Homeబిజినెస్Oppo Find X9 Ultra launch in India: Oppo నుంచి రెండు ఫోన్లు.. ఎల్లుండి...

Oppo Find X9 Ultra launch in India: Oppo నుంచి రెండు ఫోన్లు.. ఎల్లుండి నుంచే అందుబాటులోకి..

Oppo Find X9 Ultra launch in India: Oppo కంపెనీ నుంచి కొత్త మొబైల్స్ మార్కెట్లోకి వచ్చాయి. కెమెరా పనితీరుతో పాటు అద్భుతమైన ఫీచర్లు కావాలని అనుకునేవారు ఈ కంపెనీకి చెందిన ఫోన్లు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇందులో భాగంగా కంపెనీ నుంచి Find X9 Ultra,Find X9s స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయ్యాయి. ఇవి 28 మే 2026 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు ఫోన్ల పెర్ఫామెన్స్ గురించి వివరాల్లోకి […]

Oppo Find X9 Ultra launch in India: Oppo కంపెనీ నుంచి కొత్త మొబైల్స్ మార్కెట్లోకి వచ్చాయి. కెమెరా పనితీరుతో పాటు అద్భుతమైన ఫీచర్లు కావాలని అనుకునేవారు ఈ కంపెనీకి చెందిన ఫోన్లు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇందులో భాగంగా కంపెనీ నుంచి Find X9 Ultra,Find X9s స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయ్యాయి. ఇవి 28 మే 2026 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు ఫోన్ల పెర్ఫామెన్స్ గురించి వివరాల్లోకి వెళితె..

Oppo Find X9 Ultra మొబైల్ లో Qualcomm Snapdragon 8 Elite Gen 5 చిప్ సెట్ ఉండనుంది. ఇది అత్యంత శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్. ఇది 16GB RAM వరకు సపోర్ట్ చేస్తుంది. అలాగే భారతదేశంలో 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్‌లో దీనిని రూ. 1,69,999 ధరతో అందుబాటులో ఉండనుంది. ఈ ప్రాసెసర్, ర్యామ్ తో మల్టీ‌టాస్కింగ్, AI ప్రాసెసింగ్‌ ఉపయోగించేవారికి అనుగుణంగా ఉంటుంది.

X9 Ultraలో 6.8 అంగుళాల AMOLED డిస్ప్లే ఉంది. ఇది 2K రెజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. ఇది AI-పవర్డ్ అడాప్టివ్ ఐ కేర్ టెక్నాలజీతో వచ్చి తక్కువ లైట్‌తో ఉంటుంది. X9 Ultraలో డ్యూయెల్ కెమెరాలు ఉన్నాయి. ఇవి 200MP మెయిన్ కెమెరా, మరొకటి 50MP 10x ఆప్టికల్ టెల్లిఫోటో లెన్స్. ఇది 8K Ultra-Clear వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

X9 Ultraలో విపరీతమైన 7050mAh బ్యాటరీ కనిపిస్తుంది. ఇది సిలికాన్ కార్బన్ టెక్నాలజీతో తయారైంది. ఈ బ్యాటరీ 100 W వైర్డ్ చార్జింగ్, 50W ర్‌లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఒక రోజంతా కెమెరా, గేమింగ్, వీడియో స్ట్రీమింగ్‌కు పూర్తి బ్యాక్‌అప్ అందిస్తుంది.

Oppo Find X9s కూడా Snapdragon 8 సిరీస్ ప్రాసెసర్‌తో వస్తుంది, 12GB RAM + 256GB/512GB స్టోరేజ్ ఉంటుంది. దీని ధర ప్రారంభ ధర రూ.79,999 ఉండగా.. ఇందులో 7025mAh బ్యాటరీ ఉండనుంది. ఈ బ్యాటరీకి 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు చేస్తుంది. బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో X9s మొబైల్ ను రూ. 62,199కి కొనుగోలు చేయొచ్చు. Ultra ధర రూ.1,36,999కి తగ్గుతుంది. ఈ ఫోన్‌లు OPPO e-Store, Flipkart, Amazon స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper