Homeఎంటర్టైన్మెంట్Devara Movie TV telecast: ఎట్టకేలకు 'దేవర' టీవీ టెలికాస్ట్ కి మోక్షం.. ఏ ఛానల్...

Devara Movie TV telecast: ఎట్టకేలకు ‘దేవర’ టీవీ టెలికాస్ట్ కి మోక్షం.. ఏ ఛానల్ లో రాబోతుందంటే..

Devara Movie TV telecast: #RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ హీరో గా నటంచిన ‘దేవర’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ నటన , అనిరుద్ మ్యూజిక్, కొరటాల శివ మార్క్ వింటేజ్ టేకింగ్ , ఈ చిత్రాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లాయి. ఆరంభం లో డివైడ్ టాక్ వచ్చింది కానీ , ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి కదిలిన […]

Devara Movie TV telecast: #RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ హీరో గా నటంచిన ‘దేవర’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ నటన , అనిరుద్ మ్యూజిక్, కొరటాల శివ మార్క్ వింటేజ్ టేకింగ్ , ఈ చిత్రాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లాయి. ఆరంభం లో డివైడ్ టాక్ వచ్చింది కానీ , ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి కదిలిన తర్వాత టాక్ స్థిరపడింది. అలా టాక్ స్థిరపడిన తర్వాత ఈ చిత్రానికి అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 390 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నెట్ ఫ్లిక్స్ లో కూడా ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం గమనార్హం. అయితే ఇంతటి ఆదరణ దక్కించుకున్న ఈ చిత్రం ఇప్పటి వరకు టీవీ టెలికాస్ట్ అవ్వకపోవడం అభిమానులను నిరాశకు గురి చేసిన అంశం.

ఓటీటీ ప్రభావం వల్ల, టీవీ టెలికాస్ట్ మీద కూడా బలమైన ప్రభావం చూపడంతో , నిర్మాత కళ్యాణ్ రామ్ అడిగినంత డబ్బులు ఇచ్చేందుకు ఏ ఓటీటీ సంస్థ కూడా ముందుకు రాలేదు. అందుకే ఈ చిత్రం ఇన్ని రోజులు టెలికాస్ట్ కి నోచుకోలేదు. అయితే ఎట్టకేలకు ఈ సినిమా సాటిలైట్ రైట్స్ ని ఈటీవీ ఛానల్ సొంతం చేసుకుంది. చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ సినిమాని కొనుగోలు చేసింది ఈటీవీ ఛానల్. ఇప్పటి వరకు ఆ ఛానల్ లో ‘నిన్ను చూడాలని’, ‘అల్లరి రాముడు’, ‘సింహాద్రి’ వంటి చిత్రాలు మాత్రమే టెలికాస్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఒక్క ఎన్టీఆర్ సినిమా కూడా ఈటీవీ ఛానల్ కి వెళ్ళలేదు. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ సినిమాని కొనుగోలు చేయడం తో , భారీ లాభాలు వస్తాయని బలమైన నమ్మకంతో ఉంది ఈటీవీ సంస్థ.

ఈ చిత్రాన్ని త్వరలోనే ఈటీవీ ఛానల్ లో టెలికాస్ట్ చేయబోతున్నారు. మరి థియేటర్స్ లో , ఓటీటీ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి టీవీ టెలికాస్ట్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. మరోపక్క రీసెంట్ గానే ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2’ చిత్రాన్ని స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ చేశారు. ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చింది. గత ఏడాది విడుదలైన సినిమాకే ఇలాంటి రెస్పాన్స్ వచ్చిందంటే , ఇక రెండేళ్ల క్రితం విడుదలైన ‘దేవర’ ని ఆడియన్స్ ఎంతమేరకు పట్టించుకుంటారో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper