Blood Pressure Management: భారతదేశంలో హైబీపీ (అధిక రక్తపోటు) ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన ‘సైలెంట్ కిల్లర్’గా మారుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా All India Institute of Medical Sciences కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ అంబుజ్ రాయ్ వెల్లడించిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో ప్రతి ఏడాది సుమారు 16 లక్షల మంది హైబీపీ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు వంటి తీవ్రమైన వ్యాధులకు హైబీపీ ప్రధాన కారణంగా మారుతోందని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు పెద్దగా కనిపించకపోవడంతో చాలా మంది తమకు ఈ సమస్య ఉందనే విషయం ఆలస్యంగా తెలుసుకుంటున్నారు. అయితే హైబీపీ రాకుండా ఉండాలంటే జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా అవసరం. అవేంటంటే?
ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 30 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని అంచనా. పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత వేగంగా పెరుగుతోంది. నగరాల్లో సుమారు 33 శాతం మంది, గ్రామీణ ప్రాంతాల్లో 25 శాతం మంది హైబీపీతో బాధపడుతున్నారని నిపుణులు వెల్లడించారు. మారుతున్న జీవనశైలి, అధిక ఒత్తిడి, శారీరక శ్రమ తగ్గిపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.
హైబీపీని ‘సైలెంట్ కిల్లర్’ అని పిలవడానికి కారణం, ఇది చాలా కాలం పాటు ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండానే శరీరాన్ని లోపల నుంచి దెబ్బతీయడం. కొందరికి తలనొప్పి, తల తిరగడం, అలసట వంటి స్వల్ప లక్షణాలు కనిపించినా, చాలామందిలో ఏ సంకేతాలూ కనిపించవు. దీంతో పరీక్షలు చేయించుకునే వరకు సమస్య బయటపడదు. అప్పటికే గుండె, మెదడు, కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది.
వైద్యుల అభిప్రాయం ప్రకారం, హైబీపీని పూర్తిగా నివారించలేకపోయినా, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా రోజూ తీసుకునే ఉప్పు పరిమాణాన్ని తగ్గించడం చాలా అవసరం. అధిక ఉప్పు ఉన్న ప్యాకేజ్డ్ ఫుడ్స్, నిల్వ పచ్చళ్లు, చిప్స్, బేకరీ పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్ వంటి వాటిని తగ్గించాలి. నూనె, మసాలాలు అధికంగా ఉండే ఆహారాన్ని తరచుగా తినడం కూడా రక్తపోటును పెంచుతుంది.
శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం కూడా హైబీపీ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఊబకాయం ఉన్నవారిలో రక్తపోటు సమస్య ఎక్కువగా కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడక, యోగా లేదా ఇతర వ్యాయామాలు చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. అలాగే సరిపడ నిద్ర, మానసిక ప్రశాంతత కూడా ఎంతో అవసరం.
ఇప్పటి జీవనశైలిలో ఒత్తిడి కూడా హైబీపీకి ప్రధాన కారణంగా మారింది. ఉద్యోగ ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, నిద్రలేమి వంటి కారణాల వల్ల రక్తపోటు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ధ్యానం, యోగా, శ్వాస వ్యాయామాలు వంటి అలవాట్లు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. కుటుంబ సభ్యులతో సమయం గడపడం, హాబీలకు సమయం కేటాయించడం వంటి చిన్న మార్పులు కూడా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు హైబీపీ ప్రమాదాన్ని మరింత పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొగతాగడం వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి. మద్యం అధికంగా తీసుకోవడం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి వీటిని పూర్తిగా మానేయడం లేదా తగ్గించడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
వైద్యులు సూచిస్తున్న మరో ముఖ్యమైన విషయం రెగ్యులర్ హెల్త్ చెకప్. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి వ్యక్తి నిరంతరం రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. కుటుంబంలో ఇప్పటికే హైబీపీ లేదా గుండె జబ్బుల చరిత్ర ఉంటే మరింత జాగ్రత్త అవసరం. ప్రారంభ దశలోనే గుర్తిస్తే మందులు, జీవనశైలి మార్పులతో ఈ సమస్యను సమర్థంగా నియంత్రించవచ్చు.
















రోజాపై కొత్త జంతువుల పేర్లతో షర్మిల దాడి.. రెడీగా ఉండాల్సిందే!
Roja Vs Sharmila: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు వివాదాస్పద అంశాల జోలికి వెళ్తూనే ఉంటారు. సాధారణంగా కుటుంబ వ్యవహారాలను నేతలు పెద్దగా ప్రస్తావించరు. కానీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ వ్యవహారంలో చాలామంది నేతలు మాట్లాడుతుంటారు. తాజాగా మహానాడులో ఇదే ప్రస్తావన వచ్చింది. గొడ్డలి పార్టీగా పేర్కొంటూ వైయస్ వివేకానంద రెడ్డి హత్య అంశం ప్రస్తావిస్తూ నేతలు ఆరోపణలు చేశారు. అయితే వీటిని తిప్పి కొట్టే క్రమంలో మాజీ మంత్రి రోజా.. ఎవరిది గొడ్డలి పార్టీ అంటూ ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి హత్య ఘటన ఎవరి హయాంలో జరిగింది అంటూ లాజిక్ ప్రశ్న వేశారు. అంతటితో ఆగకుండా జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లెలు షర్మిలకు ప్రపంచంలో ఏ అన్న ఇవ్వని విధంగా భారీగా ఆస్తులు ఇచ్చారని చెప్పుకొచ్చారు. వారి మధ్య జరుగుతున్న వివాదాన్ని ప్రస్తావించారు. మధ్యలో విజయమ్మ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. వివేకానంద రెడ్డి హత్య ఘటన చంద్రబాబు హయాంలో జరిగిందని.. ఆయనను నిలదీయాలని పిలుపునిచ్చారు.
* రాచమల్లు పై కుక్క అని ఆరోపణ..
మొన్న మధ్యన జగన్మోహన్ రెడ్డితో షర్మిల వివాదాన్ని ప్రస్తావించారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ప్రపంచంలోనే షర్మిల లాంటి సోదరి ఎవరికీ ఉండకూడదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన అన్న తనను మోసం చేసిన తీరుపై షర్మిల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారు. తాను తన అన్న జగన్మోహన్ రెడ్డి పై మాట్లాడుతుంటే.. కుక్కలతో మాట్లాడిస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు. అవును తాము జగన్మోహన్ రెడ్డి అనే యజమానికి కుక్కలం అంటూ రాచమల్లు స్టేట్మెంట్ ఇచ్చారు. వెంటనే స్పందించిన షర్మిల వైసిపి నేతలను కుక్కలు అనవద్దు.. కుక్కలు కూడా బాధపడుతున్నాయి అంటూ సెటైర్లు వేస్తూ కామెంట్స్ చేశారు.
* రోజాపై తప్పక రియాక్షన్..
ఇంత జరిగాక కూడా మాజీ మంత్రి రోజా ఇప్పుడు షర్మిల ప్రస్తావన తీసుకొస్తున్నారు. దీంతో రోజాపై షర్మిల ఎలా రియాక్ట్ అవుతారో అని ఎక్కువ మంది ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు కుక్క అని సంబోధించారు. ఇక కొత్త జంతువుల పేర్లను పెట్టి గట్టిగానే షర్మిల రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేతిలో తాను మోసపోయానని.. తన ఆస్తిని సైతం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారని.. ఆ కారణంతోనే ఆయనను విభేదించడం ప్రారంభించారు షర్మిల. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఏ చెల్లికి ఇవ్వనంత ఆస్తి.. షర్మిలకు ఇచ్చారంటూ రోజా వకాల్తా పుచ్చుకొని మాట్లాడారు. దీనిపై షర్మిల నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ ఉండబోతుంది.