Home Blog Page 238

ఫోన్ లో ఉండే Flight Modeతో ఎన్ని లాభాలో తెలుసా..

Flight Mode Benefits
Flight Mode Benefits

Flight Mode Benefits: స్మార్ట్‌ఫోన్‌లో ఉండే ‘ఫ్లైట్ మోడ్’ (Flight Mode) అనే ఆప్షన్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. దీనిని కేవలం విమాన ప్రయాణాల్లో మాత్రమే ఉపయోగించే ఫీచర్‌గా అని అనుకుంటారు. కానీ దీనితో ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మొబైల్ సిగ్నల్, వై-ఫై, బ్లూటూత్ వంటి వైర్‌లెస్ కనెక్షన్లను తాత్కాలికంగా ఆఫ్ చేసే ఈ ఫీచర్, రోజువారీ జీవితంలో కూడా చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది. సరైన విధంగా వాడితే బ్యాటరీ సేవ్ చేయడం నుంచి ప్రశాంతమైన నిద్ర వరకు అనేక లాభాలు పొందొచ్చు. ఆ వివరాల్లోకి వెళితె..

బ్యాటరీ వినియోగం తక్కువ:
ఫోన్‌లో నెట్‌వర్క్ సిగ్నల్స్ కోసం నిరంతరం సెర్చ్ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో మొబైల్ ఎక్కువ పవర్ వినియోగిస్తుంది. ఇలాంటి సమయంలో ఫ్లైట్ మోడ్ ఆన్ చేస్తే ఫోన్ అన్ని వైర్‌లెస్ కనెక్షన్లను నిలిపివేస్తుంది. దీంతో బ్యాటరీ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. ప్రయాణాల్లో లేదా చార్జింగ్ సౌకర్యం లేని సమయంలో ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. చాలా మంది రాత్రిపూట ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి పడుకుంటే ఉదయం వరకు బ్యాటరీ శాతం ఎక్కువగా మిగులుతుందని చెబుతున్నారు.

వేగంగా ఛార్జింగ్:
ఫోన్ ఛార్జ్ చేస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో కాల్స్, మెసేజ్‌లు, ఇంటర్నెట్ యాక్టివిటీ కొనసాగుతూనే ఉంటాయి. ఇవి బ్యాటరీని వినియోగిస్తుండటంతో ఛార్జింగ్ స్పీడ్ తగ్గుతుంది. అయితే ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఛార్జ్ చేస్తే అన్ని నెట్‌వర్క్ కార్యకలాపాలు ఆగిపోతాయి. దీంతో బ్యాటరీకి నేరుగా పవర్ చేరి సాధారణం కంటే వేగంగా ఛార్జ్ అవుతుంది. అత్యవసర సమయంలో తక్కువ టైమ్‌లో ఎక్కువ బ్యాటరీ కావాలనుకునే వారికి ఇది మంచి ట్రిక్‌గా పనిచేస్తుంది.

రాత్రిపూట ఆన్ చేస్తే..
రాత్రిపూట ఫోన్ పక్కన పెట్టుకుని నిద్రపోయే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే అర్థరాత్రి వచ్చే కాల్స్, నోటిఫికేషన్లు, మెసేజ్ అలర్ట్స్ నిద్రకు అంతరాయం కలిగిస్తాయి. ఫ్లైట్ మోడ్ ఆన్ చేస్తే ఈ డిస్టర్బెన్స్ పూర్తిగా తగ్గిపోతుంది. అలారమ్ మాత్రం పనిచేస్తుంది. కాబట్టి ఉదయం లేవడంలో ఇబ్బంది ఉండదు. దీంతో ఫోన్ వల్ల వచ్చే మానసిక ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పొందే అవకాశం ఉంటుంది.

పిల్లల విషయంలో..
చిన్నపిల్లలకు వీడియోలు లేదా గేమ్స్ కోసం ఫోన్ ఇస్తుంటారు. కానీ ఇంటర్నెట్ ఆన్‌లో ఉంటే అనవసర యాప్స్ ఓపెన్ కావడం, ప్రకటనలు రావడం లేదా తెలియని లింక్స్‌పై క్లిక్ చేసే ప్రమాదం ఉంటుంది. ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఫోన్ ఇస్తే ఇంటర్నెట్ పూర్తిగా ఆఫ్ అవుతుంది. దీంతో పిల్లలు సురక్షితంగా ఆఫ్‌లైన్ గేమ్స్ లేదా ముందుగా డౌన్‌లోడ్ చేసిన వీడియోలు మాత్రమే చూడగలుగుతారు. ఇది పేరెంట్స్‌కు కూడా కొంత భరోసా ఇస్తుంది.

కొన్ని సెకన్లపాటు ఆన్ చేస్తే..
కొన్నిసార్లు ఫోన్‌లో సిగ్నల్ సరిగా రావడం లేదు, కాల్స్ కనెక్ట్ కావడం లేదు లేదా ఇంటర్నెట్ పనిచేయడం లేదు అనే సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమయంలో ఫోన్ రీస్టార్ట్ చేయకుండా ఫ్లైట్ మోడ్‌ను కొన్ని సెకన్లు ఆన్ చేసి మళ్లీ ఆఫ్ చేస్తే నెట్‌వర్క్ రిఫ్రెష్ అవుతుంది. దీంతో చాలాసార్లు సిగ్నల్ సమస్యలు వెంటనే సెట్ అవుతాయి. ఇది చిన్న ట్రిక్ అయినా చాలా మందికి ఉపయోగపడుతుంది.

జర్నీ చేసేటప్పుడు..
విమానాల్లో ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం కలిగించే అవకాశం ఉండటంతో ఫ్లైట్ మోడ్ ఉపయోగించాలని సూచిస్తారు. అయితే బస్సు, రైలు ప్రయాణాల్లో కూడా నెట్‌వర్క్ బలహీనంగా ఉన్నప్పుడు ఫోన్ ఎక్కువ బ్యాటరీ ఖర్చు చేస్తుంది. ఇలాంటి సమయంలో ఫ్లైట్ మోడ్ వాడితే బ్యాటరీ ఎక్కువసేపు నిలుస్తుంది. అంతేకాకుండా ఫోన్ వల్ల వచ్చే డిస్ట్రాక్షన్స్ తగ్గి ప్రశాంతంగా ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.

పోయినోళ్లందరూ మంచోళ్లు.. వైఎస్ మహానేత.. ఆర్కే ఇంత మాట అనేశాడేంటి..

RK comments on YSR : తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడి మీద ఈగ వాలితే ఆంధ్రజ్యోతి రాధాక్రిష్ణ సహించడు. పైగా ఉల్టా కౌంటర్ ఇవ్వడంలో రాధాక్రిష్ణ ముందు వరసలో ఉంటాడు.  పైగా లాజిక్ లను పక్కన పెట్టి వన్ సైడ్ రాసేస్తుంటాడు. మిగతా మీడియా సంస్థలు ఎలాగున్నా..రాధాక్రిష్ణ  మాత్రం తన సంస్థల ద్వారా కౌంటర్ సాలిడ్ గా ఇచ్చేస్తూ ఉంటాడు. అందుకే టీడీపీ నేతలు ఆంధ్రజ్యోతిని తమ సొంత పత్రికగా పేర్కొంటారు. తాజాకొత్త పలుకులో రాధాక్రిష్ణ దారి తప్పాడు. చంద్రబాబు కు సపోర్ట్ చేసే క్రమంలో వైఎస్ కుటుంబం గురించి, రాజారెడ్డి గురించి అసలు విషయం బయటపెట్టేశాడు. దీంతో టీడీపీ నేతలకు ఇబ్బంది కరమైన పరిస్థితి ఏర్పడుతోంది.
జగన్ ఇటీవల ప్రెస్ మీట్ లో తన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడారు. వారి మరణాల గురించి ప్రస్తావించారు. తన తండ్రి మరణం మీద అనుమానాలు ఉన్నాయని, తన తాత రాజారెడ్డిని పొట్టనబెట్టుకున్నారని ఆరోపించారు. పనిలో పనిగా వాటి వెనుక చంద్రబాబు హస్తం ఉందన్నట్టుగా ఆరోపించారు.
జగన్ అలా మాట్లాడడమే ఆలస్యం.. తెర పైకి టిడిపి నాయకులు వచ్చారు. ఇంత జరిగిన తర్వాత ఆంధ్రజ్యోతి రంగంలోకి దిగింది. గతంలో రాజారెడ్డి కుటుంబం ద్వారా ఇబ్బంది పడిన పులివెందులకు చెందిన పార్థసారథి రెడ్డితో ఏబీఎన్ డిబేట్ నిర్వహించింది. ఆ డిబేట్ లో జగన్ కుటుంబం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు పార్థసారథిరెడ్డి. ఇది పూర్తయిన తర్వాత రాధాక్రిష్ణ రంగంలోకి దిగాడు.
ఆదివారం కొత్త పలుకులో మరింత రెచ్చిపోయాడు. టిడిపి నాయకులకు చేతకానిది.. చంద్రబాబు చెప్పలేనిది.. లోకేష్ కు తెలియనిది బయట పెట్టేశాడు. అయితే ఈ ఊపులో రాధాకృష్ణ కాస్త రాంగ్ స్టెప్ వేశాడు. అది కాస్త జగన్మోహన్ రెడ్డి క్యాంపుకు అనుకూలంగా.. టిడిపికి వ్యతిరేకంగా మారిపోయింది.
“పోయిన వాళ్ళందరూ మంచివాళ్లు అనుకునే సమాజం మనది. వైయస్ రాజశేఖర్ రెడ్డి వల్ల రాజారెడ్డి మీద ఉన్న చెడు అభిప్రాయాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. ఆయన మహానేతగా పేరు తెచ్చుకున్నారు. రాజారెడ్డి హత్య రాజకీయాల వైపు వెళ్లిన తర్వాత వారి కుటుంబానికి ఆస్తులు వచ్చాయి. రాజారెడ్డి తండ్రి వెంకటరెడ్డికి పెద్దగా ఆస్తులు ఉండేవి కాదు. ఆయన ఒక చిన్నపాటి రైతు. వైయస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ విన్యాసాలు చేశారు. అనేక రకాలుగా ఆస్తులు సంపాదించుకున్నారు. దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు సంపాదించని తీరుగా ఆస్తులను పెంచుకున్నాడు. పేర్ల పార్థసారధి రెడ్డి చెప్పినట్టుగానే రాజారెడ్డి కుటుంబం నెత్తుటి కూడు తిరిగి పెరిగింది. నాటి శాపాలు ఇప్పుడు వైయస్ కుటుంబాన్ని వేధిస్తున్నాయి. రాజారెడ్డిని హత్య ఎవరు చేశారో తెలియదు. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన వైఎస్ ను మహానేతగా భావిస్తున్నారు..”
ఇలా రాసుకుంటూ పోయాడు రాధాకృష్ణ. పనిలో పనిగా జగన్ తన కుమారుడి మీద.. తన కుమార్తె మీద చేసిన ఆరోపణలకు రాధాక్రిష్ణ కౌంటర్ ఇచ్చాడు. ఒకవేళ తనకి ఇదంతా తెలిసి ఉంటే కోర్ క్యాపిటల్ సమీపంలోనే భూములు కొనేవాడినని రాధాకృష్ణ పేర్కొన్నారు. ఈ వ్యాసంలో రాధాకృష్ణ చేసిన అతి తప్పు రాజశేఖర్ రెడ్డిని సమర్థిస్తూ మహానేత అనడం.. వైసీపీ నేతలు రాధాకృష్ణ వ్యాఖ్యలను విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. చూశారా మీ రాధాకృష్ణనే వైయస్ రాజశేఖర్ రెడ్డిని మహానేత అంటున్నారు.. ఇప్పుడేం సమాధానం చెబుతారు అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పుకోలేక టిడిపి నేతలు ఇబ్బంది పడుతున్నారు.
రాధాకృష్ణ వల్ల టిడిపి నాయకులకు లాభం ఎంత జరుగుతుందో తెలియదు కాని.. అప్పుడప్పుడూ ఇలాంటి నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక మిగతా వ్యాసం అంటారా తనకు నచ్చిన టాపిక్ కాబట్టి.. తనకు తెలిసిన విషయాలు కాబట్టి.. రాధాకృష్ణ చెలరేగిపోయాడు. కానీ ఇదే సాక్షి రాజారెడ్డి మరణం మీద తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో ఒక వ్యాసం రాసింది. అది ఎలా ఉందంటే ఆయనను ఒక గాంధీ మహాత్ముడి లాగా చిత్రీకరించింది. పాపం సాక్షి.. ఏదైనా రాస్తే చదివేలా ఉండాలి.. ముఖం మీద ఉమ్మెలా ఉండకూడదు.

బాలినేనికి కొత్త బాధ్యతలు

Balineni Srinivasa Reddy
Balineni Srinivasa Reddy

Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మౌనం వీడారు. జనసేనలో చేరిన ఆయన తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోతారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కానీ ఆయన మాత్రం జగన్మోహన్ రెడ్డి పై విరుచుకుపడుతూ అటువంటిదేమీ లేదని సంకేతాలు ఇచ్చారు. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కీలక చర్చలు జరిపారు. తాను ఎటువంటి పదవులు ఆశించడం లేదని ప్రకటించారు. పదవులు ఆశించడానికి తాను ఎన్నికలకు ముందు రాలేదని.. తరువాత మాత్రమే వచ్చానని చెప్పుకొచ్చారు. తాను పార్టీ మారుతున్నానన్న ప్రచారం వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వపు ఆలోచనల వల్లే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని గుర్తు చేశారు. జగన్ వైఖరి వల్లే తన లాంటి వారు ఓడిపోయారు తప్ప వేరే కారణం లేదని కూడా తేల్చి చెప్పారు..

* వైఖరిలో మార్పు..
బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీరులో స్పష్టమైన మార్పు వచ్చింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ఉండేవారు బాలినేని. అయితే ఆయన పార్టీ మారినప్పుడు మళ్లీ వైసీపీలోకి వెళ్లిపోతారన్న అనుమానాలు అధికంగా ఉండేవి. కానీ ఆయన ఒక ప్రత్యేక ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి నుంచి బయటకు వచ్చేసారు. అయితే బాలినేని పై ఉన్న అనుమానంతో కూటమి నుంచి పెద్ద సానుకూలత రాలేదు. జనసేనలో సైతం బాలినేని పై అనుమానపు చూపులు ఉండేవి. కేవలం రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ఆయన జనసేనలో చేరారు అన్నది మెజారిటీ కూటమి శ్రేణుల అభిప్రాయం. కానీ జనసేనలోకి వచ్చిన ఏడాది తర్వాత కూడా బాలినేని వైఖరి మారలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి పై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. ఆయన విధానాలను తప్పుపడుతున్నారు.

* ఆరు జిల్లాల బాధ్యతలు..
బాలినేనికి రాయలసీమ బాధ్యతలను పవన్ కళ్యాణ్ అప్పగించినట్లు ప్రచారం నడుస్తోంది. ఇటీవల కొంతమందితో స్థానిక సంస్థల కు సంబంధించి జన సైనికుల అభిప్రాయం తీసుకునే బాధ్యతను కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పూర్తిగా రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లా బాధ్యతలను బాలినేని కి పవన్ ఇచ్చారని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో వైసీపీలో ఇబ్బంది పడుతున్న నేతలు, కేడర్ను జనసేనలోకి రప్పించేందుకు ఇప్పటినుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పావులు కదుపుతారని తెలుస్తోంది. మరోవైపు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారు. దర్శి నియోజకవర్గాన్ని బాలినేని కేటాయించేందుకు చంద్రబాబుతో పాటు పవన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా ప్రచారం నడుస్తోంది. అందుకే ఇప్పుడు బాలినేనికి కూటమిలో ప్రతి ఒక్కరు సహకరించే విధంగా.. ఆయన పెద్దరికాన్ని గౌరవిస్తూ రాయలసీమ జనసేన బాధ్యతలు ఆయనకు అప్పగించినట్లు ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత నిజం ఉందో చూడాలి.

గొడ్డలి పార్టీగా వైసిపి.. డామేజ్ కంట్రోల్ లో జగన్!

YSR Congress Party
YSR Congress Party

YSR Congress Party: ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామం ఒకటి చోటుచేసుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీగా టిడిపి చెప్తోంది. ఒక పద్ధతి ప్రకారం ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అయితే ఇది పొలిటికల్ గా డ్యామేజ్ చేస్తుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతోంది.. అందుకే జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్మీట్లో ఎవరిది గొడ్డలి పార్టీ అంటూ విరుచుకుపడ్డారు. గొడ్డలి పార్టీతో పాటుగాగన్ కల్చర్ అనేది తెలుగుదేశం పార్టీ పేటెంట్ అంటూ మాట్లాడారు. ఎవరి హయాంలో బాబాయ్ హత్య జరిగిందో చెప్పాలని సవాల్ చేశారు. అంతకుముందు మాజీమంత్రి విడదల రజిని సైతం ఎవరిది గొడ్డలి పార్టీ అంటూ ప్రశ్నించారు. తమను అనవసరంగా అలా అనవద్దని కూడా హెచ్చరించారు. అయితే ఒక పద్ధతి ప్రకారం టిడిపి నాయకత్వం గొడ్డలిని హైలెట్ చేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని పిలిచే కంటే గొడ్డలి పార్టీగా ఎలివేట్ అయ్యేలా చేసింది. అయితే ఆ డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా జగన్మోహన్ రెడ్డి సైతం రంగంలోకి దిగారు. వివరణ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా టిడిపి పై ఎదురుదాడికి దిగారు.

* వచ్చే ఎన్నికల నాటికి సజీవం..
వైయస్ వివేకానంద రెడ్డి హత్య అనేది వచ్చే ఎన్నికల్లో కూడా సజీవంగా నిలుస్తుంది అనేది బహిరంగ రహస్యం. 2019 మార్చి 15న దారుణ హత్యకు గురయ్యారు వివేకానంద రెడ్డి. తొలుత గుండెపోటుగా చిత్రీకరించారు వాళ్లే. కాదు కాదు గొడ్డలితో నరికి చంపారు అన్నది వాళ్లే. జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి గొడ్డలి అనే మాట పదే పదే వచ్చింది. అయితే ఆ తర్వాత కాలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం.. సొంత కుటుంబ సభ్యులే హత్య చేశారని ఆరోపణలు రావడం.. నిందితులను జగన్మోహన్ రెడ్డి వెనుకేసుకొస్తున్నారని సొంత కుటుంబ సభ్యులు ఆరోపించడం వంటివి ఈ కేసులో హైలైట్ అయ్యాయి. సిబిఐ విచారణను సైతం అప్పటి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించలేదు కదా.. దర్యాప్తు పై సైతం ప్రభావం చూపిందని ఆరోపణలు వచ్చాయి. వివేకానంద రెడ్డి హత్య అంశం మొన్నటి ఎన్నికల్లో విపరీతమైన ప్రభావం చూపింది. అందుకే ఈ అంశాన్ని సజీవంగా ఉంచి జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టాలని టిడిపి భావిస్తుంది.

* కాదంటున్న జగన్..
గొడ్డలి పార్టీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని చూపే ప్రయత్నం చేస్తోంది టిడిపి. అయితే తమది గొడ్డలి పార్టీ ఎలా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం విశేషం. వివేకానంద రెడ్డి హత్య జరిగింది టిడిపి సమయంలోనని.. ఆయనను హత్య చేసిన ప్రధాన నిందితుడు ఇప్పుడు టిడిపితో కలిసి పని చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. అయితే చనిపోయింది స్వయానా తన బాబాయ్. కచ్చితంగా నిందితులను శిక్షించాల్సింది ఆయనే. కానీ ఐదు సంవత్సరాలు అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి మాత్రం వివేకా హత్య కేసులో సీరియస్ గా దృష్టి పెట్టినట్టు లేదన్న విమర్శలు వచ్చాయి. పైగా నిందితులను కాపాడారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే గొడ్డలి పార్టీ అనే ముద్ర బలంగా వెళ్తోంది ఆ పార్టీపై.

అడ్డగోలు ఎస్సీ ధ్రువీకరణ.. పల్నాడు జిల్లా కలెక్టర్ గొప్ప నిర్ణయం,!

Palnadu District Collector
Palnadu District Collector

Palnadu District Collector: మతం మారిన ఎంతోమంది.. మత ప్రబోధకులు గా మారి.. ఒక మతం షెడ్యూల్ కుల ధ్రువీకరణ పొందుతూ చాలా రకాల ప్రయోజనాలు పొందుతున్నారు. అటువంటి వారికి చెంపపెట్టు లా మారింది ఓ ఘటన. పల్నాడు జిల్లాకు చెందిన ఓ పాస్టర్ ఎస్సీ కుల ధ్రువీకరణ ను రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయం పై భిన్న స్వరం వినిపిస్తోంది. అక్కడ ఓ వ్యక్తి ఒక మతం నుంచి వేరే మతం స్వీకరించి.. మత ప్రబోధకుడిగా మారారు. కానీ హిందూ మత షెడ్యూల్ కుల ధ్రువీకరణ పొంది.. దాని ద్వారా అన్ని ఫలాలను అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ మార్గదర్శకాలు ప్రకారం పల్నాడు జిల్లా కలెక్టర్ షెడ్యూల్డ్ ధ్రువీకరణను రద్దు చేశారు.

* వారి విషయంలో ఉదాసీనత..
దేశంలో రిజర్వేషన్ ఫలాల దుర్వినియోగం యథేచ్ఛగా సాగిపోతోంది. ఒక మతానికి, ఒక కులానికి రిజర్వేషన్లు కల్పిస్తామన్న ప్రభుత్వ ఆలోచనలను.. అప్పటివరకు రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్న వారు అభ్యంతరం చెబుతున్నారు. కానీ మతం మారి.. మత ప్రబోధకులుగా మారి.. పాత మతం ద్వారా.. షెడ్యూల్డ్ దృవీకరణ పొంది లక్షలాదిమంది రిజర్వేషన్ ఫలాలను పొందుతున్నారు. అటువంటి వారి విషయంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్న వారి నుంచి ఎటువంటి అభ్యంతరాలు రావడం లేదు. ఇది నిజంగా బాధ కలిగించే విషయం. ఆర్థిక, సామాజిక వెనుకబాటుతో కొన్ని కులాలను షెడ్యూల్డ్ కులాల్లో చేరుస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే వెంటనే ఉద్యమాలు వస్తున్నాయి. కానీ మతం మాటున షెడ్యూల్డ్ ధ్రువీకరణతో తమ అవకాశాలను కొల్లగొడుతున్న వారి విషయంలో ఉదాసీనత కొనసాగుతోంది.

* అటువంటి వారికి చెంపపెట్టు..
కోర్టు మార్గదర్శకాలు ప్రకారం పల్నాడు జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. నిజమైన, అర్హులకు రిజర్వేషన్ ఫలాలు అందడంలో ఎటువంటి తప్పులేదు. కానీ ఒక మతం నుంచి వేరే మతానికి మారి.. పాత మతాన్ని దూషించి.. అదే మతం ద్వారా షెడ్యూల్డ్ కుల ధ్రువీకరణ పొందిన వారి విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇప్పుడు అటువంటి వారికి చంపపెట్టు. కచ్చితంగా దీనిపై సత్వర చర్యలు మొదలు కావాలి. రాష్ట్రవ్యాప్తంగా ఇలా ధ్రువీకరణ పత్రాలు పొందుతున్న వారి విషయంలో చర్చ జరగాలి. అప్పుడే నిజమైన షెడ్యూల్డ్ కులాలకు న్యాయం జరుగుతుంది.

మోడీకి మరమరాలు ఇచ్చాడని.. ఆ దుకాణదారుడుని టార్గెట్ చేసిన పాక్- బంగ్లాదేశీయులు

Jhalmuri Seller
Jhalmuri Seller

Jhalmuri Seller: రూ.10 వ్యాపారం చేసుకునే ఓ చిరు వ్యాపారి బెంగాల్‌ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశాడు. ఆయన చేసిన చిన్నపని 70 ఏళ్ల బెంగాల్‌ రాజకీయ చరిత్రను మలుపు తిప్పింది. రూ.10 రూపాయల మరమరాలు అమ్మడంతో అతను హీరో అయ్యాడు. అయితే ఇప్పుడు అదే అతనికి ప్రాణ గండంగా మారింది. నిత్యం బెదిరింపులతో వణికిపోతున్నాడు. ఆ ప్యాపారి పేరు విక్రమ్‌ కుమార్‌ సౌ. బెంగాల్‌ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్రమోదీకి మరమరాలు(ఝాల్‌ ముఠి) అమ్మింది ఇతనే.

ఏం జరిగిందంటే..
పశ్చిమ బెంగాల్‌లోని ఝార్‌గ్రామ్‌లో ఏప్రిల్‌ 19, 2026న జరిగిన ఒక చిన్న సంఘటన రాజకీయ, సామాజిక దృక్పథాన్ని మరోసారి బయటపెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం మధ్య ఒక చిన్న రోడ్‌సైడ్‌ స్టాల్‌ వద్ద ఆగి, స్థానిక ప్రత్యేకతైన ఝాల్‌మురి (మసాలా మరమరాలు) తిన్నాడు. కానీ ఆ సంఘటన ఇప్పుడు ఒక సాధారణ వ్యాపారి జీవితాన్ని భయాందోళనల్లోకి నెట్టేసింది.ఝార్‌గ్రామ్‌లోని కాలేజ్‌ మోర్‌ వద్ద 12 ఏళ్లుగా మరమరాలు, ఝాల్‌మురి విక్రయిస్తున్న విక్రమ్‌ కుమార్‌ సౌ అనే వ్యాపారి బీహార్‌లోని గయ నుంచి వచ్చి స్థిరపడిన వ్యక్తి. ప్రధాని మోదీ కాన్వాయ్‌ ఆపి, తన షాపు వద్ద ఆగి రూ.10 ఝాల్‌మురి కోరడం, డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు ‘‘మీరు మా ప్రధాని, డబ్బు వద్దు’’ అని నిరాకరించడం, ‘‘ఉల్లిపాయలు తింటారా?’’ అని అడగ్గా మోదీ ‘‘తింటాను, తలలు తినను’’ అని చమత్కరించడం.. ఈ దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. ఈ చిన్న సంభాషణ బెంగాల్‌ ఎన్నికలలో బీజేపీకి మంచి ప్రచార సాధనంగా మారిందని కొందరు విశ్లేషిస్తున్నారు. మమతా బెనర్జీ కూడా దీన్ని ‘‘డ్రామా’’ అని విమర్శించారు.

మారిన విక్రమ్‌ సౌ జీవితం..
ఎన్నికల తర్వాత విక్రమ్‌ సౌ జీవితం పూర్తిగా మారిపోయింది. మతోన్మాదుల అసహనం ఎన్నికల ఫలితాల తర్వాత విక్రమ్‌ సాహోకు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ నుంచి అనుమానాస్పద ఫోన్‌ కాల్స్, వాట్సాప్‌ వీడియో కాల్స్‌ వస్తున్నాయి. ‘‘బాంబుతో పేల్చేస్తాం’’, ‘‘చంపేస్తాం’’ అని బెదిరింపులు వస్తున్నాయి. కొందరు బెంగాలీ, మరికొందరు ఉర్దూ భాషలో మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. మే 21న ఆయన జార్‌గ్రామ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఆయనకు భద్రత కల్పించారు. ఒక సాధారణ వ్యాపారి తన వృత్తి నిర్వహిస్తూ ప్రధాన మంత్రిని సాదరంగా స్వీకరించడం ఎందుకు కొందరిని ఇంతగా కలచివేస్తోంది? ఇది కేవలం రాజకీయ వ్యతిరేకత కాదు. ఇది మతోన్మాద అసహనం. భిన్నాభిప్రాయాలను, సాధారణ సంబంధాలను కూడా సహించలేని మనస్తత్వం.

దేశంలో విభజనకు నిదర్శనం..
ఈ సంఘటన భారతదేశంలో ఇప్పటికీ ఉన్న లోతైన విభజనను బయటపెడుతుంది. ఒక వైపు సాధారణ ప్రజలు రాజకీయ నాయకులతో సహజంగా మమేకమవుతున్నారు. మరో వైపు, కొందరు దీన్ని ‘‘దేశద్రోహం’’గా చూసి హింసాత్మక బెదిరింపులకు దిగుతున్నారు. విక్రమ్‌ సౌ వంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం లేదు. వారు తమ రోజువారీ జీవనం సాగిస్తున్నారు. వారి షాపు ముందు ప్రధాని ఆగడం ఒక అవకాశం, ఒక గర్వకారణం. దీన్ని ఎన్నికల ఫలితాలకు ఏకైక కారణం అనడం అతిగా ఉంది. ఎన్నికలు ఎన్నో అంశాలపై ఆధారపడతాయి. అభివృద్ధి, ఉపాధి, స్థానిక సమస్యలు, నాయకత్వం. కానీ ఇలాంటి బెదిరింపులు సమాజంలో భయం సృష్టిస్తాయి. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి తన అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ఉంది. ఒక వ్యాపారి తన ఉత్పత్తి అమ్మడం ద్వారా రాజకీయ నాయకుడిని సత్కరించడం కూడా అందులో భాగమే. దీన్ని లక్ష్యంగా చేసుకోవడం అంటే, సహనం, లౌకికత్వంపై దాడి చేయడమే.

తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం..
పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం (ప్రస్తుతం సువేందు అధికారి నేతృత్వంలో) ఈ కేసును తీవ్రంగా పరిశీలించి, విక్రమ్‌ సౌ కుటుంబానికి పూర్తి భద్రత కల్పించింది. ఇలాంటి బెదిరింపులు మరలా జరగకుండా చర్యలు చేపట్టింది. ఫోన్‌ కాల్స్‌పై విచారణ చేపట్టాంది. సిగ్నల్స్‌ ఆధారంగా నిందితులను గుర్తించే పని చేస్తున్నారు. పోలీసులు.

విక్రమ్‌ సాహో కథ ఒక చిన్న వ్యాపారి యొక్క అమాయకత్వం, దాన్ని తట్టుకోలేని కొందరి అసహనం మధ్య సంఘర్షణను చూపిస్తుంది. భారతదేశం వైవిధ్యాల దేశం. ఇక్కడ ఝాల్‌మురి తినడం కూడా రాజకీయం అయితే, మన సమాజం ఎంత దూరం వెళ్లిందో అర్థమవుతుంది. సాధారణ ప్రజలు భయపడకుండా తమ వృత్తి చేసుకోగలిగే వాతావరణం సష్టించడమే నిజమైన ప్రజాస్వామ్యం.

అక్రమ చొరబాట్లకు భారత్‌ చెక్‌.. అమిత్‌షా ప్రకటనతో ఆయా దేశాల్లో టెన్షన్‌!

India Smart Border Project
India Smart Border Project

India Smart Border Project: భారతదేశం తన సార్వభౌమత్వాన్ని, సామాజిక స్థిరత్వాన్ని కాపాడుకోవాలంటే సరిహద్దు రక్షణలో రాజీ లేని వైఖరి అవసరం. హామీలు, రాజకీయ ప్రకటనలు మాత్రమే సరిపోవు. అక్రమ చొరబాట్లు దేశ భద్రతకు, ఆర్థిక వనరులకు, స్థానిక డెమోగ్రాఫిక్‌ సమతుల్యానికి తీవ్ర ముప్పుగా మారాయి. ఈ నేపథ్యంలో హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించిన ‘స్మార్ట్‌ బార్డర్‌’ ప్రాజెక్ట్‌ సమయోచితమైన, అవసరమైన చర్యగా కనిపిస్తోంది.

ప్రపంచ సరిహద్దు సవాళ్లు..
ప్రపంచంలో అత్యధిక సరిహద్దు దేశాలు ఉన్న దేశాల్లో చైనా, రష్యా మొదటి స్థానంలో ఉన్నాయి. రెండు దేశాలు 14 దేశాలతో సరిహద్దులు పంచుకుంటాయి. తర్వాత బ్రెజిల్‌ (10 దేశాలు) వస్తుంది. భారత్‌ ఆరు నుంచి ఏడు దేశాలతో (పాకిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్‌లో కొంత భాగం) సరిహద్దులు కలిగి ఉంది. ఇందులో బంగ్లాదేశ్‌తో మాత్రమే సుమారు 4,096 కి.మీ. పొడవైన సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు అడవులు, నదులు, గ్రామాల మధ్య ఉండటం వల్ల నియంత్రణ కష్టం. నేపాల్‌ సరిహద్దు కూడా తెరచి ఉంచబడింది. ఇలాంటి పరిస్థితుల్లో అక్రమంగా వచ్చే వలసదారుల సంఖ్య భారీగా ఉంది.

దేశంలోకి అక్రమ వలసలు..
బంగ్లాదేశ్‌ నుంచి, నేపాల్‌ నుంచి వచ్చే అక్రమ చొరబాటుదారులు ఉత్తర–తూర్పు రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, బీహార్, ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాల్లో స్థిరపడుతున్నారు. రోహింగ్యా ముస్లిం శరణార్థుల సమస్య మరింత సంక్లిష్టం చేసింది. లీగల్‌గా వచ్చి చట్టబద్ధంగా జీవించేవారికి సమస్య లేదు. కానీ ఇల్లీగల్‌ ఎంట్రీలు ఉపాధి అవకాశాలు, భూమి, సబ్సిడీలు, రేషన్‌ కార్డులపై ఒత్తిడి తెస్తాయి. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గడం, సామాజిక ఉద్రిక్తతలు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

స్మార్ట్‌ బార్డర్‌తో పరిష్కారం..
అమిత్‌ షా ప్రకటన ప్రకారం, సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) కోసం స్మార్ట్‌ బార్డర్‌ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రధాన అంశాలు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారిత సర్వైలెన్స్, హై–రిజల్యూషన్‌ కెమెరాలు, థర్మల్‌ ఇమేజింగ్, రాడార్లు, డ్రోన్లు, ఆటోమేటిక్‌ గ్రౌండ్‌ సెన్సార్లు, రియల్‌ టైమ్‌ మానిటరింగ్‌ సెంటర్లు, చీకటి, జలాశయాలు, అడవుల గుండా చొరబడే వారిని గుర్తించడం ఈ వ్యవస్థ ద్వారా సాధ్యమవుతుంది. ఇజ్రాయెల్‌ తన గాజా, లెబనాన్‌ సరిహద్దుల్లో ఇలాంటి అత్యాధునిక వ్యవస్థలను వాడి సొరంగాలు, టన్నెల్స్‌ కూడా గుర్తించి అడ్డుకుంటోంది. చైనా తన పశ్చిమ సరిహద్దుల్లో ఇప్పటికే ఇలాంటి టెక్నాలజీని అమలు చేస్తోంది. అమెరికా మెక్సికో సరిహద్దులో గోడలు, ఎలక్ట్రానిక్‌ సర్వైలెన్స్‌ పెంచి అక్రమ వలసలను నియంత్రించడానికి ప్రయత్నాలు చేస్తోంది.

భారత్‌కు తప్పనిసరి..
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు కూడా ఇలాంటిస్మార్ట్‌ టెక్నాలజీ అవసరం. ఇందుకు భారీ ఆర్థిక వ్యయం అవసరం అయినా, దీర్ఘకాలిక దృక్పథంతో ఖర్చు చేయాలి. విదేశాల్లో భారతీయులపై పెరుగుతున్న వ్యతిరేకతఈ సమయంలో విదేశాల్లో భారతీయులపై నెరేటివ్‌ కూడా మారుతోంది. తైవాన్‌లో ఒక నాయకుడు తాను అధ్యక్షుడు అయితే ‘‘భారతీయులను అనుమతించను’’ అని వ్యాఖ్యానించడం, చర్మం రంగు, సంస్కృతి తేడాలను సూచించడం గమనార్హం (తర్వాత క్షమాపణ చెప్పారు). వియత్నాం, జపాన్‌ వంటి దేశాల్లో కూడా భారతీయ కార్మికులు, విద్యార్థులపై సందేహాలు, వ్యతిరేక ఉద్యమాలు వస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు మనకు ఒక పాఠం.

అక్రమ చొరబాట్లను అడ్డుకోవాలంటే కేవలం బీఎస్‌ఎఫ్‌ సైనికుల సంఖ్య పెంచడం సరిపోదు. టెక్నాలజీ, చట్టపరమైన కఠినత్వం, రాజకీయ సంకల్పం కలిసి ఉండాలి. స్మార్ట్‌ బార్డర్‌ ప్రాజెక్ట్‌ విజయవంతం కావాలంటే కేంద్రం–రాష్ట్రాల మధ్య సమన్వయం, తగిన బడ్జెట్‌ కేటాయింపు అత్యంత ముఖ్యం.భారత్‌ ఒక సార్వభౌమ దేశం. తన జనాభా, వనరులు, సంస్కృతిని కాపాడుకునే హక్కు దానికి ఉంది. ఇది మతం లేదా ప్రాంతీయతతో సంబంధం లేని జాతీయ భద్రతా సమస్య. సహనం మంచిదే కానీ, ఆ సహనం దేశ భవిష్యత్తును రాజీ పడేస్తే అది బలహీనతగా మారుతుంది. అక్రమ చొరబాట్లను అడ్డుకోవడం ద్వారా మాత్రమే మనం నిజమైన లౌకికత్వం, సామాజిక సామరస్యాన్ని కాపాడగలం. స్మార్ట్‌ బార్డర్‌లు ఈ దిశలో ముఖ్యమైన అడుగు. ఈ ప్రాజెక్ట్‌ను వేగంగా, పారదర్శకంగా అమలు చేసి, భారత్‌ తన సరిహద్దులను 21వ శతాబ్దానికి తగ్గట్టుగా బలోపేతం చేయాలి.

జనసేన ఎమ్మెల్యే రాజీనామా!

Arava Sridhar Resignation
Arava Sridhar Resignation

Arava Sridhar Resignation: జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన పదవికి రాజీనామా చేశారు. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి.. తన పదవిని వదులుకున్నారు. రాజీనామా పత్రాన్ని అధినేత పవన్ కళ్యాణ్ కు సమర్పించారు. కొద్ది రోజుల కిందట ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగి అరవ శ్రీధర్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో సన్నిహితంగా మెలిగిన వీడియోలతో పాటు ఆడియో సంభాషణలను సైతం బయటపెట్టింది. అరవ శ్రీధర్ పై చర్యలు తీసుకోవాలంటూ ఏకంగా పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది. పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు ప్రయత్నాలు కూడా చేసింది. అయితే ఆమె ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రోజురోజుకు పరిస్థితి తీవ్రం కావడంతో విచారణ కమిటీని నియమించారు పవన్ కళ్యాణ్. అయితే ఆ కమిటీ ఏం నివేదిక ఇచ్చిందో తెలియదు కానీ.. నిన్ననే అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి ఈ అంశంపై చర్చించారు అరవ శ్రీధర్.

* రైల్వే కోడూరు నుంచి గెలుపు..
మొన్నటి ఎన్నికల్లో జనసేన తరఫున రైల్వే కోడూరు నుంచి గెలిచారు అరవ శ్రీధర్. గెలిచిన కొద్ది కాలానికి ఆయనపై అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. ఓ మహిళా ఉద్యోగి ఏకంగా ఆయనతో సన్నిహితంగా ఉన్న వీడియోలు బయట పెట్టడం అప్పట్లో సంచలనంగా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిని ఒక విమర్శన అస్త్రంగా మార్చుకుంది. సోషల్ మీడియాలో సైతం అరవ శ్రీధర్ను టార్గెట్ చేసుకుంది. ఈ పరిణామాల క్రమంలో విచారణ కోసం జనసేన తరఫున ముగ్గురు నేతలతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి కీలక ఆధారాలు ఇచ్చారు అరవ శ్రీధర్. ఆమె ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ను బయటపెట్టారు. డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మొన్న మధ్యన జనసేన నేతలు ఆమెపై దాడి చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీంతో జనసేన పై తీవ్ర విమర్శలు వచ్చాయి.

* అధినేత పవన్ కు సమర్పణ..
నిన్ననే మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసారు అరవ శ్రీధర్. ఆ మహిళతో తనకు వ్యక్తిగత సంబంధాలు గతం నుంచి ఉన్నాయని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బ్లాక్ మెయిల్ చేశారని.. అందుకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను అధినేతకు సమర్పించారు. అయితే పవన్ సూచన మేరకు ఆరవ శ్రీధర్ తన విప్ పదవికి రాజీనామా చేశారు. తనపై ఆరోపణలు వచ్చిన క్రమంలో ప్రభుత్వం ఇచ్చిన అధికారిక పదవి తన వద్ద ఉంచుకోవడం సహేతుకం కాదని.. అందుకే రాజీనామా చేసినట్లు అరవ శ్రీధర్ మీడియాకు తెలిపారు. అధినేతకు అన్ని వివరించానని.. తాను ఎటువంటి తప్పులు చేయలేదని చెప్పుకొచ్చారు. ఇటీవలే పార్టీ క్రియాశీలక సమావేశంలో నేతల వ్యక్తిగత తప్పిదాలు పార్టీకి మైనస్ చేస్తే ఊరుకునేది లేదని పవన్ హెచ్చరించారు. ఇప్పుడు నేరుగా అరవ శ్రీధర్ వచ్చి తన పదవికి రాజీనామా చేయడం విశేషం.

బుమ్రా కి క్షమాపణలు చెప్పిన రామ్ చరణ్... ఎన్టీఆర్ చెప్పింది నిజమే...

Ram Charan
Ram Charan

Ram Charan: మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు రామ్ చరణ్… ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా అవతరించడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు. పెద్ది సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా జూన్ 4వ తేదీన ప్రేక్షకుడి ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను భారీ ఎత్తున చేపడుతున్నారు. భూపాల్ లో ఈ సినిమాకు సంబంధించిన ఒక ఈవెంట్ అయితే నిర్వహించారు. రామ్ చరణ్ తో పాటు ఈవెంట్ కి ఏ ఆర్ రెహమాన్ కూడా హాజరవ్వడం విశేషం…దానికి తోడుగా స్టేజ్ మీద రామ్ చరణ్ మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉండే ఒక యాంకర్ కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగాడు. అందులో భాగంగానే సచిన్ టెండూల్కర్ అనగానే ది లాంగ్ లెజెండరీ రన్ హి హెడ్ అన్నాడు అలాగే ఎమ్మెస్ ధోనీ పేరు చెప్పగానే కామ్ అండ్ కూల్, రోహిత్ శర్మ హి ఇస్ ఎవ్రీ బడి మ్యాన్ అన్నాడు. ఇక విరాట్ కోహ్లీ గురించి అడగగా ది ఫైర్ అంటూ సమాధానం చెప్పాడు… ఇక బూమ్రా ప్రస్తావన రాగానే అతను ది బెస్ట్ ఫుట్ బాల్ ప్లేయర్ అంటూ రామ్ చరణ్ సమాధానం ఇచ్చాడు. దాంతో ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. అయితే ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత రామ్ చరణ్ బుమ్రా గురించి తప్పుగా మాట్లాడాడు.

అతను క్రికెట్ ప్లేయర్ అని గుర్తుచేసుకొని బుమ్రా కి సారీ చెబుతూ ఒక ట్వీట్ చేశాడు… నేను కొన్నిసార్లు నిజంగానే పేర్లు మర్చిపోతూ ఉంటాను. క్రౌడ్ వల్ల పొరపాటు జరిగింది మీరంటే నాకు చాలా గౌరవం, మీ ఆటకి నేను అభిమానిని ప్రతి భారతీయుడు గర్వపడేలా చేస్తారు అంటూ బుమ్రా ను ట్యాగ్ చేశాడు…

నిజానికి రామ్ చరణ్ కి పేర్లు మర్చిపోయే అలవాటు ఉందని ‘త్రిబుల్ ఆర్’ సినిమా ప్రమోషన్స్ టైమ్ లోనే జూనియర్ ఎన్టీఆర్ తెలియజేశాడు. అతను ఒక పేరుతో ఉన్న వ్యక్తిని మరొక పేరుతో పిలుస్తూ ఉంటాడని సెట్లో కొంతమంది అలానే పిలవడం వల్ల ఆయన పిలిచిన పేరు నిజమా లేదంటే ఆ అబ్బాయి నాకు చెప్పిన పేరు నిజమా అనే ధోరణిలో నేను చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యే వాడినట్టు జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చాడు.

మొత్తానికైతే రామ్ చరణ్ కి పేర్లు సరిగ్గా గుర్తుండవనేది మరోసారి చాలా స్పష్టంగా అర్థమైంది. ఇక ఇప్పటికైనా రామ్ చరణ్ పేర్లు గుర్తుంచుకునే విధంగా చూసుకుంటే బాగుంటుందని అతని అభిమానులు కూడా వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…

టిడిపికి మరో గవర్నర్ పోస్ట్.. ఛాన్స్ వారికే!

TDP Governor Post
TDP Governor Post

TDP Governor Post: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రెండు మంత్రి పదవులతో పాటు ఒక గవర్నర్ పోస్ట్ కేటాయించేందుకు నిర్ణయించింది. అయితే అది తెలుగుదేశం పార్టీకి ఆ ఆఫర్ అని తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చి ప్రభుత్వాలు కొలువుదీరాయి. బిజెపికి సానుకూల ఫలితాలు వచ్చాయి. అందుకే కేంద్ర మంత్రివర్గ విస్తరణతో పాటు మిత్రులతో మరింత బలం పెంచుకోవాలని చూస్తోంది బిజెపి. ఇప్పటికే తమిళనాడులో డీఎంకేతో స్నేహం చేసేందుకు.. ఎన్డీఏలోకి రప్పించేందుకు చర్చలు మొదలుపెట్టింది. ఇంకోవైపు టిడిపి తో మరింత బలం పెంచుకునేందుకు వీలుగా రాజకీయ అండదండలు ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి ఒక గవర్నర్ పోస్ట్ ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

* అశోక్ గజపతిరాజుకు అవకాశం..
టిడిపి సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజుకు గవర్నర్ ఛాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల కిందట ఆయన గోవా గవర్నర్ గా నియమితులయ్యారు. అప్పట్లోనే రెండో గవర్నర్ పోస్ట్ ఇస్తారని ప్రచారం నడిచింది. కానీ అది వర్కౌట్ కాలేదు. అందుకే ఈసారి తప్పకుండా టిడిపికి ఒక గవర్నర్ పోస్ట్ ఇచ్చేందుకు కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే బీసీలకు లేదా ఎస్సీలకు ఆ పదవి ఆఫర్ చేస్తారని తెలుస్తోంది. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన అశోక్ గజపతిరాజు టిడిపి ఆవిర్భావం నుంచి సేవలు అందిస్తూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. అందుకే ఆయనకు గవర్నర్ పదవితో గౌరవప్రదమైన పదవీ విరమణ లభించినట్లు అవుతుంది.

* సీనియర్లకు ఛాన్స్..
అయితే ఇప్పుడు గవర్నర్ పోస్ట్ కోసం ఇద్దరు నేతల మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే యనమల రామకృష్ణుడు వైపు చంద్రబాబు మొగ్గుచూపే అవకాశం ఉంది. అయితే యనమల రామకృష్ణుడు రాజ్యసభ పదవి పై ఆశలు పెట్టుకున్నారు. ఆపై కేంద్ర క్యాబినెట్లో ఒక ఛాన్స్ కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రమంత్రిగా, స్పీకర్ గా సేవలందించిన ఆయన కేంద్ర రాజకీయాలు లోటు. అందుకే ఆయన గవర్నర్ కంటే కేంద్రమంత్రి పై మోజు పెంచుకున్నారు. మరోవైపు మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని గవర్నర్ పోస్ట్ కు ఎంపిక చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. అందుకే రాజ్యాంగబద్ధ పదవి ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది. ఒకవేళ ఎస్సీలకు ఇవ్వాలనుకుంటే మాత్రం మాజీ స్పీకర్ ప్రతిభాభారతికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఆమె సైతం సీనియర్ మోస్ట్ లీడర్. సుదీర్ఘకాలం మంత్రిగా వ్యవహరించారు. శాసనసభ తొలి మహిళా స్పీకర్ గా కూడా గుర్తింపు సాధించారు. ఆమెకు ఛాన్స్ ఇవ్వడం ద్వారా ఎస్సీల్లో సానుభూతి పొందాలని ఆలోచన చేస్తున్నారు. మొత్తానికైతే టీడీపీకి మరో గవర్నర్ పోస్ట్ లభించనుందన్నమాట.

తగ్గిన చికెన్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఎలా ఉన్నాయంటే..

Chicken Prices
Chicken Prices

Chicken Prices: ఆదివారం వచ్చిందంటే చాలు.. మాంసహారం తినాలని అనుకుంటారు. అయితే గత నెల రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. మరోవైపు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కావడంతో చాలా మంది చికెన్ వంటకాలకు దూరంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం చికెన్ ధరలు అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈరోజు చికెన్, గుడ్ల ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన చికెన్ ధరలు కాస్త అదుపులోకి వచ్చాయి. గత వారం రోజులుగా మార్కెట్లో కిలో చికెన్ ధర రూ. 260 నుంచి రూ. 300 వరకు పలకడంతో సామాన్యులకు చుక్కలు కనిపించాయి. అయితే, తాజాగా సరఫరా పెరగడం, డిమాండ్ కొంత మేర తగ్గడంతో ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

ప్రస్తుతం వివిధ నగరాల్లో చికెన్ ధరలు అందుబాటులోకి వస్తున్నాయి. విశాఖపట్నంలో స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ. 240 ఉండగా, విజయవాడలో అత్యల్పంగా రూ. 220కి విక్రయిస్తున్నారు. అదేవిధంగా అనకాపల్లి లో రూ. 230గా ధర నమోదైంది. తెలంగాణ విషయానికొస్తే .. హైదరాబాద్‌లో ప్రాంతాన్ని బట్టి కిలో చికెన్ రూ. 240 నుంచి రూ. 270 వరకు విక్రయిస్తున్నారు. వరంగల్, ఖమ్మం నగరాల్లో ధరలు స్థిరంగా రూ. 240 వద్ద ఉన్నాయి.

చికెన్ ధరలతో పాటు కోడిగుడ్ల ధరలు కూడా ప్రజలకు కొంత ఊరటనిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో ఒక్కో గుడ్డు రూ. 6 చొప్పున విక్రయిస్తున్నారు. గతంతో పోలిస్తే ధరలు తగ్గుముఖం పట్టడంతో వినియోగదారులు కొంత ఉపశమనం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు మరియు డిమాండ్‌ను బట్టి ఈ ధరల్లో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రతి రోజూ 10 నిమిషాలు ఇలా చేస్తే..

Meditation Benefits
Meditation Benefits

Meditation Benefits: ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు వంటి కారణాలతో చాలా మంది మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతి రోజూ కనీసం 10 నిమిషాలు ధ్యానం చేయడం మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ధ్యానం మనసును ప్రశాంతంగా ఉంచడమే కాకుండా భావోద్వేగాలను నియంత్రించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే 10 నిమిషాల ధ్యానంతో ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే?

ఆందోళన, భయం మాయం..
కొంతమంది మానసిక నిపుణుల ప్రకారం… ధ్యానం చేయడం వల్ల శరీరంలో ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ స్థాయులు తగ్గుతాయి. దీని కారణంగా టెన్షన్, ఆందోళన, భయం వంటి భావనలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. రోజూ ధ్యానం చేసే వారికి మానసిక ప్రశాంతత పెరిగి, చిన్న చిన్న విషయాలకు కోపం లేదా ఆవేశం తగ్గుతుందని చెబుతున్నారు.

ఆలోచన శక్తి మెరగు..
ధ్యానం ఏకాగ్రతను పెంచడంలో కూడా సహాయపడుతుంది. విద్యార్థులు, ఉద్యోగులు లేదా వ్యాపారులు ఎవరైనా సరే మెడిటేషన్ అలవాటు చేసుకుంటే ఆలోచనా శక్తి మెరుగవుతుంది. సమస్యలను స్పష్టంగా అర్థం చేసుకుని త్వరగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు వివరిస్తున్నారు. దీంతో పనితీరు కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది.

ఎప్పడు ధ్యానం చేయాలి?
ఉదయం సమయంలో ధ్యానం చేయడం శరీరానికి మరింత మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. మెడిటేషన్ సమయంలో లోతుగా శ్వాస తీసుకోవడం వల్ల శరీరంలో ఆక్సిజన్ ప్రవాహం పెరుగుతుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉండటంతో పాటు అలసట తగ్గుతుంది. శరీరం, మనసు రెండూ సమతుల్యంగా పనిచేయడానికి ఇది దోహదపడుతుంది.

నిద్ర సమస్యలు దూరం..
అలాగే ధ్యానం నిద్ర సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్ర పట్టకపోవడం, ఎక్కువగా ఆలోచించడం వంటి సమస్యలు ఉన్నవారు రోజూ కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తే మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా మెడిటేషన్ చేయడం వల్ల మానసిక స్థిరత్వం పెరిగి జీవితాన్ని సానుకూలంగా చూడగలుగుతారని సూచిస్తున్నారు.

ఈ ఐదు రాశుల వారు ఈరోజు నక్క తోక తొక్కినట్లే..

Today 16 June 2026 Horoscope
Today 16 June 2026 Horoscope

Today 24 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై పూర్వ పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అదనపు ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు ఉత్సాహంగా గడుపుతారు. అన్ని విషయాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా విజయం సాధిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు పెద్దలను సంప్రదించడం మంచిది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు సమాజంలో గౌరవ పొందుతారు నాణ్యమైన ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుడుమ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు పలిస్తాయి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. కొత్త వాహనం కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులు సీనియర్ల నుంచి పూర్తి మద్దతు ఉండడంతో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలు అధికంగా పొందుతారు. తల్లిదండ్రుల మద్దతుతో విద్యార్థులు పోటీ పరీక్షల విజయం సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. పరుగులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. తల్లిదండ్రుల ఆశీస్సులతో వ్యాపారులు కొత్తగా పెట్టుబడును పెడతారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. గ్రహాల అనుకూలత ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. స్నేహితుల సహకారం ఉండడంతో అన్ని పనులను సక్రమంగా చేయగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతారు. పిల్లల భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు ఉత్సాహంగా గడుపుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అదనపు ఆదాయం రావడంతో సంతోషంగా ఉంటారు. కొన్ని విభేదాల నుంచి బయటపడడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు అన్ని సానుకూలమైన ఫలితాలను పొందుతారు. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ప్రత్యర్థులపై కన్నేసి ఉంచాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. అప్పులు ఇచ్చే ముందు ఆలోచించాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు శుభవార్తలు అందుతాయి. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు. ఇప్పటివరకు ఉన్న కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. దీంతో కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అధికంగా లాభాలు ఉంటాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా గడుస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. పూర్వీకుల ఆర్థిక సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

అమెరికా కల కల్ల.. ఇండియాకు వెళ్లాల్సిందే.. గ్రీన్ కార్డు ముచ్చట తీరినట్లేనా?

USCIS new policy,

USCIS new policy : యూఎస్‌లో గ్రీన్‌కార్డ్‌ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న లక్షలాది మంది వలసదారులకు అమెరికా ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తాజాగా విడుదల చేసిన కొత్త పాలసీ మెమో ప్రకారం.. ఇకపై అమెరికాలో ఉండగానే ‘అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్’ ద్వారా గ్రీన్‌కార్డ్‌ పొందడం అత్యంత కఠినంగా మారనుంది. సాధారణంగా గ్రీన్‌కార్డ్‌ కోరుకునే వారు ఇకపై తమ స్వదేశానికి వెళ్లి, అక్కడ ఉండే అమెరికా కాన్సులేట్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

USCIS new policy,

చట్టం అసలు ఉద్దేశ్యాన్ని మళ్లీ అమల్లోకి తెస్తున్నాం: USCIS

ఈ కొత్త కఠిన విధానాన్ని ప్రకటిస్తూ USCIS ప్రతినిధి జాక్ కాహ్లర్ కీలక వ్యాఖ్యలు చేశారు. “అమెరికా ఇమ్మిగ్రేషన్‌ చట్టం యొక్క అసలు ఉద్దేశ్యాన్ని మేము మళ్లీ అమల్లోకి తీసుకొస్తున్నాం. తాత్కాలిక వీసాలపై (ఎఫ్1, హెచ్1బీ, బీ1 /బీ2 వంటివి) అమెరికాకు వచ్చే విద్యార్థులు, ఉద్యోగులు లేదా పర్యాటకులు తమ వీసా గడువు పూర్తయిన తర్వాత తిరిగి స్వదేశానికి వెళ్లాల్సిందే. వారి తాత్కాలిక ప్రవేశం అనేది గ్రీన్‌కార్డ్‌ ప్రక్రియకు తొలి అడుగుగా మారకూడదు.” అని USCIS ప్రతినిధి జాక్ కాహ్లర్ స్పష్టం చేశారు.

కొత్త నిబంధనల వల్ల మారే అంశాలు ఇవే

ఇప్పటివరకు అమెరికాలో లీగల్ స్టేటస్‌లో ఉంటూనే గ్రీన్‌కార్డ్‌కు (ఐ-485 ద్వారా) స్టేటస్ మార్చుకునే అవకాశం చాలా మందికి ఉండేది. కానీ తాజా మార్గదర్శకాలతో ఆ అవకాశాన్ని USCIS గణనీయంగా పరిమితం చేసింది. ఇకపై అత్యంత “అసాధారణ పరిస్థితులు” ఉన్నవారికి మాత్రమే అమెరికా లోపల స్టేటస్‌ అడ్జస్ట్‌మెంట్‌కు అనుమతి లభిస్తుంది. ప్రతి దరఖాస్తును అధికారులు వ్యక్తిగతంగా, అత్యంత కఠినంగా పరిశీలించి మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. నిబంధనలు వర్తించని వారు ఖచ్చితంగా భారత్ లేదా వారి స్వదేశాలకు వెళ్లి ‘కాన్సులర్ ప్రాసెసింగ్’ ద్వారానే గ్రీన్‌కార్డ్‌ తెచ్చుకోవాలి.

అమెరికాలో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్రమంగా మిగిలిపోయే వారి సంఖ్యను తగ్గించడం… USCIS బ్యాక్‌లాగ్‌లను తగ్గించి, సంస్థ వనరులను ఇతర ప్రాధాన్య కేసులపై ఉపయోగించడం… హింసా బాధితులు, మానవ అక్రమ రవాణా బాధితుల వీసాలు, పౌరసత్వ దరఖాస్తులను వేగంగా పరిష్కరించడం లక్ష్యంగా ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్టు ప్రకటనలో తెలిపారు.

భారతీయ ఐటీ ఉద్యోగులు, విద్యార్థులపై తీవ్ర ప్రభావం!

ఈ నిర్ణయం ముఖ్యంగా భారతీయులపై కోలుకోలేని దెబ్బ తీసే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే గ్రీన్‌కార్డ్‌ బ్యాక్‌లాగ్‌లో దశాబ్దాలుగా వేచి చూస్తున్న లక్షలాది మంది భారతీయ టెకీలు (హెచ్-1బీ హోల్డర్స్), ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్థులు ఈ కొత్త మార్పుతో తీవ్ర ఆందోళనలో పడ్డారు. గ్రీన్‌కార్డ్ ప్రక్రియ కోసం అమెరికా వదిలి స్వదేశానికి వెళ్తే మళ్లీ అక్కడ వీసా రిజెక్ట్ అవుతుందేమోనన్న భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.

కోర్టు మెట్లు ఎక్కనున్న కొత్త పాలసీ?

మరోవైపు USCIS తీసుకున్న ఈ హఠాత్ నిర్ణయంపై చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వలసదారుల హక్కుల సంఘాలు దీనిపై కోర్టులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో ట్రంప్ కఠిన నిర్ణయాల వల్ల అమెరికాలో భారతీయులు సహా విదేశీయులు నిపుణులు మునుపటిలా స్వేచ్ఛగా ఉండడం.. పనిచేసుకోవడం చాలా కష్టంగా మారనుంది..

బంగారం మెరుపులు డౌన్.. ఎందుకీ పరిస్థితి అంటే..

Gold Price Drop In India
Gold Price Drop In India

Gold Price Drop In India: నిజమే.. మీరు చదివింది పూర్తిగా నిజమే. నిన్నటిదాకా రాకెట్ వేగంతో దూసుకుపోయిన బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి. కొనుగోలుదారులతో సందడిగా ఉన్న దుకాణాలు ఇప్పుడు రద్దీ లేక ఇబ్బంది పడుతున్నాయి. వాస్తవానికి గోల్డ్ కు డిమాండ్ తగ్గడం నిజంగా సరికొత్త చర్చకు దారితీస్తోంది.. దీని వెనుక కారణాలు ఎలా ఉన్నప్పటికీ.. బంగారం డిమాండ్ తగ్గడం ఇప్పుడు మార్కెట్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది.

మనదేశంలో గోల్డ్ వినియోగం ఎప్పటికీ ఒక స్థాయిలోనే ఉంటుంది. కొంతకాలంగా బంగారం వినియోగం అనేది సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. వేడుకలు.. పెళ్లిళ్లు.. ఇతర ఉత్సవాల సమయంలో బంగారాన్ని భారతీయులు కచ్చితంగా కొనుగోలు చేస్తారు. అయితే ఇటీవల కాలంలో బంగారం ధర విపరీతంగా పెరిగింది. దీనివల్ల బంగారం కొనే వారి సంఖ్య తగ్గింది. కాకపోతే బంగారం అనేది మధ్యతరగతి.. దిగువ తరగతి వాళ్లకు మాత్రమే దూరమైంది. ఆగర్భ శ్రీమంతులు స్థిరమైన పెట్టుబడిగా బంగారాన్ని భావించి.. భారీగా కొనుగోలు చేస్తున్నారు.

బంగారాన్ని డబ్బున్న వాళ్ళు భారీగా కొనుగోలు చేయడం వల్ల విదేశాల నుంచి భారత్ అధిక మొత్తంలో దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల ఫారెక్స్ నిల్వలు తగ్గిపోతున్నాయి. అందువల్లే ఇటీవల భారత ప్రభుత్వం బంగారం మీద కీలక ప్రకటన చేసింది. సుంకాన్ని ఆరు నుంచి పదిని శాతం పెంచేసింది. దీనివల్ల బంగారం విలువ.. ధర విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం బంగారం 10 గ్రాములు 24 క్యారెట్ల ధర సుమారు 1,60,000 వరకు చేరుకుంది. దీంతో ప్రజలు కేవలం అవసరమైతేనే బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు అమ్మకాల పరిమాణం తగ్గిపోయినప్పటికీ.. బంగారం విలువ మాత్రమే విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్కువ బంగారాన్ని కొనుగోలు చేసినప్పటికీ.. ధర మాత్రం విపరీతంగా చెల్లించాల్సి వస్తోంది. అందువల్లే జ్యువెలరీ కంపెనీలు తమ ఆదాయాన్ని 20 నుంచి 25 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. కంపెనీలు అమ్మే బంగారం పరిమాణం తగ్గుతోంది. కాకపోతే ధరల వల్ల వారి ఆదాయం పెరుగుతోంది..

ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసెల్ తన నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. మనదేశంలో బంగారు ఆభరణాల అమ్మకాలు తగ్గుతున్నట్టు ప్రకటించింది. ప్రజలు కొనుగోలు చేస్తున్న బంగారం బరువు తగ్గుతోందని పేర్కొంది. ఈ సంవత్సరంలో బంగారు ఆభరణాల అమ్మకాలు ఎనిమిది శాతం తగ్గాయని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఆ శాతం 15 వరకు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. గడచిన పది సంవత్సరాల కాలంలో ఇదే అత్యంత స్వల్ప స్థాయి అని వెల్లడించింది. ధరల లో విపరీతమైన పెరుగుదల.. దిగుమతి సుంకం అనేది పెరగడం వల్ల బంగారంలో ఈ స్థాయి మార్పులు వచ్చాయని క్రిసిల్ ప్రకటించింది.

కాక్రోచ్ జనతా పార్టీ.. తదుపరి ఏం చేస్తుంది..

Cockroach Janata Party
Cockroach Janata Party

Cockroach Janata Party: దేశ రాజకీయాలలో కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద చర్చను తీసుకొచ్చింది ఈ పార్టీ ఇంతవరకు భౌతికంగా ఏర్పాటు కాలేదు. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే అలజడి సృష్టిస్తోంది. 30 సంవత్సరాల యువకుడు అభిజిత్ దీనికి వ్యవస్థాపకుడు. ఇతడిది మహారాష్ట్రలోని సంభాజీ నగర్. ప్రస్తుతం బోస్టన్ యూనివర్సిటీలో అత్యున్నత చదువులు చదివాడు. ఇంతకుముందు ఇతడు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా విభాగంలో పనిచేశాడు. సామాజిక మాధ్యమాల వేదికలలో ప్రజలను ఆకర్షించే విధానాలపై అతడు తీవ్రంగా అధ్యయనం చేశాడు. ఈనెల 16న తన ఎక్స్ ఖాతాలో ఒక మామూలు గూగుల్ ఫారం పెట్టాడు. మీరు సమాజంలో కాక్రోచ్ మాదిరిగా ఇబ్బంది పడుతున్నారా.. వేధింపులు ఎదుర్కొంటున్నారా.. అయితే మీరు రండి.. మనమంతా కలిసి కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు చేద్దాం.. అంటూ సెటరికల్ గా పిలుపునిచ్చాడు. అది కాస్త సంచలనమై కూర్చుంది.

కేవలం 24 గంటల వ్యవధిలోనే లక్ష మంది ఫాలోవర్స్ పుట్టుకొచ్చారు. 48 గంటల్లో లక్షల మంది ఆ ఫారం మొత్తం నింపేశారు. ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఆఫీసర్ పేజీ ఓపెన్ చేసిన కొద్ది గంటల్లోనే విధ్వంసం సృష్టించింది. ఏకంగా భారతీయ జనతా పార్టీని మించిపోయి 1.80 కోట్ల అనుచర గణాన్ని సొంతం చేసుకుంది. దీని తర్వాత ఆ పార్టీ అఫీషియల్ ఇన్ స్టాగ్రామ్ ఎకౌంటు హ్యాక్ అయింది. దీనికి అనుసంధానంగా అనేక పోస్టులు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే అభిజిత్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా ఎకౌంట్ హ్యాక్ అయిందని పేర్కొన్నాడు. పార్టీని ప్రస్తావిస్తూ వచ్చే ప్రకటనలతో తనకు సంబంధం లేదని ప్రకటించాడు.

అభిజిత్ ఎలాంటి మాటలు మాట్లాడినా సరే.. ఇప్పుడు ఈ పార్టీ విధివిధానాలు ముఖ్యంగా యువతరాన్ని ఆకట్టుకుంటున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ పార్టీ తదుపరి లక్ష్యాలు ఎలా ఉండబోతున్నాయి. ఎలాంటి విధానాలకు ఆ పార్టీ శ్రీకారం చుట్టబోతోంది. ఇంకా అనేక విషయాలపై చర్చ జరుగుతుంది. అయితే కాక్రోచ్ జనతా పార్టీ కేవలం ఫాలోవర్స్.. లైకులు.. షేర్ల వరకే ఈ పార్టీ పరిమితం కాబోదని తెలుస్తోంది. వచ్చే రోజుల్లో దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలిగే శక్తిని ఈ పార్టీ సంతరించుకుంటుందని తెలుస్తోంది.

బీహార్.. ఉత్తర ప్రదేశ్ .. మధ్యప్రదేశ్.. మహారాష్ట్ర వంటి ప్రాంతాలలో ఈ పార్టీకి సంబంధించి రీజనల్ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు ఏర్పాటు అయ్యాయి. వీటిల్లో ఎక్కువ శాతం యువత ఉన్నారు. బీహార్ రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కాక్రోచ్ జనతా పార్టీ తరఫున ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీలో ఉంటారని తెలుస్తోంది. కేవలం వీరు మాత్రమే కాకుండా టిఎంసి ఎంపీలు ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నారు. అంతేకాదు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్దేశాలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో కనిపించేది మొత్తం నిజం కాదు. అదంతా కృత్రిమ ప్రపంచం. అందులో అన్ని కూడా కృతకంగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ లైకులు.. షేర్ల ఆధారంగా ఎన్నికల్లో గెలుపులు సాధ్యమవుతాయా.. అంటే చెప్పలేని పరిస్థితి. కాకపోతే కాక్రోచ్ జనతా పార్టీ పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారి.. దేశాన్ని పరిపాలించడం అంత ఈజీ కాదని విశ్లేషకులు అంటున్నారు. కాకపోతే ఈ పార్టీ ఏర్పాటు పరిపాలకులకు ఒక గట్టి హెచ్చరికను సూచిస్తున్నారు.

మండే ఎండల్లో.. దంచి కొట్టిన వానలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎందుకీ పరిస్థితి.. ప్రకృతి ఏం చెబుతోంది..

Telugu States Sudden Rains
Telugu States Sudden Rains

Telugu States Sudden Rains: నిన్నటిదాకా 45 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలు.. వడగాలులు.. బయటికి వెళ్లడం కాదు.. ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితి.. ఇక వడదెబ్బ మృతులకు అయితే లెక్కేలేదు. దీంతో ఇంకా ఎన్నిరోజులు రా బాబు ఈ ఎండలు.. అని ప్రజలు ఇబ్బంది పడడం.. కరెంటు పోతే ప్రభుత్వాలను తిట్టుకోవడం.. ఏసీలు సరిగా పనిచేయకపోతే.. ఫ్యాన్లు సరిగా తిరగకపోతే.. కూలర్లు చల్లగాలిని అందించలేక పోతే తిట్టుకోవడం వంటివి చేశారు.

ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కరోజు వ్యవధిలోని అంతా మారిపోయింది. వాతావరణం లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఫలితంగా ముగ్గురు మృతి చెందారు. ఏపీ రాష్ట్రంలోని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అనకాపల్లి, నక్కపల్లి, పాయకరావుపేట మండలంలో విపరీతంగా వర్షం కురిసింది. గాలివాన ప్రజలకు భయభ్రాంతులకు గురిచేసింది. విపరీతమైన గాలుల వల్ల చెట్లు విరిగిపడిపోయాయి. రోడ్లమీద వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.. రమణయ్యపేట, ముకుంద రాజుపేట, దోసలపాడు, చీడిక, దొండాడ, దొడ్డిగళ్ళు వంటి ప్రాంతాలలో చెట్లు విరిగిపడిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగాయి. కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సత్యవరం ప్రాంతంలో తమలపాకు కూలీలు చనిపోయారు. ముకుందరాజుపేటలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. మామిడికాయలు పూర్తిగా నేల రాలిపోయాయి. అరటి తోటలు కుప్పకూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడిపోయాయి. దీంతో కరెంటు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.

ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. ఈ జిల్లాలోని తాడూరు మండలం గోవిందా పల్లి లో పిడుగుపాటు పడింది. ఒక గొర్రెల కాపరి అక్కడికక్కడే చనిపోయాడు. అచ్చంపేట ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి ధాన్యం మొత్తం తడిచిపోయింది. బిజినేపల్లి.. తెలకపల్లి.. తాడూరు గ్రామాలలో ఈదురుగాలులు వీచాయి. వర్షం కూడా భారీగా కురిసింది. దీంతో కేంద్రాలలో ఆరబోసిన ధాన్యం తడిచింది. రైతులు ధాన్యాన్ని కాపాడుకోలేక తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.

అందువల్లే వర్షాలు

విపరీతమైన ఎండల వల్ల నీటి ఆవిరి అధికంగా జరుగుతోంది. దీనివల్ల అకస్మాత్తుగా మేఘాలు ఏర్పడుతున్నాయి. చల్లని గాలులు వేయగానే అవి వెంటనే కరిగిపోతున్నాయి. మేఘాల మధ్య ఒత్తిడి వల్ల పిడుగుపాటు చోటుచేసుకుంటున్నది. అధిక ఉష్ణోగ్రతల వల్లే ఇటువంటి అకస్మాత్తు వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎండాకాలం ముగిసే వరకు అప్రమత్తంగా ఉండడమే మంచిదని వారు సూచిస్తున్నారు.