Home Blog Page 231

మమతక్కకు ఇక మంగళమే.. తృణమూల్‌ మనుగడ ప్రశ్నార్థకమే?

Mamata Banerjee
Mamata Banerjee

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌ను 15 ఏళ్లు ఏకచత్రాధిపత్యంగా పాలించారు మమతా బెనర్జీ. అక్కడి కమ్యూనిస్టు పాలకుల రికార్డును చెరిపేయాలని ప్రయత్నించారు. కానీ అమె అనుసరించిన విధానాలు, భారత వ్యతిరేక ధోరణి, వసలవాదుల అనుకూల వైఖరి, ఇటీవల జరిగిన ఎన్నికల్లో మమతతోపాటు, తృణమూల్‌ కాంగ్రెస్‌ను బెంగాలీలు చిత్తుగా ఓడించారు. అధికారం కోల్పోవడంతో పార్టీలో ఇప్పుడు లుకలుకలు మొదలయ్యాయి. అధినేత్రి అదేశాలను కూడా గెలిచిన ఎమ్మెల్యేలు లెక్క చేయడం లేదు. దీంతో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఎన్నికలు ముగిసిన వెంటనే పార్టీలో ఉత్పన్నమైన అసంతృప్తి, నాయకుల వలసలు, సంస్థాగత బలహీనతలు మమతా ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారాయి.

అంతర్గత అసంతృప్తి, ఎమ్మెల్యేల తిరుగుబాటు..
ఇటీవలి ఎన్నికల తర్వాత టీఎంసీ ఆహ్వానించిన ధర్నా కార్యక్రమం పార్టీ బలహీనతను బహిర్గతం చేసింది. మొత్తం ఎమ్మెల్యేలలో కేవలం 40 శాతం మంది మాత్రమే పాల్గొనడం ద్వారా పార్టీలోని వ్యతిరేకత స్పష్టమైంది. తర్వాతి ఎమ్మెల్యేల సమావేశాల్లో హాజరు ఇంకా తగ్గి, 25వ తేదీ నాటికి 40 మందికిపైగా గైర్హాజరు అయ్యారు. హాజరైన ఎమ్మెల్యేలు పార్టీ నిర్వహణను తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా అభిషేక్‌ బెనర్జీ నాయకత్వ సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఫాల్తా నియోజకవర్గం (అభిషేక్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని) అభ్యర్థి జహంగీర్‌ ఖాన్‌ విషయంలో తీసుకున్న నిర్ణయం కూడా తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ఇది పార్టీలో కుటుంబ ప్రాధాన్యతలపై ఉన్న వ్యతిరేకతను ప్రతిబింబిస్తుంది.

స్థానిక సంస్థల్లోనూ బలహీనం..
పార్టీ సంక్షోభం అసెంబ్లీ స్థాయిలో మాత్రమే కాకుండా స్థానిక సంస్థల వరకు వ్యాపించింది. ఎన్నికలు ముగిసిన వెంటనే ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడగా, మున్సిపల్‌ కౌన్సిలర్లు కూడా బయటకు వస్తున్నారు. ఈ వలసలు టీఎంసీ గ్రాస్‌రూట్‌ స్థాయి బలాన్ని బలహీనపరుస్తున్నాయి. ఆసక్తికరంగా, బీజేపీ ఈ రకమైన టీఎంసీ నాయకులను చేర్చుకోవడానికి ఇష్టపడడం లేదని సంకేతాలు వస్తున్నాయి. దీని వల్ల బయటకు వచ్చిన నాయకులు రాజకీయంగా ఒంటరిగా మారే∙ప్రమాదం ఉంది.

సంస్థాగత సంక్షోభం..
టీఎంసీ ప్రధాన కార్యాలయం అద్దె భవనంలో ఉండటం, యజమాని ఖాళీ చేయమని నోటీసు ఇవ్వడం పార్టీ స్థితిని సంకేతిస్తోంది. సమావేశాలు నిర్వహించడానికి కూడా తగిన మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడే మరో కీలక పరిణామం: భారాసాత్‌ ఎంపీ భారాసాత్‌ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం. ఇలాంటి రాజీనామాలు పార్టీలోని ఉన్నత స్థాయి అసంతృప్తిని తెలియజేస్తాయి. మమత ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో నిస్సహాయతకు గురవుతున్నారని అంచనా వేస్తున్నారు.

భవిష్యత్‌ ప్రశ్నార్థకం..
బెంగాల్‌లో కమ్యూనిస్టు శక్తులు ఇప్పటికీ కొంత పట్టు కలిగి ఉన్నాయి. అయితే రాబోయే ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయో చెప్పడం కష్టం. టీఎంసీలోని ప్రస్తుత సంక్షోభం కొనసాగితే, మమతా నాయకత్వం ఐదేళ్లు కూడా మనుగడ సాగించడం కష్టమే అనిపిస్తోంది. మమతా బెనర్జీ రాజకీయ ప్రయాణం ఎప్పుడూ సవాళ్లతో నిండి ఉంది. కానీ ఈసారి సవాళ్లు పార్టీ లోపలి నుంచి వస్తున్నాయి. అంతర్గత ఐక్యతను పునరుద్ధరించకపోతే, దశాబ్దాల పాలన తర్వాత తృణమూల్‌ కాంగ్రెస్‌ వేగంగా క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. తక్కువ పోటీ.. అధిక వేతనం..

Indian Army SSC Tech Recruitment 2026
Indian Army SSC Tech Recruitment 2026

Jobs: ప్రభుత్వ ఉద్యోగం అనగానే యువత ఎక్కువగా సక్తి చూపుతుంది. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమతుంటారు. అయితే పోటీ కారణంగా చాలా మంది ఉద్యోగాలు సాధించడం లేదు. యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్ పరీక్షల్లోని తీవ్ర పోటీ చాలా మందిని నిరాశపరుస్తుంది. అయితే, తక్కువ మంది అవగాహన ఉన్న కొన్ని కేంద్ర సంస్థల ఉద్యోగాలు అత్యధిక వేతనం, మంచి ప్రమోషన్లు, స్థిరత్వం బెటర్ వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ను అందిస్తాయి. సరైన ప్లానింగ్‌తో సన్నద్ధమైతే ఇవి సులభంగా సాధించవచ్చు.

ఆర్‌బీఐ గ్రేడ్-బీ ఆఫీసర్‌..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)గ్రేడ్-బీ పరీక్ష దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది. అప్లికేషన్ల సంఖ్య తక్కువగా ఉంటుంది కానీ సిలబస్ కఠినంగా ఉంటుంది. డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. ప్రారంభ వేతనం రూ.లక్ష నుంచి రూ.1.15 లక్షల వరకు ఉంటుంది. త్వరగా పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్, ఎకానమిక్స్ అంశాలపై ఆసక్తి ఉన్నవారికి ఇది ఉత్తమ ఎంపిక.

నాబార్డ్‌ గ్రేడ్-ఏ, బీ అధికారులు..
రూరల్ డెవలప్‌మెంట్, వ్యవసాయ రంగంపై దృష్టి సారించే నాబార్డ్‌ ఉద్యోగాలు తక్కువ పోటీ ఉంటాయి. గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ, మైక్రోఫైనాన్స్ వంటి సిలబస్ ఉంటుంది. ప్రారంభ వేతనం రూ90 వేలపైనే ఉంటుంది. అత్యుత్తమ వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పని చేసే అవకాశం ఉంటుంది.

సెబీ గ్రేడ్-ఏ ఆఫీసర్‌…
సెక్యూరిటీలు అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈబీఐ) గ్రేడ్-ఎ ఉద్యోగం గురించి చాలా మందికి తెలియదు. క్యాపిటల్ మార్కెట్స్, లా, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి స్పెషలైజ్డ్ సిలబస్ ఉంటుంది. సీనియర్ అభ్యర్థులు తక్కువగా ఉండటం వల్ల మంచి అవకాశాలు ఉన్నాయి. వేతనం సుమారు రూ.1.1 లక్షలు. టాప్ రెగ్యులేటరీ బాడీలో పని చేసే అవకాశం ఇది.

ఐఆర్‌డీఏ, పీఎఫ్‌ఆర్డీఏ అసిస్టెంట్ మేనేజర్..
ఐఆర్‌డీఏ(ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఇన్సూరెన్స్ రంగంపై ఆసక్తి ఉన్నవారికి ఉత్తమం. ఎక్స్‌లెంట్ కెరీర్ గ్రోత్‌తో నెలకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది.ఇక పీఎఫ్‌ఆర్డీఏ(పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ) అత్యధిక వేతనాలు ఉన్న ఉద్యోగాల్లో ఒకటి. పెన్షన్ సెక్టార్‌లో మంచి అవకాశాలు ఉన్నాయి. వేతనం రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది.

అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(ఏఏవో)..
పబ్లిక్ సెక్టార్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఏఏవో పోస్టులు తక్కువ ఒత్తిడి, మంచి వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌తో ఉంటాయి. వేతనం రూ70 వేల నుంచి రూ.90 వేల వరకు ఉంటుంది. ఇన్సూరెన్స్ రంగం గురించి తక్కువ మందికి ఆసక్తి ఉండటం వల్ల పోటీ కూడా తక్కువ.

ఎఫ్‌సీఐ మేనేజర్, అసిస్టెంట్ గ్రేడ్-3
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఉద్యోగాలు అప్పుడప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి. స్టేబుల్ మరియు పవర్‌ఫుల్ ఆర్గనైజేషన్ కావడం వల్ల దీర్ఘకాలిక స్థిరత్వం కావాలనుకునేవారికి బాగుంటుంది.స్టా టిస్టిక్స్ అండ్‌ డేటా సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారికి

ఎస్‌ఎస్‌సీ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్..
డిగ్రీలో స్టాటిస్టిక్స్ సబ్జెక్టు తప్పనిసరి. తక్కువ కట్‌ఆఫ్‌లు, తక్కువ అప్లికేషన్లు. ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ గ్రూప్-A సెంట్రల్ సర్వీస్. కనీస వేతనం రూ.56 వేల నుంచి మొదలవుతుంది.

రైల్వే పీఎస్‌యూలు..
ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారికి ఉత్తమం. అధిక వేతనాలు, తక్కువ పోటీ.

ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ ఏఎస్‌వో, జేఈ, లీగర్‌ అసిస్టెంట్‌..
ఈ పోస్టులు కూడా అరుదుగా నోటిఫికేషన్‌ వస్తాయి. ఢిల్లీలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. భారీ వేతనం, అద్భుతమైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్.

ఇంటెలిజెన్స్ బ్యూరో..
కఠినమైన ఇంటర్వ్యూ ఉన్నప్పటికీ, రెస్పెక్టెడ్ పోస్ట్. వేతనం రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు ఉంటుంది.

ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి పోటీ పడటం కంటే, మీ ఆసక్తి, బ్యాక్‌గ్రౌండ్‌కు సరిపోయే ఈ తక్కువ పోటీ ఉద్యోగాల వైపు దృష్టి మళ్లించండి. సరైన సమాచారం, నిరంతర ప్రయత్నం, స్మార్ట్ ప్రిపరేషన్‌తో మీ లక్ష్యం సాధించడం సాధ్యమే. ఏ ఉద్యోగం మీకు సరిపోతుందో నిర్ణయించుకోవడానికి అధికారిక వెబ్‌సైట్లు, నోటిఫికేషన్లు రెగ్యులర్‌గా చెక్ చేయండి. మీ కెరీర్‌ను స్మార్ట్‌గా షేప్ చేసుకోండి!

రజినీకాంత్ నుంచి సూర్య వరకు ఎవరు వచ్చిన మన హీరోల రికార్డులను బ్రేక్ చేయడం కష్టమేనా..?

Tamil Cinema vs Telugu Cinema
Tamil Cinema vs Telugu Cinema

Tamil Cinema vs Telugu Cinema: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు దర్శకులు ఒకప్పుడు ఘన విజయాలను సాధిస్తుండేవారు. అక్కడి హీరోలు, దర్శకులు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ పొజిషన్ లో ఉండేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి తెలుగు సినిమా ఇండస్ట్రీ సౌత్ సినిమా ఇండస్ట్రీని పక్కకు నెట్టేసి ముందుకు దూసుకెళ్లడమే కాకుండా పాన్ ఇండియా ఇండస్ట్రీని సైతం పక్కన పెట్టేసింది. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ పొజిషన్లో కొనసాగుతూ ఉండటం విశేషం…ఇక తమిళులు మాత్రం దీనిని ఒప్పుకోవడం లేదు. ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించే దిశగా సినిమాలు చేయాలని అక్కడ స్టార్ హీరోలు విపరీతంగా ఆరాటపడుతున్నారు.

కానీ రజినీకాంత్, కమల్ హాసన్ తో పాటు విజయ్, సూర్య, విక్రమ్ లాంటి హీరోలు ఎన్ని సినిమాలు చేసినా కూడా మన తెలుగు హీరోల స్టార్ డమ్ ను మ్యాచ్ చేయలేరు. అలాగే మన హీరోల కలెక్షన్స్ ను కొల్లగొట్టలేరు అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.

ఇక తమిళ దర్శకులు సైతం అక్కడున్న హీరోలతో సినిమాలు చేస్తే వరకు కావడం లేదనే ఉద్దేశంతోనే బాలీవుడ్ వెళ్లి అక్కడ సినిమాలు చేస్తున్నారు. లేదంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ స్టార్ హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ లను సాధించాలని చూస్తున్నారు…ప్రస్తుతం తమిళ్ సినిమా ఇండస్ట్రీలోని హీరోల హవా ముగిసిందనే చెప్పాలి.

ఒకప్పుడు మన స్టార్ హీరోలతో పోటీ పడినప్పటికి ఇప్పుడు పోటీపడే స్థాయిలో వాళ్లయితే లేరు. ఇక ఇలాంటి క్రమంలోనే రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమాలు చేస్తే తప్ప ఇండస్ట్రీలో వీళ్ళకంటూ ఒక స్ట్రైచర్ అయితే ఏర్పడదు. కాబట్టి ఏది ఏమైనా కూడా సౌత్ సినిమా ఇండస్ట్రీలో తమ సత్తా చాటుకోవాలంటే మాత్రం మరోసారి పెను సంచనాలను క్రియేట్ చేయాల్సిన అవసరమైతే ఉంది…చూడాలి మరి ఇక మీదట వాళ్ళు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనేది…

మైగ్రేన్ కు తమలపాకుతో చెక్..!

Betel Leaves For Migraine Relief
Betel Leaves For Migraine Relief

Betel Leaves For Migraine Relief: భారతీయ సంప్రదాయ వైద్యంలో తమలపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. దీనిని పూజలకే కాకుండా ఆరోగ్య పరిరక్షణలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యల సమయంలో తమలపాకు సహజ ఔషధంలా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే సహజ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, నొప్పి తగ్గించే గుణాలు తలకు ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. అయితే తమలపాకును ఎలా తీసుకోవాలి?

తమలపాకులో యూజినాల్ (Eugenol), టానిన్లు, ఫ్లావనాయిడ్లు వంటి సహజ రసాయనాలు ఉంటాయి. ఇవి నరాల ఒత్తిడిని తగ్గించి.. తలనొప్పి తీవ్రతను తగ్గించడంలో సహకరిస్తాయి. ముఖ్యంగా ఒత్తిడి, అలసట, చలి లేదా సైనస్ కారణంగా వచ్చే తలనొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు తమలపాకు ఉపయోగకరంగా ఉంటుందని చెబుతారు. కొన్ని సందర్భాల్లో ఇది తలలో రక్తప్రసరణను మెరుగుపరచి మైగ్రేన్ దాడి తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది.

తలనొప్పి వచ్చినప్పుడు సంప్రదాయంగా తమలపాకును కొద్దిగా వేడి చేసి నుదుటిపై ఉంచేవారు. ఇలా చేయడం వల్ల ఆకు నుంచి విడుదలయ్యే సహజ తైలాలు చర్మం ద్వారా శరీరంలోకి చేరి చల్లదనాన్ని, ఉపశమనాన్ని కలిగిస్తాయని భావిస్తారు. కొంతమంది తమలపాకును నూనెలో వేడి చేసి పేస్ట్‌లా తయారు చేసి కణతలపై రాసుకుంటారు. ఇది తల బరువుగా ఉండటం, ఒత్తిడి వల్ల వచ్చే నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

మైగ్రేన్ సమస్యలో తమలపాకుతో చేసే ఆవిరి చికిత్స కూడా ఉపయోగపడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. నీటిలో తమలపాకులు వేసి మరిగించి వచ్చే ఆవిరిని మెల్లగా పీల్చడం వల్ల ముక్కు బ్లాక్ తగ్గి తలలో ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా సైనస్ సంబంధిత మైగ్రేన్ ఉన్నవారికి ఇది కొంత ఉపశమనం ఇవ్వవచ్చు.

తమలపాకు జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. చాలామందికి అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం కారణంగా కూడా తలనొప్పి వస్తుంది. భోజనం తర్వాత చిన్న మోతాదులో తమలపాకును నమలడం వల్ల జీర్ణక్రియ చురుకుగా మారి పరోక్షంగా తలనొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే పూర్వం భోజనం అనంతరం తాంబూలం తీసుకునే అలవాటు ఉండేది.

అయితే ప్రతి తలనొప్పికీ తమలపాకు శాశ్వత పరిష్కారం కాదు. తీవ్రమైన మైగ్రేన్, తరచూ వాంతులు, కళ్ల ముందు వెలుగులు కనిపించడం, అధిక రక్తపోటు వంటి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. అలాగే తమలపాకుతో పాటు పొగాకు, అధిక సున్నం వాడటం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి సహజంగా, పరిమితంగా మాత్రమే ఉపయోగించాలి.

ఆధునిక వైద్య పరిశోధనలు కూడా తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయని సూచిస్తున్నాయి. అయితే మైగ్రేన్‌కు ఇది పూర్తి చికిత్సగా నిర్ధారించబడలేదు. అయినప్పటికీ సంప్రదాయ వైద్యంలో శతాబ్దాలుగా ఉపయోగిస్తున్న ఈ సహజ మూలిక కొంతమందికి ఉపశమనం ఇవ్వగలదని నిపుణులు చెబుతున్నారు.

లైకులు, కామెంట్ల కోసం కక్కుర్తి.. ఓ ఆర్ ఆర్ మీద 200 కిలోమీటర్ల స్పీడ్..ఈ అన్నకు తెలంగాణ పోలీసుల ఘన సన్మానం

200 KMPH Car Drive Hyderabad
200 KMPH Car Drive Hyderabad

200 KMPH Car Drive Hyderabad: అది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు.. మనోడు కొత్త కారు కొన్నాడు.. ఏకంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో నడిపాడు. అదే కాదు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. లైకుల కోసం.. కామెంట్ల కోసం కక్కుర్తి పడ్డాడు. చివరికి ఏం జరగాలో అది జరిగింది.

హైదరాబాద్ నగరానికి చెందిన యశ్వంత్ రెడ్డి అనే వ్యక్తి వోక్స్ వ్యాగన్ కంపెనీకి సంబంధించిన కార్ కొనుగోలు చేశాడు. దానిని అవుటర్ రింగ్ రోడ్డు మీదుగా డ్రైవ్ చేశాడు. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో నడిపాడు. నడపడం మాత్రమే కాదు దానిని వీడియో రికార్డ్ చేసి.. దానిని కాస్త సోషల్ మీడియాలో వదిలాడు.. కామెంట్లు.. లైకులు వస్తాయని భావించి అతడు ఆ పని చేశాడు. కానీ తెలంగాణ పోలీసులు అతని మీద నిఘా పెట్టారు. సోషల్ మీడియాలో అతని వ్యవహారం చూసి… ఘన సన్మానం చేశారు.

ఔటర్ రింగ్ రోడ్డు మీద 200 కిలోమీటర్ల వేగంతో వాహనాలను నడపడానికి అవకాశం లేదు. అతడు దూకుడుగా కారు నడపడంతో గుర్తించి అరెస్ట్ చేశారు.. అంతేకాదు ఔటర్ రింగ్ రోడ్డు మీద వేగంతో ఎవరైనా వెళ్తే ఇదే పనిష్మెంట్ ఇస్తామని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు.. ఔటర్ రింగ్ రోడ్డు మీద ఇటీవల కాలంలో ప్రమాదాల పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు గట్టిగా దృష్టి పెట్టారు.. అంతేకాదు మితిమీరిన వేగంతో వెళ్లే వారిని స్పీడ్ గన్స్ సహాయంతో పట్టుకుంటున్నారు. ఆ తర్వాత వారికి తమదైన శైలిలో పనిష్మెంట్ ఇస్తున్నారు. యశ్వంత్ రెడ్డి, కొత్త కారు కొనుగోలు చేసిన తర్వాత.. మితిమీరిన వేగంతో వెళ్లడాన్ని తెలంగాణ పోలీసులు తీవ్రంగా పరిగణించారు.

ఔటర్ రింగ్ రోడ్డు మీద అత్యంత బిజీగా ఉండే నార్సింగి పుప్పాలగూడ మధ్యలో అతడు విపరీతమైన వేగంతో వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అందువల్లే అతడిని పట్టుకొని పనిష్మెంట్ ఇచ్చారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసి ఎవరైనా ఈ స్థాయిలో వేగంతో వెళితే తమ పనిష్మెంట్ ఇలానే ఉంటుందని తెలంగాణ పోలీసులు చేతుల్లో చూపించారు.. పాపం యశ్వంత్ రెడ్డి.. సోషల్ మీడియాలో లైకుల, కామెంట్ల పిచ్చి వల్ల చివరికి పోలీస్ స్టేషన్ పాలు కావాల్సి వచ్చింది.

మీడియాకు లీకులు.. నెగిటివ్ స్టోరీలు.. కాంగ్రెస్ లో ఎవరిని ఎవరు టార్గెట్ చేస్తున్నారు..

Congress Internal Politics Leaks
Congress Internal Politics Leaks

Congress Internal Politics Leaks: ఇది కొత్తేమీ కాదు. కాంగ్రెస్ పార్టీలో అనాదిగా వస్తున్న సంప్రదాయమే. అందరికీ తెలిసినట్టుగానే ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉంటుంది. ఒకరి పొడ ఒకరికి గిట్టదు. ఒకరు ఎదిగితే ఇంకొకరు తట్టుకోలేరు. స్థూలంగా చెప్పాలంటే పరమపద సోపానం అనేది కాంగ్రెస్ పార్టీలో అణువణువు కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొత్తగా మారింది లేదు. కొత్తగా ఆ పార్టీలో అలవడిన క్రమశిక్షణ కూడా లేదు.

ఇటీవల పీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మీద బిగ్ టివి ఛానల్ లో వ్యతిరేక కథనాలు ప్రసారమయ్యాయి. ఈ ఛానల్ ముఖ్యమంత్రి కి అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తులదని తేలింది. కాంగ్రెస్ పార్టీకి బిగ్ టివి మొదటినుంచి కూడా సపోర్ట్ చేసుకుంటూ వస్తోంది. ఒక్క నెగిటివ్ స్టోరీ కూడా అందులో పబ్లిష్ కాలేదు. పబ్లిష్ అయ్యే అవకాశం కూడా లేదు. అయితే ఉన్నట్టుండి ఆ ఛానల్ లో మహేష్ కుమార్ గౌడ్ మీద నెగిటివ్ స్టోరీలు టెలికాస్ట్ కావడం నిజంగానే సంచలనం కలిగించింది.

మహేష్ కుమార్ గౌడ్ వ్యవహార శైలి మీద బిగ్ టీవీ అలాంటి స్టోరీలు టెలికాస్ట్ చేయడం నిజంగానే ఒక రకమైన దిగ్భ్రాంతిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కలిగించింది. అసలు మహేష్ కుమార్ గౌడ్ కు.. బిగ్ టి వి యాజమాన్యానికి ఎక్కడ తేడా వచ్చిందో అర్థం కావడం లేదు.. తెర వెనుక ఎలాంటి వివాదాలున్నా సరే.. తెర ముందు ఇలా బిగ్ టీవీ చేస్తుందని ఎవరూ అంచనా వేయలేదు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ బిగ్ టివి యాజమాన్యానికి పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇది ఎక్కడ దాకా వెళ్తుంది.. ఎంత దాకా దారి తీస్తుందనేది చూడాల్సి ఉంది.

ఆమధ్య భట్టి విక్రమార్క మీద ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకులో బొగ్గు గనుల కేటాయింపు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై విక్రమార్క తెర ముందుకు వచ్చారు. ఆయన కూడా తనదైన స్టైల్ లో రాధాకృష్ణ మీద విమర్శలు చేశారు. దీనికంటే ముందు ఎన్టీవీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఒక కలెక్టర్ మధ్య సంబంధం ఉన్నట్టు న్యూస్ టెలికాస్ట్ అయింది. దాని మీద ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రస్థాయిలో మండిపడింది..

కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఆ ఛానల్ ఆ స్థాయిలో నెగిటివ్ స్టోరీ పబ్లిష్ చేయడానికి బొగ్గు గనుల కేటాయింపు ప్రధాన కారణమని ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ సరికొత్త బాంబు పేల్చారు.. ఎన్ టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి అల్లుడు.. భట్టి విక్రమార్క కలిసి మైనింగ్ వ్యవహారం చేస్తున్నారని.. దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుపడుతున్నారని.. అందువల్లే ఆయన మీద ఎన్టీవీలో స్టోరీ పబ్లిష్ చేసినట్టు రాధాకృష్ణ చెప్పుకొచ్చారు.

వాస్తవానికి మీడియా వాస్తవాలను మాత్రమే ప్రసారం చేస్తే ఇంత చర్చ ఉండేది కాదు. మీడియా అనేది రాజకీయ పార్టీకి తొత్తుగా మారిపోయిన తర్వాత.. కేవలం రివేంజ్ తీర్చుకునే వ్యవస్థ గానే అది రూపాంతరం చెందింది. గతంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీడియా కాస్త హద్దుల్లో ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియా వ్యక్తిగత దాడులకు మాత్రమే ఉపకరించే వ్యవస్థగా దిగజారిపోయింది.

కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద వ్యక్తుల చేతుల్లో పరోక్షంగా కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి. అవి ఇష్టానుసారంగా కథనాలను ప్రసారం చేస్తున్నాయి. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ మరింత దారుణంగా అభాస పాలవుతోంది. ఫలితంగా పదేళ్లపాటు అధికారం కోసం ఎదురుచూసిన ఆ పార్టీ.. ఇప్పుడు ఉన్న అధికారాన్ని నిలబెట్టుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఒకరికి తెలియకుండా మరొకరు మీడియాకు లీకులు ఇచ్చుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ పరువు బజారున పడుతోందని.. అపార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంతటి దుస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక లాభదాయకమైన అంశం చోటు చేసుకుంటున్నది. అదేంటంటే క్షేత్రస్థాయిలో భారత రాష్ట్ర సమితి బలంగా లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కాస్తలో కాస్త బెటర్ పొజిషన్ కనిపిస్తోంది. ఒకవేళ భారత రాష్ట్ర సమితి గనుక బలంగా ఉండి ఉంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేరే విధంగా ఉండేది. ఇప్పటికైనా ఆ నాయకులు మారాలని.. సమిష్టిగా పార్టీ విజయం కోసం కృషి చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు.

రెడీ పవన్ కళ్యాణ్.. దమ్ముంటే అరెస్ట్ చేయండి.. తొడగొట్టిన ప్రొఫెసర్ నాగేశ్వర్

Pawan Kalyan Vs Professor Nageshwar
Pawan Kalyan Vs Professor Nageshwar

Pawan Kalyan Vs Professor Nageshwar: అసలే రోహిణి కార్తె. సూర్యుడు రెచ్చిపోతున్నాడు. ఇటువంటి తరుణంలో మండే ఎండకు తగ్గట్టుగానే.. ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఆ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు మీడియాకు కావలసినంత మసాలా అందిస్తున్నాయి. ఇప్పుడు ఆ మసాలా రేంజ్ కూడా దాటిపోయింది. అంతకుమించి అనే స్థాయిలో వీక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. ఇది ఎక్కడ వరకు దారితీస్తుందో తెలియదు గాని.. ఇప్పటికైతే మాత్రం ఒక స్థాయి లో అక్కడి రాజకీయాలు నడుస్తున్నాయి.

ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. తన సహచర మంత్రి నాదెండ్ల మనోహర్ తో ఢిల్లీ వెళ్లారు.. అక్కడ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. అక్కడ వారి మధ్య ఏం జరిగిందో తెలియదు. కాకపోతే 25 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో తెలియకపోయినాప్పటికీ.. మీడియాకు మాత్రం వచ్చే ఎన్నికల్లో కూడా మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని.. ఏపీ రాష్ట్రాన్ని బాగు చేయాలని చర్చించుకున్నట్లు చెప్పారు. ఇది ఇలా ఉంటే ప్రముఖ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ మాత్రం మరో విధంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని అమిత్ షా ముందు పవన్ కళ్యాణ్ ప్రతిపాదన తెచ్చారని.. దానికి ఆయన ఒప్పుకోలేదని.. జగన్మోహన్ రెడ్డిని తమ లాంగ్ టర్మ్ పొలిటికల్ ఫ్రెండ్ గా భావిస్తున్నట్టు అమిత్ షా చెప్పారని.. నాగేశ్వర్ అన్నారు.

నాగేశ్వర్ అన్న ఈ మాటలు క్యాజువల్ గానే ఉండవచ్చు. పాలిటిక్స్ ను అంతర్గతంగా స్టడీ చేసే వారికి వేరే విధంగా అనిపిస్తాయి . ప్రొఫెసర్ నాగేశ్వర్ నుంచి ఎప్పుడైతే ఈ మాటలు బయటికి వచ్చాయో.. అప్పుడే వైసిపి మీడియా అలర్ట్ అయిపోయింది. వెంటనే తన సోషల్ మీడియా ద్వారా.. మీడియా ద్వారా కావలసిన ప్రచారం చేసుకుంది. ఇది ఏపీ రాజకీయాలలో ఎంత మంట పుట్టించాలో అంత మంట పుట్టించింది. ఆ తర్వాత జనసేన రంగంలోకి వచ్చింది. టిడిపి.. బిజెపి ఇలా ఎదురుదాడి మొదలైంది. మొత్తంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవహారం మరో లైన్ తీసుకుంది.

ఈ క్రమంలో నాగేశ్వర్ తనను తాను సెల్ఫ్ డిపెండ్ చేసుకుంటూ.. తాను తెలంగాణ ప్రాంత వాడినని.. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన రాజకీయాలతో తనకేంటి అవసరమని వ్యాఖ్యానించారు. అవసరమైతే తనను అరెస్ట్ చేసుకోవాలని సవాల్ విసిరారు.. అంతకుముందు నాగేశ్వర్ ను అరెస్ట్ చేస్తే హైదరాబాదులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడిస్తామని టిఆర్ఎస్ అధినేత్రి కవిత హెచ్చరించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా నాగేశ్వర్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తర్వాత కులాన్ని.. ప్రాంతాన్ని ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లోకి తాను అన్ని వదులుకొని వచ్చానని.. ఎదురు దాడికి దిగితే పరిస్థితి వేరే విధంగా ఉంటుందని హెచ్చరించారు.. పవన్ కళ్యాణ్ హెచ్చరించిన కొద్దిసేపటికి ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పందించారు. తనను అరెస్ట్ చేసుకోవచ్చని.. దానికి సిద్ధంగా ఉన్నానని..క్వాష్ పిటిషన్ వేయలా వద్దా.. అనే దానిపై ఇంకా ఆలోచించుకోలేదని నాగేశ్వర్ పేర్కొన్నారు. . ఇప్పటికే నాగేశ్వర్ కు అనుకూలంగా వైసీపీ మీడియా.. బిఆర్ఎస్ మీడియా వ్యవహరిస్తున్నాయి. మధ్యలో కవిత కూడా సపోర్ట్ ఇస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం రెండు ప్రాంతాలకు మధ్యదిగా మారిపోయింది. అయితే ఇది ఎక్కడి దాకా దారితీస్తుందో చూడాల్సి ఉంది.

ఈ రాశుల వారికి ఈరోజు ఆదాయం పంట పండినట్లే..

Today 16 July 2026 Horoscope
Today 16 July 2026 Horoscope

Today 26 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై ఉత్తర పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకోకుండా ధన లాభం ఉంటుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణముంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించాలి. అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : వ్యాపారులకు గణనీయమైన లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు లాభాలు అందిస్తాయి. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఉద్యోగులకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. వ్యాపారాలు అనుకున్న దానికంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. దీంతో మానసికంగా సంతోషంగా ఉండగలుగుతారు. కుటుంబ సభ్యుల అండదండగా ఉండడంతో ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులు చేపడతారు. నిరుద్యోగులు శుభవార్తలను వింటారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారులకు కొత్త భాగస్వాముల సహకారంతో అధిక లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల అండదండలతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులకు అధికారులు అండదండలు ఉండడంతో ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్తగా పెట్టుబడును పెట్టే ముందు పెద్దలను సంప్రదిస్తారు. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఆర్థిక వ్యవహారాలు మెరుగైన ఫలితాలు ఇస్తాయి. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వీరితో వ్యాపార అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బులు ఇచ్చే ముందు ఆలోచించాలి. వ్యాపారులకు అనుకోకుండా ఆదాయం జరుగుతుంది. ఉద్యోగులు కొత్తగా ప్రాజెక్టులను చేపడితే వీటిని తోటి వారి సహకారంతో విజయవంతంగా పూర్తి చేస్తారు. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు ఆహ్లాదంగా గడుపుతారు. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఉంటాయి. ఉద్యోగులు కొత్తగా ప్రాజెక్టులను చేపడితే వాటిని వెంటనే పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొత్తగా పెట్టుబడులు పెడతారు. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు అధిక ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని పనులు పూర్తి చేయడానికి తోటి వారి సహకారాన్ని తీసుకుంటారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మీరు ఏదైనా ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల అండదండలు ఉంటాయి. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. స్నేహితుల సహకారంతో అప్పులను తీరుస్తారు. బంధువుల నుంచి ధన సహాయం ఉంటుంది. అనవసరపు వివాదానికి తలదూర్చకుండా ఉండాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. అయితే కొన్ని పనులు పూర్తికావడానికి ఆటంకాలు ఏర్పడవచ్చు. ఉద్యోగులు కొత్తగా ప్రాజెక్ట్ వర్క్ చేపడితే సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈరోజు విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఎవరికైనా డబ్బులు ఇచ్చే ముందు ఆలోచించాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వీరితో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి.

నీకు అమెరికా ఫస్ట్ అయితే మాకు ఇండియా ఫస్ట్.. ఇచ్చిపడేసిన జైశంకర్

S Jaishankar,

S Jaishankar : సింపుల్గా చెప్పాలంటే.. ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ కు వంత పాడుతోంది. అమెరికా చరిత్రలో పాకిస్తాన్ ఫేవర్ గా ఉన్న ట్రంప్ లాంటి అధ్యక్షుడిని ఇంతవరకు ప్రపంచం చూడలేదు. ఆ మధ్య మునీర్ పాకిస్తాన్ వెళ్ళాడు. ఏవో రంగురాళ్ల బాక్సులు ఇచ్చాడు. దానికి ట్రంప్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇంకేముంది పాకిస్తాన్లో పెట్టుబడులు పెడతాం.. భారీగా తవ్వకాలు జరుపుతాం అని ప్రకటనలు చేశాడు. కానీ ఇంతవరకు ఊదు కాలింది లేదు. పీరి లేచింది లేదు.

కానీ ఇదే అమెరికా ఇప్పుడు భారత్ మీద రకరకాలుగా మాట్లాడుతోంది. అమెరికాలో భారత్ నుంచి వచ్చిన వారు అక్రమంగా ఉంటున్నారని.. అమెరికా దేశస్థులకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంటున్నారని.. చీప్ లేబర్గా పనిచేస్తున్నారని.. ఇలా రకరకాల విమర్శలు చేస్తున్నారు . ఆమధ్య అమెరికాలో ఒక రాష్ట్రానికి సంబంధించిన సేనేటర్ ఏకంగా చిలుకూరు బాలాజీ ఆలయం గురించి లేకి వ్యాఖ్యలు చేశాడు. అమెరికా వీసాల కోసం గుడికి వెళ్లి రకరకాల పనులు చేస్తారని.. చివరికి బ్లాక్ మ్యాజిక్ కూడా చేపడతారని మండిపడ్డాడు. దీనిపై మన దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఇది కేవలం ఎగ్జాంపుల్ మాత్రమే.

అప్పట్లో ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడు అయినప్పుడు.. అమెరికాలో స్థిరపడిన భారతీయుల ఓట్ల కోసం ట్రంప్ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలుగా చేశాడు. నరేంద్ర మోడీని అమెరికాకు పిలిపించుకొని హౌడీ మోడీ అనే ప్రోగ్రాం నిర్వహించాడు. దానికంటే ముందు ఇంకా రకరకాల కార్యక్రమాలు జరిపాడు. అటువంటి ట్రంప్ ఇప్పుడు భారత్ అంటేనే మండిపడుతున్నాడు. మధ్యమధ్యలో రంగస్థల నాటక కళాకారుడిగా మోడీ అంటే ఇష్టం.. మోడీ నాకు దగ్గర స్నేహితుడు.. భారత్ అంటే ప్రేమ అంటూ కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నాడు. కానీ వాస్తవంలో మాత్రం వేరే ఉంది.

అమెరికాలో స్థిరపడిన భారతీయుల మీద ట్రంప్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఒక రకమైన నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుంది. ఇక రెండోసారి ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత అది మరింత పెరిగింది. ఇటీవల రూబియో ఇండియాకు వచ్చి విలేకరుల సమావేశంలో మాట్లాడింది. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు తమకు అమెరికానే ఫస్ట్ ఛాయిస్ అంటూ వ్యాఖ్యానించింది. అక్కడే మన విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ కూడా ఉన్నారు. ఆయన సమయం రాగానే.. సాలిడ్ కౌంటర్ ఇచ్చాడు. మీకు అమెరికా ఫస్ట్ అయితే.. మాకు ఇండియా ఫస్ట్ అంటూ ఓపెన్ గానే కామెంట్ చేశాడు. దీనికి రూబియో ఒకసారిగా షాక్ అయ్యారు. జై శంకర్ నుంచి ఇటువంటి కౌంటర్ వస్తుందని ఊహించలేదు. వాస్తవానికి జై శంకర్ ఫారిన్ ఎఫైర్స్ మినిస్ట్రీ అయిన తర్వాత ఇండియా రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఫారిన్ పాలసీలు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యంగా అమెరికా విషయంలో భారత్ ఏ మాత్రం తగ్గడం లేదు. తాజా పరిణామం కూడా దానిని నిరూపించింది. జై శంకర్ సాలిడ్ కౌంటర్ ఇవ్వడంతో అమెరికాకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.

ఇటీవల గ్రీన్ కార్డ్ విషయంలో కూడా అమెరికా లేనిపోని షరతులు విధించింది. దీంతో అమెరికా నిపుణులు నెత్తినోరు మొత్తుకుంటున్నారు. గ్రీన్ కార్డుల విషయంలో అమెరికా ఇలాంటి విధానాలకు పాల్పడతాయి వైద్యరగం నుంచి మొదలు పెడితే టెక్నాలజీ వరకు నిపుణులు మొత్తం స్వదేశాలకు వెళ్ళిపోతే అప్పుడు అమెరికా పరిస్థితి బిచ్చం ఎత్తుకునే స్థాయికి దిగజారుతుంది. అదే గనుక జరిగితే అమెరికా ప్రపంచ ఆర్థిక శక్తి జాబితా నుంచి పక్కకు తప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చైనా సవాల్ విసురుతోంది. తయారీ రంగంలో సూపర్ శక్తిగా ఎదిగింది. ఇదే విషయాన్ని ఇటీవల ట్రంప్ కూడా ప్రస్తావించారు. ఇప్పుడు ట్రంప్ వ్యవహరిస్తున్న శైలి కూడా ఎలా ఉందంటే బస్మాసుర హస్తం లాగా ఉంది. అతడి ధోరణి ఇలానే కొనసాగితే అమెరికాను ఎవడూ నాశనం చేయాల్సిన అవసరం లేదు.

హీరోయిన్ సమంత కి ఊహించని షాక్ ఇచ్చిన సీఎం విజయ్.. పాపం ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి..

Samantha new movie postponement

Samantha new movie postponement : పాపం సమంత కి ఈమధ్య అసలు కాలం కలిసి రావడం లేదు. చాలా కాలం తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ , ఆమె నటించిన చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా పై మార్కెట్ లో మంచి క్రేజ్ ఉంది. కానీ సరిగ్గా విడుదల సమయానికి ఎదో ఒక సమస్య వస్తూనే ఉంది. ముందుగా ఈ చిత్రాన్ని మే 14 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ అప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడం తో , జూన్ 4 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. సరిగ్గా అదే రోజున సమంత కి ఎంతో ఇష్టమైన రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం విడుదల కాబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. దీంతో తన చిత్రాన్ని సమంత జూన్ 19 కి వాయిదా వేసింది. ఇక్కడే అసలు సిసలు సమస్య వచ్చింది.

ఈ సినిమా విడుదలయ్యే రోజునే , తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్ ‘ విడుదల కాబోతుంది. త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన చేయబోతున్నారు. ఈ వారం లోనే సెన్సార్ సమస్యలు కూడా తీరబోతున్నాయని టాక్. అదే కనుక జరిగితే సమంత తన ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని మరోసారి వాయిదా వేయక తప్పదు. ఆమె ఈ చిత్రం జూన్ 19 న విడుదల కాబోతుందని కలలో కూడా ఊహించి ఉండదు. పైగా విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన నుండి విడుదల అవ్వబోతున్న మొదటి సినిమా ఇది , ఈ చిత్రం తోనే ఆయన సినిమా కెరీర్ కూడా ముగియబోతుంది. కాబట్టి ఈ సినిమాకు అటు తమిళ రాష్ట్రాల్లోనూ , ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ క్రేజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉండబోతుంది , ఇలాంటి సమయం లో ఆ చిత్రం తో పోటీ పడితే , సమంత సినిమా పరిస్థితి లారీ క్రింద నిమ్మకాయ మాదిరి అవుతుందని విశ్లేషకులు చెప్తున్న మాట.

మరి ఇప్పుడు సమంత జులై కి వెళ్లబోతుందా ?, లేదా దసరా కి వెళ్తుందా అనేది చూడాలి. మొత్తానికి సీఎం విజయ్ సమంత కి ఊహించని షాక్ ఇచ్చాడని అంటున్నారు విశ్లేషకులు. ఇక ‘మా ఇంటి బంగారం’ విషయానికి వస్తే, ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించింది, ‘ఓ బేబీ’ లాంటి భారీ హిట్ తర్వాత వీళ్లిద్దరి నుండి రాబోతున్న చిత్రమిది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సమంత నిర్మాతగా కూడా వ్యవహరించడం గమనార్హం.

ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్.. తాట తీస్తాం అంటూ వార్నింగ్..

Pawan Kalyan, Professor Nageshwar,

Pawan Kalyan : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో ప్రొఫెసర్ నాగేశ్వర రావు చేసిన కామెంట్స్ ఎంతటి దుమారం రేపాయో మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ , నాదెండ్ల మనోహర్ ఢిల్లీ కి వెళ్లి , అమిత్ షా ని కలిసి , మాజీ సీఎం జగన్ ని అరెస్ట్ చెయ్యాలంటూ కోరారని, అందుకు అమిత్ షా నవ్వుతూ సమాధానం చెప్తూ ‘చంద్రబాబు కంటే మనకి జగన్ చాలా నమ్మకస్తుడు, అతన్ని ఇబ్బంది పెట్టడం ప్రస్తుతానికి మనకి అనవసరం, కాబట్టి ఈ విషయం గురించి మర్చిపో’ అంటూ పవన్ కళ్యాణ్ కి చెప్పాడని, ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో భూకంపం సృష్టించింది అనే చెప్పొచ్చు. ఈ విషయం పై నాదెండ్ల మనోహర్ , నాగబాబు వంటి వారు కూడా రెస్పాన్స్ ఇవ్వడం , నాగేశ్వర్ మాటలను తప్పుబట్టడం జరిగింది.

అందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. అయినప్పటికీ జనసేన నాయకులు ఆయనపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యం లో పవన్ కళ్యాణ్ నేడు రాజమండ్రి పర్యటనలో భాగంగా కాసేపటి క్రితమే కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశాడు . ఈ సమావేశం లో ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు మాట్లాడిన మాటలకు చాలా ఘాటుగానే రెస్పాన్స్ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘శత్రువులు ఎక్కడో లేరు , మన పార్టీలోనే ఉన్నారు. అమిత్ షా గారితో నేను మాట్లాడిన మాటలు ఎలా బయటకు తెలుస్తాయి?, వైసీపీ నాయకుడు జైలుకు వెళ్లాలని నేనెందుకు కోరుకుంటాను?, అలా అయితే జనసేన ఎదుగుతుందా?, కేంద్ర హోమ్ మంత్రితో ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడుతారా?, ఇది మహోన్నతమైన మన వ్యవస్థను అవమానించడమే, ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసమే షా ని కలిశాను ‘ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.

అంతే కాకుండా తనపై రూమర్స్ ని ప్రచారం చేసేవాళ్లకు పవన్ కళ్యాణ్ స్వీట్ వార్నింగ్ ఇస్తూ ‘జనసేన పై రాళ్లు వేద్దామనుకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నేను కూడా అందరి లాగానే సాధారణమైన మనిషిని , నాకు కూడా కోపాలు , పౌరుషాలు ఉంటాయి. మీరు ఎల్లప్పుడూ మమల్ని కొడుతూ ఉంటే , మేము చూస్తూ చేతులు కట్టుకొని నిలబడాలా?, కష్టాలు, కన్నీళ్లు మీకే ఉంటాయా?, మీరు ఎమన్నా , మేము భరిస్తూ ఉండాలా ?, భరించినంత కాలం భరిస్తాం, సహిస్తాం , అవసరమైతే తాట తీస్తాం , ఈ మాట నేను చాలా ఏళ్ళ క్రితమే చెప్పా’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.

పెద్ది' విడుదల పై వీడని టెన్షన్.. రంగంలోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి.. అసలు ఏమి జరుగుతోంది?

Chiranjeevi Pawan Kalyan Ram Charan
Chiranjeevi Pawan Kalyan Ram Charan

Tollywood exhibitors controversy : మరో 9 రోజుల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఎక్కడ చూసినా పెద్ది మేనియా నే కనిపిస్తోంది. ఆ స్థాయిలో మేకర్స్ ప్రొమోషన్స్ చేస్తున్నారు. అయితే ‘పెద్ది’ చిత్రానికి సమస్యలు ఇంకా పూర్తిగా వీడిపోలేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గానే ఎక్సిభిటర్స్ గిల్డ్ మరియు ప్రొడ్యూసర్స్ గిల్డ్ మధ్య జరిగిన గొడవలు మనమంతా చూశాము. మాకు ఎట్టి పరిస్థితిలోనూ కమీషన్ బేసిస్ మీదనే సినిమాలను రన్ చెయ్యాలి, లేదంటే థియేటర్స్ ని మూసేస్తామని ఎక్సిభిటర్స్ గిల్డ్ సభ్యులు, అదే విధంగా మేము నిర్దిష్టమైన ప్రణాళికలు, షరతులు లేకుండా, కమీషన్ బేసిస్ మీద థియేటర్స్ ని రన్ చేయడానికి ఒప్పుకోము అంటూ నిర్మాతలు మీడియా ముందుకొచ్చి కొట్లాడుకున్నారు.

ఆ తర్వాత రెండు రోజులకు ఈ రెండు గిల్డ్స్ మధ్య చర్చలు జరగడం, ఈ చర్చలు వాడావేడి వాతావరణం లో మొదలైనప్పటికీ , చివరికి సామరస్యంగానే చర్చలు ముగించడం, ఆ తర్వాత స్వయంగా దిల్ రాజు నే ‘పెద్ది’ చిత్రానికి ఎలాంటి ఆటంకాలు ఉండవని , స్మూత్ గానే విడుదల అయ్యేలా చేస్తామని మాట ఇవ్వడం తో ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడింది. అయితే ఇప్పుడు ఎక్సిభిటర్స్ మరోసారి స్వరం మార్చారు. మాకు ఎట్టి పరిస్థితిలోనూ ‘పెద్ది’ చిత్రం నుండే కమీషన్ బేసిస్ మీద థియేటర్స్ ని నడిపే విధానం కావాలి అంటూ మీడియా ముందుకొచ్చారు. నేడు ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తో కూడా భేటీ అయ్యారు. దిల్ రాజు, అల్లు అరవింద్ , ఏషియన్ సునీల్, సురేష్ బాబు లతో పాటు , పలువురు కీలక నిర్మాతలు కమ్ ఎక్సిభిటర్స్ ఈ భేటీ లో పాల్గొన్నారు.

చిరంజీవి కి ప్రస్తుతం థియేటర్స్ ఎదురుకుంటున్న సమస్యలను వివరించి, కమీషన్ బేసిస్ మీద నడుపుకునేలా అడుగులు ముందుకు వేసేందుకు సహకరించమని కోరడం , అందుకు చిరంజీవి కూడా సానుకూలంగానే రెస్పాన్స్ ఇచ్చాడని దిల్ రాజు చెప్పడం వంటివి కాసేపటి క్రితమే జరిగాయి. మరో రెండు రోజుల్లో కీలక సమావేశం ఉందట , అదే విధంగా రాజమండ్రి పర్యటన లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కూడా వీళ్లంతా రేపు భేటీ అవ్వబోతున్నారట. త్వరలోనే దీనికి శాశ్వత పరిష్కారం జరగనుంది. అయితే ఒకవేళ సానుకూల ఫలితాలు రాకపోతే, తెలంగాణ ప్రాంతం లో పెద్ది చిత్రాన్ని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రణాళికలు దిల్ రాజు గ్యాంగ్ సిద్ధం చేస్తుందని , టికెట్ హైక్స్ రానివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు , మరి ఏమి జరగబోతుందో చూడాలి.

పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ లను చూస్తుంటే నా తమ్ముడు పునీత్ గుర్తుకొస్తున్నాడు : శివరాజ్ కుమార్

Peddi Shivarajkumar Glimpse
Peddi Shivarajkumar Glimpse

Peddi movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం వచ్చే నెల 4 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంమని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ నాన్ స్టాప్ గా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా నేడు కర్ణాటక రాష్ట్రంలో ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఈ చిత్రం లో కీలక పాత్ర పోషించిన కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా ఈ ఈవెంట్ కి విచ్చేసి , పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు . అవి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి, ఇంతకీ ఆయన ఏమి మాట్లాడాడో చూద్దాం.

ఆయన మాట్లాడుతూ ‘రామ్ చరణ్ ఒక మంచి నటుడు కంటే ముందుగా ఒక గొప్ప మనిషి. తన తండ్రి చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్ నుండి ఎన్నో మంచి లక్షణాలు అలవాటు చేసుకున్నాడు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఒక వీడియో ని నేను కూడా చూశాను , ఆ వీడియో లో రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్ పక్కపక్కనే కూర్చుంటారు, రామ్ చరణ్ పైకి లేచి స్టేజి మీదకు వెళ్లబోతుంటే , పవన్ కళ్యాణ్ ఆపి, సెక్యూరిటీ ఏర్పాటు చేసి పంపిస్తాడు , ఆ వీడియో చూసినప్పుడు నా మనసుకి ఎంతో ఆనందం కలిగింది. వాళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమాభినామాలు చూస్తే నాకు నా తమ్ముడు పునీత్ తో ఉన్నటువంటి అనుబంధం గుర్తుకువచ్చింది’ అంటూ శివరాజ్ కుమార్ మాట్లాడిన మాటలు అభిమానులకు చాలా ఎమోషనల్ అనిపించాయి. ఇక పెద్ది గురించి ఆయన మాట్లాడిన కొన్ని మాటలు కూడా బాగా వైరల్ అయ్యాయి.

ఆయన మాట్లాడుతూ ‘ఈ చిత్రం లో రామ్ చరణ్ నటన నిజంగా అద్భుతం, కచ్చితంగా అతనికి నేషనల్ అవార్డు వస్తుందని బలంగా నమ్ముతున్నాను. దాదాపుగా రెండేళ్ల పాటు చరణ్ ఈ సినిమా కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశాడు. చాలా నిజాయితీగా అతను ఈ పాత్రలోకి ఒదిగిపోయాడు. ఇక సినిమా విషయానికి వస్తే ఒక బలమైన కథకి , ఎమోషనల్ జర్నీ తోడైతే ఎలా ఉంటుందో , అదే పెద్ది లో మనం చూడబోతున్నాం. బుచ్చి అద్భుతంగా ఈ సినిమాని తీర్చి దిద్దాడు. ముఖ్యంగా ఈ చిత్రం లోని ప్రతీ క్యారెక్టర్ ఒక అద్భుతం అనే చెప్పాలి. ఇక రత్నవేలు గారి విజువల్స్ ఆడియన్స్ ని మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. స్పోర్ట్స్ ఎపిసోడ్స్ ఆడియన్స్ కి చిరకాలం గుర్తుండిపోతుంది. సినిమా షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు మేమంతా ఒక కుటుంబం లాగానే కలిసున్నాం’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఒక సైనికుడికి అన్యాయం.. కదిలిన భారత సైన్యం.. దెబ్బకు పోలీసుల కాళ్ల బేరం

ITBP jawan mother case

ITBP jawan mother case : ఒక జవాన్ సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతుంటే, అతని కన్నతల్లి నగరంలోని ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి చేతి కోల్పోయింది. ఇది వ్యక్తిగత విషాదం కాదు. వైద్య వ్యవస్థలో లోపం. వైద్యో నారాయణో హరి అంటారు. కానీ వైద్యం వ్యాపారంగా మారింది. వైద్యులు బిజినెస్‌ చేస్తున్నారు. ఇలాంటి రోజుల్లో వైద్యుల బాధ్యతారహిత్యానికి ప్రతీక ఘటన కాన్పూర్‌లో జరిగింది. ఇది దేశానికి సేవ చేసే వీరుల కుటుంబాలపై మన సమాజం చూపుతున్న ఉదాసీనతకు ఉదాహరణ.

ఏం జరిగిందంటే..
ఐటీబీపీ జవాన్ వికాస్ సింగ్ తల్లి నిర్మలాదేవి(56) అనారోగ్యంతో కృష్ణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరింది. ఆమెను వెంటిలేటర్‌పై ఉంచినట్లు చెప్పి సంతకాలు మాత్రమే తీసుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. నొప్పితో నిర్మలా దేవి తల్లడిల్లినా పట్టించుకోలేదు. నల్లబడి వాచిపోయినా స్పందించలేదు. చివరికి రక్తప్రసరణ ఆగిపోయి కణజాలం కుళ్లిపోయి చేయి తొలగించాల్సిన దారుణ పరిస్థితి ఏర్పడింది. ఇది వైద్యుల నిర్లక్షా‍్యనికి, ఆసుపత్రి అలసత్వానికి నిదర్శనం. ఇది ఒక్కసారి జరిగిన పొరపాటు కాదని, ఇదే ఆసుపత్రిలో గతంలో కూడా సైనిక, పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన ఆరోపణలు రావడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

కత్తిరించిన చేతితో ఆందోళన..
ఈ నేపథ్యంలో జవాన్ వికాస్ సింగ్ చేసిన ప్రతిస్పందన హృదయవిదారకం. తన తల్లి కత్తిరించిన చేతిని థర్మోకోల్ బాక్సులో పెట్టుకొని కమిషనరేట్ మెట్లు ఎక్కారు. పోలీసులు మొదట ఫిర్యాదు నమోదు చేయడానికి నిరాకరించడం, తర్వాత ఏర్పాటు చేసిన విచారణ కమిటీ ‘బోగస్’ నివేదిక ఇవ్వడం దేశంలో సాధారణమైపోయిన అధికారిక బాధ్యతారాహిత్యాన్ని బయటపెడుతుంది. అయితే ఈ ఘటనలో నిజమైన ఆశాకిరణం ఐటీబీపీ బలగాల స్పందన. కమాండెంట్ గౌరవ్ ప్రసాద్ నేతృత్వంలో సుమారు 50 మంది యూనిఫాం ధరించి కమిషనరేట్‌ను చుట్టుముట్టి, క్రమశిక్షణతో, సంయమనంతో న్యాయం కోసం డిమాండ్ చేయడం చాలా అర్థవంతమైన చర్య. దేశాన్ని కాపాడే సైనికులు తమ తోటి జవాన్‌కు జరిగిన అన్యాయాన్ని ఊరుకోలేకపోవడం సైనిక సోదరత్వానికి, సంస్థాగత గౌరవానికి నిదర్శనం. ఈ చర్య వల్లే కమిషనర్ కొత్త విచారణకు ఆదేశించి, బాధ్యులపై చర్య తీసుకుంటామని హామీ ఇవ్వాల్సి వచ్చింది. ఈ సంఘటన మనకు కొన్ని కఠిన సత్యాలను గుర్తు చేస్తోంది. సరిహద్దుల్లో రక్తం కార్చే వీరుల కుటుంబాలు కనీసం నగరాల్లో మంచి వైద్యం, న్యాయం ఆశించడం ఎంతో అన్యాయం. ప్యానెల్ ఆసుపత్రుల్లోనూ ఇలాంటి నిర్లక్ష్యం జరగడం ఆందోళనకరం. వైద్య రంగంలో బాధ్యతా బాహ్యత, పోలీసు వ్యవస్థలో స్పందన లేకపోవడం ఇవి కేవలం ఒక్క జవాన్ కుటుంబానికి మాత్రమే కాదు, మొత్తం దేశ భద్రతా యంత్రాంగానికి సంబంధించిన విషయాలు. ఈ ఘటన నుంచి పాఠం నేర్చుకోవాలి. నిర్లక్ష్యం చేసిన వైద్యులపై కఠిన చర్యలు, ఆసుపత్రికి తగిన శిక్ష, జవాన్ కుటుంబానికి పూర్తి న్యాయం మరియు పరిహారం అందించాలి.

సైనికుల కుటుంబాలకు ప్రత్యేక వైద్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. ఒక జవాన్ కన్నీరు వ్యవస్థలను కదిలించినప్పుడు, ఆ సైన్యం కదలడం సహజం. కానీ ఈ సైనికులు ప్రతిరోజూ సరిహద్దుల్లో కాపలా కాస్తున్నప్పుడు, వారి కుటుంబాలు ఇంట్లో భద్రతగా ఉండాలి. ఇది కేవలం ఒక కేసు కాదు.. మన జాతీయ బాధ్యత.

ప్లే ఆఫ్ రేసు : ఈ ఏడుగురి ఆట చూసేందుకు సిద్ధమా..

IPL 2026 playoffs

IPL 2026 playoffs : ఐపీఎల్ లో ఇప్పటివరకు ఒక లెక్క.. ఇక ముందు నుంచి ఒక లెక్క. మంగళవారం నుంచి క్వాలిఫైయర్ రేసు మొదలవుతుంది. క్వాలిఫైయర్ రేసులో భాగంగా మంగళవారం ధర్మశాలలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య క్వాలిఫైయర్ 1 మ్యాచ్ నిర్వహిస్తారు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ వెళ్తుంది. ఇక బుధవారం ముల్లాన్ పూర్ వేదికగా హైదరాబాద్, రాజస్థాన్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. ఈ మ్యాచ్లో ఓడిన జట్టు నేరుగా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇదే వేదిక శుక్రవారం క్వాలిఫైయర్ -2 మ్యాచ్ జరుగుతుంది. క్వాలిఫైయర్ -1 లో ఓటమిపాలైన జట్టు ఎలిమినేటర్ విభాగంలో గెలిచిన జట్లు పోరాడుతాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్ వెళ్తుంది. ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్రమోడి స్టేడియంలో జరుగుతుంది. ఇందులో విజయం సాధించిన జట్టు ట్రోఫీ అందుకుంటుంది.

ఈ సీజన్లో ఇప్పటివరకు మొత్తం 70 మ్యాచ్ లు జరిగాయి. ఇవన్నీ కూడా అభిమానులకు అద్భుతమైన క్రికెట్ ఆనందాన్ని పంచాయి. ఇప్పటివరకు జరిగిన 70 మ్యాచులు ఒక విధంగా ఉంటే.. ఇకపై జరిగే నాలుగు మ్యాచ్లు మరో విధంగా ఉంటాయి. ప్రేక్షకుల దృష్టి నుంచి చూస్తే ఈ మ్యాచ్ లు సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం లేకపోలేదు. అయితే ఈ నాలుగు మ్యాచ్ల్లో ఏడుగురు ఆటగాళ్లు అద్భుతంగా అదరగొట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరి ఆట చూసేందుకు అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఆరెంజ్ క్యాప్ విభాగంలో

సాయి సుదర్శన్

ఆరెంజ్ క్యాప్ విభాగంలో గుజరాత్ ఆటగాడు సాయి సుదర్శన్ 638 పరులతో టాప్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇతడు ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. బెంగళూరు తో జరిగే మ్యాచ్లో ఇతడు గనుక సత్తా చూపిస్తే గుజరాత్ జట్టుకు అడ్డు ఉండదు.. పైగా ఇతడు ఓపెనర్ గా వచ్చి పాతుకు పోతున్నాడు. ఇతడిని అవుట్ చేయడం ఒక రకంగా బెంగళూరు జట్టుకు ఇబ్బందికరమే అని చెప్పాలి.

గిల్

గుజరాత్ జట్టుకు నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు గిల్. ఓపెనర్ గా వస్తున్న ఇతడు అద్భుతంగా ఆడుతున్నాడు. ఆరెంజ్ క్యాప్ విభాగంలో ఇతడు రెండవ స్థానంలో ఉన్నాడు. ఇతడు ఏకంగా 616 పరుగులు చేశాడు. తదుపరి మ్యాచ్లో అదే స్థాయిలో ఆడితే మాత్రం గుజరాత్ జట్టు కు అడ్డు అనేది ఉండదు.

క్లాసెన్

హైదరాబాద్ జట్టు తరఫున కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతున్న ఆటగాడిగా క్లాసెన్ కొనసాగుతున్నాడు. ఇతడు ఇప్పటివరకు 606 పరుగులు చేశాడు. స్థిరమైన బ్యాటింగ్ చేస్తూ.. జట్టు విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాజస్థాన్ జట్టుతో జరిగే మ్యాచ్లో ఇతడి మీద హైదరాబాద్ భారీ అంచనాలు పెట్టుకుంది. ఇతడు గనక మరోసారి తన బ్యాట్ కు అని చెప్తే హైదరాబాద్ జట్టుకు పని ఈజీ అయిపోతుంది.

వైభవ్ సూర్య వంశీ

రాజస్థాన్ జట్టు తరఫున ఆడుతున్న ఈ 15 సంవత్సరాల బాలుడు ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇప్పటివరకు ఇతడు 583 పరుగులు చేశాడు. తుఫాన్ వేగంతో బ్యాటింగ్ చేస్తున్న ఇతడు.. హైదరాబాద్ జట్టుతో జరిగే మ్యాచ్లో తిరుగులేని ఇన్నింగ్స్ ఆడతాడని రాజస్థాన్ జట్టు భావిస్తోంది. ఒకవేళ గనుక అతడు మరోసారి ఆపద్బాంధవుడి పాత్ర పోషిస్తే రాజస్థాన్ జట్టుకు విజయం నల్లేరు మీద నడకవుతుంది.

పర్పుల్ విభాగంలో

భువనేశ్వర్ కుమార్

బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న ఇతడు ఇప్పటివరకు 24 వికెట్లు పడగొట్టాడు. తక్కువ పరుగులు ఇచ్చి.. స్వింగ్ బంతులతో ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తున్నాడు. ఇతడి మీద బెంగళూరు భారీ అంచనాలు పెట్టుకుంది. ప్లే ఆఫ్ లో ఇతడు గనుక మరొకసారి తన బౌలింగ్ తో ఆకట్టుకుంటే బెంగళూరు జట్టుకు విజయాలు సులభమవుతాయి. అంతేకాదు ట్రోఫీ గెలిచినా సరే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

రబాడ

గుజరాత్ జట్టు తరఫున ఆడుతున్న ఇతడు కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నాడు. లైన్ అండ్ లెంగ్త్ ఏమాత్రం మిస్ చేయకుండా బంతులు వేస్తూ వికెట్లు పడగొడుతున్నాడు. ఇప్పటివరకు అతడు తన ఖాతాలో 24 వికెట్లను వేసుకున్నాడు. తదుపరి మ్యాచ్లో కూడా అతడు అదే జోరు చూపిస్తే గుజరాత్ జట్టు కచ్చితంగా అంచనాలకు అందని ఫలితాన్ని అందుకుంటుంది.

జోప్రా ఆర్చర్

రాజస్థాన్ జట్టుకు ప్రధాన ఆయుధంగా మారాడు ఇతడు. అద్భుతమైన బంతులు వేస్తూ వికెట్లను పడగొడుతున్నాడు. పైగా ఎకనామి విషయంలో కూడా అత్యంత పొదుపు పాటిస్తున్నాడు. ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ విజయానికి ఇతడే ముఖ్యకారకుడు. అటువంటి ప్రదర్శనలు ఇతడు మరోసారి రిపీట్ చేస్తే రాజస్థాన్ జట్టు పంట పండినట్టే.

రషీద్ ఖాన్

పర్పుల్ విభాగంలో పేస్ బౌలర్లు వికెట్ల పంట పండించుకుంటే.. రషీద్ ఖాన్ గుజరాత్ తరఫున స్పిన్ బౌలింగ్ వేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు అతడు 19 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. గుజరాత్ సాధించిన విజయాలలో ముఖ్య పాత్ర పోషించాడు. తదుపరి మ్యాచ్లో కూడా అతడు అదే స్థాయిలో బౌలింగ్ వేస్తే గుజరాత్ జట్టు కచ్చితంగా మరోసారి విజేతగా ఆవిర్భవిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

క్వాలిఫైయర్ రేసు : ఈ నాలుగింటిలో గెలుపు ఎవరిది..

IPL 2026 playoffs : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ కు సంబంధించి లీగ్ సమరం ముగిసింది. హైదరాబాద్, గుజరాత్, బెంగళూరు, రాజస్థాన్ ప్లే ఆఫ్ వెళ్లిపోయాయి.. పాయింట్లు పరంగా చూసుకుంటే బెంగళూరు, గుజరాత్ జట్లు బలంగా కనిపిస్తున్నాయి. నెట్ రన్ రేట్ కూడా ఈ జట్లకు మెరుగ్గా ఉంది. అలాగని రాజస్థాన్, హైదరాబాద్ జట్లను అంత సులభంగా తీసుకోవడానికి లేదు.

గ్రూప్ దశలో జరిగిన పోరాటాలు ఒక విధంగా.. ప్లే ఆఫ్ దశలో పోరాటాలు మరొక విధంగా ఉంటాయి. అందువల్లే ఇప్పుడు జరిగే పోటీలను ఆటగాళ్లు పాయింట్ల పరంగా చూసుకోరు. నెట్ రన్ రేట్ పరంగా చూసుకోరు. కేవలం విజయమో.. వీర స్వర్గమో అన్నట్టుగానే భావిస్తారు. హైదరాబాద్, గుజరాత్ జట్లకు కాస్త వెసలు బాటు ఉంది. ఎందుకంటే ఆ రెండు జట్లకు రెండు అవకాశాలుంటాయి. కానీ హైదరాబాద్, రాజస్థాన్ జట్లకు మాత్రం ప్రతి మ్యాచ్ కూడా నాకౌట్ లాగే ఉంటుంది.

ఈ సీజన్లో గుజరాత్, హైదరాబాద్, రాజస్థాన్, బెంగళూరు.. ఇలా ఏ జట్టు ట్రోఫీ గెలిచినా సరే రెండవది అవుతుంది. ఎందుకంటే బెంగళూరు 18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత గత ఏడాది విజేతగా నిలిచింది. ఈసారి కూడా ట్రోఫీ గెలిస్తే వరుసగా రెండవసారి విజేతగా నిలుస్తుంది.

గుజరాత్ కూడా 2022లో ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఇక ఈ సీజన్లో గనుక గుజరాత్ విజేతగా నిలిస్తే రెండవ టైటిల్ ఆ జట్టు ఖాతాలో ఉంటుంది.

హైదరాబాద్ 2016లో విజేతగా ఆవిర్భవించింది. 2024లో ఫైనల్ దాకా వెళ్ళినప్పటికీ ట్రోఫీ అందుకోలేకపోయింది. అయితే ఈసారి గెలిస్తే మాత్రం రెండవ ట్రోఫీ తన ఖాతాలో వేసుకుంటుంది.

రాజస్థాన్ 2008లో షేన్ వార్న్ నాయకత్వంలో ట్రోఫీ అందుకుంది. ఇంతవరకు మరొకసారి విజేతగా నిలవలేదు. అయితే ఈసారి గనుక ఆ జట్టు గెలిస్తే రెండవసారి ట్రోఫీ అందుకున్న చరిత్రను తన ఖాతాలో లిఖించుకుంటుంది.

ఈసారి ఐపీఎల్ లో ఈ నాలుగు జట్లు బలంగా పోరాటాన్ని సాగించాయి. ప్లే ఆఫ్ దశ దాకా వచ్చాయి. కొన్ని సందర్భాల్లో వెనుకబడినప్పటికీ.. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లలో విజయాలు సాధించి ఇక్కడ దాకా వచ్చాయి. ఈ జట్ల మధ్య పోరాటాలు చూసేందుకు అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.