Homeబిజినెస్iPhone 18 series specifications leak: iPhone కొనేవారికి గుడ్ న్యూస్.. 18 సిరీస్ స్పెషిఫికేషన్...

iPhone 18 series specifications leak: iPhone కొనేవారికి గుడ్ న్యూస్.. 18 సిరీస్ స్పెషిఫికేషన్ లీక్..

iPhone 18 series specifications leak: Apple కంపెనీకి చెందిన ఐ ఫోన్ భారత మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడు పోతుంటాయి. అయితే ఈ కంపెనీకి చెందిన iPhone 18 సిరీస్ మార్కెట్లోకి రాబోతుంది. ఇప్పటికే ఐ ఫోన్ కొనాలని అనుకునేవారు కొత్త సిరీస్ కోసం ఎదురుచూస్తన్నారు. ఇలాంటి వారికి ఈ కొత్త ఫోన్ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. అయితే ఈ 18 సిరీస్ ఎలా ఉంటుందో చూద్దాం..

యాపిల్ కంపెనీ నంచి ప్రతీ ఏడాది కొత్త మొబైల్ ను సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తుంది. అలాగే ఏడాది కూడా iPhone 18 Pro, iPhone 18 Pro Max మోడళ్లను 2026 సెప్టెంబర్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఈసారి యాపిల్ ఒక కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రీమియం మోడల్స్‌ను సెప్టెంబర్‌లో విడుదల చేస్తూనే, సాధారణ iPhone 18, బడ్జెట్ ఫ్రెండ్లీ iPhone 18e మోడళ్లను వచ్చే ఏడాది వరకు వాయిదా వేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కాబట్టి, సాధారణ వినియోగదారులకు కొత్త ఐఫోన్ అందుబాటులోకి రావడానికి కొంత సమయం పట్టవచ్చు.

భారత మార్కెట్‌లో ఐఫోన్ 18 ధరలు ప్రీమియం శ్రేణిలోనే ఉండనున్నాయి. అంచనాల ప్రకారం iPhone 18 Pro బేస్ వేరియంట్ ధర సుమారు రూ.1,34,900 నుంచి రూ. 1,39,900 మధ్య ఉండవచ్చు. అలాగే, iPhone 18 Pro Max మోడల్ ధర సుమారు రూ.1,49,900 నుంచి రూ.1,59,900 వరకు ఉండవచ్చని అంచనా. సాధారణ iPhone 18 ధర 2027లో విడుదలయితే సుమారు రూ. 89,999 నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

కెమెరా విభాగంలో ఈసారి పెద్ద మార్పులు ఉండనున్నాయి. ముఖ్యంగా, iPhone 18 Pro మోడళ్లలో ‘వేరియబుల్ అపెర్చర్’ లెన్స్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనివల్ల వినియోగదారులు DSLR కెమెరాల మాదిరిగా డెప్త్ ఆఫ్ ఫీల్డ్ , లైటింగ్ పై పూర్తి నియంత్రణను కలిగి ఉంటారు. అంతేకాకుండా ముందు వైపు ఉన్న ‘డైనమిక్ ఐలాండ్’ పరిమాణం సుమారు 35% తగ్గి ఎక్కువ స్క్రీన్ స్పేస్‌ను అందిస్తుందని భావిస్తున్నారు. ఫోన్ వెనుక భాగంలో కొత్త రంగులు మరియు మెరుగైన ఫినిషింగ్‌తో వచ్చే అవకాశం ఉంది.

ఈ కొత్త ఐఫోన్లలో అత్యంత శక్తివంతమైన A20 Pro చిప్‌సెట్ ఉండనుంది. ఇది 2nm ప్రాసెస్ ఆధారంగా తయారవుతుంది, దీనివల్ల ఫోన్ పనితీరు 15 శాతం వేగంగా పనిచేస్తుంది. పవర్ ఎఫీషియెన్సీ 30 శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే మల్టీ టాస్కింగ్, గేమింగ్ కోసం ఇందులో 12GB RAM అందించే అవకాశం ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే.. Pro Max మోడల్‌లో 5,100mAh నుంచి 5,200mAh సామర్థ్యం గల బ్యాటరీ ఉండవచ్చని, ఇది మునుపటి కంటే మెరుగైన బ్యాటరీ లైఫ్ అందిస్తుందని నివేదికలు చెబుతున్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular