Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan emotional post on Peddi: 'పెద్ది' సినిమాపై పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్.....

Pawan Kalyan emotional post on Peddi: ‘పెద్ది’ సినిమాపై పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్.. సంచలనం రేపుతున్న వీడియో..

Pawan Kalyan emotional post on Peddi: మరి కొద్దీ గంటల్లోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాల్లోనూ మొదలయ్యాయి. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫైనల్ అడ్వాన్స్ బుకింగ్స్ సేల్స్ 60 కోట్ల […]

Pawan Kalyan emotional post on Peddi: మరి కొద్దీ గంటల్లోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాల్లోనూ మొదలయ్యాయి. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫైనల్ అడ్వాన్స్ బుకింగ్స్ సేల్స్ 60 కోట్ల వరకు ఉండొచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యం లో పవన్ కళ్యాణ్ ‘పెద్ది’ చిత్రం గురించి తన సోషల్ మీడియా మాధ్యమాలలో వేసిన పోస్టులు ఇప్పుడు సంచనలనం గా మారాయి. ఈ పోస్టులను చూస్తే రామ్ చరణ్ పై తనకు ఎలాంటి ప్రేమ ఉందో మరోసారి స్పష్టంగా అర్థం అవుతోంది. ఇంతకీ ఆయన ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం.

ఆయన మాట్లాడుతూ ‘పెద్ది గ్లింప్స్ ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నేల యొక్క గొప్పతనాన్ని తెలిపే చిత్రమిది. చిన్న తనం నుండి గ్లోబల్ వైడ్ గా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా ఎదిగేంత వరకు రామ్ చరణ్ ప్రయాణాన్ని చూస్తూనే ఉన్నాను. కానీ ఎంత ఎత్తుకి ఎదిగిన ఒదిగిపోయే మనస్తత్వం ఉన్న మనిషి మా రామ్ చరణ్. ఇక పిఠాపురం నుండి సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన యంగ్ దర్శకుడు బుచ్చి బాబు కి తన మాతృ నేల పై ఎలాంటి ప్రేమ ఉందో , ఈ సినిమా తో కూడా హీరో పాత్ర ద్వారా మాతృ భూమి గొప్పతనాన్ని తెలిపే ప్రయత్నం చేస్తున్నాడు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి అందించిన సంగీతం , సినిమా పై అంచనాలను , ఆసక్తి ని తారా స్థాయికి తీసుకెళ్లేలా చేశాయి’.

‘అదే విధంగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థని ప్రత్యేకంగా అభినందించాలి. ఇలాంటి సినిమాని ఈ రేంజ్ స్కేల్ తో , భారీ తారాగణం తో తెరకెక్కించడం చిన్న విషయం కాదు. ఈ చిత్రానికి విడుదలకు ముందు ఎదురైనా అడ్డంకులను నేనంతా గమనిస్తూనే ఉన్నాను. కానీ ఆంజనేయ స్వామి ఎలా అయితే అడ్డంకులను జయించి , లక్ష్యాన్ని చేధించాడో, మా రామ్ చరణ్ కూడా అలాంటి అడ్డంకులను ఛేదించి ఘన విజయం సాధిస్తాడు అనే నమ్మకం ఉంది. ఈ సినిమా విడుదల సందర్భంగా మూవీ టీం మొత్తానికి విజయం ప్రాప్టించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. అంతే కాదు , ఒక వీడియో ని ఆయన తన టీం తో ప్రత్యేకంగా ఎడిట్ చేయించి విడుదల చేయించడం కూడా హైలైట్ గా మారింది. ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper