Home Blog Page 195

బుద్ధిమంతుడని ఉద్యోగమిస్తే..ల్యాప్ టాప్ ఎత్తుకుపోయాడు

Employee laptop theft incident
Employee laptop theft incident

Employee laptop theft incident: పాపమని పాతబట్టలు ఇస్తే గోడచాటుకు పోయి కోలుచుకున్నాడట వెనుకటికి ఒకడు. ఇతడి యవ్వారం పై సామెత మాదిరిగానే ఉంది. ఉద్యోగాలున్నాయి.. అర్హతలున్న వారు దరఖాస్తు చేసుకోండి. మెరుగైన జీతం,ఇతర ప్రయోజనాలు కల్పిస్తామని ఉబర్ కంపెనీ ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటన ఇవ్వడమే ఆ కంపెనీ పాలిటి శాపమైంది.

ఉబర్ కంపెనీ మనదేశంలో కొంతకాలంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ఆన్ లైన్ లో ఫుడ్, ట్రావెలింగ్ వంటి విభాగాలలో సేవలు అందిస్తోంది. ఈ కంపెనీ ఇటీవల ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటన ఇవ్వడమే ఆ కంపెనీ పాలిట పాపమైంది. కంపెనీ ఇంటర్వ్యూకు ఓ యువకుడు హాజరయ్యాడు. అన్ని రౌండ్లను క్లియర్ చేశాడు. అంతే కాదు, వెళ్తూవెళ్తూ కంపెనీ కొత్త మ్యాక్ బుక్ ను చోరీ చేశాడు. హైదరాబాద్ నగరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఉబర్ కంపెనీలో ఈ సంఘటన చోటు చేసుకోవడం సంచలనం కలిగిస్తోంది. దీనిపై రిక్రూటర్ చేసిన వ్యక్తి లింక్డ్ ఇన్ లో ఓ పోస్ట్ చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది. ‘ఫోన్ స్విచ్చాప్,లింక్ డ్ ఇన్ ప్రొఫైల్ కనిపించడం లేదు. ల్యాప్ టాప్ పంపించిన చిరునామాలో వెతికితే అక్కడ అతడు లేడు. పైగా అతడు ఆ రూమ్ ను ఖాళీ చేశాడు. ల్యాప్ టాప్ ను అతడు ఫ్యాక్టరీ రీసెట్ చేశాడు. ఇదంతా ఒక ప్రణాళిక మాదిరిగా కనిపిస్తోందని’ ఆ వ్యక్తి పేర్కొన్నాడు.

ఇటీవల కాలంలో కంపెనీలు ఉద్యోగార్థులు ఎటువంటి మోసాలు చేయకుండా ఉండేందుకు ఇంటర్వ్యూల సమయంలో ల్యాప్ టాప్ లను నేరుగా వారి దగ్గరికి పంపిస్తున్నాయి. ఈ సమయంలో కొంతమంది ల్యాప్ టాప్ లను చోరీ చేస్తున్నారు. తాజాగా ఉబర్ కంపెనీకి ఈ పరిణామం ఎదురుకావడం ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది. ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు కంపెనీలు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తుల వల్ల అంతర్జాతీయంగా హైదరాబాద్ నగరం పరువుపోతుందని వారు కామెంట్లు చేస్తున్నారు. ఇంటర్వ్యూ ల సమయంలో అభ్యర్థుల ప్రవర్తన, వ్యవహార శైలి మీద ఫోకస్ పెట్టాలని వారు సూచిస్తున్నారు.

ప్రభాస్ తో ఫ్రెండ్షిప్ చేస్తే మామూలుగా ఉండదంటున్న స్టార్ హీరో..

Prabhas
Prabhas

Prabhas friendship with star heroes: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చో బెట్టాయి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేయడమే కాకుండా బాలీవుడ్ హీరోలకు సైతంకి పోటీని ఇచ్చాడు. ప్రస్తుతం పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక బాహుబలి నుంచి ఇప్పటి వరకు ప్రభాస్ క్రేజ్ ను టచ్ చేయడం బాలీవుడ్ హీరోల వల్ల కావడం లేదు. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. అందుకే ఆయన చాలావరకు సక్సెస్ లను సాధిస్తున్నాడు… ప్రభాస్ తో ఫ్రెండ్షిప్ చేయడం చాలా కష్టమని చాలా మంది చెబుతూ ఉంటారు. కారణం ఏంటి అంటే ప్రభాస్ హీరో గానే కాకుండా ఒక మంచి ఫ్రెండ్ గా కూడా కొనసాగుతున్నాడు. ప్రతి ఒక్కరికి ఏ ప్రాబ్లం ఉన్నా అతనే దగ్గరుండి సాల్వ్ చేస్తూ ఉంటాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఫ్రెండ్స్ అందరికి విపరీతంగా భోజనం పెట్టించేస్తుంటాడట. తన ఇంట్లోనే డిఫరెంట్ కర్రీస్ ను చేయించి ఫ్రెండ్స్ కి దగ్గరుండి మరి తనే వడ్డిస్తూ వాళ్ళందరికీ ఫుల్లుగా తినిపిస్తుంటాడట. దీనివల్ల కొన్ని సందర్భాల్లో తమ ఫ్రెండ్స్ కి చాలా ఇబ్బంది అవుతుందని అయినప్పటికి ప్రభాస్ వదలకుండా గట్టిగా తినాలని చెబుతూ ఉంటాడట.

ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ తో ఫ్రెండ్షిప్ చేయడం అన్ని విధాలుగా ప్లస్ అయినప్పటికి భోజనం విషయంలో మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని స్టార్ హీరో గోపీచంద్ సైతం పలు సందర్భాల్లో తెలియజేశారు. నిజానికి ప్రభాస్ గోపీచంద్ మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉందనే విషయం మనందరికి తెలిసిందే. వీరిద్దరు వర్షం సినిమాలో కలిసి నటించారు. ఇక అప్పటినుంచి వీళ్ల మధ్య విపరీతమైన బాండింగ్ ఏర్పడింది.

ఒకరకంగా చెప్పాలంటే యూవీ క్రియేషన్స్ లో గోపీచంద్ ను హీరోగా పెట్టి చాలా సినిమాలను నిర్మించడానికి కారణం ప్రభాస్ అనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఇలానే కలకాలం కొనసాగాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు…

'ఇరుముడి' గ్లింప్స్ లో కొత్త రవితేజ కనిపించాడా..? స్టోరీ ఇదేనా..?

Irumudi Movie
Irumudi Movie

Ravi Teja Irumudi movie story: కెరీర్ మొదటి నుంచి కమర్షియల్ సినిమాలను చేస్తూ వచ్చిన రవితేజ…వాటితోనే భారీ విజయాలను అందుకున్నారు. కానీ ఇప్పుడు లైఫ్ లో ఫస్ట్ టైం డిఫరెంట్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు. నిజానికి శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ హీరోగా చేస్తున్న ‘ఇరుముడి’ సినిమా ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా నుంచి గత కొద్దిసేపటి క్రితమే ఒక గ్లింప్స్ రిలీజ్ అయింది. రవితేజ తన కూతురితో ఆడుకుంటున్న కొన్ని షాట్స్ వేశారు. అలాగే తన కూతురు తను ఇద్దరు కూడా అయ్యప్ప మాల ధరించినట్టుగా చూపించారు. మొత్తానికైతే తన కూతురికి ఏదో ఇబ్బంది జరుగుతుంది. దాని వెనక ఎవరున్నారు అనేది తెలుసుకొని వాళ్ళని ఒక్కొక్కరిని ఏరుపారేస్తూ ఉండడమే ఈ సినిమా కథగా తెలుస్తుంది.

ఈ సినిమా విషయంలో రవితేజ చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. శివ నిర్వాణ సైతం ఇంతకు ముందు చేసిన ఖుషి సినిమాతో భారీ ఫ్లాప్ ను మూటగట్టుకున్నాడు.

దాంతో ఇప్పుడు ఎలాగైనా సరే తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాతో అటు రవితేజ, ఇటు శివ నిర్వాణ ఇద్దరికి సక్సెస్ దక్కుతుందని చాలా మంచి కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు రిలీజ్ అయిన గ్లింప్స్ ను కనుక చూసినట్లయితే మాత్రం గ్లింప్స్ చాలా అద్భుతంగా ఉందని ప్రేక్షకులందరి చేత ప్రశంసలైతే దక్కుతున్నాయి…

గ్లింప్స్ అంటే రొటీన్ రెగ్యులర్ గా ఇవ్వకుండా డిఫరెంట్ గా సినిమా లోని కంటెంట్ ను చెప్పకనే చెప్పినట్టుగా రిలీజ్ చేశారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో అటు దర్శకుడు, ఇటు హీరో ఇద్దరు కూడా ఒకేసారి హిట్ ట్రాక్ ఎక్కబోతున్నారనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది… చూడాలి మరి వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది…

ఎన్టీఆర్ మొహమాటానికి పోయి చేసిన రెండు సినిమాలు ఇవే...కోలుకోలేని దెబ్బ కొట్టాయిగా...

NTR
NTR

NTR career mistakes: సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ వస్తే చాలు హీరోలు టాప్ పొజిషన్ కి వెళ్తారు. అదే ఒక ఫ్లాప్ సినిమా పడితే మాత్రం పాతాళానికి పడిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే మొహమాటానికి పోయి సినిమాలను చేసి ప్లాప్ లను మూట గట్టుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అయితే మొహమాటానికి పోయి రెండు సినిమాలతో భారీ ప్లాప్ లను మూట గట్టుకున్నారు. సింహాద్రి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఎన్టీఆర్ ఆ తర్వాత చేసిన సినిమాతో ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ఇక దానికి తోడుగా ఆయన బి.గోపాల్ దర్శకత్వంలో చేసిన నరసింహుడు సినిమా ఘోరంగా విఫలమైంది. ఆ ప్రొడ్యూసర్ ట్యాంక్ బండ్ లో దూకి మరి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యాడు అంటే ఆ సినిమా ప్రొడ్యూసర్స్ కి ఎంత భారీ నష్టాలను మిగిల్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ సినిమా తర్వాత ఆయన ముళ్ళపూడి వర దర్శకత్వంలో చేసిన ‘నా అల్లుడు’ సినిమా కూడా డిజాస్టర్ అయింది. విజయేంద్ర ప్రసాద్ కథ అందించినప్పటికి ఈ సినిమా అనుకున్న మేరకు సక్సెస్ ని సాధించలేదు.

రాజమౌళి ఉన్నాడనే ఒక దృక్పథంతో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా చేశాడు. ఇక ముళ్ళపూడి వర ఈ సినిమా ని అనుకున్న రేంజ్ లో తీయకపోవడంతో సినిమా డిజాస్టర్ అయింది. మొత్తానికైతే మొహమాటానికి పోయి ఆయన చేసిన ఈ రెండు సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి.

ఈ రెండు మూవీస్ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ ను భారీగా డౌన్ చేశాయి.
అలాగే తన మార్కెట్ ను కూడా చాలా వరకు కోల్పోయేలా చేశాయి. ఇక ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు మొహమాటానికి పోవడం తగ్గించుకుంటే మంచిదని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్లకు చెబుతుంటారు.

సినిమా కథను బట్టి దర్శకుడిని బట్టి ముందుకెళ్లాలి తప్ప ఏదో మొహమాటానికి వెళ్ళి సినిమాలు తీస్తే ఇప్పటి వరకు వాళ్ళు క్రియేట్ చేసుకున్న మార్కెట్ కోల్పోయి భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు… ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…

రెండో పెళ్లాం.. ది క్యాన్సర్ హబ్.. మీకో దండం రా అయ్యా

Rendo Pellam
Rendo Pellam

Rendo Pellam: మనుషులకు మాత్రమే కాదు, వ్యాపార సంస్థలకు కూడా పేర్లు ఉంటాయి. పేర్ల ఆధారంగానే ఆయా వ్యాపార సంస్థలు ప్రజల్లో ఒక బ్రాండ్ విలువను సొంతం చేసుకుంటాయి. ఒకప్పుడు వ్యాపార సంస్థలకు పేర్లను పెట్టే విషయంలో ఇప్పుడున్న స్థాయిలో వినూత్న విధానాన్ని అవలంబించేవారు కాదు. రానురాను జనాల మైండ్ సెట్ మారిన నేపథ్యంలో వ్యాపార సంస్థల పేర్లు కూడా విచిత్రంగా ఉంటున్నాయి.

నేటికాలంలో యువత వినూత్నమైన పేర్లు ఉన్న వ్యాపారసంస్థలలోనే కొనుగోళ్లు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా రెస్టారెంట్ల విషయంలో మాత్రం తమకు నచ్చిన పేరు ఉన్న వాటిల్లోనే దండిగా తినేస్తున్నారు. దీంతో క్యాచీ పేర్లు పెట్టేందుకు వ్యాపార సంస్థల నిర్వాహకులు ఆసక్తి చూపిస్తున్నారు. విశాఖపట్టణంలో ఇద్దరు వ్యక్తులు వ్యాపారసంస్థలను ఏర్పాటు చేశారు. వాటికి అత్యంత వినూత్నమైన పేర్లను పెట్టారు. దీంతో అవి సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తున్నాయి.

విశాఖపట్టణంలోని మర్రిపాలెంలో రెండో పెళ్లాం అనే పేరుతో రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మీమ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తున్నాయి. మరో వైపు ఓ పాన్ షాప్ యజమాని విచిత్రంగా తన దగ్గర లభ్యమయ్యే పదార్థాలు తింటే క్యాన్సర్ వస్తుందని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా తన షాపునకు ది క్యాన్సర్ హబ్ అనే పేరు పెట్టాడు.

రెండో పెళ్లాం.. ది క్యాన్సర్ హబ్ అనే పేర్లు నెట్టింట చర్చకు దారి తీస్తున్నాయి. మీ వ్యాపారం జోరుగా సాగేందుకు ఇలాంటి పేర్లు పెట్టుకున్నారు. మీరు మాములోళ్లు కాదు.. మీ వ్యాపారం మరింత గొప్పగా సాగాలి.. మీరు గొప్పగా వెలుగొందాలని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

పిల్లలను బడికి పిలిచే ఓ సిక్కోలు పాట.. కదిలిస్తోంది.. రప్పిస్తోంది..

Srikakulam Viral Song
Srikakulam Viral Song

Srikakulam Viral Song: వేసవి సెలవులు ముగుస్తున్నాయి. ఈనెల 12న విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. పిల్లలకు అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేసే పనిలో ఉన్నారు. సెలవుల్లో బంధువుల ఇంటికి, విహారయాత్రలకు వెళ్లిన వారు ఇంటి ముఖం పడుతున్నారు. ఈ తరుణంలో సోషల్ మీడియాలో ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలను చూపుతూ సాగిన ఈ వీడియో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

భీమ్లా నాయక్ పాటతో..
పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సూపర్ డూపర్ హిట్ అయింది. అందులో టైటిల్ సాంగ్ ను జతచేస్తూ.. పాఠశాలలు సిద్ధంగా ఉన్నాయని.. పిల్లలు రావాలని సూచిస్తూ సాగిన పాట.. తెర వెనుక ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలను చూపుతూ సాగిన ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంటుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఔత్సాహిక యువకులు ఈ పాటను రూపొందించి.. సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఇనిస్టా తో పాటు రీల్స్ లో ఈ పాట దుమ్ము దులుపుతోంది. విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ముగుస్తున్న సెలవులు..
వేసవి సెలవులు ముగుస్తున్నాయి. విద్యార్థులకు అవసరమైన పుస్తకాల సేకరణలో తల్లిదండ్రులు నిమగ్నమయ్యారు. బ్యాగులు, షూస్, యూనిఫారం వంటివి సేకరిస్తున్నారు. ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. సాధారణంగా వేసవి సెలవులు అంటేనే విహారయాత్రలకు, బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. అయితే ఇప్పుడు పాఠశాలలు తెరిచే సమయం సమీపిస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒక రకమైన ఆందోళన. ఫీజులతోపాటు ఇతర ఖర్చులు అధికంగా ఉంటాయి ఈ నెలలో. పెరిగిన ఖర్చులను ఊహించుకుని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. మరోవైపు విద్యార్థులు సైతం తమకు ఇష్టమైన సెలవులు ముగిస్తుండడంతో వారి ముఖంలో కూడా కాస్త బాధ కనిపిస్తోంది. కానీ పాఠశాలలకు పిల్లలను స్వాగతిస్తూ భీమ్లా నాయక్ తరహాలో వైరల్ అవుతున్న ఆ పాట మాత్రం ఆకట్టుకుంటోంది.

 

View this post on Instagram

 

A post shared by Hari Rocky (@hari_hockey_13_travelr)

మా రాజకీయాల్లో వేలు పెడితే చూస్తూ ఊరుకోము అంటూ పవన్ కళ్యాణ్ కి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్..

KTR CM Candidate
KTR CM Candidate

KTR strong warning to Pawan Kalyan: గత కొద్దిరోజులుగా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి , జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ జరుగుతున్న రాజకీయాలను మనమంతా చూస్తూనే ఉన్నాం. అనవసరంగా ఆయన్ని గెలుకుతూ , మేధావుల ముసుగులో కొంతమంది విశ్లేషకులు పుట్టించిన పుకార్ల నుండి ఈ వివాదం మొదలైంది. తర్వాత ఆ ప్రముఖ మేధావి విశ్లేషకుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు అధికారిక ప్రకటన చేసి క్షమాపణలు చెప్పడం , అక్కడితో ఆగకుండా సీనియర్ జర్నలిస్టులు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ మీద ముప్పేట దాడి చేస్తూ ప్రెస్ మీట్ ని నిర్వహించడం , ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితుల మధ్య పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా , నవ తెలంగాణ నిర్మాణ సభ ని ఏర్పాటు చేయడం , అందుకు ప్రభుత్వం అనుమతించకపోవడం వంటివి పొలిటికల్ హీట్ ని తారా స్థాయికి తీసుకెళ్లేలా చేశాయి.

ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా కూడా , పవన్ కళ్యాణ్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి , తెలంగాణ లో తనని అడుగుపెట్టనివ్వం అంటూ ప్రగల్భణాలు పలికిన కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీల నాయకులపై తీవ్రమైన విమర్శలు చేయడం వంటివి తెలంగాణ రాజకీయాల్లో సంచలనం గా మారింది. అయితే పవన్ కళ్యాణ్ పై కాసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో పెను దుమారం రేపుతోంది. ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణ మీరు అయ్యా జాగీరా ? అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మీరు ఒక్క విషయాన్నీ మాత్రం గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ కచ్చితంగా భూమిపుత్రుల జాగీరు. ఈ నేల కోసం కష్టపడినా వారు , ఈ నేల కోసం త్యాగం చేసిన వాళ్ళ నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికీ తెలంగాణ , 4 కోట్ల భూమి పుత్రుల జాగీరు’ అంటూ చెప్పుకొచ్చాడు కేటీఆర్.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘మీరు ఇక్కడే ఉన్నారు , మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, వ్యాపారాలు చేసుకుంటున్నారు , అలాగే ఉండండి , ఎవరికీ ఇబ్బంది లేదు , 10 , 12 ఏళ్ళ నుండి చిన్న సమస్య అయినా వచ్చిందా?, మేము ఎలాంటి వాళ్ళమంటే , వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రవేటీకరిస్తున్నారు అంటే , వాళ్ళ తరుపున మేము పార్లమెంట్ లో పోరాడాము బీజేపీ తో’ అంటూ ఆయన గుర్తు చేసాడు. పవన్ కళ్యాణ్ తెలంగాణ లో పోటీ చేస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదని, 2023 లో ఆయన పోటీ కూడా చేసారని, కానీ ఇక్కడి రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు అలోచించి మాట్లాడండి అని , మిమ్మల్ని ఎవరూ అడ్డుకోవట్లేదని, మీరే ఊహాజనితమైన ప్రభంజనాలు సృష్టించుకుంటున్నారు అంటూ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డాడు . పవన్ కళ్యాణ్ నుండి ఓజీ అనే సినిమా వచ్చిందని , మాకు తెలంగాణ లో ఇప్పటికే కేసీఆర్ అనే ఓజీ ఉన్నాడని , మరో ఓజీ అవసరం లేదని, మా రాజకీయాల్లో వేలుపెడితే చూస్తూ ఊరుకోము అంటూ కేటీఆర్ హెచ్చరించాడు.

‘కట్‌ మనీ’ తిరిగిచ్చేస్తున్నారు. ప్రజల తిరుగుబాటుతో ఉ*చ్చ పోసుకుంటున్న టీఎంసీ నేతలు!

TMC cut money controversy
TMC cut money controversy

TMC cut money controversy: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీని అక్కడి ప్రజలు చిత్తుగా ఓడించారు. దీంతో 15 ఏళ్ల తృణమూల్‌ పాలన ముగిసింది. వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ నాయకులు 15 ఏళ్లు సాగించిన అరాచకాలతో ప్రజలు విసిగిపోయారు. ఇటీవల ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. ప్రస్తుతం సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో ప్రజలు గతంలో సాగించిన అరాచకాలను గుర్తుచేసుకుంటూ టీఎంసీ నేతలపై తిరగబడుతున్నారు. ఇటీవల మమత బెనర్జీ మేనల్లుడిపై దాడిచేశారు. ఈ నేపథ్యంలో బెంగాల్‌ రాజకీయాలు మళ్లీ ఒక వికృతమైన సత్యాన్ని బయటపెడుతున్నాయి. గతంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి ‘కట్‌ మనీ’ పేరుతో లక్షలు, కోట్లు కొల్లగొట్టిన తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు ఆ డబ్బును ప్రజలకు తిరిగి ఇస్తున్న దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి.

బెంగాల్‌లో కట్‌ మనీ వ్యవస్థ..
2021 నుంచి ముఖ్యంగా కూచ్‌ బెహర్‌ జిల్లాలో టీఎంసీ నేతలు ప్రభుత్వ పథకాల డబ్బు వచ్చినప్పుడు ప్రతీ లబ్ధిదారుడి నుంచి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు కట్‌ చేసి వసూలు చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇది ఒక్క జిల్లాకు పరిమితం కాదు. రాష్ట్రవ్యాప్తంగా ఈ అవినీతి సంస్కృతి లోతుగా వ్యాపించింది. ఇప్పుడు అదే నేతలు గ్రామాల్లోకి వెళ్లి, డబ్బు తిరిగి ఇస్తూ, క్షమాపణ చెప్పుతున్నారు. అయితే ఇది నిజమైన పశ్చాత్తాపం కాదు..అధికారం కోల్పోయిన భయం నుంచి పుట్టిన భయం.

అధికారంలో ఉన్నంత కాలం అరాచకం..
అధికారంలో ఉన్నప్పుడు టీఎంసీ నేతలు ప్రజల డబ్బును సులభంగా కొల్లగొట్టారు. అధికారం పోవడం, ప్రజలు తిరుగుబాటు చేయడం, టీఎంసీ ఎమ్మెల్యేలు కూడా సైలెంట్‌ కావడంతో నేతలు డబ్బు తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి రాజకీయ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో ఈ ఘటనలు స్పష్టంగా చెబుతున్నాయి.

బెంగాల్‌లో ఇప్పుడు జరుగుతున్న ఈ ‘‘కట్‌ మనీ రిటర్న్‌’’ డ్రామా ఒక విషయం స్పష్టం చేస్తోంది. అధికారం లేని చోట మాత్రమే ప్రజలకు న్యాయం జరుగుతుందన్న భయానకమైన సందేశం ప్రజల మనసుల్లోకి వెళ్తోంది. నిజమైన ప్రజాస్వామ్యం అధికారం ఉన్నా, లేకపోయినా న్యాయం జరిగే వ్యవస్థను కోరుకుంటుంది. కానీ బెంగాల్‌లో ప్రస్తుతం జరుగుతున్నది దానికి భిన్నం. ఈ ఘటనలు తృణమూల్‌కు మాత్రమే కాదు, మొత్తం రాజకీయ వ్యవస్థకు ఒక హెచ్చరిక.

ఇరాన్‌ ప్రతీకార దాడులు.. మధ్యప్రాచ్యం మళ్లీ భీకర యుద్ధం!

Iran retaliatory attacks latest news
Iran retaliatory attacks latest news

Iran retaliatory attacks latest news: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం రాజుకుంటోంది. ఒకవైపు అమెరికా–ఇరాన్‌ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఇంకోవైపు అమెరికా ఆత్మరక్షణ పేరుతో ఇరాన్‌లోని హార్ముజ్, క్వెష్మ్‌ ప్రాంతాలపై విరుచుకుపడుతోంది. ఒకవైపు శాంతి చర్చలు అంటూనే దాడులు ప్రారంభించిన అమెరికాపై ఇరాన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో మరోసారి తీవ్రమైన ప్రతీకార చర్యలకు దిగింది. కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై మిస్సైళ్లు, డ్రోన్ల దాడులు చేసినట్లు ఇరాన్‌ ప్రకటించింది. హార్ముజ్‌ ప్రాంతం, క్వెష్మ్‌ దీవి పై అమెరికా చేసిన దాడులకు ఇది సమాధానమని ఇరాన్‌ ప్రకటించింది. ఈ పరిణామం ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న మధ్యప్రాచ్య ప్రాంతాన్ని మరింత అగ్నిగుండంగా మార్చే అవకాశం ఉంది.

ప్రతీకార యుద్ధం షురూ..
ఇరాన్‌ తన దాడులను స్పష్టంగా ‘‘ప్రతీకారం’’గా ప్రకటించడం గమనార్హం. హార్ముజ్‌ జలసంధి సమీపంలోని క్వెష్మ్‌ దీవిపై అమెరికా చేసిన దాడులు ఇరాన్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. ఈ దీవి ఇరాన్‌ సైనిక వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. ఇరాన్‌ ఇప్పుడు గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా తన సామర్థ్యాన్ని ప్రదర్శించింది. అయితే ఈ దాడులు ఎంతవరకు సఫలమయ్యాయి అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఇరాన్‌ తన ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ సమర్థవంతంగా పని చేస్తున్నాయని చెప్పినప్పటికీ, కువైట్, బహ్రెయిన్‌ దేశాలు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశాయి.

హార్ముజ్‌పై ప్రభావం..
హార్ముజ్‌ జలసంధి ప్రపంచ ఆయిల్‌ సరఫరాలో కీలకమైనది. ప్రపంచంలోని 20 శాతం ఆయిల్‌ ఈ జలసంధి గుండా ప్రయాణిస్తుంది. ఇరాన్‌ ఈ ప్రాంతంపై ఎక్కువ నియంత్రణ కోరుకుంటుంది, అమెరికా, దాని మిత్రదేశాలు దాన్ని స్వేచ్ఛగా ఉంచాలని కోరుకుంటాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న దాడులు కేవలం సైనిక చర్యలు మాత్రమే కాదు, ఆర్థిక యుద్ధంగా కూడా మారుతున్నాయి. ఈ ఘర్షణలు ఇప్పటికే గ్లోబల్‌ ఆయిల్‌ మార్కెట్లను కదిలించాయి. ఆయిల్‌ ధరలు పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా భారత్‌ వంటి ఆయిల్‌ దిగుమతి ఆధారిత దేశాలు ఇందుకు ఎక్కువగా గురవుతాయి.

ప్రాంతీయ స్థిరత్వం ఎటువైపు..
ఇరాన్‌–అమెరికా మధ్య ఈ తాజా ఘర్షణ గల్ఫ్‌ దేశాలను కూడా నేరుగా బలిపీఠం చేస్తోంది. కువైట్, బహ్రెయిన్‌ వంటి దేశాలు తమ భూభాగంపై జరుగుతున్న దాడుల వల్ల అనవసరమైన ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఇది ఇప్పటికే సున్నితంగా ఉన్న గల్ఫ్‌ రాజకీయ సమీకరణాలను మరింత క్లిష్టంగా చేస్తోంది. ఇరాన్‌ తన సైనిక బలాన్ని ప్రదర్శించడం ద్వారా ప్రాంతంలో తన ప్రభావాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. మరోవైపు అమెరికా తన మిత్రదేశాల భద్రతను కాపాడుతూ, ఇరాన్‌ను కట్టడి చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ పరస్పర చర్యలు పెద్ద యుద్ధంగా మారే ప్రమాదం ఉంది.

తాజా దాడులు ఇరాన్‌–అమెరికా మధ్య ఉన్న ఏవైనా డిప్లమసీ ప్రయత్నాలను మరింత క్లిష్టతరం చేస్తాయి. రెండు వైపులా ఉన్న హెచ్చరికలు, ప్రతీకార వాగ్దానాలు యుద్ధం మరింత విస్తరించే అవకాశాలను పెంచుతున్నాయి. మధ్యప్రాచ్యం ఇప్పటికే చాలా సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో రెండు పక్షాలు కూడా సంయమనం పాటించి, డిప్లమసీ మార్గాన్ని ఎంచుకోవడం అవసరం ఉంది. ఉద్రిక్తతలు త్వరగా తగ్గకపోతే, ధరల పెరుగుదల రూపంలో ప్రపంచం మొత్తం దాని ధర చెల్లించాల్సి వస్తుంది.

గుండెల్ని పిండేస్తున్న 'ఇరుముడి' గ్లింప్స్ వీడియో.. ఇది కదా రవన్నా నీ నుండి ఆశించినది..

Irumudi glimpse video
Irumudi glimpse video

Irumudi glimpse video: మన టాలీవుడ్ స్టార్ హీరోలలో టాలెంట్ కి చిరునామా లాంటి హీరో మాస్ మహారాజ రవితేజ. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని మొదలు పెట్టి , ఆ తర్వాత కమెడియన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించి , తద్వారా వచ్చిన ఫేమ్ తో హీరో గా మారి , హిట్ మీద హిట్ కొడుతూ మాస్ , ఫ్యామిలీ , యూత్ అని తేడా లేకుండా అన్ని వర్గాల్లోనూ బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. ప్రస్తుత ట్రెండ్ లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ప్రతీ స్టార్ హీరో నటన లో విభిన్నమైన కోణాలను ఆవిష్కరిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. రవితేజ కి కూడా అలా అద్భుతాలు సృష్టించేంత టాలెంట్ ఉంది.

కానీ ఈమధ్య కాలం లో ఆయన ఒకే తరహా మూస కమర్షియల్ సినిమాలను తీస్తూ తన మార్కెట్ మొత్తాన్ని పోగొట్టుకునే పరిస్థితికి వచ్చేసాడు. అభిమానులు కూడా ‘ఎలా ఉండే రవితేజ, ఎలా అయిపోయాడు, ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ని శాసించేంత సత్తా ఉన్న రవితేజ , నేడు మీడియం రేంజ్ మార్కెట్ ని కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది’ అంటూ సోషల్ మీడియా లో బహిరంగంగానే వాపోయారు. సరిగ్గా అలాంటి సమయం లోనే రవితేజ తన మైండ్ సెట్ ని మార్చుకున్నాడు. ఇకపై కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు , నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు. అందులో భాగంగా ఆయన ప్రకటించిన చిత్రం ‘ఇరుముడి’. నిన్ను కోరి , మజిలీ వంటి చిత్రాలను తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. ఫస్ట్ లుక్ విడుదల అయ్యినప్పటి నుండే ఈ సినిమా పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఆసక్తి కలిగింది.

దానికి తోడు అయ్యప్ప స్వామి బ్యాక్ గ్రౌండ్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ నేపథ్యం లో నేడు ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియో లో తండ్రి , కూతురు మధ్య ఉన్న ఎమోషన్ ని చాలా చక్కగా చూపించారు. భార్య చనిపోయిన తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లి , ఆమెని మర్చిపోలేక ముందుకి బానిస అయినా రవితేజ ని , అతని కూతురు మందు మానెయ్ నాన్న అని కోరడం, రవితేజ తనకు ఉన్నటువంటి ఆ చెడు అలవాటు ని తన కూతురు కోసం త్యాగం చేయడం కోసం అయ్యప్ప మాల ని ధరించడం ఆ తర్వాత జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. క్వాలిటీ పరంగా కూడా ఈ చిత్రాన్ని హై స్టాండర్డ్స్ తో తెరకెక్కిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. సోషల్ మీడియా ని ఊపేస్తున్న ఈ గ్లింప్స్ వీడియో ని మీరు కూడా చూసేయండి.

అనిల్ రావిపూడి కథలో వెంకటేష్ కి ప్రాముఖ్యత తగ్గిపోతుందా..?

Anil Ravipudi Venkatesh Movie
Anil Ravipudi Venkatesh Movie

Anil Ravipudi Venkatesh Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సక్సెస్ లను సాధించే దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు ఇప్పటివరకు వరుస సక్సెస్ లను సాధిస్తూ 12 విజయాలతో మొదటి స్థానంలో ఉండగా అతని తర్వాత స్థానంలో అనిల్ రావిపూడి ఉండటం విశేషం… ఇప్పటివరకు అనిల్ చేసిన తొమ్మిది సినిమాల్లో 9 మూవీస్ కూడా సూపర్ సక్సెస్ ని సాధించాయి. దాంతో ఇప్పుడు చేయబోతున్న పదోవ సినిమా మీద ఆయన పూర్తి ఫోకస్ అయితే పెట్టాడు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ లను పెట్టి మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాలో ఆయన తన డైరెక్షన్ కి సంబంధించిన మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ మూవీలో వెంకటేష్ క్యారెక్టర్ చాలా తక్కువగా ఉంటుందట. కారణం ఏంటి అంటే కథరీత్యా వెంకటేష్ ఈ సినిమాలో కొంతవరకే కనిపిస్తారని మిగతా సమయం మొత్తం కళ్యాణ్ రామ్ కనిపిస్తాడట. వెంకటేష్ తో పోలిస్తే కళ్యాణ్ రామ్ కి స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంటుందనే కామెంట్ వస్తున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా వెంకటేష్ కనిపించేది తక్కువ సమయమైన కూడా ఆయన క్యారెక్టర్ లో ఉన్న డెప్త్ చాలా ఎక్కువగా ఉంటుందని అది ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుందని అందువల్లే అతని పాత్రను ఓన్ చేసుకుని అతను లేకపోయిన కూడా ఆయన ఇచ్చిన ఇంపాక్ట్ సినిమా మొత్తం కొనసాగుతుందని అనిల్ రావిప్పుడు చెబుతుండటం విశేషం…

ఇక ఏది ఏమైనా కూడా వెంకటేష్ తో ఆయన ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేశాడు. ఇక ఇప్పుడు ఐదో సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అనిల్ రావిపూడి తో సినిమా కమిట్ అయినప్పటికి ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది.

దాంతో వీలైనంత తొందరగా ఈ సినిమాను ఫినిష్ చేసి అనిల్ రావిపూడి సినిమాలో జాయిన్ అయిపోవడానికి వెంకటేష్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది… గత సంవత్సరం ‘సంక్రాంతికి వస్తున్నాం ‘ సినిమాతో మంచి విజయాన్ని సాధించిన వెంకటేష్ మరోసారి అనిల్ రావిపూడి తో జతకట్టడం మీద ప్రతి ప్రేక్షకుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు…

అల్లు అర్జున్ - అట్లీ మూవీ కథలో మార్పులు చేస్తున్నారా..? కారణమేంటంటే..?

Allu Arjun Atlee Movie Story
Allu Arjun Atlee Movie Story

Allu Arjun Atlee Movie Story: అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసే ప్రయత్నంలో సినిమా యూనిట్ చాలా బిజీగా ఉన్నారు. అయినప్పటికి ఈ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చిత్ర యూనిట్ అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలన్నీ విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాని సైతం విజువల్ ఫీస్ట్ గా తెరకెక్కించి ప్రేక్షకులందరిని మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక దానికోసమే కథలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి కథను ఇంకా స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో అల్లు అర్జున్ భారీ విజయాన్ని సాధించి 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టినట్లైతే మాత్రం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ ని అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.

తద్వారా ప్రేక్షకుల నుంచి ఎలాంటి మన్ననలను పొందగలుగుతాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమా కథ ఏంటి అని కొంతమంది కొన్ని రకాల ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. నిజానికి సినిమా షూటింగ్ 50% పూర్తయిన తర్వాత కథను మార్చడం అనేది చాలా వరకు సినిమాకి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అయితే కొన్ని సినిమాల కథలను మార్చిన తర్వాత ఆ కథలు చాలా అద్భుతంగా కుదిరిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పటివరకు చాలా సినిమాల విషయంలో ఇలానే జరిగింది. ఇక ప్రస్తుతం ఉన్న సందర్భంలో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న అల్లు అర్జున్… తన నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉంటాయి.

కాబట్టి ఆ అంచనాలను అందుకోవాలంటే కథ కూడా స్ట్రాంగ్ గా ఉండాలనే ఉద్దేశ్యంతోనే అట్లీ ఈ సినిమా కథని చాలా వైల్డ్ గా రాస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా అల్లు అర్జున్ – అట్లీ ఇద్దరు కూడా భారీ విజయాన్ని సాధించి తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

మహేష్ బాబు చేయాల్సిన మూడు సినిమాలను చేసిన రవితేజ...

Mahesh Babu Missed Movies
Mahesh Babu Missed Movies

Mahesh Babu Missed Movies: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాని మరొక హీరో చేసి సూపర్ సక్సెస్ లను సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొంత మంది సినిమాలను మిస్ చేసుకుని భారీ సక్సెస్ లను కోల్పోతూ ఉంటే మరి కొంతమంది మాత్రం సినిమాని రిజెక్ట్ చేసి భారీ ఫ్లాప్ ల నుంచి తప్పించుకుంటున్నారు. ఇక ఏది ఏమైనా కూడా చాలామంది హీరోలు తమ ఎంటైర్ కెరియర్ లో ఎన్నో కొన్ని సినిమాలు అయితే మిస్ చేసుకునే ఉంటారు. అందులో మహేష్ బాబు మిస్ చేసుకున్న కొన్ని సినిమాలను రవితేజ చేసి భారీ విజయాన్ని సాధించాడనే విషయం చాలా మందికి తెలియదు… హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ చేసిన మిరపకాయ్ సినిమా కథని మొదట హరీష్ శంకర్ కి వినిపించారట. కానీ మహేష్ బాబు మాత్రం ఆ సినిమా మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో రవితేజతో చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు…

ఇక అనిల్ రావిపూడి సైతం ‘రాజా ది గ్రేట్’ సినిమాని మాత్రం మహేష్ బాబు కోసం అనుకున్నారట. కానీ ఒక కమర్షియల్ హీరో కండ్లు లేకుండా కనిపిస్తే తన అభిమానులు ఒప్పుకోరేమో అనే ఉద్దేశ్యంతో మహేష్ బాబు ఆ కథను రిజెక్ట్ చేశాడట. దాంతో రవితేజ సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు…

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ‘క్రాక్’ సినిమా కథని మొదట మహేష్ బాబు కోసం అనుకున్నారట. కానీ మహేష్ బాబు అప్పటికే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లు చాలానే చేశానని చెప్పి ఇప్పుడు మళ్ళీ అదే చేస్తే రొటీన్ అవుతుందని అన్నారట.

అందువల్లే తను ఆ సినిమా చేయనని చెప్పారట. దాంతో రవితేజ ఆ సినిమా చేసి సూపర్ సక్సెస్ సాధించాడు. మొత్తానికైతే మహేష్ బాబు మిస్ చేసుకున్న మూడు సినిమాలతో రవితేజ సూపర్ హిట్లను అందుకోవడం చాలా గొప్ప విషయమనే చెప్పాలి…ఈ మూవీస్ రవితేజ కెరీర్ కి చాలా వరకు హెల్ప్ అయ్యాయి…

అమిత్ షా ఎంట్రీ.. పాకిస్తాన్ లో వణుకు.. ఏం ప్లాన్ చేశారు

Amit Shah Pakistan Border Visit
Amit Shah Pakistan Border Visit

Amit Shah Pakistan Border Visit: ఇటీవల కాలంలో పాకిస్తాన్ దేశానికి భారత్ షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. పాకిస్తాన్ తేరుకునే లోపు దిమ్మ తిరిగే విధంగా చేస్తోంది. ఇప్పుడిక భారత్ ఒక అడుగు ముందుకేసింది. పాకిస్తాన్ కుట్రలకు.. పాకిస్తాన్ చేస్తున్న దారుణాలకు చరమగీతం పాడేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించింది. ఈ క్రమంలోనే కేంద్ర హోం శాఖ మంత్రి సరిహద్దుల్లో పర్యటిస్తున్నారు. భద్రత విషయంలో మన దేశ ఆర్మీకి సూచనలు చేస్తున్నారు.

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే విధంగా అమిత్ షా స్కెచ్ వేశారు. అది కాస్త ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలోని అత్యంత సున్నితమైన హరామి నాలా, సర్ క్రీక్ ప్రాంతంలో అమిత్ షా పర్యటించారు. ఈ ప్రాంతాలు పాకిస్తాన్ కు అత్యంత దగ్గరగా ఉంటాయి. ఈ నేపథ్యంలో భారతదేశం నుంచి పశ్చిమ సరిహద్దు వెంబడి అమిత్ షా భద్రత ఏర్పాట్లను పరీక్షించారు. కొత్తగా ఏర్పాటుచేసిన బోర్డర్ అవుట్ పోస్ట్ జి7 ను ఆయన ప్రారంభించారు. హరామి నాలా అత్యంత చిత్తడిగా ఉంటుంది. ఇందులో నిత్యం పాములు.. తేళ్లు కనిపిస్తూ ఉంటాయి. మన భారతదేశ ఆర్మీకి అత్యంత కఠినమైన ప్రదేశం ఇది. అంతేకాదు.. ఈ ప్రాంత విషయంలో పాకిస్తాన్ దేశానికి.. మనకు వివాదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ప్రాంతం మీద పట్టు సాధించడానికి కేంద్రం ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

అవుట్ పోస్ట్ జి7 ప్రారంభించిన తర్వాత ఓపి టవర్ 1170 లో ఆయన కంట్రోల్ సందర్శించారు. సర్ క్రీక్ ప్రాంతంలో పడవ ద్వారా పర్యటించారు అంతేకాదు పర్యటన సందర్భంగా జట్టి పాయింట్ వద్ద ఆయన మొక్కలు నాటారు. భుజ్ ప్రాంతంలో బిఎస్ఎఫ్ సెక్టార్ ప్రధాన కార్యాలయంలో ఆర్మీ సిబ్బందితో ఆయన అత్యంత రహస్యంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. గత నవంబర్ లోనే బిఎస్ఎఫ్ ఆవిర్భావ వేడుకలకు అమిత్ షా హాజరయ్యారు. కచ్ ప్రాంతానికి అమిత్ షా రావడం గడచిన ఆరు నెలల్లో ఇది రెండవసారి.

అమిత్ షా ఇలా పర్యటించడంతో పాకిస్తాన్ గుండెల్లో గుబులు మొదలైంది. భారత్ ఏదో చేస్తోందనే భయం పాకిస్తాన్లో కనిపిస్తోంది. అందువల్లే భారత్ సరిహద్దులను పాకిస్తాన్ కూడా జాగ్రత్తగా పరిశీలిస్తోంది. అంతేకాదు అక్కడ కీలకమైన ఎయిర్ బేస్ లు నిర్మిస్తున్న నేపథ్యంలో.. అమిత్ షా అక్కడ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడ మాత్రమే కాదు.. పాకిస్తాన్ సరిహద్దు వెంట అత్యంత కఠినమైన..కంచెలు నిర్మిస్తామని అమిత్ షా ప్రకటించడం ఇక్కడ విశేషం.

'ఇరుముడి' తర్వాత రవితేజ కెరియర్ మారనుందా..?

Ravi Teja Irumudi Movie
Ravi Teja Irumudi Movie

Ravi Teja Irumudi Movie: రవితేజ హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒకప్పుడు రవితేజ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ విలన్ పాత్రను పోషిస్తూ వచ్చాడు. కానీ హీరోగా మారిన తర్వాత ఆయనకు ఎనలేని గుర్తింపు వచ్చింది. రవితేజ అప్పటి నుంచి ఇప్పటివరకు తీవ్రంగా కష్టపడుతూ సక్సెస్ లను సాధించడమే తన ఏజెండాగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నాడు. కొద్దిరోజుల నుంచి రవితేజ భారీ సక్సెసులైనతే సాధించడం లేదు. దాంతో ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతుంది. మొత్తానికైతే అయ్యప్ప మాల వేసుకున్న వ్యక్తికి కొన్ని ఆపదలు వచ్చినప్పుడు దేవుడితో పాటు మనుషులు కూడా అతనికి ఎలా హెల్ప్ అయ్యారు. దాని నుంచి ఆయన ఎలా తప్పించుకున్నాడు అనే విషయాన్ని ఇందులో చాలా స్పష్టంగా చెప్పబోతున్నారట.

ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న రవితేజ ఈ మధ్యకాలంలో చాలావరకు డీలా పడిపోతున్నాడు. కారణం ఏదైనా ఆయన డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకోకపోవడం, రొటీన్ స్టైల్ లో నటించడం వల్లే ఆయన కెరీర్ డౌన్ ఫాల్ అవుతుంది.

కానీ ఇప్పుడు మొదటిసారి ‘ఇరుముడి’ సినిమాతో డిఫరెంట్ ప్రయత్నమైతే చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ వస్తుందని ఆయన భావిస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరోసారి ఆయన తన సత్తా చాటుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ మూవీలో రవితేజ అద్భుతంగా నటించాడని సినిమా కూడా చాలా బాగా వచ్చిందని మేకర్స్ చెబుతున్నారు.

దానివల్ల రవితేజ ఖాతాలో మరో సక్సెస్ పడబోతుంది అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది అంటూ మేకర్స్ చాలా క్లారిటిగా ఉన్నారు…ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని బ్రేక్ చేయగలిగే సత్తా ఉన్న దర్శకులు చాలా మంది ఉన్నప్పటికి రవితేజ మాత్రం కొత్త దర్శకులను యంగ్ డైరెక్టర్ ను ఎంకరేజ్ చేస్తు సినిమాలు చేయడం విశేషం…

లక్నో యజమాని గోయంక అలాంటివాడు.. అందుకే పంత్ వెళ్లిపోయాడు.. అసలు నిజం చెప్పిన లలిత్ మోడీ

Lalit Modi On Sanjiv Goenka
Lalit Modi On Sanjiv Goenka

Lalit Modi On Sanjiv Goenka: ఈ ఐపీఎల్లో అత్యంత దారుణంగా ఆడింది లక్నో జట్టు. ఈ జట్టులో అనుభవజ్ఞులైన ప్లేయర్లు ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. ముఖ్యంగా లక్నో జట్టును కెప్టెన్ రిషబ్ పంత్ నడిపించిన విధానం దారుణంగా ఉంది. అందువల్లే ఆ టీం లాస్ట్ స్టేజ్ లో ఉండిపోయింది. ఆ ఒత్తిడి తట్టుకోలేక.. విమర్శలను ఎదుర్కోలేక కెప్టెన్ పంత్ తన స్థానం నుంచి తప్పుకున్నాడు.. అంతేకాదు, ఈ విషయాన్ని లక్నో యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్లో లక్నో జట్టుకు నాయకుడిగా ఎవరుంటారో అనే చర్చ మొదలైంది.

ఈ చర్చ ఇలా సాగుతుండగానే ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ బాంబు పేల్చారు. సంచలన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి.. లక్నో జట్టులో ఏం జరిగిందో బయట పెట్టేశారు. దీంతో స్పోర్ట్స్ వర్గాల్లో చర్చ మొదలైంది. లక్నో జట్టుకు యజమానిగా సంజీవ్ గోయాంక కొనసాగుతున్నారు. ఆయనను అత్యంత చెత్త యజమాని అని లలిత్ ఆరోపించారు. అతడు మాట తప్పిన మూర్ఖుడు.. నిలకడ లేని వ్యక్తి అని మండిపడ్డారు. ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో లలిత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

“అతడు ఒక జట్టును కొనుగోలు చేయడం.. దానిని సమర్థవంతంగా నడిపించడం సాధ్యం కాదు. అనవసరంగా జట్టును కొనుగోలు చేసి తన విఫలత్వాన్ని నిరూపించుకున్నాడు. అతడు లక్నో జటన్ కొనుగోలు చేయడం ద్వారా ఐపిఎల్ రేటింగ్ చాలావరకు తగ్గిపోయింది. లక్నో జట్టు ప్రతి సీజన్లో కూడా దారుణమైన ఆట తీరు కొనసాగిస్తుంది. ఈసారి కూడా లక్నో రిక్త హస్తాలతోనే వెళ్లిపోయింది. గోయంక తీరు వల్ల అతడు ఒక మీమ్ క్రియేటర్లకు సర్ఫ్ గా మారిపోయాడు. అంతేకాదు గోయంక మీద రూపొందిన మీమ్ ను ఎక్కువగా చూసిన వాళ్లకు తాను ఒక చేతి వాచి బహుమతిగా ఇస్తానని” లలిత మోడీ వ్యాఖ్యానించాడు.

సంజీవ్ మీద లలిత్ మోడీ విమర్శలు చేయడం ఇదే తొలిసారి కాదు. ప్రతి సందర్భంలో ఆయన ఇదే స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ సీజన్లో ఒక మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత సంజీవ్, పంత్ మధ్య విపరీతమైన చర్చ జరిగింది. ఆ సమయంలో సంజీవ్ కు లలిత్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. అయితే ఈ సీజన్లో లక్నో జట్టు అంతగా ఆడక పోవడంతో.. దానికి బాధ్యత వహిస్తూ కెప్టెన్ బాధ్యతల నుంచి పంత్ తప్పుకున్నాడు. సంజీవ్ వ్యవహార శైలి నేపథ్యంలో.. ఇకపై ఆ జట్టుకు సారధిగా ఎవరూ వచ్చే అవకాశం లేదని స్పోర్ట్స్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

అన్నామలై రాజీనామా చేసి.. తప్పు చేస్తున్నాడా..

Annamalai Resignation From BJP
Annamalai Resignation From BJP

Annamalai Resignation From BJP: భారతీయ జనతా పార్టీ నుంచి అన్నామలై తప్పుకున్నట్టే. ఢిల్లీలో వేచి చూడాలని పార్టీ పెద్దలు చెప్పిన నేపథ్యంలో.. ఆయన అక్కడ ఉన్నాడని చెబుతున్నారు గాని.. రాజ్యసభ సీటు ఇస్తామని వార్తలు వస్తున్నాయి గాని.. అవేవీ వాస్తవం కాకపోవచ్చు. ఎందుకంటే అన్నామలై ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ ప్రకారం ఆయన సొంత పార్టీ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సొంత పార్టీ పెట్టాలని ఆయన మీద అనుచరులు ఒత్తిడి తీసుకొస్తున్నట్టు ఇటీవల తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొంతమంది బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి కూడా అన్నామలై బాటలోనే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.

ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో బిజెపి కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాలు అన్నామలై కి ఏమాత్రం రుచించలేదని తెలుస్తోంది. అందువల్లే ఆయన రాజీనామా వైపు వెళ్ళినట్టు తెలుస్తోంది. అన్నా డీఎంకేతో పొత్తు.. సీట్ల సర్దుబాటు.. ప్రచారం.. రాష్ట్ర అధ్యక్ష బాధ్యత నుంచి ఆయనను తప్పించడం.. ఇవన్నీ కూడా అన్నామలై లో వేరే భావాన్ని కలిగించాయని వార్తలు వస్తున్నాయి. అందువల్లే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారని.. బిజెపి అధిష్టానం రంగంలోకి దిగి నచ్చ చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని సమాచారం.

అన్నా మలై రాజీనామా విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన తొందర పడ్డారని.. పార్టీ ప్రయోజనాలను ఆయన అర్థం చేసుకోవడం లేదని బిజెపి నాయకులు అంటున్నారు.. అన్నా మలై వేచి చూస్తే బాగుండేదని చెబుతున్నారు. అన్నామలై ఉదంతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్న బిజెపి నాయకులు.. ఒక కీలక విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. బిజెపిలో వ్యక్తి ప్రయోజనాలు ఉండవని.. పార్టీ ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని వారు వివరిస్తున్నారు.

అస్సాం ముఖ్యమంత్రిగా గతంలో సర్బానంద సోనోవాల్ ఉండేవారు. ఆ తర్వాత హిమంత బీజేపీలో చేరారు. సర్బానంద మంచి నాయకుడే.. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఆయనకు కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకున్నారు. హిమంతను అస్సాం ముఖ్యమంత్రి చేశారు. నాడు పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని సోనోవాల్ స్వాగతించారు. కేంద్ర మంత్రివర్గంలోకి సానుకూల ధోరణితో వెళ్లిపోయారు. హిమంత దూకుడు వల్ల అస్సాం వరుసగా అధికారంలోకి వచ్చింది. అక్కడ బిజెపి అధికారంలో ఉండడం వల్ల అనేక రకాల పనులను చేపట్టేందుకు కేంద్రానికి ఆస్కారం ఏర్పడుతోంది.

అన్నా మలై వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తున్న జాతీయవాదులు ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. 1995 -96 కాలంలో నరేంద్ర మోడీ గుజరాత్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. పార్టీ కి దూరం కావాల్సి వచ్చింది. దీంతో ఆయన చాలా కాలం పాటు ఢిల్లీకి పరిమితం కావలసి వచ్చింది. జాతీయ పార్టీ కార్యాలయంలో ఒక చిన్న గదిలో.. మరొక నాయకుడితో ఆయన ఉండాల్సి వచ్చింది. ఇలా అనేక రోజులు ఉన్న తర్వాత.. మళ్లీ గుజరాత్ రాష్ట్రం లోకి ఆయన వచ్చారు. ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మూడోసారి దేశ ప్రధాన మంత్రిగా కొనసాగుతున్నారు. అంతటి నరేంద్ర మోడీకి ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు.. పార్టీ అధినాయకత్వం నిర్ణయానికి అన్నా మలై కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని వారు గుర్తు చేస్తున్నారు..