Home Blog Page 235

పెంచుకుంటూ పోతున్నారు.. ఎన్నాళ్ళు ఈ పెట్రోమంట

Petrol Price Hike In India
Petrol Price Hike In India

petrol price hike : పెంచుడు కార్యక్రమం దర్జాగా సాగిపోతోంది. జనాలకు కూడా అలవాటైపోతుంది. మొదట్లో మూడు రూపాయలు పెంచారు. ఆ తర్వాత 90 పైసలు వడ్డించారు. ఇప్పుడు ఏకంగా 2.84 రూపాయలు పెంచేశారు. ఇలా పెంచుకుంటూ పోవడం వల్ల సామాన్య జనం బతికే పరిస్థితి లేకుండా పోతోంది. ధరల స్థాయి నిరంతర పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్లో ప్రతి వస్తువు ధర కూడా ఆకాశంలో విహరిస్తోంది. పెట్రోల్ ధరల పెరుగుదలను సాకుగా చూపించి వ్యాపారులు ఇతర వస్తువుల ధరలు కూడా పెంచుతున్నారు. దీనివల్ల సగటు మనిషి బతకలేక పోతున్నాడు.

సోమవారం ఉదయం నుంచి మన దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు మరింత పెరిగాయి. పెట్రోల్ పై 2.84.. డీజిల్ పై 2.86 రూపాయల ధర పెరిగింది. నష్టాలు వస్తున్నాయని సాకుగా చూపించిన దేశీయ చమురు రంగ సంస్థలు ధరలను విపరీతంగా పెంచాయి. ఈ ధరలు సోమారం ఉదయం నుంచి అమలులోకి వచ్చాయి. ఇప్పటికే మూడు విడతలుగా డీజిల్, పెట్రోల్ ధరలను చమురు రంగ సంస్థలు పెంచేశాయి.. ఇప్పుడు పెరిగిన దర ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 102.12, లీటర్ డీజిల్ ధర 95.20కి విక్రయిస్తున్నారు.. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 111.12, చెన్నైలో 107.77, విజయవాడలో 117.19, డీజిల్ 104.88, గుంటూరులో పెట్రోల్ 117.59, డీజిల్ 105.28, హైదరాబాదులో పెట్రోల్ 115.58, డీజిల్ 103.74 ధరలో లభ్యమవుతూ ఉంటుంది.

మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం తగ్గినప్పటికీ.. ఉద్రిక్తతలు ఒకప్పటి మాదిరిగా లేకపోయినప్పటికీ.. చమురు సరఫరాలో ఊహించిన వేగం లేదు. పైగా అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గల్ఫ్ దేశాలు యుద్ధం వల్ల ఏర్పడిన లాస్ ను పూడ్చుకోవడానికి క్రూడ్ ఆయిల్ ధరలను పెంచేస్తున్నాయి. దీనివల్ల అన్ని దేశాలలో చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కొన్ని దేశాలైతే చమురు వినియోగంలో అనేక షరతులు విధిస్తున్నాయి. ప్రజలను ఇష్టానుసారంగా వాడకూడదని సూచిస్తున్నాయి. దీంతో అన్ని రకాల సేవలు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని వ్యాపారాలు చమురు ఆధారంగా సాగుతూ ఉంటాయి. చమురు ధరలు పెరిగితే చాలు ఇతర వస్తువుల ధరలు కూడా పెరిగిపోతుంటాయి. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇతర వస్తువుల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో సగటు జీవి బడ్జెట్ లెక్కలు మారిపోతున్నాయి. అందువల్లే యుద్ధం శాశ్వతంగా ముగిసి.. చమురు ధరలు సాధారణ స్థితికి రావాలని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారు. అయితే శాంతి చర్చల నేపథ్యంలో అటు ఇరాన్.. ఇటు అమెరికా పట్టు విడుపులకు పోతున్న నేపథ్యంలో పరిస్థితి ఎప్పుడు మునుపటి స్థితికి వస్తుందో అర్థం కావడం లేదు.

బాలిక పై అఘాయిత్యం.. జోకులేసిన ముగ్గురు ఐపీఎస్ లను తీసేసిన విజయ్.. సంచలనం

IPS officers suspended, Coimbatore girl case

IPS officers suspended : తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. కోయంబత్తూర్ జిల్లాలో ఓ పదేళ్ల బాలికపై ఘోరం జరిగింది. ఆమెను కొంతమంది వ్యక్తులు అపహరించి.. అత్యంత క్రూరానికి పాల్పడ్డారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి విజయ్ వెంటనే స్పందించారు. అంతేకాదు జరిగిన ఘటనపై తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సంబంధిత ఎమ్మెల్యే పరామర్శించారు.

ఈ కేసులో పోలీసులు వేగంగా వ్యవహరించారు. నేరుగా ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రావడంతో విచారణను వేగవంతం చేశారు. ఫలితంగా ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ కేసు కు సంబంధించిన విషయాలను చెప్పడానికి నిన్న ఒక మహిళ ఐజీ అధికారి.. ఇద్దరు ఐపీఎస్ అధికారులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. దానికంటే ముందు వారు ముగ్గురు నవ్వుతూ కనిపించారు. ముఖ్యంగా మహిళ ఐజీ అధికారి అయితే తోటి ఐపీఎస్ అధికారులతో సరదాగా నవ్వుతూ ముచ్చటించారు. గోర్లు గిల్లుతూ.. ఈ సంఘటనపై అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

ఆ మహిళ ఐజీ అధికారి వ్యవహరించిన తీర్పట్ల సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వచ్చాయి. ఒక బాలిక చనిపోతే కొంచెం కూడా మానవత్వం లేదా అంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నువ్వు కూడా ఒక మహిళవే కదా.. నీక్కూడా పెళ్లయి ఉంటుంది కదా.. నీకు పిల్లలు ఉండి ఉంటారు కదా.. ఒకవేళ జరిగిన ఘటనలో చనిపోయింది నీ కూతురైతే నువ్వు ఇలానే వ్యవహరిస్తావా అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఇది కాస్త ముఖ్యమంత్రి విజయ్ దృష్టికి వెళ్లిపోయాయి.

విజయ్ వెంటనే స్పందించారు. ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒక కేసు వ్యవహారంలో పోలీసులు నిజాలు చెప్పేటప్పుడు ఇలా వ్యవహరించకూడదని సూచించారు. ప్రజలకు పోలీసులు జవాబుదారీగా ఉండాలని.. శాంతి భద్రతలను పరిరక్షించాలని సూచించారు. దారుణంగా వ్యవహరించే అధికారుల మీద ఏమాత్రం జాలి చూపించాల్సిన అవసరం లేదని విజయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. జరిగిన ఘటనపై తాను విచారం వ్యక్తం చేస్తున్నానని.. పోలీసులు ఇకపై ఇలా వ్యవహరించకూడదని ఆయన సూచించారు. అందువల్లే ఆ ముగ్గురు అధికారులపై సస్పెండ్ వేటు వేస్తున్నట్టు వెల్లడించారు.

విజయ్ తీసుకున్న నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. విజయ్ ని చూసి మిగతా ముఖ్యమంత్రులు నేర్చుకోవాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు..”విజయ్ ఏమాత్రం నిర్లక్ష్యం వహించలేదు. ఆ ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేయించాడు. దీనిని బట్టి పోలీసులు ఎలా ఉండాలో.. ఎలా ఉండకూడదో తెలుసుకుంటారని” నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన సినిమాల్లో రామ్ చరణ్ కి నచ్చిన మూవీ అదేనా..?

Chiranjeevi
Chiranjeevi

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలన్నీ అతన్ని టాప్ లెవల్లో నిల్చో బెట్టాయి. 2008 వ సంవత్సరంలో ‘ప్రజారాజ్యం’ పార్టీ పెట్టి రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత రాజకీయాల్లో ఇమడలేక ఆయన తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ను చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేశాడు. అయితే ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఆ తర్వాత చేసిన సినిమాలు అతనికి కొంతవరకు చేదు అనుభవాన్ని మిగిల్చాయనే చెప్పాలి. ఇక వాల్తేరు వీరయ్య, మన శంకర్ వరప్రసాద్ లాంటి సినిమాలు మాత్రమే అతనికి ఊరటను ఇచ్చాయి.

సెకండ్ ఇన్నింగ్స్ లో చిరంజీవి చేసిన సినిమాల్లో రామ్ చరణ్ కి బాగా నచ్చిన సినిమా ఏంటి అంటే ‘సైరా’ సినిమా అని చెబుతున్నాడు. చిరంజీవి చాలా అగ్రెసివ్ గా కనిపించడమే కాకుండా క్యారెక్టర్ కోసం చాలా వరకు కష్టపడ్డాడు. కాబట్టి సైరా మూవీ అంటే తనకు చాలా ఇష్టమని చెప్తుంటాడు.

ఒక చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో ఆ సినిమా అండర్ రేటెడ్ మూవీ అని అనుకున్న విజయాన్ని సాధించకపోయిన కూడా చిరంజీవిలోని పూర్తి స్థాయి నటుణ్ని మరోసారి బయటికి తీసింది అంటు పలు సందర్భాల్లో కొందరు కామెంట్స్ కూడా చేశారు….మొత్తానికైతే రామ్ చరణ్ కి తన తండ్రి చేసిన సినిమాల్లో సైరా అంటే ఇష్టం ఉండటమే కాకుండా ఆ సినిమా ని ప్రొడ్యూస్ చేసింది కూడా రామ్ చరణ్ నే కావడం విశేషం…

ఆ సినిమా అనుకున్న మేరకు సక్సెస్ కాకపోవడానికి గల కారణం ఏంటి అంటే దర్శకుడు దానిని చాలా బాగా తీర్చిదిద్దినప్పటికి క్లైమాక్స్ ఎపిసోడ్ ప్రేక్షకులకు అంత బాగా ఎఫెక్టివ్ గా అనిపించలేదు. దాంతో ఆ సినిమాని వాళ్ళు పక్కన పెట్టేసారు. మొత్తానికైతే సినిమా విజువల్ గా గాని చిరంజీవి నటన పరంగా గాని ప్రేక్షకులకు ఒక హై ఫీల్ ఇచ్చింది. ప్రస్తుతం చిరంజీవి బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో మరోసారి సూపర్ సక్సెస్ ని సాధించాలని ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…

ఈ రాశుల వారికి ఈరోజు డబ్బే డబ్బు.. అయితే..

Today 23 July 2026 Horoscope
Today 23 July 2026 Horoscope

Today 25 May 2026 Horoscope: జ్యోతిష శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు అనుకోకుండా ధన లాభం ఉంటుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారి ప్రయాణాలు ఈరోజు సానుకూలంగా ఉంటాయి. గతంలో మొదలు పెట్టిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉండడంతో ముఖ్యమైన పనులను పూర్తిచేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ఇదే మంచి సమయం. ప్రభుత్వ కార్యక్రమాలు చురుకుగా పూర్తవుతాయి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : పూర్వీకుల ఆస్తిపై శుభవార్తలు వింటారు. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో అనుకున్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా వ్యాపారులకు ధన లాభం ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెద్దల అండదండలతో కొత్తగా పెట్టుబడులు పెడతారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఉద్యోగులకు కెరీర్ విషయంలో శుభవార్తలు అందుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. అవసరానికి మించి ఖర్చులు చేయకుండా ఉండాలి. ఎవరితోనూ అనవసరపు వాదనలకు దిగకుండా ఉండాలి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : సింహరాశి వారు ఈరోజు కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను సులభంగా పూర్తి చేస్తారు. ఇతరులతో వాదనలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు కొత్త పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులు అవసరం మేరకు మాత్రమే ఖర్చులు చేయాలి. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పూర్వికులు ఆర్థిక సంబంధించి శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఖర్చులను నియంత్రించాలి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రాశి వారికి ఈ రోజు పని భారం ఎక్కువగా ఉంటుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : పాత పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులు ప్రాజెక్టులను అనుకున్న సమయంలో పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు పోటీపరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈరోజు కెరియర్ విషయంలో కీలక సమాచారం అందుతుంది. కొందరు ఉద్యోగులకు పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడును పెడతారు. ఎవరైనా డబ్బు అడిగితే ఆలోచించాలి. అత్యవసర సేవలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఉద్యోగులకు అదనపు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. తల్లిదండ్రుల అండదండలతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. అవసరానికి మించి ఖర్చులు చేయవద్దు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఇంటికి సంబంధించిన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులకు అనుకోకుండా ధన లాభం ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.

సింహాలకు కూడా సుస్సు పోయిస్తుంది.. గిన్నీస్ బుక్ లో చోటు.. ఈ భీకర జంతువు ఏంటో తెలుసా..

Most Fearless Animal
Most Fearless Animal

Most Fearless Animal: అడవిలో సింహం రాజు అని అందరికీ తెలుసు. కానీ ఆ సింహాలకే సవాల్ విసిరే చిన్న జంతువు ఒకటి ఉంది. అదే Honey Badger. పరిమాణంలో చిన్నదైనా, ధైర్యం, దూకుడు, పోరాట నైపుణ్యం వల్ల దీనిని ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన జంతువులలో ఒకటిగా పరిగణిస్తారు. ఆఫ్రికా అడవుల్లో సింహాలు, చిరుతలు, హైనాలు కూడా ఈ జంతువుతో తగవు పెట్టడానికి ముందు ఆలోచిస్తాయని వన్యప్రాణి నిపుణులు చెబుతుంటారు. ఈ జంతువు గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..

Honey Badger ను ‘Ratel’ అని కూడా పిలుస్తారు. ఇది ప్రధానంగా ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, భారతదేశంలోని కొన్ని అడవి ప్రాంతాల్లో కనిపిస్తుంది. దీని శరీరం చిన్నదిగా ఉన్నా, దట్టమైన చర్మం, బలమైన గోర్లు, పదునైన దవడలు దీనిని ప్రమాదకరమైన వేటగాడిగా మార్చాయి. సాధారణంగా 9 నుంచి 16 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. అయినా తనకంటే ఎన్నో రెట్లు పెద్ద జంతువులపై కూడా దాడి చేయగలదు.

Honey Badger గురించి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చింది దాని నిర్భయ స్వభావమే. చాలా జంతువులు ప్రమాదం కనిపిస్తే పారిపోతాయి. కానీ Honey Badger మాత్రం ఎదురుదాడి చేస్తుంది. సింహం, చిరుత, అడవి కుక్కలు, హైనాలు దాడి చేసినా వెనక్కి తగ్గకుండా పోరాడుతుంది. కొన్ని సందర్భాల్లో పెద్ద మృగాలను కూడా వెనక్కి తరిమేసిన ఘటనలు డాక్యుమెంటరీల్లో నమోదయ్యాయి.

ఇది విషసర్పాలకు కూడా పెద్ద శత్రువుగా భావిస్తారు. కోబ్రా, వైపర్ వంటి విషపూరిత పాములను కూడా వేటాడుతుంది. పాము కాటు వేసినా కొన్ని గంటల పాటు స్పృహ కోల్పోయి మళ్లీ కోలుకుని ఆ పామునే తినేస్తుందని పరిశోధకులు చెబుతుంటారు. దీనికి విషాన్ని తట్టుకునే శక్తి ఇతర జంతువుల కంటే ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు.

Honey Badger తెలివితేటలు కూడా ఆశ్చర్యపరుస్తాయి. జూలో బంధించినప్పుడు తాళాలు తెరవడం, రాళ్లు లేదా కట్టెలను ఉపయోగించి గోడలు ఎక్కడం వంటి పనులు చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. అందుకే దీనిని అత్యంత తెలివైన అడవి జంతువులలో ఒకటిగా కూడా పరిగణిస్తారు.

దీని ఆహారం చాలా విభిన్నంగా ఉంటుంది. పాములు, ఎలుకలు, పక్షులు, కీటకాలు, చిన్న జంతువులు, తేనె ఏదైనా తింటుంది. ముఖ్యంగా తేనెటీగల గూళ్లను పగలగొట్టి తేనె తినడం దీనికి చాలా ఇష్టం. అందుకే దీనికి ‘Honey Badgerఅనే పేరు వచ్చింది. తేనెటీగలు దాడి చేసినా మందపాటి చర్మం వల్ల పెద్దగా ప్రభావం ఉండదు.

దీని చర్మం చాలా గట్టిగా, వదులుగా ఉంటుంది. అందువల్ల పెద్ద జంతువు పట్టుకున్నా, తన శరీరాన్ని తిప్పి తిరిగి దాడి చేయగలదు. గాయపడినా చివరి వరకు పోరాడే స్వభావం దీనికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. అందుకే ప్రపంచ ప్రఖ్యాత Guinness Book కూడా Honey Badger ను ‘Most Fearless Animal’గా పేర్కొంది.

‘వన్నె తగ్గింది’ అనే పదం ఎలా పుట్టింది?

Vanne Taggindi Meaning
Vanne Taggindi Meaning

Vanne Taggindi Meaning: మన రోజువారీ జీవితంలో ‘వన్నె తగ్గింది’ అనే మాటను తరచుగా వింటుంటాం. ఒక వ్యక్తి ప్రభావం తగ్గినా.. ఒక వస్తువు మెరుపు కోల్పోయినా.. ఒక ప్రదేశం పాత గౌరవం కోల్పోయినా ఈ నానుడిని ఉపయోగిస్తారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఈ ‘వన్నె’ అనే పదానికి బంగారంతో చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటో తెలుసుకుందాం..

బంగారం గురించి తెలిపేటప్పుడు పాత రోజుల్లో ఇప్పటిలా ‘క్యారెట్లు’ అనే పదం విస్తృతంగా వాడుకలో లేదు. అప్పట్లో బంగారం నాణ్యతను ‘వన్నె’ల ద్వారా చెప్పేవారు. 16 వన్నెల బంగారం అంటే పూర్తిగా స్వచ్ఛమైన బంగారం అని అర్థం. అదే నేటి 24 క్యారెట్ గోల్డ్‌కు సమానం. అలాగే 14.6 వన్నెలు అంటే ప్రస్తుతం మనం చెప్పుకునే 22 క్యారెట్ బంగారం. అంటే వన్నెలు తగ్గిన కొద్దీ బంగారంలో ఇతర లోహాల మిశ్రమం పెరిగిందని భావించేవారు.

బంగారం ఎక్కువకాలం వాడితే దాని మెరుపు కొద్దిగా తగ్గుతుంది. అప్పట్లో అలాంటి సందర్భాల్లో ‘బంగారం వన్నె తగ్గింది’ అని చెప్పేవారు. ఇక్కడ ‘వన్నె’ అంటే కేవలం రంగు కాదు.. స్వచ్ఛత, మెరుపు, విలువ అన్నీ కలిపిన భావం. క్రమంగా ఈ పదం బంగారాన్ని దాటి మనుషులు, వస్తువులు, పరిస్థితులకు కూడా వర్తించసాగింది.

ఉదాహరణకు ఒకప్పుడు ఎంతో ప్రాచుర్యం పొందిన వ్యక్తి ఇప్పుడు గుర్తింపు కోల్పోతే ‘అతని వన్నె తగ్గింది’ అంటారు. అలాగే ఒక ఊరు పాత అందం కోల్పోయినా, ఒక సంస్థ ప్రభావం తగ్గినా అదే మాట వాడుతారు. అంటే ‘వన్నె’ అనే పదం ఇప్పుడు ప్రతిష్ట, ఆకర్షణ, విలువ, గౌరవం అనే అర్థాలన్నింటినీ సూచించే నానుడిగా మారిపోయింది.

తెలుగు భాషలో ఇలాంటి పదాలకు గొప్ప చరిత్ర ఉంటుంది. సాధారణంగా వినిపించే మాటల వెనుక సామాజిక జీవితం, వ్యాపార పద్ధతులు, పాత కొలమానాలు దాగి ఉంటాయి. ‘వన్నె తగ్గింది’ అనే నానుడి కూడా అలాంటి చారిత్రక ప్రయాణం చేసిన పదాల్లో ఒకటి. బంగారం మెరుపు నుంచి మొదలైన ఈ మాట.. ఇప్పుడు మన భావోద్వేగాలను కూడా వ్యక్తపరచే సామెతగా మారిపోయింది.

ప్రపంచంలోనే 10 అణుబాంబులున్న దేశాలు.. అవి ఎలా పొందారు? వాటి చరిత్ర ఇదీ

Nuclear Weapons Countries
Nuclear Weapons Countries

Nuclear Weapons Countries: ప్రపంచంలో అణుబాంబులు కలిగిన దేశాలు చాలా తక్కువే అయినా, వాటి శక్తి మాత్రం మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉంటుంది. ఒక అణుబాంబు పేలితే లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే అణ్వాయుధాలను ప్రపంచ దేశాలు అత్యంత రహస్యంగా, భారీ భద్రత మధ్య నిర్వహిస్తుంటాయి. ప్రస్తుతం అధికారికంగా లేదా అనధికారికంగా అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాల సంఖ్య 9గా గుర్తించబడుతోంది. అయితే కొన్ని నివేదికల్లో NATO భాగస్వామ్య కారణాల వల్ల మరో దేశాన్ని కూడా చర్చలోకి తీసుకువస్తారు. దీంతో “10 అణ్వాయుధ శక్తులు” అనే జాబితా తరచుగా వినిపిస్తుంది. ఆ 10 దేశాల్లో ఇండియా కూడా ఉంది. ఆ వివరాల్లోకి వెళితె..

అణుబాంబును మొదటగా తయారు చేసి ఉపయోగించిన దేశం United States. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1945లో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిపై అమెరికా అణుబాంబులు వేసింది. ఆ తర్వాత ప్రపంచ రాజకీయాల్లో అణ్వాయుధాలు కీలక పాత్ర పోషించడం ప్రారంభమైంది. ప్రస్తుతం అమెరికా వద్ద వేల సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్నాయని అంచనా. భూమి, జలాంతర్గాములు, యుద్ధవిమానాల ద్వారా వీటిని ప్రయోగించే సామర్థ్యం అమెరికాకు ఉంది.

Russia ప్రపంచంలోనే అత్యధిక అణ్వాయుధాలు కలిగిన దేశంగా భావిస్తారు. శీతల యుద్ధ కాలం నుంచి అమెరికాతో అణ్వాయుధ పోటీలో ఉన్న రష్యా ఇప్పటికీ అత్యంత శక్తివంతమైన మిస్సైల్ వ్యవస్థలను నిర్వహిస్తోంది. హైపర్సోనిక్ అణు క్షిపణులు కూడా రష్యా వద్ద ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.

China గత కొన్నేళ్లుగా తన అణ్వాయుధ శక్తిని వేగంగా పెంచుకుంటోంది. చైనా ఆధునిక క్షిపణి వ్యవస్థలు, అణు జలాంతర్గాములు, దీర్ఘశ్రేణి అణు దాడి సామర్థ్యాలను అభివృద్ధి చేస్తోంది. ఆసియాలో చైనా ఎదుగుదల ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.

India 1974లో మొదటి అణు పరీక్ష నిర్వహించింది. ‘స్మైలింగ్ బుద్ధ’ పేరుతో జరిగిన ఈ పరీక్ష తర్వాత భారత్ అణుశక్తి దేశంగా గుర్తింపు పొందింది. తర్వాత 1998లో పోఖ్రాన్ పరీక్షలతో భారత్ తన అణు సామర్థ్యాన్ని ప్రపంచానికి స్పష్టంగా తెలియజేసింది. భారత్ ‘No First Use’ విధానాన్ని పాటిస్తామని ప్రకటించింది. అంటే ముందుగా అణుదాడి చేయమని.. కానీ దాడి జరిగితే భారీ ప్రతిదాడి చేస్తామని చెబుతోంది.

Pakistan భారత్‌కు ప్రత్యర్థిగా అణ్వాయుధ కార్యక్రమాన్ని అభివృద్ధి చేసింది. 1998లో పాకిస్థాన్ అణు పరీక్షలు నిర్వహించింది. అప్పటి నుంచి దక్షిణాసియాలో అణు ఉద్రిక్తతలు పెరిగాయి. భారత్-పాక్ సంబంధాలు క్షీణించిన ప్రతిసారి ప్రపంచం ఆందోళన చెందుతుంది.

North Korea ప్రపంచంలో అత్యంత వివాదాస్పద అణు శక్తిగా గుర్తించబడుతోంది. అనేక అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ ఉత్తర కొరియా అణు పరీక్షలు, క్షిపణి ప్రయోగాలు కొనసాగిస్తోంది. అమెరికా సహా పలు దేశాలకు ఇది భద్రతా సవాల్‌గా మారింది.

NATO కూటమిలో France, United Kingdom కీలక అణు శక్తులు. ఈ రెండు దేశాలు సముద్ర మార్గంలో అణుదాడి చేసే జలాంతర్గామి వ్యవస్థలను బలోపేతం చేశాయి. యూరప్ భద్రతలో వీటి పాత్ర చాలా కీలకం.

Israel అధికారికంగా అణ్వాయుధాలు ఉన్నాయని ఎప్పుడూ ప్రకటించలేదు. కానీ ప్రపంచ నిపుణులు మాత్రం ఇజ్రాయెల్ వద్ద గోప్యంగా అణుబాంబులు ఉన్నాయని భావిస్తున్నారు. మధ్యప్రాచ్య ప్రాంతీయ రాజకీయాల్లో ఇది అత్యంత సున్నితమైన అంశంగా ఉంది.

కొన్ని నివేదికల్లో Germany, Belgium, Italy, Turkey వంటి NATO మిత్రదేశాల్లో అమెరికా అణ్వాయుధాలు నిల్వ ఉంచిన కారణంగా వాటిని కూడా చర్చలోకి తీసుకుంటారు. అయితే ఇవి స్వతంత్ర అణు శక్తులుగా పరిగణించబడవు.

ప్రపంచంలో అణ్వాయుధాల ఉనికి ఒకవైపు భద్రతను ఇస్తే, మరోవైపు భారీ వినాశన భయాన్ని కూడా పెంచుతోంది. అందుకే ఐక్యరాజ్యసమితి సహా అనేక అంతర్జాతీయ సంస్థలు అణు నిరాయుధీకరణపై నిరంతరం పిలుపునిస్తున్నాయి.

హార్ముజ్‌లో సరికొత్త సమస్య.. మరో సూయజ్‌ కాలువ అవుతుందా?

Hormuz Strait Crisis
Hormuz Strait Crisis

Hormuz Strait Crisis: ప్రపంచ ఇంధన మార్గాల్లో ఆక్సిజన్‌గా భావించే హార్ముజ్‌ జలసంధి దాదాపు మూడు నెలలుగా స్తబ్దంగా మారింది. అమెరికా–ఇజ్రాయెల్‌ కూటమి, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు ఈ కీలకమైన నౌకా మార్గాన్ని అడ్డుకోవడంతో, గ్లోబల్‌ ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన హెచ్చరిక సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి 1967 సూయజ్‌ కాలువ సంక్షోభాన్ని గుర్తు చేస్తోంది.

చరిత్ర పునరావృతం అవుతుందా..
1967 అరబ్‌–ఇజ్రాయెల్‌ యుద్ధంలో సూయజ్‌ కాలువలో 15 నౌకలు చిక్కుకుపోయి, ఎనిమిదేళ్లపాటు అక్కడే కూరుకుపోయాయి. ’ఎల్లో ఫ్లీట్‌’గా ప్రసిద్ధి చెందిన ఆ నౌకలు తుప్పు పట్టి, చరిత్రలో ఒక హెచ్చరికగా మిగిలిపోయాయి. ఇప్పుడు హార్ముజ్‌లోనూ అదే దృశ్యం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్ని రోజులు ఈ దిగ్బంధనం కొనసాగుతుందో, ఎన్ని ఓడలు ఈ జలసంధిలో నిలిచిపోతాయో ప్రస్తుతం ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఈ సంక్షోభం సైన్స్‌ ఫిక్షన్‌ లాగా అనిపించినా, వాస్తవం మాత్రం తీవ్రంగా ఉంది.

యూఏఈ వ్యూహాత్మక సన్నాహాలు..
సంక్షోభం ప్రారంభం నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ స్పష్టమైన దూరదృష్టితో ముందుకు వెళ్తోంది. హార్ముజ్‌పై ఆధారపడకుండా చమురు రవాణా చేసేందుకు ప్రత్యామ్నాయ పైప్‌లైన్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. 2027 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కావొచ్చని అంచనాలు ఉన్నాయి. దౌత్య చర్చలు జరుగుతున్నా, దీర్ఘకాలిక ఉద్రిక్తతలు కొనసాగే అవకాశం ఉందని అబుదాబి అంచనా వేస్తోంది. ఇది ఒక దేశం మాత్రమే కాదు, మొత్తం గల్ఫ్‌ ప్రాంతం యొక్క భద్రతా వ్యూహంలో భాగం.

మార్కెట్‌ ఆశలు..
సంక్షోభం త్వరలో ముగిసి, చమురు ధరలు అనియంత్రితంగా పెరగకుండా సమతుల్యత నిలుస్తుందని వారు నమ్ముతున్నారు. అయితే ఈ ఆశలు ఎంతవరకు వాస్తవ రూపం దాల్చేయనేది ప్రశ్నార్థకం. ప్రపంచవ్యాప్తంగా రోజుకు సుమారు 20 మిలియన్‌ బ్యారెల్స్‌ చమురు సరఫరా అంతరాయం కలిగింది. సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలు, అత్యవసర నిల్వలు విడుదల చేయడం ద్వారా తాత్కాలికంగా పరిస్థితిని నియంత్రించగలిగాయి. కానీ ఈ నిల్వలు ఎప్పటికప్పుడు అయిపోతాయి.

ఆ తర్వాత ఏమవుతుంది?
ఇరాన్‌ సంకల్పం. ఆర్థిక ఒత్తిడిఇరాన్‌ వైపు చూస్తే, తీవ్రమైన ఆర్థిక సవాళ్ల మధ్య కూడా వెనక్కి తగ్గే సంకేతాలు కనిపించడం లేదు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ క్షీణత వంటి సమస్యలు ఉన్నప్పటికీ, ఉనికి కోసం పోరాటం కొనసాగుతోంది. రెండు వైపులా ’ముందుగా ఎవరు ఒప్పుకుంటారు’ అని వేచి చూడడం జరుగుతోంది. ఇలాంటి స్థిరత్వం లేని ఎదురు చూపు ప్రపంచానికి మరింత నష్టం కలిగిస్తుంది. హార్ముజ్‌ను శాశ్వతంగా మూసివేయడం ఎవరికీ లాభదాయకం కాదు. త్వరిత తాత్కాలిక ఒప్పందం అవసరం. అయితే గత చరిత్ర చెప్పినట్లు, ఒక్కసారి సాధారణమైన సంక్షోభాలు కాలక్రమేణా దీర్ఘకాలిక సమస్యలుగా మారే ప్రమాదం ఉంది. ప్రపంచ ఇంధన భద్రత ఇకపై భౌగోళిక రాజకీయాలపై ఆధారపడి ఉండదు. వైవిధ్యపరమైన సరఫరా మార్గాలు, పునరుత్పాదక ఇంధనాల వైపు వేగవంతమైన మార్పు, ప్రాంతీయ దేశాల మధ్య సహకారం – ఇవి భవిష్యత్‌ కోసం అనివార్యమైన అడుగులు.

చరిత్ర నుంచి నేర్చుకోకపోతే, ఆర్థిక వ్యవస్థలు మాత్రమే కాదు, సమగ్ర ప్రపంచ స్థిరత్వం కూడా ప్రమాదంలో పడుతుంది. సమయం ఇంకా ఉంది, కానీ చాలా తక్కువగా ఉంది.

గుక్కెడు నీళ్ల కోసం ప్రాణాలకు తెగిస్తున్న బాలికలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

Water Crisis In India
Water Crisis In India

Water Crisis In India: ఈ జీవికైనా సరే పీల్చేగాలి తర్వాత తాగే నీరు అత్యంత ముఖ్యం. అందువల్లే నీరు ఉన్నచోటే ఈ భూమండలం మీద సంస్కృతులు ఏర్పడ్డాయి. నగరాలు నిర్మాణమయ్యాయి. జీవజాతులు అభివృద్ధి చెందాయి. నీరు లేని చోట ఇప్పటికీ నిర్మానుష్యమైన వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. అందువల్లే జలాన్ని జగతికి బలం అని పిలుస్తుంటారు.

ఈ భూమండలంలో సముద్రాలు ఎక్కువగా ఉంటాయి. చాలా తక్కువ శాతం లో తాగునీటి వనరులు అందుబాటులో ఉంటాయి. తాగునీటిని సక్రమంగా వినియోగించుకుంటే ఇబ్బందులు ఉండవు. అలా కాకుండా ఇష్టానుసారంగా వాడితే ఇబ్బందులు ఎదురవుతుంటాయి. నీటిని విచ్చలవిడిగా వాడటం.. జల వనరులను పరిరక్షించుకోకపోవడంతో ఈ ప్రపంచంలో చాలామంది తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు. పైగా అభివృద్ధి పేరుతో అడవులను నాశనం చేయడంవల్ల వర్షాలు అంతగా కురవడం లేదు. పైగా కాంక్రీట్ జంగిల్ పెరిగిపోవడంతో భూమిలోకి నీరు ఇంకడం పూర్తిగా తగ్గిపోతుంది. అందువల్లే నీటి కొరత తీవ్రంగా ఉంటున్నది.

మనదేశంలో కూడా నీటి కొరతతో ఇబ్బంది పడే రాష్ట్రాలు చాలానే ఉన్నాయి. ఆమధ్య మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి ప్రత్యేక రైలు భోగిలలో నీటిని తరలించారు. సైనికుల పహార మధ్య నీటిని సరఫరా చేశారు. దీనినిబట్టి నీటి కొరత ఏర్పడితే జనజీవనం ఏ స్థాయిలో అవస్థ పడుతుందో ఇది కళ్లకు కట్టింది. ఇప్పుడు ఇటువంటి కష్టాలను మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నారు. మధ్యప్రదేశ్ పూర్తిగా అటవీ రాష్ట్రం. ఇక్కడ చాలా గ్రామాలు దూరం గా ఉంటాయి. ఈ గ్రామాలలో ప్రస్తుతం తాగునీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కార్గోనే జిల్లాలోని భగవాన్య గ్రామపంచాయతీ పరిధిలోని సర్బాద్ అనే గ్రామంలో తాగునీటి కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ తాగునీటి కోసం ప్రజలు నరకం చూస్తున్నారు. సర్బాద్ గ్రామంలో తాగునీటి కోసం బాలికలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో వారు నీటిని సేకరిస్తున్నారు. బావిలో కనీసం తాడు కూడా లేదు. గుడ్డలను తాడుగా మార్చుకొని.. ఆ బాలికలు బావిలో నీటిని తీసుకొని పైకి ఎక్కుతున్నారు. ఏ మాత్రం పట్టు తప్పినా సరే బాలికలు గాయపడడం ఖాయం. ఈ వీడియో పట్ల నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిలియన్ డాలర్ల ఎకనామి కాదని.. ప్రజలకు గుక్కెడు తాగునీళ్లు ఇవ్వాలని నెటిజన్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

సినిమా బడ్జెట్ పెంచేది హీరోలా,దర్శకులా... వీళ్లిద్దరు కాకపోతే ఇంకెవరు..?

Movie Budget
Movie Budget

Movie Budget Increase: ప్రస్తుతం స్టార్ హీరోలు చేస్తున్న సినిమాల బడ్జెట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యులు సినిమాలను చూడాలంటే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కారణం ఏంటి అంటే బడ్జెట్ ని పెంచడం వల్ల టికెట్ రేట్లను కూడా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానివల్ల చాలామంది థియేటర్లకి రావడమే మానేశారు. ఇక ఇలాంటి క్రమంలోనే హీరోలు తమ రెమ్యూనరేషన్ లను తగ్గించుకుంటే సినిమా బడ్జెట్ ఆటోమేటిక్గా తగ్గిపోతుందని కొంతమంది అంటున్నారు. మరి కొంతమంది మాత్రం విజువల్ వండర్స్ ని క్రియేట్ చేయడానికి విభిన్న కోణం లో కథలను రాస్తున్నారు. కాబట్టి బడ్జెట్ భారీగా పెరిగిపోతుందని చెబుతున్నారు. ఇక మరికొంతమంది హీరోలు, దర్శకులు బడ్జెట్ ను పెంచడం లేదు. కేవలం ప్రొడ్యూసర్లు మాత్రమే బడ్జెట్ ని కావాలనే పెంచుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కారణం ఏంటంటే ప్రస్తుతం ఒక హీరో కొంత రెమ్యూనరేషన్ ను తీసుకొని సినిమాలను చేస్తుంటే అతనికి సక్సెస్ వస్తే చాలు ప్రొడ్యూసర్లు తనతో సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో విపరీతంగా రెమ్యూనరేషన్ ను పెంచేసి వాళ్ళ డేట్స్ ని అయితే లాక్ చేసుకుంటున్నారు. దీనివల్ల హీరోలు తమ పారితోషికాన్ని పెంచుకోవడానికి ప్రొడ్యూసర్లు అవకాశాలను ఇస్తున్నారు. దాంతో వాళ్ళు సినిమా సినిమాకి త రెమ్యునరేషన్ ను విపరీతంగా పెంచేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే బడ్జెట్ ని పెంచేది ప్రొడ్యూసర్లు మాత్రమే అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…

ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు స్టార్ హీరోల సినిమాలకి వస్తుంది. కాబట్టి వాళ్లతో సినిమాలను చేసి భారీ మొత్తంలో డబ్బులు సంపాదించాలనే ప్రయత్నంలో ప్రొడ్యూసర్లు అయితే ఉన్నారు. ఇక ఫైనల్ గా ఈ సినిమాల వల్ల నష్టపోయేది ప్రేక్షకులే అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

వాళ్ళకి ఎలాగోలాగా డబ్బులు అయితే వస్తున్నాయి. కానీ ప్రేక్షకుడు రోజు పని చేసుకొని ఎప్పుడొకసారి తన కుటుంబాన్ని తీసుకొని వినోదం కోసం సినిమా థియేటర్ కి వచ్చి సినిమాని చూసి వెళ్లాలనుకుంటాడు. ఇక ఇలాంటి క్రమంలో అతనికి తక్కువ ధరలో టికెట్ దొరికితే పర్లేదు.

కానీ వీలైనంత ఎక్కువ ధరలో రేట్లు ఉంటే మాత్రం తను ఫ్యామిలీతో థియేటర్ కి రావడం ఇబ్బందిని కలిగిస్తుంది. కాబట్టి టికెట్ రేట్లను తగ్గించాలి అంటే బడ్జెట్ నియంత్రణలో ఉంచాల్సిన అవసరం ఉంది. ప్రొడ్యూసర్లు, హీరోలు, దర్శకులు ముగ్గురు కలిసి దీనిమీద చర్యలు తీసుకుంటే తప్ప ఓవర్ బడ్జెట్ అనేది కంట్రోల్ కాదంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…

ముకేశ్ అంబానీ వల్ల కాలేదు గాని.. అర్జెంటుగా ఆకాష్ అంబానికి న్యూజన్ గోల్డ్ ఇప్పించాలి..

Akash Ambani Bald Look
Akash Ambani Bald Look

Akash Ambani Bald Look: డబ్బుంటే ఏదైనా సాధ్యమే అనుకుంటారు. వాస్తవంలో మాత్రం అది నిజం కాదు. ఎందుకంటే డబ్బుతో కొనలేనివి.. డబ్బుతో సాధ్యం కానివి చాలా ఉంటాయి. డబ్బుతో పరుపులు కొనవచ్చు. కానీ నిద్రను కొనలేం. డబ్బుతో విలాసాలను ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఆనందాన్ని కొనుగోలు చేయడం.. డబ్బుతో మిద్దెలు కట్టుకోవచ్చు. కానీ సుఖాన్ని అందిపుచ్చుకోలేం. కరెన్సీ అనేది అవసరం మాత్రమే.. అదే లైఫ్ అనుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

మనదేశంలో ముకేశ్ అంబానీ ఆగర్భ శ్రీమంతుడు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. తాను తలచుకుంటే ఏదైనా చేయగలడు. ఏమైనా చేయగలడు. ఎక్కడిదాకైనా వెళ్లగలడు. చివరికి అంతరిక్షంలోకి వెళ్లి పిజ్జాలు, బర్గర్లు కూడా తిని.. అవసరమైతే అక్కడ ఒక ఇల్లు కట్టుకొని ఉండగలడు. అంతటి ముకేశ్ అంబానీ కూడా కాలేదు. ఎందుకంటే డబ్బు అనేది ఆయనకు అపరిమితంగా ఉంది. కానీ దానితో కూడా చేయలేని పనులు చాలా ఉన్నాయి.

ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు ఆస్తమా వల్ల విపరీతంగా లావు అయ్యాడు. అప్పట్లో ప్రపంచ స్థాయి వైద్యులతో అతడికి చికిత్స చేయించారు. కొంతవరకు ఫలితం వచ్చింది. బరువు తగ్గాడు. నా జూకుగా కనిపించాడు. ఆ తర్వాత మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. ఈసారి వైద్యులు కూడా చేతులెత్తేశారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే పరిస్థితి. కొడుకు అంత లాగ ఉండడంతో ఆ బాధ ముకేశ్ అంబానీలో ఆ బాధ నిత్యం ఉంటూనే ఉంటుంది. గతంలో తగ్గిన తర్వాత మళ్లీ బరువు పెరిగిన చిన్న కుమారుడు ఇంతవరకు పూర్వ ఆకృతిని సంతరించుకోలేదు. తగ్గే అవకాశం కూడా లేదు. కాకపోతే అతడు విపరీతమైన డబ్బు ఉన్న వాడు కాబట్టి రాధిక మర్చంట్ లాంటి కోడలు వచ్చింది. అటువంటి భారీ శరీరం ఉన్న వ్యక్తి మిడిల్ క్లాస్ లో కనుక పుట్టి ఉంటే ఏం జరిగి ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మేము అంబానీ ద్వితీయ పుత్రుడు అనంత అంబానీ ని బాడీ షేమింగ్ చేయడం లేదు. ప్రస్తావన వచ్చింది కాబట్టి ఎగ్జాంపుల్ చెప్పాం.

ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ రిలయన్స్ వ్యవహారాలలో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటాడు. పైగా అతడికి ముఖేష్ అంబానీ తర్వాత స్థాయి ఉంది. ముంబై ఇండియన్స్ జట్టులో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. అంతటి డబ్బు.. పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ ఆకాష్ అంబానికి బట్టతల ఉంది. మొదట్లో అతడి జుట్టు బ్రహ్మాండంగా ఉండేది. కానీ ఇటీవల కాలంలో జుట్టు ఊడిపోవడం మొదలైంది. చివరికి బట్ట తల వచ్చేసింది. బట్టతల వచ్చినంత మాత్రాన దానిని కవర్ చేసుకోవడానికి ఆకాష్ ప్రయత్నించడం లేదు. జుట్టును మొలిపించుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ పెద్దగా ఉపయోగం లేదని తెలుస్తోంది. అందువల్లే ఊడిపోయే బొచ్చు కోసం అంతగా ప్రయత్నించాల్సిన అవసరం లేదని అతడు కూడా సైలెంట్ అయిపోయాడు. బట్టతలతోనే తిరుగుతున్నాడు.

ఇటీవల అతడు ముంబైలో ఒక ఆలయానికి వెళ్ళాడు. అక్కడ అతడి బట్ట తల చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది. కొంతమంది కొంటె నెటిజన్లు ఆకాష్ అంబానికి సూచనలు చేస్తున్నారు. న్యూజన్ గోల్డ్ రాసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో న్యూజన్ గోల్డ్ పెద్ద సంచలనమే సృష్టించింది. బట్టతల మీద రాసుకుంటే జుట్టు వస్తుందని ప్రకటించింది. జుట్టు ఏమో గాని.. ఆ తైలం కొనుగోలు చేసి చాలామంది చేతి తీట వదిలింది.

పెద్ది మూవీ హిట్ అయితే బుచ్చిబాబు కి ఆ స్టార్ హీరోలతో మూవీ చేసే ఛాన్స్ వస్తుందా..?

Peddi Movie
Peddi Movie

Peddi Movie: ‘ఉప్పెన’ సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు… మొదటి సినిమాతోనే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయిన ఆయన ప్రస్తుతం రామ్ చరణ్ ను హీరోగా పెట్టి చేస్తున్న ‘పెద్ది’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ట్రైలర్ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. దాంతో సినిమా మీద ఆటోమేటిగ్గా బజ్ ఏర్పడింది. ఇక మీదట కూడా ఈ సినిమా మీద హైపు విపరీతంగా క్రియేట్ అవ్వడానికి ప్రమోషన్స్ అయితే భారీ ఎత్తున చేస్తున్నారు. జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విషయంలో మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక బుచ్చిబాబు ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధిస్తే స్టార్ హీరోలతో సినిమాలను చేసే అవకాశాలైతే ఉన్నాయి… ఇక ఇప్పటికే అతనితో సినిమా చేయడానికి షారుఖ్ ఖాన్ సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.

ఇక అతనితో పాటు తమిళ్ స్టార్ హీరో అయిన సూర్య కూడా బుచ్చిబాబు డైరెక్షన్ నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక వీళ్లిద్దరితోపాటు మలయాళ నటుడు మోహన్ లాల్ కూడా బుచ్చిబాబు డైరెక్షన్లో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారట. ఇక మోహన్ లాల్ కి పెద్ది సినిమాకి ముందే ఒక కథనైతే వినిపించారట.

ఆ కథ మోహన్ లాల్ కి బాగా నచ్చడంతో సినిమా చేద్దామని అనుకున్నాడు. కానీ ఈ గ్యాప్ లోనే పెద్ది సినిమా చేసే అవకాశం రావడంతో బుచ్చిబాబు రామ్ చరణ్ ను డైరెక్షన్ చేశాడు. మొత్తానికైతే ఈ సినిమా రిజల్ట్ మీదనే తన తర్వాత సినిమాలు ఆధారపడి ఉన్నాయనేది వాస్తవం…షారుక్ ఖాన్ సైతం బుచ్చిబాబు డైరెక్షన్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

కానీ ఒక సినిమా సక్సెస్ అయితేనే ఆ దర్శకుడికి విపరీతమైన క్రేజ్ వస్తుంది. ఒకవేళ ఫెయిల్యూర్ అయితే మాత్రం దర్శకుడు ఎవరిని పట్టించుకోడు కాబట్టి ఇప్పుడు బుచ్చిబాబు పరిస్థితి అలాగే ఉంది. సక్సెస్ కొడితే చాలామంది హీరోలు అతని కోసం ఎదురు చూస్తారు. ఫెయిల్యూర్ వస్తే మాత్రం మళ్లీ అతని వైపు చూసే హీరోలు కూడా ఉండరనే చెప్పాలి…

అఖిల్ 'లెనిన్' టీజర్ రివ్యూ : ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందే.. అయ్యగారు హిట్ కొట్టబోతున్నారు..

Akhil Lenin Teaser Review
Akhil Lenin Teaser Review

Akhil Lenin Teaser Review: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇన్ని సంవత్సరాలు పూర్తి అయ్యినప్పటికీ కూడా సరైన కమర్షియల్ సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది అక్కినేని అఖిల్ మాత్రమే. భారీ అంచనాల నడుమ ఆయన ఇండస్ట్రీ లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే స్టార్ హీరో అయిపోతాడని అప్పట్లో అందరూ అనుకున్నారు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయనకు చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు. ఆయన గత చిత్రం ‘ఏజెంట్’ కూడా భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది . ఈ చిత్రం తర్వాత ఎలా సూపర్ హిట్ కొట్టాలనే కసితో ఆయన చేసిన చిత్రం ‘లెనిన్’. జూన్ 24 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని కాసేపటి క్రితమే విడుదల చేయగా, దీనికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ టీజర్ లో అక్కినేని అఖిల్ , భాగ్యశ్రీ భొర్సే మధ్య ఉన్న కెమిస్ట్రీ అదిరిపోయింది అనే చెప్పాలి. ఆరంభం లో ఎన్టీఆర్ డైలాగ్ ని అనుకరిస్తూ హీరోయిన్ భాగ్య శ్రీ చేసిన స్టేజి షో కి సంబంధించిన షాట్ చూసేందుకు చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత బైక్ మీద వెళ్తూ వీళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణ కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా అఖిల్ యాస లో సహజత్వం ఉండడం గమనించాల్సిన విషయం. ఓవరాల్ గా అఖిల్ వయస్సు కి తగ్గ పాత్ర దొరికిందని , ఈ చిత్రం తో ఆయన కచ్చితంగా భారీ హిట్ కొట్టబోతున్నాడని అర్థం అవుతుంది. లుక్స్ కూడా బాగా ఉండడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక చివర్లో ‘నేను తప్పిపోలేదు అబ్బా.. మీ అందరినీ వెతుక్కుంటూ వచ్చాను’ అని చెప్పిన డైలాగ్ అభిమానులను ఉద్దేశించి చేసినట్టుగా అనిపించింది.

ఎందుకంటే ‘ఏజెంట్’ చిత్రం 2023 వ సంవత్సరం లో విడుదలైంది. దాదాపుగా మూడు సంవత్సరాలపాటు ఆయన వెండితెర కి దూరం అవ్వడం తో ఈ డైలాగ్ ని పెట్టినట్టుగా అనిపిస్తోంది. ఓవరాల్ గా టీజర్ అదిరిపోయింది , అక్కినేని అఖిల్ ఆలస్యంగా హిట్ కొట్టబోతున్నప్పటికీ కూడా కుంభస్థలాన్ని బద్దలు కొట్టే రేంజ్ లో కొట్టబోతున్నాడని, అక్కినేని నాగార్జున కూడా చాలా గట్టి నమ్మకం తో ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పడం తో , అభిమానులు కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారని అంటున్నారు ట్రేడ్ ఫ్యాన్స్. ఇకపోతే సోషల్ మీడియా ని ఊపేస్తున్న ఈ టీజర్ ని మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియజేయండి.

 

 

ఆ మూడు సినిమాల స్టోరీ లను కాపీ చేసి పెద్ది మూవీ చేశారా..?

Ram Charan Peddi Collections
Ram Charan Peddi Collections

Ram Charan Peddi Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న వారిలో రామ్ చరణ్ ముందు స్థానంలో ఉన్నాడు. రాజమౌళి తో చేసిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియాలో సైతం తన సత్తా చాటుకున్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ కి ఎక్కువ క్రేజ్ అయితే దక్కింది. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా లో ప్రధానంగా మూడు స్పోర్ట్స్ లను హైలైట్ చేస్తూ సినిమానైతే తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరో క్రికెట్ ప్లేయర్ గా, కుస్తీ ఫైటర్ గా, రన్నర్ గా కూడా కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని ట్రైలర్ లో ఎస్టాబ్లిష్ చేశారు.

ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ ఇంతకుముందు ఇలాంటి పాత్రను ఎప్పుడూ పోషించలేదు. కాబట్టి అతనికి ఆ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని కూడా చెబుతున్నారు. అయితే ఈ సినిమాని ప్రధానంగా మూడు కథలను కాపీ చేసి తెరకెక్కించారట. ఆ కథలు ఏంటి అంటే అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన ‘లగాన్’ సినిమాలోని క్రికెట్ పాయింట్ ను తీసుకున్నారు.

అలాగే సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన ‘సుల్తాన్’ సినిమాలో కుస్తీ ఫైట్ ని ఈ సినిమాలో మెయిన్ పాయింట్ గా రాసుకున్నారు. ఇక దాంతోపాటుగా ‘బాగ్ మిల్కా బాగ్’ లోని రన్నింగ్ రేస్ ని సైతం ఈ సినిమాలో భాగం చేస్తూ చివరలో దానికి ఒక క్లారిటి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ మూడు కథలను బేస్ చేసుకొని బుచ్చిబాబు ఈ కథనైతే రెడీ చేసినట్టుగా తెలుస్తుంది.

మరి రామ్ చరణ్ ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా? లేదంటే కాపీ సినిమాలతో వస్తుంది కాబట్టి ఈ సినిమా భారీ డీలా పడిపోతుందా అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో చర్చనీయాంశంగా మారింది…గత సంవత్సరం రామ్ చరణ్ చేసిన గేమ్ చేంజర్ ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన కొంతవరకు డీలా పడ్డాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది…

మీకు ఇదేం పోయేకాలం రా .. చీర్ లీడర్స్ తో ఆ చిల్లర పనులేంటి..

IPL Cheerleaders Harassment
IPL Cheerleaders Harassment

IPL Cheerleaders Harassment: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఐపీఎల్ అనేది కమర్షియల్ గేమ్. దేన్ని దాని తీరుగానే చూడాలి. అలా కాకుండా మ్యాచ్ చూస్తున్నప్పుడు వెధవ వేషాలు వేస్తే పోలీసులు తాట తీస్తారు. ఈ అనుభవం వీళ్లకు 70mm స్క్రీన్ లో అనుభవంలోకి వచ్చింది. వీరి వ్యవహారానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

ఐపీఎల్ లో భాగంగా పంజాబ్, లక్నో జట్ల మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అయ్యర్ సేన గెలుపును అందుకుంది. అయితే మ్యాచ్ జరుగుతున్న సేపు కొంతమంది ఆకతాయి కుర్రాళ్ళు దారుణంగా ప్రవర్తించారు. ఇష్టానుసారంగా వ్యవహరించారు. మైదానంలో బుద్ధిగా మ్యాచ్ చూడకుండా.. వెకిలి వేషాలు వేశారు. పంజాబ్ జట్టుకు సపోర్ట్ గా డాన్సులు వేస్తున్న చీర్ లీడర్స్ మీద దారుణంగా ప్రవర్తించారు. దీంతో మహిళా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆకతాయిల తిక్క కుదిరించారు.

చీర్ లీడర్స్ డ్యాన్స్ చేస్తుండగా కొంతమంది ఆకతాయిల వారిమీదికి పేపర్లను విసిరేశారు. అందులో తమ చరవాణి ఫోన్ నెంబర్ పొందుపరిచారు.. మీరు కూడా అలానే చేయాలని వారి వైపు కాగితాలను విసిరేశారు. ఆకతాయిల ప్రవర్తన చూసి విసిగిపోయిన చీర్ లీడర్స్ ఇబ్బంది పడ్డారు. వెంటనే ఈ విషయాన్ని అక్కడే ఉన్న పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. మహిళా పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. ఆ ఆకతాయిల తిక్క కుదిరించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తోంది.

“ఆటను చూసేందుకు వెళ్ళినప్పుడు.. ప్లేయర్ల పోరాటాన్ని మాత్రమే వీక్షించాలి. వారు ఆడుతున్నంత సేపు అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించాలి. అభిమాన ప్లేయర్లు పరుగులు తీస్తుంటే సపోర్ట్ చేయాలి. అలాకాకుండా చిల్లర వ్యవహారాలకు పాల్పడితే పరిణామాలు ఇదిగో ఇలానే ఉంటాయని” సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రాజమౌళి తో సినిమా చేసి లాస్ అయిన ప్రొడ్యూసర్... కట్ చేస్తే ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయాడుగా...

SS Rajamouli
SS Rajamouli

SS Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన రాజమౌళి బాహుబలితో పాన్ ఇండియా లో తన సత్తా చాటుకున్నాడు. ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న ఆయన తను చేయబోయే సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో మొదటి సక్సెస్ ని అందుకున్న ఆయన ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో వరుసగా 12 విజయాలను తన ఖాతాలో వేసుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక కెరియర్ స్టార్టింగ్ లో రాజమౌళి డైరెక్షన్ చేసిన ‘సై’ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఆవుల గిరి ఆ సినిమాతో నష్టాన్ని చవిచూశాడని తనే ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ముఖ్యంగా సై సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న కూడా కమర్షియల్ గా ఆ సినిమాకి రావాల్సినంత కలెక్షన్స్ రాలేదనే చెప్పాలి. దానివల్ల ఆయన కొంతవరకు డబ్బులను కూడా కోల్పోయాననే చెప్పాడు. ఇక ఆ తర్వాత క్రమంలో ఆయన ఒకటి రెండు సినిమాలను ప్రొడ్యూస్ చేసి సినిమా ఇండస్ట్రీ తనకు అచ్చి రాదనే ఉద్దేశ్యంతో సినిమా ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోయాడు.

ప్రస్తుతం ఆయన సినిమాలను ప్రొడ్యూస్ చేయకుండా తన పని తను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. రాజమౌళి ఎన్టీఆర్ కెరియర్ లో చేసిన సినిమాలన్నీ సక్సెస్ ఫుల్ గా నిలిచినప్పటికి ప్రొడ్యూసర్లకు కూడా విపరీతంగా లాభాలను తీసుకొచ్చి పెట్టాయి.

సై సినిమా విషయంలో మాత్రమే ఆ లెక్క తప్పింది అంటూ పలువురు సినిమా మేధావులు సైతం ఆ మూవీ టాపిక్ వచ్చిన ప్రతిసారి ఈ విషయాన్ని చాలా ప్రస్ఫుటంగా చెబుతూ ఉంటారు. ఇక ఏది ఏమైనా కూడా జక్కన్న ఏదైనా సినిమా చేస్తే ఆ సినిమా మీద పూర్తి ఫోకస్ ని పెట్టి వర్క్ చేస్తుంటాడు.

అలాగే ప్రేక్షకుల్లో ఆ సినిమా తాలూకు ఇంటెన్షన్ క్రియేట్ చేయడానికి విపరీతమైన ప్రమోషన్స్ కూడా చేపడుతూ ఉంటాడు. ఇక ఈ క్రమంలోనే ఆయన చేసిన సినిమాల పట్ల ప్రేక్షకుల్లో విశేషమైన బజ్ క్రియేట్ అవుతుంటుంది…ఇక ప్రస్తుతం వారణాసి తో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు…