Home Blog Page 229

మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో ప్రీమియం ఫోన్.. విడుదల కన్ఫామ్..

Redmi Turbo 5 launch confirmed
Redmi Turbo 5 launch confirmed

Redmi Turbo 5 launch confirmed: Redmi నుంచి మార్కెట్లోకి కొత్త ఫోన్ రాబోతుందంటే కొందరికి ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే ఈ మొబైల్స్ బడ్జెట్ కు అనుగుణంగా ఉంటాయి. ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్ష్ ఈ కంపెనీ ఫోన్లను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే లేటేస్ట్ గా ఈ కంపెనీ నుంచి రాబోతున్న అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ ‘రెడ్‌మీ టర్బో 5’. దీని గురించి టెక్ ప్రపంచంలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ ఫోన్ భారతీయ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది? దీని ప్రత్యేకతలు ఏంటి?

Redmi Turbo 5 త్వరలోనే భారతీయ మార్కెట్లో విడుదల కాబోతోందని షావోమీ అధికారికంగా ప్రకటించింది. కానీ అసలైన తేదీని తెలపలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ జూన్ 2026 ప్రారంభంలో భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కొన్ని నివేదికలు జూన్ 18వ తేదీని లాంచ్ తేదీగా సూచిస్తున్నప్పటికీ, కంపెనీ నుండి ఖచ్చితమైన తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ఫోన్ అమెజాన్ (Amazon) ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుందని ఇప్పటికే కన్ఫమ్ అయ్యింది.

ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం లుక్‌తో రానుంది. ఇందులో 6.59 అంగుళాల 1.5K అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లేను అందించనున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుండటంతో గేమింగ్, వీడియో ప్లేబ్యాక్ అనుభవం చాలా స్మూత్‌గా ఉండనుంది. ఇది డాల్బీ విజన్ మరియు హెచ్‌డిఆర్ 10+ (HDR10+) సపోర్ట్‌తో రానుండటంతో డిస్‌ప్లే క్వాలిటీ అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నారు.

టర్బో 5 ఫోన్ పర్‌ఫార్మెన్స్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్‌సెట్ ఉండనుంది. ఇది వేగవంతమైన 12GB వరకు ర్యామ్‌, UFS 4.1 స్టోరేజ్ తో జత చేయబడనుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఇందులో ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ (HyperOS) పై పనిచేయనుంది.

ఈ ఫోన్ యొక్క అతిపెద్ద హైలైట్ దాని బ్యాటరీ. ఇందులో ఏకంగా 7,560mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించారు. దీనిని వేగంగా ఛార్జ్ చేయడానికి 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇక కెమెరా విషయానికి వస్తే.. వెనుక భాగంలో OIS సపోర్ట్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, ముందు భాగంలో సెల్ఫీల కోసం 20MP కెమెరా ఉండనున్నాయి.

రెడ్‌మీ టర్బో 5 ధర భారతదేశంలో రూ.40,000 లోపు ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాలో ఇది ఇప్పటికే లాంచ్ అయినందున, భారత్‌లో కూడా అదే తరహా ఫీచర్లతో వస్తుందని లీకులు చెబుతున్నాయి. దీనికి తోడు IP69 రేటింగ్ వంటి వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఉండటం వల్ల, ప్రీమియం మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో ఇది బలమైన పోటీదారుగా నిలవనుంది.

Oppo నుంచి రెండు ఫోన్లు.. ఎల్లుండి నుంచే అందుబాటులోకి..

Oppo Find X9 Ultra launch in India
Oppo Find X9 Ultra launch in India

Oppo Find X9 Ultra launch in India: Oppo కంపెనీ నుంచి కొత్త మొబైల్స్ మార్కెట్లోకి వచ్చాయి. కెమెరా పనితీరుతో పాటు అద్భుతమైన ఫీచర్లు కావాలని అనుకునేవారు ఈ కంపెనీకి చెందిన ఫోన్లు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇందులో భాగంగా కంపెనీ నుంచి Find X9 Ultra,Find X9s స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయ్యాయి. ఇవి 28 మే 2026 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు ఫోన్ల పెర్ఫామెన్స్ గురించి వివరాల్లోకి వెళితె..

Oppo Find X9 Ultra మొబైల్ లో Qualcomm Snapdragon 8 Elite Gen 5 చిప్ సెట్ ఉండనుంది. ఇది అత్యంత శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్. ఇది 16GB RAM వరకు సపోర్ట్ చేస్తుంది. అలాగే భారతదేశంలో 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్‌లో దీనిని రూ. 1,69,999 ధరతో అందుబాటులో ఉండనుంది. ఈ ప్రాసెసర్, ర్యామ్ తో మల్టీ‌టాస్కింగ్, AI ప్రాసెసింగ్‌ ఉపయోగించేవారికి అనుగుణంగా ఉంటుంది.

X9 Ultraలో 6.8 అంగుళాల AMOLED డిస్ప్లే ఉంది. ఇది 2K రెజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. ఇది AI-పవర్డ్ అడాప్టివ్ ఐ కేర్ టెక్నాలజీతో వచ్చి తక్కువ లైట్‌తో ఉంటుంది. X9 Ultraలో డ్యూయెల్ కెమెరాలు ఉన్నాయి. ఇవి 200MP మెయిన్ కెమెరా, మరొకటి 50MP 10x ఆప్టికల్ టెల్లిఫోటో లెన్స్. ఇది 8K Ultra-Clear వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

X9 Ultraలో విపరీతమైన 7050mAh బ్యాటరీ కనిపిస్తుంది. ఇది సిలికాన్ కార్బన్ టెక్నాలజీతో తయారైంది. ఈ బ్యాటరీ 100 W వైర్డ్ చార్జింగ్, 50W ర్‌లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఒక రోజంతా కెమెరా, గేమింగ్, వీడియో స్ట్రీమింగ్‌కు పూర్తి బ్యాక్‌అప్ అందిస్తుంది.

Oppo Find X9s కూడా Snapdragon 8 సిరీస్ ప్రాసెసర్‌తో వస్తుంది, 12GB RAM + 256GB/512GB స్టోరేజ్ ఉంటుంది. దీని ధర ప్రారంభ ధర రూ.79,999 ఉండగా.. ఇందులో 7025mAh బ్యాటరీ ఉండనుంది. ఈ బ్యాటరీకి 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు చేస్తుంది. బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో X9s మొబైల్ ను రూ. 62,199కి కొనుగోలు చేయొచ్చు. Ultra ధర రూ.1,36,999కి తగ్గుతుంది. ఈ ఫోన్‌లు OPPO e-Store, Flipkart, Amazon స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయి.

ఎట్టకేలకు 'దేవర' టీవీ టెలికాస్ట్ కి మోక్షం.. ఏ ఛానల్ లో రాబోతుందంటే..

Devara Movie TV telecast
Devara Movie TV telecast

Devara Movie TV telecast: #RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ హీరో గా నటంచిన ‘దేవర’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ నటన , అనిరుద్ మ్యూజిక్, కొరటాల శివ మార్క్ వింటేజ్ టేకింగ్ , ఈ చిత్రాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లాయి. ఆరంభం లో డివైడ్ టాక్ వచ్చింది కానీ , ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి కదిలిన తర్వాత టాక్ స్థిరపడింది. అలా టాక్ స్థిరపడిన తర్వాత ఈ చిత్రానికి అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 390 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నెట్ ఫ్లిక్స్ లో కూడా ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం గమనార్హం. అయితే ఇంతటి ఆదరణ దక్కించుకున్న ఈ చిత్రం ఇప్పటి వరకు టీవీ టెలికాస్ట్ అవ్వకపోవడం అభిమానులను నిరాశకు గురి చేసిన అంశం.

ఓటీటీ ప్రభావం వల్ల, టీవీ టెలికాస్ట్ మీద కూడా బలమైన ప్రభావం చూపడంతో , నిర్మాత కళ్యాణ్ రామ్ అడిగినంత డబ్బులు ఇచ్చేందుకు ఏ ఓటీటీ సంస్థ కూడా ముందుకు రాలేదు. అందుకే ఈ చిత్రం ఇన్ని రోజులు టెలికాస్ట్ కి నోచుకోలేదు. అయితే ఎట్టకేలకు ఈ సినిమా సాటిలైట్ రైట్స్ ని ఈటీవీ ఛానల్ సొంతం చేసుకుంది. చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ సినిమాని కొనుగోలు చేసింది ఈటీవీ ఛానల్. ఇప్పటి వరకు ఆ ఛానల్ లో ‘నిన్ను చూడాలని’, ‘అల్లరి రాముడు’, ‘సింహాద్రి’ వంటి చిత్రాలు మాత్రమే టెలికాస్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఒక్క ఎన్టీఆర్ సినిమా కూడా ఈటీవీ ఛానల్ కి వెళ్ళలేదు. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ సినిమాని కొనుగోలు చేయడం తో , భారీ లాభాలు వస్తాయని బలమైన నమ్మకంతో ఉంది ఈటీవీ సంస్థ.

ఈ చిత్రాన్ని త్వరలోనే ఈటీవీ ఛానల్ లో టెలికాస్ట్ చేయబోతున్నారు. మరి థియేటర్స్ లో , ఓటీటీ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి టీవీ టెలికాస్ట్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. మరోపక్క రీసెంట్ గానే ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2’ చిత్రాన్ని స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ చేశారు. ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చింది. గత ఏడాది విడుదలైన సినిమాకే ఇలాంటి రెస్పాన్స్ వచ్చిందంటే , ఇక రెండేళ్ల క్రితం విడుదలైన ‘దేవర’ ని ఆడియన్స్ ఎంతమేరకు పట్టించుకుంటారో చూడాలి.

నిర్మాత బండ్ల గణేష్ ని చెప్పుతో కొట్టిన ప్రముఖ నటుడు.. మరీ ఇంత దారుణమా..

Bandla Ganesh
Bandla Ganesh

Actor attacks Bandla Ganesh: మన సినీ ఇండస్ట్రీ లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి , ఆ తర్వాత అగ్ర నిర్మాతగా మారి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తీసిన వ్యక్తి బండ్ల గణేష్. ఇతను కేవలం ఒక నటుడు , నిర్మాత మాత్రమే కాదు, ఒక మంచి పారిశ్రామిక వేత్త కూడా. అయితే ఈమధ్య కాలం లో ఆయన సినిమాలకు దూరమయ్యాడు , కేవలం తన వ్యాపారాల మీదనే ద్రుష్టి పెట్టాడు, అయితే ఇప్పుడు మరోసారి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న బండ్ల గణేష్ , ప్రముఖ సీనియర్ నటుడు రాజా రవీంద్ర కి సంబంధించిన ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన మాటలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి, అవేంటో ఒకసారి చూద్దాం.

ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొత్తల్లో తనకు ఎదురైనా ఒక చేదు అనుభవాన్ని తల్చుకుంటూ ఆయన ఈ ఇంటర్వ్యూ లో బాధపడ్డాడు. ఆయన మాట్లాడుతూ ‘సౌందర్య చనిపోయిన రోజు , నేను ఒక షూటింగ్ లో ఉన్నాను. నేను తో సహచర నటులతో కలిసి కూర్చొని ఉన్నాను. నా ఎదురుగా ఒక ప్రముఖ సీనియర్ ఆర్టిస్టు ఉన్నాడు. చాలా గొప్ప వ్యక్తి , ఆయన నాకు ఎంతో సహాయం చేశారు కూడా. నా అలవాటు లో పొరపాటుగా, సార్ సార్ అంటూ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశాను . కానీ ఒక్కసారిగా ఆయన ఆవేశం తో నన్ను చెప్పు తీసుకొని కొట్టాడు. ఏ తప్పు చేయకుండా, నేను చెప్పు దెబ్బలు తినాల్సి వచ్చిందే అని చాలా బాధపడ్డాను. ఆ తర్వాత పాపం ఆయన వేరే ఎదో టెన్షన్ లో ఉన్నాడు లే, అందుకే ఇలా రియాక్ట్ అయ్యాడు అని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. ఆ తర్వాత పక్క రోజు ఆయనే వచ్చి నాకు క్షమాపణలు చెప్పాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.

అయితే బండ్ల గణేష్ ని ఇలా అకారణంగా చెప్పు తీసుకొని కొట్టిన ఆ సీనియర్ ఆర్టిస్ట్ ఎవరు?, అనే దానిపైనే ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో చర్చ నడుస్తోంది. ఇంతటి కోపం కేవలం ఇద్దరికీ మాత్రమే ఉంటుంది , ఒకరు బాలయ్య బాబు , మరొకరు మోహన్ బాబు. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టు అన్నాడు కాబట్టి, వీరిద్దరూ కాకపోవచ్చు , మరి ఎవరు అయ్యుంటారు?, బ్రహ్మానందం అయ్యుండొచ్చా?, లేదా కొత్త శ్రీనివాసరావు అయ్యుండొచ్చా ? అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంచనాలు వేస్తున్నారు.

'పెద్ది' దుబాయ్ ప్రివ్యూ షో టాక్ వచ్చేసింది.. సెకండ్ హాఫ్ ఇలా ఉంటుందని ఎవ్వరు ఊహించలేదు..

Peddi Movie Success
Peddi Movie Success

Peddi movie Dubai preview show talk: సోషల్ మీడియా , ఎలక్ట్రానిక్ మీడియా అని తేడా లేదా , ఇప్పుడు ఎక్కడ చూసినా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ మేనియా నే కనిపిస్తోంది. డైరెక్టర్ బుచ్చి బాబు ఇంటర్వ్యూస్ ఒక పక్క, రాష్ట్రాల వారీగా ఈవెంట్స్ ని నాన్ స్టాప్ గా నిర్వహిస్తున్నారు. మొదటి నుండి మంచి బజ్ ఉన్న ఈ చిత్రానికి , ఇవన్నీ చెయ్యడం వల్ల, ఆ బజ్ తారాస్థాయికి చేరుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు UA సర్టిఫికేట్ ని జారీ చేశారు. సెన్సార్ సభ్యుల నుండి ఈ చిత్రానికి మంచి పాజిటివ్ బజ్ ఉంది , ఆ రేంజ్ పాజిటివ్ బజ్ ఆడియన్స్ నుండి కూడా వస్తే , ఈ సినిమా బాక్స్ ఆఫీస్ సునామీ ని ఎవ్వరూ ఊహించలేరు , ఆ రేంజ్ ఉండబోతుంది.

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు దుబాయ్ లో కూడా పూర్తి అయ్యాయట. అక్కడి నుండి వస్తున్నా టాక్ కూడా వేరే లెవెల్ లో ఉంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఆరంభం కాస్త స్లో స్క్రీన్ ప్లే తో సాగిన, ప్రీ ఇంటర్వెల్ నుండి సినిమా వేరే లెవెల్ కి వెళ్తుందని , ఫస్ట్ లో రామ్ చరణ్ , జగపతి బాబు పెర్ఫార్మన్స్ లను ఆడియన్స్ జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని , అంత అద్భుతంగా వచ్చిందని అంటున్నారు. ప్రీ ఇంటర్వెల్ నుండి క్లైమాక్స్ వరకు ఈ సినిమా లో రామ్ చరణ్ నటన , బుచ్చి బాబు టేకింగ్ ఆడియన్స్ ని కంటతడి పెట్టించేలా ఉంటుందని , ఈ స్థాయి బావోద్వేగపూరిత చిత్రం ఈ మధ్యకాలం లో రాలేదని , ఇలాంటి సినిమాని రామ్ చరణ్ ఒప్పుకొని చేయడం చాలా గ్రేట్ అంటూ చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా ఈ సినిమాలోని చివరి 45 నిమిషాలు , ఆ తర్వాత క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ తెలుగు సినిమా బ్రతికి ఉన్నంత కాలం ఆడియన్స్ గుర్తుపెట్టుకుంటారని , రామ్ చరణ్ చాలా అద్భుతంగా నటించాడని , నేషనల్ అవార్డు మాత్రమే కాదు , ఆయన్ని మనం త్వరలోనే ఈ సినిమా కారణంగా ఆస్కార్ వేడుకల్లో కూడా చూడొచ్చని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో మరో ‘డంగల్ ‘, ‘లగాన్ ‘ లాంటి చిత్రమంటూ ప్రచారం జరుగుతున్న ఈ సినిమా , నిజంగా ఆ రేంజ్ లో ఉంటే మాత్రం , కేవలం బాలీవుడ్ నుండే ఈ చిత్రం 500 కోట్ల గ్రాస్ ని రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

లైవ్ లో మంత్రి కందుల దుర్గేష్ పై పవన్ కళ్యాణ్ ఫైర్.. సంచలనం రేపుతున్న వీడియో..

Pawan Kalyan fires on Kandula Durgesh
Pawan Kalyan fires on Kandula Durgesh

Pawan Kalyan fire on Kandula Durgesh: పవన్ కళ్యాణ్ రంగం లోకి దిగితే , ఏ పని అయినా చాలా తొందరగా జరిగిపోతుందని అందరూ అంటుంటారు. ఆ స్థాయిలో ఆయన తల్చుకుంటే అధికారులను పరుగులు పెట్టిస్తుంటాడు. 2024 వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ ‘సీజ్ ది షిప్’ అంటూ చేసిన నినాదం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనమంతా చూశాము . దేశవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ గా మారింది ఈ అంశం. అక్రమంగా విదేశాలకు షిప్స్ ద్వారా తరలిస్తున్న పీడీఎస్ రైస్ ని పట్టుకొని అప్పట్లో పవన్ కళ్యాణ్ పెద్ద సెన్సేషన్ సృష్టించాడు. అయితే ఇప్పుడు మరోసారి ఆయన అలాంటి సందర్భాన్ని రిపీట్ చేశాడు. వచ్చే ఏడాది ఉభయ గోదావరి జిల్లాల్లో పుష్కరాలు జరగబోతుంది. ఈ సందర్భంగా ఇప్పటి నుండే పటిష్టమైన ఏర్పాట్లు చేసేందుకు పవన్ కళ్యాణ్ రంగం లోకి దిగాడు.

నిన్నటి నుండి ఆయన రాజమండ్రి లో పర్యటిస్తూ , అక్కడి నదీ జలాల్లో జరిగే కాలుష్యం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. అధికారులను లైవ్ లో నిలదీస్తూ , వాళ్లకు తమ బాధ్యతలను గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. అలసత్వం వహిస్తే తన సొంత పార్టీ నేతలను కూడా వదిలి పెట్టను అనే సందేశాన్ని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పాడు. ఇకపోతే నేడు కూడా ఆయన రాజమండ్రి పరిసరాల్లో పర్యటించాడు. పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థ పదార్దాల కారణం గా నీరు కలుషితం అవ్వడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక చోట కాలువ లో ఉన్న వ్యర్దాలను చూసి ‘ పుష్కరాల్లో ఇక్కడ స్నానం చేస్తే పుణ్యం వస్తుందో లేదో తెలియదు కానీ , రోగాలు మాత్రం కచ్చితంగా వస్తాయి’ అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించాడు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా, ఆయన్ని కూడా మందలించాడు పవన్ కళ్యాణ్.

‘మీరు రాష్ట్రానికి మంత్రి, ఇలాంటి వాటికి మీరే బాధ్యత వహించాలి. అలసత్వం వ్యవహరించడం అసలు సరికాదు’ అంటూ చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ గ్రౌండ్ లోకి డ్యూటీ దిగితే ఈ రేంజ్ లో ఉంటుందని , అధికారులు , కలెక్టర్లు , ఎమ్మెల్యే లు , మినిస్టర్లు ఇక పై జాగ్రత్తగా వ్యవహరించాలని , లేదంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా హెచ్చరించాడు. వచ్చే ఏడాది దాదాపుగా 10 కోట్ల జనాలు ఈ పుష్కరాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు కనీవినీ ఎరుగని రేంజ్ లో ఉండాలని ఆయన ఆదేశించారు.

మన భారతదేశం ఎందుకు అభివృద్ధి చెందడం లేదు..

India development growth
India development growth

India development growth: భారతదేశంను ఇప్పటికీ కొందరు అభివృద్ధి చెందుతున్న దేశం అని అంటూ ఉంటారు. కానీ 77 సంవత్సరాలైనా కూడా ఈదేశంల అభివృద్ధి చెందిన దేశంగానే పిలవబడుతోంది. ఇందుకు కారణం ఇక్కడ సరైన ఆర్థిక వనరులు లేకపోవడమా? లేదా నైపుణ్యం లేకపోవడమా? అన్న చర్చ పదే పదే జరుగుతుంది. కానీ నేటి యువతకు కావాల్సిన మార్గాలు, సౌకర్యాలు, వారికి అవగాహన కల్పించడానికి స్కిల్స్ లేకపోవడమేనని అంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వాలు తామ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టిస్తామని చెబుతారు. కానీ ప్రైవేట్ కంపెనీ పెట్టుకుంటామంటే మాత్రం అనుమతి ఇవ్వరు. ప్రభుత్వ ఉద్యోగాల కంటే ప్రైవేట్ సెక్టార్ పెరగడంతోనే దేశం అభివృద్ధి జరుగుతుందని కొందరి ఆర్థిక నిపుణుల సలహా. అసలు నేటి యువత చదువు పూర్తయ్యాక ఏ దారిలో వెళ్లాలి? ప్రభుత్వ ఉద్యోగం కోసం సంవత్సరాల పాటు సిద్ధం కావాలా? ప్రైవేట్ రంగంలో వెంటనే ఉద్యోగం పట్టాలా? లేక రిస్క్ తీసుకుని వ్యాపారం ప్రారంభించాలా? ఈ మూడు మార్గాల్లో ప్రతి దానికి అవకాశాలున్నాయి.. అలాగే సమస్యలూ ఉన్నాయి. కానీ దేశ ఆర్థిక పరిస్థితులు, విద్యా వ్యవస్థ, టెక్నాలజీ మార్పులు, ప్రపంచ పోటీ కారణంగా యువతలో గందరగోళం పెరుగుతోంది. వీటి గురించి..

ప్రభుత్వ ఉద్యోగం ఇంకా ఎందుకు ఆకర్షిస్తోంది?
భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే ఇప్పటికీ ‘భద్రత’ అనే భావన బలంగా ఉంది. ఒకసారి ఉద్యోగం వస్తే స్థిరమైన జీతం, పెన్షన్ ప్రయోజనాలు, సామాజిక గౌరవం, ఉద్యోగ భద్రత లభిస్తాయని చాలా కుటుంబాలు నమ్ముతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో ప్రభుత్వ ఉద్యోగాన్ని జీవిత లక్ష్యంగా చూస్తున్నారు.

అయితే సమస్య ఏంటంటే.. పోస్టులు చాలా తక్కువ, పోటీ లక్షల్లో ఉంటుంది. ఒక ఉద్యోగానికి వేల మంది దరఖాస్తు చేయడం సాధారణమైపోయింది. కొందరు యువకులు 5-6 సంవత్సరాలు కేవలం పరీక్షల కోసమే సిద్ధమవుతూ జీవితంలోని కీలక సమయాన్ని ఖర్చు చేస్తున్నారు. ఉద్యోగం వస్తే మంచిదే కానీ రాకపోతే మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నాయి.

ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా కూడా ఆ ఉద్యోగికి ప్రతీ సంవత్సరం ఇంక్రిమెంట్ పెరుగుతుంది. ఆ పరిస్థితి లేకపోతే ఇతర మార్గాల్లో ఆదాయం ఆర్జించాలని చూస్తుంటారు. ఇలా కొంత వరకు మాత్రమే సంపద సృష్టించబడుతుందని కొందరు ఆర్థిక వేత్తలు అంటున్నారు.

ప్రైవేట్ సెక్టార్‌లో అవకాశాలు ఎక్కువ.. కానీ ఒత్తిడి కూడా ఎక్కువే ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ రంగంతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఈ-కామర్స్, డిజిటల్ మార్కెటింగ్, హెల్త్‌కేర్ రంగాల్లో ఉద్యోగాలు వేగంగా పెరిగాయి.

కానీ ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థిరత్వం తక్కువగా ఉంటుంది. కంపెనీ పరిస్థితులు మారితే ఉద్యోగాలు పోవచ్చు. టార్గెట్లు, పనిఒత్తిడి, ఎక్కువ పని గంటలు ఉద్యోగులను మానసికంగా అలసటకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో “లేఆఫ్స్” అనే భయం ఎప్పుడూ ఉంటుంది.

అయినా సరే.. ప్రైవేట్ రంగం ఒక మంచి విషయం నేర్పుతోంది. అది “స్కిల్స్”. ఎవరి దగ్గర నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయో వారికి మంచి జీతాలు, ప్రపంచస్థాయి అవకాశాలు లభిస్తున్నాయి. అంతేకాకుండా ఒక వ్యక్తి కొన్నాళ్ల పాటు ఒక కంపెనీలో ఉద్యోగం చేసి.. ఆ తరువాతం సొంతంగా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రారంభించవచ్చు. దీంతో తన ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఆ తరువాత విదేశాలతో కూడా వ్యాపారం చేయొచ్చు. కానీ చాలా మంది ప్రైవేట్ జాబ్ అనగానే భయంతో వీటి వైపు వెళ్లడం లేదు. దీంతో భారతదేశంలో సంపద సృష్టించబడడం లేదు.

ఐటీ చదివిన వారికి సరైన ఉద్యోగాలు ఎందుకు రావడం లేదు?
ప్రస్తుతం దేశంలో పెద్ద చర్చగా మారింది. ప్రతి సంవత్సరం లక్షల మంది ఇంజినీరింగ్, ఐటీ కోర్సులు పూర్తి చేస్తున్నా.. అందరికీ సరైన ఉద్యోగాలు రావడం లేదు. దీనికి ప్రధాన కారణం “స్కిల్ గ్యాప్”.

చాలా కాలేజీల్లో ఇప్పటికీ పాత సిలబస్ నే బోధిస్తున్నారు. పరిశ్రమలకు అవసరమైన ప్రాక్టికల్ నైపుణ్యాలు విద్యార్థుల్లో తక్కువగా ఉన్నాయి. చాలామంది విద్యార్థులు కేవలం డిగ్రీ కోసం మాత్రమే చదువుతున్నారు కానీ రియల్ ప్రాజెక్ట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్‌పై దృష్టి పెట్టడం లేదు.

ఇక మరోవైపు కంపెనీలు ఇప్పుడు కేవలం డిగ్రీ కాకుండా AI, Cloud Computing, Cyber Security, Data Analytics, Full Stack Development వంటి ఆధునిక నైపుణ్యాలు కోరుతున్నాయి. అందుకే ‘చదువు ఉంది.. ఉద్యోగం లేదు’ అనే పరిస్థితి కనిపిస్తోంది.

AI రావడంతో ఉద్యోగాల భవిష్యత్తు ఎలా మారుతోంది?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ రంగం వేగంగా మారుతోంది. ఒకప్పుడు మనుషులు చేసే అనేక పనులను ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లు, ఆటోమేషన్ టూల్స్ చేస్తున్నాయి. దీనివల్ల కొంతమంది ఉద్యోగాలు కోల్పోతున్నా.. కొత్త ఉద్యోగాలు కూడా పుడుతున్నాయి.భవిష్యత్తులో కేవలం డిగ్రీ సరిపోదు. జీవితాంతం కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యం ఉన్నవారే నిలబడగలుగుతారు. ‘లెర్నింగ్’ ఒక నిరంతర ప్రక్రియగా మారుతోంది.

వ్యాపారం ప్రారంభించాలంటే ఎందుకు భయపడుతున్నారు?
భారతదేశంలో చాలా మంది యువతకు వ్యాపారం చేయాలనే ఆసక్తి ఉంది. కానీ మొదటి అడుగు వేయడానికే భయపడుతున్నారు. ఎందుకంటే వ్యాపారం అంటే రిస్క్, పెట్టుబడి, అనిశ్చితి.మొదటగా మూలధనం సమస్య ఉంటుంది. బ్యాంకులు కొత్త వ్యాపారాలకు సులభంగా రుణాలు ఇవ్వవు. కుటుంబాలు కూడా “స్థిరమైన ఉద్యోగం వదిలి వ్యాపారం ఎందుకు?” అని ప్రశ్నిస్తాయి. మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉంటుంది. టాక్సులు, లైసెన్సులు, అనుమతులు, అధికార వ్యవస్థలో ఆలస్యం వంటి సమస్యలు కొత్త వ్యాపారులకు అడ్డంకులవుతున్నాయి. వీటిలో

1. నాణ్యమైన విద్య లోపం: చాలా మంది విద్యార్థులు డిగ్రీలు సంపాదిస్తున్నా.. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు అందడం లేదు.

2. జనాభా ఒత్తిడి: భారతదేశంలో యువత సంఖ్య చాలా ఎక్కువ. కానీ అందరికీ సరిపడా ఉద్యోగాలు సృష్టించడం పెద్ద సవాలుగా మారింది.

3. పరిశోధనలపై తక్కువ పెట్టుబడి: అమెరికా, చైనా వంటి దేశాలతో పోలిస్తే పరిశోధన, టెక్నాలజీ అభివృద్ధిపై భారత్ తక్కువగా ఖర్చు చేస్తోంది.

4. బ్యూరోక్రసీ, అవినీతి: కొన్ని రంగాల్లో అనుమతులు, విధానాలు, ఆలస్యాలు వ్యాపారాల వృద్ధిని మందగింపజేస్తున్నాయి.

5. గ్రామీణ-పట్టణ అసమానతలు: పట్టణాల్లో అవకాశాలు ఎక్కువగా ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు పరిమితంగానే ఉన్నాయి.

ఇలా అనేక సమస్యలు ఉండడంతోనే భారతదేశంలో ఇంకా అభివృద్ధి చెందుతున్నదేశంగానే ఉండిపోతుంది.

'పెద్ది' ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఇంతేనా..? ఇలా అయితే బ్రేక్ ఈవెన్ అసాధ్యం..

Peddi movie overseas advance bookings
Peddi movie overseas advance bookings

Peddi movie overseas advance bookings: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం సరిగ్గా మరో 8 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కానీ ఈ చిత్రానికి మొదట్లో ఉన్నటువంటి హైప్, హంగామా మాత్రం ఇప్పుడు జనాల్లో కనిపించడం లేదు. ‘చికిరి చికిరి’ సాంగ్ గ్లోబల్ వైడ్ గా సునామీ సృష్టించింది, ఆ తర్వాత విడుదలైన ‘రయ్ రయ్ రారా’ పాటకు కూడా ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జెన్ జీ ఆడియన్స్ ఇన్ స్టాగ్రామ్ లో ఈ పాటకు కూడా లక్షల సంఖ్యలో రీల్స్ చేశారు. ఇక ఆ తర్వాత విడుదలైన పహిల్వాన్ గ్లింప్స్ , థియేట్రికల్ ట్రైలర్, పోస్టర్స్ ఇవన్నీ కూడా అదిరిపోయాయి. వీటికి తోడు ప్రొమోషన్స్ కూడా అదరగొడుతోంది మూవీ టీం. ఒకపక్క ఇంటర్వ్యూస్ ఇస్తూనే , మరోపక్క నాన్ స్టాప్ గా ఈవెంట్స్ ని పెడుతున్నారు.

రీసెంట్ గానే భోపాల్ లో నిర్వహించిన ఈవెంట్ ఎంతటి సక్సెస్ అయ్యిందో మన కళ్లారా చూశాము. దాదాపుగా 2 లక్షల మంది జనాలు ఈ ఈవెంట్ కి వచ్చారు. అదే విధంగా నిన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈవెంట్ జరిగింది. ఇలా నిత్యం ఈ సినిమా ని ఆడియన్స్ లో ఉంచేందుకు మూవీ టీం పటిష్టమైన ప్రణాళికలు చేసింది. కానీ ఇవేమి ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ పై మాత్రం ఎలాంటి ప్రభావం చూపించడం లేదు. నార్త్ అమెరికా లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించిన మొదటి రోజే 1 లక్షా 47 వేల డాలర్లు వచ్చేలోపు అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇండియన్ సినిమా హిస్టరీ లో ఈ రేంజ్ ఆరంభం ఏ సినిమాకు కూడా జరగలేదు. ఆరంభం లో వచ్చిన ఈ గ్రాస్ ని చూసి , అభిమానులు , ప్రేక్షకులు , ట్రేడ్ వర్గాలు కచ్చితంగా ఓజీ , దేవర కలెక్షన్స్ ని దాటేస్తుందని అనుకున్నారు.

కానీ అది జరగడం లేదు. మరో ఓజీ, దేవర అవుతుందని అనుకుంటే, హరి హర వీరమల్లు , రాజా సాబ్ రేంజ్ ట్రెండ్ ని కనబరుస్తూ ఓవర్సీస్ బయ్యర్స్ లో వణుకు పుట్టేలా చేస్తోంది ఈ చిత్రం. ఎందుకంటే కేవలం ఒక్క నార్త్ అమెరికా లోనే ఈ చిత్రం 7.5 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే ప్రీమియర్స్ నుండి కచ్చితంగా 3 మిలియన్ డాలర్ల గ్రాస్ రావాల్సిన అవసరం ఉంది. కానీ ఈ చిత్రానికి ఇప్పటి వరకు కేవలం 4 లక్షల 60 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అది కూడా 1401 షోస్ నుండి. ఓజీ చిత్రం రెండు రోజుల్లో 5 లక్షల డాలర్లు, ఓవరాల్ ప్రీ సేల్స్ 2.5 మిలియన్ డాలర్లు వచ్చాయి. కానీ ‘పెద్ది’ చిత్ర పరిస్థితి చూస్తుంటే 1 మిలియన్ ప్రీ సేల్స్ కూడా కష్టం లాగా అనిపిస్తోంది , చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.

'ధురంధర్' హీరో రణవీర్ సింగ్ పై 3 ఏళ్ళ నిషేధం విధించిన బాలీవుడ్..కారణం ఏంటంటే..

Bollywood Ban on Ranveer Singh
Bollywood Ban on Ranveer Singh

Bollywood Ban on Ranveer Singh: రీసెంట్ గానే ‘ధురంధర్’ సిరీస్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని షేక్ చేసి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మైమరచిపోయేలా చేసిన రణవీర్ సింగ్ కెరీర్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. ‘ధురంధర్’ సిరీస్ తర్వాత బాలీవుడ్ నెంబర్ 1 హీరో స్థానం లో కూర్చొని , ఇలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని ఇంకా ఎన్నో చేస్తాడని ఆశించిన అభిమానులకు ఇప్పుడు నిరాశ మిగిలే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రణవీర్ సింగ్ పై బాలీవుడ్ బ్యాన్ విధించింది. అందుకు ముఖ్య కారణం ‘డాన్ 3’. ఈ సినిమా నుండి రణవీర్ సింగ్ తప్పుకోవడం వల్లే, అసలు సమస్య మొదలైంది. ‘ధురంధర్’ సిరీస్ కి ముందు రణవీర్ సింగ్ కొన్ని సినిమాలు ఒప్పుకున్నాడు. అందులో జాంబీ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రళయ్’ ఒకటి కాగా , ‘డాన్ 3’ మరొకటి.

అప్పట్లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ హీరో గా నటించిన ‘డాన్’ చిత్రం ఒక ప్రభంజనం సృష్టించింది . ఆ తర్వాత మోడరన్ యుగం లో షారుఖ్ ఖాన్ ఈ చిత్రాన్ని అప్పటి తరం ఆడియన్స్ కి తగ్గట్టుగా రీమేక్ చేసి సెన్సేషన్ సృష్టించాడు. ఆ తర్వాత సీక్వెల్ గా ‘డాన్ 2’ చేసాడు , ఇది కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సిరీస్ కి కొనసాగింపుగా డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ ‘డాన్ 3’ ప్రకటించింది. హీరో గా రణవీర్ సింగ్ నటించబోతున్నాడని చాలా గ్రాండ్ గా ప్రకటించారు. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా రణవీర్ సింగ్ ఆ చిత్రం నుండి తప్పుకోవడం వల్ల, తమకు 40 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లిందని డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ గతంలో వెల్లడించారు. వాళ్ళు తమకు న్యాయం చెయ్యాలంటూ నేరుగా ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్’ బోర్డు వద్ద రణవీర్ సింగ్ పై కంప్లైంట్ ఇచ్చారు.

ఈ కంప్లైంట్ ని చాలా సీరియస్ గా తీసుకున్న బోర్డు, నిర్మత్యాలకు నష్టం కలిగించినందుకు రణవీర్ సింగ్ పై మూడేళ్ళ నిషేధం విదిస్తున్నాను అంటూ సంచలన ప్రకటన చేశారు. దీనికి రణవీర్ సింగ్ నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. బౌండెడ్ స్క్రిప్ట్ మా హీరో వద్దకు డైరెక్టర్ ఇప్పటి వరకు తీసుకొని రాలేదు , ఈ చిత్రం కోసం మా హీరో చాలా సమయాన్ని కేటాయించాడు , కానీ డైరెక్టర్ వినియోగించుకోలేదు , ఇప్పటికీ స్క్రిప్ట్ రెడీ అవ్వకపోవడం వల్లే , ఈ చిత్రం నుండి రణవీర్ సింగ్ తప్పుకోలేదంటూ ఆయన పీఆర్ టీం అధికారిక ప్రకటన కొద్దిరోజుల క్రితం చేసింది. మరి ఇప్పుడు ఈ బ్యాన్ పై రణవీర్ సింగ్ ఎలాంటి రియాక్షన్ ఇస్తాడో చూడాలి.

కోడి కడుపులో గుడ్డు ఎలా తయారవుతుంది.. వైరల్ వీడియో

How egg is formed inside Hen
How egg is formed inside Hen

How egg is formed inside Hen: మనం చాలా సందర్భాల్లో పౌష్టికాహారంలో భాగంగా కోడిగుడ్డును తీసుకుంటూ ఉంటాం. కోడి గుడ్డు చూస్తే చాలా చిన్నదిగా కనిపిస్తుంది. కానీ ఇది తయారు కావడంలో 24 గంటల ప్రాసెస్ అవుతుంది. అంతేకాకుండా కోడిగుడ్డులో ఉండూ మూడు పొరలు దశల వారిగా ప్రక్రియను జరుపుతుంది. నాచురల్ గా పెరిగే కోళ్లు అవి సరైన ఉష్ణోగ్రతను కలిగి ఉండి గుడ్డు ప్రాసెస్ ను జరుపుకుంటుంది. కానీ ప్రస్తుత కాలంలో ఫారంలో ఉండే కోళ్లకు ప్రత్యేకంగా దాన ఇస్తూ వాటిని ప్రత్యేక వాతావరణంలో పెంచుతూ ఉంటారు. కానీ గుడ్డు ప్రక్రియ మాత్రం ప్రకృతిలో జరిగే అద్భుతమైన జీవ ప్రక్రియ అని అనుకోవచ్చు. ఒక ఆడ కోడి (పెట్టె) శరీరంలో దాదాపు 24 నుంచి 26 గంటల పాటు జరిగే పలు దశల తర్వాత గుడ్డు బయటకు వస్తుంది. ఇది ఎలా జరుగుతుందో చూద్దాం.

పసుపు భాగం (Yolk) తయారీ:
కోడి అండాశయంలో చిన్న చిన్న గుండ్రటి భాగాలు పసుపు రంగులో ఉంటాయి. వీటిలో ఒకటి పూర్తిగా ఎదిగినప్పుడు వాటి నుంచి విడిపోతుంది. దానిని యోల్క్ లేదా గుడ్డు పచ్చసొన అంటారు. ఇది భవిష్యత్తులో పిల్లకోడి పెరుగుదలకు అవసరమైన పోషకాలను కలిగి ఉంటుంది.

ఫర్టిలైజేషన్ జరిగే దశ:
కోడిపుంజుతో సంభోగం జరిగితే, ఆ పచ్చసొనపై వీర్యకణం కలిసే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియను ఫర్టిలైజేషన్ అంటారు. అయితే పుంజు లేకపోయినా కోడి గుడ్లు పెడుతుంది. కానీ అలాంటి గుడ్లలో పిల్లలు పుట్టవు.

తెల్లసొన ఏర్పడటం:
పసుపు భాగం అండనాళంలోకి వచ్చిన తర్వాత దాని చుట్టూ ఆల్బుమెన్ అనే తెల్లసొన పొరలు ఏర్పడతాయి. ఇవే మనం గుడ్డు పగలగొట్టినప్పుడు కనిపించే తెల్లటి ద్రవం. ఇది పసుపు భాగాన్ని రక్షిస్తుంది.

గుడ్డు ఆకారం ఏర్పడటం:
తర్వాత గుడ్డు రెండు మెత్తని పొరలతో కప్పబడుతుంది. ఇవి గుడ్డు ఆకారాన్ని నిలబెట్టడంలో సహాయపడతాయి.

గట్టి పెంకు తయారీ:
అండనాళంలోని చివరి భాగంలో సుమారు 20 గంటల పాటు గుడ్డు ఉంటుంది. ఈ సమయంలో కాల్షియంతో గట్టి పెంకు (Shell) ఏర్పడుతుంది. అందుకే కోళ్లకు కాల్షియం అధికంగా ఉన్న ఆహారం ఇస్తారు.

గుడ్డు బయటకు రావడం:
అన్ని దశలు పూర్తయ్యాక గుడ్డు కోడి శరీరం నుంచి బయటకు వస్తుంది. సాధారణంగా ఒక కోడి రోజుకు ఒక గుడ్డు పెడుతుంది.

బ్రౌన్ గుడ్లు, వైట్ గుడ్లు ఎందుకు?
గుడ్డు రంగు కోడి జాతిపై ఆధారపడి ఉంటుంది. తెల్ల కోళ్లు సాధారణంగా తెల్ల గుడ్లు పెడితే, ఎరుపు లేదా గోధుమ రంగు కోళ్లు బ్రౌన్ గుడ్లు పెడతాయి. పోషకాల్లో పెద్దగా తేడా ఉండదు.

 

View this post on Instagram

 

A post shared by Facts 24 (@facts24telugu)

ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయం.. వస్తోంది ఇథనాల్‌ కుకింగ్‌ స్టవ్‌

Ethanol cooking stove
Ethanol cooking stove

Ethanol Cooking Stove: పశ్చిమాసియా యుద్ధం కారణంగా దేశంలో ఇంధన సంక్షోభం నెలకొంది క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరుగుతున్నాయి. దీంతో దేశంలో పెట్రో ధరలు పెరుగుతున్నాయి. ఎల్పీజీ సరఫరా నిలిచిపోవడంతో వాటి ధరలను కేంద్రం పెంచింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లలో గ్యాస్‌ సరఫరా నిలిచిపోయి మూతపడుతున్నాయి. ఈ తరుణంలో ప్రయత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఇంధన రంగంలో కొత్త మలుపు రాబోతోందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. ఇటీవల ఇథనాల్‌ ఆధారిత కుకింగ్‌ స్టవ్‌లను ఎల్‌పీజీ సిలిండర్లకు ఆర్థికపరంగా మంచి ప్రత్యామ్నాయంగా సిఫార్సు చేశారు. దేశీయ ఇంధన వనరులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ ప్రతిపాదన వచ్చింది. ఇథనాల్‌ స్టవ్‌లను ప్రోత్సహించడానికి యువతను ఆకర్షించేలా రూ.40 కోట్ల ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించడం ఈ సూచనకు ఆచరణాత్మక బలం ఇస్తోంది.

ఇథనాల్‌ స్టవ్‌ ఎలా పని చేస్తుంది?
ఈ స్టవ్‌లో నీటిలో కేవలం 7 శాతం ఇథనాల్‌ కలిపితే సరైన మంట వస్తుందని గడ్కరీ తెలిపారు. సాధారణ ఎల్‌పీజీ స్టవ్‌లతో పోలిస్తే ఇందులో మసి, పొగ, కాలుష్యం ఏమీ ఉండదు. ఇథనాల్‌ సులభంగా లభ్యమవుతుంది మరియు దేశంలోని చక్కెర కర్మాగారాలు, మక్క ఉత్పత్తి నుంచి సులభంగా తయారు చేయవచ్చు. ఇప్పటికే ఈ స్టవ్‌లు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయి, కాబట్టి సాధారణ ప్రజలు సులభంగా ప్రయత్నించవచ్చు.

ఇథనాల్‌ స్టవ్‌తో ప్రయోజనాలు..
ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో ఇథనాల్‌ స్టవ్‌ గృహిణుల ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చు. పొగ, మసి లేకపోవడం వల్ల ఇంటి లోపలి గాలి నాణ్యత మెరుగుపడుతుంది. ముఖ్యంగా గ్రామీణ మహిళల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతులపై ఆధారపడటం తగ్గి, దేశీయ ఇథనాల్‌ ఉత్పత్తి పెరిగి రైతులకు కొత్త ఆదాయ వనరు అవుతుంది. రూ.40 కోట్ల పథకం ద్వారా స్టార్టప్‌లు, యువ ఇంజనీర్లు ఈ టెక్నాలజీని మరింత మెరుగుపరచడానికి ప్రోత్సాహం లభిస్తుంది.

ఇథనాల్‌ బ్లెండింగ్‌లో భారత్‌ ఇప్పటికే ముందుకు వచ్చింది. పెట్రోల్‌లో ఇథనాల్‌ మిశ్రమాన్ని పెంచడం ద్వారా క్రూడ్‌ ఆయిల్‌ ఆదా చేస్తోంది. ఇప్పుడు కుకింగ్‌ రంగంలోకి ఈ టెక్నాలజీని తీసుకురావడం సమగ్ర ఇంధన వ్యూహంలో భాగమని చెప్పవచ్చు.అయితే కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి:ఇథనాల్‌ సరఫరా గొలుసు బలోపేతం చేయాలి. సాధారణ ప్రజలు మారడానికి అవగాహన కార్యక్రమాలు అవసరం. స్టవ్‌ ధర, భద్రత, వినియోగ సౌలభ్యం వంటి అంశాల్లో మెరుగుదల చేయాలి. ఈ పథకం విజయవంతమైతే గ్రామీణ భారత్‌లో ఇంధన వినియోగం, పర్యావరణ రంగంలో ముఖ్యమైన మార్పు వస్తుంది. ప్రభుత్వం ఇథనాల్‌ ఉత్పత్తిని ప్రోత్సహిస్తే రైతులు, పరిశ్రమలు, గృహిణులు మూడు వర్గాలు కూడా లాభపడతాయి.

ఈ దిశలో కూర్చొని భోజనం చేస్తే.. మీరు ధనవంతులే..

Vastu Shastra Eating Direction
Vastu Shastra Eating Direction

Vastu Shastra Eating Direction: భారతీయ సంస్కృతిలో భోజనానికి ఎంతో గొప్ప స్థానం ఉంది. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని భావించిన మన పూర్వీకులు భోజనాన్ని కేవలం ఆకలి తీర్చుకునే ప్రక్రియగా కాకుండా ఒక పవిత్ర యజ్ఞంగా పరిగణించారు. అందుకే భోజనం చేసే ముందు శరీర శుభ్రత, మనసు ప్రశాంతత, కూర్చునే విధానం, చూసే దిశ వంటి అంశాలపై ప్రత్యేకమైన నియమాలు ఏర్పరిచారు. ఇవి కేవలం ఆధ్యాత్మిక విశ్వాసాలే కాకుండా ఆరోగ్య పరిరక్షణకు కూడా ఉపయోగపడతాయని భావిస్తారు. ఇలాంటి సమయంలో భోజనం చేసేటప్పుడు కొన్ని సరైన దిశలో కూర్చోవాలని అంటుంటారు. అసలు ఏ దిశలో కూర్చొని భోజనం చేయడం మంచిది?

వాస్తు శాస్త్రం, ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం.. ప్రతి దిశకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉందని, ఆ శక్తి మన శరీరం, మనస్సుపై ప్రభావం చూపుతుందని పూర్వీకులు నమ్మేవారు. అందుకే ఇంటి నిర్మాణంలోనూ, భోజన పద్ధతులలోనూ దిశలకు ప్రాముఖ్యత ఇచ్చారు. భోజనం చేసే సమయంలో తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ముఖం పెట్టుకుని కూర్చోవడం శుభప్రదంగా చెబుతారు.

తూర్పు దిశను అత్యంత శుభదాయకంగా భావిస్తారు. సూర్యుడు ఉదయించే దిశ కావడంతో ఇది శక్తి, ఆరోగ్యం, ఆయుష్షుకు సంకేతంగా చెప్పబడింది. తూర్పు వైపు చూస్తూ భోజనం చేస్తే శరీరంలో సానుకూల శక్తి పెరుగుతుందని, మనసు ప్రశాంతంగా మారుతుందని చెబుతారు. జీర్ణక్రియ కూడా సక్రమంగా జరిగి శరీరానికి అవసరమైన శక్తి అందుతుందని విశ్వసిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు తూర్పు దిశగా కూర్చొని భోజనం చేస్తే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని పెద్దలు చెబుతుంటారు.

ఉత్తర దిశను ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు. ఈ దిశను కుభేరుడి దిశగా పేర్కొంటారు. ఉత్తర దిశ వైపు కూర్చొని భోజనం చేయడం వల్ల ఆర్థిక స్థిరత్వం, ధనసమృద్ధి కలుగుతుందని వాస్తు శాస్త్రం వివరిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులు ఈ దిశలో భోజనం చేస్తే మానసిక ఉత్సాహం పెరిగి నిర్ణయ సామర్థ్యం మెరుగుపడుతుందని కొందరు నమ్ముతారు.

దక్షిణ దిశను యమధర్మరాజుతో అనుసంధానిస్తారు. అందుకే ఈ దిశ వైపు చూసి భోజనం చేయడం మంచిది కాదని పెద్దలు హెచ్చరిస్తారు. ఈ దిశలో భోజనం చేస్తే అలసట, మానసిక భారము పెరుగుతుందని అంటారు. అలాగే పడమర దిశ వైపు కూర్చొని భోజనం చేస్తే పెద్దగా మంచి లేదా చెడు ఫలితాలు ఉండవని, సాధారణ ప్రభావమే ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

భోజనం చేసే సమయంలో ప్రశాంత వాతావరణం కూడా చాలా ముఖ్యమని ఆధ్యాత్మిక శాస్త్రాలు సూచిస్తున్నాయి. కోపం, ఆందోళన, తొందరపాటు వంటి భావాలతో భోజనం చేస్తే ఆహారం సరిగా జీర్ణం కాదని చెబుతారు. అందుకే భోజనం సమయంలో ఎక్కువగా మాట్లాడకుండా, టీవీ లేదా మొబైల్ చూడకుండా, మనసును ప్రశాంతంగా ఉంచుకుని తినాలని సూచిస్తారు. ఇలా చేస్తే శరీరం ఆహారంలోని పోషకాలను సమర్థంగా గ్రహిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

పూర్వకాలంలో నేలపై కూర్చొని భోజనం చేసే పద్ధతికి కూడా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉండేది. నేలపై పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చొని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఆయుర్వేదం పేర్కొంటుంది. ఈ విధంగా కూర్చోవడం వల్ల శరీరంలోని నాడులు సమతుల్యంగా పనిచేసి మనసు ప్రశాంతంగా ఉంటుందని భావిస్తారు.

భోజనం ముందు చేతులు, కాళ్లు కడుక్కోవడం కూడా ఆరోగ్య పరిరక్షణలో భాగమే. ఇది కేవలం పరిశుభ్రతకే కాకుండా మనసుకు ప్రశాంతతను కూడా ఇస్తుందని అంటారు. అలాగే భోజనం చేసిన వెంటనే నీళ్లు ఎక్కువగా తాగకూడదని, కొద్దిసేపటి తర్వాత మాత్రమే తీసుకోవాలని ఆయుర్వేదం సూచిస్తుంది.

బతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్.. కలెక్టర్ నే ఆడేసుకున్న తీన్మార్ మల్లన్న.. వైరల్ వీడియో

Nalgonda Death Certificate Issue
Nalgonda Death Certificate Issue

Nalgonda Death Certificate Issue: కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఒంటరిగా అనాధాశ్రమాల్లో వదిలేస్తున్న పిల్లలను చూస్తున్నాం. కొందరైతే స్మశానంలో బతికుండగానే వదిలేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు చేస్తున్న పొరపాట్లు వాళ్ల నిర్లక్ష్యానికి అర్థం పడుతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో వృద్ధురాలు బతికుండగానే చనిపోయినట్లుగా అధికారులు ధ్రువీకరించారు. దీంతో బాధితురాలు ఎమ్మెల్సీ ని ఆశ్రయించింది.

ఎమ్మెల్సీకి ఫిర్యాదు..
నల్గొండ కలెక్టరేట్ పరిధికి చెందిన శిరీషాల మల్లమ్మ బతికుండగానే చనిపోయినట్లు అధికారులు సర్టిఫై చేశారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఫిర్యాదు చేసింది. స్పందించిన మల్లన్న ఈ విషయాన్ని నల్గొండ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఫోన్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేసిన కలెక్టర్ మాట్లాడుతుడగా,.. మల్లమ్మ అనే వృద్ధురాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నారు. అయినప్పటికీ స్థానిక అధికారులు ఆమె పేరిట డెత్ సర్టిఫికేట్ జారీ చేశారు. దీంతో ఆమెకు రావాల్సిన వృద్ధాప్య పెన్షన్, ప్రభుత్వ సౌకర్యాలు ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది.మల్లన్న జోక్యంఈ అన్యాయాన్ని గమనించిన తీన్మార్ మల్లన్న స్వయంగా అడిగారు.

నీళ్లు నమిలిన కలెక్టర్..
ఎమ్మెల్సీ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయినా కలెక్టర్ నీళ్లు నమిలారు. జిల్లా పాలన అధికారిగా బాధ్యతలు తీసుకోవాల్సి ఉండగా ఫోన్ మాట్లాడుతుండగానే కట్ చేశారు.. ఈ ఫోన్ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

ఇది మొదటిసారి కాదు..
ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. మేక పర్యాయాలు ఇలాంటి తప్పుడు వివరాల నమోదు ఘటనలు వెలుగులోకి వచ్చాయి ఆధార్ లింకింగ్, డేటా అప్‌డేషన్ లోపాల వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. బతికున్న వ్యక్తికి చావు సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల ఆ వ్యక్తి కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పెన్షన్ ఆగిపోవడం, ఇతర ప్రభుత్వ సహాయాలు రాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

ఈ ఘటనపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “బతికున్న వారిని చంపేసి సర్టిఫికేట్ ఇచ్చే అధికారులను ఎవరు బాధ్యుల్ని చేస్తారు?” అని ప్రశ్నిస్తున్నారు.తీన్మార్ మల్లన్న ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా సరైన చర్యలు జరగకపోవడం అధికార వ్యవస్థలోని ఉదాసీనతను బయటపెట్టింది.

 

View this post on Instagram

 

A post shared by Np_official (@np_officials1)

సీఎం విజయ్ విజయం పై ఓపెన్ అయిపోయిన పవన్ కళ్యాణ్.. వైరల్ వీడియో

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ అధినేత.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత సోషల్ మీడియాలో బాగా టోల్ అవుతున్నారు. దళపతి విజయ్ పార్టీ పెట్టిన రెండున్నర ఏళ్లలో ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించి సీఎం అయ్యారు. దీంతో అక్కడి రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ లోని జనసేనతో పోలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ దళపతి విజయ్ ఇద్దరూ సినిమా నేపథ్యం నుంచి వచ్చిన వారే కావడం ఇందుకు కారణం. సోషల్ మీడియాలో రోల్పై పవన్ కళ్యాణ్ ఇంతకాలం మౌనం పాటించారు. తాజాగా పార్టీ సమావేశంలో ఓపెన్ అయ్యారు.

తమిళ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు..
తమిళనాడు రాజకీయాల్లో నటుడు దలపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీ వీ కె) సాధించిన అసాధారణ విజయం దక్షిణ భారత రాజకీయ దృశ్యాన్ని మార్చేసింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీ వీ కె 108 సీట్లు సాధించి కొలిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విజయ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టడం రాజకీయ వర్గాల్లో తెగ చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇటీవల జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడుతూ తమిళనాడు రాజకీయాలను ప్రశంసించారు. అదే సమయంలో తన 15 ఏళ్ల రాజకీయ ప్రయాణాన్ని పరోక్షంగా ప్రస్తావించి, ఆత్మపరిశీలన చేశారు.

అసూయ కలిగేలా..
పవన్ కళ్యాణ్ తమిళనాడు రాజకీయాలను “చాలా ప్రశాంతంగా, సుఖంగా, కేర్‌ఫ్రీగా” జరుగుతున్నాయని అభివర్ణించారు. విజయ్ అభిమానులు పెట్టిన భారీ కటౌట్లు, హాలోగ్రామ్స్, భారీ సెలబ్రేషన్స్ ద్వారా సీఎం పదవి సాధించడం చూసి “అసూయ కలుగుతోంది” అని స్పష్టంగా చెప్పారు. “వాళ్లు కటౌట్లు పెట్టుకుని సంతోషంగా గెలిచేశారు. నేను 15 సంవత్సరాలు రోడ్ల మీద తిరిగినా అలాంటి విజయం రాలేదు” అని నవ్వుతూ అన్నారు.

ఆంధ్ర వర్సెస్ తమిళనాడు..
పవన్ తన వ్యాఖ్యల్లో ఒక ముఖ్యమైన పాయింట్‌ను స్పష్టం చేశారు. తమిళనాడు రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌కు భిన్నమని, ఇద్దరినీ పోల్చడం అవివేకమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కులాలు, సామాజిక సమీకరణాలు, కాంప్లికేటెడ్ అలయన్స్ రాజకీయాలు ఉండగా, తమిళనాడులో సినిమా స్టార్ ఫాలోయింగ్ మరింత ఏకగ్రీవంగా పని చేసిందని సూచించారు.“సీఎం కావాలని లేదా పదవుల కోసం పార్టీ పెట్టలేదు. కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేయాలనే ఉద్దేశ్యంతోనే జనసేనను స్థాపించాను” అని చెప్పడం ద్వారా తన రాజకీయ లక్ష్యాలను మరోసారి పునరుద్ఘాటించారు.

నాయకులు నేర్చుకోవాల్సిన పాఠాలు..
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రాజకీయాల్లో అరుదైన నిజాయితీని ప్రదర్శిస్తాయి. చాలా మంది నాయకులు తమ వైఫల్యాలను ఒప్పుకోకుండా ఇతరులను నిందించడం సాధారణం. కానీ ఇక్కడ ఒక సీనియర్ నాయకుడు తన 15 ఏళ్ల అనుభవాన్ని ప్రస్తావించి, మరొకరి విజయాన్ని అభినందిస్తూ స్వీయ విమర్శ చేయడం పరిపక్వతను చాటుతుంది. సినిమా ప్రభావం రాజకీయాల్లో ఇప్పటికీ బలంగా ఉంది. కానీ ఆ శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలంటే సామాజిక సమీకరణాలు, భూమిక అనుకూలంగా ఉండాలి. తమిళనాడులో కనిపించిన తక్కువ వ్యక్తిగత దాడులు, ఏకత్వం ఆంధ్రప్రదేశ్‌కు అవసరం. వ్యక్తిగత విమర్శలు తగ్గి, అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. 15 ఏళ్ల అనుభవం తర్వాత కూడా కొత్త విజయాలను చూసి ఆలోచించడం నాయకులకు మంచి గుణం. ఇది భవిష్యత్ వ్యూహాలకు దారి చూపుతుంది.
పవన్ కళ్యాణ్ మాటలు కేవలం విజయ్‌ను అభినందించడం కాదు — దక్షిణ భారత రాజకీయాల్లో మారుతున్న ట్రెండ్‌ను, తన ప్రయాణంలోని సవాళ్లను, మరింత మెరుగైన రాజకీయ సంస్కృతి అవసరాన్ని గుర్తు చేస్తాయి.

ఈ వైరల్ వీడియో యువ నాయకులు, రాజకీయ విశ్లేషకుల మధ్య చర్చలను రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత పరిపక్వంగా, ప్రజా సమస్యలకు పరిష్కారాలు ఇచ్చే దిశగా మారాలంటే పవన్ చెప్పినట్లు తమిళనాడు నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవడం మంచిదే. రాజకీయాలు కేవలం అధికార పోటీ కాదు, ప్రజల ఆకాంక్షలను తీర్చే సాధనం కావాలి.

ఏపీలో ఎండ ప్రచండం.. మరో నాలుగు రోజులు ఇలానే!

Andhra Pradesh Heatwave
Andhra Pradesh Heatwave

Andhra Pradesh Heatwave: ఏపీలో ఎండ ప్రచండం ఉంది. రోళ్లు పగిలేలా ఎండలు ఉన్నాయి. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వేడి గాలుల తీవ్రత పెరుగుతోంది. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా.. అన్నిచోట్ల ఒకేలా ఉంది పరిస్థితి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఒకే మాదిరిగా ఉంది వాతావరణం. రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలో వేడిగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కోస్తాంధ్ర తీర ప్రాంతం ఉడికిపోతోంది. శనివారం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. అదే జరిగితే ఏపీ ప్రజలకు మరింత ఇబ్బందికరమే.
* ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు,ఎన్టీఆర్, బాపట్ల,ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
* విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయగోదావరి, నెల్లూరు జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
* శ్రీకాకుళం,విశాఖ, కాకినాడ,, చిత్తూరు, తిరుపతి, మదనపల్లి, శ్రీ సత్య సాయి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
* నేడు రాష్ట్రవ్యాప్తంగా 26 మండలాల్లో తీవ్రవడగాలులు, 137 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.
* మరోవైపు దేశానికి రుతుపవనాలు రాక ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈరోజు నుంచి వారం రోజుల వ్యవధిలో కేరళకు తాకుతాయి రుతుపవనాలు. జూన్ రెండో వారంలో తెలుగు రాష్ట్రాలకు తాకే ఛాన్స్ కనిపిస్తోంది.

గత ఏడాది డీఎస్సీ పై జగన్ కొత్త కథలు!

Jagan Mohan Reddy
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరి పై విద్యాధికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రజా సమస్యలను ప్రస్తావించే క్రమంలో.. కొన్ని వ్యవస్థల విషయంలో చేస్తున్న ఆరోపణలు సహేతుకం కాదని వాదిస్తున్నారు. తాజా గా జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై సంచలన ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం 16 వేల ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది వారంతా ఉద్యోగాల్లో చేరి పాఠాలు కూడా బోధిస్తున్నారు. అయితే ఆ డీఎస్సీ అక్రమం అని జగన్మోహన్ రెడ్డి తాజాగా ఆరోపించడం చూస్తుంటే.. ఆయన అపరిపక్వతకు అద్దం పడుతోంది. అత్యంత పారదర్శకంగా డీఎస్సీ ప్రక్రియ పూర్తయి.. నియామకాలు కూడా జరిగిన తరువాత బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అర్థంలేని ఆరోపణలు చేయడం ఏంటని విద్యాశాఖ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

* 16 వేల ఉపాధ్యాయుల భర్తీ..
గత ఏడాది కూటమి ప్రభుత్వం 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పటికే ఎన్నికలకు ముందు జగన్ ప్రభుత్వం సైతం 6000 పోస్టులతో నోటిఫికేషన్ అయితే ప్రకటించింది కానీ ఎటువంటి పరీక్షలు నిర్వహించలేకపోయింది. కనీసం దరఖాస్తు ప్రక్రియ కూడా చేయలేకపోయింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ని ప్రకటించింది. అప్పుడు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోర్టులను ఆశ్రయించారు. డీఎస్సీ నోటిఫికేషన్ ను అడ్డగించే ప్రయత్నం చేశారు. కానీ లోకేష్ పట్టుదలగా వ్యవహరించి డీఎస్సీ నియామక ప్రక్రియను సకాలంలో పూర్తిచేసి.. 16,000 మందికి ఉద్యోగాలను అప్పగించి వారి కళ్ళల్లో ఆనందం నింపారు. ఇప్పుడు ఏడాది తర్వాత సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని రంగరించి జగన్ కొత్త కథ అల్లుతున్నారు. పైగా డీఎస్సీ వివరాలను ప్రభుత్వం వెబ్సైట్ నుంచి డిలీట్ చేసిందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అయితే విద్యాశాఖతో పాటు సమాజంపై అవగాహన ఉన్నవారు దీనిని తప్పుపడుతున్నారు.

* తప్పు అని తేల్చిన ఏపీ ఫాక్ట్ చెక్
అయితే జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేయడంతో ఏపీ ఫ్యాక్ట్ చెక్ రంగంలోకి దిగింది. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నవి తప్పుడు ఆరోపణలుగా తేల్చింది. ప్రభుత్వ వెబ్సైట్లో అన్ని వివరాలు ఉన్నాయని.. ఎటువంటి డిలీట్ చేయలేదని తేల్చి చెప్పింది. మంత్రి నారా లోకేష్ సైతం స్పందించారు. మరో ఏడుపుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉండాలని సూచించారు. త్వరలో మరో డీఎస్సీ ప్రకటిస్తామని.. ప్రతి సంవత్సరం దీనిని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జగన్ అధికారంలోకి వస్తే ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పారని.. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించలేదని.. ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ భర్తీ చేయలేదని.. ఆయనకు ఏడుపు తప్ప మరొకటి ఎందుకు కనిపిస్తుంది అంటూ ఎద్దేవా చేశారు లోకేష్. మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి డీఎస్సీపై చేస్తున్న ఆరోపణలు విద్యాశాఖ వర్గాల్లో విస్మయం రేపుతోంది. డీఎస్సీ పోస్టుల నియామకం జరపకపోగా ఇటువంటి అడ్డగోలు ఆరోపణలు చేయడం ఏంటనేది ఎక్కువమంది ప్రశ్న.

చీరలో కైపెక్కించే చరిత అందాలు

Chaithra J Achar
Chaithra J Achar