Home Blog Page 237

పాకిస్తాన్ కు దిమ్మతిరిగేలా చేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. ఏకంగా 22 మంది..ఇది మామూలు దెబ్బ కాదు..

Baloch Liberation Army
Baloch Liberation Army

Baloch Liberation Army: ఇన్నాళ్లపాటు భారత్ లో మతకల్లోలాలు రేపింది. చేతకాని ప్రభుత్వాలు అధికారంలో ఉండడంతో దాడులు చేసింది. భీకరమైన ప్రాణ నష్టానికి కారణమైంది. అంతేకాదు సరిహద్దుల్లో రక్తపుటేర్లు ప్రవహించేలా చేసింది. అంతేకాదు మన దేశానికి సంబంధించిన అనేక విషయాలలో వేలు పెట్టి.. అమెరికాతో అంటకాగి ఇబ్బంది పెట్టేది.

ఇంతటి దుర్మార్గమైన పాకిస్తాన్ ఆటలు ఇప్పుడు సాగడం లేదు. మనదేశంలో బలమైన ప్రభుత్వం ఉండడంతో ఉగ్రవాద కార్యకలాపాలలో ముందడుగు పడటం లేదు. పైగా పాకిస్తాన్ దేశంలో గుర్తుతెలియని అజ్ఞాత సాయుధ దళాలు కాల్పులకు పాల్పడుతున్నాయి. ఉగ్రవాదులను అత్యంత సమీపంలో నుంచి కాల్చేస్తున్నాయి. అజ్ఞాత సాయుధ దళాలకు తోడుగా ఇప్పుడు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ రంగంలోకి దిగింది. కొంతకాలంగా పాకిస్తాన్ ప్రభుత్వం మీద బలూచిస్థాన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పాకిస్తాన్ నుంచి విడగొట్టి తమను భారత దేశంలో కలపాలని.. లేదా సొంత దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.. అయితే పాకిస్తాన్ కూడా ఆర్మీ ని బలూచిస్థాన్ మీదికి ప్రయోగిస్తోంది. హింసాత్మక ఘటనలకు పాల్పడుతోంది. అయితే బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ దాడులను ఏమాత్రం లెక్కపెట్టడం లేదు. పైగా అంతకుమించి అనే స్థాయిలో దాడులు చేస్తోంది.

తాజాగా క్వెట్టా చమన్ గేట్ దగ్గరలో ఒక ప్యాసింజర్ రైలు లక్ష్యంగా చేసుకొని. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ దాడిలో మొత్తం 23 మంది చనిపోయారు. 47 మంది గాయపడ్డారు. ఇందులో ఎక్కువగా చిన్నారులు.. మహిళలు ఉన్నారు. అధికారులు సమాచారం అందుకొని అక్కడికి చేరుకున్నారు. వీరిలో చాలామంది పరిస్థితి దారుణంగా ఉంది. పాకిస్తాన్ దేశానికి భారీగా నష్టం కలిగించాలి అనే ఉద్దేశంతోనే ఈ దాడికి పాల్పడినట్టు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్తాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ లో ఆ దేశ ఆర్మీ పెషవర్ ప్రాంతానికి వెళ్తుందనే సమాచారంతో ఈ దాడికి పాల్పడింది బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.

బాంబు పేలుడు వల్ల ఘోరమైన నష్టం జరిగింది. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల భవనాల అద్దాలు పగిలి పోయాయి. కిటికీలు విరిగిపోయాయి. రైల్వే ట్రాక్ దగ్గరగా ఉన్న అనేక వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఒక భోగికి మంటలు కూడా అంటుకున్నాయి.

నిన్న అధ్యక్షుడు ట్రంప్ మీద.. నేడు వైట్ హౌస్ దగ్గర.. అమెరికాలో భద్రత లేదా

US Security Concerns
US Security Concerns

US Security Concerns: చీమ చిటుక్కుమన్నా సరే వెంటనే తెలిసిపోతుంది. ప్రత్యర్థి దేశాలు దాడులు చేయడం కాదు.. దాడులు చేసేందుకు రూపకల్పన చేస్తున్న సరే తెలిసిపోతుంది. ఒక రకంగా అమెరికా చుట్టూ భద్రత అనేది దుర్భేద్యం లాగా ఉంటుంది. ఎప్పుడు ఏం జరిగినా సరే అక్కడి వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తాయి.

అయితే అమెరికా మీద ఇప్పటివరకు ఇటువంటి అభిప్రాయాలు మాత్రమే ఉండేవి. పైగా రక్షణ వ్యవస్థగా ఇటీవల కాలంలో ఇజ్రాయిల్ మాదిరిగా డోమ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు అమెరికా ప్రణాళికలు రూపొందించింది. పెంటగాన్ ప్రాంతంలో ఉన్న అమెరికా రక్షణ వ్యవస్థకు భారీగా నిధులు ఇవ్వడం మొదలుపెట్టింది. ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా రక్షణ కోసం దండిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు.

ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ అమెరికాలో భద్రత గురించి సరికొత్త ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అమెరికాలో అధ్యక్షుడు నివాసం ఉండే వైట్ హౌస్ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. శనివారం ఒక వ్యక్తి వైట్ హౌస్ చెక్ పాయింట్ వద్ద సెక్యూరిటీ అధికారులపై కాల్పులకు దిగాడు. అమెరికా సీక్రెట్ సర్వీస్ ఆఫీస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈ విషయాలను వెల్లడించింది. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఒక వ్యక్తి 17వ స్ట్రీట్ పెన్సిల్వేనియా ఎవెన్యూ దగ్గరలో వైట్ హౌస్ చెక్పోస్ట్ వద్దకు వచ్చాడు. తన వద్ద ఉన్న తుపాకీని బయటకు తీశాడు. సెక్యూరిటీ అధికారులను లక్ష్యంగా చేసుకుని పైరింగ్ మొదలు పెట్టాడు. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. తిరిగి కాల్పులు మొదలుపెట్టారు. దీంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఈ ఘటన జరిగినప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ లో ఉండడం విశేషం.

ఇటీవల ట్రంప్ మీద కూడా కాల్పులు జరిగాయి. ఆయన ఒక సమావేశంలో పాల్గొన్నప్పుడు ఓ వ్యక్తి అందులోకి వచ్చాడు. కాల్పులు జరిపాడు. అయితే ఆ ఘటనలో ట్రంప్ ను ఆయన అంతరంగీక సిబ్బంది కాపాడారు.. వెంటనే సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్లారు.. ఈ ఘటనలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ ఘటనకు మర్చిపోకముందే వైట్ హౌస్ సమీపంలో కాల్పులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకొని ఇలా చేయడం పట్ల అమెరికాలో భద్రత పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సర్పంచ్ సాబ్ కు 26.75 కోట్లు.. అందుకోసమే ఖర్చు పెట్టాం.. అసలు విషయం చెప్పిన పాంటింగ్

Ricky Ponting And Shreyas Iyer
Ricky Ponting And Shreyas Iyer

Ricky Ponting And Shreyas Iyer: ఈ ఐపిఎల్ సీజన్ ప్రారంభంలో వరుసగా విజయాలు సాధించి టేబుల్ టాపర్ గా నిలిచింది పంజాబ్ జట్టు. పంజాబ్ జట్టుకు సారధిగా శ్రేయస్ అయ్యర్ వ్యవహరిస్తున్నాడు. గతంలో కూడా పంజాబ్ జట్టును అతడు ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. ఇప్పుడు అయ్యర్ శనివారం నాటి లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏకంగా సెంచరీ చేశాడు. తన జట్టుకు అవసరమైన సందర్భంలో విజయం అందించాడు. ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచాడు.

అయ్యర్ సూపర్ సెంచరీ చేసిన నేపథ్యంలో అతడి మీద ప్రశంసలు కురుస్తున్నాయి. ఇన్నాళ్లపాటు పంజాబ్ జట్టు కు వరుస ఓటములు ఎదురైన నేపథ్యంలో అయ్యర్ మీద విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితే అతడు వాటన్నిటిని సానుకూలంగా తీసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా తన జట్టుకు అద్భుతమైన విజయం అందించడమే కాదు.. సూపర్ సెంచరీ చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు.

అయ్యర్ సెంచరీ మీద ఆ జట్టు కోచ్ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ” అయ్యర్ అద్భుతమైన ఆటగాడు. అతడు మెరుపు వేగంతో పరుగులు తీస్తాడు. పైగా జట్టును కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటాడు. ఆపద్బాంధవుడు అనే పాత్రకు అతడు బలమైన ఉదాహరణ. అందువల్లే అతడిని వేలంలో 26.75 కోట్లకు కొనుగోలు చేశాం.. అయ్యర్ పరిణతి ఉన్న ఆటగాడు. ఎమోషన్స్ కొన్ని సందర్భాలలో దాచుకుంటాడు. మరికొన్ని సందర్భాలలో వ్యక్తం చేస్తుంటాడు. సహచర ఆటగాళ్ల మీద సహనాన్ని కలిగి ఉంటాడు. వారు ఎటువంటి ఆట తీరు ప్రదర్శించినప్పటికీ ఏమాత్రం ఆగ్రహానికి గురికాడు. ఫలితం ఎలా ఉన్నప్పటికీ సరే జట్టు మీద నిందలు మోపలేడు. అతడు నీ జాతీయ జట్టులో చూడబోతుండడం ఆనందాన్ని కలిగిస్తోందని” పాంటింగ్ వ్యాఖ్యానించాడు.

పంజాబ్ జట్టు తరఫున సెంచరీ చేసిన మూడవ ఆటగాడిగా అయ్యర్ కొనసాగుతున్నాడు. 2020లో కేఎల్ రాహుల్.. 2011లో గిల్ క్రిస్ట్ ఈ ఘనత అందుకున్నారు.

ఐపీఎల్ లో లక్ష్యాన్ని సాధించే క్రమంలో సెంచరీ చేసిన నాలుగవ సారథిగా అయ్యర్ నిలిచాడు. ఈ జాబితాలో సెహ్వాగ్, కోహ్లీ, సంజు ముందు స్థానంలో ఉన్నారు.

గడిచిన సీజన్ నుంచి లక్నో జట్టు మీద పంజాబ్ నాలుగు మ్యాచ్లో విజయం సాధించింది.. తద్వారా సరికొత్త రికార్డును తన పేరు మీద రాసుకుంది.

పంజాబ్ గెలిచింది.. రాజస్థాన్.. కోల్కతా ఏం చేస్తాయో..

IPL Playoff Race
IPL Playoff Race

IPL Playoff Race: ఐపీఎల్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు హైదరాబాద్, బెంగళూరు, గుజరాత్ ప్లే ఆఫ్ వెళ్లిపోయాయి.. నాలుగో స్థానం కోసం పంజాబ్, కోల్కతా, రాజస్థాన్ జట్ల మధ్య విపరీతమైన పోటీ ఉంది. గెలవాల్సిన మ్యాచ్లో పంజాబ్ విజయం సాధించడంతో.. ఆ జట్టు కాస్త ముందడుగు వేసింది. అయితే రాజస్థాన్.. కోల్కతా జట్లకు కూడా అవకాశం ఉండడం.. ఈ రెండు జట్లు తమ తదుపరి మ్యాచులు ఆడే అవకాశం ఉండడంతో.. ఏదైనా జరగవచ్చని క్రికెట్ విశేషకులు అంచనామిస్తున్నారు.

లీగ్ దశలో ఆదివారం నాడు రెండు కీలకమైన మ్యాచులు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్ల్లో గెలిచిన వారికి నాలుగో బెర్త్ దక్కుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.. నాలుగో బెర్త్ కోసం పంజాబ్, రాజస్థాన్, కోల్కతా జట్లు సిద్ధంగా ఉన్నాయి. పంజాబ్ ఖాతాలో 15 పాయింట్లు
.. రాజస్థాన్ ఖాతాలో 14 పాయింట్లు.. కోల్కతా ఖాతాలో 13 పాయింట్లు ఉన్నాయి..

ఆదివారం మధ్యాహ్నం జరిగే మ్యాచ్లో రాజస్థాన్ గనుక ముంబై ఇండియన్స్ మీద విజయం సాధిస్తే ఎటువంటి సమీకరణాల అవసరం లేకుండానే నాలుగో స్థానాన్ని దక్కించుకుంటుంది. అప్పుడు రాజస్థాన్ ఖాతాలో 16 పాయింట్లు ఉంటాయి. ఫలితంగా చివరి మ్యాచ్ తో సంబంధం లేకుండా కోల్కతా, పంజాబ్ ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది.

ముంబై జట్టుతో జరిగే మ్యాచ్ ఒకవేళ గనుక రాజస్థాన్ ఓటమిపాలైతే.. పంజాబ్, కోల్కతా చెట్లకు అవకాశాలుంటాయి. అప్పుడు ఢిల్లీ జట్టుతో జరిగే మ్యాచ్లో కోల్కతా గెలవాల్సి ఉంటుంది.

ఇప్పటివరకు పంజాబ్ జట్టు ఖాతాలో 15 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేట్ కూడా + 0.309 ఉంది. ఇలాంటప్పుడు పంజాబ్ జట్టును అధిగమించాలంటే కోల్కతా అత్యంత భారీ విజయం సొంతం చేసుకోవాలి. ఢిల్లీ జట్టు మీద భారీ అంతరంతో కోల్కతా గెలిస్తే ఖాతాలో 15 పాయింట్లు ఉంటాయి. నెట్ రన్ రేట్ కూడా+0.011 ఉంటుంది.

కోల్కతా జట్టు బెటర్ నెట్ రన్ రేట్ సాధించాలంటే ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు 200 పైగా పరుగుల టార్గెట్ విధించాలి. ఆ తర్వాత 77 పరుగుల అంతరంతో విజయం సాధించాలి.

ఒకవేళ కోల్కతా టార్గెట్ ఫినిష్ చేయడానికి దిగినప్పుడు 200కు పైగా పరుగుల టార్గెట్ ను కేవలం 12.1 ఓవర్లలోనే పూర్తి చేయాలి. అప్పుడు పంజాబ్ జట్టు వెనక్కి వెళ్ళిపోతుంది.. కోల్కతా ముందుకు వస్తుంది.. ఇవన్నీ జరగాలంటే ముంబై ఇండియన్స్ జట్టు మీద రాజస్థాన్ ఓడిపోవాలి. ఒకవేళ గెలిస్తే పంజాబ్.. కోల్కతా బ్యాగులు సర్దుకుని ఇంటికి పోవాలి.

విజయవాడ థార్ కేసు.. తెర వెనుక వైసిపి మంత్రి .. ఇంతకీ ఏం జరిగింది.

Vijayawada Thar Case
Vijayawada Thar Case

Vijayawada Thar Case: విజయవాడ నగరంలోని హై టెన్షన్ రోడ్లో ఇద్దరు యువకులు ఇటీవల తమ థార్ కార్లతో పరస్పరం ఢీ కొట్టుకున్నారు. నడిరోడ్డు పైన రౌడీయిజం చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. చూస్తున్న వాళ్లకు ప్రాణం పోయినంత పని అయ్యింది. పోలీసుల రంగంలోకి దిగిన తర్వాత అసలు కథ మొదలైంది. దీని వెనుక ఏముంది.. అమ్మాయి వ్యవహారం మాత్రమేనా.. ఇంకా ఏదైనా జరిగిందా అనే కోణాలలో పోలీసులు ఎంక్వయిరీ స్టార్ట్ చేశారు.

ఇందులో ఏ 1 బొల్లం ఓం కు మాదకద్రవ్యాల పరీక్ష చేస్తే పాజిటివ్ వచ్చింది.. ఏ 2 రోహిత్ లింగమనేని ఘటన స్థలం నుంచి పారిపోవాలని ప్రయత్నించాడు. అయినప్పటికీ పోలీసులు వదిలిపెట్టలేదు. అతడి వద్ద ఈ సిగరెట్లు.. ఇంకా రకరకాల పాదలు దొరికాయి. కేవలం కాళ్లతో గుద్దుకోవడంతోనే ఈ వ్యవహారం మొదలు కాలేదు. వీరి వాహనాలను తనిఖీ చేసిన పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. ఒకరి వాహనంలో హాకీ కర్రలు.. ఇనుప రాడ్లు బయటపడ్డాయి. మరొకరి కారులో స్టెరాయిడ్ ఇంజక్షన్లు దొరికాయి. ఇందులో రోహిత్ సాయి చదువుకుంటున్నాడు. ఓం తన తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు. సమాజంలో పేరు పొందిన వ్యక్తుల కుమారులైన వీరిద్దరూ ఇంతటి స్థాయిలో పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది.

ఈ ఘటనలో ఒక నిందితుడి వెనుక మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నట్టు టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఆయన తన రాజకీయ పలుకుబడి ప్రయోగించినప్పటికీ పోలీసులు తమ పని తాము చేసుకుపోయారని.. ప్రజలకు పోలీసుల పట్ల నమ్మకాన్ని కలిగించారని టిడిపి నేతలు అంటున్నారు. అందువల్లే థార్ గ్యాంగ్ కు పోలీసుల రేంజ్ అంటే ఏమిటో చూపించారని చెబుతున్నారు..

మత్తు తలకు ఎక్కి.. రాజకీయంగా అండ చూసుకొని.. వీధిలోకి వచ్చే ఇటువంటి రౌడీలకు పోలీసులు తమదైన ట్రీట్మెంట్ ఇచ్చారు. అందువల్లే అర్ధరాత్రి పూట విచ్చలవిడిగా వ్యవహరించిన రౌడీయిజం ఇప్పుడు జైలు గోడల మధ్య మూసుకొని కూర్చుంది. ఉన్మాదంతో గట్టిగా కేకలు వేసిన ఈ రౌడీ యువకులు ఇప్పుడు జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. మత్తు దిగింది కాబట్టి వాస్తవం అర్థమవుతోంది. ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకునే యువకులకు ఈ థార్ గ్యాంగ్ వ్యవహారం ఒక బలమైన గుణపాఠం.

ఎబోలా ముప్పు.. ఆ మూడు దేశాలకు వెళ్లొద్దు.. కేంద్రం కీలక సూచన!

Ebola Virus
Ebola Virus

Ebola Virus: ఆఫ్రికా దేశాలను ఎబోలా వైరస్‌ వణికిస్తోంది. బాధితుల సంఖ్యం వేగంగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తమైంది. ప్రపంచ దేశాలకు కీలక సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారత ప్రయాణికులకు ట్రావెల్‌ అడ్వైజరీ జారీ చేసింది. కాంగో, ఉగాండా, సౌత్‌ సూడాన్‌ దేశాలకు అత్యవసర కారణాలు తప్ప భారతీయులు ప్రయాణించవద్దని స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. అక్కడ నివసించే భారతీయులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఆందోళనకరంగా వ్యాధి తీవ్రత..
కాంగోలో ఇప్పటికే సుమారు 750 కేసులు నమోదు కాగా, 177 నుంచి 204 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనాలు వస్తున్నాయి. ఎబోలా వంటి అతి ప్రమాదకర వైరస్‌ రక్తం, శరీర ద్రవాల ద్వారా వేగంగా వ్యాపించే సామర్థ్యం కలిగి ఉండటం, ప్రత్యేక చికిత్స, టీకా లభ్యత కొరవడటం వంటి అంశాలు ఈ ముప్పును మరింత తీవ్రం చేస్తున్నాయి. ఆఫ్రికా ఖండంలోని అస్థిరత, సరిహద్దు దాటిన కదలికలు వ్యాధి వ్యాప్తిని మరింత సవాలుగా మార్చాయి. గతంలో ఎబోలా అవుట్‌ బ్రేక్‌లు ప్రపంచానికి ఎన్నో హెచ్చరికలు ఇచ్చాయి. కానీ ప్రతిసారీ మనం సిద్ధతలో వెనుకబడటం బాధ్యతావంతమైన పాలనకు మంచి సంకేతం కాదు.భారత్‌ చర్యలు – సానుకూల అడుగుభారత్‌ ఇంకా ఎబోలా కేసులు నమోదు కాకపోవడం శుభవార్త. అయినప్పటికీ కేంద్రం ఎయిర్‌పోర్టుల్లో స్క్రీనింగ్‌ పెంచడం, ప్రయాణికులకు సూచనలు ఇవ్వడం, అవసరమైతే క్వారంటైన్‌ వ్యవస్థలను సిద్ధం చేయడం వంటి చర్యలు ప్రశంసనీయం.

కోవిడ్‌ నుంచి పాఠాలు..
కోవిడ్‌ మహమ్మారి నుంచి నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు ఉపయోగపడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ హెచ్చరికలు కేవలం తాత్కాలికం కాకుండా, దీర్ఘకాలిక వ్యూహంగా మారాలి. వైద్యులు, పరిశోధనా సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు అందరూ ఏకకాలంలో పనిచేయాల్సిన అవసరం ఉంది.

వైద్య సదుపాయాల కొరత..
ఆఫ్రికా దేశాల్లో వైద్య సదుపాయాల కొరత, రాజకీయ అస్థిరత, సమాచార వ్యవస్థ బలహీనతలు వ్యాధి నియంత్రణను కష్టతరం చేస్తున్నాయి. భారత్‌ వంటి దేశాలు తమ సరిహద్దులను రక్షించుకోవడంతోపాటు, అంతర్జాతీయ స్థాయిలో వైద్య సహాయం, టీకా పరిశోధనలు, సాంకేతిక సహకారం అందించడంలో కూడా తన వంతు పాత్ర నిర్వహించాలి. భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారులు మరిన్ని రావచ్చు. కాబట్టి సర్వైలెన్స్‌ వ్యవస్థలను బలోపేతం చేయడం, ఆసుపత్రుల్లో సామర్థ్యం పెంచడం, ప్రజల్లో ఆరోగ్య అవగాహన మెరుగుపరచడం వంటి చర్యలు నిరంతరం కొనసాగాలి.

కేంద్ర ప్రభుత్వం ఎబోలా నేపథ్యంలో చూపుతున్న చురుకైన వైఖరి ప్రశంసనీయం. అయితే ఈ సవాలు మనకు ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా. ప్రపంచం మరింత దగ్గరవుతున్న ఈ కాలంలో ఏ దేశం కూడా ఒంటరిగా సురక్షితం కాదు. సమయోచిత హెచ్చరికలతోపాటు, దృఢమైన ఆరోగ్య రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే మనం భవిష్యత్‌ ముప్పులను ధైర్యంగా ఎదుర్కోగలం.

భోపాల్ లో మెరిసిన ‘పెద్ది’

Peddi Bhopal Event
Peddi Bhopal Event

బొగ్గు నుంచి గ్యాస్‌.. ఇంధన స్వాతంత్య్రవైపు భారత్‌ కీలక అడుగు!

Coal Gasification India
Coal Gasification India

Coal Gasification India: భారతదేశం ఇంధన దిగుమతులపై ఎంతగా ఆధారపడి ఉందో ఇటీవలి ఘటనలు మరోసారి ఉద్ఘాటించాయి. ఎల్‌ఎన్‌జీలో 42 శాతం ఖతార్‌ నుంచి భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. అయితే తాజాగా పశ్చిమాసియా యుద్ధం కారణంగా అమెరికా, ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై దాడిచేశాయి. ఇరాన్‌ గల్ఫ్‌ దేశమైన ఖతార్‌పై దాడిచేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తడంతో భారత్‌కు ఎల్‌ఎన్‌జీ సరఫరా 30 శాతం పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 17 శాతం గ్యాస్‌ సరఫరా తగ్గడం కేవలం భారత్‌ సమస్య మాత్రమే కాదు, అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ స్థిరత్వానికి కూడా హెచ్చరిక.

కేంద్రం కీలక నిర్ణయం..
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఎన్‌జీ కొరత తీర్చడానికి కీలక నిర్ణయం తీసుకుంది. 37,500 కోట్ల రూపాయలతో కోల్‌ గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టుకు చేపట్టిన నిర్ణయం సమయోచితం మాత్రమే కాదు, దూరదృష్టి కలిగిన వ్యూహాత్మక చర్య. బొగ్గు నుంచి గ్యాస్‌ ఉత్పత్తి చేసే ఈ సాంకేతికత ద్వారా దేశం దీర్ఘకాలికంగా విదేశీ ఆధారాలను తగ్గించుకోవడం సాధ్యమవుతుంది.

విదేశాలపై ఆధార పడకుండా..
ఖతార్, దుబాయ్‌ వంటి దేశాలపై ఎల్‌ఎన్‌జీ కోసం అత్యధికంగా ఆధారపడటం భారత్‌ శక్తి భద్రతకు పెద్ద ముప్పు. భౌగోళిక రాజకీయ సంక్షోభాలు ఎప్పుడు ఏ రూపంలో మన సరఫరా గొలుసును దెబ్బతీస్తాయో చెప్పలేం. గతంలో రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం కూడా ఇంధన ధరలను పెంచి భారత్‌ను ఇబ్బంది పెట్టింది. ఇలాంటి సందర్భాల్లో స్థానిక ఉత్పాదకతను పెంచకపోతే, ఆర్థిక వ్యవస్థ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు చేపట్టిన కోల్‌ గ్యాసిఫికేషన్‌ కార్యక్రమం భారత్‌ చరిత్రలో మొదటి సారి ఇంత పెద్ద స్థాయిలో చేపట్టిన ప్రయత్నం. దేశంలో సమృద్ధిగా ఉన్న బొగ్గు వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని, సింథటిక్‌ గ్యాస్‌ ఉత్పత్తి చేయడం ద్వారా దిగుమతులు తగ్గించి, విదేశీ మారక నిల్వలను కాపాడవచ్చు.

ఉత్పత్తిలో సవాళ్లు…
ఈ ప్రాజెక్టు విజయవంతమైతే ఖతార్‌పై మాత్రమే కాక, మొత్తం ఇంధన దిగుమతులపై ఆధారం తగ్గుతుంది. ఉపాధి అవకాశాలు పెరగడం, బొగ్గు ఉత్పత్తి ప్రాంతాల అభివృద్ధి, శక్తి భద్రత వంటి బహుముఖ ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఇది ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా నిలవవచ్చు. ఖతార్‌ వంటి దేశాలపై ఆధారపడిన అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఇలాంటి మార్గాలు అన్వేషించేలా చేస్తుంది. అయితే, ఈ ప్రయత్నం సవాళ్లు లేకుండా కాదు. పర్యావరణ భద్రత, కార్బన్‌ ఉద్గారాల నియంత్రణ, ఆధునిక టెక్నాలజీ అవసరం ఉంది. కార్బన్‌ క్యాప్చర్‌ అండ్‌ స్టోరేజ్‌ (సీసీఎస్‌) వంటి సాంకేతికతలను తప్పనిసరిగా అనుసరించాలి. ప్రారంభ దశలో ఖర్చులు ఎక్కువైనా, దీర్ఘకాలిక లాభాలు భారీగా ఉంటాయి.

ఇంధన రంగంలో స్వాతంత్య్రం సాధించడం ఏ దేశానికైనా జాతీయ భద్రతకు సమానం. ఖతార్‌ సంక్షోభం భారత్‌కు ఒక కఠిన హెచ్చరికగా మారి, స్వయం సమృద్ధి వైపు వేగంగా అడుగులు వేయడానికి కారణమైంది. మోదీ సర్కారు చేపట్టిన కోల్‌ గ్యాసిఫికేషన్‌ కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేస్తే, ఇది కేవలం ఒక ప్రాజెక్టు కాకుండా, భారత్‌ ఇంధన విధానంలోనే ఒక చారిత్రక మలుపుగా నిలుస్తుంది. ఈ దిశలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణ రక్షణ, సమర్థవంతమైన అమలుతో ఈ ప్రయత్నం పూర్తి విజయం సాధించాలని ఆశిద్దాం.

మంత్రులకు మోదీ ర్యాంకింగ్‌.. టాప్‌లో ఉన్నది వీరే!

Modi Cabinet Performance Rankin
Modi Cabinet Performance Rankin

Modi Cabinet Performance Ranking: కేంద్ర మంత్రివర్గ విస్తరణ త్వరలో ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఈసారి విస్తరణలో తెలంగాణకు మరో మంత్రి పదవి రావొచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తన పాలనా శైలిలో మరో కీలక మలుపు తీసుకుంది. కేంద్ర మంత్రులు, వారి శాఖల పనితీరును వివిధ పారామీటర్ల ఆధారంగా మొదటిసారి ర్యాంకులు ఇచ్చారు. వీటిని క్యాబినెట్‌ సమావేశంలో ప్రదర్శించడం ఒక సానుకూల అభివృద్ధి. ఈ చర్య ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత జవాబుదారీగా, ఫలితాల దిశగా నడిపించే దిశలో ముఖ్యమైన అడుగు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొదటి నుంచి తన కేబినెట్‌లో మంత్రులకు, నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు పనితీరులో ర్యాంకులు ఇస్తున్నారు. మోదీ ఇప్పుడు చంద్రబాబును అనుసరిస్తున్నారు.

టాప్‌ పెర్ఫార్మర్లు వీరే..
తాజాగా మోదీ ప్రకటించిన ర్యాంకుల్లో కన్జ్యూమర్‌ అఫైర్స్, బొగ్గు, విద్యుత్, వైద్య శాఖలు వివిధ విభాగాల్లో ఉత్తమ పనితీరు చూపాయి. ఫిర్యాదుల పరిష్కారం, సంక్షోభ నిర్వహణ, ఫైల్‌ పారవేయడం, పరిపాలనా సమర్థత వంటి కీలక అంశాల్లో ఈ శాఖలు ముందుండటం గమనార్హం. ముఖ్యంగా వినియోగదారుల సమస్యల పరిష్కారం, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తీసుకున్న చర్యలు కన్జ్యూమర్‌ అఫైర్స్‌ శాఖను ప్రత్యేకంగా హైలైట్‌ చేశాయి. ఈ ర్యాంకింగ్స్‌ ప్రజలకు మేలు చేసే నిర్ణయాలను త్వరగా అమలు చేయడం, సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడం వంటి లక్ష్యాలతో రూపొందించబడింది. ఇది పాలకుల్లో పోటీ మనస్తత్వాన్ని ప్రోత్సహిస్తుంది. నిర్లక్ష్యానికి తావు లేకుండా చేస్తుంది.

ర్యాంకులు ఎందుకు ముఖ్యమైనవి..
ప్రభుత్వాలు తరచూ పథకాలు ప్రకటిస్తాయి, కానీ వాటి అమలు, ఫలితాలు చాలా సార్లు వెనుకబడి ఉంటాయి. ఇలాంటి సమయంలో శాఖల పనితీరును కొలిచే స్పష్టమైన మెకానిజం ఉండటం ప్రజా సేవా ధోరణిని బలపరుస్తుంది. ఇది మంత్రులు మాత్రమే కాక, సచివాలయాలు, అధికారుల వరకు కూడా జవాబుదారీతనాన్ని పెంచుతాయి. ఈ విధానం ద్వారా ప్రభుత్వం తన నిర్వహణను కార్పొరేట్‌ స్టైల్‌లో వ్యవస్థీకరించడం స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితాల ఆధారంగా ప్రశంసలు, సూచనలు, అవసరమైతే సవరణలు చేయడం ద్వారా పాలనా సామర్థ్యం మెరుగుపడే అవకాశం ఎక్కువ.

ర్యాంకింగ్‌తో సవాళ్లు..
అయితే, ఈ ర్యాంకింగ్‌ వ్యవస్థ పూర్తిగా పారదర్శకంగా, నిష్పాక్షికంగా ఉండాలి. కొన్ని శాఖలు సహజంగా సవాళ్లు ఎక్కువ ఎదుర్కొంటాయి కాబట్టి, పారామీటర్లు సమగ్రంగా, వాస్తవికంగా ఉండాలి. అలాగే, ఈ వ్యవస్థ నిరంతరం కొనసాగి, కేవలం ఒక్క సమావేశానికి పరిమితం కాకుండా ఉండాలి. మొత్తం మీద, ఈ చర్య ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత చురుకుగా, ఫలితభిరుచిగా మార్చడానికి ఉపయోగపడుతుందని ఆశించవచ్చు. ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారం కావడం, పథకాలు సకాలంలో అమలు కావడం ద్వారా మాత్రమే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది.

ఈ కొత్త ప్రయత్నం విజయవంతమైతే, భారత పాలనా చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుంది. మంత్రులు మాత్రమే కాదు, మొత్తం ప్రభుత్వ వ్యవస్థ ఫలితాల మీద దృష్టి సారించే సంస్కృతి ఏర్పడటం దేశం కోసం శుభ సూచన.

మధ్యతరగతి వారు కోనే ఫోన్ ఇదే.. ధర ఎంతంటే..

Realme 16T 5G
Realme 16T 5G

Realme 16T 5G: మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువగా కోరుకునే మొబైల్స్ కంపెనీల్లో Realme ఒకటి. ఈ కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చే మొబైల్స్ బడ్జెట్ లోనూ ఉంటూ.. ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ వెర్షన్ తో మార్కెట్లోకి వస్తాయి. ఇందులో భాగంగా లేటేస్ట్ గా రియల్ మీ 16T 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో బలమైన బ్యాటరీ తో పాటు విజులవల్స్ కు అనుగుణంగా డిస్ ప్లే ఉంది. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

రియల్ మీ 16T 5G ఫోన్‌లో 6.8 అంగళాల LCD Display ఉండనుంది. ఇది 144Hz రిష్రెష్ రేట్ తో పనిచేస్తుంది. రోజువారీ వినియోగంలో స్క్రోలింగ్, వీడియో ప్లేబ్యాక్, గేమింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉండేలా దీనిని తీర్చిదిద్దారు. పెర్ఫార్మెన్స్ కోసం ఇందులో MediaTek Dimensity 6300 చిప్ సెట్ ను ఏర్పాటు చేశారు. అలాగే ఇందులో 6GB లేదా 8GB RAM, 128GB లేదా 256GB storage వరకు వినియోగించుకోవచ్చు. Android 16 ఆధారిత Realme UI 7పై ఈ కొత్త మొబైల్ పనిచేస్తుంది.

ఫోటోగ్రఫీ కోరుకునేవారికి ఈ ఫోన్ లో రియర్‌లో 50MP ప్రధాన కెమెరా, 2MP monochrome sensor కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. వీటితో పాటు AI Portrait Glow, AI Instant Clip వంటి సాఫ్ట్‌వేర్ ఫీచర్లు కూడా ఫోన్‌లో ఉన్నాయి.

Realme 16T ప్రధానంగా బ్యాటరీ ప్రేమికుల కోసం రూపొందించిన ఫోన్. ఇందులో 8,000mAh బ్యాటరీ ఉండడంతో దీర్ఘకాలిక బ్యాకప్ లభిస్తుంది. ఈ బ్యాటరీకి 45W ఛార్జింగ్ తో పాటు బైపాస్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది. ఇక ఇందులో IP69 రేటింగ్ ఉండడంతో దుమ్ము, ధూళి తో పాటు నీటి బిందువుల నుంచి రక్షణగా ఉంటుంది. అలాగే ఇందులో cooling system కూడా బాగానే ఇచ్చారు. మొత్తం మీద, దీన్ని బ్యాటరీ, డిస్‌ప్లే, కఠినమైన బాడీ, మధ్యస్థాయి పెర్ఫార్మెన్స్ కలిపిన ప్యాకేజ్‌గా చూడొచ్చు.

ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.. రూ. 29,999 నంచి ప్రారంభమై రూ. 31,999 వరకు విక్రయిస్తున్నార. ఇది Flipkart, Realme India వెబస్ సైట్లో అందుబాటులో ఉంది.

ఫోన్ లో ఉండే Flight Modeతో ఎన్ని లాభాలో తెలుసా..

Flight Mode Benefits
Flight Mode Benefits

Flight Mode Benefits: స్మార్ట్‌ఫోన్‌లో ఉండే ‘ఫ్లైట్ మోడ్’ (Flight Mode) అనే ఆప్షన్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. దీనిని కేవలం విమాన ప్రయాణాల్లో మాత్రమే ఉపయోగించే ఫీచర్‌గా అని అనుకుంటారు. కానీ దీనితో ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మొబైల్ సిగ్నల్, వై-ఫై, బ్లూటూత్ వంటి వైర్‌లెస్ కనెక్షన్లను తాత్కాలికంగా ఆఫ్ చేసే ఈ ఫీచర్, రోజువారీ జీవితంలో కూడా చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది. సరైన విధంగా వాడితే బ్యాటరీ సేవ్ చేయడం నుంచి ప్రశాంతమైన నిద్ర వరకు అనేక లాభాలు పొందొచ్చు. ఆ వివరాల్లోకి వెళితె..

బ్యాటరీ వినియోగం తక్కువ:
ఫోన్‌లో నెట్‌వర్క్ సిగ్నల్స్ కోసం నిరంతరం సెర్చ్ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో మొబైల్ ఎక్కువ పవర్ వినియోగిస్తుంది. ఇలాంటి సమయంలో ఫ్లైట్ మోడ్ ఆన్ చేస్తే ఫోన్ అన్ని వైర్‌లెస్ కనెక్షన్లను నిలిపివేస్తుంది. దీంతో బ్యాటరీ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. ప్రయాణాల్లో లేదా చార్జింగ్ సౌకర్యం లేని సమయంలో ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. చాలా మంది రాత్రిపూట ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి పడుకుంటే ఉదయం వరకు బ్యాటరీ శాతం ఎక్కువగా మిగులుతుందని చెబుతున్నారు.

వేగంగా ఛార్జింగ్:
ఫోన్ ఛార్జ్ చేస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో కాల్స్, మెసేజ్‌లు, ఇంటర్నెట్ యాక్టివిటీ కొనసాగుతూనే ఉంటాయి. ఇవి బ్యాటరీని వినియోగిస్తుండటంతో ఛార్జింగ్ స్పీడ్ తగ్గుతుంది. అయితే ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఛార్జ్ చేస్తే అన్ని నెట్‌వర్క్ కార్యకలాపాలు ఆగిపోతాయి. దీంతో బ్యాటరీకి నేరుగా పవర్ చేరి సాధారణం కంటే వేగంగా ఛార్జ్ అవుతుంది. అత్యవసర సమయంలో తక్కువ టైమ్‌లో ఎక్కువ బ్యాటరీ కావాలనుకునే వారికి ఇది మంచి ట్రిక్‌గా పనిచేస్తుంది.

రాత్రిపూట ఆన్ చేస్తే..
రాత్రిపూట ఫోన్ పక్కన పెట్టుకుని నిద్రపోయే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే అర్థరాత్రి వచ్చే కాల్స్, నోటిఫికేషన్లు, మెసేజ్ అలర్ట్స్ నిద్రకు అంతరాయం కలిగిస్తాయి. ఫ్లైట్ మోడ్ ఆన్ చేస్తే ఈ డిస్టర్బెన్స్ పూర్తిగా తగ్గిపోతుంది. అలారమ్ మాత్రం పనిచేస్తుంది. కాబట్టి ఉదయం లేవడంలో ఇబ్బంది ఉండదు. దీంతో ఫోన్ వల్ల వచ్చే మానసిక ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పొందే అవకాశం ఉంటుంది.

పిల్లల విషయంలో..
చిన్నపిల్లలకు వీడియోలు లేదా గేమ్స్ కోసం ఫోన్ ఇస్తుంటారు. కానీ ఇంటర్నెట్ ఆన్‌లో ఉంటే అనవసర యాప్స్ ఓపెన్ కావడం, ప్రకటనలు రావడం లేదా తెలియని లింక్స్‌పై క్లిక్ చేసే ప్రమాదం ఉంటుంది. ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఫోన్ ఇస్తే ఇంటర్నెట్ పూర్తిగా ఆఫ్ అవుతుంది. దీంతో పిల్లలు సురక్షితంగా ఆఫ్‌లైన్ గేమ్స్ లేదా ముందుగా డౌన్‌లోడ్ చేసిన వీడియోలు మాత్రమే చూడగలుగుతారు. ఇది పేరెంట్స్‌కు కూడా కొంత భరోసా ఇస్తుంది.

కొన్ని సెకన్లపాటు ఆన్ చేస్తే..
కొన్నిసార్లు ఫోన్‌లో సిగ్నల్ సరిగా రావడం లేదు, కాల్స్ కనెక్ట్ కావడం లేదు లేదా ఇంటర్నెట్ పనిచేయడం లేదు అనే సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమయంలో ఫోన్ రీస్టార్ట్ చేయకుండా ఫ్లైట్ మోడ్‌ను కొన్ని సెకన్లు ఆన్ చేసి మళ్లీ ఆఫ్ చేస్తే నెట్‌వర్క్ రిఫ్రెష్ అవుతుంది. దీంతో చాలాసార్లు సిగ్నల్ సమస్యలు వెంటనే సెట్ అవుతాయి. ఇది చిన్న ట్రిక్ అయినా చాలా మందికి ఉపయోగపడుతుంది.

జర్నీ చేసేటప్పుడు..
విమానాల్లో ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం కలిగించే అవకాశం ఉండటంతో ఫ్లైట్ మోడ్ ఉపయోగించాలని సూచిస్తారు. అయితే బస్సు, రైలు ప్రయాణాల్లో కూడా నెట్‌వర్క్ బలహీనంగా ఉన్నప్పుడు ఫోన్ ఎక్కువ బ్యాటరీ ఖర్చు చేస్తుంది. ఇలాంటి సమయంలో ఫ్లైట్ మోడ్ వాడితే బ్యాటరీ ఎక్కువసేపు నిలుస్తుంది. అంతేకాకుండా ఫోన్ వల్ల వచ్చే డిస్ట్రాక్షన్స్ తగ్గి ప్రశాంతంగా ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.

పోయినోళ్లందరూ మంచోళ్లు.. వైఎస్ మహానేత.. ఆర్కే ఇంత మాట అనేశాడేంటి..

RK comments on YSR : తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడి మీద ఈగ వాలితే ఆంధ్రజ్యోతి రాధాక్రిష్ణ సహించడు. పైగా ఉల్టా కౌంటర్ ఇవ్వడంలో రాధాక్రిష్ణ ముందు వరసలో ఉంటాడు.  పైగా లాజిక్ లను పక్కన పెట్టి వన్ సైడ్ రాసేస్తుంటాడు. మిగతా మీడియా సంస్థలు ఎలాగున్నా..రాధాక్రిష్ణ  మాత్రం తన సంస్థల ద్వారా కౌంటర్ సాలిడ్ గా ఇచ్చేస్తూ ఉంటాడు. అందుకే టీడీపీ నేతలు ఆంధ్రజ్యోతిని తమ సొంత పత్రికగా పేర్కొంటారు. తాజాకొత్త పలుకులో రాధాక్రిష్ణ దారి తప్పాడు. చంద్రబాబు కు సపోర్ట్ చేసే క్రమంలో వైఎస్ కుటుంబం గురించి, రాజారెడ్డి గురించి అసలు విషయం బయటపెట్టేశాడు. దీంతో టీడీపీ నేతలకు ఇబ్బంది కరమైన పరిస్థితి ఏర్పడుతోంది.
జగన్ ఇటీవల ప్రెస్ మీట్ లో తన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడారు. వారి మరణాల గురించి ప్రస్తావించారు. తన తండ్రి మరణం మీద అనుమానాలు ఉన్నాయని, తన తాత రాజారెడ్డిని పొట్టనబెట్టుకున్నారని ఆరోపించారు. పనిలో పనిగా వాటి వెనుక చంద్రబాబు హస్తం ఉందన్నట్టుగా ఆరోపించారు.
జగన్ అలా మాట్లాడడమే ఆలస్యం.. తెర పైకి టిడిపి నాయకులు వచ్చారు. ఇంత జరిగిన తర్వాత ఆంధ్రజ్యోతి రంగంలోకి దిగింది. గతంలో రాజారెడ్డి కుటుంబం ద్వారా ఇబ్బంది పడిన పులివెందులకు చెందిన పార్థసారథి రెడ్డితో ఏబీఎన్ డిబేట్ నిర్వహించింది. ఆ డిబేట్ లో జగన్ కుటుంబం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు పార్థసారథిరెడ్డి. ఇది పూర్తయిన తర్వాత రాధాక్రిష్ణ రంగంలోకి దిగాడు.
ఆదివారం కొత్త పలుకులో మరింత రెచ్చిపోయాడు. టిడిపి నాయకులకు చేతకానిది.. చంద్రబాబు చెప్పలేనిది.. లోకేష్ కు తెలియనిది బయట పెట్టేశాడు. అయితే ఈ ఊపులో రాధాకృష్ణ కాస్త రాంగ్ స్టెప్ వేశాడు. అది కాస్త జగన్మోహన్ రెడ్డి క్యాంపుకు అనుకూలంగా.. టిడిపికి వ్యతిరేకంగా మారిపోయింది.
“పోయిన వాళ్ళందరూ మంచివాళ్లు అనుకునే సమాజం మనది. వైయస్ రాజశేఖర్ రెడ్డి వల్ల రాజారెడ్డి మీద ఉన్న చెడు అభిప్రాయాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. ఆయన మహానేతగా పేరు తెచ్చుకున్నారు. రాజారెడ్డి హత్య రాజకీయాల వైపు వెళ్లిన తర్వాత వారి కుటుంబానికి ఆస్తులు వచ్చాయి. రాజారెడ్డి తండ్రి వెంకటరెడ్డికి పెద్దగా ఆస్తులు ఉండేవి కాదు. ఆయన ఒక చిన్నపాటి రైతు. వైయస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ విన్యాసాలు చేశారు. అనేక రకాలుగా ఆస్తులు సంపాదించుకున్నారు. దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు సంపాదించని తీరుగా ఆస్తులను పెంచుకున్నాడు. పేర్ల పార్థసారధి రెడ్డి చెప్పినట్టుగానే రాజారెడ్డి కుటుంబం నెత్తుటి కూడు తిరిగి పెరిగింది. నాటి శాపాలు ఇప్పుడు వైయస్ కుటుంబాన్ని వేధిస్తున్నాయి. రాజారెడ్డిని హత్య ఎవరు చేశారో తెలియదు. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన వైఎస్ ను మహానేతగా భావిస్తున్నారు..”
ఇలా రాసుకుంటూ పోయాడు రాధాకృష్ణ. పనిలో పనిగా జగన్ తన కుమారుడి మీద.. తన కుమార్తె మీద చేసిన ఆరోపణలకు రాధాక్రిష్ణ కౌంటర్ ఇచ్చాడు. ఒకవేళ తనకి ఇదంతా తెలిసి ఉంటే కోర్ క్యాపిటల్ సమీపంలోనే భూములు కొనేవాడినని రాధాకృష్ణ పేర్కొన్నారు. ఈ వ్యాసంలో రాధాకృష్ణ చేసిన అతి తప్పు రాజశేఖర్ రెడ్డిని సమర్థిస్తూ మహానేత అనడం.. వైసీపీ నేతలు రాధాకృష్ణ వ్యాఖ్యలను విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. చూశారా మీ రాధాకృష్ణనే వైయస్ రాజశేఖర్ రెడ్డిని మహానేత అంటున్నారు.. ఇప్పుడేం సమాధానం చెబుతారు అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పుకోలేక టిడిపి నేతలు ఇబ్బంది పడుతున్నారు.
రాధాకృష్ణ వల్ల టిడిపి నాయకులకు లాభం ఎంత జరుగుతుందో తెలియదు కాని.. అప్పుడప్పుడూ ఇలాంటి నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక మిగతా వ్యాసం అంటారా తనకు నచ్చిన టాపిక్ కాబట్టి.. తనకు తెలిసిన విషయాలు కాబట్టి.. రాధాకృష్ణ చెలరేగిపోయాడు. కానీ ఇదే సాక్షి రాజారెడ్డి మరణం మీద తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో ఒక వ్యాసం రాసింది. అది ఎలా ఉందంటే ఆయనను ఒక గాంధీ మహాత్ముడి లాగా చిత్రీకరించింది. పాపం సాక్షి.. ఏదైనా రాస్తే చదివేలా ఉండాలి.. ముఖం మీద ఉమ్మెలా ఉండకూడదు.

బాలినేనికి కొత్త బాధ్యతలు

Balineni Srinivasa Reddy
Balineni Srinivasa Reddy

Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మౌనం వీడారు. జనసేనలో చేరిన ఆయన తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోతారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కానీ ఆయన మాత్రం జగన్మోహన్ రెడ్డి పై విరుచుకుపడుతూ అటువంటిదేమీ లేదని సంకేతాలు ఇచ్చారు. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కీలక చర్చలు జరిపారు. తాను ఎటువంటి పదవులు ఆశించడం లేదని ప్రకటించారు. పదవులు ఆశించడానికి తాను ఎన్నికలకు ముందు రాలేదని.. తరువాత మాత్రమే వచ్చానని చెప్పుకొచ్చారు. తాను పార్టీ మారుతున్నానన్న ప్రచారం వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వపు ఆలోచనల వల్లే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని గుర్తు చేశారు. జగన్ వైఖరి వల్లే తన లాంటి వారు ఓడిపోయారు తప్ప వేరే కారణం లేదని కూడా తేల్చి చెప్పారు..

* వైఖరిలో మార్పు..
బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీరులో స్పష్టమైన మార్పు వచ్చింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ఉండేవారు బాలినేని. అయితే ఆయన పార్టీ మారినప్పుడు మళ్లీ వైసీపీలోకి వెళ్లిపోతారన్న అనుమానాలు అధికంగా ఉండేవి. కానీ ఆయన ఒక ప్రత్యేక ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి నుంచి బయటకు వచ్చేసారు. అయితే బాలినేని పై ఉన్న అనుమానంతో కూటమి నుంచి పెద్ద సానుకూలత రాలేదు. జనసేనలో సైతం బాలినేని పై అనుమానపు చూపులు ఉండేవి. కేవలం రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ఆయన జనసేనలో చేరారు అన్నది మెజారిటీ కూటమి శ్రేణుల అభిప్రాయం. కానీ జనసేనలోకి వచ్చిన ఏడాది తర్వాత కూడా బాలినేని వైఖరి మారలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి పై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. ఆయన విధానాలను తప్పుపడుతున్నారు.

* ఆరు జిల్లాల బాధ్యతలు..
బాలినేనికి రాయలసీమ బాధ్యతలను పవన్ కళ్యాణ్ అప్పగించినట్లు ప్రచారం నడుస్తోంది. ఇటీవల కొంతమందితో స్థానిక సంస్థల కు సంబంధించి జన సైనికుల అభిప్రాయం తీసుకునే బాధ్యతను కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పూర్తిగా రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లా బాధ్యతలను బాలినేని కి పవన్ ఇచ్చారని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో వైసీపీలో ఇబ్బంది పడుతున్న నేతలు, కేడర్ను జనసేనలోకి రప్పించేందుకు ఇప్పటినుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పావులు కదుపుతారని తెలుస్తోంది. మరోవైపు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారు. దర్శి నియోజకవర్గాన్ని బాలినేని కేటాయించేందుకు చంద్రబాబుతో పాటు పవన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా ప్రచారం నడుస్తోంది. అందుకే ఇప్పుడు బాలినేనికి కూటమిలో ప్రతి ఒక్కరు సహకరించే విధంగా.. ఆయన పెద్దరికాన్ని గౌరవిస్తూ రాయలసీమ జనసేన బాధ్యతలు ఆయనకు అప్పగించినట్లు ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత నిజం ఉందో చూడాలి.

గొడ్డలి పార్టీగా వైసిపి.. డామేజ్ కంట్రోల్ లో జగన్!

YSR Congress Party
YSR Congress Party

YSR Congress Party: ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామం ఒకటి చోటుచేసుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీగా టిడిపి చెప్తోంది. ఒక పద్ధతి ప్రకారం ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అయితే ఇది పొలిటికల్ గా డ్యామేజ్ చేస్తుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతోంది.. అందుకే జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్మీట్లో ఎవరిది గొడ్డలి పార్టీ అంటూ విరుచుకుపడ్డారు. గొడ్డలి పార్టీతో పాటుగాగన్ కల్చర్ అనేది తెలుగుదేశం పార్టీ పేటెంట్ అంటూ మాట్లాడారు. ఎవరి హయాంలో బాబాయ్ హత్య జరిగిందో చెప్పాలని సవాల్ చేశారు. అంతకుముందు మాజీమంత్రి విడదల రజిని సైతం ఎవరిది గొడ్డలి పార్టీ అంటూ ప్రశ్నించారు. తమను అనవసరంగా అలా అనవద్దని కూడా హెచ్చరించారు. అయితే ఒక పద్ధతి ప్రకారం టిడిపి నాయకత్వం గొడ్డలిని హైలెట్ చేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని పిలిచే కంటే గొడ్డలి పార్టీగా ఎలివేట్ అయ్యేలా చేసింది. అయితే ఆ డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా జగన్మోహన్ రెడ్డి సైతం రంగంలోకి దిగారు. వివరణ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా టిడిపి పై ఎదురుదాడికి దిగారు.

* వచ్చే ఎన్నికల నాటికి సజీవం..
వైయస్ వివేకానంద రెడ్డి హత్య అనేది వచ్చే ఎన్నికల్లో కూడా సజీవంగా నిలుస్తుంది అనేది బహిరంగ రహస్యం. 2019 మార్చి 15న దారుణ హత్యకు గురయ్యారు వివేకానంద రెడ్డి. తొలుత గుండెపోటుగా చిత్రీకరించారు వాళ్లే. కాదు కాదు గొడ్డలితో నరికి చంపారు అన్నది వాళ్లే. జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి గొడ్డలి అనే మాట పదే పదే వచ్చింది. అయితే ఆ తర్వాత కాలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం.. సొంత కుటుంబ సభ్యులే హత్య చేశారని ఆరోపణలు రావడం.. నిందితులను జగన్మోహన్ రెడ్డి వెనుకేసుకొస్తున్నారని సొంత కుటుంబ సభ్యులు ఆరోపించడం వంటివి ఈ కేసులో హైలైట్ అయ్యాయి. సిబిఐ విచారణను సైతం అప్పటి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించలేదు కదా.. దర్యాప్తు పై సైతం ప్రభావం చూపిందని ఆరోపణలు వచ్చాయి. వివేకానంద రెడ్డి హత్య అంశం మొన్నటి ఎన్నికల్లో విపరీతమైన ప్రభావం చూపింది. అందుకే ఈ అంశాన్ని సజీవంగా ఉంచి జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టాలని టిడిపి భావిస్తుంది.

* కాదంటున్న జగన్..
గొడ్డలి పార్టీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని చూపే ప్రయత్నం చేస్తోంది టిడిపి. అయితే తమది గొడ్డలి పార్టీ ఎలా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం విశేషం. వివేకానంద రెడ్డి హత్య జరిగింది టిడిపి సమయంలోనని.. ఆయనను హత్య చేసిన ప్రధాన నిందితుడు ఇప్పుడు టిడిపితో కలిసి పని చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. అయితే చనిపోయింది స్వయానా తన బాబాయ్. కచ్చితంగా నిందితులను శిక్షించాల్సింది ఆయనే. కానీ ఐదు సంవత్సరాలు అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి మాత్రం వివేకా హత్య కేసులో సీరియస్ గా దృష్టి పెట్టినట్టు లేదన్న విమర్శలు వచ్చాయి. పైగా నిందితులను కాపాడారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే గొడ్డలి పార్టీ అనే ముద్ర బలంగా వెళ్తోంది ఆ పార్టీపై.

అడ్డగోలు ఎస్సీ ధ్రువీకరణ.. పల్నాడు జిల్లా కలెక్టర్ గొప్ప నిర్ణయం,!

Palnadu District Collector
Palnadu District Collector

Palnadu District Collector: మతం మారిన ఎంతోమంది.. మత ప్రబోధకులు గా మారి.. ఒక మతం షెడ్యూల్ కుల ధ్రువీకరణ పొందుతూ చాలా రకాల ప్రయోజనాలు పొందుతున్నారు. అటువంటి వారికి చెంపపెట్టు లా మారింది ఓ ఘటన. పల్నాడు జిల్లాకు చెందిన ఓ పాస్టర్ ఎస్సీ కుల ధ్రువీకరణ ను రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయం పై భిన్న స్వరం వినిపిస్తోంది. అక్కడ ఓ వ్యక్తి ఒక మతం నుంచి వేరే మతం స్వీకరించి.. మత ప్రబోధకుడిగా మారారు. కానీ హిందూ మత షెడ్యూల్ కుల ధ్రువీకరణ పొంది.. దాని ద్వారా అన్ని ఫలాలను అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ మార్గదర్శకాలు ప్రకారం పల్నాడు జిల్లా కలెక్టర్ షెడ్యూల్డ్ ధ్రువీకరణను రద్దు చేశారు.

* వారి విషయంలో ఉదాసీనత..
దేశంలో రిజర్వేషన్ ఫలాల దుర్వినియోగం యథేచ్ఛగా సాగిపోతోంది. ఒక మతానికి, ఒక కులానికి రిజర్వేషన్లు కల్పిస్తామన్న ప్రభుత్వ ఆలోచనలను.. అప్పటివరకు రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్న వారు అభ్యంతరం చెబుతున్నారు. కానీ మతం మారి.. మత ప్రబోధకులుగా మారి.. పాత మతం ద్వారా.. షెడ్యూల్డ్ దృవీకరణ పొంది లక్షలాదిమంది రిజర్వేషన్ ఫలాలను పొందుతున్నారు. అటువంటి వారి విషయంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్న వారి నుంచి ఎటువంటి అభ్యంతరాలు రావడం లేదు. ఇది నిజంగా బాధ కలిగించే విషయం. ఆర్థిక, సామాజిక వెనుకబాటుతో కొన్ని కులాలను షెడ్యూల్డ్ కులాల్లో చేరుస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే వెంటనే ఉద్యమాలు వస్తున్నాయి. కానీ మతం మాటున షెడ్యూల్డ్ ధ్రువీకరణతో తమ అవకాశాలను కొల్లగొడుతున్న వారి విషయంలో ఉదాసీనత కొనసాగుతోంది.

* అటువంటి వారికి చెంపపెట్టు..
కోర్టు మార్గదర్శకాలు ప్రకారం పల్నాడు జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. నిజమైన, అర్హులకు రిజర్వేషన్ ఫలాలు అందడంలో ఎటువంటి తప్పులేదు. కానీ ఒక మతం నుంచి వేరే మతానికి మారి.. పాత మతాన్ని దూషించి.. అదే మతం ద్వారా షెడ్యూల్డ్ కుల ధ్రువీకరణ పొందిన వారి విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇప్పుడు అటువంటి వారికి చంపపెట్టు. కచ్చితంగా దీనిపై సత్వర చర్యలు మొదలు కావాలి. రాష్ట్రవ్యాప్తంగా ఇలా ధ్రువీకరణ పత్రాలు పొందుతున్న వారి విషయంలో చర్చ జరగాలి. అప్పుడే నిజమైన షెడ్యూల్డ్ కులాలకు న్యాయం జరుగుతుంది.

మోడీకి మరమరాలు ఇచ్చాడని.. ఆ దుకాణదారుడుని టార్గెట్ చేసిన పాక్- బంగ్లాదేశీయులు

Jhalmuri Seller
Jhalmuri Seller

Jhalmuri Seller: రూ.10 వ్యాపారం చేసుకునే ఓ చిరు వ్యాపారి బెంగాల్‌ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశాడు. ఆయన చేసిన చిన్నపని 70 ఏళ్ల బెంగాల్‌ రాజకీయ చరిత్రను మలుపు తిప్పింది. రూ.10 రూపాయల మరమరాలు అమ్మడంతో అతను హీరో అయ్యాడు. అయితే ఇప్పుడు అదే అతనికి ప్రాణ గండంగా మారింది. నిత్యం బెదిరింపులతో వణికిపోతున్నాడు. ఆ ప్యాపారి పేరు విక్రమ్‌ కుమార్‌ సౌ. బెంగాల్‌ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్రమోదీకి మరమరాలు(ఝాల్‌ ముఠి) అమ్మింది ఇతనే.

ఏం జరిగిందంటే..
పశ్చిమ బెంగాల్‌లోని ఝార్‌గ్రామ్‌లో ఏప్రిల్‌ 19, 2026న జరిగిన ఒక చిన్న సంఘటన రాజకీయ, సామాజిక దృక్పథాన్ని మరోసారి బయటపెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం మధ్య ఒక చిన్న రోడ్‌సైడ్‌ స్టాల్‌ వద్ద ఆగి, స్థానిక ప్రత్యేకతైన ఝాల్‌మురి (మసాలా మరమరాలు) తిన్నాడు. కానీ ఆ సంఘటన ఇప్పుడు ఒక సాధారణ వ్యాపారి జీవితాన్ని భయాందోళనల్లోకి నెట్టేసింది.ఝార్‌గ్రామ్‌లోని కాలేజ్‌ మోర్‌ వద్ద 12 ఏళ్లుగా మరమరాలు, ఝాల్‌మురి విక్రయిస్తున్న విక్రమ్‌ కుమార్‌ సౌ అనే వ్యాపారి బీహార్‌లోని గయ నుంచి వచ్చి స్థిరపడిన వ్యక్తి. ప్రధాని మోదీ కాన్వాయ్‌ ఆపి, తన షాపు వద్ద ఆగి రూ.10 ఝాల్‌మురి కోరడం, డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు ‘‘మీరు మా ప్రధాని, డబ్బు వద్దు’’ అని నిరాకరించడం, ‘‘ఉల్లిపాయలు తింటారా?’’ అని అడగ్గా మోదీ ‘‘తింటాను, తలలు తినను’’ అని చమత్కరించడం.. ఈ దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. ఈ చిన్న సంభాషణ బెంగాల్‌ ఎన్నికలలో బీజేపీకి మంచి ప్రచార సాధనంగా మారిందని కొందరు విశ్లేషిస్తున్నారు. మమతా బెనర్జీ కూడా దీన్ని ‘‘డ్రామా’’ అని విమర్శించారు.

మారిన విక్రమ్‌ సౌ జీవితం..
ఎన్నికల తర్వాత విక్రమ్‌ సౌ జీవితం పూర్తిగా మారిపోయింది. మతోన్మాదుల అసహనం ఎన్నికల ఫలితాల తర్వాత విక్రమ్‌ సాహోకు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ నుంచి అనుమానాస్పద ఫోన్‌ కాల్స్, వాట్సాప్‌ వీడియో కాల్స్‌ వస్తున్నాయి. ‘‘బాంబుతో పేల్చేస్తాం’’, ‘‘చంపేస్తాం’’ అని బెదిరింపులు వస్తున్నాయి. కొందరు బెంగాలీ, మరికొందరు ఉర్దూ భాషలో మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. మే 21న ఆయన జార్‌గ్రామ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఆయనకు భద్రత కల్పించారు. ఒక సాధారణ వ్యాపారి తన వృత్తి నిర్వహిస్తూ ప్రధాన మంత్రిని సాదరంగా స్వీకరించడం ఎందుకు కొందరిని ఇంతగా కలచివేస్తోంది? ఇది కేవలం రాజకీయ వ్యతిరేకత కాదు. ఇది మతోన్మాద అసహనం. భిన్నాభిప్రాయాలను, సాధారణ సంబంధాలను కూడా సహించలేని మనస్తత్వం.

దేశంలో విభజనకు నిదర్శనం..
ఈ సంఘటన భారతదేశంలో ఇప్పటికీ ఉన్న లోతైన విభజనను బయటపెడుతుంది. ఒక వైపు సాధారణ ప్రజలు రాజకీయ నాయకులతో సహజంగా మమేకమవుతున్నారు. మరో వైపు, కొందరు దీన్ని ‘‘దేశద్రోహం’’గా చూసి హింసాత్మక బెదిరింపులకు దిగుతున్నారు. విక్రమ్‌ సౌ వంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం లేదు. వారు తమ రోజువారీ జీవనం సాగిస్తున్నారు. వారి షాపు ముందు ప్రధాని ఆగడం ఒక అవకాశం, ఒక గర్వకారణం. దీన్ని ఎన్నికల ఫలితాలకు ఏకైక కారణం అనడం అతిగా ఉంది. ఎన్నికలు ఎన్నో అంశాలపై ఆధారపడతాయి. అభివృద్ధి, ఉపాధి, స్థానిక సమస్యలు, నాయకత్వం. కానీ ఇలాంటి బెదిరింపులు సమాజంలో భయం సృష్టిస్తాయి. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి తన అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ఉంది. ఒక వ్యాపారి తన ఉత్పత్తి అమ్మడం ద్వారా రాజకీయ నాయకుడిని సత్కరించడం కూడా అందులో భాగమే. దీన్ని లక్ష్యంగా చేసుకోవడం అంటే, సహనం, లౌకికత్వంపై దాడి చేయడమే.

తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం..
పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం (ప్రస్తుతం సువేందు అధికారి నేతృత్వంలో) ఈ కేసును తీవ్రంగా పరిశీలించి, విక్రమ్‌ సౌ కుటుంబానికి పూర్తి భద్రత కల్పించింది. ఇలాంటి బెదిరింపులు మరలా జరగకుండా చర్యలు చేపట్టింది. ఫోన్‌ కాల్స్‌పై విచారణ చేపట్టాంది. సిగ్నల్స్‌ ఆధారంగా నిందితులను గుర్తించే పని చేస్తున్నారు. పోలీసులు.

విక్రమ్‌ సాహో కథ ఒక చిన్న వ్యాపారి యొక్క అమాయకత్వం, దాన్ని తట్టుకోలేని కొందరి అసహనం మధ్య సంఘర్షణను చూపిస్తుంది. భారతదేశం వైవిధ్యాల దేశం. ఇక్కడ ఝాల్‌మురి తినడం కూడా రాజకీయం అయితే, మన సమాజం ఎంత దూరం వెళ్లిందో అర్థమవుతుంది. సాధారణ ప్రజలు భయపడకుండా తమ వృత్తి చేసుకోగలిగే వాతావరణం సష్టించడమే నిజమైన ప్రజాస్వామ్యం.

అక్రమ చొరబాట్లకు భారత్‌ చెక్‌.. అమిత్‌షా ప్రకటనతో ఆయా దేశాల్లో టెన్షన్‌!

India Smart Border Project
India Smart Border Project

India Smart Border Project: భారతదేశం తన సార్వభౌమత్వాన్ని, సామాజిక స్థిరత్వాన్ని కాపాడుకోవాలంటే సరిహద్దు రక్షణలో రాజీ లేని వైఖరి అవసరం. హామీలు, రాజకీయ ప్రకటనలు మాత్రమే సరిపోవు. అక్రమ చొరబాట్లు దేశ భద్రతకు, ఆర్థిక వనరులకు, స్థానిక డెమోగ్రాఫిక్‌ సమతుల్యానికి తీవ్ర ముప్పుగా మారాయి. ఈ నేపథ్యంలో హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించిన ‘స్మార్ట్‌ బార్డర్‌’ ప్రాజెక్ట్‌ సమయోచితమైన, అవసరమైన చర్యగా కనిపిస్తోంది.

ప్రపంచ సరిహద్దు సవాళ్లు..
ప్రపంచంలో అత్యధిక సరిహద్దు దేశాలు ఉన్న దేశాల్లో చైనా, రష్యా మొదటి స్థానంలో ఉన్నాయి. రెండు దేశాలు 14 దేశాలతో సరిహద్దులు పంచుకుంటాయి. తర్వాత బ్రెజిల్‌ (10 దేశాలు) వస్తుంది. భారత్‌ ఆరు నుంచి ఏడు దేశాలతో (పాకిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్‌లో కొంత భాగం) సరిహద్దులు కలిగి ఉంది. ఇందులో బంగ్లాదేశ్‌తో మాత్రమే సుమారు 4,096 కి.మీ. పొడవైన సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు అడవులు, నదులు, గ్రామాల మధ్య ఉండటం వల్ల నియంత్రణ కష్టం. నేపాల్‌ సరిహద్దు కూడా తెరచి ఉంచబడింది. ఇలాంటి పరిస్థితుల్లో అక్రమంగా వచ్చే వలసదారుల సంఖ్య భారీగా ఉంది.

దేశంలోకి అక్రమ వలసలు..
బంగ్లాదేశ్‌ నుంచి, నేపాల్‌ నుంచి వచ్చే అక్రమ చొరబాటుదారులు ఉత్తర–తూర్పు రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, బీహార్, ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాల్లో స్థిరపడుతున్నారు. రోహింగ్యా ముస్లిం శరణార్థుల సమస్య మరింత సంక్లిష్టం చేసింది. లీగల్‌గా వచ్చి చట్టబద్ధంగా జీవించేవారికి సమస్య లేదు. కానీ ఇల్లీగల్‌ ఎంట్రీలు ఉపాధి అవకాశాలు, భూమి, సబ్సిడీలు, రేషన్‌ కార్డులపై ఒత్తిడి తెస్తాయి. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గడం, సామాజిక ఉద్రిక్తతలు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

స్మార్ట్‌ బార్డర్‌తో పరిష్కారం..
అమిత్‌ షా ప్రకటన ప్రకారం, సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) కోసం స్మార్ట్‌ బార్డర్‌ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రధాన అంశాలు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారిత సర్వైలెన్స్, హై–రిజల్యూషన్‌ కెమెరాలు, థర్మల్‌ ఇమేజింగ్, రాడార్లు, డ్రోన్లు, ఆటోమేటిక్‌ గ్రౌండ్‌ సెన్సార్లు, రియల్‌ టైమ్‌ మానిటరింగ్‌ సెంటర్లు, చీకటి, జలాశయాలు, అడవుల గుండా చొరబడే వారిని గుర్తించడం ఈ వ్యవస్థ ద్వారా సాధ్యమవుతుంది. ఇజ్రాయెల్‌ తన గాజా, లెబనాన్‌ సరిహద్దుల్లో ఇలాంటి అత్యాధునిక వ్యవస్థలను వాడి సొరంగాలు, టన్నెల్స్‌ కూడా గుర్తించి అడ్డుకుంటోంది. చైనా తన పశ్చిమ సరిహద్దుల్లో ఇప్పటికే ఇలాంటి టెక్నాలజీని అమలు చేస్తోంది. అమెరికా మెక్సికో సరిహద్దులో గోడలు, ఎలక్ట్రానిక్‌ సర్వైలెన్స్‌ పెంచి అక్రమ వలసలను నియంత్రించడానికి ప్రయత్నాలు చేస్తోంది.

భారత్‌కు తప్పనిసరి..
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు కూడా ఇలాంటిస్మార్ట్‌ టెక్నాలజీ అవసరం. ఇందుకు భారీ ఆర్థిక వ్యయం అవసరం అయినా, దీర్ఘకాలిక దృక్పథంతో ఖర్చు చేయాలి. విదేశాల్లో భారతీయులపై పెరుగుతున్న వ్యతిరేకతఈ సమయంలో విదేశాల్లో భారతీయులపై నెరేటివ్‌ కూడా మారుతోంది. తైవాన్‌లో ఒక నాయకుడు తాను అధ్యక్షుడు అయితే ‘‘భారతీయులను అనుమతించను’’ అని వ్యాఖ్యానించడం, చర్మం రంగు, సంస్కృతి తేడాలను సూచించడం గమనార్హం (తర్వాత క్షమాపణ చెప్పారు). వియత్నాం, జపాన్‌ వంటి దేశాల్లో కూడా భారతీయ కార్మికులు, విద్యార్థులపై సందేహాలు, వ్యతిరేక ఉద్యమాలు వస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు మనకు ఒక పాఠం.

అక్రమ చొరబాట్లను అడ్డుకోవాలంటే కేవలం బీఎస్‌ఎఫ్‌ సైనికుల సంఖ్య పెంచడం సరిపోదు. టెక్నాలజీ, చట్టపరమైన కఠినత్వం, రాజకీయ సంకల్పం కలిసి ఉండాలి. స్మార్ట్‌ బార్డర్‌ ప్రాజెక్ట్‌ విజయవంతం కావాలంటే కేంద్రం–రాష్ట్రాల మధ్య సమన్వయం, తగిన బడ్జెట్‌ కేటాయింపు అత్యంత ముఖ్యం.భారత్‌ ఒక సార్వభౌమ దేశం. తన జనాభా, వనరులు, సంస్కృతిని కాపాడుకునే హక్కు దానికి ఉంది. ఇది మతం లేదా ప్రాంతీయతతో సంబంధం లేని జాతీయ భద్రతా సమస్య. సహనం మంచిదే కానీ, ఆ సహనం దేశ భవిష్యత్తును రాజీ పడేస్తే అది బలహీనతగా మారుతుంది. అక్రమ చొరబాట్లను అడ్డుకోవడం ద్వారా మాత్రమే మనం నిజమైన లౌకికత్వం, సామాజిక సామరస్యాన్ని కాపాడగలం. స్మార్ట్‌ బార్డర్‌లు ఈ దిశలో ముఖ్యమైన అడుగు. ఈ ప్రాజెక్ట్‌ను వేగంగా, పారదర్శకంగా అమలు చేసి, భారత్‌ తన సరిహద్దులను 21వ శతాబ్దానికి తగ్గట్టుగా బలోపేతం చేయాలి.