Home Blog Page 201

తెలంగాణ గడ్డమీద నుంచి వైయస్సార్ ద్వారా వైసీపీని దెబ్బ కొట్టిన పవన్..

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: ఇప్పుడంటే జగన్ గులాబీ పార్టీకి దగ్గర మిత్రుడు అయిపోయాడు. 2024లో జరిగే ఎన్నికల్లో ఏపీలో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని కెసిఆర్ కూడా చెప్పారు. అక్కడిదాకా ఎందుకు జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆ కార్యక్రమానికి కేసీఆర్ కూడా వెళ్లారు. ఆయనను ప్రగతి భవన్ కు ఆహ్వానించారు. అప్పట్లో కాలేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి జగన్ ను కెసిఆర్ ఆహ్వానించారు.

జగన్ మీడియాలో కేసీఆర్ గురించి.. కెసిఆర్ మీడియాలో జగన్ గురించి ఒక్క నెగిటివ్ వార్త కూడా రాదు. పైగా ఆ మధ్య బెంగళూరులో కేటీఆర్.. జగన్ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో కలుసుకున్నారు. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. సోషల్ మీడియాలో కూడా గులాబీ పార్టీకి వైసిపి.. వైసీపీకి గులాబీ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ సహకరిస్తుంటాయి. పైగా ఒకరి ఫీడ్ మరొకరు షేర్ చేసుకుంటారు. సయామి కవలల మాదిరిగా సాగిపోతున్న గులాబీ పార్టీ, వైసిపి బంధానికి పవన్ కళ్యాణ్ తెలంగాణ గడ్డ మీద నుంచి గట్టి షాక్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ ను ఆంధ్ర నేత అంటూ నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని మంగళవారం పబ్లిష్ చేసింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఔత్సాహికులు పవన్ కళ్యాణ్.. కేటీఆర్ గతంలో దిగిన ఫోటోలను.. వారిద్దరూ మాట్లాడుకుంటున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో గులాబీ పార్టీ మీడియా అసలు రంగు బయటపడింది. ఇక పవన్ కళ్యాణ్ తన ఇంటి వద్ద నుంచి జరిగిన విలేకరుల సమావేశంలో ఆవేశంగా మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణ విషయంలో వైఎస్ఆర్ పోషించిన పాత్ర గురించి స్పష్టంగా చెప్పేశారు. ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ గురించి గులాబీ మీడియా.. గులాబీ పార్టీ నాయకులు సానుకూలంగా మాట్లాడుతున్నారు. అంతకుముందు కేసీఆర్ కూడా వైఎస్ఆర్ గురించి గొప్పగానే మాట్లాడారు. తెలంగాణకు బద్ధ శత్రువు వైఎస్ఆర్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

వైయస్ బతికున్నప్పుడు చాలామంది తెలంగాణవాదులు నోరు మెదపలేదని.. నాడు తెలంగాణని వ్యతిరేకించిన వాళ్లంతా ఇప్పుడు పదవుల్లో ఉన్నారని.. వైయస్సార్ బతికి ఉన్నప్పుడు వారంతా తెలంగాణ నినాదాన్ని కూడా సహించేవారు కాదని పవన్ కళ్యాణ్ చెప్పారు. దీంతో పవన్ కళ్యాణ్ మీద విష ప్రచారం చేస్తున్న వైసీపీకి.. వైసిపి మీడియాకు జనసేన అధినేత షాకిచ్చారు. తెలంగాణ ఉద్యమం సాగుతున్నప్పుడు వైయస్సార్ ఎలా వ్యవహరించారు.. ఎలా ఉద్యమాన్ని తొక్కిపెట్టారు అనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గట్టిగానే ఉదహరించారు.. దీంతో వైసీపీ నేతలకు షాక్ తగిలింది. అంతేకాదు ఇటీవల ఓ వైసీపీ ఎమ్మెల్యే చేసిన భూ కుంభకోణం కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో ఏదో హంగామా చేద్దామని అనుకున్న వైసీపీ మీడియాకు.. వైసిపి నాయకులకు ఆదిలోనే బ్రేక్ వేశారు పవన్ కళ్యాణ్. అదే కాదు తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్న నమస్తే తెలంగాణకు కూడా దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.

నాకు ఆంధ్రా లోనే దిక్కులేదు.. తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానా..

Pawan Kalyan Telangana Politics
Pawan Kalyan Telangana Politics

Pawan Kalyan Telangana Politics: రాజకీయ నాయకులకు కొన్ని విషయాలు చెప్పాలంటే ధైర్యం ఉండాలి. అలాంటి ధైర్యం రాజకీయ నాయకులు నేటి కాలంలో పెద్దగా కనిపించడం లేదు. కానీ ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తి విభిన్నం. ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడిగా కంటే కూడా.. సామాజిక బాధ్యత ఉన్న పౌరుడిగా కనిపిస్తుంటారు. అందువల్లే ఆయన మొహమాటం లేకుండా మాట్లాడుతుంటారు. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ఉంటారు. తాజాగా తెలంగాణలో తన ఇంట్లో జరిగిన విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ చాలా ఆవేశంగా మాట్లాడారు. తెలంగాణ పునర్ నిర్మాణ సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం.. హైకోర్టులో కూడా సానుకూల తీర్పు రాకపోవడంతో పవన్ కళ్యాణ్ నేరుగా తన ఇంటి నుంచి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ అంటేనే ఆవేశం ఉంటుంది. దాని వెనక ఆలోచన కూడా ఉంటుంది. ఈసారి ఆవేశాన్ని, ఆలోచనను ఏకకాలంలో మిలితం చేసి ఆయన మాట్లాడారు. తన మీద వస్తున్న ఆరోపణలకు.. విమర్శలకు సమర్థవంతంగా సమాధానం చెప్పారు. అంతేకాదు, తెలంగాణలో జనసేన పోటీ ఎందుకు చేయాలి.. ఎందుకు ప్రశ్నించాలి.. సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకోవాలి అనే విషయాలు మీద పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీ ఇచ్చారు. విలేకరులు అడిగిన ప్రతి ప్రశ్నకు ఆయన సావధానంగా సమాధానం చెప్పారు. అంతేకాదు నేషనల్ మీడియా కూడా కొన్ని ప్రశ్నలు అడిగితే.. వాటికి కూడా సాలిడ్ ఆన్సర్ ఇచ్చేశారు.

ముఖ్యమంత్రి ఎందుకు అవుతాను

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశించడానికి కేవలం అధికారం కోసం మాత్రమే కాదని.. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి జనసేన తెలంగాణలో పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. కెసిఆర్ ఆంధ్రప్రదేశ్లో భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే తాము స్వాగతించామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. “అందరూ మహారాష్ట్ర వెళ్లొచ్చు. పంజాబ్ కూడా వెళ్ళవచ్చు. కానీ జనసేన తెలంగాణలో ఎందుకు అడుగు పెట్టకూడదు.. తెలంగాణ ఏమైనా మీ అయ్యా జాగిర.. తెలంగాణ ఏమైనా నిషిద్ధ ప్రాంతమా.. తెలంగాణలో ఏం కోరుకుంటాం.. నేను ఇక్కడ ముఖ్యమంత్రి ఎందుకు అవుతాను.. నాకు ఆంధ్రాలోనే దిక్కులేదు.. ఇక్కడ నేను ముఖ్యమంత్రి ఎందుకు అవుతాను. తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేస్తామని ఇక్కడి వారి బయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీకి లక్ష మంది కూడా లేరు. రెండువేల మందితో సభ పెట్టుకుంటే అనుమతి ఎందుకు ఇవ్వరు అంటూ” పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన ప్రతి మాటలోనూ క్లారిటీ ఉంది.. కేవలం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనవసరమైన రాద్ధాంతం చేసింది.. కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ. అని రాష్ట్రాలలో ఆ పార్టీ రాజకీయాలు చేస్తోంది. అలాంటప్పుడు తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగుపెడితే ఆ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంటి.. త్వరలో జరిగే జిహెచ్ఎంసి ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తే తమకు ఇబ్బంది అవుతుందని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారా.. అందువల్లే ఇలా జనసేన పార్టీ సభకు అడ్డంకులు సృష్టిస్తున్నారా.. అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పొన్నం ప్రభాకర్.. దానం నాగేందర్.. కల్వకుంట్ల కవిత.. పాశం యాదగిరి లాంటి వారంతా కూడా విమర్శలు చేయడం ఇక్కడ విశేషం. వారందరికీ కూడా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ విలేకరుల సమావేశం వేదికగా చెప్పేశారు.

మీ అయ్య జాగిరా.. నా ఇల్లుని తెలంగాణ ప్రభుత్వానికి రాసిచ్చేస్తా తీసుకోండి - పవన్ కళ్యాణ్

Pawan Kalyan Fans
Pawan Kalyan Fans

Pawan Kalyan house controversy: గత కొద్దిరోజులుగా తెలంగాణ లో పవన్ కళ్యాణ్ పై జరుగుతున్నా ముప్పేట దాడి ని మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ప్రొఫెస్సర్ నాగేశ్వర రావు, ఎలాంటి ఆధారాలు లేకుండా, సోషల్ మీడియా లో వైసీపీ పార్టీ నాయకులూ ప్రచారం చేసే వార్తలను తీసుకొచ్చి , పవన్ కళ్యాణ్ ఢిల్లీ లో రీసెంట్ గా అమిత్ షా ని కలవడానికి వెళ్ళడానికి ముఖ్య కారణం జగన్ ని అరెస్ట్ చెయ్యమని అడగడానికి అని చెప్పడం , అందుకు అమిత్ షా పవన్ కళ్యాణ్ ని మందలించి పంపాడని అనడం, వీటిని జనసేన పార్టీ చాలా తీవ్రస్థాయిలో ఖండించడం వంటివి జరిగాయి. ఈ సమస్యని మరింత తీవ్రవతం చేస్తూ ప్రొఫెస్సర్ నాగేశ్వర్ రావు తన తోటి జర్నలిస్టులతో కలిసి ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి తెలంగాణ వాదం లేవనెత్తడం వంటివి చేయడం రాజకీయాల్లో తీవ్రమైన హీట్ వాతావరణం ని తలపించాయి.

ఈ నేపథ్యం లో పవన్ కళ్యాణ్ నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ నవనిర్మాణ సభ ని ఏర్పాటు చేసాడు. 2 వేలమంది జనసేన కార్యకర్తలతో గచ్చిబౌలి లో ప్లాన్ చేసిన ఈ మీటింగ్ కి ప్రభుత్వం నుండి అనుమతి రాలేదు. దీంతో పవన్ కళ్యాణ్ జూబ్లీ హిల్స్ లోని తన ఇంటి వద్దనే ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేస్తున్నట్టు నేడు ఉదయం ఒక ప్రకటన చేసాడు. కాసేపటి క్రితమే ఈ ప్రెస్ మీట్ ని నిర్వహించగా, పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కీలమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణ లో నన్ను అడుగుపెట్టనివ్వం అని కొందరు కాంగ్రెస్ నాయకులూ మాట్లాడుతున్నారు. తెలంగాణ మీ అయ్యా జాగీరు అనుకుంటున్నారా?, ఇప్పుడు చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి , తెలంగాణ లో జనసేన పార్టీ ఉంటుంది , ప్రతీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది , ప్రతీ సమస్య పై గొంతెత్తి మాట్లాడుతుంది, ఏమి చేస్తారో చేసుకోండి’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘కొంతమంది నేను తెలంగాణ లో భూమి ని కబ్జా చేసి ఇల్లు ని నిర్మించుకున్నానని అంటున్నారు. నేను నిజంగా అలా చేసానని నిరూపిస్తే , రేవంత్ గారికి ఒక్కటే చెప్తున్న, నా ఇల్లు ని తెలంగాణ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా రాసి ఇచ్చేస్తా’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడానికి కానీ, విభజన కి కానీ నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు , విభజించిన తీరుకి వ్యతిరేకం అని మొదటి నుండి చెప్తూనే వస్తున్నామని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లు అయినప్పటికీ కూడా, యువత కి ఉపాధి కలిపించలేక పోయారని , ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పిన వాళ్ళు నేడు కాంగ్రెస్ పార్టీ లో ఎమ్మెల్యే లుగా కొనసాగుతున్నారని , ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు నా మీద మాట్లాడుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు నెటిజెన్స్ అమితంగా ఆకట్టుకున్నాయి . అంతే కాకుండా గద్దర్ తో తనకు ఉన్నటువంటి గొప్ప అనుబంధాన్ని , ఆయన ఉద్యమ స్ఫూర్తిని కూడా పవన్ కళ్యాణ్ ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడడం గమనార్హం. ఇంకా ఆయన ఈ ప్రెస్ మీట్ లో ఏమేమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో లో చూడండి.

ఆస్పత్రిలో ఆపరేషన్ లో ఉండగా వైఎస్ఆర్ బెదిరించాడు.. బెదరలా.. అసలు నిజం చెప్పిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan YSR incident truth
Pawan Kalyan YSR incident truth

Pawan Kalyan YSR incident truth: గచ్చిబౌలిలో నిర్వహించే సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. హైకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ ఉపయోగం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ ఆలోచించుకున్నారు. తన ఇంటి దగ్గర నుంచే విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడడం మొదలుపెట్టారు. సహజంగానే ఆవేశపూరితమైన వ్యక్తిత్వంతో కనిపించే పవన్ కళ్యాణ్.. చాలా లోతైన విషయాలు మాట్లాడారు. ఇన్ని రోజులపాటు తన మీద వస్తున్న ఆరోపణలకు అత్యంత ఘాటు భాషలో సమాధానం ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ కు సమాజ సేవ అంటే చాలా ఇష్టం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలను ఆయన చాలావరకు పరిష్కరించారు. చాలామందికి ఆయన సహాయం కూడా చేశారు. ఈ విషయాలను ఆయన స్వయంగా చెప్పుకోలేదు. కొంతమంది వ్యక్తుల ద్వారా అది కూడా చాలా కాలం తర్వాత బయటకు వచ్చాయి. ఇప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన ఏపీ రాష్ట్రంలో పర్యావరణ శాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. తన మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న పనులను వేగంగా పూర్తి చేస్తూనే.. పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమల యాజమాన్యాలకు చుక్కలు చూపిస్తున్నారు.. ముక్కు సూటి స్వభావాన్ని కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ ఏ విషయమైనా సరే ఓపెన్ గానే చెబుతారు. జూబ్లీహిల్స్ లో తన ఇంటి వద్ద జరుగుతున్న విలేకరుల సమావేశంలో కూడా తన రాజకీయ ప్రవేశం గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

చాలాకాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడారు. బహుశా తెలంగాణ నేతలు తన మీద చేస్తున్న ఆరోపణలకు ఈ విధంగా కౌంటర్ ఇవ్వడానికి ఆయన ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం అంత ఈజీగా జరగలేదు. బాలు సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత.. 2005 -06 కాలంలో ఆయనకు అపెండిక్స్ ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ హాస్పిటల్ లో బెడ్ మీద ఉన్నారు.. ఒక పోలీసు అధికారి ఆయన దగ్గరికి వచ్చారు..

“మీరు రాజకీయాల్లోకి వస్తున్నారా.. మిమ్మల్ని వదిలిపెట్టారు. మీ అన్నయ్యగారు ఏమైనా పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశం ఉందా.. ఆయనను కూడా వదిలిపెట్టరు. కేసులు పెడతారు.. రకరకాలుగా ఇబ్బందులు పెడతారు.. జాగ్రత్త” అంటూ ఆ పోలీసు అధికారి పవన్ కళ్యాణ్తో చెప్పారు.. దానికి పవన్ కళ్యాణ్ “లేదు సార్ మేము రాజకీయాల్లోకి ఎందుకు వస్తాం. రాజకీయాలలోకి రావాల్సిన అవసరం మాకు ఏముంది” అని బదులిచ్చారు. “లేదు లేదు మీరు చూస్తూ ఉండండి.. మీరు రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా చంపేస్తారు అని” ఆ పోలీసు అధికారి పవన్ కళ్యాణ్ తో చెప్పారు. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. యువరాజ్యానికి పవన్ కళ్యాణ్ అధినేతగా ఉన్నారు. ఇప్పుడైతే చంపేస్తారు అనే మాట పవన్ కళ్యాణ్ కు వినిపించిందో ఆయన అప్పుడే గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత తన సోదరుడితో ఈ విషయాలను చెప్పుకొని బాధపడ్డారు. ఆ తర్వాత కొద్ది కాలానికి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రజారాజ్యం పార్టీ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. చిరంజీవి అధికారంలోకి రాలేకపోయినప్పటికీ.. ముఖ్యమంత్రి కలను సాకారం చేసుకోలేకపోయినప్పటికీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మాత్రం తనకంటూ ఒక మార్క్ సృష్టించుకున్నారు.
https://x.com/i/broadcasts/1wxWjjmRjQjJQ

తమిళ సీఎం విజయ్ కి మరో ఇబ్బంది.. ఈ గండాన్ని ఎలా దాటుతాడో ..

CM Vijay political challenges
CM Vijay political challenges

CM Vijay political challenges: తమిళ ముఖ్యమంత్రి విజయ్ కి సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి. ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు ప్రతిదీ కూడా ఒక పరమపద సోపానం లాగా మారిపోయింది. ప్రతి సమస్యను ఆయన పరిష్కరించుకుంటూ వస్తున్న విధానం గొప్పగానే ఉన్నప్పటికీ.. ఆయన సమస్యలు ఎదుర్కొంటున్న తీరు మాత్రం టీ వీ కే కార్యకర్తలకు ఏమాత్రం రుచించడం లేదు.

ఇటీవల కోయంబత్తూరు వ్యవహారంలో విజయ్ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది డీఎంకే. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన విజయ్ ఐపిఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. దీంతో ఆ సమస్య నుంచి బయటపడగలిగారు. దాన్ని మర్చిపోకముందే ఇప్పుడు మరొక సమస్య విజయ్ ముందు నిలిచింది.. దీంతో ఆయన ఏం చేస్తారు అనేది ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది.

తమిళనాడు రాష్ట్రంలో కావేరి నది జలాల వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కావేరి నదికి మధ్య భాగంలో మేఘ ధాతు ప్రాంతం వద్ద కర్ణాటక రాష్ట్రం ఒక రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.. దీనిని తప్పుపడుతూ తమిళనాడులో ఉన్న అన్ని పార్టీలు ఆందోళనలు చేపడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే కర్ణాటక వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎండిఎంకే ప్రధాన కార్యదర్శి వైగో ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక తీరు సరికాదని మండిపడ్డారు.

ఆ ప్రాజెక్టును నిర్మిస్తామని ఇటీవల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ వ్యాఖ్యానించారు. కర్ణాటక ప్రభుత్వం మొండిగా వెళుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వకూడదని అన్ని రాజకీయ పార్టీలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి.. ఈ నిరసనలో అన్ని రాజకీయ పార్టీలు.. రైతు సంఘాలు పాల్గొన్నాయి.

ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం కర్ణాటక ప్రభుత్వం ఏకంగా 5900 కోట్ల రూపాయలను కేటాయించింది. 68 టీఎంసీ ల నీరు నిల్వ చేసే విధంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. సుప్రీంకోర్టు, కావేరి నీటి నిర్వహణ బోర్డు ఉత్తర్వులను కర్ణాటక ప్రభుత్వం కాల రాస్తోందని తమిళనాడు నేతలు ఆరోపిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టు వల్ల మెట్టూరు ప్రాంతానికి నేటి ప్రవాహం తగ్గుతుందని.. కావేరి నీటి మీద ఆధారపడిన జిల్లాల మొత్తం ఇబ్బందులు ఎదుర్కొంటాయని తమిళ రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వివాదాన్ని ఎలా విజయ్ పరిష్కరిస్తారు.. కర్ణాటక ప్రభుత్వం మీద ఎలా ఒత్తిడి తీసుకొస్తారో చూడాల్సి ఉంది.

ఐపీఎల్ ద్వారా ఇలా కూడా సంపాదించవచ్చా.. వైభవ్ సూర్య వంశీ భలే పాఠాలు చెప్పాడుగా..

Vaibhav Suryavanshi IPL
Vaibhav Suryavanshi IPL

Vaibhav Suryavanshi IPL: ఐపీఎల్ అంటేనే కమర్షియల్ గేమ్. ఇందులో ఆడేవాడికి డబ్బే డబ్బు. అలాంటి ప్లేయర్ల మీద కోట్లు కుమ్మరించడానికి కంపెనీలు వెనుకాడవు. ప్రకటనలు.. ఒప్పందాలు.. ఇంకా అనేక రకాల వ్యవహారాలతో ఆటగాళ్లు దండిగానే సంపాదిస్తారు. ఈసారి ఐపీఎల్ లో మాత్రం 15 సంవత్సరాల బుడ్డోడు.. గొప్ప గొప్ప ప్లేయర్లను కాదని గట్టిగా సంపాదించాడు. అతడు మరెవరో కాదు వైభవ్ సూర్య వంశీ.

సూర్య వంశీ ఇటీవలీ ఐపీఎల్ లో సంచలన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. ఆట ద్వారా మాత్రమే కాకుండా ఆదాయంలో కూడా సత్తా చూపించాడు. ఈ సీజన్లో అతడు రి టెన్షన్ కింద రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి 1.1 కోట్లు స్వీకరించాడు. మ్యాచ్ ఫీజుగా 7.5(ఒక్కో మ్యాచ్) లు తీసుకున్నాడు. తద్వారా 1.20 కోట్లు అతనికి దక్కాయి. తన ప్రదర్శనతో మోస్ట్ వ్యాల్యుడు ప్లేయర్ గా 15 లక్షలు సొంతం చేసుకున్నాడు. ఆరెంజ్ క్యాప్ ద్వారా 10 లక్షలు దక్కించుకున్నాడు. సూపర్ స్ట్రైకర్ ద్వారా 10 లక్షలు + 20 లక్షలు+ ఒక కారు తక్కించుకున్నాడు. అత్యధిక సిక్సర్లు కొట్టడం ద్వారా పది లక్షలు సంపాదించాడు. ఎమర్జింగ్ ప్లేయర్ పురస్కారం ద్వారా 10 లక్షలు సొంతం చేసుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. ఇతర పురస్కారాలు కలుపుకొని మొత్తంగా అతడు 3.10 కోట్లు సంపాదించాడు.

ఐపీఎల్ లో ఒక అన్ క్యాప్డ్ ఆటగాడు ఈ స్థాయిలో సంపాదించడం మామూలు విషయం కాదు. ఇదంతా కూడా ఒక రోజులోనే రాలేదు. సూర్య వంశీ తన సూపర్ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. దీనికోసం విపరీతంగా ప్రాక్టీస్ చేశాడు. క్రికెట్ మాత్రమే లోకంగా బతికాడు. బంతిని గట్టిగా కొట్టడం మాత్రమే కాదు.. సమర్థవంతంగా ఎలా ఆడాలో కూడా చూపించాడు. అందువల్లే అతడు అత్యంత విలువైన ఆటగాడిగా మారిపోయాడు. ఇప్పుడే అతడు ఐపీఎల్లో తన ప్రస్థానం మొదలుపెట్టాడు. ఇకముందు విధ్వంసాల మీద విధ్వంసాలు సృష్టించబోతాడు. అతని కోసం రాజస్థాన్ రాయల్స్ ఎంతైనా ఖర్చు చేస్తుంది. ఎన్ని కోట్లయినా సరే ఇచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే సూర్యవంశీ కేవలం ఇప్పుడు ఒక ఆటగాడు మాత్రమే కాదు.. అంతకుమించిన బ్రాండ్ కూడా..

మొదట్లో అతడి ఆట దూకుడుగా సాగేది. ఆ తర్వాత దూకుడు తనంతో పాటు సమర్థత కూడా దానికి జత కలిసేది. అందువల్లే అతడు ఈ స్థాయిలో ఆడుతున్నాడు. పరుగుల వరద బ్రహ్మాండంగా పారిస్తూ ఉన్నాడు. సూర్య వంశీ ఆడుతున్న తీరు ఆకట్టుకుంటుంది. అతడు ఇదే జోరు కనక చూపిస్తే.. ఐపీఎల్ చరిత్రలో మరింత విధ్వంసాన్ని సృష్టించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇళ్లను ప్రింట్ చేస్తున్నారు.. ఎవర్రా మీరు ఇలా ఉన్నారు

Largest 3D printed building in France
Largest 3D printed building in France

Largest 3D printed building in France: మనకు ఇల్లు కట్టుకోవాలని ఉంటే ఏం చేస్తాం.. ముందు సరైన స్థలం కొనుగోలు చేస్తాం. ఆ తర్వాత ఇంజనీర్ ను పిలిపించి ప్లానింగ్ గీయించుకుంటాం. తాపీ మేస్త్రిని పిలిపించుకొని మన స్తోమత తగ్గట్టుగా ఇల్లు నిర్మించుకుంటాం. కానీ ఇప్పుడు ఇల్లు నిర్మించే విషయంలో కూడా మార్పులు వస్తున్నాయి. క్రమేపి ఇంటి నిర్మాణం కొత్త పుంతలు తొక్కుతోంది.

కొద్దిరోజుల క్రితం ఫ్రాన్స్ లో ఒక అపార్ట్మెంట్ నిర్మించారు. దానిని నిర్మించారు అని చెప్పడం కంటే.. ప్రింట్ చేశారు అనడం సబబు.. దాదాపు మూడు అంతస్తుల లో.. 12 పోర్షన్లు ఉన్నాయి ఈ అపార్ట్మెంట్లో. ఈ భవనంలో ఉన్న కోడలు మొత్తం ప్రింటింగ్ టెక్నాలజీతో పూర్తి చేశారు. నిర్మాణంలో బలం ఉండడానికి స్తంభాలను పాతారు. కాలమ్స్.. పై కప్పులను నిర్మించారు. ఆ తర్వాత తలుపులను.. కిటికీలను.. వైరింగ్.. బాత్రూం.. ఇతర వాటిని దశలవారీగా అమర్చారు. అయితే ఒక సాధారణ ఇంటిని నిర్మించడానికి పట్టే సమయానికంటే మూడు నెలలు ముందుగానే దీనిని పూర్తి చేశారు.

ఫ్రాన్స్ లోని అత్యంత చారిత్రాత్మకమైన నగరం రిమ్స్ ప్రాంతంలో దీనిని నిర్మించారు. 800 చదరపు మీటర్ల వైశాల్యం తో.. అత్యాధునికమైన ఫైబర్.. కాంక్రీట్ వంటి వాటిని వాడి దీనిని నిర్మించారు. అత్యంత నాణ్యమైన ఫైబర్ వల్ల ఈ భవనంలో పిల్లర్ల సంఖ్య చాలా వరకు తగ్గింది. త్రిడి విధానంలో ప్రింటింగ్ టెక్నాలజీ ఉపయోగించడంతో కాంక్రీట్ వాడకం కూడా సమర్థవంతంగా సాగింది. అంతేకాదు, 10 శాతం కాంక్రీట్ వాడకాన్ని తగ్గించారు. గత ఏడాది మార్చి నెలలో 3d ప్రింటింగ్ మొదలుపెట్టారు. ఆ తర్వాత 34 రోజుల్లోనే ఆ త్రీడీ ప్రింటింగ్ మొత్తాన్ని పూర్తి చేశారు.. మిగిలిన పనులు దశలవారీగా పూర్తి చేశారు. ఏప్రిల్ నెలలో ఈ భవనం ప్రారంభమైంది.. కో బోడ్ బాడ్ -2 అనే అత్యాధునికమైన త్రీడీ ప్రింటర్ ను దీనికోసం ఉపయోగించారు. ఈ యంత్రం గతంలో భూకంపాలను తట్టుకునే ఇల్లు.. సమాచార కేంద్రాన్ని త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో పూర్తి చేయడం ఇక్కడ విశేషం.

మన దేశంలో ఎలా ఉందంటే

3d ప్రింటింగ్ టెక్నాలజీ అనేది మనదేశంలో కూడా సాగుతూ ఉంది. ఇప్పటికైతే ప్రారంభ దశలో మాత్రమే ఉంది. సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం మద్రాస్ ఐఐటి త్వస్థ పేరుతో త్రీడీ ప్రింటెడ్ ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేసింది. 600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఇల్లు అప్పట్లో చాలా మందిలో విపరీతమైన ఆసక్తిని కలగజేసింది. త్వస్త తో పాటు ఎల్ అండ్ టి సంస్థ కూడా గృహ నిర్మాణాలను వేగంగా చేపట్టేందుకు 3d ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు.

ప్రభాస్, అల్లు అర్జున్ లను టార్గెట్ చేసిన రామ్ చరణ్..

Ram Charan vs Prabhas vs Allu Arjun
Ram Charan vs Prabhas vs Allu Arjun

Ram Charan vs Prabhas vs Allu Arjun: బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమా మరో రెండు రోజుల్లో రిలీజ్ కి రెడీ అవ్వనున్న నేపథ్యంలో ఈ సినిమా విషయంలో మేకర్స్ అయితే చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఎలా ఉంటుంది ప్రేక్షకులను అలరిస్తుందా? లేదా అనే విషయంలో కూడా సరైన క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రానటువంటి గుర్తింపు ఈ సినిమాతో రామ్ చరణ్ తెచ్చుకోబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు రామ్ చరణ్ చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి.

ఇక ఆయన నుంచి రాబోతున్న సినిమా ఏరేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను రాబడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది గంటల పాటు వెయిట్ చేయాల్సిన సమయమైతే ఉంది…రామ్ చరణ్ లాంటి నటుడు పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతున్నాడు అంటూ బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా మ్యాజిక్ ఫిగర్ ని రాబడుతుందా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశముగా మారింది. నిజానికి ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో ప్రభాస్ అల్లు అర్జున్ ను మినహాయిస్తే ఎవరు కూడా 1500 కోట్లకు పైన కలెక్షన్స్ అయితే కొల్లగొట్టలేదు.

కాబట్టి రామ్ చరణ్ పెద్ది సినిమాతో ఆ రికార్డును బ్రేక్ చేసి తనకంటూ సొంత రికార్డులను క్రియేట్ చేసుకోగలుగుతాడా అనే ధోరణిలో కూడా చర్చలైతే జరుగుతున్నాయి. ఇక రామ్ చరణ్ అనుకున్నట్టుగా ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే పర్లేదు లేకపోతే మాత్రం ఈ సినిమా కూడా షెడ్డు కి పోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తాడు అనేది… ఇక రేపు నైట్ నుంచి పెద్ది మూవీకి సంబంధించిన ప్రీమియర్స్ పడే అవకాశమైతే ఉంది…

జగపతి బాబు ను మోసం చేసిన బుచ్చిబాబు... ఇంటి గేటు దాకా వచ్చి వెళ్ళిపోయాడా..?

Buchi Babu Jagapathi Babu controversy
Buchi Babu Jagapathi Babu controversy

Buchi Babu Jagapathi Babu controversy: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ సైతం తను చేసే సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. మొత్తానికైతే ఆయన చేస్తున్న సినిమాలన్నీ అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇక తన శిష్యుడు అయిన బుచ్చిబాబు సైతం రాణిస్తూ ఉండడం విశేషం… ఉప్పెన సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన ఇప్పుడు పెద్ది సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన అనుకున్నట్టుగానే పెద్ది సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక జగపతిబాబు లాంటి నటుడు ఈ మధ్యకాలంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బుచ్చిబాబు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. ఉప్పెన సినిమాకి మొదట తననే విలన్ గా అనుకున్నారని తన ఇంటి గేటు దాకా వచ్చి మరి తన ఆలోచన మార్చుకొని వెనక్కి వెళ్లిపోయారని చెప్పాడు.

ఎందుకంటే తనకంటే బెటర్ ఆప్షన్ అయిన విజయ్ సేతుపతికి వెళ్తేనే ఈ క్యారెక్టర్ బాగా ఎలివేట్ అవుతుందనే ఉద్దేశంతో తను కాదని విజయ్ సేతుపతి ని అప్రోచ్ అయ్యాడని జగపతిబాబు చెప్పాడు. నాకు నాన్నకు ప్రేమతో సినిమా సమయం లోనే బుచ్చిబాబు తెలుసు…

మా ఇద్దరి మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధం ఉందని జగపతి బాబు చెప్పడం విశేషం… మొత్తానికైతే ఉప్పెన సినిమాలో నన్ను పెట్టుకోలేదనే ఒక చిన్న గిల్టీ ఫీల్ తోనే పెద్ది సినిమాలో అప్పలసూరి క్యారెక్టర్ కి నన్ను సెలెక్ట్ చేసుకున్నారని జగపతిబాబు చెప్పడం విశేషం…

మొదట్లో ఈ క్యారెక్టర్ కోసం కూడా కొంతమందిని అనుకున్నాడు. కానీ వాళ్ళు దానికి సెట్ అవ్వరనే ఉద్దేశ్యంతో మళ్లీ నా దగ్గరికి వచ్చాడు అంటూ జగపతిబాబు చెప్పడం విశేషం…పెద్ది మూవీ లో తన పాత్ర చాలా బాగుంటుందని జగపతి బాబు చెప్పడం ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది…

2 రోజుల్లో 'పెద్ది'.. అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఏ రేంజ్ లో ఉన్నాయంటే..

Peddi Plus Points
Peddi Plus Points

Peddi movie advance bookings: అభిమానులు , ప్రేక్షకులు ఎప్పటి నుండో ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ కంటెంట్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని బహుశా అభిమానులు కూడా ఊహించి ఉండరు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ రీసెంట్ గానే భారీ లెవెల్ లో మొదలు పెట్టారు. ముందుగా ఓవర్సీస్ లో నెల రోజుల క్రితమే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టగా, అక్కడి ఆడియన్స్ నుండి యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. 3 మిలియన్ల గ్రాస్ కేవలం ప్రీమియర్ షోస్ నుండి వస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు కనీసం 1 మిలియన్ ప్రీ సేల్స్ కూడా జరగలేదు.

ఓవర్సీస్ పరిస్థితి అలా ఉండగా , ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. ఇక్కడ నిన్న ఉదయం నుండి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా, సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇదే ఊపు కొనసాగితే , కచ్చితంగా ఈ చిత్రానికి ఆల్ టైం టాప్ 3 రేంజ్ గ్రాస్ వస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇకపోతే రేపే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ పడనున్నాయి. ఒక్క ప్రీమియర్ షో టికెట్ రేట్ 600 రూపాయిలు. అన్నీ ప్రాంతాల్లోనూ ప్రీమియర్ షోస్ టికెట్ సేల్స్ హాట్ కేక్ లాగా ఉన్నాయి. ముందుగా ఓవరాల్ గ్రాస్ ప్రీమియర్ షోస్ + మొదటి రోజు కి కలిపి ఎంత వచ్చిందో ఒకసారి వివరంగా చూద్దాం. ముందుగా ప్రీమియర్ షోస్ విషయానికి వస్తే వైజాగ్ నుండి 2 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా , రాజమండ్రి నుండి 80 లక్షలు , కాకినాడ నుండి 78 లక్షలు, గుంటూరు నుండి 70 లక్షలు వచ్చాయి.

అదే విధంగా నెల్లూరు నుండి 66 లక్షలు రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా , తిరుపతి నుండి 51 లక్షలు, విజయనగరం నుండి 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ నుండే 5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇక నార్త్ అమెరికా విషయానికి వస్తే, ఇప్పటి వరకు 8 లక్షలకు పైగా డాలర్లు నమోదు అయ్యాయని, ఓవరాల్ గా ఓవర్సీస్ నుండి 1.265 మిలియన్ డాలర్ల గ్రాస్ నమోదు అయ్యిందని, ఇండియన్ కరెన్సీ లెక్కల్లోకి చూస్తే 12 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చిందని ,. అదే విధంగా ఇండియా లో ప్రీమియర్స్ + మొదటి రోజుకి కలిపి 13 కోట్ల గ్రాస్ వచ్చిందని , ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 25 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చిందని అంటున్నారు.

తమిళనాట సంచలనం: అన్నామలైకి దారేది?

Annamalai
Annamalai

Annamalai political future: భారతీయ జనతా పార్టీకి ఇలా జరగాల్సిందే. తమిళనాడులో అధికారంలోకి రావాలని కలలుగన్న కమలం పార్టీ పెద్దలు.. వాటిని ఇక కలలుగానే కొనసాగించాలి. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీకి అన్నామలై రూపంలో ఒక సిసలైన నాయకుడు.. తన ఐపీఎస్ సర్వీసును పక్కన పెట్టుకొని రాజకీయాల్లోకి వస్తే.. కమలం పార్టీకి తిరుగులేని స్థాయిని తమిళనాడులో కల్పించాలని సంకల్పిస్తే.. కేవలం అన్నాడీఎంకే అనే పార్టీతో పొత్తు కోసం అన్నామలై అనే శక్తివంతమైన నాయకుడిని బిజెపి పక్కన పెట్టింది. రాష్ట్ర అధ్యక్షుడి స్థానం నుంచి తొలగించింది.. అంతేకాదు ఎన్నికల్లో అతని పాత్రను నామమాత్రం చేసింది. గెలిచే స్థానాలను అన్నా డీఎంకేకు ఇచ్చేసింది.

ఇవన్నీ చూస్తున్న అన్నామలై కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి.. ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. కార్యనిర్వాహక అధ్యక్షుడు బిఎల్ సంతోష్ తో సమావేశమైనట్టు సమాచారం. సుదీర్ఘ సమయం భేటీ తర్వాత ఆయన తన రాజీనామా పత్రాన్ని వారికి అందజేసినట్టు తెలుస్తోంది. ఇక మంగళవారం సాయంత్రం అన్నామలై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం మాత్రం అన్నామలైని పార్టీలో కొనసాగాలని కోరినట్టు తెలుస్తోంది. ఆయనకు రాజ్యసభ స్థానాన్ని కూడా ఇచ్చే అవకాశాన్ని తాము పరిశీలిస్తున్నామని కేంద్ర అనేకత్వం చెప్పినట్టు సమాచారం. కాగా పార్టీ అధినాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చేవరకు ఢిల్లీని విడిచిపెట్టి వెళ్లకూడదని అన్నామలై కి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ చెప్పినట్టు తెలుస్తోంది. తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీని పెట్టేందుకు అన్నామలై సిద్ధంగా ఉన్నట్టు అక్కడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొంతకాలంగా తన మద్దతుదారులతో అన్నామలై వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ పై చర్చలు సాగిస్తున్నారు. వీటికి సంబంధించి కొద్ది రోజుల్లోనే అసలు విషయాలను వెల్లడిస్తామని.. తన నిర్ణయాన్ని ప్రకటిస్తామని అన్నామలై వెల్లడించారు.

అన్నామలై నితిన్ చెప్పినట్టుగా ఢిల్లీలో ఉంటారా.. వెంటనే తమిళనాడు వచ్చేస్తారా.. అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. ద్రావిడ సిద్ధాంతాలు లేని తమిళనాడు రాజకీయాలను చూడాలని అన్నామలై కోరుకుంటున్నారు. ద్రావిడ సిద్ధాంతాలతో ఆ రెండు పార్టీలు తమిళనాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాయని అనేక సందర్భాలలో అన్నామలై ఆరోపించారు. తాజాగా భారతీయ జనతా పార్టీ కూడా అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి ఆయన ఏ మాత్రం సహించలేకపోయారు. బిజెపి అధినాయకత్వానికి చెప్పినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో ఆయన తన దారి తాను చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. రాజ్యసభ స్థానం ఇచ్చినప్పటికీ కూడా అన్నామలై మెత్తబడకపోవచ్చు అని ఆయన మద్దతుదారులు అంటున్నారు.

ఐపీఎల్ ముగిసింది.. టీమిండియా పరిస్థితి ఏంటి..

IPL 2026 impact on Team India
IPL 2026 impact on Team India

IPL 2026 impact on Team India: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ఘనంగా ముగిసింది. బెంగళూరు జట్టు మరోసారి విజేతగా నిలిచింది. తద్వారా తన ఖాతాలో 2వ ట్రోఫీని జమ చేసుకుంది. ఐపీఎల్ నడుస్తున్నంత సేపు టీమిండియా అంతర్జాతీయ టోర్నీలు ఆడదు. ఐపీఎల్ ముగిసిన తర్వాత మళ్లీ టీమిండియా తన క్రికెట్ వేటను సాగిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా ప్రయాణం ఏంటి.. ఎటువంటి టోర్నీలు ఆడుతుంది.. ఏ ఏ దేశాలతో పోటీ పడుతుంది.. అనే అంశాలపై పూర్తిస్థాయి కథనం ఇది.

వచ్చే ఏడాది ఐపీఎల్ జరిగే వరకూ టీమిండియా దాదాపు పది టెస్టులు ఆడుతుంది. 20 వన్డే మ్యాచ్లు.. 23 t20 లు ఆడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో ఒక టెస్ట్, 3 వన్డేలు ఆడుతుంది. ఐర్లాండ్ జట్టుతో రెండు టీ20 లు, ఇంగ్లాండ్ జట్టుతో 5 t20 లు, 3 వన్డేలు, జింబాబ్వే జట్టుతో మూడు టి20 లు, శ్రీలంక జట్టుతో రెండు టెస్టులు, వెస్టిండీస్ జట్టుతో 3 వన్డేలు, 5 t20 మ్యాచ్ లు, న్యూజిలాండ్ జట్టుతో రెండు టెస్టులు, 3 వన్డేలు, 5 t20 మ్యాచ్ లు ఆడుతుంది, శ్రీలంక జట్టుతో 3 వన్డేలు, మూడు టి20 మ్యాచ్ లు ఆడుతుంది, జింబాబ్వే తో 3 వన్డే మ్యాచ్లు ఆడుతుంది. ఆస్ట్రేలియా జట్టుతో ఐదు టెస్టులు ఆడుతుంది. మధ్యలో ఆసియా గేమ్స్ కూడా ఉన్నాయి.

టీమిండియాకు టి20 లలో, వన్డేలలో పెద్దగా ఇబ్బంది లేదు. కేవలం టెస్టుల్లో మాత్రమే టీమిండియా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నది. స్వదేశం, విదేశాలలో జరిగిన టోర్నీలలో ఓడిపోయి పరువు తీసుకుంటున్నది. వైట్ బాల్ ఫార్మాట్లో టీమిండియా ఆధిపత్యం కొనసాగిస్తున్నప్పటికీ.. రెడ్ బాల్ లో మాత్రం తీవ్రంగా తడబడుతున్నది. ఇది ఒక రకంగా ఆ జట్టును తీవ్రంగా ఇబ్బందికి గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో జరిగే రెడ్ బాల్ సిరీస్ లలో టీమిండియా సత్తా చూపించాల్సిన అవసరం ఉంది. గతంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టుకు దారుణమైన పరాభవం ఎదురయింది. దానినుంచి కచ్చితంగా పాఠాలు నేర్చుకున్న టీమిండియా.. బదులు తీర్చుకోవాలి.

2027 లో వన్ డే ప్రపంచ కప్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. టీమిండియా దాదాపు సగం జట్ల మీద వన్డే సిరీస్ లు ఆడుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆ సిరీస్ లను తనకు అనుకూలంగా మార్చుకొని.. విజయాలు సాధించగలిగితే.. 2027 ప్రపంచ కప్ కు సానుకూలంగా తన ప్రయాణాన్ని సాగించేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే జట్టు పగ్గాలు గిల్ చేతిలోనే ఉన్నాయి కాబట్టి.. జట్టులో యువ రక్తం తొణికిసలాడుతుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

మద్యం తాగకపోయినా.. మత్తుతో ఉంటున్నాడు.. ఎందుకంటే..

Feeling drunk without alcohol causes
Feeling drunk without alcohol causes

Feeling drunk without alcohol causes: మద్యపానం చేయకపోయినా నిరంతరం మత్తులో తూలుతున్న ఒక వ్యక్తికి సంబంధించిన వార్త ఇప్పుడు వైద్య ప్రపంచంలో చర్చనీయాంశమైంది. సాధారణంగా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మనిషికి మత్తు కలుగుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. వైద్యులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, అతనికి అత్యంత అరుదైన ‘ఆటో-బ్రూవరీ సిండ్రోమ్’ (Auto-Brewery Syndrome) అనే వింత వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యాధితో అతడు మద్యం తీసుకోకపోయినా మత్తులో ఉంటున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితె..

అసలేం జరిగింది?
కెనడాకు చెందిన ఓ వ్యక్తి ఎటువంటి మద్యం సేవించకపోయినా నిత్యం కళ్లు తిరిగి పడిపోవడం, మత్తుగా అనిపించి స్పృహ కోల్పోవడం వంటి సమస్యలతో బాధపడేవాడు. దీనిని చూసిన చుట్టుపక్కల వారు, కొందరు పోలీసులు అతడిని చూసి మద్యం తాగి ఉన్నాడని భావించి పలుమార్లు ఇబ్బందులకు గురిచేశారు. నిరంతరం ఇలా జరుగుతుండటంతో అతను తీవ్ర వేదనకు లోనయ్యాడు. చివరకు వైద్య నిపుణుల దగ్గరకు వెళ్లినప్పుడు, అతని రక్త పరీక్షల్లో ఆల్కహాల్ స్థాయిలు మద్యం తాగిన వ్యక్తికి సమానంగా ఉండటాన్ని చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఆ తరువాత వైద్య పరీక్షలు చేయగాఅతడికి ఆటో-బ్రూవరీ సిండ్రోమ్ ఉన్నట్లు గుర్తించారు.

ఆటో-బ్రూవరీ సిండ్రోమ్ అంటే ఏమిటి?
ఈ వ్యాధిని ‘గట్ ఫెర్మెంటేషన్ సిండ్రోమ్’ అని కూడా పిలుస్తారు. సాధారణంగా మనం తీసుకునే ఆహారం జీర్ణక్రియ ప్రక్రియ ద్వారా శక్తిగా మారుతుంది. అయితే, ఈ సిండ్రోమ్ ఉన్నవారి జీర్ణవ్యవస్థలో అసాధారణమైన మార్పులు జరుగుతాయి. వీరి పేగుల్లో ఉండే ఈస్ట్ లేదా కొన్ని రకాల బ్యాక్టీరియా, మనం తీసుకునే కార్బోహైడ్రేట్లు, చక్కెరలను ఆల్కహాల్‌గా మార్చేస్తాయి. దీనివల్ల ఆ వ్యక్తి బయట ఎక్కడా మద్యం సేవించకపోయినా, అతని రక్తంలో ఆల్కహాల్ స్థాయిలు పెరుగుతాయి.

శరీరమే ఒక ‘బ్రూవరీ’లా..
ఈ వ్యాధి ప్రభావం వల్ల ఆ వ్యక్తి జీర్ణవ్యవస్థే ఒక మద్యం తయారీ కేంద్రంలా మారుతుంది. అందుకే దీనికి ‘ఆటో-బ్రూవరీ సిండ్రోమ్’ అని పేరు వచ్చింది. అతను బంగాళదుంపలు, బియ్యం లేదా చక్కెర ఉన్న పదార్థాలు తిన్న ప్రతిసారీ, ఆ ఆహారం కడుపులో పులిసి నేరుగా ఆల్కహాల్‌గా మారుతుంది. ఇది ఆ వ్యక్తి రక్తంలో కలిసి నేరుగా మెదడుపై ప్రభావం చూపుతుంది, తద్వారా అతను మత్తులో ఉన్నట్లు ప్రవర్తిస్తాడు.

చికిత్స మరియు నివారణా మార్గాలు:
ఈ అరుదైన వ్యాధికి శాశ్వత నివారణ కష్టమైనప్పటికీ, సరైన నియమాలతో అదుపులో ఉంచుకోవచ్చు. వైద్యులు ఆ వ్యక్తికి కార్బోహైడ్రేట్లు లేని లేదా చాలా తక్కువగా ఉండే డైట్‌ను సూచించారు. దీనితో పాటు, శరీరంలోని అదనపు ఈస్ట్ పెరుగుదలను అరికట్టేందుకు యాంటీ-ఫంగల్ మందులను అందిస్తున్నారు. ఈ చికిత్స ద్వారా అతని జీర్ణవ్యవస్థను సాధారణ స్థితికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అతను మెరుగైన ఆరోగ్యంతో ఉన్నాడని వైద్యులు వెల్లడించారు.

ఈ తరహా అరుదైన ఆరోగ్య సమస్యల పట్ల ప్రజలకు అవగాహన ఉండాలని, ఇలాంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే నిపుణులను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఐపిఎల్ 2027 లో కోలుకోలేని దెబ్బ.. ఆ టీంలకు భారీ నష్టం

IPL-2027
IPL-2027

IPL 2027: 2026 ఐపిఎల్ పూర్తయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్ గా అవతరించింది. 2027 ఐపీఎల్ నిర్వహించేందుకు ఇంకా సమయం ఉంది. దానికి ఇంతలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఊహించని షాక్ తగిలింది. ఈ మూడు జట్లలో కీలకమైన ప్లేయర్లు 2027 ఐపీఎల్ ఆడే విషయంలో సందిగ్ధం నెలకొంది.

2027 లో సాగే వన్డే వరల్డ్ కప్ సాధించాలని ఆస్ట్రేలియా జట్టు బలమైన నిర్ణయంతో ఉంది. 2023లో ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్ అందుకుంది. ఫైనల్ లో టీమిండియాను ఓడించింది. దీంతో 2027 లో కూడా అదే జోరు కొనసాగించాలని ఆస్ట్రేలియా జట్టు భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటినుంచే కసరత్తు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఆడే కీలకమైన బౌలర్ల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు.

హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ జట్లలో కీలకమైన ప్లేయర్లుగా ఉన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టార్క్, హేజిల్ వుడ్, కమిన్స్ ను 2027లో నిర్వహించే ఐపిఎల్ లో ఆడించకూడదని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వర్క్ లోడ్ పెంచకూడదని.. వీరు ముగ్గురు ప్రధాన బౌలర్లు కావడంతో.. ఒత్తిడి పెంచొద్దని ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దీనిని ఆస్ట్రేలియా క్రికెట్ మేనేజ్మెంట్ ఆ ముగ్గురు బౌలర్లకు చెప్పినట్టు తెలుస్తోంది.

రెవ్యాజ్ స్పోర్ట్స్ నివేదిక ప్రకారం 2027 వన్డే ప్రపంచ కప్ గెలవాలని క్రికెట్ ఆస్ట్రేలియా బలంగా కోరుకుంటున్నది. అందువల్లే జట్టును ఇప్పటినుంచే బలోపేతం చేసేందుకు కసరత్తులు చేస్తున్నది. ఈ నేపథ్యంలో కీలకమైన ముగ్గురు ఆ బౌలర్లకు విశ్రాంతితోపాటు.. ఐపీఎల్ లాంటి టోర్నీలలో ఆడకుండా.. కేవలం జాతీయ జట్టుకు మాత్రమే ఆడే విధంగా రూపకల్పన చేసింది. ఫలితంగా వారి మీద ఒత్తిడి తగ్గి.. 2027 వన్డే ప్రపంచ కప్ గెలిచేందుకు ఆస్కారం ఏర్పడుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తుంది. అయితే బోర్డు నిర్ణయాన్ని ఈ ముగ్గురు బౌలర్లు పాటిస్తారా.. లేదా అనేది చూడాల్సి ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

CBSE మూల్యాంకనంలో OSM వివాదం ఏంటీ.. అసలేం జరిగింది..

CBSE OSM evaluation issue
CBSE OSM evaluation issue

CBSE OSM evaluation issue: Central Board of Secondary Education మూల్యాంకన విధానంలో ఉపయోగిస్తున్న ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) వ్యవస్థపై వివాదం నెలకొంది. డిజిటల్ టెక్నాలజీ ద్వారా మూల్యాంకన ప్రక్రియను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నప్పటికీ, కొన్ని సాంకేతిక లోపాలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళనకు కారణమయ్యాయి.ఆన్‌లైన్ ద్వారా అప్‌లోడ్ చేసిన సమాధాన పత్రాలు స్పష్టంగా లేవని, చదవడానికి వీల్లేకుండా, మొబైల్ ఫోన్లతో తీసినట్లుగా మసకగా ఉన్నాయని విద్యార్థులు వాపోయారు. అసలు ఇది ఎలా జరిగింది?ఆన్ స్క్రీన్ మార్కింగ్ అంటే ఏమిటీ?

ఆన్-స్క్రీన్ మార్కింగ్ అనేది పూర్తిగా డిజిటల్ మూల్యాంకన విధానం. పరీక్షలు పూర్తయిన తర్వాత విద్యార్థుల జవాబు పత్రాలను హై-క్వాలిటీ స్కానర్లతో స్కాన్ చేసి PDF ఫార్మాట్‌లోకి మారుస్తారు. అనంతరం ఆ ఫైళ్లను సురక్షిత ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లో అప్‌లోడ్ చేస్తారు. మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులు కంప్యూటర్ స్క్రీన్‌పై ఆ జవాబు పత్రాలను పరిశీలించి మార్కులు కేటాయిస్తారు. దీనివల్ల జవాబు పత్రాల రవాణా, భద్రత, సమయ వ్యయం వంటి సమస్యలు తగ్గుతాయని CBSE భావించింది.

అయితే జవాబు పత్రాలను డిజిటల్ రూపంలోకి మార్చే ప్రక్రియలో కొన్ని లోపాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. స్కానింగ్ సమయంలో కొన్ని పేజీలు స్పష్టంగా కనిపించకపోవడం, కొన్ని పేజీలు పూర్తిగా బ్లర్ కావడం వంటి సమస్యలు వెలుగులోకి వచ్చాయి. దీంతో విద్యార్థులు రాసిన సమాధానాలు మూల్యాంకనకర్తలకు సరిగా కనిపించకపోయే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.

కొన్ని సందర్భాల్లో జవాబు పత్రాల్లోని కొన్ని పేజీలు స్కానింగ్ ప్రక్రియలో మిస్సయ్యాయని సమాచారం. అంటే విద్యార్థి రాసిన పూర్తి సమాధానం డిజిటల్ కాపీలో లేకపోవడం వల్ల మార్కులపై ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువ పేజీలు రాసిన విద్యార్థుల విషయంలో ఈ సమస్య తీవ్రంగా ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఒక విద్యార్థి జవాబు పత్రంలోని కొన్ని పేజీలు మరో విద్యార్థి జవాబు పత్రానికి జత కావడం… స్కానింగ్ లేదా డిజిటల్ ఫైల్ ప్రాసెసింగ్ సమయంలో జరిగిన ఈ సాంకేతిక పొరపాటు వల్ల మూల్యాంకనంలో గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల సరైన విద్యార్థికి సరైన మార్కులు రాకపోవచ్చనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలు బయటకు రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక విద్యార్థి భవిష్యత్తు పరీక్ష ఫలితాలపై ఆధారపడి ఉండే సమయంలో ఇలాంటి సాంకేతిక లోపాలు అన్యాయానికి దారితీయవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా బోర్డు పరీక్షల్లో ప్రతి మార్కు కీలకమైనందున మూల్యాంకన ప్రక్రియపై మరింత పర్యవేక్షణ అవసరమని డిమాండ్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ అంతరంగిక సమావేశానికి అడ్డంకులా?

Pawan Kalyan

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తెలంగాణలో జనసేన నవ నిర్మాణ సమావేశం చేసుకోవడానికి సిద్దమయ్యారు. కానీ నిన్న రాత్రి అనుమతి ఇవ్వలేదు. ఇది బహిరంగ సభ. ఆంతరంగిక సమావేశం. వాళ్ల పార్టీ కార్యకర్తలతో జరుపుకునే సమావేశం. ఆయన సెలబ్రెటీ కావడంతో ట్రాఫిక్ కంట్రోల్ చేయలేమని పోలీసులు అనుమతి నిరాకరించారు.

పబ్లిక్ మీటింగ్ ఇది కాదు. కేవలం నేతలు, కార్యకర్తలతో క్లోజ్ డోర్ మీటింగ్. జనసేన నేతలకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఇది ఎమర్జెన్సీ అని చెప్పొచ్చు. తెలంగాణలో భారత రాజ్యాంగం కాకుండా ప్రత్యేక రాజ్యాంగం నడుస్తోందా..? ఇప్పుడు వస్తున్న మార్పులు ఏంటంటే.. హైకోర్టులో అత్యవసర పిటీషన్ మూవ్ చేస్తే రిజిస్ట్రార్ దగ్గరే నిరాకరించారు. హైకోర్టు జడ్జీల బెంచ్ వద్దకు వెళ్లలేదు.

ఇవన్నీ చూస్తుంటే.. అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో తెలంగాణలో జరుగుతుందో తెలుస్తోంది. జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం దీన్ని అడ్డుకుంది. రాజ్యాంగం ఇచ్చిన హక్కును దుర్వినియోగం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ’ ఉన్మాదిగా మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ అంతరంగిక సమావేశానికి అడ్డంకులా? దీనిపై ’రామ్‘ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

జపనీస్ వాకింగ్.. ఇలా చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా

Japanese walking method benefits
Japanese walking method benefits

Japanese walking method benefits: మనలో చాలామందికి ఉదయం పూట వాకింగ్ చేసే అలవాటు ఉంటుంది. సిటీలో ఉన్నవాళ్లు గ్రౌండ్లలో.. మారుమూల గ్రామాలలో ఉన్నవారు పంట పొలాలు లేదా.. ఇతర ప్రాంతాలలో వాకింగ్ చేస్తూ ఉంటారు. వాకింగ్ చేయడం వల్ల శారీరక సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. అంతేకాదు చెమట రూపంలో చెడు పదార్థాలు బయటికి వెళ్లిపోతుంటాయి. శరీరం స్లిమ్ అవుతూ ఉంటుంది. పైగా నడక వల్ల వృద్ధాప్య ఛాయలు రావు. శరీరంలో ఉన్న అనవసరమైన కొవ్వులు కూడా కరిగిపోతాయి. అవయవాల పనితీరు మెరుగవుతుంది.

వాకింగ్ చేసేటప్పుడు చాలామంది ఒక రకమైన విధానాన్ని పాటిస్తూ ఉంటారు. అయితే వాకింగ్ లు కూడా రకరకాల పద్ధతులు అమల్లోకి వచ్చాయి. అయితే ఇప్పటి కాలంలో జపనీస్ వాకింగ్ స్టైల్ ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. జపాన్ ప్రజలు పొదుపు.. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటారు.

జపాన్ ప్రజలు ప్రతిరోజు పదివేల అడుగుల వరకు నడుస్తూ ఉంటారు. దీనివల్ల శారీరక శ్రమ ఏర్పడుతూ ఉంటుంది. ఇది అత్యంత సులువైన శారీరక శ్రమకు బెంచ్ మార్క్ గా ఉంటుంది.. ఫిట్నెస్ ట్రాకర్స్ .. స్మార్ట్ ఫోన్ల సహాయంతో జపాన్ ప్రజలు ప్రతిరోజు 10,000 అడుగులు నడుస్తుంటారు.

ఇలా వాకింగ్ చేయడం వల్ల డిమెన్షియా నుంచి శరీరానికి రక్షణ కలుగుతుందని జపాన్ ప్రజలు నమ్ముతుంటారు. అయితే ఆరోగ్యంగా ఉన్న వారికి పదివేల అడుగుల దూరం నడవడం పెద్ద కష్టం కాకపోవచ్చు కానీ.. మోకాళ్ల నొప్పులు.. కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఇబ్బంది తప్పకపోవచ్చు.. నడక వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయని జపాన్ ప్రజలు నమ్ముతుంటారు.. కొద్దిసేపు వేగంగా నడిచి.. ఆ తర్వాత నెమ్మదిగా నడవడం వల్ల శ్వాస మెరుగ్గా ఉంటుంది. అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తప్రసరణ వ్యవస్థని కూడా సక్రమంగా చేస్తోంది. జపాన్ ప్రజలు టెక్నాలజీని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నెమ్మదిగా నడుస్తుంటారు. ఆఫీస్ కు వెళ్తున్నప్పుడు వేగంగా అడుగులు వేస్తుంటారు.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకున్న తర్వాత కూడా జపాన్ ప్రజలు నడుస్తుంటారు. దీనివల్ల శరీరంలో జీర్ణక్రియ మెరుగవుతుందని.. సరైన స్థాయిలో పోషకాలు అన్ని శరీర అవయవాలకు లభిస్తాయని జపాన్ ప్రజలు నమ్ముతుంటారు. జపాన్ ప్రజలు ఉదయం పూట 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తుంటారు. ఒకవేళ ఆరోగ్యం మెరుగ్గా ఉన్నవారు అంతకంటే ఎక్కువగానే చేస్తుంటారు. ఇందులో మొదటి మూడు నిమిషాలు వేగంగా నడుస్తుంటారు. ఆ తర్వాత మూడు నిమిషాలు నెమ్మదిగా నడుస్తుంటారు. ఇలా ఐదుసార్లు వేగంగా.. ఐదుసార్లు నెమ్మదిగా నడిచి.. ఆరోగ్యానికి కాపాడుకుంటారు. అయితే ఇలా నడిచే మందు జపాన్ ప్రజలు వార్మప్ చేస్తుంటారు.

ఈ విధానం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని హార్వర్డ్ వైద్య నిపుణులు తమ పరిశోధన ద్వారా బయటపెట్టారు. రక్త ప్రసరణ వేగం దీనిద్వారా సమర్థవంతంగా జరుగుతుందని.. గుండెపోటు వచ్చే అవకాశం ఉండదని.. రోగ నిరోధక శక్తి పెరుగుతుందని.. రాత్రి సమయంలో నిద్ర మెరుగ్గా పడుతుందని హార్వర్డ్ వైద్యులు చెబుతున్నారు.