Home Blog Page 210

ఎద అందాలతో చంపేస్తోన్న ‘దేవయానీ’

Deviyani Sharma latest photos
Deviyani Sharma latest photos

కాంగ్రెస్ గవర్నమెంట్ కు సెల్యూట్.. ఇలాంటి నిర్ణయాలే జనాల్లో నిలబెడతాయి

Kerala Menstrual Leave Policy
Kerala Menstrual Leave Policy

Kerala Menstrual Leave Policy: ఎంతసేపటికి పదవుల కోసం.. కాంట్రాక్టుల కోసం.. కమిషన్ల కోసమే పాకులాడుతుంటారు. నిత్యం పంచాయతీలు పెట్టుకుంటారు. ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకుంటారు. దుమ్మెత్తి పోసుకుంటారు. పదవుల విషయంలో రాజకీయాలు చేస్తుంటారు. పైరవీలు కొనసాగిస్తుంటారు.. ఇదిగో ఇలాంటి ప్రచారమే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీడియాలో.. సోషల్ మీడియాలో సాగుతూ ఉంటుంది.

అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జనం కోణంలో ఆలోచిస్తుంటారు. తమకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటారు. అటువంటి నిర్ణయం ఇది. ఇటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు కచ్చితంగా అభినందించాలి.. భుజం తట్టి శభాష్ అని పొగడాలి.. ఇంతకీ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి.. ప్రజల జీవితాల్లో ఎలా మార్పు తీసుకొస్తుంది.. ఇంతకీ ఆ నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటి..

కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సతీషన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. వాస్తవానికి వేణుగోపాల్ కు ఆ పదవి రావాలి. కాకపోతే అనేక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు ఆ పదవి ఇచ్చారు. సతీషన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేరళ రాష్ట్రంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ కౌమార అమ్మాయిలకు ప్రతినెలా మూడు రోజులపాటు రుతుక్రమ సెలవులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. 50 మందికి పైగా ఉద్యోగులు ఉన్న కార్యాలయాలలో క్వాలిటీ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నారు. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ఆరు నెలల పాటు ప్రసూతి సెలవులు అమలు చేయబోతున్నారు. అంతేకాదు పేదరికం తొలగించేందుకు.. అనాధలు లేని రాష్ట్రంగా మార్చేందుకు దత్తతలను ప్రోత్సహించబోతున్నారు. వాస్తవానికి ఇటువంటి నిర్ణయాలు గొప్పగా ఉండకపోవచ్చు. కానీ చాలామందిని ప్రభావితం చేస్తాయి.

ఆడవాళ్లకు ఆ మూడు రోజులు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో వారిలో రకరకాల సమస్యలు ఉంటాయి. అవి బయటకు చెప్పుకోలేరు. కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు మహిళా ఉద్యోగులు నరకం చూస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితిని గమనించి సెలవులు ప్రకటించడం
.. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని చెప్పడం నిజంగా గొప్ప విషయం. ఇది త్వరగా అమలులోకి వచ్చి.. కేరళ అమ్మాయిలకు, మహిళలకు రిలీఫ్ కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

ఆ ఒక్క సమస్య ను పరిష్కరించడంతో ఇండస్ట్రీ పెద్ద ఎవరో తెలిసిపోయింది...

Telugu Film Industry Issues
Telugu Film Industry Issues

Telugu Film Industry Issues: సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్లి సాల్వ్ చేసుకోవాలనే విషయంలో ఇప్పటివరకు సరైన క్లారిటి రావడం లేదు. ప్రతి ఒక్కరు ఎవరి ప్రాబ్లం ని వాళ్ళు ఏదో రకంగా సొల్యూషన్ వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పర్ఫెక్ట్ సొల్యూషన్ ఏంటి అనే విషయంలో మాత్రం ఎవ్వరు సమాధానం చెప్పడం లేదు. ఇలాంటి క్రమంలోనే సింగిల్ స్క్రీన్స్ విషయంలో గత కొన్ని రోజులుగా వివాదాలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే…నిజానికి పర్సంటేజ్ రూపం లో డబ్బులు చెల్లించకపోతే థియేటర్లు మూసేస్తాం అని ఎగ్జిబ్యూటర్లు వల్ల వాదనను వినిపించారు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ని చూపించాడు. మొత్తం తనే చూసుకుంటానని ఎవరు ఎలాంటి ఇబ్బందులను పడుతున్నారని దాని మీద ఒక సర్వేను నిర్వహించి ఎవరికి అన్యాయం జరగకుండా అందరికి న్యాయం జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోబోతున్నాం అంటూ చిరంజీవి స్వయంగా వాళ్ళందరికి చెప్పడంతో అందరూ సంతృప్తి చెందారు.

ప్రస్తుతానికైతే ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ ని మూసివేయడం లేదు. కాబట్టి రాబోయే సినిమాలకు చాలావరకు మంచి జరిగే అవకాశం ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకోవడం కాదు. ఇండస్ట్రీకి వచ్చిన సమస్యలను పరిష్కరించినప్పుడు మాత్రమే వాళ్ళ పెద్దరికం అనేది బయటపడుతుంది అంటూ మరి కొంతమంది ఇంకొంత మంది హీరోలను ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు.

మొత్తానికైతే చిరంజీవి ఇప్పటికి స్టార్ హీరో గానే కొనసాగుతున్నాడు. అయినప్పటికి ఆయన ఇండస్ట్రీలో ఉన్న కొన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుండటంతో ప్రతి ఒక్కరు చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ఉంటే మరింత మందికి న్యాయం జరిగే అవకాశం ఉంటుందని వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…

ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు తమ ప్రాబ్లంకి సొల్యూషన్స్ చూపించేవారు లేక చాలావరకు సఫర్ అవుతున్నారు. కానీ చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు అడుగు వేయడం వల్ల మరికొన్ని సమస్యలు కూడా అతని వద్దకు వచ్చే అవకాశం ఉంది. మరి వాటన్నింటిని పరిష్కరిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

హీరోలు డ్యూయల్ రోల్ చేయడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?

Dual Role Trend In Tollywood
Dual Role Trend In Tollywood

Dual Role Trend In Tollywood: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో డ్యూయల్ రోల్ ట్రెండ్ అయితే నడుస్తుంది. ఇప్పటివరకు చాలామంది హీరోలు సింగల్ పాత్రలో నటించిన కూడా ఇప్పుడు మాత్రం డ్యూయల్ రోల్ పక్కా ఉండాల్సిందే అనే రీతిలో ముందుకు సాగుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేస్తున్న ‘వారణాసి’ సినిమాలో మహేష్ బాబు 5 గెటప్పుల్లో కనిపించబోతున్నాడు. అల్లు అర్జున్ హీరోగా, అట్లీ డైరెక్షన్ లో వస్తున్న ‘రాకా’ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు… ఆ డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ సైతం రెండు పాత్రలను పోషిస్తునట్టుగా తెలుస్తోంది. అందులో ఒకటి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కాగా, మరొకటి హీరో పాత్ర కావడం విశేషం… ఇలా స్టార్ హీరోలు రోల్స్ మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండటం చూస్తున్న ప్రతి ఒక్కరు వీళ్ళు ఎందుకని అలా చేస్తున్నారు అనే ధోరణిలో కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో ఒక్కొ టైమ్ లో ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు డ్యూయల్ రోల్ ట్రెండ్ నడుస్తుందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు…

మరి ఈ ఫీవర్ ఎన్ని రోజులపాటు ఉంటుంది. ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ ఎంత కాలం కొనసాగుతుందనేది కూడా తెలియాల్సి ఉంది. దానికి తోడుగా మన స్టార్ హీరోలు భారీ బడ్జెట్లతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. కాబట్టి సినిమాలను సక్సెస్ ఫుల్ గా నిలపాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంది.

వాళ్ళు సినిమాలో ఒక క్యారెక్టర్ లో నటిస్తారా లేదంటే రెండు క్యారెక్టర్ లలో నటిస్తారనే విషయం పక్కన పెడితే సినిమాని సక్సెస్ఫుల్గా నిలపాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది… ఇక దర్శకులు సైతం హీరోలను స్క్రీన్ మీద ఎక్కువ సేపు వాళ్ల అభిమానులు చూడాలని కోరుకుంటున్నారు.

కాబట్టి ఎటు చూసినా వాళ్లే కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ప్రేక్షకుడికి హీరోని ఎక్కువసేపు చూశామనే సంతృప్తి కలుగుతుంది. అలాగే సినిమా సక్సెస్ ఫుల్ గా ఆడితే ప్రేక్షకుడు రిపీటెడ్ గా థియేటర్ కి వచ్చి సినిమాను చూసే అవకాశం ఉంటుందన్న ఉద్దేశ్యంతోనే ఇలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది…

ఐటీ జాబ్ మానేసి ఆటో నడుపుతోంది.. ప్రశాంతంగా బతుకుతోంది..

IT Employee Quits Job
IT Employee Quits Job

IT Employee Quits Job: ఉంటుందో లేదో తెలియదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఐదు అంకెల జీతం అన్న మాటే గాని.. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లాలి. రాత్రికి పగలుకు తేడా లేకుండా పనిచేయాలి. ఆరోగ్యం పాడైతే అంతే సంగతులు. పింకు స్లిప్ చేతిలో పెట్టి వెళ్లిపో అంటూ ఎగ్జిట్ చూపిస్తుంటారు. ఇది కొత్తకాలంగా ఐటీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న పరిస్థితి.

ఐటీ లో ఉన్న దారుణమైన పరిస్థితుల వల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇంకా కోల్పోతూనే ఉన్నారు. ఇంకా కొంతమంది అందులోనే పనిచేస్తూ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు. నిరంతరంగా ఉండే పని ఒత్తిడి.. తలనొప్పి.. కార్పొరేట్ వ్యవహారాలు ఐటి ఉద్యోగులకు కుటుంబ సంబంధాలను దూరం చేస్తున్నాయి.. దీంతో వారు మర మనుషులుగా మారిపోతున్నారు. సంపాదన సంగతి దేవుడెరుగు. కుటుంబ బంధాలకు.. ఇతర వ్యవహారాలకు దూరమవుతున్నారు. దీనివల్ల వారి మీద ఒత్తిడి పెరిగిపోయి రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి.

ఇటువంటి పరిస్థితులు కొనసాగుతున్న ఐటీ కి ఇండస్ట్రీలో ఉప మహిళ తీసుకున్న డేరింగ్ స్టెప్ ఇప్పుడు అందరిని ఆలోచింపజేస్తుంది.. అంతేకాదు ఆమె తీసుకున్న నిర్ణయం చాలా గొప్పగా అనిపిస్తుంది. ఐటీ విభాగంలో పనిచేసిన ఆ మహిళ స్టోరీని ఓ మహిళా వ్యాపారవేత్త సామాజిక మాధ్యమాల వేదికగా వెలుగులోకి తీసుకొచ్చారు.

ఆ మహిళ దాదాపు 9 సంవత్సరాలు పాటు ఐతే ఇండస్ట్రీలో మేనేజర్ గా పని చేసింది. కార్పొరేట్ ప్రపంచంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. దానిని ఆమె అనుభవించింది. ఎంత పని చేసినా సరే ఇంకా ఒత్తిడి ఉంటున్న నేపథ్యంలో తట్టుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆ తర్వాత తను సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేసుకుంది.. ఒక ఆటోను పర్చేజ్ చేసింది. పురుషులతో పాటుగా తాను కూడా ఆటోను నడుపుతోంది. బిందాస్ గా నెలకు 60 వేలు వెనకేస్తోంది. గత ఉద్యోగంలో జీతం ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఇందులో ఒత్తిడి లేకుండా… సాఫీగా జీవితం సాగిపోతుందని… ఫ్యామిలీకి ఎక్కువగా సమయం కేటాయిస్తున్నట్టు ఆమె ప్రకటించింది. ఈమె చెప్పిన మాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి. ఐటీ ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చిన వారికి బయట చాలా అవకాశాలు ఉన్నాయని ఈమె చెప్పిన మాటల ద్వారా తెలుస్తోంది.

పాకిస్తాన్ దెబ్బకు నరేంద్ర మోడీ తోక ముడిచాడా.. మీకో దండం రా అయ్యా

Narendra Modi
Narendra Modi

Narendra Modi Pakistan Debate: కుక్కకు సింహం లాంటి ఎలివేషన్ ఇస్తే ఎలా ఉంటుంది.. బురదలో దొర్లే పందిని సింహాసనం మీద కూర్చోబెడితే ఎలా ఉంటుంది.. పాకిస్తాన్ విషయంలో ఓవర్గం మీడియా చేస్తున్న అతి కూడా ఇలానే ఉంది. అసలే ఆ దేశానికి ఆర్థిక వనరులు లేవు. ప్రజల మీద విపరీతమైన ఒత్తిడి పెంచుతున్నారు. దారుణంగా పన్నులు వేస్తున్నారు. అప్పులు తీర్చే మార్గం లేక ఉన్న ఆ కాస్త ఫారెక్స్ నిల్వల నుంచి చెల్లిస్తోంది. యూఏఈ పాకిస్తాన్ దేశస్థులను తమ దేశం నుంచి వెళ్లగొడుతోంది. ఐఎంఎఫ్ బెల్ అవుట్ ఇవ్వకుండా పాకిస్తాన్ సహనాన్ని పరీక్షిస్తోంది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ మీద బీభత్సంగా దెబ్బ కొడుతోంది. చివరికి గల్ఫ్ దేశాలు కూడా పాకిస్తాన్ దేశాన్ని నమ్మడం లేదు.

ఉగ్రవాదులు కూడా అబ్రహం అకార్డ్స్ విషయంలో పాకిస్తాన్ పాలకులను బెదిరిస్తున్నారు. తిక్క తిక్కగా ప్రవర్తిస్తే చుక్కలు చూస్తారంటూ హెచ్చరిస్తున్నారు. అమెరికాతో అంట కాగితే ఖబర్దార్ అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్ ఏ విధంగా బలమైన శక్తిగా ఎదుగుతోంది.. ఏ స్థాయిలో ఆ దేశానికి అనుకూలంగా అన్ని పరిస్థితులు ఉన్నాయి.. కానీ ఇవేవీ కొన్ని మీడియా సంస్థలకు పట్టవు. వాటికి కావాల్సింది కేవలం భారత వ్యతిరేకత. అందువల్లే పాకిస్తాన్ దేశాన్ని గొప్పగా కీర్తిస్తున్నాయి.

పుల్వామా ఎటాక్.. పహల్గామ్ దాడి భద్రతాపరమైన లోపాల వల్ల జరిగాయట.. అందులో ఉగ్రవాదుల దుర్మార్గం ఏదీ లేదట. పైగా వీటికి సాక్షాలను అంతర్జాతీయ సమాజం ముందు ఉంచడంలో భారత్ విఫలమైందట. అప్పట్లో కేరళలో జరిగిన సమావేశంలో పాకిస్తాన్ దేశాన్ని ప్రపంచం నుంచి ఒంటరి చేస్తామని నరేంద్ర మోడీ చేసిన ప్రకటన మీద నిలబడలేదట. పైగా ఇప్పుడు చైనా, అమెరికా పాకిస్తాన్ దేశానికి అండగా ఉంటున్నాయట. ఈ విషయంలో నరేంద్ర మోడీ ఏమి చేయలేకపోతున్నారట.

చైనా అనేది సామ్రాజ్యవాదం దేశం. అమెరికా అనేది సైతాన్ దేశం. ఈ రెండు దేశాలకు కేవలం వనరులు.. తాము చెప్పినట్టు ఆడించే వత్తాసు పాలకులు మాత్రమే కావాలి. అందువల్లే పాకిస్తాన్ దేశంతో ఇవి స్నేహం నటిస్తున్నాయి. ఒకవేళ ఇదంతా నిజమే అనుకుంటే ట్రంప్ ఎందుకు పాకిస్తాన్ లో పర్యటించడం లేదు.. చైనా అధ్యక్షుడు ఎందుకు పాకిస్తాన్ వెళ్లడం లేదు.. స్థూలంగా పాకిస్తాన్లో ఉన్న వనరులు ఈ రెండు దేశాలకు కావాలి. పైగా భారత్ మీద పెత్తనం సాగించాలని అమెరికాకు, డ్రాగన్ దేశానికి ఒక స్థావరం కావాలి. అందువల్లే పాకిస్తాన్ దేశంతో అవి స్నేహం నటిస్తున్నాయి.

ఒకసారి తేడా కొడితే పాకిస్తాన్ దేశాన్ని అవి ఏం చేయాలో అదే చేస్తాయి. చైనా అవసరం లేకుండా.. అమెరికాతో సంబంధం లేకుండా భారత్ ఏమైనా చేయగలుగుతుంది.. అది పాకిస్తాన్ వల్ల అవుతుందా.. అమెరికా దయ లేకపోతే.. చైనా బిచ్చం వెయ్యకపోతే పాకిస్తాన్ బతికే పరిస్థితి లేదు.. చివరికి చీనాబ్ నది నుంచి నీళ్లు వదలకపోతే పాకిస్తాన్ ఎడారి అవుతుంది.. ఇన్ని తెలిసిన కూడా మీడియా సంస్థలు పాకిస్తాన్ దేశానికి అనుకూలంగా రాస్తున్నాయి అంటే ఇది మామూలు పైత్యం కాదు. ఎన్ని రకాల మందులు వాడినా ఇది తగ్గదు.

కుర్చీల కోసం కొట్లాట.. ఇలాగైతే కాంగ్రెస్ బిజెపిని ఎప్పుడు దించుతుంది..

Kerala Congress internal conflict
Kerala Congress internal conflict

Kerala Congress internal conflict: అదే సాంప్రదాయం.. అదే కొట్లాట.. రాష్ట్రం మారుతోంది.. నాయకులు మారుతున్నారు.. కానీ గొడవలు మాత్రం అదే తీరుగా ఉంటున్నాయి. దీనిని అంతర్గత ప్రజాస్వామ్యమని చెబుతుంటారు కానీ.. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యహారాలకు ఆస్కారం ఉండదు. ఎత్తులు, పై ఎత్తులు సాగిపోతూ ఉంటే పరిపాలన ఎలా సాగుతూ ఉంటుంది.. ప్రజలకు మెరుగైన భద్రత ఎలా లభిస్తూ ఉంటుంది.. ఈ ప్రశ్నలకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజంగా సమాధానం చెప్పాలి.

కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ముఖ్యమంత్రులను మార్చడం కొత్తకాదు. గతంలో అనేక పర్యాయాలు ఈ పని చేసింది. ఇప్పుడు కూడా చేస్తోంది. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో సిద్ధ రామయ్యను ఆ పదవి నుంచి దించింది. అది కూడా ఒక్క రోజులోనే సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు జరిగాయి. రాహుల్ గాంధీ.. మల్లికార్జున కార్గే వంటి వారంతా ఈ పర్వంలో ఉన్నారు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న డీకే శివకుమార్.. పరమేశ్వర.. రాజీనామా చేసిన సిద్ధరామయ్య.. వారంతా ఢిల్లీలోనే ఉన్నారు. కొద్దిరోజులుగా వారంతా లాబీయింగ్ చేసుకుంటూ ఉన్నారు. పదవుల కోసం వారంతా అక్కడ ఉంటుంటే కర్ణాటక రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంటుంది.. ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంటి.. అనే ప్రశ్నలు మీడియా వేసినప్పుడు కాంగ్రెస్ నాయకుల దగ్గర సమాధానం లేకుండా పోతుంది.

సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి వెంటనే దిగిపోలేదు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన నాటి నుంచి ఆయనకు ప్రతిదీ అనుకూలంగా మారలేదు. డీకే శివకుమార్ వర్గం ఏదో ఒక రూపంలో ఆయనను ఇబ్బంది పెడుతూనే ఉంది. చివరికి రెండున్నర సంవత్సరాల పరిపాలనా కాలాన్ని ఆయన ముక్కుతూ మూలుగుతూ పూర్తి చేశారు. దీనివల్ల కర్ణాటక రాష్ట్రంలో పెట్టుబడులు.. శాంతి భద్రతలు.. ఇతర వ్యవహారాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కొన్ని రకాల కుంభకోణాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఆ ప్రభావం స్థానిక ఎన్నికలు.. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీద భారీగానే పడింది.

ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఖాయమైనప్పటికీ.. సిద్ధరామయ్య కుమారుడు యతేంద్రకు కీలకమైన శాఖలు ఇస్తున్నారట.. అంతేకాదు ఆయనను డిప్యూటీ సీఎం గా నియమిస్తున్నారట. అధిష్టానం చెప్పినట్టుగా సిద్ధరామయ్య రాజ్యసభకు వెళ్లి పోరట. ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలు ఏమీ అనుకోరా.. నెగిటివ్ ఆలోచనలు ఏమీ రావా.. ముఖ్యమంత్రి మార్పు వ్యవహారం అనేది అంతర్గతంగా సాగిపోవాలి. అందులో గొడవలకు.. వివాదాలకు ఆస్కారం లేకుండా ఉండాలి. అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇలా చేయడం నిజంగా ప్రజలను పిచ్చివాళ్లను చేయడమే.. పరిపాలన సాగించండి అంటూ ప్రజలు ఓటు వేస్తే కాంగ్రెస్ పాలకులు చేస్తున్న పని ఇలా ఉండడం నిజంగా ఆశ్చర్యకరమే.

బిజెపి కూడా ముఖ్యమంత్రులను మార్చేస్తూ ఉంటుంది. గుజరాత్ లో కూడా అనేకసార్లు ముఖ్యమంత్రులను మార్చేసింది. కానీ ఏ రోజు కూడా ఈ స్థాయిలో చర్చనీయాంశం కాలేదు. చివరికి పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారికి ముఖ్యమంత్రి స్థానాన్ని ఇచ్చే విషయంలో కూడా బిజెపి రహస్య విధానాన్ని పాటించింది. మీడియాకు ఏ ఒక్క లీకు కూడా ఇవ్వలేదు. అస్సాంలో హిమంత.. విషయంలో కూడా బిజెపి సీక్రసీ విధానాన్ని కొనసాగించింది. కర్ణాటకలో కూడా ముఖ్యమంత్రులను బిజెపి మార్చినప్పుడు ఈ స్థాయిలో ఎన్నడూ వివాాదం కాలేదు. పైగా నాయకులు షరతులు విధించే పరిస్థితి కాషాయ నాయకులు తీసుకురాలేదు.

కాంగ్రెస్ పార్టీ కేవలం కర్ణాటకతోనే కాదు.. ఆ మధ్య తెలంగాణలో కూడా.. తాజాగా కేరళలో కూడా ఇదే తీరైన వాతావరణాన్ని కొనసాగించింది. తెలంగాణలో ముఖ్యమంత్రి స్థానం కోసం ఒక కీలక నాయకుడు భారీగా పైరవీలు చేశారు. చివరికి కొంతమంది ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలు కూడా చేసినట్టు తెలుస్తోంది. అయితే రాహుల్ గాంధీ గట్టిగా పట్టు పట్టడంతో ఆ నేత వెనక్కి తగ్గినట్టు సమాచారం. అందువల్లే ముఖ్యమంత్రి ఎంపికలో జాప్యం జరిగింది. కేరళలో కూడా ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ అనేక రకాల దాగుడుమూతలు ఆడింది. వేణుగోపాల్ కు ముఖ్యమంత్రి పదవి లభిస్తుందని అందరు అనుకున్నారు. కానీ సతీషన్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇందులో కూడా క్యాంపు రాజకీయాలు జరిగాయి. చాలా రోజులపాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయంలో మంతనాలు జరిగాయి.

ఇలా చెప్తే బిజెపికి అనుకూలంగా రాస్తున్నారు అనుకోవచ్చు గాని.. కాంగ్రెస్ పార్టీలో ఇంత దారుణంగా అంతర్గత కలహాలు బహిర్గతంగా జరుగుతుంటే రాయకుండా ఎలా ఉంటారు.. అది ఎలా సాధ్యమవుతుంది. వాస్తవానికి ఎలక్షన్స్ లో పోటీ చేసిన తర్వాత.. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన తర్వాత.. పదవుల కోసం రాజకీయ నాయకులు అంతర్గతంగా చర్చించుకోవాలి. పైగా అది అంతర్గత వ్యవహారం కూడా.. అలాకాకుండా ఇలా మూకుమ్మడి పోరాటాలు చేసుకోవడం.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఎటువంటి అంతర్గత ప్రజాస్వామ్యమో నేతలు చెప్పాలి.. కాంగ్రెస్ పార్టీ ఇలానే వ్యవహరించుకుంటూ వెళ్తే.. బిజెపిని కేంద్రంలో అధికారం నుంచి దించడం సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బిజెపిలో సాధ్యమైన రాజకీయ క్రమశిక్షణ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు అమలు కావడం లేదని.. అందుకే ప్రజలు ఆ పార్టీని దూరంగా పెడుతున్నారని వారు చెబుతున్నారు.

త్రివిక్రమ్ - ఎన్టీయార్ మూవీ అనౌన్స్ మెంట్ రాకపోవడానికి కారణం వాళ్లేనా..?

Trivikram NTR new movie update
Trivikram NTR new movie update

Trivikram NTR new movie update: సినిమా ఇండస్ట్రీ లో సక్సెస్ సాధించడమనేది అంత ఆశామాశీ వ్యవహారమైతే కాదు. ఎంతటి బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా సినిమాలో నటించడానికి అవకాశం దొరుకుతుంది. కానీ సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు. ఎప్పటికప్పుడు ఒక సినిమాకు సంబంధించిన కథను సక్సెస్ ఫుల్ గా రాసుకొని దాన్ని స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా డెలివరీ చేసినప్పుడు మాత్రమే సినిమాలు సక్సెస్ ను సాధిస్తాయి. అంతేతప్ప ఇండస్ట్రీ లో బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడుతాయనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఇక ఇప్పుడున్న స్టార్ హీరోలందరు బ్యా గ్రౌండ్ తో వచ్చినప్పటికి వాళ్ళకంటూ ఒక స్టైల్ ను ఏర్పాటు చేసుకొని వాళ్ళు తమ టాలెంట్ ని చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు సైతం ఈ మధ్యకాలంలో మంచి విజయాలను సాధిస్తున్నాడు. గత సంవత్సరం చేసిన ‘వార్ 2’ సినిమాతో కొంతవరకు తడబడ్డప్పటికి ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘డ్రాగన్’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక ఇప్పటివరకు ఆయన నుంచి వచ్చిన సినిమాలు తనను టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వచ్చినప్పటికి దాని మీద అఫీషియల్ గా మాత్రం ఇంకా క్లారిటి ఇవ్వలేకపోతున్నారు. మే 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆరోజు ఈ సినిమాకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని అందరు ఎదురు చూశారు. కానీ అది జరగలేదు.

త్రివిక్రమ్ ఈ మూవీని అల్లు అర్జున్ తో చేయాలా లేదంటే జూనియర్ ఎన్టీఆర్ తో ఈ సినిమా చేయాలా అనే ఒక చిన్న డైలమాలో ఉన్నాడట. ప్రస్తుతానికి వీళ్ళిద్దరిని పెట్టుకొని ఆయన ముందుకు సాగుతున్నాడు. ఇందులో ఎవరితో సినిమా చేస్తాడనే విషయంలో త్రివిక్రమ్ కి కూడా ఇంకా క్లారిటీ దొరకడం లేదు.

త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా పూర్తి అయిన తర్వాత నెక్స్ట్ సినిమా గురించి ఆలోచిస్తాడట. అల్లు అర్జున్ ఇప్పటికే రెండు సినిమాలు కమిట్ అయ్యాడు. కాబట్టి ఆ దర్శకుల సినిమాలు పూర్తి అయిన కూడా అల్లు అర్జున్ డేట్స్ అయితే ఖాళీగా ఉండవు. కానీ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాను పూర్తి చేసుకున్న తర్వాత పూర్తి డేట్స్ అన్ని ఖాళీగానే ఉంటాయి.

కాబట్టి ఎన్టీఆర్ తో చేస్తేనే బాగుంటుంది అనే ఆలోచనలో త్రివిక్రమైతే ఉన్నాడు. కానీ మార్కెట్ పరంగా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ కంటే అల్లు అర్జున్ కి ఇప్పుడు ఎక్కువ మార్కెట్ ఉండటం వల్ల ప్రొడ్యూసర్లు అల్లు అర్జున్ వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారనే వార్తలైతే వస్తున్నాయి…

వైభవ్ సూర్యవంశీ.. ఎవరెస్టంత ఎత్తుకు ఎదిగిపోయాడు

Vaibhav Suryavanshi success story
Vaibhav Suryavanshi success story

Vaibhav Suryavanshi success story: ఆ మధ్య ఐపీఎల్ లీగ్ మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ వీరవిహారం చేశాడు. సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం మైదానంలోకి లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ వచ్చారు. ఆయనను చూడగానే వైభవ్ సూర్యవంశీ మరోమాటకు తావు లేకుండా పాదాలకు నమస్కరించారు. ముగ్ధుడైపోయిన సునీల్ గవాస్కర్ అతడిని తన చేతులతో పైకి లేపి లగేరహో భేటా అంటూ ఆశీర్వదించారు.

వైభవ్ సూర్యవంశీలో ఈ గుణమే ఇప్పుడు అందరికీ నచ్చుతోంది. ధోని నుంచి విరాట్ వరకు అందరూ అతడిని మెచ్చుకుంటున్నారు. సెహ్వాగ్ అయితే ఏకంగా తాను ఒక ఫ్రాంఛైజీ కి ఓనర్ అయితే అతడికి ఏకంగా 30 కోట్లు ఇస్తానని ప్రకటించాడు. ఇంత వరకు ప్రపంచ లీగ్ చరిత్రలో ఏ ఆటగాడికి కూడా ఆ స్థాయిలో ధర లభించలేదు. సెహ్వాగ్ మాటలను బట్టి సూర్యవంశీ ఆట తీరు. అతడి కి పెరిగిన మార్కెట్, అతడి వ్యాల్యూ అర్థం చేసుకోవచ్చు.

మైదానం ప్రత్యర్థి బౌలర్ల మీద సూర్యవంశీ విరుచుకుపడతాడు. దయాదాక్షిణ్యం లేకుండా కొట్టేస్తుంటాడు. అతడి ఆటతీరు చూస్తుంటే తోపు బౌలర్లకు సైతం చెమటలు పడుతుంటాయి. గుజరాత్ జట్టుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో సూర్యవంశీ ఒక్కడే జట్టు భారాన్ని మోసిన తీరు..అతడు ఒక్కడే అన్ని పరుగులు చేసిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే.

మైదానంలో వీరవిహారంచేసే వైభవ్ సూర్యవంశీ..పెద్దలతో మాత్రం గొప్పగా నడుచుకుంటాడు. గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీతో ఫొటోలు దిగేందుకు చాలామంది పోటీపడ్డారు. ఇందులో ప్రముఖులు కూడా ఉన్నారు. వారందరి దగ్గరనుంచి సూర్యవంశీ ఆశీర్వాదం తీసుకున్నాడు. అతడి ముఖంలో అసహనం కనిపించలేదు. చిరాకు కనిపించలేదు. ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలని సూర్యవంశీ నిరూపించాడు.

స్పిరిట్ లో ప్రభాస్ బ్రదర్ గా సందీప్ రెడ్డి వంగ కనిపించబోతున్నాడా.. ఇక రచ్చ రచ్చే..

Prabhas Spirit Movie
Prabhas Spirit Movie

Spirit movie Prabhas brother role: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ప్రభాస్ లాంటి నటుడు సైతం పెను సంచలనాలను క్రియేట్ చేసే సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే పెను సంచలనాలను క్రియేట్ చేయాలని 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, హీరో ప్రభాస్ ఇద్దరు చాలా కసిగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ఉందట. ప్రభాస్ బ్రదర్ గా నటించే ఒక పాత్రలో సందీప్ రెడ్డివంగా నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. నిజానికి సందీప్ రెడ్డివంగా ను చూడగానే ఒక రఘుడ్ లుక్ తో, బేస్ వాయిస్తూ వేసుకొని ఉంటాడు కాబట్టి ఆయన మాటలకే చాలా మంది భయ పడిపోతుంటారు.

మరి అలాంటి ఒక వ్యక్తి ఈ సినిమాలో చిన్న నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ లో నటించబోతున్నాడు అనే వార్త తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళు చేసే సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేయాల్సిన అవసరమైతే ఉంది.

ఇక దాంతో పాటుగా సందీప్ రెడ్డివంగా ఈ సినిమాలో నటిస్తున్నాడు అంటే ఆయన చాలా వరకు క్లారిటిని మైంటైన్ చేయాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వస్తున్న సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి…ఈ సినిమాలో సందీప్ నటిస్తే నిజంగానే అదొక వండర్ గా నిలిచిపోతుంది.

నిజానికి ఆయన చాలా మంచి నటుడని ఆయనతో వర్క్ చేసిన చాలా మంది చెబుతుంటారు. కానీ స్క్రీన్ మీద మనం ఎప్పుడు చూడలేదు. ఒకవేళ ప్రభాస్ పక్కన మనం ఆయన్ని చూసినట్లయితే ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ ఇద్దరు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

దాసరి సమాధికి ఇలాంటి దుస్థితి రావడమా..? హీరోలు దర్శకులు ఏం చేస్తున్నారు..

Dasari Narayana Rao memorial condition
Dasari Narayana Rao memorial condition

Dasari Narayana Rao memorial condition: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచిన వాళ్ళలో దాసరి నారాయణరావు ఒకరు… వైవిధ్యభరితమైన సినిమాలను చేస్తూ ఇప్పుడున్న చాలామంది స్టార్ హీరోలకు తన సినిమాల్లో అవకాశాలను ఇచ్చి వాళ్ళని స్టార్లుగా తీర్చిదిద్దిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం… అలాంటి దిగ్గజ దర్శకుడు 2017 మే 30వ తేదీన మరణించారు. ఇక ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి దగ్గరికి వెళ్లి నివాళులు అర్పించాలి అనుకున్న వారికి ఒక చేదు అనుభవమైతే ఎదురైంది. దాసరి నారాయణ రావు ఆయన భార్య పద్మ సమాధులను ఒకే చోట పెట్టారు. అయితే దానిని అప్పటినుంచి ఇప్పటివరకు పట్టించుకునే నాధుడు కూడా లేకపోయాడు. తన కుటుంబ సభ్యులు కూడా ఆ సమాధులను పట్టించుకోవడం లేదంటూ చాలావరకు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలను అందించి ఎంతో మంది నటులను, దర్శకులను వెలుగులోకి తీసుకొచ్చిన దాసరి నారాయణరావు సమాధిని ఎవ్వరు పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం అనే చెప్పాలి. ఆయన సమాధి చుట్టూ పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం పేరుకుపోయిన కనీసం వాటిని క్లీన్ చేసే నాధుడు కూడా లేకపోయాడు.

ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న మంచి మనోజ్ వెంటనే తనతో పాటు తన మనుషులను తీసుకొచ్చి దాని చుట్టూ క్లీన్ చేయించాడు. కొంతమంది మనుషులను పంపించి వాటిని క్లీన్ చేయాలని చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే దాసరి నారాయణరావు ఇండస్ట్రీ పెద్దగా కూడా కొన్ని సంవత్సరాల పాటు వ్యవహరించారు. ఎన్నో సినిమాలకు ఆయన మార్గదర్శి గా మారాడు.

అలాగే కొంతమంది ని ఆదుకోవడంలో కూడా ఆయన చాలావరకు హెల్ప్ చేశాడు. ఇండస్ట్రీలో ఎలాంటి సమస్య ఎవరికి ఎదురైనా కూడా దానిని పరిష్కరించడంలో ఆయన ముందు వరుసలో ఉండేవారు… అలాంటి దాసరి నారాయణరావు గారిని చనిపోయిన తర్వాత కనీసం పట్టించుకునే వారు కూడా లేరు. చాలా మంది స్టేజ్ ఎక్కి నాకు దాసరి గారు లైఫ్ ఇచ్చారు అని చెబుతుంటారు. కానీ ఆయనసమధి దగ్గరికి వచ్చి నివాళులు అర్పించే వారు మాత్రం కరువయ్యారు…

ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్తుంది…మన ముందు తరం వాళ్ళను గౌరవించుకోవడం మన బాధ్యత…ఇప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న హీరోలు దర్శకులు ఒకప్పుడు దాసరి లాంటి దిగ్గజ దర్శకులు చేసిన సినిమాలను చూసే ఇండస్ట్రీ లోకి వచ్చారనే విషయాన్ని ఇప్పుడున్న గుర్తుంచుకుంటే మంచింది. లేకపోతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు సైతం మిమ్మల్ని మర్చిపోయే అవకాశం ఉంది…

ఈ స్కూటర్ డిజైన్ మాత్రమే కాదు.. మైలైజ్ లోనూ అద్భుతం..

Bajaj Chetak 2026 electric scooter
Bajaj Chetak 2026 electric scooter

Bajaj Chetak 2026 electric scooter: భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో Bajaj కంపెనీకి చెందిన Chetak మరోసారి తన సత్తా చాటింది. ఈ వెహిక్ మార్కెట్లోకి వచ్చిన కొత్తలో పెద్దగా ఆదరణ ఉండేది కాదు. ఇదే సమయంలో కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి రావడంతో పోటీని తట్టుకోలేకపోయింది. అయితే ఈ ఏడాదిలో ఈ స్కూటర్ కు ఎక్కువ ఆదరణ పెరిగింది. దీంతో ఒక్క ఏడాదిలోనే 79 శాతం వృద్ధి అమ్మకాలను నమోదు చేసుకుంది. ఇంతకీ ఈ స్కూటర్ అమ్మకాలు ఎలా ఉన్నాయి? ఇందులో ఉండే ఫీచర్లు ఏంటీ?

Bajaj Chetak 2026 ఏప్రిల్ నెలలో 34,304 యూనిట్ల విక్రయాలను నమోదు చేసుకుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఇది కూడా ఒకటిగా నిలిచింది. గత ఏడాది ఇదే కాలంలో 19,216 యూనిట్లు మాత్రమే విక్రయాలు చేసుకున్న ఈ స్కూటర్ ఈసారి దాదాపు 79 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేయడం విశేషం. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కొత్త కొత్త కంపెనీలు, మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నప్పటికీ చేతక్‌పై వినియోగదారుల నమ్మకం మరింత పెరుగుతోంది. ముఖ్యంగా నాణ్యత, విశ్వసనీయత, బ్రాండ్ విలువ, విస్తృత సర్వీస్ నెట్‌వర్క్ వంటి అంశాలు చేతక్ అమ్మకాలకు ప్రధాన బలంగా మారాయి. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన వాహనం కోసం చూస్తున్న వారికి ఇది ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తోంది.

బజాజ్ చేతక్‌లో అత్యాధునిక లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఈ స్కూటర్ లో 2.9 kWh, 3.2 kWh అనే సామర్థ్యాలు కలిగిన బ్యాటరీలు అందుబాటులో ఉన్నాయి. ఈ బ్యాటరీలు ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 113 కిలోమీటర్ల నుంచి 127 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. దీంతో ప్రతిరోజూ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు లేదా నగర పరిధిలో ప్రయాణించే వారికి ఇది ఎంతో అనుకూలంగా మారింది. ఎలక్ట్రిక్ మోటార్‌తో పనిచేసే చేతక్ నగర రోడ్లపై అత్యంత నిశ్శబ్దంగా ప్రయాణించే అనుభూతిని అందిస్తుంది. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే శబ్దం తక్కువగా ఉండటంతో పాటు కంపనలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగర ప్రాంతాల్లో ఈ లక్షణం వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

బజాజ్ చేతక్ ప్రీమియం స్కూటర్ లో 5 అంగుళాల TFT కలర్ డిస్‌ప్లే లేదా టచ్‌స్క్రీన్ ఉంటుంది. బేసిక్ వేరియంట్లలో ఎల్‌సిడి స్క్రీన్ వస్తుంది. బ్లూటూత్ ద్వారా స్కూటర్‌ను చేతక్ యాప్‌నకు కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా కాల్స్, మెసేజ్ అలర్ట్‌లు, నావిగేషన్ మరియు మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్లలో ఎకో , స్పోర్ట్ వంటి రైడింగ్ మోడ్స్ ఉంటాయి. బ్యాటరీ అమరికను బట్టి 25 నుంచి 35 లీటర్ల వరకు విశాలమైన బూట్ స్పేస్ లభిస్తుంది.

పెట్రోల్ ధరలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు వినియోగదారులకు పెద్ద ఉపశమనంగా మారుతున్నాయి. చేతక్‌ను ఛార్జ్ చేయడానికి అయ్యే ఖర్చు, పెట్రోల్ స్కూటర్‌తో పోలిస్తే చాలా తక్కువ. అలాగే ఇంజిన్ ఆయిల్ మార్పులు, క్లచ్ లేదా గేర్‌బాక్స్ నిర్వహణ వంటి అదనపు ఖర్చులు లేకపోవడం దీని ప్రత్యేకత.

యూఎస్‌ యూటర్న్‌.. గ్రీన్‌ కార్డ్‌ ఆశావహులకు బిగ్‌ రిలీఫ్‌

US green card latest update
US green card latest update

US green card latest update: అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడాలనుకునే వారు అక్కడి గ్రీన్‌ కార్డు కోసం ప్రయత్నిస్తారు. అయితే ట్రంప్‌ ప్రభుత్వం ఇటీవల గ్రీన్‌కార్డు జారీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆ నిర్ణయాన్ని యూఎస్‌ మళ్లీ వెనక్కి తీసుకుంది. దీంతో అమెరికాలో స్థాయి నివాసం (పర్మనెంట్‌ రెసిడెన్సీ) కోసం ఎదురుచూస్తున్న వేలాది వలసదారులు, ముఖ్యంగా భారతీయులు ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. మొదటి ప్రకటనలో గందరగోళం ఉండడంతో యూఎస్‌ అధికారులు స్పష్టమైన వివరణ ఇచ్చి పరిస్థితిని సాధారణపరచారు.

ఆందోళన ఎందుకు?
గత వారం వచ్చిన కొన్ని నివేదికలు గ్రీన్‌ కార్డ్‌ దరఖాస్తుదారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లి అక్కడి నుంచే ప్రక్రియ పూర్తి చేయాలని సూచించాయి. దీంతో హెచ్‌–1బీ వీసాలపై పని చేస్తున్న వృత్తిపరులు, వారి కుటుంబాలు తీవ్ర అనిశ్చితికి లోనయ్యారు. ఎన్నో సంవత్సరాలుగా అమెరికాలోనే ఉండి, ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇది పెద్ద ఆందోళన కలిగించింది.

తాజాగా మార్పు..
హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ శాఖ స్పష్టం చేసినట్లు, చాలా మంది దరఖాస్తుదారులపై ఎలాంటి పెద్ద మార్పు రాదు. ప్రతీ కేసును వ్యక్తిగతంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని, అనేక మంది అమెరికాలోనే ఉండి ప్రక్రియ కొనసాగించవచ్చని తెలిపారు. ఇది కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాలకు మాత్రమే వర్తింపజేయబడుతుందని అధికారులు వివరించారు.

ఎవరికి ప్రయోజనకరం?
భారతీయ సాంకేతిక నిపుణులు హెచ్‌–1బీ వీసా హోల్డర్లు, వారి కుటుంబాలు ప్రధాన లబ్ధిదారులు. వారి ఉద్యోగాలు, జీవనం అంతరాయం లేకుండా కొనసాగడానికి ఈ స్పష్టత సహాయపడుతుంది. టెక్‌ రంగం సహా వివిధ రంగాల్లోని యజమానులు నైపుణ్యం కలిగిన ఉద్యోగులను కోల్పోయే భయం నుంచి బయటపడ్డారు. దీర్ఘకాలిక అనిశ్చితి తొలగి, స్థిరత్వం వైపు అడుగులు వేయడానికి మార్గం సుగమమైంది.

వలసదారులకు ఊరట..
అమెరికా యూటర్న్‌ వలస విధానాల్లో ఆచరణాత్మకతను ప్రతిబింబిస్తుంది. ఒకవైపు కఠిన నిబంధనలు విధించాలనే ఉద్దేశం ఉన్నా, ఆర్థిక వ్యవస్థకు అవసరమైన నైపుణ్యం కలిగిన వలసదారులను కోల్పోవడం దేశం ఇష్టపడదు. ఫలితంగా, వ్యక్తిగత కేసుల పరిశీలనపై ఎక్కువ ఆధారపడటం ద్వారా సమతుల్య విధానాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఇది పూర్తి స్థిరత్వం కాదు. గ్రీన్‌ కార్డ్‌ వేచి ఉండే సమయం ఇంకా ఎక్కువగా ఉండటం, బ్యాక్‌లాగ్‌ సమస్యలు కొనసాగుతున్నాయి. కాబట్టి దరఖాస్తుదారులు ఎప్పటిలాగే అప్రమత్తంగా ఉండి, తాజా అప్‌డేట్లను గమనించాలి.

తాజా పరిణామం వలసదారుల్లో నమ్మకం కొంత మెరుగుపరిచినప్పటికీ, దీర్ఘకాలిక పరిష్కారాల కోసం అమెరికా వలస వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు అవసరమని స్పష్టం చేస్తోంది.

ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడానికి కారణం ఇదే..

Why Pumpkin is hung in front of House
Why Pumpkin is hung in front of House

Why Pumpkin is hung in front of House: భారతీయ సంస్కృతిలో ప్రతి ఆచారానికి ఒక ప్రత్యేకమైన అర్థం, అంతరార్థం ఉంటుంది. అలాంటి సంప్రదాయాల్లో ఇంటి ముంగిట గుమ్మడికాయ కట్టడం కూడా ఒకటి. కొత్త ఇల్లు నిర్మించినప్పుడు, దుకాణం లేదా వ్యాపార సంస్థ ప్రారంభించినప్పుడు, గృహప్రవేశం వంటి శుభకార్యాల సమయంలో గుమ్మడికాయను కట్టి వేలాడదీయడం దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న ఆచారం. ఇది కేవలం మూఢనమ్మకం కాదని, దాని వెనుక ఆధ్యాత్మిక విశ్వాసాలతో పాటు కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని పెద్దలు చెబుతుంటారు. అవేంటో చూద్దాం..

హిందూ సంప్రదాయం ప్రకారం.. కొత్తగా నిర్మించిన ఇల్లు, కొత్త వ్యాపారం లేదా శుభకార్యం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మంచి విషయాలను చూసినప్పుడు కొందరి అసూయ, ప్రతికూల ఆలోచనలు లేదా దృష్టిదోషం పడుతుందని పూర్వీకులు విశ్వసించేవారు. అందుకే ఆ ప్రతికూల శక్తులను ఇంటి లోపలికి రానీయకుండా గుమ్మడికాయను గుమ్మానికి కట్టేవారు. దీనివల్ల దృష్టి గుమ్మడికాయపై పడుతుందని, ఇల్లు లేదా వ్యాపారంపై పడే ప్రతికూల ప్రభావం తగ్గుతుందని నమ్మకం.

వాస్తు శాస్త్రంలో గుమ్మడికాయను శుభప్రదమైన వస్తువుగా భావిస్తారు. ఇది నెగెటివ్ ఎనర్జీని గ్రహించి, పరిసరాల్లో సానుకూల శక్తిని పెంచుతుందని చెబుతారు. ముఖ్యంగా తెల్ల గుమ్మడికాయ లేదా బూడిద గుమ్మడికాయను కట్టడం ద్వారా ఇంటిలో ప్రశాంతత, ఐశ్వర్యం, శ్రేయస్సు పెరుగుతాయని వాస్తు నిపుణులు పేర్కొంటారు.

పురాణాల్లో గుమ్మడికాయను పవిత్రతకు, సంపూర్ణతకు ప్రతీకగా పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో దానిని దేవతారాధనలో కూడా ఉపయోగిస్తారు. యజ్ఞాలు, హోమాలు ముగిసిన తర్వాత గుమ్మడికాయను బలి ప్రతీకగా సమర్పించే ఆచారం కూడా ఉంది. అందువల్ల గుమ్మడికాయ చెడు శక్తులను దూరం చేసే సాధనంగా భావించబడింది.

పూర్వకాలంలో నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత ఇంటి చుట్టూ ధూళి, వ్యర్థాలు ఎక్కువగా ఉండేవి. గుమ్మడికాయ త్వరగా కుళ్లే స్వభావం కలిగి ఉండటంతో దానిపై ఈగలు, పురుగులు చేరేవి. ఫలితంగా అవి ఇంటి లోపలికి కాకుండా బయటే కేంద్రీకృతమయ్యేవని కొందరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇంటి పరిశుభ్రత కొంతవరకు కాపాడబడేదని భావిస్తారు.

గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లో నివసించే వారికి ఒక రకమైన భద్రతా భావన కలుగుతుంది. “మన ఇంటిని చెడు ప్రభావాల నుంచి రక్షించే చర్య చేశాం” అనే సానుకూల ఆలోచన మానసికంగా ధైర్యాన్ని ఇస్తుంది. ఈ విశ్వాసం కుటుంబ సభ్యుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో గుమ్మడికాయకు బదులుగా నిమ్మకాయలు, మిరపకాయలు లేదా ఇతర వస్తువులను కూడా కడతారు. అయితే వాటి ఉద్దేశం మాత్రం ఒకటే. ప్రతికూల శక్తులను దూరం చేసి, శుభఫలితాలను ఆహ్వానించడం. కొన్ని ప్రాంతాల్లో గుమ్మడికాయపై ముఖం ఆకారాన్ని గీసి వేలాడదీయడం కూడా కనిపిస్తుంది.

పవన్ కళ్యాణ్ ఫారెస్ట్రీ మినిస్ట్రీ తీసుకుంది ఇందుకే.. ఎన్ని జంతువులు బతికి బట్టకట్టాయో తెలుసా..

Pawan Kalyan forestry ministry
Pawan Kalyan forestry ministry

Pawan Kalyan forestry ministry: ఎవరికైనా మంత్రి పదవి పొందే అవకాశం ఉంటే రెండవ మాటకు తావు లేకుండా రెవెన్యూ వైపు చూస్తారు. అవకాశం ఉంటే ఫైనాన్స్ లేదా ఎనర్జీ.. వంటి శాఖలను తీసుకుంటారు. ఎందుకంటే వాటిలో ఉండే సౌలభ్యం వేరు.. సంపాదించుకునే మార్గం వేరు.. కానీ ఏపీలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత.. ఆయన ఏరి కోరి పర్యావరణ శాఖను తీసుకున్నారు. తీసుకోవడం మాత్రమే కాదు తాను ఆ శాఖను తీసుకోవడం వల్ల ఏం చేస్తానో కూడా చేసి చూపిస్తున్నారు.

మరికొద్ది రోజుల్లో గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కార్యాచరణ మొదలుపెట్టాయి. ఏపీ రాష్ట్రంలో గోదావరి విస్తారంగా ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఈ నది చుట్టుపక్కల కాలుష్యకారక పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. ఆ పరిశ్రమలు పెద్ద వ్యక్తుల చేతిలో ఉన్నాయి. వాటి గురించి ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. తొలిసారిగా పవన్ కళ్యాణ్ ఆ విషయం మీద దృష్టి సారించారు. అదే కాదు తన పార్టీకి చెందిన మంత్రి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్యకారక పరిశ్రమలు ఈ స్థాయిలో ఉంటే మీరు ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు.. ఈ పరిశ్రమలు త్వరలో మూతపడే అవకాశం ఉంది. గోదావరి ఊపిరి పీల్చుకునే సుముహూర్తం దగ్గర్లోనే ఉంది. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ చూపించిన తెగువ వల్ల సాధ్యమైంది.

పవన్ కళ్యాణ్ ఆ మధ్య ఉమ్మడి చిత్తూరులో పర్యటించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ మీద ఉక్కు పాదం మోపాలంటే ఏం చేయాలో క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అటవీశాఖ సిబ్బందికి ఆయుధాలు.. ఇతర సామాగ్రి అందించేందుకు ప్రభుత్వాన్ని ఒప్పించారు. మరికొద్ది రోజుల్లో అటవీశాఖ సిబ్బందికి అత్యంత ఆధునికమైన ఆయుధ సామాగ్రి చేతికి వస్తుంది. దీనివల్ల ఆపత్కాలంలో వారికి ఆ ఆయుధాలు రక్షణగా ఉపయోగపడతాయి . అంతేకాదు స్మగ్లర్ల ఆగడాలకు చెక్ పడుతుంది.

వీటితోనే పవన్ కళ్యాణ్ ఆగిపోలేదు.. ఏపీలో విస్తారంగా ఉన్న అడవుల్లో జంతువుల వేట ఇష్టానుసారంగా సాగుతూ ఉంటుంది. వేటగాళ్లు అడవులలో ఉచ్చులు బిగిస్తుంటారు. ట్రాప్లు ఏర్పాటు చేస్తుంటారు. అందులో చిక్కుకున్న జింకలు.. కుందేళ్లు.. దుప్పులు.. వంటి జంతువులను వధించి.. వాటి మాంసాన్ని విక్రయిస్తుంటారు.. ఈ జంతువులను విక్రయించడం వల్ల అడవుల్లో జీవ వైవిధ్యం పూర్తిగా దెబ్బతింటున్నది. అందువల్ల పులులు.. ఇతర క్రూర మృగాలు ఆహారం లభించగా జనావాసాల్లోకి వస్తున్నాయి.

ఆ మధ్య రాజమండ్రిలోకి ఒక పులి వచ్చింది. చాలా రోజులపాటు ఆ ప్రాంతం లోనే అది తిరిగింది. చివరికి అటవీశాఖ అధికారులు పట్టుకోవడంతో రాజమండ్రి వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే.. అయితే ఈ అడవి జంతువులను వేటాడే వేటగాళ్ల కు చెక్ పెట్టేందుకు పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా సూచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి.. అడవుల్లో ఉన్న ఉచ్చులు.. ఫుల్ ట్రాప్లు.. కరెంటు తీగలను తొలగించారు.

హనుమాన్ ఫౌండేషన్ అటవీశాఖ అధికారులకు సహకరించింది. రంపచోడవరం అటవీ ప్రాంతంలో దుండగులు భారీ ఎత్తున ఉచ్చులు ఏర్పాటు చేశారు. రాహుల్ కూడా ఏర్పాటు చేశారు. దాదాపు క్షేత్రస్థాయిలో అటవీశాఖ అధికారులు మూడు రోజుల పాటు శ్రమించారు. అత్యంత కఠినమైన పరిస్థితుల మధ్య శ్రమించి 242 ఉచ్చులను, 10 ఫుల్ ట్రాప్ లను, 10 కిలోమీటర్ల పొడవు ఉన్న విద్యుత్ తీగలను తొలగించారు..

వీటిని తొలగించడం వల్ల ఎన్నో అటవీ జంతువులు బతికి బట్టకట్టాయి.. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే.. ఇలాంటి ఎన్నో పనులు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఎందుకంటే పచ్చని అడవి బాగుంటేనే మనిషి బతుకు బాగుంటుంది. అడవి ఎండిపోయిననాడు మనిషి బతుకు ఎడారి అవుతుంది.

ఇప్పటికైనా రేవంత్ మేల్కొన్నాడు. అసలు లోపాన్ని గుర్తించాడు.. సంతోషం

Revanth Reddy Political Journey
Revanth Reddy Political Journey

Revanth Reddy latest news: తెలంగాణ రాష్ట్ర కలను కాంగ్రెస్ పార్టీ సాకారం చేసింది.. కానీ, కెసిఆర్ వ్యూహ చతురతను అమలు చేసి.. ఆ క్రెడిట్ మొత్తం తను కొట్టేశాడు. స్వయం ప్రకటిత తెలంగాణ బాపుగా ప్రకటించుకున్నాడు. కెసిఆర్ అసలు లక్ష్యాన్ని కాంగ్రెస్ అంచనా వేయలేకపోయింది. ఆ తర్వాత జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం కావలసి వచ్చింది. తెలంగాణ ప్రజలు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష స్థానాన్ని అప్పగించినప్పటికీ.. కెసిఆర్ రాజకీయ పునరేకికరణ వల్ల కాంగ్రెస్ పార్టీ కోలుకోకుండా అయిపోయింది.

కెసిఆర్ ఏకపక్షంగా పాలిస్తూ ఉండడం.. కొన్ని ప్రజావ్యతిరేక విధానాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారిపోయాయి. వీటికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేది. సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికలలో తెలంగాణ పగ్గాలు అందుకోగలిగింది. ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాను ఏ స్థాయిలో అయితే ఉపయోగించుకుందో.. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను దూరం పెట్టింది.

సోషల్ మీడియాను దూరం పెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీకి గడిచిన రెండున్నర సంవత్సరాలుగా నష్టం జరుగుతూనే ఉంది. ఉప ఎన్నికలు.. స్థానిక సంస్థల ఎన్నికలు.. అంతకు ముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికలు.. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఇబ్బంది కలిగించలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి.. గులాబీ పార్టీ మీద ప్రజలు తీవ్రమైన కోపంతో ఉన్నారు కాబట్టి ఆ స్థాయిలో ఫలితాలు వచ్చాయి. అయితే ఎల్లకాలం అవే ఫలితాలు సాధ్యం కాదు. ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని తగ్గించుకోవడానికి భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియాను విపరీతంగా ఉపయోగించుకుంటున్నది.

కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను సోషల్ మీడియా ద్వారా బలంగా చాటిచెప్పుతున్నది. ఏ మాటకు ఆ మాట కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కంటే గులాబీ పార్టీ సోషల్ మీడియా కొన్ని లక్షల రెట్లు బలంగా ఉంది. మాధ్యమాలు ఏవైనా కావచ్చు.. గులాబీ పార్టీ బలమైన నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంది. చివరికి ప్రభుత్వం తాను చేసిన మంచి పని కూడా చెప్పుకునే స్థితిలో లేకుండా పోయింది. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ.. రైతుల ఖాతాలలో బోనస్ డబ్బులు జమ చేసినప్పటికీ.. మహిళలకు రకరకాల పథకాలు అమలు చేస్తున్నప్పటికీ.. ఇవేవీ కూడా చెప్పుకునే స్థాయిలో ప్రభుత్వం లేదు. ఒకవేళ ఇవే పథకాలను గులాబీ పార్టీ గనుక అమలు చేసి ఉంటే.. ప్రచారం ఒక స్థాయిలో ఉండేది.

సోషల్ మీడియా బలహీనంగా మారడాన్ని ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గుర్తించినట్టు కనిపిస్తోంది. పీఏసీ సమావేశంలో ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. సోషల్ మీడియా వారియర్స్ సేవలను ఉపయోగించుకోలేకపోవడం.. బలమైన సోషల్ మీడియా విభాగాలను నిర్మించుకోలేకపోవడం.. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసుకోకుండా.. సొంత డబ్బా కు మాత్రమే ఎమ్మెల్యేలు పరిమితం కావడం పట్ల రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉండదని హెచ్చరించారు. సోషల్ మీడియాను ప్రాపర్ గా వాడుకోవాలని.. ప్రభుత్వ పథకాలను.. కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లినప్పుడే విజయం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారు సరైన గుర్తింపు లేక బయటికి వెళ్లిపోయిన విషయాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అధికారంలో ఉన్న పార్టీలో నుంచి సోషల్ మీడియా వారియర్స్ బయటకు వెళ్లిపోతే అంతకుమించిన దారుణం మరొకటి ఉండదని.. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని సీఎం హెచ్చరించారు. అయితే సీఎం మాటలు హెచ్చరికల వరకే ఉంటాయా.. క్షేత్రస్థాయిలో ఏమైనా మార్పులు ఉంటాయా.. ఒకవేళ సీఎం మాటలు హెచ్చరికల వరకే ఆగిపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీని ఎవడూ బాగు చేయలేడు.