Homeఆంధ్రప్రదేశ్‌Kodali Nani latest decision: ఈసారి పోటీపై కొడాలి నాని సంచలన నిర్ణయం!

Kodali Nani latest decision: ఈసారి పోటీపై కొడాలి నాని సంచలన నిర్ణయం!

Kodali Nani latest decision: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి కొడాలి నాని యాక్టివయ్యారు. తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రెండు రోజుల కిందట తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ ను సైతం వదల్లేదు. అయితే విజయవాడ అయితే వస్తున్న కొడాలి నాని గుడివాడ వైపు మాత్రం చూడడం లేదు. గుడివాడ విషయంలో ఆయన […]

Kodali Nani latest decision: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి కొడాలి నాని యాక్టివయ్యారు. తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రెండు రోజుల కిందట తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ ను సైతం వదల్లేదు. అయితే విజయవాడ అయితే వస్తున్న కొడాలి నాని గుడివాడ వైపు మాత్రం చూడడం లేదు. గుడివాడ విషయంలో ఆయన ఆలోచన మారినట్లు తెలుస్తోంది. గుడివాడకు దూరం కావడమే ఉత్తమం అన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. 2004 నుంచి 2019 వరకు ఆయన 4 ఎన్నికల్లో గెలిచారు. ఐదోసారి పోటీ చేసి ఓడిపోయారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన తర్వాత కూడా తనను ప్రజలు ఓడించారన్న ఆవేదన కొడాలి నాని లో ఉన్నట్లు తెలుస్తోంది.

టిడిపి ద్వారా ఎంట్రీ..
2004లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుడివాడ నుంచి పోటీ చేశారు కొడాలి నాని. ఆ ఎన్నికల్లో గెలిచారు కానీ టిడిపి అధికారంలోకి రాలేదు. 2009లో రెండోసారి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడు కూడా టిడిపి అధికారంలోకి రాలేదు. అప్పుడే నాయకత్వంతో విభేదించి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ వైసీపీ మాత్రం గెలవలేదు. 2019లో కొడాలి నాని గెలవడంతో పాటు వైసిపి అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో రెండున్నర సంవత్సరాల పాటు మంత్రిగా కూడా కొనసాగారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ ఇంత చేసిన తనను నియోజకవర్గ ప్రజలు ఓడించడంతో తీవ్ర ఆవేదనతో ఉన్నారు. అందుకే గుడివాడకు దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

పోటీ చేయకూడదని..
అయితే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని కొడాలి నాని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీకి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచార బాధ్యతలను కొడాలి నాని తీసుకుంటారన్న ప్రచారం సాగుతోంది. అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో తప్పుకుంటానని నాని ముందుగానే ప్రకటన చేశారు. తన అన్న కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటించారు. తన దూకుడు రాజకీయాలతో లేనిపోని వివాదాలను తెచ్చుకున్నారు నాని. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసి.. వివాద రాజకీయాలకు దూరంగా ఉండాలని చూస్తున్నారట కొడాలి నాని. అందులో ఎంత నిజం ఉందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper