Homeఎంటర్టైన్మెంట్Ravi Teja Irumudi movie story: 'ఇరుముడి' గ్లింప్స్ లో కొత్త రవితేజ కనిపించాడా..? స్టోరీ...

Ravi Teja Irumudi movie story: ‘ఇరుముడి’ గ్లింప్స్ లో కొత్త రవితేజ కనిపించాడా..? స్టోరీ ఇదేనా..?

Ravi Teja Irumudi movie story: కెరీర్ మొదటి నుంచి కమర్షియల్ సినిమాలను చేస్తూ వచ్చిన రవితేజ…వాటితోనే భారీ విజయాలను అందుకున్నారు. కానీ ఇప్పుడు లైఫ్ లో ఫస్ట్ టైం డిఫరెంట్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు. నిజానికి శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ హీరోగా చేస్తున్న ‘ఇరుముడి’ సినిమా ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా నుంచి గత కొద్దిసేపటి క్రితమే ఒక గ్లింప్స్ రిలీజ్ అయింది. […]

Ravi Teja Irumudi movie story: కెరీర్ మొదటి నుంచి కమర్షియల్ సినిమాలను చేస్తూ వచ్చిన రవితేజ…వాటితోనే భారీ విజయాలను అందుకున్నారు. కానీ ఇప్పుడు లైఫ్ లో ఫస్ట్ టైం డిఫరెంట్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు. నిజానికి శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ హీరోగా చేస్తున్న ‘ఇరుముడి’ సినిమా ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా నుంచి గత కొద్దిసేపటి క్రితమే ఒక గ్లింప్స్ రిలీజ్ అయింది. రవితేజ తన కూతురితో ఆడుకుంటున్న కొన్ని షాట్స్ వేశారు. అలాగే తన కూతురు తను ఇద్దరు కూడా అయ్యప్ప మాల ధరించినట్టుగా చూపించారు. మొత్తానికైతే తన కూతురికి ఏదో ఇబ్బంది జరుగుతుంది. దాని వెనక ఎవరున్నారు అనేది తెలుసుకొని వాళ్ళని ఒక్కొక్కరిని ఏరుపారేస్తూ ఉండడమే ఈ సినిమా కథగా తెలుస్తుంది.

ఈ సినిమా విషయంలో రవితేజ చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. శివ నిర్వాణ సైతం ఇంతకు ముందు చేసిన ఖుషి సినిమాతో భారీ ఫ్లాప్ ను మూటగట్టుకున్నాడు.

దాంతో ఇప్పుడు ఎలాగైనా సరే తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాతో అటు రవితేజ, ఇటు శివ నిర్వాణ ఇద్దరికి సక్సెస్ దక్కుతుందని చాలా మంచి కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు రిలీజ్ అయిన గ్లింప్స్ ను కనుక చూసినట్లయితే మాత్రం గ్లింప్స్ చాలా అద్భుతంగా ఉందని ప్రేక్షకులందరి చేత ప్రశంసలైతే దక్కుతున్నాయి…

గ్లింప్స్ అంటే రొటీన్ రెగ్యులర్ గా ఇవ్వకుండా డిఫరెంట్ గా సినిమా లోని కంటెంట్ ను చెప్పకనే చెప్పినట్టుగా రిలీజ్ చేశారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో అటు దర్శకుడు, ఇటు హీరో ఇద్దరు కూడా ఒకేసారి హిట్ ట్రాక్ ఎక్కబోతున్నారనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది… చూడాలి మరి వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper