Home Blog Page 196

ఇరాన్‌ ప్రతీకార దాడులు.. మధ్యప్రాచ్యం మళ్లీ భీకర యుద్ధం!

Iran retaliatory attacks latest news
Iran retaliatory attacks latest news

Iran retaliatory attacks latest news: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం రాజుకుంటోంది. ఒకవైపు అమెరికా–ఇరాన్‌ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఇంకోవైపు అమెరికా ఆత్మరక్షణ పేరుతో ఇరాన్‌లోని హార్ముజ్, క్వెష్మ్‌ ప్రాంతాలపై విరుచుకుపడుతోంది. ఒకవైపు శాంతి చర్చలు అంటూనే దాడులు ప్రారంభించిన అమెరికాపై ఇరాన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో మరోసారి తీవ్రమైన ప్రతీకార చర్యలకు దిగింది. కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై మిస్సైళ్లు, డ్రోన్ల దాడులు చేసినట్లు ఇరాన్‌ ప్రకటించింది. హార్ముజ్‌ ప్రాంతం, క్వెష్మ్‌ దీవి పై అమెరికా చేసిన దాడులకు ఇది సమాధానమని ఇరాన్‌ ప్రకటించింది. ఈ పరిణామం ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న మధ్యప్రాచ్య ప్రాంతాన్ని మరింత అగ్నిగుండంగా మార్చే అవకాశం ఉంది.

ప్రతీకార యుద్ధం షురూ..
ఇరాన్‌ తన దాడులను స్పష్టంగా ‘‘ప్రతీకారం’’గా ప్రకటించడం గమనార్హం. హార్ముజ్‌ జలసంధి సమీపంలోని క్వెష్మ్‌ దీవిపై అమెరికా చేసిన దాడులు ఇరాన్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. ఈ దీవి ఇరాన్‌ సైనిక వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. ఇరాన్‌ ఇప్పుడు గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా తన సామర్థ్యాన్ని ప్రదర్శించింది. అయితే ఈ దాడులు ఎంతవరకు సఫలమయ్యాయి అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఇరాన్‌ తన ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ సమర్థవంతంగా పని చేస్తున్నాయని చెప్పినప్పటికీ, కువైట్, బహ్రెయిన్‌ దేశాలు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశాయి.

హార్ముజ్‌పై ప్రభావం..
హార్ముజ్‌ జలసంధి ప్రపంచ ఆయిల్‌ సరఫరాలో కీలకమైనది. ప్రపంచంలోని 20 శాతం ఆయిల్‌ ఈ జలసంధి గుండా ప్రయాణిస్తుంది. ఇరాన్‌ ఈ ప్రాంతంపై ఎక్కువ నియంత్రణ కోరుకుంటుంది, అమెరికా, దాని మిత్రదేశాలు దాన్ని స్వేచ్ఛగా ఉంచాలని కోరుకుంటాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న దాడులు కేవలం సైనిక చర్యలు మాత్రమే కాదు, ఆర్థిక యుద్ధంగా కూడా మారుతున్నాయి. ఈ ఘర్షణలు ఇప్పటికే గ్లోబల్‌ ఆయిల్‌ మార్కెట్లను కదిలించాయి. ఆయిల్‌ ధరలు పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా భారత్‌ వంటి ఆయిల్‌ దిగుమతి ఆధారిత దేశాలు ఇందుకు ఎక్కువగా గురవుతాయి.

ప్రాంతీయ స్థిరత్వం ఎటువైపు..
ఇరాన్‌–అమెరికా మధ్య ఈ తాజా ఘర్షణ గల్ఫ్‌ దేశాలను కూడా నేరుగా బలిపీఠం చేస్తోంది. కువైట్, బహ్రెయిన్‌ వంటి దేశాలు తమ భూభాగంపై జరుగుతున్న దాడుల వల్ల అనవసరమైన ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఇది ఇప్పటికే సున్నితంగా ఉన్న గల్ఫ్‌ రాజకీయ సమీకరణాలను మరింత క్లిష్టంగా చేస్తోంది. ఇరాన్‌ తన సైనిక బలాన్ని ప్రదర్శించడం ద్వారా ప్రాంతంలో తన ప్రభావాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. మరోవైపు అమెరికా తన మిత్రదేశాల భద్రతను కాపాడుతూ, ఇరాన్‌ను కట్టడి చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ పరస్పర చర్యలు పెద్ద యుద్ధంగా మారే ప్రమాదం ఉంది.

తాజా దాడులు ఇరాన్‌–అమెరికా మధ్య ఉన్న ఏవైనా డిప్లమసీ ప్రయత్నాలను మరింత క్లిష్టతరం చేస్తాయి. రెండు వైపులా ఉన్న హెచ్చరికలు, ప్రతీకార వాగ్దానాలు యుద్ధం మరింత విస్తరించే అవకాశాలను పెంచుతున్నాయి. మధ్యప్రాచ్యం ఇప్పటికే చాలా సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో రెండు పక్షాలు కూడా సంయమనం పాటించి, డిప్లమసీ మార్గాన్ని ఎంచుకోవడం అవసరం ఉంది. ఉద్రిక్తతలు త్వరగా తగ్గకపోతే, ధరల పెరుగుదల రూపంలో ప్రపంచం మొత్తం దాని ధర చెల్లించాల్సి వస్తుంది.

గుండెల్ని పిండేస్తున్న 'ఇరుముడి' గ్లింప్స్ వీడియో.. ఇది కదా రవన్నా నీ నుండి ఆశించినది..

Irumudi glimpse video
Irumudi glimpse video

Irumudi glimpse video: మన టాలీవుడ్ స్టార్ హీరోలలో టాలెంట్ కి చిరునామా లాంటి హీరో మాస్ మహారాజ రవితేజ. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని మొదలు పెట్టి , ఆ తర్వాత కమెడియన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించి , తద్వారా వచ్చిన ఫేమ్ తో హీరో గా మారి , హిట్ మీద హిట్ కొడుతూ మాస్ , ఫ్యామిలీ , యూత్ అని తేడా లేకుండా అన్ని వర్గాల్లోనూ బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. ప్రస్తుత ట్రెండ్ లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ప్రతీ స్టార్ హీరో నటన లో విభిన్నమైన కోణాలను ఆవిష్కరిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. రవితేజ కి కూడా అలా అద్భుతాలు సృష్టించేంత టాలెంట్ ఉంది.

కానీ ఈమధ్య కాలం లో ఆయన ఒకే తరహా మూస కమర్షియల్ సినిమాలను తీస్తూ తన మార్కెట్ మొత్తాన్ని పోగొట్టుకునే పరిస్థితికి వచ్చేసాడు. అభిమానులు కూడా ‘ఎలా ఉండే రవితేజ, ఎలా అయిపోయాడు, ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ని శాసించేంత సత్తా ఉన్న రవితేజ , నేడు మీడియం రేంజ్ మార్కెట్ ని కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది’ అంటూ సోషల్ మీడియా లో బహిరంగంగానే వాపోయారు. సరిగ్గా అలాంటి సమయం లోనే రవితేజ తన మైండ్ సెట్ ని మార్చుకున్నాడు. ఇకపై కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు , నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు. అందులో భాగంగా ఆయన ప్రకటించిన చిత్రం ‘ఇరుముడి’. నిన్ను కోరి , మజిలీ వంటి చిత్రాలను తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. ఫస్ట్ లుక్ విడుదల అయ్యినప్పటి నుండే ఈ సినిమా పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఆసక్తి కలిగింది.

దానికి తోడు అయ్యప్ప స్వామి బ్యాక్ గ్రౌండ్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ నేపథ్యం లో నేడు ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియో లో తండ్రి , కూతురు మధ్య ఉన్న ఎమోషన్ ని చాలా చక్కగా చూపించారు. భార్య చనిపోయిన తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లి , ఆమెని మర్చిపోలేక ముందుకి బానిస అయినా రవితేజ ని , అతని కూతురు మందు మానెయ్ నాన్న అని కోరడం, రవితేజ తనకు ఉన్నటువంటి ఆ చెడు అలవాటు ని తన కూతురు కోసం త్యాగం చేయడం కోసం అయ్యప్ప మాల ని ధరించడం ఆ తర్వాత జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. క్వాలిటీ పరంగా కూడా ఈ చిత్రాన్ని హై స్టాండర్డ్స్ తో తెరకెక్కిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. సోషల్ మీడియా ని ఊపేస్తున్న ఈ గ్లింప్స్ వీడియో ని మీరు కూడా చూసేయండి.

అనిల్ రావిపూడి కథలో వెంకటేష్ కి ప్రాముఖ్యత తగ్గిపోతుందా..?

Anil Ravipudi Venkatesh Movie
Anil Ravipudi Venkatesh Movie

Anil Ravipudi Venkatesh Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సక్సెస్ లను సాధించే దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు ఇప్పటివరకు వరుస సక్సెస్ లను సాధిస్తూ 12 విజయాలతో మొదటి స్థానంలో ఉండగా అతని తర్వాత స్థానంలో అనిల్ రావిపూడి ఉండటం విశేషం… ఇప్పటివరకు అనిల్ చేసిన తొమ్మిది సినిమాల్లో 9 మూవీస్ కూడా సూపర్ సక్సెస్ ని సాధించాయి. దాంతో ఇప్పుడు చేయబోతున్న పదోవ సినిమా మీద ఆయన పూర్తి ఫోకస్ అయితే పెట్టాడు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ లను పెట్టి మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాలో ఆయన తన డైరెక్షన్ కి సంబంధించిన మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ మూవీలో వెంకటేష్ క్యారెక్టర్ చాలా తక్కువగా ఉంటుందట. కారణం ఏంటి అంటే కథరీత్యా వెంకటేష్ ఈ సినిమాలో కొంతవరకే కనిపిస్తారని మిగతా సమయం మొత్తం కళ్యాణ్ రామ్ కనిపిస్తాడట. వెంకటేష్ తో పోలిస్తే కళ్యాణ్ రామ్ కి స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంటుందనే కామెంట్ వస్తున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా వెంకటేష్ కనిపించేది తక్కువ సమయమైన కూడా ఆయన క్యారెక్టర్ లో ఉన్న డెప్త్ చాలా ఎక్కువగా ఉంటుందని అది ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుందని అందువల్లే అతని పాత్రను ఓన్ చేసుకుని అతను లేకపోయిన కూడా ఆయన ఇచ్చిన ఇంపాక్ట్ సినిమా మొత్తం కొనసాగుతుందని అనిల్ రావిప్పుడు చెబుతుండటం విశేషం…

ఇక ఏది ఏమైనా కూడా వెంకటేష్ తో ఆయన ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేశాడు. ఇక ఇప్పుడు ఐదో సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అనిల్ రావిపూడి తో సినిమా కమిట్ అయినప్పటికి ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది.

దాంతో వీలైనంత తొందరగా ఈ సినిమాను ఫినిష్ చేసి అనిల్ రావిపూడి సినిమాలో జాయిన్ అయిపోవడానికి వెంకటేష్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది… గత సంవత్సరం ‘సంక్రాంతికి వస్తున్నాం ‘ సినిమాతో మంచి విజయాన్ని సాధించిన వెంకటేష్ మరోసారి అనిల్ రావిపూడి తో జతకట్టడం మీద ప్రతి ప్రేక్షకుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు…

అల్లు అర్జున్ - అట్లీ మూవీ కథలో మార్పులు చేస్తున్నారా..? కారణమేంటంటే..?

Allu Arjun Atlee Movie Story
Allu Arjun Atlee Movie Story

Allu Arjun Atlee Movie Story: అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసే ప్రయత్నంలో సినిమా యూనిట్ చాలా బిజీగా ఉన్నారు. అయినప్పటికి ఈ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చిత్ర యూనిట్ అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలన్నీ విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాని సైతం విజువల్ ఫీస్ట్ గా తెరకెక్కించి ప్రేక్షకులందరిని మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక దానికోసమే కథలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి కథను ఇంకా స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో అల్లు అర్జున్ భారీ విజయాన్ని సాధించి 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టినట్లైతే మాత్రం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ ని అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.

తద్వారా ప్రేక్షకుల నుంచి ఎలాంటి మన్ననలను పొందగలుగుతాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమా కథ ఏంటి అని కొంతమంది కొన్ని రకాల ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. నిజానికి సినిమా షూటింగ్ 50% పూర్తయిన తర్వాత కథను మార్చడం అనేది చాలా వరకు సినిమాకి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అయితే కొన్ని సినిమాల కథలను మార్చిన తర్వాత ఆ కథలు చాలా అద్భుతంగా కుదిరిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పటివరకు చాలా సినిమాల విషయంలో ఇలానే జరిగింది. ఇక ప్రస్తుతం ఉన్న సందర్భంలో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న అల్లు అర్జున్… తన నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉంటాయి.

కాబట్టి ఆ అంచనాలను అందుకోవాలంటే కథ కూడా స్ట్రాంగ్ గా ఉండాలనే ఉద్దేశ్యంతోనే అట్లీ ఈ సినిమా కథని చాలా వైల్డ్ గా రాస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా అల్లు అర్జున్ – అట్లీ ఇద్దరు కూడా భారీ విజయాన్ని సాధించి తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

మహేష్ బాబు చేయాల్సిన మూడు సినిమాలను చేసిన రవితేజ...

Mahesh Babu Missed Movies
Mahesh Babu Missed Movies

Mahesh Babu Missed Movies: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాని మరొక హీరో చేసి సూపర్ సక్సెస్ లను సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొంత మంది సినిమాలను మిస్ చేసుకుని భారీ సక్సెస్ లను కోల్పోతూ ఉంటే మరి కొంతమంది మాత్రం సినిమాని రిజెక్ట్ చేసి భారీ ఫ్లాప్ ల నుంచి తప్పించుకుంటున్నారు. ఇక ఏది ఏమైనా కూడా చాలామంది హీరోలు తమ ఎంటైర్ కెరియర్ లో ఎన్నో కొన్ని సినిమాలు అయితే మిస్ చేసుకునే ఉంటారు. అందులో మహేష్ బాబు మిస్ చేసుకున్న కొన్ని సినిమాలను రవితేజ చేసి భారీ విజయాన్ని సాధించాడనే విషయం చాలా మందికి తెలియదు… హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ చేసిన మిరపకాయ్ సినిమా కథని మొదట హరీష్ శంకర్ కి వినిపించారట. కానీ మహేష్ బాబు మాత్రం ఆ సినిమా మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో రవితేజతో చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు…

ఇక అనిల్ రావిపూడి సైతం ‘రాజా ది గ్రేట్’ సినిమాని మాత్రం మహేష్ బాబు కోసం అనుకున్నారట. కానీ ఒక కమర్షియల్ హీరో కండ్లు లేకుండా కనిపిస్తే తన అభిమానులు ఒప్పుకోరేమో అనే ఉద్దేశ్యంతో మహేష్ బాబు ఆ కథను రిజెక్ట్ చేశాడట. దాంతో రవితేజ సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు…

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ‘క్రాక్’ సినిమా కథని మొదట మహేష్ బాబు కోసం అనుకున్నారట. కానీ మహేష్ బాబు అప్పటికే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లు చాలానే చేశానని చెప్పి ఇప్పుడు మళ్ళీ అదే చేస్తే రొటీన్ అవుతుందని అన్నారట.

అందువల్లే తను ఆ సినిమా చేయనని చెప్పారట. దాంతో రవితేజ ఆ సినిమా చేసి సూపర్ సక్సెస్ సాధించాడు. మొత్తానికైతే మహేష్ బాబు మిస్ చేసుకున్న మూడు సినిమాలతో రవితేజ సూపర్ హిట్లను అందుకోవడం చాలా గొప్ప విషయమనే చెప్పాలి…ఈ మూవీస్ రవితేజ కెరీర్ కి చాలా వరకు హెల్ప్ అయ్యాయి…

అమిత్ షా ఎంట్రీ.. పాకిస్తాన్ లో వణుకు.. ఏం ప్లాన్ చేశారు

Amit Shah Pakistan Border Visit
Amit Shah Pakistan Border Visit

Amit Shah Pakistan Border Visit: ఇటీవల కాలంలో పాకిస్తాన్ దేశానికి భారత్ షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. పాకిస్తాన్ తేరుకునే లోపు దిమ్మ తిరిగే విధంగా చేస్తోంది. ఇప్పుడిక భారత్ ఒక అడుగు ముందుకేసింది. పాకిస్తాన్ కుట్రలకు.. పాకిస్తాన్ చేస్తున్న దారుణాలకు చరమగీతం పాడేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించింది. ఈ క్రమంలోనే కేంద్ర హోం శాఖ మంత్రి సరిహద్దుల్లో పర్యటిస్తున్నారు. భద్రత విషయంలో మన దేశ ఆర్మీకి సూచనలు చేస్తున్నారు.

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే విధంగా అమిత్ షా స్కెచ్ వేశారు. అది కాస్త ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలోని అత్యంత సున్నితమైన హరామి నాలా, సర్ క్రీక్ ప్రాంతంలో అమిత్ షా పర్యటించారు. ఈ ప్రాంతాలు పాకిస్తాన్ కు అత్యంత దగ్గరగా ఉంటాయి. ఈ నేపథ్యంలో భారతదేశం నుంచి పశ్చిమ సరిహద్దు వెంబడి అమిత్ షా భద్రత ఏర్పాట్లను పరీక్షించారు. కొత్తగా ఏర్పాటుచేసిన బోర్డర్ అవుట్ పోస్ట్ జి7 ను ఆయన ప్రారంభించారు. హరామి నాలా అత్యంత చిత్తడిగా ఉంటుంది. ఇందులో నిత్యం పాములు.. తేళ్లు కనిపిస్తూ ఉంటాయి. మన భారతదేశ ఆర్మీకి అత్యంత కఠినమైన ప్రదేశం ఇది. అంతేకాదు.. ఈ ప్రాంత విషయంలో పాకిస్తాన్ దేశానికి.. మనకు వివాదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ప్రాంతం మీద పట్టు సాధించడానికి కేంద్రం ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

అవుట్ పోస్ట్ జి7 ప్రారంభించిన తర్వాత ఓపి టవర్ 1170 లో ఆయన కంట్రోల్ సందర్శించారు. సర్ క్రీక్ ప్రాంతంలో పడవ ద్వారా పర్యటించారు అంతేకాదు పర్యటన సందర్భంగా జట్టి పాయింట్ వద్ద ఆయన మొక్కలు నాటారు. భుజ్ ప్రాంతంలో బిఎస్ఎఫ్ సెక్టార్ ప్రధాన కార్యాలయంలో ఆర్మీ సిబ్బందితో ఆయన అత్యంత రహస్యంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. గత నవంబర్ లోనే బిఎస్ఎఫ్ ఆవిర్భావ వేడుకలకు అమిత్ షా హాజరయ్యారు. కచ్ ప్రాంతానికి అమిత్ షా రావడం గడచిన ఆరు నెలల్లో ఇది రెండవసారి.

అమిత్ షా ఇలా పర్యటించడంతో పాకిస్తాన్ గుండెల్లో గుబులు మొదలైంది. భారత్ ఏదో చేస్తోందనే భయం పాకిస్తాన్లో కనిపిస్తోంది. అందువల్లే భారత్ సరిహద్దులను పాకిస్తాన్ కూడా జాగ్రత్తగా పరిశీలిస్తోంది. అంతేకాదు అక్కడ కీలకమైన ఎయిర్ బేస్ లు నిర్మిస్తున్న నేపథ్యంలో.. అమిత్ షా అక్కడ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడ మాత్రమే కాదు.. పాకిస్తాన్ సరిహద్దు వెంట అత్యంత కఠినమైన..కంచెలు నిర్మిస్తామని అమిత్ షా ప్రకటించడం ఇక్కడ విశేషం.

'ఇరుముడి' తర్వాత రవితేజ కెరియర్ మారనుందా..?

Ravi Teja Irumudi Movie
Ravi Teja Irumudi Movie

Ravi Teja Irumudi Movie: రవితేజ హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒకప్పుడు రవితేజ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ విలన్ పాత్రను పోషిస్తూ వచ్చాడు. కానీ హీరోగా మారిన తర్వాత ఆయనకు ఎనలేని గుర్తింపు వచ్చింది. రవితేజ అప్పటి నుంచి ఇప్పటివరకు తీవ్రంగా కష్టపడుతూ సక్సెస్ లను సాధించడమే తన ఏజెండాగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నాడు. కొద్దిరోజుల నుంచి రవితేజ భారీ సక్సెసులైనతే సాధించడం లేదు. దాంతో ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతుంది. మొత్తానికైతే అయ్యప్ప మాల వేసుకున్న వ్యక్తికి కొన్ని ఆపదలు వచ్చినప్పుడు దేవుడితో పాటు మనుషులు కూడా అతనికి ఎలా హెల్ప్ అయ్యారు. దాని నుంచి ఆయన ఎలా తప్పించుకున్నాడు అనే విషయాన్ని ఇందులో చాలా స్పష్టంగా చెప్పబోతున్నారట.

ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న రవితేజ ఈ మధ్యకాలంలో చాలావరకు డీలా పడిపోతున్నాడు. కారణం ఏదైనా ఆయన డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకోకపోవడం, రొటీన్ స్టైల్ లో నటించడం వల్లే ఆయన కెరీర్ డౌన్ ఫాల్ అవుతుంది.

కానీ ఇప్పుడు మొదటిసారి ‘ఇరుముడి’ సినిమాతో డిఫరెంట్ ప్రయత్నమైతే చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ వస్తుందని ఆయన భావిస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరోసారి ఆయన తన సత్తా చాటుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ మూవీలో రవితేజ అద్భుతంగా నటించాడని సినిమా కూడా చాలా బాగా వచ్చిందని మేకర్స్ చెబుతున్నారు.

దానివల్ల రవితేజ ఖాతాలో మరో సక్సెస్ పడబోతుంది అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది అంటూ మేకర్స్ చాలా క్లారిటిగా ఉన్నారు…ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని బ్రేక్ చేయగలిగే సత్తా ఉన్న దర్శకులు చాలా మంది ఉన్నప్పటికి రవితేజ మాత్రం కొత్త దర్శకులను యంగ్ డైరెక్టర్ ను ఎంకరేజ్ చేస్తు సినిమాలు చేయడం విశేషం…

లక్నో యజమాని గోయంక అలాంటివాడు.. అందుకే పంత్ వెళ్లిపోయాడు.. అసలు నిజం చెప్పిన లలిత్ మోడీ

Lalit Modi On Sanjiv Goenka
Lalit Modi On Sanjiv Goenka

Lalit Modi On Sanjiv Goenka: ఈ ఐపీఎల్లో అత్యంత దారుణంగా ఆడింది లక్నో జట్టు. ఈ జట్టులో అనుభవజ్ఞులైన ప్లేయర్లు ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. ముఖ్యంగా లక్నో జట్టును కెప్టెన్ రిషబ్ పంత్ నడిపించిన విధానం దారుణంగా ఉంది. అందువల్లే ఆ టీం లాస్ట్ స్టేజ్ లో ఉండిపోయింది. ఆ ఒత్తిడి తట్టుకోలేక.. విమర్శలను ఎదుర్కోలేక కెప్టెన్ పంత్ తన స్థానం నుంచి తప్పుకున్నాడు.. అంతేకాదు, ఈ విషయాన్ని లక్నో యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్లో లక్నో జట్టుకు నాయకుడిగా ఎవరుంటారో అనే చర్చ మొదలైంది.

ఈ చర్చ ఇలా సాగుతుండగానే ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ బాంబు పేల్చారు. సంచలన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి.. లక్నో జట్టులో ఏం జరిగిందో బయట పెట్టేశారు. దీంతో స్పోర్ట్స్ వర్గాల్లో చర్చ మొదలైంది. లక్నో జట్టుకు యజమానిగా సంజీవ్ గోయాంక కొనసాగుతున్నారు. ఆయనను అత్యంత చెత్త యజమాని అని లలిత్ ఆరోపించారు. అతడు మాట తప్పిన మూర్ఖుడు.. నిలకడ లేని వ్యక్తి అని మండిపడ్డారు. ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో లలిత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

“అతడు ఒక జట్టును కొనుగోలు చేయడం.. దానిని సమర్థవంతంగా నడిపించడం సాధ్యం కాదు. అనవసరంగా జట్టును కొనుగోలు చేసి తన విఫలత్వాన్ని నిరూపించుకున్నాడు. అతడు లక్నో జటన్ కొనుగోలు చేయడం ద్వారా ఐపిఎల్ రేటింగ్ చాలావరకు తగ్గిపోయింది. లక్నో జట్టు ప్రతి సీజన్లో కూడా దారుణమైన ఆట తీరు కొనసాగిస్తుంది. ఈసారి కూడా లక్నో రిక్త హస్తాలతోనే వెళ్లిపోయింది. గోయంక తీరు వల్ల అతడు ఒక మీమ్ క్రియేటర్లకు సర్ఫ్ గా మారిపోయాడు. అంతేకాదు గోయంక మీద రూపొందిన మీమ్ ను ఎక్కువగా చూసిన వాళ్లకు తాను ఒక చేతి వాచి బహుమతిగా ఇస్తానని” లలిత మోడీ వ్యాఖ్యానించాడు.

సంజీవ్ మీద లలిత్ మోడీ విమర్శలు చేయడం ఇదే తొలిసారి కాదు. ప్రతి సందర్భంలో ఆయన ఇదే స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ సీజన్లో ఒక మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత సంజీవ్, పంత్ మధ్య విపరీతమైన చర్చ జరిగింది. ఆ సమయంలో సంజీవ్ కు లలిత్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. అయితే ఈ సీజన్లో లక్నో జట్టు అంతగా ఆడక పోవడంతో.. దానికి బాధ్యత వహిస్తూ కెప్టెన్ బాధ్యతల నుంచి పంత్ తప్పుకున్నాడు. సంజీవ్ వ్యవహార శైలి నేపథ్యంలో.. ఇకపై ఆ జట్టుకు సారధిగా ఎవరూ వచ్చే అవకాశం లేదని స్పోర్ట్స్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

అన్నామలై రాజీనామా చేసి.. తప్పు చేస్తున్నాడా..

Annamalai Resignation From BJP
Annamalai Resignation From BJP

Annamalai Resignation From BJP: భారతీయ జనతా పార్టీ నుంచి అన్నామలై తప్పుకున్నట్టే. ఢిల్లీలో వేచి చూడాలని పార్టీ పెద్దలు చెప్పిన నేపథ్యంలో.. ఆయన అక్కడ ఉన్నాడని చెబుతున్నారు గాని.. రాజ్యసభ సీటు ఇస్తామని వార్తలు వస్తున్నాయి గాని.. అవేవీ వాస్తవం కాకపోవచ్చు. ఎందుకంటే అన్నామలై ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ ప్రకారం ఆయన సొంత పార్టీ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సొంత పార్టీ పెట్టాలని ఆయన మీద అనుచరులు ఒత్తిడి తీసుకొస్తున్నట్టు ఇటీవల తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొంతమంది బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి కూడా అన్నామలై బాటలోనే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.

ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో బిజెపి కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాలు అన్నామలై కి ఏమాత్రం రుచించలేదని తెలుస్తోంది. అందువల్లే ఆయన రాజీనామా వైపు వెళ్ళినట్టు తెలుస్తోంది. అన్నా డీఎంకేతో పొత్తు.. సీట్ల సర్దుబాటు.. ప్రచారం.. రాష్ట్ర అధ్యక్ష బాధ్యత నుంచి ఆయనను తప్పించడం.. ఇవన్నీ కూడా అన్నామలై లో వేరే భావాన్ని కలిగించాయని వార్తలు వస్తున్నాయి. అందువల్లే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారని.. బిజెపి అధిష్టానం రంగంలోకి దిగి నచ్చ చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని సమాచారం.

అన్నా మలై రాజీనామా విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన తొందర పడ్డారని.. పార్టీ ప్రయోజనాలను ఆయన అర్థం చేసుకోవడం లేదని బిజెపి నాయకులు అంటున్నారు.. అన్నా మలై వేచి చూస్తే బాగుండేదని చెబుతున్నారు. అన్నామలై ఉదంతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్న బిజెపి నాయకులు.. ఒక కీలక విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. బిజెపిలో వ్యక్తి ప్రయోజనాలు ఉండవని.. పార్టీ ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని వారు వివరిస్తున్నారు.

అస్సాం ముఖ్యమంత్రిగా గతంలో సర్బానంద సోనోవాల్ ఉండేవారు. ఆ తర్వాత హిమంత బీజేపీలో చేరారు. సర్బానంద మంచి నాయకుడే.. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఆయనకు కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకున్నారు. హిమంతను అస్సాం ముఖ్యమంత్రి చేశారు. నాడు పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని సోనోవాల్ స్వాగతించారు. కేంద్ర మంత్రివర్గంలోకి సానుకూల ధోరణితో వెళ్లిపోయారు. హిమంత దూకుడు వల్ల అస్సాం వరుసగా అధికారంలోకి వచ్చింది. అక్కడ బిజెపి అధికారంలో ఉండడం వల్ల అనేక రకాల పనులను చేపట్టేందుకు కేంద్రానికి ఆస్కారం ఏర్పడుతోంది.

అన్నా మలై వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తున్న జాతీయవాదులు ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. 1995 -96 కాలంలో నరేంద్ర మోడీ గుజరాత్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. పార్టీ కి దూరం కావాల్సి వచ్చింది. దీంతో ఆయన చాలా కాలం పాటు ఢిల్లీకి పరిమితం కావలసి వచ్చింది. జాతీయ పార్టీ కార్యాలయంలో ఒక చిన్న గదిలో.. మరొక నాయకుడితో ఆయన ఉండాల్సి వచ్చింది. ఇలా అనేక రోజులు ఉన్న తర్వాత.. మళ్లీ గుజరాత్ రాష్ట్రం లోకి ఆయన వచ్చారు. ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మూడోసారి దేశ ప్రధాన మంత్రిగా కొనసాగుతున్నారు. అంతటి నరేంద్ర మోడీకి ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు.. పార్టీ అధినాయకత్వం నిర్ణయానికి అన్నా మలై కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని వారు గుర్తు చేస్తున్నారు..

ఏ రంగు ఆహారం.. ఎలాంటి శక్తిని ఇస్తుంది..

Rainbow Diet Benefits
Rainbow Diet Benefits

Rainbow Diet Benefits: ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం కడుపు నిండా తినడం మాత్రమే సరిపోదు. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా అందాలి. అందుకే పోషకాహార నిపుణులు ప్రతిరోజూ వివిధ రంగుల పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి రంగు వెనుక ప్రత్యేకమైన పోషక విలువలు దాగి ఉన్నట్లు కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ‘రెయిన్‌బో డైట్’ లేదా రంగురంగుల ఆహారం తీసుకోవడం ద్వారా శరీరానికి సమగ్ర పోషణ లభిస్తుంది. ఇలాంటప్పుడు ఎలాంటి రంగు ఆహారం ఏ విధంగా పోషకాలు అందిస్తుందో తెలుసుకుందాం..

ఎరుపు రంగు పండ్లు.. కూరగాయలు గుండెకు మేలు:
టమాటా, పుచ్చకాయ, స్ట్రాబెర్రీ, దానిమ్మ వంటి ఎరుపు రంగు పండ్లు, కూరగాయల్లో లైకోపీన్, విటమిన్-సి వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రక్తనాళాల పనితీరును బలోపేతం చేస్తాయి. అలాగే ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా సహాయపడతాయి. శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఆకుపచ్చ రంగు ఆహారం.. రోగనిరోధక శక్తికి బలం:
పాలకూర, బ్రోకలీ, క్యాబేజీ, కొత్తిమీర, బఠానీలు వంటి ఆకుపచ్చ రంగు కూరగాయల్లో క్లోరోఫిల్, ఫోలేట్, ఐరన్, విటమిన్-కె పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోన్ల సమతుల్యతను కాపాడటంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎముకలను బలంగా ఉంచి రక్తహీనత సమస్యను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో ఆకుపచ్చ ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది.

పసుపు, ఆరెంజ్ రంగులు.. శక్తికి నిలయం:
మామిడి, బొప్పాయి, క్యారెట్, గుమ్మడికాయ, కమలాపండు వంటి పసుపు, ఆరెంజ్ రంగు ఆహారాల్లో బీటా కెరోటిన్, విటమిన్-ఏ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచి కండరాలను బలంగా ఉంచుతాయి. మెదడు పనితీరును మెరుగుపరచి ఏకాగ్రత, ఆలోచనా శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా చర్మ కాంతిని పెంచి కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

తెలుపు, గోధుమ రంగు ఆహారం.. గుండెకు రక్షణ:
వెల్లుల్లి, ఉల్లిపాయ, ముల్లంగి, పుట్టగొడుగులు, ఓట్స్ వంటి తెలుపు లేదా గోధుమ రంగు ఆహారాల్లో ప్రత్యేకమైన ఫైటోన్యూట్రియంట్లు ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీరంలోని వాపులను తగ్గించడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి.

నీలం, ఊదా రంగు పండ్లు.. కంటి ఆరోగ్యానికి మేలు:
బ్లూబెర్రీలు, నల్ల ద్రాక్ష, జామున్ పండ్లు, ఊదా క్యాబేజీ వంటి నీలం లేదా ఊదా రంగు ఆహారాల్లో ఆంథోసయానిన్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. వృద్ధాప్య ప్రభావాలను తగ్గించి మెదడు కణాలను రక్షిస్తాయి. కొన్ని పరిశోధనల ప్రకారం ఇవి గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

చాలామంది తమకు ఇష్టమైన కొన్ని పండ్లు, కూరగాయలకే పరిమితమవుతుంటారు. అయితే నిపుణులు ఒక్క రంగు ఆహారం కాకుండా అన్ని రంగుల ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి రంగులో వేర్వేరు పోషకాలు ఉండటంతో శరీరానికి సమగ్ర ప్రయోజనాలు అందుతాయి. అందుకే ప్రతిరోజూ భోజనంలో కనీసం 4 నుంచి 5 రంగుల పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవడం మంచిది.

మహేష్ బాబు డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటంటే..?

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu Dream Project: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ప్రతి ఒక్క హీరో కి ఒక స్టైల్ ఉన్నట్టుగానే మహేష్ బాబుకి సైతం సపరేట్ స్టైల్ ని క్రియేట్ చేసుకొని మాస్ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. లేడీ ఫ్యాన్స్ ని ఎక్కువ సంపాదించుకున్న హీరో కూడా మహేష్ బాబే కావడం విశేషం… ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు లేడీ ఫ్యాన్స్ అందరు సినిమా థియేటర్ దగ్గరే ఉంటారు. అలాంటి క్రెడిట్ ని సంపాదించుకున్న ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో సైతం ఇంకాస్త యాక్టివ్ గా ఉండాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన ఇప్పుడు పాన్ ఇండియాలో సైతం తన సత్తా ఏంటో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇప్పటి వరకు తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న మహేష్ బాబు ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా అదే క్లారిటిని మెయింటైన్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక మహేష్ బాబు తన సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నప్పటికి అతనికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలని ఉందట. ఆ సినిమా ఏంటి అంటే ఒక సూపర్ మేన్ లాంటి ఒక సిరీస్ లో తను నటించాలని ఆ పాత్రలో చేసే విన్యాసాలలో కొన్నింటిని తను ఒరిజినల్ గా చేసి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడట.

ప్రస్తుతం మహేష్ బాబు ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హీరోగా మారాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన అలా నెంబర్ వన్ పొజిషన్ ని అందుకోవాలంటే మాత్రం వరుస సక్సెస్ లను సాధించాలి… ప్రస్తుతం తను అనుకున్నట్టుగానే వరుస విజయాలు సాధించి నెంబర్ వన్ పొజిషన్ ను అందుకుంటాడా?

లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటికే రాజమౌళితో చేస్తున్న వారణాసి సినిమా విషయంలో ఆయన చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. ఇందులో ఏమాత్రం తేడా జరిగిన కూడా ఆయన చాలా వరకు డీలా పడిపోవచ్చు…

చిరంజీవి రాజకీయాలకు వెళ్లి ఉండకపోతే తెలుగు ఇండస్ట్రీ మరోలా ఉండేదా..?

Chiranjeevi
Chiranjeevi

Chiranjeevi Politics Impact: మెగాస్టార్ చిరంజీవి గత 50 సంవత్సరాలు నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేయనటువంటి పాత్ర లేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించిన ఆయన తన సత్తా ఏంటో ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకులందరికి చూపిస్తున్నాడు. ఇప్పటికే ఆయన నుంచి వచ్చిన సినిమాలు అతన్ని టాపిక్ లెవల్లో నిల్చోబెట్టాయి. అలాంటి హీరో ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో కొంతవరకు డీలా పడిపోయాడు. ఇక రీసెంట్ గా చేసిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా అతనికి భారీ విజయాన్ని కట్టబెట్టినప్పటికి ఆ సినిమా ఆయన రేంజ్ కి తగ్గ సక్సెస్ అయితే కాదని చాలామంది చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి 2008 వ సంవత్సరంలో ప్రజారాజ్యం అనే రాజకీయ పార్టీని పెట్టి రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. మొత్తానికైతే ఆ పార్టీతో ఆయన సీఎం గా అవతరిస్తాననే ఆలోచన చేసినప్పటికి ఆయన అనుకున్న రేంజ్ లో సీట్లైతే రాలేదు.

దాంతో ఆయన కొంతవరకు డీలా పడిపోయాడు. ఇక మొత్తానికైతే చిరంజీవి చేసిన ఆ ఒక్క మిస్టేక్ వల్ల ఆయన దాదాపు 10 సంవత్సరాలపాటు ఇండస్ట్రీ నుంచి దూరంగా ఉంటూ రాజకీయానికి సంబంధించిన పనులు చూసుకుంటూ వచ్చాడు. ఇక అప్పటినుంచి చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చినా కూడా ఆయనకు సరైన సక్సెస్ రావడం లేదు.

నిజానికి చిరంజీవి రాజకీయరంగ ప్రవేశం చేయడానికి ముందు వరకు కూడా ఆయన నెంబర్ వన్ హీరోగా కొనసాగాడు. అలాంటి చిరంజీవి అంత మంచి హోదాను వదులుకొని 10 సంవత్సరాలపాటు ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్లిపోవడంతో అతని క్రేజ్ పడిపోయింది. అటు రాజకీయ రంగంలో చేసిన మిస్టేక్స్ వల్ల ఆయన పర్సనల్ విషయాల్లో కూడా చాలా వరకు దెబ్బ పడింది. దానివల్ల ఇటు జనాల్లో చాలా వరకు నమ్మకాన్ని కోల్పోయారు. దాంతో ఆయన ఏం చేయాలో తెలియని సందిగ్ధ పరిస్థితిలో పడిపోయి మొత్తానికైతే ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో సక్సెస్ ని సాధించి ప్రేక్షకులందరికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాడు.

రాజకీయ రంగ ప్రవేశం చేయడం వల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు అనే విషయం మీద ఇప్పటివరకు సరైన క్లారిటీ అయితే లేకుండా పోయింది. ఒకవేళ తను ఇండస్ట్రీ లోనే ఉండి ఉంటే ఇలానే సినిమాలు చేసుకుంటూ వస్తే మాత్రం ఇప్పటి వరకు అతనే నెంబర్ వన్ హీరోగా ఉంవారంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…

తెలంగాణ ఎవరి జాగీర్‌?

Telangana Political Controversy
Telangana Political Controversy

Telangana Political Controversy: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించి పుష్కరం పూర్తయింది. అయినా ఇప్పటికీ తెలంగాణ అంశం, ఉద్యమం, సెంటిమెంట్‌ ప్రజల్లో రగులుతూనే ఉంది. రాజకీయ నేతలు దానిని రగిలిస్తూనే ఉన్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, తెలంగాణ కాంగ్రెస్‌ నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంతో తెలంగాణ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. రాష్ట్రం 12 ఏళ్లు గడిచినా, ఆ అస్తిత్వం ఇప్పటికీ రాజకీయ యుద్ధభూమిగా మారుతోంది. ఇటీవలి పవన్‌ కల్యాణ్‌–పొన్నం ప్రభాకర్‌ వాగ్వాదం ఈ వాస్తవాన్ని మరోసారి బయటపెట్టింది. తెలంగాణ ఏర్పాటు దినోత్సవం సమయంలో హైదరాబాద్‌లో ‘నవనిర్మాణ సభ’ నిర్వహించాలని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించగా, మంత్రి పొన్నం ప్రభాకర్‌ తీవ్రంగా స్పందించారు. ‘‘తెలంగాణ మీ అయ్య జాగీరా?’’ అని పవన్‌ ప్రశ్నించిన దానికి ‘‘అవును, మా అయ్య జాగీరే’’ అన్న తీరుగా వచ్చిన సమాధానాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

దశాబ్దాల పోరాట ఫలితం..
ఉద్యమం నుంచి జాగీరు మనస్తత్వం వరకుదశాబ్దాల పోరాటం, విద్యార్థుల త్యాగాలు, యువకుల ఆత్మాహుతులు, లక్షలాది మంది ప్రజల ఉద్యమ ఉత్సాహం.. ఇవన్నీ తెలంగాణను కేవలం ఒక భౌగోళిక ప్రాంతంగా కాకుండా ఆత్మగౌరవ చిహ్నంగా నిలిపాయి. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు ‘‘మా రాష్ట్రం, మా సంపద, మా నిర్ణయాలు’’ అన్న నినాదం ప్రజల హృదయాల్లో గాఢంగా నాటుకుంది. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంతమంది నాయకులు ఆ స్ఫూర్తిని తమ కుటుంబం, తమ పార్టీ లేదా తమ ప్రాంతీయ ఆధిపత్యానికి పరిమితం చేస్తున్నారు. ‘‘ఇది మా అయ్య జాగీరు’’ అన్న మాటలు ఆ ఫ్యూడల్‌ భావనను స్పష్టంగా బయటపెడుతున్నాయి. ఉద్యమ కాలంలో అణచివేతను ఎదిరించిన వారే ఇప్పుడు తమను తాము ‘‘యజమానులు’’గా చూసుకోవడం బాధాకరం.

ప్రజలదా? పార్టీలదా? బయటి వారిదా?
తెలంగాణపై మూడు ముఖ్యమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల సొత్తా? పార్టీలదా..?, బయటివారిదా? అంటే ఇది ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు, ఎవరి కుటుంబ వ్యాపారం కాదు.
ఏదైనా ఒక రాజకీయ పార్టీ లేదా కుటుంబం యాజమాన్యంలో ఉందా?
ఎవరి ఆధిపత్యంలోనూ ఉండకూడదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, రాష్ట్రం ప్రజల సార్వభౌమత్వానికి లోబడి ఉండాలి.

రాజకీయం చేయడం తప్పా?
భారత రాజ్యాంగం ప్రకారం ఏ భారతీయ పౌరుడికైనా దేశంలో ఎక్కడైనా రాజకీయ కార్యకలాపాలు చేసే స్వేచ్ఛ ఉంది. కానీ ఆ కార్యకలాపాలు స్థానిక భావాలను గౌరవించి, ఉద్యమ త్యాగాలను అవమానించకుండా జరగాలి. ‘‘వలసదారులు’’ అన్న మాటను రాజకీయ ఆయుధంగా ఉపయోగించడం కూడా ప్రమాదకరం. పవన్‌ కల్యాణ్‌ గతంలో తెలంగాణ ఏర్పాటుపై చేసిన కొన్ని వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల భావాలను గాయపరిచాయన్న విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో, స్థానిక నాయకులు ‘‘ఇది మా జాగీరు’’ అని చెప్పడం ఆ గాయాలను మరింత లోతు చేస్తోంది. రెండు వైపులా ఉన్న ఈ ధోరణి తెలుగు రాష్ట్రాల మధ్య సహజీవనానికి మంచిది కాదు.

అణచివేతకు వ్యతిరేకంగా..
తెలంగాణ ఉద్యమం అణచివేతకు వ్యతిరేకంగా పుట్టింది. ఆ ఉద్యమ స్ఫూర్తి ఇప్పుడు కొందరి రాజకీయ ఆధిపత్యం మరియు వ్యక్తిగత స్వార్థాలకు బలి అవుతోంది. ‘‘జాగీరు’’ మనస్తత్వం రాజకీయాలను కుటుంబ ఆస్తిగా మార్చేస్తుంది. ఇది దీర్ఘకాలికంగా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. నిజమైన అభివృద్ధి కావాలంటే తెలంగాణను ఎవరి యాజమాన్యంగా కాకుండా, అందరి హక్కుగా చూడాలి. నాయకులు యజమానులుగా కాకుండా సేవకులుగా పని చేయాలి. బయటి నాయకులైనా, స్థానికులైనా వారి పనితనం, వారి విధానాలు, వారి నిబద్ధత ఆధారంగానే ప్రజలు నిర్ణయం తీసుకోవాలి.

తెలంగాణ ప్రజలు దశాబ్దాల త్యాగాలతో సాధించిన ఆత్మగౌరవం ఇప్పుడు రాజకీయ లాభాల కోసం బలిపశువు కాకూడదు. ఈ ‘‘జాగీరు’’ వివాదం ఒక సంకేతం మాత్రమే. ఇది రాజకీయ వ్యవస్థలో ఇంకా ఉన్న ఫ్యూడల్‌ మనస్తత్వానికి అద్దం పడుతోంది తెలంగాణ ముమ్మాటీకి ఇక్కడి ప్రజలదే. మిగతా అన్నీ కేవలం రాజకీయ భ్రమలు మాత్రమే.

రాజమౌళి నెక్స్ట్ మూవీ మీద క్లారిటీ ఇచ్చిన విజయేంద్రప్రసాద్...

Vijayendra Prasad
Vijayendra Prasad

Vijayendra Prasad: ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమా తో తన కెరీర్ ని మొదలు పెట్టిన రాజమౌళి ప్రస్తుతం 12 సినిమాలతో వరుస సక్సెస్ లను సాధించాడు. ఇప్పుడు వారణాసి సినిమాతో 13 వ సక్సెస్ ను కూడా సాధించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత ఆయన తన తదుపరి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది. ఎవరితో చేయబోతున్నాడు అనే విషయంలో కూడా చాలా క్లారిటి రావాల్సిన అవసరమైతే ఉంది. ఈ విషయం మీద రీసెంట్ గా రాజమౌళి వాళ్ళ నాన్న విజయేంద్ర ప్రసాద్ ఒక క్లారిటి ఇచ్చాడు. నిజానికి రాజమౌళి చేసే సినిమాలన్నింటికి కథలను తనే అందిస్తాడు. కాబట్టి తనతో ఇప్పటికే ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా కథనైతే రెడీ చేయమని చెప్పారట. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సీనియర్ హీరోలైనా చిరంజీవి,నాగార్జున,బాలకృష్ణ, వెంకటేష్ లతో పాటు రజినీకాంత్ ను కూడా ఈ సినిమాలో భాగం చేయబోతున్నారట. నిజానికి వీళ్ళందరు కలిసి ఒక సినిమా చేయడం అనేది అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుందనే చెప్పాలి.

నిజంగానే వీళ్ళందరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయంలో కూడా సరైన క్లారిటీ రావాల్సి ఉంది. విజయేంద్రప్రసాద్ అయితే వీళ్ళందరిని కలిపి ఒక కథను రెడీ చేస్తున్నాడట. ఇక సీనియర్ హీరోలందరిని కలపాలని ఎప్పటినుంచో రాజమౌళికి ఉంది.

కాబట్టి వీళ్ళందరిని కలిపి చూపిస్తే ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశ్యంతోనే ఆయన ఇలాంటి ఒక సినిమాకి కథనైతే రాయమని చెప్పారట. విజయప్రసాద్ దానికి న్యాయం చేస్తున్నాడు కథలో అందరికీ ప్రాముఖ్యత ఉండే విధంగా చూసుకుంటూ ఒక మంచి కథనైతే తను రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇంతకుముందు ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ ని కలిపిన రాజమౌళి ఇప్పుడు సీనియర్ హీరోలందరిని కలిపి సినిమా చేయించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… రాజమౌళి కనక ఈ హీరోలందరినీ కలిపి సినిమా చేసినట్లయితే మాత్రం ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

'ఢీ' ఫేమ్ 'పండు మాస్టర్' కి ఘోర రోడ్డు ప్రమాదం.. తీవ్రగాయాలు.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..

Pandu Master Accident
Pandu Master Accident

Pandu Master Accident: ఈటీవీ లో ప్రసారం అయ్యే ‘ఢీ ‘ డ్యాన్స్ రియాలిటీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాయించుకున్న పండు మాస్టర్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురి అవ్వడం ఆయన అభిమానులను అత్యంత బాధకు గురి చేస్తోంది. విశాఖ పట్నం ఆనందపురం సమీపం లో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. తగరపు వలస అమ్మవారి ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన డ్యాన్స్ ప్రోగ్రాం ఈవెంట్ ని ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణం మధ్యలో తన టీం కి చెందిన ఒక సభ్యుడు అస్వస్థతకు గురి అవ్వడం తో పండు మాస్టర్ తన కారు ని ఆపాల్సి వచ్చింది. ఆ సమయం లో కారు నుండి బయటకు దిగి , పండు మాస్టర్ రోడ్డు మీద నిల్చొని ఉన్నాడు. అదే సమయం లో ఒక కోళ్ల వ్యాన్మ్ అదుపు తప్పిపోయి ఆగి ఉన్న పండు మాస్టర్ కారు ని ఢీ కొట్టింది.

ఆ కారణం చేత పక్కనే ఉన్నటువంటి పండు మాస్టర్ కి కూడా తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి వెంటనే పండు మాస్టర్ ని సమీపం లో ఉన్న హాస్పిటల్ లో చేర్పించారు.ప్రస్తుతం పండు మాస్టర్ కి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. పోలీసులు కోళ్ల వ్యాన్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుల్లితెర ద్వారా పండు మాస్టర్ సంపాదించుకున్న క్రేజ్ మామూలుది కాదు. అద్భుతమైన డ్యాన్స్ తో పాటు , తన కామెడీ టైమింగ్ తో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈటీవీ లో ఆయన ఒక పక్క ఢీ షో లో టాప్ కంటెస్టెంట్ గా కొనసాగుతూనే , మరో పక్క ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా రెగ్యులర్ గా కనిపిస్తున్నాడు.

ప్రస్తుతం నడుస్తున్న ‘ఢీ’ షో లో పండు మాస్టర్ టైటిల్ విన్నింగ్ రేస్ లో కూడా ఉన్నాడు. ఈ ఏడాది గ్రాండ్ గా మొదలు అవ్వబోయే బిగ్ బాస్ సీజన్ 10 లో కూడా ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క సినిమా అవకాశాలు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి.ఇలాంటి సమయం లో పండు మాస్టర్ కి ఇలాంటి ప్రమాదం జరగడం దురదృష్టకరం. ప్రస్తుతానికి అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి చెప్పలేని స్థాయిలోనే ఉంది. ఆయన సంపూర్ణమైన ఆరోగ్యం తో బయటకు రావాలని , ఎప్పటి లాగానే తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిద్దాం.

షర్మిలకు షాక్.. డీకే శివకుమార్ మడత పేచీ!

YS Sharmila And DK Shivakumar
YS Sharmila And DK Shivakumar

YS Sharmila And DK Shivakumar: రాజ్యసభ పదవిపై ఆశలు పెట్టుకున్నారు షర్మిల. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి పిలుపు రావడంతో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అక్కడ రాజ్యసభ భరోసా రావడంతో ఆనందంతో కనిపించారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ పదవి కష్టమేనన్న టాక్ నడుస్తోంది. దానికి కారణం లేకపోలేదు. కర్ణాటక రాజకీయాలు మారడంతో.. షర్మిలకు ఈసారి అవకాశం ఉంటుందా లేదా అనేది ఒక అనుమానం. ఎందుకంటే ఆమె కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నిక కావాలి. కానీ అక్కడ పరిస్థితి ఏమంత బాగాలేదు. అందుకే కాంగ్రెస్ అగ్ర నాయకత్వం పునరాలోచనలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే షర్మిలకు షాక్ తగిలినట్లే.

* అప్పట్లో హామీ..
తన తండ్రి పేరుతో తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేశారు షర్మిల. అక్కడ రాజకీయాల్లో రాణించాలని భావించారు. సుదీర్ఘ పాదయాత్ర కూడా చేశారు. కానీ అనుకున్న స్థాయిలో వర్కౌట్ కాలేదు. దీంతో తన పార్టీని ఏదో ఒక జాతీయ పార్టీలో విలీనం చేయాలని భావించారు. తన తండ్రి ఇష్టపడే కాంగ్రెస్ పార్టీలోనే విలీనం చేశారు చివరకు. అలా విలీనం చేసినందుకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. కానీ కాంగ్రెస్ హై కమాండ్ మాత్రం ఏపీ బాధ్యతలు అప్పగించింది. అచేతనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఊపిరి పోయాలని భావించింది. అందుకు అప్పట్లో రాజ్యసభ పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లకు కర్ణాటక నుంచి మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతుండడంతో.. షర్మిలకు ఇచ్చిన హామీ అమలు చేసేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పైగా వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు డి కే శివకుమార్. షర్మిలకు రాజ్యసభ పదవి దక్కుతుందంటే ఆయన సైతం సంతోషిస్తారు. ఆ నమ్మకంతోనే అగ్రనేత రాహుల్ ఢిల్లీకి పిలిపించి రాజ్యసభ పదవి ఇస్తామని షర్మిలకు చెప్పారు. అయితే ఇప్పుడు మొత్తం సీన్ రివర్స్ అవుతున్నట్లు ప్రచారం నడుస్తోంది.

* విపరీతమైన పోటీ..
ఈరోజు కర్ణాటక సీఎం గా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే అదే కర్ణాటక నుంచి షర్మిల కు అవకాశం ఇచ్చేందుకు కాంగ్రెస్ హై కమాండ్ ఆదేశాలు జారీచేసింది. అయితే ఈ నిర్ణయంతో కర్ణాటక కాంగ్రెస్ నాయకులు అసంతృప్తికి గురవుతున్నారు. మరో రెండేళ్లలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇవి డీకే శివకుమార్ పనితీరుకు అజెండాగా నిలవనున్నాయి. అయితే ప్రారంభంలోనే రాజ్యసభ పదవి ద్వారా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి రేగే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి చాలామంది నేతలు రాజ్యసభ పదవి ఆశిస్తున్నారు. ఇప్పుడు ఆ పదవిని షర్మిలకు ఇస్తే ఆ ప్రభావం డీకే శివకుమార్ పై పడుతుంది. అయితే ఇప్పుడు డీకే శివకుమార్ షర్మిల విషయంలో వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే షర్మిలకు షాక్ తగిలినట్టే.

పెద్ది మూవీ సక్సెస్ అయితే క్రెడిట్ ఎవరికి వెళుతుంది...

Peddi Movie
Peddi Movie

Peddi Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ సైతం మొదటి సినిమాతోనే తన సత్తా ఏంటో చూపించుకున్నాడు. ‘మగధీర’ తో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టి యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరికి దగ్గరైపోయాడు. ప్రస్తుతం రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా అవతరించడమే కాకుండా పాన్ ఇండియాలో తను చేసిన సినిమాల మీద ప్రేక్షకులు విశేషమైన అంచనాలైతే పెట్టుకున్నారు…ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు దర్శకత్వంలో చేసిన ‘పెద్ది’ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ మూవీ రేపు అఫీషియల్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ రోజు నుంచే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ వేయబోతున్నారు.

ఈరోజు రాత్రి నుంచి సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శింపబడబోతున్నాయి. ఈ సినిమా సక్సెస్ ని కనుక సాధించినట్లు ఆ క్రెడిట్ ఎవరికి పోతుంది. అనేదానిలోనే ఇప్పుడు ప్రతి ఒక్కరి దృష్టి అయితే ఉంది. నిజానికి బుచ్చిబాబు ఈ సినిమా కోసం చాలా బాగా కష్టపడ్డాడనే వార్తలు వస్తున్నాయి.

రామ్ చరణ్ సైతం మూడు క్యారెక్టర్ లను స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా ప్రెసెంట్ చేయడానికి తన శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారంటూ మరి కొంతమంది చెబుతుండటం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ లో అటు బుచ్చిబాబు, ఇటు రామ్ చరణ్ ఇద్దరు కూడా చాలా వరకు కష్టపడ్డారు. కాబట్టి క్రెడిట్ వీళ్లిద్దరికి వెళ్తుందని మరి కొంతమంది చెబుతుండటం విశేషం…

ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లగలిగే ఘనత రామ్ చరణ్ కైతే ఉంది. కాబట్టి ఈ సినిమాతో తన మార్కెట్ ను భారీగా పెంచుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఒకవేళ ఏమాత్రం డీలాపడ్డ కూడా తన మార్కెట్ భారీగా తగ్గిపోయే అవకాశాలైతే ఉన్నాయి…