Peddi movie overseas advance bookings: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం సరిగ్గా మరో 8 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కానీ ఈ చిత్రానికి మొదట్లో ఉన్నటువంటి హైప్, హంగామా మాత్రం ఇప్పుడు జనాల్లో కనిపించడం లేదు. ‘చికిరి చికిరి’ సాంగ్ గ్లోబల్ వైడ్ గా సునామీ సృష్టించింది, ఆ తర్వాత విడుదలైన ‘రయ్ రయ్ రారా’ పాటకు కూడా ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జెన్ జీ ఆడియన్స్ ఇన్ స్టాగ్రామ్ లో ఈ పాటకు కూడా లక్షల సంఖ్యలో రీల్స్ చేశారు. ఇక ఆ తర్వాత విడుదలైన పహిల్వాన్ గ్లింప్స్ , థియేట్రికల్ ట్రైలర్, పోస్టర్స్ ఇవన్నీ కూడా అదిరిపోయాయి. వీటికి తోడు ప్రొమోషన్స్ కూడా అదరగొడుతోంది మూవీ టీం. ఒకపక్క ఇంటర్వ్యూస్ ఇస్తూనే , మరోపక్క నాన్ స్టాప్ గా ఈవెంట్స్ ని పెడుతున్నారు.
రీసెంట్ గానే భోపాల్ లో నిర్వహించిన ఈవెంట్ ఎంతటి సక్సెస్ అయ్యిందో మన కళ్లారా చూశాము. దాదాపుగా 2 లక్షల మంది జనాలు ఈ ఈవెంట్ కి వచ్చారు. అదే విధంగా నిన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈవెంట్ జరిగింది. ఇలా నిత్యం ఈ సినిమా ని ఆడియన్స్ లో ఉంచేందుకు మూవీ టీం పటిష్టమైన ప్రణాళికలు చేసింది. కానీ ఇవేమి ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ పై మాత్రం ఎలాంటి ప్రభావం చూపించడం లేదు. నార్త్ అమెరికా లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించిన మొదటి రోజే 1 లక్షా 47 వేల డాలర్లు వచ్చేలోపు అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇండియన్ సినిమా హిస్టరీ లో ఈ రేంజ్ ఆరంభం ఏ సినిమాకు కూడా జరగలేదు. ఆరంభం లో వచ్చిన ఈ గ్రాస్ ని చూసి , అభిమానులు , ప్రేక్షకులు , ట్రేడ్ వర్గాలు కచ్చితంగా ఓజీ , దేవర కలెక్షన్స్ ని దాటేస్తుందని అనుకున్నారు.
కానీ అది జరగడం లేదు. మరో ఓజీ, దేవర అవుతుందని అనుకుంటే, హరి హర వీరమల్లు , రాజా సాబ్ రేంజ్ ట్రెండ్ ని కనబరుస్తూ ఓవర్సీస్ బయ్యర్స్ లో వణుకు పుట్టేలా చేస్తోంది ఈ చిత్రం. ఎందుకంటే కేవలం ఒక్క నార్త్ అమెరికా లోనే ఈ చిత్రం 7.5 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే ప్రీమియర్స్ నుండి కచ్చితంగా 3 మిలియన్ డాలర్ల గ్రాస్ రావాల్సిన అవసరం ఉంది. కానీ ఈ చిత్రానికి ఇప్పటి వరకు కేవలం 4 లక్షల 60 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అది కూడా 1401 షోస్ నుండి. ఓజీ చిత్రం రెండు రోజుల్లో 5 లక్షల డాలర్లు, ఓవరాల్ ప్రీ సేల్స్ 2.5 మిలియన్ డాలర్లు వచ్చాయి. కానీ ‘పెద్ది’ చిత్ర పరిస్థితి చూస్తుంటే 1 మిలియన్ ప్రీ సేల్స్ కూడా కష్టం లాగా అనిపిస్తోంది , చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.
