Pawan Kalyan forestry ministry: ఎవరికైనా మంత్రి పదవి పొందే అవకాశం ఉంటే రెండవ మాటకు తావు లేకుండా రెవెన్యూ వైపు చూస్తారు. అవకాశం ఉంటే ఫైనాన్స్ లేదా ఎనర్జీ.. వంటి శాఖలను తీసుకుంటారు. ఎందుకంటే వాటిలో ఉండే సౌలభ్యం వేరు.. సంపాదించుకునే మార్గం వేరు.. కానీ ఏపీలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత.. ఆయన ఏరి కోరి పర్యావరణ శాఖను తీసుకున్నారు. తీసుకోవడం మాత్రమే కాదు తాను ఆ శాఖను తీసుకోవడం వల్ల ఏం చేస్తానో కూడా చేసి చూపిస్తున్నారు.
మరికొద్ది రోజుల్లో గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కార్యాచరణ మొదలుపెట్టాయి. ఏపీ రాష్ట్రంలో గోదావరి విస్తారంగా ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఈ నది చుట్టుపక్కల కాలుష్యకారక పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. ఆ పరిశ్రమలు పెద్ద వ్యక్తుల చేతిలో ఉన్నాయి. వాటి గురించి ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. తొలిసారిగా పవన్ కళ్యాణ్ ఆ విషయం మీద దృష్టి సారించారు. అదే కాదు తన పార్టీకి చెందిన మంత్రి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్యకారక పరిశ్రమలు ఈ స్థాయిలో ఉంటే మీరు ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు.. ఈ పరిశ్రమలు త్వరలో మూతపడే అవకాశం ఉంది. గోదావరి ఊపిరి పీల్చుకునే సుముహూర్తం దగ్గర్లోనే ఉంది. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ చూపించిన తెగువ వల్ల సాధ్యమైంది.
పవన్ కళ్యాణ్ ఆ మధ్య ఉమ్మడి చిత్తూరులో పర్యటించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ మీద ఉక్కు పాదం మోపాలంటే ఏం చేయాలో క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అటవీశాఖ సిబ్బందికి ఆయుధాలు.. ఇతర సామాగ్రి అందించేందుకు ప్రభుత్వాన్ని ఒప్పించారు. మరికొద్ది రోజుల్లో అటవీశాఖ సిబ్బందికి అత్యంత ఆధునికమైన ఆయుధ సామాగ్రి చేతికి వస్తుంది. దీనివల్ల ఆపత్కాలంలో వారికి ఆ ఆయుధాలు రక్షణగా ఉపయోగపడతాయి . అంతేకాదు స్మగ్లర్ల ఆగడాలకు చెక్ పడుతుంది.
వీటితోనే పవన్ కళ్యాణ్ ఆగిపోలేదు.. ఏపీలో విస్తారంగా ఉన్న అడవుల్లో జంతువుల వేట ఇష్టానుసారంగా సాగుతూ ఉంటుంది. వేటగాళ్లు అడవులలో ఉచ్చులు బిగిస్తుంటారు. ట్రాప్లు ఏర్పాటు చేస్తుంటారు. అందులో చిక్కుకున్న జింకలు.. కుందేళ్లు.. దుప్పులు.. వంటి జంతువులను వధించి.. వాటి మాంసాన్ని విక్రయిస్తుంటారు.. ఈ జంతువులను విక్రయించడం వల్ల అడవుల్లో జీవ వైవిధ్యం పూర్తిగా దెబ్బతింటున్నది. అందువల్ల పులులు.. ఇతర క్రూర మృగాలు ఆహారం లభించగా జనావాసాల్లోకి వస్తున్నాయి.
ఆ మధ్య రాజమండ్రిలోకి ఒక పులి వచ్చింది. చాలా రోజులపాటు ఆ ప్రాంతం లోనే అది తిరిగింది. చివరికి అటవీశాఖ అధికారులు పట్టుకోవడంతో రాజమండ్రి వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే.. అయితే ఈ అడవి జంతువులను వేటాడే వేటగాళ్ల కు చెక్ పెట్టేందుకు పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా సూచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి.. అడవుల్లో ఉన్న ఉచ్చులు.. ఫుల్ ట్రాప్లు.. కరెంటు తీగలను తొలగించారు.
హనుమాన్ ఫౌండేషన్ అటవీశాఖ అధికారులకు సహకరించింది. రంపచోడవరం అటవీ ప్రాంతంలో దుండగులు భారీ ఎత్తున ఉచ్చులు ఏర్పాటు చేశారు. రాహుల్ కూడా ఏర్పాటు చేశారు. దాదాపు క్షేత్రస్థాయిలో అటవీశాఖ అధికారులు మూడు రోజుల పాటు శ్రమించారు. అత్యంత కఠినమైన పరిస్థితుల మధ్య శ్రమించి 242 ఉచ్చులను, 10 ఫుల్ ట్రాప్ లను, 10 కిలోమీటర్ల పొడవు ఉన్న విద్యుత్ తీగలను తొలగించారు..
వీటిని తొలగించడం వల్ల ఎన్నో అటవీ జంతువులు బతికి బట్టకట్టాయి.. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే.. ఇలాంటి ఎన్నో పనులు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఎందుకంటే పచ్చని అడవి బాగుంటేనే మనిషి బతుకు బాగుంటుంది. అడవి ఎండిపోయిననాడు మనిషి బతుకు ఎడారి అవుతుంది.
















తిట్టిన మెగా ఫ్యామిలీనే నమ్ముకున్న రోజా!
Roja: రాజకీయంగా మాజీమంత్రి రోజా దూకుడు స్వభావంతో ఉంటారు. రాజకీయ ప్రత్యర్థులను విపరీతంగా ద్వేషిస్తుంటారు. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆమె వాడే భాష, పదప్రయోగం తీవ్రంగా ఉంటుంది. ఇటీవల మెగా ఫ్యామిలీ పై కూడా ఆమె తరచూ వ్యాఖ్యానాలు చేస్తుంటారు. వారికి మద్దతుగా నిలిచే బుల్లితెర నటులపై కూడా నోరు పారేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే రాజకీయంగా విభేదించే రోజా సినిమాల పరంగా మాత్రం మెగా ఫ్యామిలీ వైపు మొగ్గు చూపుతుండడం విశేషం. మెగా ఫ్యామిలీతోనే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఆమె నోటి నుంచి వస్తోంది. చిరంజీవి అవకాశం ఇస్తే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని ఆమె చెప్పుకు రావడం విశేషం.
* చిరంజీవి వైపే మొగ్గు..
ప్రముఖ జర్నలిస్టు జాఫర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బుల్లితెర కార్యక్రమానికి వచ్చారు మాజీ మంత్రి రోజా. ఆయన పలు ప్రశ్నలు వేశారు. సినిమా రంగంలో ఉన్న ఆ నలుగురు అగ్ర కథానాయకులు ఎవరితో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని ప్రశ్నించారు. మారు మాట చెప్పకుండా మెగాస్టార్ చిరంజీవి అంటూ తేల్చి చెప్పారు రోజా. ఆయనతో అయితే డాన్స్ పోటీపడి చేయవచ్చని చెప్పుకొచ్చారు. బాలకృష్ణ అంటే వ్యక్తిగతంగా ఇష్టం కానీ.. చిరంజీవితో నటించడం అంటేనే తనకు ఆసక్తి అని నిర్మొహమాటంగా చెప్పేశారు. నాగార్జునకు తాను అభిమానిని.. ఆయనతో నటించిన అని చెప్పారు. వెంకటేష్ తో ఒకే ఒక్క సినిమా మాత్రమే చేశానని.. ఆయన విషయంలో సైతం ఆప్షన్ లేదని తేల్చి చెప్పారు రోజా.
* అప్పట్లో ఆశీర్వాదం కోసం..
వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవితో రోజాకు మంచి అనుబంధమే ఉండేది. ఆయనతో కలిసి పలు హిట్ చిత్రాల్లో నటించారు. మంత్రిగా ఎంపికైన తర్వాత చిరంజీవి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.. మరో మెగా బ్రదర్ నాగబాబుతో సుదీర్ఘకాలం ఈటీవీ జబర్దస్త్ కార్యక్రమంలో జడ్జిగా కొనసాగారు. అయితే పవన్ కళ్యాణ్ పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ పెట్టుకుంటూ వస్తున్నారు. మధ్య మధ్యలో మెగా ఫ్యామిలీ పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ సినిమాల పరంగా చిరంజీవి ద్వారా రీఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచనతో రోజా ఉన్నారు. మరి అందుకు చిరంజీవి అవకాశం ఇస్తారో లేదో చూడాలి.