Home Blog Page 230

తొలి మహానాడు అదుర్స్.. ప్రత్యేకతలు ఇవే!

TDP Mahanadu History
TDP Mahanadu History

TDP Mahanadu History: తెలుగుదేశం పార్టీకి పండుగ లాంటిది మహానాడు. అయితే ఈ వేడుకను ప్రారంభించింది మాత్రం నందమూరి తారక రామారావు. హైదరాబాదులో 1982లో పార్టీని ప్రకటించారు ఎన్టీఆర్. అలా ప్రకటించిన తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి రాగలిగారు. పార్టీ ప్రకటన హైదరాబాదులో చేసిన సమయంలోనే.. ప్రతి రెండేళ్లకు ఒకసారి మహానాడు ను జరుపుకుంటామని ప్రకటించారు. అయితే ఈ మహానాడు అనేది ఒక కార్యక్రమమా? పండుగ? అనేది తెలియలేదు పార్టీ శ్రేణులకు. అలాగని నందమూరి తారక రామారావును ప్రశ్నించే ధైర్యము ఎవరికీ లేదు. అయితే తొలిసారిగా గుంటూరులో శ్రీకృష్ణదేవరాయలు మున్సిపల్ మైదానంలో నిర్వహించిన మహానాడు నభూతో న భవిష్యత్ అన్నట్టు సాగింది. తెలుగుదేశం పార్టీ గమనాన్ని మార్చింది. ఆ పార్టీ పునాదులను మరింత పటిష్టం చేసింది. ఆ మహానాడులో అన్ని ప్రత్యేకమే. రాష్ట్రానికి అవసరమైన భవిష్యత్ కార్యాచరణ.. పార్టీ అభివృద్ధి.. పార్టీ శ్రేణులకు అతిధి మర్యాదలు.. ఇలా మహానాడులో అన్ని ప్రత్యేకమే.

* అందరి దృష్టి ఎన్టీఆర్ వైపే..
కాంగ్రెస్ పార్టీ కోటను బద్దలు కొట్టింది తెలుగుదేశం. పార్టీని ఏర్పాటు చేసిన అనతి కాలంలోనే విజయాన్ని అందుకున్నారు నందమూరి తారకరామారావు. జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. ముఖ్యంగా కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను కూడదియగలిగారు. ప్రాంతీయ పార్టీలకు ఒక దిక్సూచిగా తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్దారు. అయితే ఏ వ్యక్తికైనా.. వ్యవస్థ కైనా క్రమశిక్షణ అవసరం. వ్యూహం అత్యంత కీలకం. భవిష్యత్ కార్యాచరణ అనేది అత్యంత ఆవశ్యం. దానిని తెలుగుదేశం పార్టీకి మహానాడు ద్వారా పరిచయం చేశారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని రెండు రోజులపాటు మహానాడు వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా మార్చారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మహానాడు నిర్వహించాలని శాశ్వత తీర్మానం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నుంచి గ్రామస్థాయి కార్యకర్త వరకు ఒకే వేదికపై తెచ్చేందుకు ఈ మహానాడు అనేది గొప్ప ఆయుధంగా మారింది తెలుగుదేశం పార్టీకి.

* అతిరథ మహారధులు హాజరు..
గెలుపు బాటతో జాతీయస్థాయిలో తెలుగుదేశం పార్టీ ఒక వెలుగు వెలిగింది ఆ సమయంలో. 1984లో గుంటూరులో తొలి మహానాడు జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు మున్సిపల్ గ్రౌండ్లో మహానాడు నిర్వహణ అనేది ఒక ప్రత్యేకంగా నిలిచింది. చివరి రోజు టిడిపి శ్రేణులతో సాగిన భారీ ఊరేగింపు అనేది తెలుగుదేశం పార్టీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. నాడు దేశవ్యాప్తంగా అతిరథ మహారధులు మహానాడుకు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీకి అది పండుగ అయినా జాతీయస్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేకులంతా క్యూ కట్టారు. అప్పట్లో జాతీయస్థాయిలో అగ్ర నేతలుగా ఉన్న ఎంజి రామచంద్రన్, బాబు జగ్జీవన్ రావ్, ఫరూక్ అబ్దుల్లా, హెచ్డి బహుగుణ, చండ్ర రాజేశ్వరరావు, ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి, రామకృష్ణ హెగ్డే, అజిత్ సింగ్, శరద్ పవర్, ఉన్ని కృష్ణన్, మేనకా గాంధీ తదితరులు హాజరయ్యారు. అంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులంతా తొలి మహానాడుకు హాజరయ్యారు అన్నమాట.

* పసందైన వంటకాలతో..
ఎన్టీఆర్ భోజనప్రియలు. అందుకే తన పుట్టినరోజు నాడు నిర్వహిస్తున్న మహానాడుకు విచ్చేసి టిడిపి శ్రేణులకు పసందైన ఆహారాన్ని అందించడం ఆనవాయితీగా చేశారు. అదే ఆనవాయితీని కొనసాగించారు చంద్రబాబు. మహానాడు అంటే ముందుగా గుర్తొచ్చేది ఆహార మెనూ. పసందైన ఆంధ్ర వంటకాలతో.. మూడు ప్రాంతాల్లో ప్రముఖమైన ఆహారంతో.. మహానాడుకు హాజరయ్యే వారికి సంతృప్తిగా భోజనాలు పెట్టడం అనేది ఒక సంప్రదాయం. ప్రారంభ మహానాడులో టిడిపి నేతలు బస చేసేందుకు కుటీరాలను ఏర్పాటు చేశారు. కాలక్రమంలో మహానాడు ఏ నగరంలో నిర్వహిస్తే సమీపంలో హోటల్లు, ఫామ్ హౌస్ లతో టిడిపి శ్రేణులు నిండిపోయేవారు. అయితే ఈ ఏడాది ఖర్చు తగ్గించుకునేందుకు వీలుగా.. ప్రధాని సూచనల మేరకు హైబ్రిడ్ విధానంలో మహానాడుకు సిద్ధపడింది టిడిపి నాయకత్వం.

అంచనాలను పెంచేస్తున్న 'హైబ్రిడ్ మహానాడు'

Hybrid Mahanadu
Hybrid Mahanadu

Hybrid Mahanadu: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి సంవత్సరం నిర్వహించే మహానాడుకు ఒక చరిత్ర ఉంది. ఒక ప్రత్యేకత కూడా ఉంది. అయితే అంతకుమించి ఈ ఏడాది నిర్వహిస్తున్న హైబ్రిడ్ మహానాడుకు మరో ప్రత్యేకత. ఏటా ఎన్టీఆర్ జన్మదినం నాడు రెండు రోజులపాటు మహానాడు ను నిర్వహించి.. పార్టీతో పాటు రాష్ట్ర భవిష్యత్తు కోసం తీర్మానాలు చేయడం, చర్చించడం ఈ మహానాడు లక్ష్యం. ప్రతి సంవత్సరం ఏదో ఒక నగరంలో నిర్వహించి.. లక్షలాదిమంది టిడిపి శ్రేణులను తరలించి.. వారికి సంతృప్తికరమైన భోజనాలు పెట్టి పంపించడం ఒక ఆనవాయితీ. అయితే వృధా ఖర్చులు తగ్గించుకోవాలన్న ప్రధాని సూచనలను గౌరవించి.. ఈ ఏడాది మహానాడును రద్దు చేశారు. హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నారు. రేపటి నుంచి రెండు రోజులపాటు జరిగే ఈ హైబ్రిడ్ మహానాడు నిర్వహణపై అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఆసక్తి కనిపిస్తోంది.

* తెలుగుదేశం పార్టీకి సంప్రదాయంగా…
తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా.. అంటూ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా మహానాడు నిర్వహించి పార్టీ కార్యక్రమాలపై చర్చించి.. రాష్ట్ర అభివృద్ధికి తీర్మానాలు చేసి చర్చించాలన్నది ఈ మహానాడు ముఖ్య ఉద్దేశం. అప్పటివరకు జాతీయ కాంగ్రెస్ విధానాలతో ఇటువంటి వాసనలు ఉండేవి కావు. ఆ మహా పురుషుడు ఎన్టీఆర్ ఏనాడు అయితే మహానాడు పెట్టారో.. ఆ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. తెలంగాణలో మహానాడు నిర్వహిస్తే మారుమూల శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా టిడిపి శ్రేణులు తరలి వెళ్లేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా.. నవ్యాంధ్రప్రదేశ్లో అయినా.. పార్టీ అధికారంలో ఉన్న.. లేకపోయినా మహానాడు అనేది తెలుగుదేశం పార్టీకి పరమ పవిత్రమైన ఒక పండుగ.

* అందరి చూపు అటువైపే..
మహానాడు అంటేనే తెలుగుదేశం పార్టీ అభిమాని పులకించుకుపోతారు. అటువంటి మహానాడు ను ఈసారి హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పరిమిత సంఖ్యలో నేతలతో భౌతికంగా మహానాడు నిర్వహిస్తారు. దానికి అనుసంధానంగా నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి.. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే మహానాడు ను అనుసంధానిస్తారు. ఎంపిక చేసిన నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలతో పాటు నేతలతో మాట్లాడిస్తారు. పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ తో వారిని మాట్లాడించడం ద్వారా.. ఒక రకమైన సంతృప్తి ఉండేలా చేస్తారు. మహానాడు హైబ్రిడ్ విధానం ద్వారా చేపట్టడం ద్వారా ఆదా అయిన సొమ్మును పార్టీ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారు. గతం మాదిరిగా వేలాదిమందికి మాత్రమే కాదు.. లక్షలాదిమందికి ఈసారి మహానాడు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. నేరుగా పార్టీ సిద్ధాంతాలపై మరింత చర్చ జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.. అయితే ఇప్పుడు హైబ్రిడ్ మహానాడు పై టిడిపి కంటే ఇతర రాజకీయ పార్టీల్లోనే ఎక్కువ ఆసక్తి ఉంది.

ఆకాశం నుంచి ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఎలా ఉంటుందో తెలుసా? వైరల్ వీడియో

India Pakistan Border
India Pakistan Border

India Pakistan Border: భారత్‌–పాకిస్తాన్‌ సరిహద్దు అంటేనే ఎప్పుడూ ఉద్రిక్తతలు నెలకొని ఉంటాయి. దాయాది దేశం ఎప్పుడూ కవ్వింపులకు పాల్పడుతూ.. ఉగ్రవాదులను మన దేశంలోకి పంపే ప్రయత్నం చేస్తుంది. అయితే వాఘా సరిహద్దు మాత్రం.. కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అయితే తాజాగా ఇండిగో విమానయాన సంస్థ పైలట్‌ కెప్టెన్‌ ప్రదీప్‌ కృష్ణన్‌ విమాన ప్రయాణికులకు ఓ అద్భుత దృశ్యాన్ని చూపించారు. రాత్రి వేళ తీసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాక్‌పిట్‌ నుంచి తీసిన ఈ అపూర్వ ఫుటేజ్‌లో భారత్‌–పాకిస్తాన్‌ సరిహద్దు ఒక ప్రకాశవంతమైన కాంతి గీతంలా కనిపించింది. చుట్టూ చీకటి అంచుల మధ్య ఎల్లో ఫ్లడ్‌లైట్లు వరుసగా వెలుగుతూ రాడ్‌క్లిఫ్‌ లైన్‌ను స్పష్టంగా విభజించి చూపించాయి. విమానం క్రూజింగ్‌ ఎత్తులో ఉన్నప్పుడు సరిహద్దు ఇరువైపులా ఉన్న బార్డర్‌ అవుట్‌పోస్టులు, సెక్యూరిటీ ఏర్పాట్లు కాంతి క్లస్టర్లుగా కనిపించాయి. ఈ దృశ్యం చాలా మందిని ఆకట్టుకుంది.

అత్యంత సున్నితమైన ప్రాంతం..
కెప్టెన్‌ ప్రదీప్‌ లేడీస్‌ అండ్‌ జెంలిట్‌మెన్‌ అంటూ ప్రయాణీకులతో మాట్లాడుతూ, ‘‘ప్రపంచంలోని అత్యంత సున్నితమైన, బలంగా కాపాడబడే సరిహద్దుల్లో ఒకటైన భారత్‌–పాకిస్తాన్‌ సరిహద్దును చూడవచ్చు’’ అని ప్రకటించడం వీడియోలో ఉంది. అంతరిక్షం నుంచి కనిపించే గీత‘‘రాత్రి సమయంలో భారత్‌–పాకిస్తాన్‌ సరిహద్దును అంతరిక్షం నుంచి కూడా గుర్తించవచ్చు’’ అని వీడియోకు ఇచ్చిన క్యాప్షన్‌ ఈ దృశ్యం ఎంత ప్రత్యేకమో తెలియజేస్తోంది. భూమి మీది చీకటి నేపథ్యంలో ఈ కాంతి గీతం ఒక డ్రామాటిక్, సర్రియల్‌ ఇమేజ్‌ను సృష్టించింది.

నెటిజన్ల స్పందన..
ఈ వీడియో విడుదలైన వెంటనే నెటిజన్ల నుంచి వేలాది ప్రతిస్పందనలు వచ్చాయి. చాలా మంది దీన్ని ‘‘అద్భుతం’’, ‘‘ఇప్పటివరకు ఇలా చూడలేదు’’ అని వ్యాఖ్యానించారు. కొందరు సరిహద్దుల మానవీయ కోణాన్ని ప్రస్తావించారు.‘‘రెండు వైపులా ఉన్న అందమైన ప్రజలు, సరిహద్దు రాజకీయాల అందములేని గోడ వల్ల విభజించబడ్డారు’’ అని ఒకరు రాశారు. ‘‘సరిహద్దు లైట్ల బిల్లు ఎవరు చెల్లిస్తారు?’’ అని మరొకరు జోక్‌ చేశారు. ‘‘రెండు సముద్రాలు కలిసి ఉన్నా ఎప్పుడూ కలవని లాగా… ఎంత దగ్గరగా ఉన్నా ఎంత దూరం!’’ అని మరొక వ్యాఖ్య ఆకట్టుకుంది.

ఈ ఏరియల్‌ ఫుటేజ్‌ కేవలం అందమైన దృశ్యం మాత్రమే కాదు. ఇది రాజకీయాలు, చరిత్ర, భద్రతా అవసరాల వల్ల ఏర్పడిన విభజనను గుర్తు చేస్తుంది. ఒకవైపు అధిక సైనిక భద్రత, మరోవైపు సాధారణ ప్రజల జీవితాలు – ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆకాశం నుంచి చూసినప్పుడు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. కెప్టెన్‌ ప్రదీప్‌ కృష్ణన్‌ ఇలాంటి సమాచారపరమైన, ఆకర్షణీయమైన వీడియోలు షేర్‌ చేయడం ద్వారా ప్రయాణీకుల అనుభవాన్ని మరింత గుర్తుండిపోయేలా చేస్తున్నారు. ఈ వీడియో లక్షలాది మంది మనసుల్లో సరిహద్దుల గురించి, వాటి వెనుక ఉన్న వాస్తవాల గురించి ఆలోచనలను రేకెత్తించింది.

ఏపీకి నిన్న రాయల్ ఎన్ఫీల్డ్.. నేడు వాల్వో!

Volvo Plant AP
Volvo Plant AP

Volvo Plant AP: ఏపీ ప్రభుత్వానికి మరో గుడ్ న్యూస్ అందింది. ప్రపంచ ప్రఖ్యాత ఆటోమొబైల్ దిగ్గజం వాల్వో తన ఉత్పత్తి కేంద్రాన్ని ఏపీలో పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వోల్వో ప్రతినిధులు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. రాష్ట్రంలో మరో దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ తన కార్యకలాపాలను మొదలెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. వాల్వో ప్రపంచంలోనే గుర్తింపు కలిగిన కంపెనీ. అటువంటి కంపెనీ రాష్ట్రానికి వస్తే భారీ ఎత్తున అనుబంధ పరిశ్రమలు తరలివచ్చే అవకాశం ఉంది.

* తడలో రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్..
ఇప్పటికే చిత్తూరు జిల్లా తడలో రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమ ఏర్పాటు కానుంది. దాదాపు రూ.2500 కోట్లతో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ప్రపంచ బ్రాండ్ ఆటోమొబైల్ దిగ్గజం. మొన్ననే రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. దీంతో వేలాదిమందికి ఉపాధి కూడా దొరకనుంది. రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం కూడా సమకూరనుంది. విశాఖను ఐటి హబ్ గా.. రాయలసీమను తయారీ రంగ పరిశ్రమలకు హబ్ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యూహంతో పని చేస్తోంది. అది వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది.

* ప్రపంచ ప్రఖ్యాత ఆటోమొబైల్ దిగ్గజం..
ప్రపంచ ప్రఖ్యాత ఆటోమొబైల్ దిగ్గజంగా వోల్వో ఉంది. ఈ కంపెనీ నుంచి అత్యాధునిక వాహనాలు ఉత్పత్తి అవుతుంటాయి. విడిభాగాల తయారీ కూడా జరుపుతూ ఉంటుంది ఈ సంస్థ. తమ నూతన కేంద్రాన్ని ఏపీలో పెట్టాలన్న ఆలోచన చేస్తోంది వాల్వో. రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమ ఏర్పాటుతో ఈ వోల్వో ఆలోచనలో పడింది. తమ ఆసక్తిని ఏపీ ప్రభుత్వానికి చెప్పింది. 250 ఎకరాల భూమితో పాటు సింగిల్ విండో అనుమతులు, కొన్ని రకాల రాయితీలు కోరుతోంది. అయితే భారీ పెట్టుబడులకు అవకాశం ఉండడంతో.. రాష్ట్ర ప్రభుత్వం సైతం అదే స్థాయిలో స్పందిస్తోంది. త్వరలో ఒప్పందాలు పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

జనసేన పై కులం ముద్ర.. తేల్చేసిన పవన్!

Janasena Central Cabinet
Janasena Central Cabinet

Janasena Party: పవన్ కళ్యాణ్ నిర్మోహమాటంగా చెప్పేశారు. పార్టీని సిద్ధాంత పరంగా నడుపుతానని.. ఇష్టం ఉన్నవారు ఉండండి.. లేకపోయినా వారు వెళ్ళిపొండి అంటూ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. సోమవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మనసు విప్పి మాట్లాడారు. జనసేన ను ఒక ప్రాంతానికి, ఒక కులానికి ఆపాదించవద్దు అని తేల్చి చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక పవన్ కళ్యాణ్ దృష్టికి చాలా అంశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా తెలిస్తే చాలు జనసేన అనేది కాపుల పార్టీగా ముద్ర వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జనసేన నేతలు కూడా అదే వైఖరితో ఉన్నారు. ఆ వైఖరి మూలంగా జనసేనతో పాటు పవన్ కళ్యాణ్ పై నమ్మకం ఉన్న ఇతర సామాజిక వర్గాలు సైతం సైడ్ అవుతున్నాయి. దానిని గుర్తించారు పవన్ కళ్యాణ్. అందుకే కులం అనే మాట వినిపించకుండా.. ఒక కులానికి మాత్రమే జనసేనను ఆపాదించకుండా చూడాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే నిన్న స్పష్టమైన ప్రకటన చేశారు.

* జనసేన చుట్టూ కథలు..
రాష్ట్రంలో కాపుల అంశంపై ఏది జరిగిన దానిని జనసేన చుట్టూ కథలు అల్లడం పరిపాటిగా మారింది. కేవలం పవన్ కళ్యాణ్ విషయంలో కాపుల వైఖరి మారినందునే ఇలా వారిని దూరం చేసేందుకు చాలా రకాల ప్రయత్నాలు జరిగాయి ఏపీలో. అయితే ఇదే జనసేన 2019 ఎన్నికల్లో ఉంది. అప్పుడు కూడా ఈ రాష్ట్రంలో కాపులు జనసేన వైపు కాకుండా వైసిపి వైపు చూశారు. ఆ పార్టీ వైఖరి నచ్చకపోవడం వల్లే కూటమి వైపు 2024 ఎన్నికల్లో టర్న్ అయ్యారు. అయితే ఇక్కడ కాపుల ముద్ర అనేది జనసేన వైపు వేయడం ప్రారంభించారు. కేవలం జనసేన ఎదగకుండా చేసేందుకు జరిగే ప్రయత్నం అది. అందులో భాగంగా ఇతర సామాజిక వర్గాలు జనసేన వైపు వెళ్లకుండా ఉండేందుకు వేసిన ఎత్తుగడ అది. దీనిని పవన్ కళ్యాణ్ గుర్తించారు కూడా. కులం మాటున జనసేన ను ఒక చట్రంలో పెట్టి ఎదగకుండా చేయాలి అనుకుంటే తాట తీస్తా అంటూ హెచ్చరించారు. అయితే ఈ హెచ్చరిక కేవలం రాజకీయ ప్రత్యర్థులకు మాత్రమే కాదు. జనసేనలో ఉండే నాయకులకు సైతం ఈ హెచ్చరిక అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నోరు తెరిస్తే చాలు కాపుల పేరుతో జనసేన పై రాజకీయం చేస్తున్నారు. గత పదేళ్ల కాలం పాటు దీనిని భరించారు పవన్ కళ్యాణ్. అందుకే ఆయనలో సహనం నశించి ఇప్పుడు గట్టిగానే బదులిస్తున్నారు.

* ఏది జరిగినా వివాదమే..
రాష్ట్రంలో కాపులకు ఏదైనా ఇబ్బంది కలిగితే జనసేనకు బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న కాపు నేతలు తప్పు చేస్తే దానిని సైతం తప్పుపడుతున్నారు. కేవలం జనసేన అంటే కాపుల పార్టీగా ముద్ర వేసే ప్రయత్నాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. వాటన్నింటినీ గమనించిన పవన్ కళ్యాణ్ గట్టిగానే నిన్న సంకేతాలు పంపారు. తమిళనాడులో విజయ్ పార్టీ పెడితే అన్ని కులాలు మద్దతు తెలిపాయని.. ఇక్కడ మాత్రం అటువంటి పరిస్థితి లేదని ఆవేదనతో అన్నారు. జనసేన శ్రేణులు సైతం ఈ విషయంలో తప్పు చేయవద్దు అని.. లేనిపోని కుల ప్రస్తావనలు తీసుకురావద్దని సంకేతాలు పంపారు పవన్.

వాటిని పూర్తి చేస్తేనే 'తల్లికి వందనం'

Thalliki Vandanam Scheme
Thalliki Vandanam Scheme

Thalliki Vandanam Scheme: ఏపీలో విద్యార్థుల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. పిల్లల చదువుకు గాను తల్లికి వందనం కింద 13 వేల రూపాయల చొప్పున సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 12న పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం తెరుచుకోనున్నాయి. ఆరోజు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత విద్యా సంవత్సరంలో కూడా తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నగదు సాయం అందింది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో సాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వేసవి సెలవుల అనంతరం జూన్ 12న పాఠశాలలు తెరుచుకొనున్నాయి. జూన్ 1న జూనియర్ కాలేజీలు తెరవనున్నారు. 12న తల్లికి వందనం నిధులు జమ చేయనున్నారు.

* ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి..
గత ఏడాది తల్లికి వందనం పథకాన్ని సమగ్రంగా అమలు చేశారు. అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నగదు సాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు గత ఏడాది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పథకాన్ని వర్తింపజేశారు. గరిష్టంగా ఐదుగురు పిల్లల వరకు లబ్ధి పొందిన వారు ఉన్నారు. అందుకే ఈ ఏడాది కూడా అలానే అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పథకానికి సంబంధించి అన్ని సన్నాహాలను పూర్తి చేసింది. ముందుగా జాబితాలను సచివాలయాల వారీగా పంపించనుంది. అటు తర్వాత విద్యాశాఖ దానిని సేకరించి నిధుల విడుదలకు నిర్ణయించింది.

* గత ఏడాది ఇబ్బందులు..
అయితే గత ఏడాది చాలామంది అర్హులు ఈ పథకానికి ఇబ్బంది పడ్డారు. ప్రధానంగా విద్యుత్తు 300 యూనిట్ల వినియోగం, బ్యాంకు ఖాతాతో ఆధార్ అనుసంధానం కాకపోవడం, మ్యాపింగ్ కాకపోవడం, బ్యాంకు ఖాతా యాక్టివ్ లేకపోవడం వంటి వాటితో చాలామంది పథకానికి దూరమయ్యారు. అటువంటి వారికి ఈ ఏడాది ముందుగానే అధికారులు హెచ్చరిస్తున్నారు. బ్యాంక్ ఖాతాతో ఆధార్ అనుసంధానం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎంపీసీఐ మ్యాపింగ్ కూడా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తప్పకుండా అవి చేస్తేనే తల్లికి వందనం దక్కుతుంది. ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ఇవన్నీ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఆ ఆస్తులు చిన్న అప్పన్నవా? వైవి సుబ్బారెడ్డివా?!

YV Subba Reddy PA Appanna
YV Subba Reddy PA Appanna

YV Subba Reddy PA Appanna: టీటీడీ తాత్కాలిక ఉద్యోగి చిన్న అప్పన్న అరెస్టు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. ఆయన ఒక్కప్పటి వైవి సుబ్బారెడ్డి పిఎ. ఏసీబీ అరెస్టుతో పాటు వందల కోట్ల ఆస్తుల డాక్యుమెంట్స్ లభ్యం కావడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. అసలు చిన్న అప్పన్న ఎవరో తనకు తెలియదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు వైవి సుబ్బారెడ్డి. కానీ ఇప్పుడు ఒక తాత్కాలిక ఉద్యోగి ఖాతాల్లో నగదు, ఆయన పేరుతో వందల కోట్ల రూపాయల ఆస్తులు చూస్తుంటే ఆయన వెనుక ఉన్న పెద్ద తలకాయ ఎవరు అని ఇట్టే తెలిసిపోతుంది. టిటిడి నెయ్యి కుంభకోణానికి సంబంధించి చిన్న అప్పన్న పేరు తెరపైకి వచ్చింది. ఆయనకు నెయ్యి సరఫరా చేసే సంస్థల ప్రతినిధులకు మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. అలా చిన్న అప్పన్న తెరపైకి రాగా ఇప్పుడు ఏసీబీ ఆయనను అరెస్ట్ చేసింది.

* ఉత్తరాంధ్ర మొత్తం ఆయనదే..
వై వి సుబ్బారెడ్డి కేవలం టిటిడి అధ్యక్షుడి గానే ఉండలేదు. రాజ్యసభ సభ్యుడిగా, ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గా కూడా వ్యవహరించారు. స్వయానా జగన్మోహన్ రెడ్డి బాబాయి కావడంతో ఒక అధికార శక్తిగా మారారు. అప్పటివరకు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న విజయసాయిరెడ్డిని తోసేసి మరి ఆయన కోఆర్డినేటర్ పదవిని దక్కించుకున్నారు. ఆ సమయంలోనే ప్రభుత్వ భూముల కేటాయింపులు,, ల్యాండ్ సెటిల్మెంట్స్, ప్రైవేటు ఆస్తుల దురాక్రమణ వంటి వాటికి వత్తాసు పలికారు అన్న ఆరోపణలు ఉన్నాయి. విశాఖ నగరంలో ప్రైమ్ కార్నర్ లో ఆస్తులు, బీచ్ రోడ్డులో భూములు ఇలా అన్నింటినీ కొల్లగొట్టారు అన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. లోకల్ మీడియా సైతం దీనిపై పెద్ద ఎత్తున కథనాలను ప్రచురించింది.

* అంతా బినామీ పర్వం..
అయితే ఓ సాధారణ టీటీడీ తాత్కాలిక ఉద్యోగి ఇంతలా సంపాదన వెనుక.. అస్సలు లీగల్ కనిపించడం లేదు. పెద్ద ఎత్తున బినామీ పర్వం నడిచినట్లు స్పష్టం అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్న అప్పన్న ఆస్తులు ఆయనకు కూడా తెలియనంతగా బినామీగా మారిపోయినట్లు స్పష్టం అవుతోంది. కేవలం ఆయన ఒక్కరు మాత్రమే కాదు కుటుంబ సభ్యుల పేరుతో సైతం పెద్ద ఎత్తున ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. చిన్న అప్పన్న ఆస్తులు వెనుక ఉన్నది వైవి సుబ్బారెడ్డి అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు చిన్న అప్పన్నను అరెస్టు చేయడమే కాదు.. ఈ అక్రమ సంపాదన వెనుక ఉన్న అసలు గుట్టును బయట పెట్టాల్సిన అవసరం ఉంది.

పవన్ సరే.. బిజెపి సంగతేంటి!?

Pawan Kalyan And BJP
Pawan Kalyan And BJP

Pawan Kalyan And BJP: ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవహారంపై స్పందించారు పవన్ కళ్యాణ్. అమిత్ షా లాంటి గొప్ప వ్యక్తిని కలిసినప్పుడు అరెస్టులు గురించి ప్రస్తావిస్తామా? అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అంతటి పెద్దలను కలిసి విన్నవిస్తే.. ఇలా విశ్లేషించడం ఏంటని గట్టిగానే నిలదీశారు పవన్ కళ్యాణ్. అయితే ఇంతటి నిందారోపణలు పవన్ పై రాగా.. బిజెపి వ్యూహాత్మక మౌనం పాటించడం మాత్రం కూటమి ధర్మానికి విఘాతం కలిగిస్తోంది. తిరిగి బిజెపి పైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బిజెపి సైలెన్స్ ఎంతలా అంటే.. వైసిపి విషయంలో సాఫ్ట్ కార్నర్ అన్నట్టు ప్రజల్లోకి సంకేతాలు వెళ్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్ పై కూటమిలోని రెండు పార్టీలు గట్టిగా నిలదీస్తుండగా.. బిజెపి మాత్రం మౌనం వహిస్తోంది.

* ఆది నుంచి సాఫ్ట్ కార్నర్..
ఆది నుంచి బిజెపి వైయస్సార్ కాంగ్రెస్ విషయంలో సాఫ్ట్ కార్నర్ తో ఉందన్న టాక్ ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా దానిని బాగా హైలైట్ చేస్తోంది. తద్వారా తప్పనిసరి పరిస్థితుల్లోనే బిజెపి టిడిపి తో కలిసిందని.. అవసరమైన పక్షంలో వైసీపీ నుంచి పరస్పర రాజకీయ ప్రయోజనాలు అందుకునేందుకు సిద్ధంగా ఉందని ప్రచారం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో బిజెపి ఉదాసీనంగా ఉందని చెప్పడానికి ఆయన బెయిల్ రద్దు, వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో జాప్యం వంటి వాటిని ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు విశ్లేషకులు. ఈ క్రమంలోనే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏకంగా పవన్ కళ్యాణ్ పై బాంబు పేల్చారు. అందుకు జనసేనతో పాటు పవన్ రియాక్ట్ అయ్యారు. కానీ టిడిపి విషయంలో బిజెపి ఆలోచన అది అని.. జగన్మోహన్ రెడ్డి శాశ్వత మిత్రుడు బిజెపి కని చెప్పారు ప్రొఫెసర్ నాగేశ్వర్. దానిని ఖండించాల్సిన అవసరం బిజెపికి ఉంది. లేకుంటే అదే నిజం అని జనాలు నమ్మక తప్పదు.

* తెలంగాణ బిజెపి నేత సమర్ధన..
ప్రొఫెసర్ నాగేశ్వర్ కమ్యూనిస్టు భావజాలం ఉన్న వ్యక్తి. పైగా ఆధారాలు లేకుండా బిజెపి అగ్రనేత ఆదేశాలు అన్నట్టు మాట్లాడారు. దానిని ఖండించాల్సిన బీజేపీ నేతలు ఇప్పుడు అదే నాగేశ్వర్ ను సమర్ధిస్తున్నారు. తెలంగాణ బిజెపి నేత మురళీధర్ రావు ప్రొఫెసర్ నాగేశ్వర్ మంచి విశ్లేషకుడు అన్నట్టు కితాబు ఇచ్చారు. ఆయన తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న తర్వాత కూడా పోలీస్ కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. దీంతో నాగేశ్వర్ చెప్పింది నిజమే అన్నట్టు సంకేతాలు ఇచ్చారు. అయితే ఆది నుంచి బిజెపి విధానం ఇదే. ఏపీతో వింత రాజకీయం ఆడుతోంది. ఇక్కడున్న రాజకీయ పరిస్థితులకు తగ్గట్టు వ్యవహరించి రాజకీయ లబ్ధి పొందుతోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్లో మాత్రం బిజెపి వైఖరి ఇప్పుడు అంతటా చర్చ నడుస్తోంది.

ఇజ్రాయెల్‌ సాహసం... న్యూక్లియర్‌ ముప్పును దూరం చేసిన ఆపరేషన్‌ ఒపెరా!

Israel Operation Opera
Israel Operation Opera

Israel Operation Opera: ఒక అనివార్య నిర్ణయం1981 జూన్‌ 7న మధ్యాహ్నం ఎండ మండుతున్న సమయంలో ఇరాక్‌ రాజధాని భాగ్దాద్‌కు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓసిరాక్‌ న్యూక్లియర్‌ రియాక్టర్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దళం చేసిన దాడి ప్రపంచ చరిత్రలో ఒక మలుపుగా నిలిచింది. సద్దాం హుస్సేన్‌ తన ‘‘న్యూక్లియర్‌ డ్రీమ్‌’’ను సాకారం చేసుకోవాలని కలలు కంటున్న సమయంలో ఇజ్రాయెల్‌ ఆ కలను ఒక్క దాడితో చెరిపేసింది. ఇది కేవలం సైనిక ఆపరేషన్‌ కాదు.. ఇజ్రాయెల్‌ ఉనికి ప్రశ్నార్థకం చేసే అణు బెదిరింపును అడ్డుకున్న సాహసం. 1948లో ఇజ్రాయెల్‌ ఏర్పాటు నుంచి చుట్టుపక్కల దేశాలు (ఇరాక్, ఇరాన్, జోర్డాన్, లెబనాన్‌) దాడులు చేస్తూనే ఉన్నాయి. 1967 సిక్స్‌ డే యుద్ధం, 1973 యోమ్‌ కిప్పూర్‌ యుద్ధాలు ఇజ్రాయెల్‌ను బలపరిచినా, ఒక దేశం అణు శక్తి సాధిస్తే తమ మనుగడే ప్రమాదంలో పడుతుందని ఇజ్రాయెల్‌ నాయకులు గుర్తించారు.

న్యూక్లియర్‌ వెపన్‌పై ఇరాక్‌ దృష్టి..
ఇరాక్‌ 1960ల చివరి నుంచి న్యూక్లియర్‌ కార్యక్రమం మొదలుపెట్టింది. సోవియట్‌ యూనియన్‌ సహాయం తర్వాత ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్రాన్స్‌ 72 కిలోల హైలీ ఎన్‌రిచ్‌డ్‌ యురేనియం సరఫరా చేసింది. సద్దాం దీన్ని ‘‘సివిలియన్‌’’ ప్రాజెక్ట్‌గా చూపించినా, అతని ఉద్దేశం న్యూక్లియర్‌ ఆయుధాలు తయారు చేయడమేనని మొసాద్‌ ఇంటెలిజెన్స్‌ స్పష్టంగా గుర్తించింది.

మొసాద్‌ మెలకువలు..
1970ల చివరి నుంచి మొసాద్‌ ఇరాక్‌ కదలికలను బద్దలు చేసింది. ఇరాక్‌ సైంటిస్టులపై హత్యాదాడులు, రహస్య సమాచార సేకరణ ద్వారా రియాక్టర్‌ 1981 జూలై నాటికి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని తెలిసింది. 1980లో ఇరాన్‌–ఇరాక్‌ యుద్ధం మొదలై ఇరాన్‌ విమానాలు రియాక్టర్‌పై దాడి చేయడం ఇజ్రాయెల్‌కు అదనపు సమాచారం అందించింది. అమెరికా శాటిలైట్‌ చిత్రాలు, చైనా నుంచి వచ్చిన సమాచారంతో ఇరాక్‌ రక్షణ వ్యవస్థలు ఇజ్రాయెల్‌కు ‘‘ఓపెన్‌ బుక్‌’’లా మారాయి. 1,600 కిలోమీటర్ల దూరం ప్రయాణం ఇజ్రాయెల్‌ విమానాలకు పెద్ద సవాల్‌. అమెరికా సరఫరా చేసిన ఎఫ్‌–16 ఫైటర్‌ బాంబర్లు, ఎఫ్‌–15 ఎస్కార్ట్‌ విమానాలు, అదనపు ఫ్యూయల్‌ ట్యాంకులు, ఎయిర్‌ రీఫ్యూలింగ్‌ సాంకేతికతలతో ఈ సవాలును అధిగమించారు. విమానాలు ఇజ్రాయెల్‌–జోర్డాన్‌ సరిహద్దు మీదుగా, జోర్డాన్, సౌదీ అరేబియా గాలిమార్గాల గుండా రహస్యంగా వెళ్లాలని ప్రణాళిక వేశారు.

కీలక దాడికి సన్నద్ధం..
శుక్రవారం (జూన్‌ 7, 1981) ఎంచుకోవడానికి కారణం – అక్కడ పనులు తక్కువగా ఉండటం. సాయంత్రం 6:30 గంటలకు ఎనిమిది ఎఫ్‌–16లు 16 బాంబులు వేశాయి. 14 బాంబులు లక్ష్యాన్ని కచ్చితంగా కొట్టాయి. భారీ పేలుడుతో రియాక్టర్‌ కాంక్రీట్‌ డోమ్‌ కూలిపోయింది. దాడిలో 10 ఇరాక్‌ సైనికులు, ఒక ఫ్రెంచ్‌ ఇంజినీర్‌ మరణించారు. ఇజ్రాయెల్‌ విమానాలు ఒక్కటి కూడా నష్టపోకుండా సురక్షితంగా తిరిగి వచ్చాయి. జోర్డాన్‌ రాజు విమానాలను గుర్తించి హెచ్చరిక ఇవ్వడానికి ప్రయత్నించినా, ఇజ్రాయెల్‌ కమ్యూనికేషన్‌ జామింగ్‌తో అది విఫలమైంది. ప్రధాని మెనాచెమ్‌ బెగిన్‌ నాయకత్వంలో ఈ ఆపరేషన్‌కు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. ఇది ‘‘బెగిన్‌ డాక్ట్రిన్‌’’కు మొదటి ప్రయోగం – ఇజ్రాయెల్‌ శత్రువులు అణు ఆయుధాలు సాధించకుండా అడ్డుకోవాలన్న సూత్రం.

అంతర్జాతీయ ప్రతిచర్య…
దాడి తర్వాత ఇజ్రాయెల్‌ ప్రపంచం నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఖండించింది. అమెరికా సైతం తొలుత తీవ్రంగా స్పందించి ఎఫ్‌–16ల డెలివరీలు సస్పెండ్‌ చేసింది. మీడియా దీన్ని ‘‘స్టేట్‌ స్పాన్సర్డ్‌ టెర్రరిజం’’ అని విశేషించింది. కానీ ఇజ్రాయెల్‌ ‘‘మా ఉనికి ప్రమాదంలో ఉన్నప్పుడు అంతర్జాతీయ చట్టాల కంటే మా భద్రత ముఖ్యం.’’దీర్ఘకాలికంగా చూస్తే ఈ దాడి ఇరాక్‌ న్యూక్లియర్‌ కార్యక్రమాన్ని కనీసం ఒక దశాబ్దం వెనక్కి నెట్టింది. అయితే కొందరు విశ్లేషకుల ప్రకారం ఇది సద్దాంను రహస్య యురేనియం ఎన్‌రిచ్‌మెంట్‌ కార్యక్రమం వైపు మళ్లించి, అతని న్యూక్లియర్‌ ఆకాంక్షలను మరింత బలపరచింది. 1991 గల్ఫ్‌ యుద్ధంలో మళ్లీ దాడులు జరగకపోతే ఇరాక్‌ అణు ఆయుధాలు తయారు చేసేవాడని కొందరు అంటారు.

ఆపరేషన్‌ ఒపెరా ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్, సైనిక సామర్థ్యం, ధైర్య సాహసానికి ఉదాహరణ. ఇరాన్‌ న్యూక్లియర్‌ కార్యక్రమం మళ్లీ చర్చనీయాంశమవుతున్న నేటి కాలంలో ఈ ఘటన మరింత ప్రాసంగికమవుతోంది. శత్రువు అణు శక్తి సాధించే ముందే చర్య తీసుకోవాలా? దాని ఫలితాలు ఏమిటి? ఈ ప్రశ్నలు ఇప్పటికీ ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఆపరేషన్‌ ఒపెరా ఒక విషయం స్పష్టం చేసింది.. ఇజ్రాయెల్‌ తన ఉనికి కోసం ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధమని. ఆ ధైర్యం ఈరోజు కూడా మధ్యప్రాచ్య సమీకరణాలను నిర్దేశిస్తోంది.

బాలయ్య ఆ ఒక్క కారణం వల్లే వివేక్ ఆత్రేయ మూవీని రిజెక్ట్ చేశారా..?

Balakrishna
Balakrishna

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు రీసెంట్ గా చేసిన సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘అఖండ 2’ సినిమా తీవ్రంగా నిరాశపర్చినప్పటికి ఆయన చేసిన సినిమాలన్నీ వేరే రేంజ్ లో ఉంటాయని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక బాలయ్య నుంచి వచ్చే ప్రతి మాస్ సినిమాను ప్రేక్షకులు విశేషంగా ఎంజాయ్ చేసే అవకాశాలైతే పుష్కలంగా ఉంటాయి… ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా ‘కొరటాల శివ’ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు.

ఇక ఇప్పటికే ఈ రెండు సినిమాల మీద బాలయ్య బాబు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో బాలయ్య బాబు సినిమా ఉంటుందని గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. కానీ బాలయ్య మాత్రం వివేక్ ఆత్రేయ సినిమాను పక్కన పెట్టేసినట్టుగా తెలుస్తుంది. కారణమేంటంటే వివేక్ రాసిన కథ బాగున్నప్పటికి అది భారీ బడ్జెట్ తో కూడుకున్నదిగా తెలుస్తుంది.

దానివల్ల బాలయ్య మార్కెట్ కి మించి బడ్జెట్ పెట్టడం అంటే చాలా కష్టతరమైన విషయం…అందువల్లే బాలయ్యే కావాలని దాని బడ్జెట్ ను తగ్గిస్తే తగ్గించండి లేకపోతే ప్రాజెక్ట్ చేసే అవకాశం లేదని చెప్పేశారట. దాంతో వివేక్ ఫ్యూచర్లో బడ్జెట్ ను తగ్గించి బాలయ్యతో సినిమా చేస్తాడా? లేదంటే ఇతర హీరోలతో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది…

ఇక వివేక్ ఆత్రేయ ఇంతకు ముందు మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి, సరిపోదు శనివారం లాంటి సినిమాలు చేశాడు. ఈ సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సాధించడంతో దర్శకుడిగా వివేక్ కి మంచి గుర్తింపైతే లభించింది. తన నుంచి సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అలాంటి దర్శకుడు ఇప్పుడు బాలయ్య బాబుతో సినిమా చేసి మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంటాడా? లేదంటే ఇతర హీరోల వైపు మొగ్గు చూపుతాడా అనేది తెలియాల్సి ఉంది…

అంతే.. పాకిస్తాన్ లో పుట్టినందుకు అనుభవించండి

Pakistan Crisis
Pakistan Crisis

Pakistan Crisis: ఏ దేశ ప్రజల కైనా సరే తమ సొంత గడ్డ ఒక అస్తిత్వంగా నిలుస్తూ ఉంటుంది. దాని ఆధారంగానే వారికి ప్రపంచంలో గౌరవం లభిస్తుంది. ఆఫ్రికా నుంచి మొదలు పెడితే ఆసియా వరకు అన్ని దేశాల ప్రజలకు ఇదే వర్తిస్తుంది. కానీ ఒక పాకిస్తాన్ ప్రజలకు తప్ప.

వారు చేసుకున్న దురదృష్టమేంటో తెలియదు. వారు చేసిన పాపం ఏంటో కూడా తెలియదు. ఆ దేశంలో పుట్టడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వారి మీద ఎవరికీ పాజిటివ్ ఒపీనియన్ ఉండదు. ఏ దేశం కూడా వారిని మనుషుల్లాగా చూడదు. వారు వచ్చారంటే చాలు చీడపురుగుల మాదిరిగా చూస్తూ ఉంటుంది. ఇలాంటి హేళనలు వాళ్ళు భరిస్తూనే ఉన్నారు. పంటికింద ఆ బాధను అదిమి పెడుతూనే ఉన్నారు. అయినప్పటికీ వారి దేశం మీద ఉన్న అపప్రద తొలగిపోవడం లేదు. పైగా ఉగ్రవాదులతో అంటకాగడం వల్ల ఆ దేశానికి అంతకుమించిన స్థాయిలో చెడ్డ పేరు వస్తోంది.

అక్కడి పాలకులు.. ఉగ్రవాద సంస్థల నిర్వాహకులు కలిసి పోవడం వల్ల ఈ దుస్థితి దాపురించింది. చివరికి ముస్లిం దేశాలు కూడా పాకిస్తాన్ అంటేనే ఛీ కొడుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ దేశ ప్రజలను యూఏఈ తరిమి తరిమి కొడుతోంది. ఇటీవల అమెరికాకు యూఏఈ సైనిక స్థావరాల ఏర్పాటు కోసం అవకాశం కల్పించింది.. దీనిని మనసులో పెట్టుకున్న ఇరాన్ యూఏఈ మీద దాడులు చేసింది. అయితే ఇరాన్ దేశానికి సమాచారం అందించింది తమ దేశంలో ఉన్న పాకిస్తాన్ షియాలు అని యూఏఈ అనుమానించింది. అంతేకాదు విచారణ కూడా మొదలుపెట్టింది. ఆ విచారణలో తాము అనుమానిస్తున్నది నిజమేనని తేలింది. దీంతో అప్పటినుంచి యూఏఈ ఆపరేషన్ మొదలుపెట్టింది. తమ దేశంలో ఉంటున్న పాకిస్తాన్ ముస్లింలను వెనక్కి పంపిస్తోంది. కనీసం వాళ్ళ ఆస్తులు.. సేవింగ్స్.. ఇంటి లగేజ్ కూడా ఇవ్వకుండా కట్టుబట్టలతో పాకిస్తాన్ పంపిస్తోంది.. షియా ముస్లింలుగా తాము పుట్టడమే నేరమా అంటూ అక్కడివారు విలపిస్తున్నారు. షియా ముస్లింలు ఇరాన్ దేశానికి భారీగా ఫండింగ్ చేస్తున్నారని.. తమ దేశంలో ఉంటూ.. ఇరాన్ దేశానికి సపోర్ట్ చేస్తున్నారని యూఏఈ ఆరోపిస్తోంది.

యూఏఈ ఇటీవల పాకిస్తాన్ దేశానికి ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసింది. దీంతో గల్ఫ్ దేశాల వద్ద బిచ్చమెత్తుకొని పాకిస్తాన్ ఆ అప్పు చెల్లించింది. ఆ అప్పు తీరిన తర్వాత యూఏఈ తమ దేశంలో స్థిరపడిన పాకిస్తాన్ దేశీయులను తరిమి తరిమికొడుతోంది. అంతేకాదు అవసరమైతే పాకిస్తాన్ దేశంతో యుద్ధం చేసేందుకు కూడా సిద్ధంగా ఉంది. ఇటీవల కాలంలో పాకిస్తాన్ రకరకాల విన్యాసాలు చేస్తోంది. గోడ మీది పిల్లి వాటం లాగా ప్రయత్నాలు చేస్తోంది. ఇది యూఏఈ కి కంటగింపుగా మారింది. అందువల్లే ఈ స్థాయిలో పాకిస్తాన్ మీద రివెంజ్ తీర్చుకుంటున్నది. తమ దేశస్తులను బయటికి వెళ్లగొడుతున్నప్పటికీ ఇంతవరకు పాకిస్తాన్ పరిపాలకులు మాట్లాడటం లేదంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరోవైపు ఇటీవల మనదేశ విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ యూఏఈ లో పర్యటించారు. అనేక రకాల ఒప్పందాలు కుదుర్చుకున్నారు.. ముఖ్యంగా చమురు రంగంలో భారీగా పెట్టుబడులను ఆహ్వానించారు. దానికి యూఏఈ నుంచి కూడా సానుకూల స్పందన వచ్చింది. ఇది ఒక రకంగా పాకిస్తాన్ దేశానికి చెంప పెట్టు లాంటిది. అంతర్జాతీయ అవసరాలు.. ఇంకా అనేక రకాల పరిణామాల నేపథ్యంలో భారత్ సరికొత్త వాణిజ్య సూత్రాలను అమలు చేస్తోంది. అందులో భాగమే యూఏఈ తో స్నేహం. స్థూలంగా చెప్పాలంటే శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అన్నట్టు.

క్వాలిఫైయర్ సమరం.. జిటి వర్సెస్ ఆర్సిబి.. గెలిచేది ఎవరంటే..

GT Vs RCB Qualifier
GT Vs RCB Qualifier

GT Vs RCB Qualifier: ఐపీఎల్ లో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు లీగ్ దశలో అత్యుత్తమ ప్రతిభ చూపించిన జట్లు ప్లే ఆఫ్ దశకు వచ్చేసాయి. ప్లే ఆఫ్ దశలో తొలి సమరం మంగళవారం నుంచి మొదలు కాబోతోంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న బెంగళూరు, గుజరాత్ జట్లు తలబడబోతున్నాయి.

డిపెండింగ్ ఛాంపియన్గా బెంగళూరు కొనసాగుతుండగా.. సంచలనజట్టుగా గుజరాత్ రంగంలోకి దిగుతోంది. ఈ రెండు జట్లు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. రెండు జట్లలో సమఉజ్జీలైన ప్లేయర్లు ఉన్నారు.. గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్ 638, గిల్ 616 పరుగులు చేశారు. వీరిద్దరూ భీకరమైన ఫామ్ లో ఉన్నారు. అంతేకాదు ఆరెంజ్ క్యాప్ విభాగంలో తొలి రెండు స్థానాలలో ఉన్నారు. బట్టల కూడా 469 పరుగులతో తిరుగులేని స్థాయిలో ఉన్నాడు. వీరు ముగ్గురు గనుక అదరగొడితే గుజరాత్ జట్టుకు అడ్డు అనేది ఉండదు. బౌలింగ్లో కూడా గుజరాత్ అత్యంత పటిష్టంగా ఉంది. 24 వికెట్లు పడగొట్టి రబాడ పర్పుల్ క్యాప్ విభాగంలో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. సిరాజ్ 17 వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్ 19 వికెట్లతో, ప్రసిద్ధి కృష్ణ 14 వికెట్లతో తిరుగులేని స్థాయిలో ఉన్నారు. లీగ్ దశలో చివరి మ్యాచ్లో చెన్నై జట్టును గుజరాత్ 89 పరుగులు తేడాతో ఓడించింది.

ఇక బెంగళూరు ఈ సీజన్లో 14 మ్యాచ్లలో 9 విజయాలు సాధించింది. ఈ సీజన్లో ఒక సందర్భంలో రెండు మ్యాచ్ లలో ఓటమి పాలయింది. మరోవైపు గుజరాత్ ఫస్ట్ హాఫ్ లో ఇబ్బంది పడినప్పటికీ.. సెకండ్ హాఫ్ లో సత్తా చూపించింది. తొలి ఏడు మ్యాచ్లలో నాలుగింట్లో ఓడిపోయింది. ఆ తర్వాత ఏడు మ్యాచ్లలో ఆరు గెలిచింది. పాయింట్లు పట్టికలో రెండవ స్థానంలోకి వచ్చింది. విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, పాటిధార్, సాల్ట్, పడికల్, కృనాల్ పాండ్యా వంటి ప్లేయర్లతో బెంగళూరు భీకరంగా కనిపిస్తోంది.

ఈ రెండు జట్లు సమఉజ్జీలు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకు ఐపీఎల్లో 8 సార్లు తలపడ్డాయి. చెరి 4 సార్లు విజయం సాధించాయి. ఈ సీజన్లో రెండుసార్లు ఈ జట్లు పోటీపడ్డాయి. ఏప్రిల్ 24 న జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఏప్రిల్ 30న జిటి మూడు వికెట్ల తేడాతో బెంగళూరు మీద గెలిచింది.. మంగళవారం జరిగే పోరు రెండు జట్ల మధ్య హోరాహోరీగా ఉంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు.. పైగా రెండు జట్లలో భీకరమైన ప్లేయర్లు ఉన్నారు.

మ్యాచ్ జరిగే ధర్మశాల పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ వేదిక మీద ఇప్పటివరకు రెండు మ్యాచ్లు జరిగాయి. రెండు సందర్భాల్లో కూడా టార్గెట్ ఫినిష్ చేసిన జట్లు మాత్రమే విజయాలు సాధించాయి. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

విజయ్ మరో సంచలనం.. తమిళనాడు పాలిటిక్స్ బాక్సాఫీస్ బద్దలు

CM Vijay
CM Vijay

CM Vijay: సాధారణంగా విజయ్ సినిమాలు విడుదలయితే తమిళనాడులో సరికొత్త రికార్డులు నమోదవుతాయి. బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త వసూళ్లు సాధ్యమవుతాయి. కానీ, రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ కి వచ్చిన తర్వాత.. ముఖ్యమంత్రిగా మారిపోయిన తర్వాత విజయ్ తన స్టైల్ పూర్తిగా చేంజ్ చేసుకున్నారు. మేకోవర్ నుంచి మొదలు పెడితే పాలిటిక్స్ వరకు అన్నిట్లో గేమ్ చేంజింగ్ పర్సన్ అయిపోయారు.

తమిళనాడులో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు విజయ్ ని మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి. విజయ్ ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా కోయంబత్తూరు బాలిక ఘటనలో విజయ్ స్పందించిన తీరు యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. క్షణాల్లో విజయ్ తీసుకున్న నిర్ణయం బాలిక కుటుంబానికి న్యాయం చేసింది. అంతేకాదు ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు జైలు పాలయ్యేలా చేసింది.. ఇలా చెప్పుకుంటూ పోతే విజయ్ చేస్తున్న పరిపాలన.. తీసుకుంటున్న నిర్ణయాలు అచ్చం సినిమాల మాదిరిగానే ఉన్నాయి.

తాజాగా విజయ్ తన రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పారు.. వారందరి సంక్షేమమే తన ధ్యేయమని స్పష్టం చేశారు. రైతులకు సంబంధించిన 50 వేల వరకు రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్టు విజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. సాకార బ్యాంకులో గత ఏడాది మే 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు రుణాలు తీసుకున్న వారందరికీ ఇది వర్తిస్తుందని విజయ్ స్పష్టం చేశారు.

ఇంతటితోనే విజయ్ ఆగిపోలేదు. లక్ష రూపాయలు, అంతకు పైన రుణాలను ఐదు విభాగాలుగా విభజించి.. 20000, 15000, 10000, 5000 చొప్పున రుణాలను మాఫీ చేస్తున్నట్టు విజయ్ ప్రకటించారు. తద్వారా రైతుల మీద ఉన్న రుణ భారాన్ని తగ్గిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. తమిళనాడు రైతులకు విజయ్ తీసుకున్న నిర్ణయం ఎంతగానో ఉపయోగకరంగా ఉండనుంది. అంతేకాదు వారికి వ్యవసాయంలో మెరుగైన ఉత్పత్తి సాధించడానికి.. దోహదం చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇటీవల డిఎంకె అధినేత స్టాలిన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విజయ్ ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా.. నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అయితే వీటిపై విజయ్ ఇంతవరకు స్పందించలేదు. కేవలం తన చేతల ద్వారా మాత్రమే స్టాలిన్ వ్యాఖ్యలకు సమాధానం చెబుతున్నారు. అన్నట్టుగానే ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. తద్వారా తాను మాటల ముఖ్యమంత్రిని కాదని.. చేతల ముఖ్యమంత్రినని నిరూపించుకుంటున్నారు విజయ్.

డ్యామేజ్ కంట్రోల్ లో వైసిపి!

YSRCP Damage Control
YSRCP Damage Control

YSRCP Damage Control: కడపలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ కంట్రోల్ కు దిగింది. వైయస్ కుటుంబం పై జరుగుతున్న దాడిపై తొలిసారిగా ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. ఇటీవల జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తన తాత హత్య గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. తన తాతను చంపిన వారిని సైతం తాను ఏం చేయకుండా విడిచిపెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పటినుంచి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అయ్యారు. గతంలో ఏం జరిగింది? వైయస్ రాజారెడ్డి పరిస్థితి ఏంటి? రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితం వెనుక జరిగిన కథలు? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు.. వారి స్వభావాల గురించి రకరకాల కథనాలు వచ్చాయి. వరుసగా బీటెక్ రవి, పార్థసారధి రెడ్డి లాంటి వారు స్టేట్మెంట్లు ఇచ్చారు. సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో చర్చకు దారితీసాయి. కానీ ఒక్కరంటే ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా దీనిపై స్పందించలేదు.

* ఒక్కరూ నోరు తెరవలే..
కడప జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. కడప జిల్లా వ్యవహారాలను ఎంపీ అవినాష్ రెడ్డి చూస్తున్నారు. పెద్ద ఎత్తున నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. కానీ వైయస్ కుటుంబం పై వచ్చిన విమర్శలపై ఎవరూ స్పందించలేదు. దీంతో ఇదంతా నిజమే అన్నట్టు ప్రచారంలోకి వెళ్ళింది. దీంతో డ్యామేజ్ కంట్రోల్లోకి దిగింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. పార్టీ హై కమాండ్ నుంచి కడప జిల్లా వైసీపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఈ అంశంలో ఎందుకు వెనుకబడ్డారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

* అవినాష్ రెడ్డి ఘాటు స్పందన..
అయితే సాధారణంగా పెద్దగా మాట్లాడరు వైయస్ అవినాష్ రెడ్డి. హై కమాండ్ నుంచి ఏం ఆదేశాలు వచ్చాయో తెలియదు కానీ.. వైయస్ కుటుంబం పై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు. బీటెక్ రవి పై విరుచుకుపడ్డారు. నువ్వెంత నీ బతుకు ఎంత అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయేందుకు సిద్ధపడ్డావని.. ఇప్పుడు అదే వైసీపీని కొనుగోలు చేసే స్థాయికి చేరావంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అవినాష్ రెడ్డి. డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగానే అవినాష్ రెడ్డి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడకపోవడం లోటు. ఇకనుంచి వరుసగా వైసీపీ నేతలు రంగంలోకి దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

పెద్ది క్లైమాక్స్ ట్విస్ట్ తెలిసిపోయింది... ఏంటి బుచ్చిబాబు నీ పైత్యం...

Peddi Movie Climax Twist
Peddi Movie Climax Twist

Peddi Movie Climax Twist: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాతో ఎలాగైనా సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్న రామ్ చరణ్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ అభిమానులు సైతం ఈ సినిమా కోసం వేయి కండ్లతో వెయిట్ చేస్తున్నారు. కారణం ఏంటి అంటే ఇంతకుముందు వచ్చిన గేమ్ చేంజర్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. కాబట్టి పాన్ ఇండియాలో తన తోటి హీరోలు అందరు ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో రామ్ చరణ్ మాత్రం కొంతవరకు వెనుకబడ్డాడు. ఇక పెద్ది సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి చూపించడానికి రామ్ చరణ్ రెడీ అవుతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి… ఇక రీసెంట్ గా పెద్ది మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ మూవీలో పెద్ది క్యారెక్టర్ చేస్తున్న రామ్ చరణ్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. క్రికెటర్ గా, కుస్తీ ఫైటర్ గా, రన్నర్ గా కనిపిస్తాడట. అయితే క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుందని బుచ్చిబాబు రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో క్లారిటి ఇచ్చాడు. ఇంతకీ అంత ఎమోషనల్ గా ఉండే సన్నివేశాలు సినిమాలో ఏముంటాయి. అనే ధోరణిలో ఇప్పటికే ప్రేక్షకులైతే ఆలోచిస్తున్నారు. నిజానికి రామ్ చరణ్ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ తో ముందుకు తీసుకెళ్లాడట. మరి ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ చివర్లో రన్నింగ్ రేస్ చేసేటప్పుడు తన రెండు కాళ్లు పోతాయట.

ఆర్టిఫీషియల్ కాళ్లను పెట్టుకొని ఆయన రన్నింగ్ రేస్ లో పాల్గొని గెలవడం అనేది సినిమా మొత్తానికి హైలెట్ గా నిలుస్తుందని చెబుతున్నాడు. ఇదంతా చూసిన జనాలు ‘ఉప్పెన’ సినిమాలో హీరోకి ఒక పర్సనల్ పార్ట్ ని కట్ చేశారు. ఇక పెద్ది సినిమాలో హీరో కాళ్లు తీసేశారు.

ఇలా హీరోకి ఏదో ఒకటి తీసేయకుండా బుచ్చిబాబు కథ రాసుకోలేడా? ఎందుకని ఆయన అలా బాడీ పార్ట్స్ తీసేస్తున్నాడు. దాని వల్లే ఎమోషన్ వర్కౌట్ అవుతుంది అని భావిస్తున్నాడా అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఇంకొంత మంది బుచ్చిబాబు ఇకనైనా తన పైత్యం ఆపేసే సినిమా ని కమర్షియల్ హీరోని చాలా హానెస్ట్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.

అంతేతప్ప ఇలాంటివి పెట్టుకొని ఎమోషనల్ గా కనెక్ట్ చేయడం అనేది అన్నివేళలా వర్కౌట్ అవ్వకపోవచ్చు…కొన్నిసార్లు బోల్తా కూడా కొట్టొచ్చు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ తన కాళ్లు లేకుండా రన్నింగ్ రేస్ లో ఎలా పాల్గొన్నాడు ఎలా విజయం సాధించాడనేది ఈ సినిమా క్లైమాక్స్ గా తెలుస్తుంది…

చిరంజీవి కొడుకు టాప్ హీరో అయ్యాడు.. మరి బాలయ్య కొడుకు ఏం అవుతాడు...

Balakrishna Vs Chiranjeevi
Balakrishna Vs Chiranjeevi

Chiranjeevi Vs Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి – బాలయ్య బాబు మధ్య విపరీతమైన పోటీ ఉన్న విషయం మనకు తెలిసిందే. గత 50 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నప్పటికి ఎవరు ఎవరి పైన పై సాధిస్తారనే విషయంలో వీరిద్దరి మధ్య ప్రతిసారి పోటీ జరుగుతూనే ఉంది. కొన్ని సందర్భాల్లో చిరంజీవి బాలయ్య బాబు ను డామినేట్ చేస్తే మరికొన్ని సిచువేషన్ లలో బాలయ్య చిరంజీవి ని డామినేట్ చేస్తూ వచ్చాడు. ఫైనల్ గా చిరంజీవి బాలయ్యను ఎక్కువగా డామినేట్ చేస్తూ వరుస సక్సెస్ లను సాధించడం వల్ల తను మెగాస్టార్ గా మారాడు. గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా వెలుగొందుతుందటం విశేషం… ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది.

చిరంజీవి తనయుడు అయిన రామ్ చరణ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మెగా పవర్ స్టార్ గా రాణిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రతి సినిమా విషయంలో తన వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాడు. ఇక బాలయ్య కొడుకు అయిన మోక్షజ్ఞ ఇప్పటికే 30 సంవత్సరాల పైబడిన వయసు వచ్చినప్పటికి ఇంకా కూడా ఇండస్ట్రీకి రాకపోవడంతో ఇక బాలయ్య బాబు కొడుకు ఇండస్ట్రీకి రావడం అసాధ్యమని చాలామంది అనుకుంటున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే మోక్షజ్ఞ ఎందుకని ఇంత నిర్లక్ష్యం చేస్తున్నాడు. సినిమాలంటే ఇంట్రెస్ట్ లేకపోతే సినిమా ఇండస్ట్రీకి రానని చెప్పొచ్చు కదా అని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఫైనల్ గా చిరంజీవి తన కొడుకును మెగా పవర్ స్టార్ గా మార్చితే బాలయ్య బాబు మాత్రం తన కొడుకుని ఏం చేయబోతున్నాడు అనే విషయంలో ఇంకా క్లారిటి రావడం లేదంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.

ఇక మొత్తానికైతే నందమూరి అభిమానులు సైతం బాలయ్య బాబు కొడుకు ఇండస్ట్రీకి వస్తే అతన్ని ఆదరించాలని అతని సినిమాలు చూడడానికి వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ అతను మాత్రం సినిమా ఇండస్ట్రీకి రావడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించనట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది అనేది…

రామ్ చరణ్ తో డాన్స్ అంటే భయపడిపోతున్న హీరోయిన్స్ వీళ్లేనా..?

Ram Charan Favourite Kollywood Hero
Ram Charan Favourite Kollywood Hero

Ram Charan Dance Performance: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ కి చాలా మంచి క్రేజ్ ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాడు. ఇక రామ్ చరణ్ అంటే డ్యాన్స్, ఫైట్లతో ప్రేక్షకులకు ఒక మంచి కిక్ ఇచ్చే హీరో అనే విషయం మనందరికి తెలిసిందే. ఆయన మొదటి సినిమా నుంచి మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలను నమ్ముకుని ముందుకు సాగుతున్నాడు. మధ్యలో మగధీర లాంటి ప్రయోగాత్మకమైన సినిమా చేశాడు. ఆ మూవీ సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడంతో రామ్ చరణ్ క్రేజ్ తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు తను వెను తిరిగి చూడకుండా ముందుకు సాగుతున్నాడు. రాజమౌళితో చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో గ్లోబల్ స్టార్ గా కూడా అవతరించాడు. అలాంటి రామ్ చరణ్ తన అభిమానుల కోసం ఎంత కష్టమైన స్టెప్పులనైనా సరే వేసి తన డాన్సులతో అభిమానులను మెప్పిస్తూ ఉంటాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ పక్కన డాన్సులు వేయడానికి హీరోలు చాలా వరకు భయపడిపోతున్నారట… మిగతా హీరోలతో డ్యాన్స్ చేయడానికి వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోయిన కూడా రామ్ చరణ్ పక్కన డాన్స్ వెయ్యాలంటే మాత్రం వాళ్ళు చాలా వరకు రిహార్సల్స్ చేసుకొని మరి సెట్ కి వస్తున్నారట. ఈ క్రమం లోనే ‘పెద్ది’ సినిమాలో శృతిహాసన్ ఐటెం సాంగ్ చేసిన విషయం మనకు తెలిసిందే.

ఆమె ఆ సాంగ్ చేయడానికి చాలా వరకు షూటింగ్ కి మూడు రోజుల ముందు నుంచి ఏమైనా రిహార్సల్స్ చేసుకుంటూ ఆ స్టెప్పును ఎలా పెర్ఫామ్ చేయాలి. ఆ గ్రేస్ ఎలా రావాలి అనే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రామ్ చరణ్ పక్కన స్టెప్ లు వేయడం అంటే అంత ఆశా మాశీ వ్యవహారం అయితే కాదు.

అందులో ఏమాత్రం చిన్న తేడా వచ్చినా కూడా పక్కన ఉన్న హీరోయిన్ తేలిపోతూ ఉంటారు. కాబట్టి రామ్ చరణ్ కి పోటీ ఇవ్వకపోయిన తన డాన్స్ ను మ్యాచ్ చేస్తే చాలు అనే ఉద్దేశ్యంతోనే హీరోయిన్స్ అయితే ఉన్నారు. శృతిహాసన్ సైతం అలాగే బయపడిందట. మొత్తానికైతే ఐటెం సాంగ్ లో అద్భుతమైన స్టెప్పులు వేసిన శృతిహాసన్ రామ్ చరణ్ పక్కన మంచి స్టెప్ లు వేసింది. ఇక రీసెంట్ గా ఈ సాంగ్ కి సంబంధించిన లిరికల్ వీడియో అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పెన్స్ రావడం విశేషం…