇరాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపవచ్చు.

ఈ ఆరోపణలు ఇంకా కోర్టులో నిరూపణ కావాల్సి ఉంది. అయితే ఇవి ఇరాన్‌– అమెరికా మధ్య కొనసాగుతున్న రహస్య యుద్ధంలో మరో అధ్యాయాన్ని బయటపెడుతున్నాయి. ఉగ్రవాదం ఏ రూపంలో వచ్చినా, దానిని అడ్డుకోవడం అంతర్జాతీయ సమాజం ముందున్న సవాల్‌. ఈ కేసు న్యాయవ్యవస్థ సరైన ముగింపు పొంది, భద్రతా వ్యవస్థలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన గుర్తు చేస్తోంది.

ఏపీకి మరో మణిహారం సిద్ధం.. ఇక ప్రపంచ పటంలో..

Bhogapuram International Airport
Bhogapuram International Airport

Bhogapuram International Airport: ఏపీలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం సేవలు ప్రారంభించనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో సేవలు అందుబాటులోకి వచ్చాయి.. దాదాపు పనులన్నీ పూర్తి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తయింది. విజయవంతంగా పూర్తి చేసింది పౌర విమానయాన శాఖ. అన్ని కుదిరితే జూలై నుంచి అక్కడ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి క్లారిటీ కూడా వచ్చింది. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఏపీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేటాయించింది కేంద్రం. గత టిడిపి ప్రభుత్వ హయాంలోనే దీని నిర్మాణం ప్రారంభం అయింది. ఇప్పుడు అదే టిడిపి ప్రభుత్వంలో విమానాశ్రయం ప్రారంభం కానుండడం విశేషం.

* దేశంలోనే అతి పెద్దది..
దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. విభజన హామీల్లో భాగంగా ఏపీకి ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేటాయించారు. ఉత్తరాంధ్రలో నిర్మించాలన్నది అప్పటి ప్రభుత్వ ఆలోచన. విశాఖలో ఉండే విమానాశ్రయం పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని.. చాలడం లేదు. దీంతో అన్ని హంగులతో అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం ఏర్పడింది. అప్పట్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా పూసపాటి అశోక్ గజపతిరాజు ఉండేవారు. ఆయన విన్నపం మేరకు భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు అప్పటి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భూ సమీకరణతో పాటు పనులు ప్రారంభం అయ్యాయి అప్పట్లో. మధ్యలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పనుల్లో జాప్యం జరిగింది. అయితే 2024లో ఎన్డీఏ అధికారంలోకి రావడం.. టిడిపి కీలక భాగస్వామి కావడం.. రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖను తీసుకోవడం వంటి కారణాలతో.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయి. మొన్ననే ట్రయల్ రన్ కూడా సక్సెస్ అయ్యింది. దాదాపు పెండింగ్ పనులన్నీ పూర్తయ్యాయి.

* ప్రధానమంత్రి కార్యాలయానికి సమాచారం..
అయితే జూన్ లో విమానాశ్రయం ప్రారంభం ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జూలై 5/ 8/10 తేదీల్లో విమానాశ్రయ ప్రారంభం జరిపేందుకు ప్రధానమంత్రి కార్యాలయానికి సమాచారం పంపింది. ఈ మూడో తేదీల్లో ఒకదానిని ఖరారు చేయాలని కోరింది. అయితే ప్రధానమంత్రి కార్యాలయం మాత్రం జూలై 5 తేదీని ఖరారు చేసింది. మరోవైపు దీనిని ధ్రువీకరిస్తూ సింగపూర్ ఎయిర్లైన్స్ సూట్ సంస్థ తమ విమాన రాకపోకలను భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి జూలై 8 నుంచి ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తమ ఏజెంట్లకు కూడా సమాచారం ఇచ్చింది. అయితే ఒక్కో విమానయాన సంస్థ తమ కార్యకలాపాలను భోగాపురం నుంచి ప్రారంభించేందుకు వీలుగా ప్రకటనలు చేస్తుండడం విశేషం. విమానాశ్రయ ప్రారంభానికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

15 లక్షల కొత్త పింఛన్లు.. చంద్రబాబు సర్కార్ సాహసం!

AP New Pensions
AP New Pensions

AP New Pensions: కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్లు ఇవ్వాలని భావిస్తోంది. 60 సంవత్సరాలు దాటిన వృద్ధులతో పాటు 50 సంవత్సరాలు దాటిన బీసీ, ఎస్సీ,ఎస్టీ వారికి సైతం పింఛన్లు అందించేందుకు కార్యాచరణ ప్రారంభించింది. జూన్ 12 నాటికి కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుంది. అందుకే ఎన్నికల్లో హామీ ఇచ్చిన మాదిరిగా.. కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అదే జరిగితే దేశంలోనే ఏపీ సంక్షేమ పథకాల పరంగా రికార్డు క్రియేట్ చేసినట్టే.

* అదనంగా రూ.700 కోట్ల భారం..
ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా పేరుతో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళ, కిడ్నీ సంబంధిత రోగులు, డప్పు కళాకారులు, చర్మకారులు వంటి విభాగాల్లో పింఛన్లు అందుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 62 లక్షలకు పైగా పింఛన్లు అందిస్తున్నారు. ఇందుకు గాను నెలవారీగా రూ. 2,700 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. దాదాపు ఏడాదికి 41 వేల కోట్ల రూపాయలు భారం పడుతోంది ప్రభుత్వానికి. అయితే ఇప్పుడు అదనంగా 15 లక్షల పింఛన్లు అందించాలని నిర్ణయించడం విశేషం. ఇప్పటినుంచి అదనంగా 700 కోట్ల రూపాయల వరకు భారం పడనుంది రాష్ట్ర ప్రభుత్వంపై. తాము అధికారంలోకి వస్తే కొత్త పింఛన్లు అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత స్పోజ్ కోటా కింద పింఛన్లు అందజేశారు. వివిధ రుగ్మతలతో బాధపడే వారికి వాటిని అందజేశారు. అయితే ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పింఛన్ పథకం ఇంకా అమలు కాలేదు. దానికోసమే ఎక్కువ మంది ఎదురుచూస్తూ వచ్చారు.

* బకాయిలతో సహా చెల్లింపులు..
అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పింఛన్లు అందిస్తామన్న హామీ ఎట్టకేలకు తీరనుంది. కానీ తాము అధికారంలోకి వస్తే.. మూడువేల రూపాయలు ఉన్న సామాజిక పింఛన్ మొత్తాన్ని నాలుగు వేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలా ఇచ్చిన హామీని 2024 ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్పారు చంద్రబాబు. చెప్పిన మాదిరిగే అధికారంలోకి వచ్చిన తరువాత జూన్ నెలలో మూడు నెలల బకాయిలతో సహా చెల్లింపులు చేశారు. అయితే నవరత్నాల్లో భాగంగా పింఛన్లు అందిస్తామని ఇచ్చిన హామీని రెండేళ్ల తర్వాత నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు ఆర్థికపరంగా అధ్యయనం చేశారు. అది ఒక కొలిక్కి రావడంతో.. ఇప్పుడు పింఛన్లు అందించేందుకు సన్నాహాలు ప్రారంభించారన్నమాట. అయితే ప్రభుత్వ ప్రణాళికతో పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వై నాట్ పులివెందుల అనకుండా.. చాప కింద నీరులా టిడిపి!

Pulivendula Politics
Pulivendula Politics

Pulivendula Politics: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. కానీ తెలుగుదేశం మాత్రం చాపకింద నీరులా చుట్టేస్తోంది జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి సత్తా చాటాలని చూస్తోంది. ఎటువంటి హడావిడి లేకుండా పులివెందుల నియోజకవర్గం లో అన్ని స్థానిక సంస్థలను సొంతం చేసుకుని.. రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత డిఫెన్స్ లో పడేయాలని ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా పులివెందుల మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు ఇప్పటినుంచే ప్రణాళిక అమలు చేస్తోంది. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి బీటెక్ రవితో పాటు ఆయన సోదరులు పులివెందుల పట్టణాన్ని దత్తత తీసుకున్నట్టు ప్రాంతాలవారీగా.. నిత్య పర్యటనలు చేస్తూ.. ప్రజల పనులను చేస్తూ తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందులో కొంతవరకు సక్సెస్ అయ్యారు కూడా.

* గతంలో వివేకానంద రెడ్డి..
గతంలో పులివెందుల పట్టణం పై వైయస్ వివేకానంద రెడ్డికి మంచి పట్టు ఉండేది. ఆయన నిత్య పర్యటనలతో పట్టణం మొత్తాన్ని చుట్టేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. పులివెందుల వ్యవహారాలను వైయస్ అవినాష్ రెడ్డి చూస్తున్నారు. అయితే ఆయన తన వద్దకు వచ్చిన నాయకులతో మాత్రమే మమేకమవుతున్నారు. వారికి అందుబాటులో ఉంటున్నారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి పని చేసే వైసిపి నేత అక్కడ లేకుండా పోయారు. కొద్దిరోజుల కిందట దుశ్యంత్ రెడ్డి అనే నాయకుడు వైసీపీ తరఫున మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రకటించారు అవినాష్ రెడ్డి. పులివెందుల పట్టణంలో ఆయన అందుబాటులో ఉంటారని చెప్పుకొచ్చారు. కానీ ఇటీవల దుష్యంత్ రెడ్డి పెద్దగా కనిపించడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే టిడిపిలో బీటెక్ రవితో పాటు ఆయన సోదరులు చాలా యాక్టివ్ గా ఉన్నారు.

* అంతా తెర వెనుక..
గతంలో వై నాట్ కుప్పం అంటూ హడావిడి చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో ఏకపక్ష విజయం సొంతం చేసుకుంది. దీంతో సాధారణ ఎన్నికల్లో సైతం కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని భారీ శపథం చేసింది. కానీ తరువాత చతికిల పడింది. అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండ.. ఎటువంటి హడావిడి చేయకుండా పులివెందులపై పూర్తి దృష్టి కేంద్రీకరించింది టిడిపి. సాధారణ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అనేది కష్టతరమైన.. స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను గెలిపించి.. రాష్ట్రస్థాయిలో వైసీపీని, ఆ పార్టీ శ్రేణుల ఆశలను నీరుగార్చడమే ధ్యేయం అన్నట్టు టిడిపి కూటమి నేతల ఆలోచన ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

భారత్ పై విదేశీ బొద్దింకల దండయాత్ర..

Cockroach Janata Party
Cockroach Janata Party

Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు విపరీతమైన చర్చలో ఉంది. ఈ పార్టీ ఇంతవరకు అధికారికంగా పుట్టలేదు. ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకోలేదు. కానీ సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉండడంతో.. ఈ పార్టీ గురించి చర్చ మొదలైంది. అయితే ఈ పార్టీని మొదట్లో చాలామంది సానుకూలంగా తీసుకున్నారు. ఆ తర్వాత రాజకీయ చర్చల్లో ఈ పార్టీ గురించి ప్రస్తావన పెరగడం ప్రారంభమైంది. అంతేకాదు ఈ పార్టీ వెనుక అసలు వ్యక్తులు.. దీని వెనక ఉద్దేశాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.

కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేసిన వ్యక్తి అమెరికాలో ఉన్నత విద్య చదువుతున్నారు. మరొక వ్యక్తి ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఇంకో వ్యక్తి ఇంగ్లాండులో ఉన్నారు. వీరిలో ఇద్దరు గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పనిచేశారు. ఒక వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు. అయితే వీరి వెనక విదేశీ శక్తులు ఉన్నాయని.. అందువల్లే వీరు భారత ప్రభుత్వం మీద దాడి చేస్తున్నారని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు.

కాక్రోస్ జనతా పార్టీని ఆన్లైన్లో ఎక్కువగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇతర దేశాలకు చెందినవారు ఎక్కువగా అనుసరిస్తున్నారు. ఇందులో ఇండియన్స్ తక్కువ మంది ఉండడం విశేషం. పైగా కాక్రోచ్ జనతా పార్టీ ఉద్దేశాలు వేరే విధంగా ఉన్నాయి.. ఇక ఈ పార్టీ సోషల్ మీడియాలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. ఇంకా కొంతమందిని అనుసరిస్తుంది. దీంతో దీని వెనకాల ఉన్న అసలు ఉద్దేశాలు ఏంటో అర్థమవుతున్నాయని బిజెపి నాయకులు అంటున్నారు.

“పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ను జైలుకు పంపించారు. ఉక్రెయిన్ లో జోకర్ ను తీసుకొచ్చి అధ్యక్షుడిని చేశారు. బంగ్లాదేశ్లో మహమ్మద్ యునెస్ చేతిలో పగ్గాలు పెట్టి దేశాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు భారత్ మీద పడ్డారు. పైగా మన దేశంలో బెంగాల్ రాష్ట్రంలో మమత ఓడిపోయింది. తమిళనాడులో ద్రావిడ సిద్ధాంతాన్ని.. సార్వభౌమత్వాన్ని వద్దనుకునే వ్యక్తులు ఓడిపోయారు.. అస్సాం నుంచి మొదలు పెడితే ప్రతి రాష్ట్రంలోనూ విదేశీ శక్తులకు కొమ్ముకాసే పార్టీలు అధికారంలోకి రాకుండా పోతున్నాయి.. అందువల్లే దేశం నుంచి కాకుండా.. దేశం బయటనుంచి దాడి చేస్తున్నారు.. అయితే ఈ శక్తుల ఆటలు సాగవని” బిజెపి నాయకులు అంటున్నారు.

కాక్రోచ్ జనతా పార్టీకి కాశ్మీరి వేర్పాటు వాద వ్యక్తులు.. అమెరికన్ డీప్ స్టేట్ శక్తులు.. దుబాయ్ కేంద్రంగా ఉగ్రవాదులకు సహకారం అందించే వ్యవస్థలు డబ్బులు ఇస్తున్నట్టు బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. అందువల్లేవారు మన దేశం మీద ఇలా దాడి చేస్తున్నారని మండిపడుతున్నారు. అయితే ఇటువంటి వ్యక్తులు కొంతమేర సోషల్ మీడియాలో అలజడి సృష్టిస్తారని.. ఆ తర్వాత అంత చల్లారిపోతుందని బిజెపి నేతలు అంటున్నారు.

గ్రీన్ కార్డ్ షాక్.. అమెరికాలో ఉన్న వాళ్లు తట్టాబుట్టా సర్దుకొని రావాల్సిందే..

US Green Card New Rules
US Green Card New Rules

US Green Card New Rules: అమెరికాలో వలసదారలపై మరో నిబంధన తీసుకొచ్చింది. ఇప్పటికే శాశ్వత వీసాపై పలు నిర్ణయాలు తీసకున్న ఇక్కడి ప్రభుత్వం తాజాగా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇక నుంచి శాశ్వత నివాస హక్కు (గ్రీన్ కార్డు) పొందాలంటే సొంత దేశానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ కొత్త నిబంధనల ద్వారా అమెరికాలో ఉంటున్న వలదారులు.. ముఖ్యంగా భారతీయులపై తీవ్రప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ విషయంలో కొందరికి మినహాయింపు ఉంటుంది. ఆ వివరాల్లోకి వెళితె..

అమెరికా వలస విధానాల్లో తాగాగా మార్పులు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఈ దేశంలో తాత్కాలికంగా ఉంటున్న విదేశీయులు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే, ఇకపై తప్పనిసరిగా తమ మాతృదేశానికి వెళ్లాలని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) స్పష్టం చేసింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధి జాక్ కహ్లర్ కొత్త పాలసీ మెమోను విడుదల చేశారు. అమెరికా వలస చట్టాల అసలు ఉద్దేశాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తేల్చి చెప్పారు. దీంతో విజిట్ వీసా లేదా తాత్కాలిక వీసాపై ఉంటూ గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారిలో ఆందోళన మొదలైంది.

అయితే ఈ నిబంధనల్లో కొందరికి మినహాయింపు ఉంటుందని తెలపింది. కొన్ని ప్రత్యేక, అసాధారణ పరిస్థితుల్లో ‘అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్’ ద్వారా అమెరికా నుంచే గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అటువంటి మినహాయింపు కోరే వారి దరఖాస్తులను అధికారులు అత్యంత క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎవరైనా గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుని అది తిరస్కరణకు గురైతే, వారు అమెరికాలో అక్రమంగా ఉండకుండా చూసేందుకు ఈ కొత్త నిబంధనలు దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు.

వలస వ్యవస్థను దుర్వినియోగం కాకుండా చూడటమే ఈ విధానం ప్రధాన ఉద్దేశమని జాక్ కహ్లర్ వివరించారు. ముఖ్యంగా విద్యార్థులు, తాత్కాలిక కార్మికులు, టూరిస్టు వీసాపై వచ్చిన వారు తమ పని పూర్తికాగానే దేశాన్ని వీడి వెళ్లాలని, గ్రీన్‌కార్డు హోదా పొందేందుకు అమెరికాకు రావడం ఒక మెట్టుగా మారకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ విధానం వల్ల వలసల ప్రక్రియ మరింత క్రమబద్ధీకరించబడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

యూఎస్‌సీఐఎస్‌ చేపట్టిన కఠిన చర్యల ఫలితంగా ఇప్పటికే తీవ్ర ప్రభావం చూపింది. 2027 ఆర్థిక సంవత్సరంలో హెచ్-1బీ వీసా దరఖాస్తుల సంఖ్య ఏకంగా 38.5 శాతం పడిపోయింది. వీసాల ఆమోదంలో కూడా సంస్థ తన పద్ధతిని మార్చుకుంది. కేవలం ఉన్నత డిగ్రీలు, అధిక వేతనాలు పొందుతున్న నైపుణ్యం కలిగిన అభ్యర్థులకే పెద్దపీట వేస్తున్నట్లు యూఎస్‌సీఐఎస్‌ పేర్కొంది.

టాలీవుడ్ కి కొత్త విలన్స్ కావాలి... అదే బాటలో ఉన్న కొంతమంది హీరోలు...

Tollywood New Villains
Tollywood New Villains

Tollywood New Villains: సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణించడం అనేది అంత ఆశామాషీ వ్యవహారం కాదు. చేసిన ప్రతి సినిమాతో ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది. స్టార్ హీరోలు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటే కొంతమంది హీరోలు వాళ్ళకంటూ ఒక సక్సెస్ ని సాధించడానికి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే హీరోలు కొంతమంది విలన్స్ గా మారి తమ సత్తా చాటుతున్నారు. ఇక ఇప్పటికే జగపతిబాబు, శ్రీకాంత్ లాంటి నటులు విలన్లుగా మారి వాళ్ళ సత్తా చాటుకుంటున్న క్రమంలో ఇప్పుడు రాజశేఖర్, మోహన్ బాబులు సైతం విలన్స్ గా అవతారం ఎత్తారు. ఇక వాళ్లతో పాటుగా కొంతమంది కుర్ర హీరోలు కూడా విలన్లుగా అవతరించడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇప్పటికే ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో హీరోగా పరిచయమైన కార్తికేయ సైతం నాని ని హీరోగా చేసిన ‘గ్యాంగ్ లీడర్’ మూవీ లో విలన్ గా నటించాడు.

మరోసారి తను ఫుల్ టైం విలన్ గా నటించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది… ఇక నవీన్ చంద్ర సైతం విలన్ గా అవతరించి పలు సక్సెస్ లను కూడా సాధించాడు. ఇక ఇప్పుడు కూడా కొంతమంది ఫేడౌట్ హీరోలు విలన్స్ గా రాబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.

ఇక వాళ్ళు ఎవరు అనే విషయంలో క్లారిటి లేదు. కానీ మొత్తానికైతే కొంతమంది స్టార్ హీరోలు సైతం విలన్లుగా అవతరించడానికి సిద్ధమవుతున్నారని సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి… కొత్త యాక్టర్లు విలనిజాన్ని ప్రదర్శిస్తే సినిమాలు కూడా చాలా ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది.

అలా కాదని ఎప్పుడు చూసే రొటీన్ మొహాల్ని చూస్తే ఆ ఫ్రెష్ ఫీల్ రావడం లేదని చాలామంది ఆడియన్స్ కూడా వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. కాబట్టి ఇండస్ట్రీలో కొత్త విలనిజాన్ని పండించడానికి కొత్త నటులు రావడం అనేది చాలా వరకు ప్లస్ అవుతుందనే చెప్పాలి…చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకెంత మంది హీరోలు విలన్స్ గా మారబోతున్నారు అనేది…

దేశంలో ఇక పెట్రోల్ ధరలను భరించలేమా? ఏం జరుగుతోంది..

Petrol Price Hike In India
Petrol Price Hike In India

Petrol Price Hike In India: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు భారత ఇంధన ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల సెంబ్లీ ఎన్నికల కరాణంగా దాదాపు రెండు నెలలు ధరలు పెంచకుండా భవించిన కేంద్రం.. ఎన్నికలు ముగియగానే వరుసగా పెట్రో బాదుడు మొదలు పెట్టింది. గడిచిన పది రోజుల్లో మూడుసార్లు ధరలు పెంచి సామాన్యుడిపై తీవ్ర భారం మోపింది. క్రూడాయిల్‌ ఒత్తిడి, యిల్‌ కంపెనీల ఒత్తిడితో మే 15న పెట్రోల్, డీజిల్‌ ధరలపై రూ.3 చొప్పున పెంచింది. మే 19న పెట్రోల్‌పై 86 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెంచింది. తాజాగా మే 23న మళ్లీ పెట్రోల్‌ లీటర్‌కు 87 పైసలు, డీజిల్‌కు 91 పైసలు, సీఎన్జీ కేజీకి రూ.1 పెరిగాయి.

యుద్ధ ప్రభావమే అంటున్న కంపెనీలు..
ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు దీర్ఘకాలం నష్టాలను భరించాయని చెబుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో అధిక ధరలకు క్రూడాయిల్‌ కొనుగోలు చేయడం వల్ల వేల కోట్ల ఆర్థిక నష్టం ఏర్పడిందని వారి వాదన. కేంద్ర ప్రభుత్వం కూడా ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచాలనే ఉద్దేశంతో ఎక్సైజ్‌ సుంకాన్ని తాత్కాలికంగా తగ్గించి, ధరలను స్థిరంగా ఉంచడానికి ప్రయత్నించింది. అయితే ఇప్పుడు ఆ ఒత్తిడి తట్టుకోలేక ధరలు పెంచుతోంది. హర్ముజ్‌ జలసంధి ఉద్రిక్తతలు – సరఫరా గొలుసు ముప్పుఅమెరికా–ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, హర్ముజ్‌ జలసంధి వద్ద ఏర్పడిన అనిశ్చితి ప్రపంచ చమురు సరఫరాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ జలసంధి ద్వారా ప్రపంచంలోని గణనీయమైన చమురు రవాణా జరుగుతుంది. దీని వల్ల నౌకా రవాణా ఖర్చులు పెరగడంతోపాటు సరఫరా తగ్గి, ధరలు ఎగిరిపోతున్నాయి.

పెప్పు ఇక్కడితో ఆగదు..
ప్రస్తుత పెంపు ఇక్కడితో ఆగకపోవచ్చని, మరిన్ని దశల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక, మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. కంపెనీలు ఇప్పటి వరకు చేసిన పెంపు సరిపోదని, ఇంకా కొన్ని వారాలు ఈ ప్రక్రియ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. వినియోగదారులపై పడుతున్న భారం ఇంధన ధరల పెరుగుదల సరాసరి ప్రజల జీవన వ్యయాన్ని పెంచుతుంది. రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయలు, పండ్లు, పాలు, ఇతర రోజువారీ వస్తువుల ధరలు కూడా ఎగసేత్తే ప్రమాదం ఉంది. ఇప్పటికే ద్రవ్యోల్బణ ఒత్తిడిలో ఉన్న మధ్యతరగతి కుటుంబాలపై ఇది అదనపు భారం. ప్రభుత్వం దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి సారించాలి. పునరుత్పాదక ఇంధనాలు, ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రోత్సాహం, విదేశీ చమురు ఆధారితత్వాన్ని తగ్గించే వ్యూహాలు త్వరగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రపంచ రాజకీయాల్లో ఏర్పడే చిన్న చిన్న మార్పులు కూడా భారతీయుల దైనందిన జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ సవాల్‌ను అవకాశంగా మార్చుకుని, ఇంధన స్వావలంబన వైపు వేగంగా అడుగులు వేయడం దేశ ఆర్థిక స్థిరత్వానికి కీలకం. లేని పక్షంలో, ఇలాంటి షాక్‌లు మరిన్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది.

ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్‌ ఘర్‌ వాపసీ.. సొంత మతంలోకి గిరిజనులు!

Chhattisgarh Ghar Wapsi
Chhattisgarh Ghar Wapsi

Chhattisgarh Ghar Wapsi: ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల కనిపిస్తున్న ఒక సామాజిక ఉద్యమం దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది. మత మార్పిడులు జరిగిన అనేక గిరిజన కుటుంబాలు తమ మూలాలను తిరిగి గుర్తించి, స్వధర్మం వైపు మళ్లుతున్నాయి. ఇది కేవలం మతపరమైన మార్పు మాత్రమే కాకుండా, సాంస్కృతిక గుర్తింపు, సమాజంలోని లోతైన మార్పులను ప్రతిబింబిస్తోంది. ముచ్చిపుర్‌లో తాజా తిరుగుబాటు మే 22న కవార్ధా జిల్లా ముచ్చిపుర్‌ గ్రామంలో జరిగిన కార్యక్రమం ఈ ఉద్యమానికి ఉదాహరణ. సుమారు 200 మంది గిరిజనులు తాము మోసపూరితంగా లేదా తమకు పూర్తిగా అవగాహన లేకుండా మతం మార్చుకున్నట్లు గుర్తించి, తిరిగి హిందూ ధర్మంలోకి ప్రవేశించారు. ఈ కార్యక్రమం స్థానికంగా పండుగ వాతావరణంలో జరిగింది. పొరుగు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. స్థానిక ఎమ్మెల్యే భావన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని, వచ్చినవారి పాదాలు కడిగి సంప్రదాయక రీతిలో స్వాగతం పలికారు. ఇది వ్యక్తిగత స్థాయిలోనూ, రాజకీయంగానూ ఆమె ఈ ఉద్యమాన్ని తీవ్రంగా తీసుకుంటున్నట్లు చూపిస్తోంది.

గిరిజన ప్రాంతాల్లో కొనసాగుతున్న మత మార్పిడి..
ఇటీవలి కాలంలో ఛత్తీస్‌గఢ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు పెరిగాయి. డంగర్‌ గ్రామంలో 70 మంది, కుయికుట్టూర్‌లో 50 మంది, కుల్సిటోగ్రీలో 140 మంది
మరో 115 మంది గిరిజనులు వివిధ ప్రాంతాల్లో తిరిగి వచ్చారు. మొత్తంగా సుమారు 600 మంది ఈ తాజా వేవ్‌లో హిందూ ధర్మానికి తిరిగి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది ఒక్కసారిగా జరిగిన విషయం కాదు. ఉమ్మడి మధ్యప్రదేశ్‌ కాలం నుంచి గిరిజనుల మధ్య మత మార్పిడులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఈ ప్రక్రియ ముందుకు సాగింది. ఇప్పుడు దానికి వ్యతిరేక దిశలో మార్పు కనిపిస్తోంది.

మత మార్పిడులకు కారణాలు..
గిరిజనులు మతం మారడానికి ప్రధాన కారణాలు ఆర్థిక సహాయం, వైద్య సౌకర్యాలు, చదువు అవకాశాలు మరియు సామాజిక ఒత్తిళ్లు అని స్థానికులు చెబుతున్నారు. అయితే కాలక్రమేణా వారు తమ సంస్కృతి, ఆచారాలు, ఆధ్యాత్మికతతో తమను తాము అనుసంధానం చేసుకోవడం ద్వారా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఘర్‌ వాపసీ ఉద్యమం ఇక్కడ వ్యక్తుల స్వేచ్ఛాపూర్వక నిర్ణయంగా చూడాలని ఉద్యమకర్తలు వాదిస్తున్నారు. ఇది బలవంతపు మార్పిడులకు వ్యతిరేకంగా ఒక సామాజిక స్పందనగా కనిపిస్తోంది. సామాజిక–రాజకీయ పరిణామాలుఈ ఉద్యమం ఛత్తీస్‌గఢ్‌ రాజకీయాల్లో కూడా ప్రభావం చూపుతోంది. సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు దీన్ని సాంస్కృతిక పునరుజ్జీవనంగా చూస్తున్నారు. గిరిజన సమాజాల్లో మత మార్పిడులు ఎప్పుడూ సున్నితమైన అంశం. ఇవి కేవలం వ్యక్తిగత నమ్మకాలతో ముగియవు. సంస్కృతి, భూమి, సామాజిక నిర్మాణంతో ముడిపడి ఉంటాయి.

ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న ఈ మార్పు భారతదేశంలోని గిరిజన సమాజాల్లో జరుగుతున్న లోతైన సాంస్కృతిక ఆత్మపరిశీలనను ప్రతిబింబిస్తోంది. ఇది ఎంతవరకు స్వచ్ఛందంగా, ఎంతవరకు సంఘటిత ఉద్యమంగా ఉందనేది స్వతంత్ర అధ్యయనాలు నిర్ధారించాలి. అయితే ఒక విషయం స్పష్టం గిరిజనులు తమ గతం, వారసత్వం, గుర్తింపును తిరిగి కోరుకుంటున్నారు. ఈ ప్రక్రియ శాంతియుతంగా, హింసాత్మకంగా కాకుండా కొనసాగాలని ఆశించాలి.

వెంకటేష్ ఎవరితోనైనా మల్టీ స్టారర్ మూవీ చేసేస్తాడా..? కారణమేంటంటే..?

Venkatesh Multistarrer Movies
Venkatesh Multistarrer Movies

Venkatesh Multistarrer Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. విక్టరీ వెంకటేష్ లాంటి నటుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. మల్టీ స్టారర్ సినిమా అంటే చాలు వెంకటేష్ గుర్తుకొస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు చాలామంది యంగ్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలను చేస్తున్నాడు. అలాగే సీనియర్ హీరోలతో పాటు కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఈ సంవత్సరం చిరంజీవి హీరోగా వచ్చిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాలో సైతం నటించి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. వెంకటేష్ సినిమా అంటే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి వస్తారు. కాబట్టి అతన్ని సినిమాలో భాగం చేయాలని చాలామంది దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తుండటం విశేషం… ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెస్ లను సాధించినా కూడా రాని గుర్తింపు విక్టరీ వెంకటేష్ కి తను చేసిన సినిమాలతో వచ్చింది.

ఆయన ఎలాంటి ఈగో లేకుండా చాలామంది హీరోలతో కలిసి నటించడానికి ఆసక్తి చూపిస్తాడు. కాబట్టి అతనంటే చాలామందికి అభిమానం ఉంది. అతనికి యాంటీ ఫ్యాన్స్ కూడా ఎవరు ఉండరు. అందర హీరోల ు అభిమానులు అతని సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఉంటారు. ఇక అలాంటి వెంకటేష్ మరోసారి మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

శర్వానంద్ చేయబోతున్న కొత్త సినిమాలో వెంకటేష్ ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు. వెంకటేష్ ఆ సినిమాకు ఎందుకు ఒప్పుకున్నాడని కొంతమంది వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటే ఆ సినిమాలో అతని పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉందట. అందువల్లే వెంకటేష్ ఆ పాత్రను ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది… మరి ఆయన ఆ పాత్రతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.

ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాతో ఎలాంటి విజయాన్ని మూటగట్టుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాలో కళ్యాణ్ రామ్ తో కలిసి నటించబోతున్నాడు. మొత్తానికైతే మల్టీ స్టారర్ సినిమా అంటే చాలు వెంకటేష్ అందరికి గుర్తుకు వస్తుండడం విశేషం…

నాగార్జున 100 వ సినిమా క్లైమాక్స్ ఇలా డిజైన్ చేశారేంటి..?

Nagarjuna 100th Movie
Nagarjuna 100th Movie

Nagarjuna 100th Movie: అక్కినేని నాగార్జున తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నాడు. అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన నాగార్జున కెరియర్ మొదట్లో చేసిన సినిమాలతో అనుకున్న విజయాలను సాధించలేదు. పెను సంచలనాలను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇకమీదట కూడా ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది… ఇక ఇప్పుడున్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియా బాట పడుతుంటే నాగార్జున మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం తన వందో సినిమాని చేస్తూ బిజీగా ఉన్నాడు. గత సంవత్సరం ఆయన కుబేర, కూలీ లాంటి రెండు సినిమాల్లో నటించాడు. వీటిలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించాడు.

దానివల్ల నాగార్జున ఎలాంటి పాత్రలోనైనా నటించగలిగే కెపాసిటి తనకు ఉందని చాలామంది నమ్ముతున్నారు. ఇక వైవిధ్యమైన పాత్రలు కూడా చేసే అవకాశం తనకు దక్కుతుంది. ప్రస్తుతం ఆయన తన వందో సినిమా పూర్తయిన తర్వాత మిగతా సినిమాల గురించి ఆలోచిస్తారట.

ప్రస్తుతానికైతే ఈ సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసి సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. నిజానికి సీనియర్ హీరోలందరు తనదైన రీతిలో సత్తా చాటుకుంటుంటే నాగార్జున ఒక్కడే వెనుకబడిపోయాడు… నాగార్జున 100 వ సినిమాలో క్లైమాక్స్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట.

నాగార్జున ఏడిపించే క్లైమాక్స్ ని చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకు ముందు ఎప్పుడు నాగార్జున అంత ఎమోషనల్ క్లైమాక్స్ అయితే మనకు ఇవ్వలేదని సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి నాగార్జున చివర్లో చనిపోతాడా లేదంటే సినిమాకు సంబంధించి ఏదైనా త్యాగం చేసే అవకాశం ఉందా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి… సినిమా క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే…

మహేష్ బాబు వారణాసి మూవీ కోసం అన్ని గంటల పాటు వాటర్ లో ఉన్నాడా..?

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటే ఆ సినిమా మీద తన పూర్తి ఫోకస్ తో వర్క్ చేస్తుంటాడు. దర్శకుడు ఏది అడిగితే అది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అలాగే సినిమా కోసం విపరీతంగా కష్టపడుతుంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ‘వారణాసి’ సినిమా కోసం ప్రస్తుతం మహేష్ బాబు విపరీతమైన కష్టాలైతే పడుతున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మహేష్ బాబు మంచి గుర్తింపైతే వస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళి మహేష్ బాబు విపరీతంగా కష్టపడుతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. దాదాపు ఒక ఎనిమిది గంటలపాటు ఆయన వాటర్ లోనే ఉన్నాడట. దానివల్ల అతనికి జలుబు కూడా అయింది. ఆ ఫైట్ సీక్వెన్స్ ఇంకా పూర్తి కాలేదట.

మహేష్ బాబుకు జలుబు అయిందని చెప్పి కొద్దిరోజుల పాటు రెస్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా జక్కన్న మహేష్ బాబు తోనే ఆ సీక్వెన్స్ చేయిస్తున్నాడు. పెద్దగా డూప్ ను కూడా వాడడం లేదట. ఎందుకంటే అందులో క్లోజ్ షాట్స్ ఎక్కువగా ఉండటం వల్ల మహేష్ బాబు అయితేనే దాన్ని పర్ఫెక్ట్ గా పోట్రే చేయగలుగుతాడు.

డూప్ ని పెడితే తెలిసిపోతుంది అనే ఉద్దేశ్యంతోనే ఆయన మహేష్ బాబు మీదనే ఎక్కువ ఫోకస్ చేసి ముందుకు వెళ్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది. మహేష్ బాబు మాత్రం ఈ సినిమాతో విపరీతంగా కష్టపడటమే కాకుండా ఇంతకుముందు ఎన్నడు లేని విధంగా ఆయన తన బాడీని షేప్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా రిలీజ్ అయితే మహేష్ బాబుకు మంచి గుర్తింపు రావడమే కాకుండా అతను ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా మారిపోతాడు అంటూ పలువురు సినిమా మేధావులు సైతం కామెంట్స్ చేస్తున్నారు… రాజమౌళి సైతం ఈ సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించడమే టార్గెట్ గా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు…

చిరంజీవి బాబీకి పెట్టిన కండిషన్స్ ఇవే... తేడా జరిగితే అంతే...

Chiranjeevi Bobby Movie Item Song Removed
Chiranjeevi Bobby Movie Item Song Removed

Chiranjeevi Bobby Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమా రీసెంట్ గా ఓపెనింగ్ జరుపుకుంది. తొందరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ జరగబోతుంది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ మీద చిరంజీవి చాలా వరకు అంచనాలైతే పెట్టుకున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. దాంతో బాబీని నమ్మి మరోసారి అతనికి అవకాశమైతే ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో బాబీ చిరంజీవిని చాలా వైల్డ్ గా చూపించబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందట. 50 సంవత్సరాల వ్యక్తి తన కూతురికి ఎలా అండగా నిలిచాడు. తన కూతురికి వచ్చిన కష్టం ఏంటి అనే విషయాలను కూడా ఇందులో చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది.

చిరంజీవి బాబీ కి కొన్ని కండిషన్స్ పెట్టారంట. ఈ సినిమా బడ్జెట్ ఓవర్ గా కాకూడదని అలాగే సినిమా స్క్రిప్ట్ విషయంలో నాకు ఏదైతే చెప్పావో దాని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలని ఇక స్క్రిప్ట్ ని ఎప్పుడు కూడా మార్చాల్సిన అవసరం ఉండొద్దని చెప్పారట. తనకు ఏదైతే చెప్పాడో దాన్నే తీయాలని స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా చిరంజీవి బాబీ కి చెప్పినట్టుగా తెలుస్తుంది.

బాబీ కూడా చిరంజీవి పెట్టిన కండిషన్స్ కి ఒప్పుకొని సినిమా చేయడానికి రంగంలోకి దిగుతున్నాడు. ఇక ఇప్పటివరకు చిరంజీవి చేసిన సినిమాలు గొప్ప విజయాలను సాధించిన కూడా ఆయనకు సెకండ్ ఇన్నింగ్స్ లో రావాల్సినంత గుర్తింపు రావడం లేదు. ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య సినిమాలు తప్ప మిగతా సినిమాకు ఆడలేదు.

ఇక ఈ ఇయర్ మన శంకర్ వరప్రసాద్ మూవీ సూపర్ సక్సెస్ అయిన కూడా అది సంక్రాంతి హిట్ అని చిరంజీవి రేంజ్ సినిమా కాదని చాలామంది దాన్ని విమర్శించారు. ఇక ఇప్పటికైనా చిరంజీవి రేంజ్ సినిమాతో వచ్చి మరోసారి తన సత్తా చాటుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

బిజెపికి నో చెప్పిన చంద్రబాబు!

Chandrababu BJP
Chandrababu BJP

Chandrababu BJP Decision: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రం నుంచి నలుగురు సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు. వారి స్థానంలో కొత్త వారి ఎన్నిక జరగనుంది. కూటమికి ఏకపక్ష బలం ఉండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడే అవకాశం లేదు. అయితే ఈ నాలుగు పదవులను కూటమి పార్టీలు ఎలా సర్దుకుంటాయి అన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే పదవీ విరమణ చేస్తున్న వారిలో సానా సతీష్ టిడిపికి చెందిన వారే. ఆయనకు మరోసారి రెన్యువల్ ఖాయం. మిగతా మూడు పదవులు మాత్రం కూటమిలోని మూడు పార్టీలు సర్దుకుంటాయని అంతా భావిస్తున్నారు. కానీ ఇప్పుడు కొత్త ప్రచారం మొదలైంది. టిడిపి మూడు పదవులు తీసుకుని ఒక్క పదవి మాత్రం మిత్రపక్షాలకు ఇచ్చేందుకు చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

* రెండుసార్లు బిజెపికి అవకాశం..
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుసార్లు రాజ్యసభ పదవుల భర్తీ జరిగింది. అయితే ఆ రెండుసార్లు బిజెపికి ఛాన్స్ ఇచ్చింది. ఎందుకంటే రాజ్యసభలో బిజెపి బలం తక్కువగా ఉంది. కేంద్ర పెద్దల విజ్ఞప్తి మేరకు చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చి అప్పట్లో బీజేపీకి రెండు ఎంపీ పదవులు ఇచ్చారు. అయితే మరో మిత్రపక్షం జనసేనకు ఇంతవరకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. ఈసారి తప్పకుండా తమకు అవకాశం ఇవ్వాలని జనసేన కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో బిజెపికి ఈసారి ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కు సమాచారం ఇచ్చారు చంద్రబాబు. అయితే కేంద్ర పెద్దలు పట్టుబడితే మాత్రం చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉంది.

* ఆశావహులు అధికం.
తెలుగుదేశం పార్టీలో సీనియర్లు చాలామంది ఉన్నారు. సానా సతీష్ కు విడిచిపెట్టగా.. మరో రెండు రాజ్యసభ సీట్లు దక్కితే సామాజిక సమీకరణలను, సీనియారిటీని పరిగణలోకి తీసుకొని ఎంపిక చేయాల్సి ఉంటుంది. చాలామంది ఆశావహులు ఉండడంతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఖాళీ అవుతున్న నాలుగింటిలో.. రెండింటిని వదులుకుంటే తమకు ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ద్వారా కేంద్ర పెద్దలకు తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజ్యసభలో బిజెపి బలం పెరగడంతో హై కమాండ్ పెద్దలు సైతం పెద్దగా పట్టుబట్టే అవకాశం లేదు. ఒకవేళ పట్టుబడితే మాత్రం చంద్రబాబు మెత్తబడక తప్పదు.

ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమాలను బాలయ్య ఎప్పుడో చేసేశాడా..?

Balakrishna Nippuravva Movie
Balakrishna Nippuravva Movie

Balakrishna Nippuravva Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. మన స్టార్ హీరోలందరు భారీ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదిస్తున్న క్రమంలో కొంతమంది దర్శకులు మాత్రం డిఫరెంట్ సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇప్పటివరకు తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకులు ప్రస్తుతం పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు… ఇక కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత ప్రభాస్ తో చేసిన ‘సలార్’ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…

ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాలన్నీ డార్క్ షేడ్ లో కనిపించి కనిపించని విజువల్స్ తో ఉంటాయని నిజానికి ఆయన కోల్ మైన్స్ లో ఎక్కువగా సన్నివేశాలను రాసుకొని అక్కడే సినిమా మొత్తాన్ని చిత్రీకరించే విధంగా స్క్రిప్ట్ డిజైన్ చేసుకుంటూ ఉంటాడు. అయితే అది చూసిన ప్రేక్షకులు చాలా కొత్త అనుభూతిని పొందుతున్నారు.

నిజానికి 1993 వ సంవత్సరంలో చేసిన ‘నిప్పురవ్వ’ సినిమాలో కోల్ మైన్స్ గురించి అక్కడివాళ్ళు పడే బాధల గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఈ సినిమా కోసం బాలయ్య విపరీతంగా కష్టపడ్డాడు. ఈ మూవీ ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో బాలయ్య కొంతవరకు డీలా పడ్డాడు. ఇక కోల్ మైన్స్ గురించి ప్రశాంత్ నీల్ కంటే ముందే బాలయ్య బాబు ప్రస్తావించాడు.

నిప్పు రవ్వ పేరుతో సినిమా కూడా చేశాడంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో బాలయ్య బాబు అభిమానులు కొన్ని వార్తలను వైరల్ చేస్తున్నారు. నిజానికి బాలయ్య అప్పట్లో కొన్ని ఎక్స్పరిమెంటల్ సినిమాలను కూడా చేశాడు. అవి అనుకున్న రేంజ్ లో ఆడకపోవడంతో సక్సెస్ ఫుల్ సినిమాల వైపే అతను పరుగులు తీశాడు…